‘‘నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవం యొక్క అథారిటీగా
అయ్యి సమస్యను సమాధాన స్వరూపములోకి పరివర్తన చెయ్యండి’’
ఈ రోజు బ్రాహ్మణ ప్రపంచము యొక్క రచయిత తన నలువైపులా ఉన్న
బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు. ఈ బ్రాహ్మణ ప్రపంచము చిన్న
ప్రపంచము, కానీ అతి శ్రేష్ఠమైన, అతి ప్రియమైన ప్రపంచము. ఈ
బ్రాహ్మణ ప్రపంచము మొత్తము విశ్వములోని విశేష ఆత్మల ప్రపంచము.
బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో
కూడా కొద్దిమంది అయిన ఆత్మలు ఎందుకంటే వారు తమ తండ్రిని
గుర్తించి, తండ్రి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఏ విధంగా
తండ్రి ఉన్నతోన్నతమైనవారో, అలా తండ్రిని గుర్తించి తండ్రికి
చెందినవారిగా అయ్యే ఆత్మలు కూడా విశేష ఆత్మలు. ప్రతి బ్రాహ్మణ
ఆత్మకు జన్మించగానే భాగ్యవిధాత తండ్రి మస్తకములో శ్రేష్ఠ భాగ్య
రేఖను గీసారు, మీరు అటువంటి శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలు.
స్వయాన్ని అటువంటి భాగ్యవంతులుగా భావిస్తున్నారా? ఇంత గొప్ప
ఆత్మిక నషా అనుభవమవుతుందా? బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి హృదయములో
హృదయాభిరాముడు హృదయపూర్వకమైన అనురాగాన్ని, హృదయపూర్వకమైన
ప్రేమను ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ మొత్తము కల్పములో ఒక్కరి
ద్వారానే మరియు ఒక సమయములోనే ప్రాప్తిస్తుంది. ఈ ఆత్మిక నషా సదా
ప్రతి కర్మలో ఉంటుందా? ఎందుకంటే - మేము కర్మయోగీ జీవితము కల
విశేష ఆత్మలము అని మీరు విశ్వానికి ఛాలెంజ్ చేస్తారు. కేవలం
యోగము జోడించే యోగీ కారు, యోగీ జీవితము కలవారు. జీవితమనేది
సదాకాలికముగా ఉంటుంది. సహజముగా మరియు నిరంతరము ఉంటుంది. 8 గంటలు,
6 గంటలు యోగీ జీవితము కలవారు కారు. యోగము అనగా స్మృతి, ఇది
బ్రాహ్మణ జీవితపు లక్ష్యము. జీవిత లక్ష్యము స్వతహాగానే
గుర్తుంటుంది మరియు ఎటువంటి లక్ష్యము ఉంటుందో అటువంటి లక్షణాలు
కూడా స్వతహాగానే వస్తాయి.
బాప్ దాదా ప్రతి బ్రాహ్మణ ఆత్మ మస్తకములో మెరుస్తూ ఉన్న
భాగ్య సితారను చూస్తారు. బాప్ దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరినీ
శ్రేష్ఠ స్వమానధారిగా, స్వరాజ్యధారిగా చూస్తారు. మరి మీరందరూ
కూడా స్వయాన్ని - నేను స్వమానధారీ ఆత్మను, స్వరాజ్యధారీ ఆత్మను
అని ఇలానే అనుభవం చేస్తున్నారా? నేను స్వమానధారీ ఆత్మను అనేది
ఒకవేళ క్షణములో స్మృతిలోకి తీసుకువచ్చినట్లయితే క్షణములో ఎంత
స్వమానాల లిస్ట్ వస్తుంది! ఇప్పుడు కూడా మీ స్వమానాల లిస్ట్
స్మృతిలోకి వచ్చిందా? పెద్ద లిస్ట్ కదా! స్వమానము అనేది
అభిమానాన్ని అంతము చేస్తుంది ఎందుకంటే స్వమానము అనేది శ్రేష్ఠ
అభిమానము. శ్రేష్ఠ అభిమానము అశుద్ధమైన రకరకాల దేహాభిమానాన్ని
సమాప్తము చేసేస్తుంది. ఏ విధంగా లైట్ స్విచ్ ఆన్ చెయ్యటముతో
క్షణములో అంధకారము దానంతటదే పారిపోతుంది, అంధకారాన్ని
పారద్రోలటం జరగదు లేక అంధకారాన్ని తొలగించడానికి శ్రమించాల్సిన
పని ఉండదు, స్విచ్ ఆన్ చేయగానే అంధకారము స్వతహాగానే
సమాప్తమైపోతుంది. అలాగే స్వమానమనే స్మృతి యొక్క స్విచ్ ను ఆన్
చేసినట్లయితే రకరకాల దేహాభిమానాలను సమాప్తము చేసే శ్రమ
చేయవలసిన అవసరము ఉండదు. ఎప్పటివరకైతే స్వమానము యొక్క స్మృతి
స్వరూపులుగా అవ్వరో, అప్పటివరకు శ్రమ చేయవలసి వస్తుంది. బాప్
దాదా పిల్లల ఆటను చూస్తారు - స్వమానాన్ని హృదయములో వర్ణన
చేస్తారు - ‘‘నేను బాప్ దాదా హృదయ సింహాసనాధికారిని’’, అని ఇలా
వర్ణన కూడా చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు కూడా, కానీ అనుభవమనే
సీట్ పై సెట్ అవ్వటం లేదు. ఏది ఆలోచిస్తారో అది అనుభవమవ్వటము
తప్పనిసరి ఎందుకంటే అన్నింటికంటే శ్రేష్ఠమైన అథారిటీ అనుభవం
యొక్క అథారిటీ. కనుక బాప్ దాదా చూస్తున్నారు - చాలా బాగా
వింటారు, ఆలోచించటము కూడా చాలా బాగా ఆలోచిస్తారు కానీ వినటము
మరియు ఆలోచించటము వేరే విషయము, అనుభవీ స్వరూపులుగా అవ్వటము -
ఇదే బ్రాహ్మణ జీవితము యొక్క శ్రేష్ఠ అథారిటీ. ఇదే భక్తికి మరియు
జ్ఞానానికి తేడా. భక్తిలో కూడా వినే నషాలో చాలా ఆనందపడతారు,
ఆలోచిస్తారు కూడా, కానీ అనుభవం చేయలేకపోతారు. జ్ఞానము యొక్క
అర్థమే జ్ఞాన స్వరూప ఆత్మ అనగా ప్రతి స్వమానము యొక్క అనుభవీగా
అవ్వటము. అనుభవీ స్వరూపము ఆత్మిక నషాను ఎక్కిస్తుంది.
అనుభవాన్ని జీవితములో ఎప్పుడూ మర్చిపోరు. విన్నదానిని,
ఆలోచించినదానిని మర్చిపోతారు కానీ అనుభవమనే అథారిటీ ఎప్పుడూ
తక్కువ అవ్వదు.
కనుక బాప్ దాదా పిల్లలకు ఈ స్మృతినే కలిగిస్తున్నారు -
భగవంతుడైన తండ్రి నుండి విన్న ప్రతి విషయములో, ఆ విన్నదాని
యొక్క అనుభవీమూర్తులుగా అవ్వండి. అనుభవం చేసిన విషయాన్ని ఒకవేళ
వేయిమంది కలిసి తొలగించాలని అనుకున్నా అది తొలగదు. మాయ కూడా
అనుభవాన్ని తొలగించలేదు. ఎలా అయితే, శరీరాన్ని ధరించటంతోనే -
నేను ఫలానాను అని అనుభవం చేస్తారు, అది ఎంత పక్కాగా ఉంటుంది!
ఎప్పుడైనా మీ దేహము యొక్క పేరును మర్చిపోతారా? ఒకవేళ ఎవరైనా
మీరు ఫలానా కాదు అని అంటే ఒప్పుకోగలరా? అలాగే స్వమానాల
లిస్టులోని ప్రతిదానిని అనుభవం చెయ్యటము ద్వారా ఎప్పటికీ
స్వమానాన్ని మర్చిపోలేరు. కానీ బాప్ దాదా చూసారు - ప్రతి
స్వమానాన్ని, ప్రతి పాయింటును అనుభవం చెయ్యటములో, అనుభవీలుగా
అవ్వటములో నంబరువారుగా ఉన్నారు. నేను ఉన్నదే ఆత్మను అని అనుభవం
చేసినప్పుడు, మరి ఇక మీరు ఆత్మ తప్ప ఇంకేమిటి! దేహాన్ని అయితే
నాది అని అంటారు, నేను ఉన్నదే ఆత్మను, మరి ఉన్నదే ఆత్మను
అన్నప్పుడు ఇక దేహ భానము ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు
వచ్చింది? కారణము, 63 జన్మల అభ్యాసము, నేను దేహాన్ని అనే
వ్యతిరేకమైన అభ్యాసము పక్కా అయిపోయింది. యథార్థ అభ్యాసాన్ని
అనుభవం చెయ్యటము మర్చిపోతారు. బాప్ దాదా పిల్లలు శ్రమపడటాన్ని
చూసినప్పుడు వారికి పిల్లలపై ప్రేమ కలుగుతుంది. పరమాత్ముని
పిల్లలు, కానీ శ్రమపడుతున్నారా! కారణము - అనుభవీ మూర్తిగా
అవ్వటములో లోపము. దేహ భానము యొక్క అనుభవాన్ని ఏం జరిగినా, ఏ
కర్మ చేస్తున్నా ఆ దేహ భానాన్ని మర్చిపోరు, అలా బ్రాహ్మణ
జీవితము అనగా యోగీ జీవితము, మరి యోగీ జీవితము యొక్క అనుభవాన్ని
ఎలా మర్చిపోగలరు!
మరి చెక్ చేసుకోండి - ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి
తీసుకువచ్చారా? జ్ఞానాన్ని వినటము, వినిపించటము సహజమే కానీ
జ్ఞాన స్వరూపులుగా అవ్వాలి. జ్ఞానాన్ని స్వరూపములోకి
తీసుకువస్తే స్వతహాగానే ప్రతి కర్మ నాలెడ్జ్ ఫుల్ గా అనగా
నాలెడ్జ్ యొక్క లైట్, మైట్ కలదిగా ఉంటుంది. జ్ఞానాన్ని లైట్
మరియు మైట్ అనే అనడం జరుగుతుంది. అలాగే యోగీ స్వరూపము అనేది
యోగయుక్త, యుక్తియుక్త స్వరూపము. ధారణా స్వరూపము అనగా ప్రతి
కర్మ, ప్రతి కర్మేంద్రియము, ప్రతి గుణము యొక్క ధారణా స్వరూపముగా
ఉంటాయి. సేవలో అనుభవీ మూర్తులు, సేవాధారులు అంటే అర్థము నిరంతర,
స్వతహా సేవాధారి, మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మణా
ద్వారానైనా, సంబంధ-సంపర్కము ద్వారానైనా ప్రతి కర్మలో సేవ
సహజముగా జరుగుతూ ఉండాలి, అటువంటివారినే నాలుగు సబ్జెక్టులలోనూ
అనుభవీ స్వరూపులు అని అంటారు. కనుక అందరూ చెక్ చేసుకోండి -
ఎంతవరకు అనుభవీ మూర్తులుగా అయ్యారు? ప్రతి గుణము యొక్క అనుభవీ,
ప్రతి శక్తి యొక్క అనుభవీ. అనుభవమనేది అవసరమైన సమయములో చాలా
పనికొస్తుంది అని మామూలుగా ఒక సామెత కూడా ఉంది. కనుక అనుభవీ
మూర్తుల యొక్క అనుభవం ఎటువంటి సమస్యనైనా, అనుభవీ మూర్తులు
అనుభవం యొక్క అథారిటీతో సమస్యను క్షణములో సమాధాన స్వరూపములోకి
పరివర్తన చేస్తారు. సమస్య సమస్యగా ఉండదు, సమాధాన స్వరూపముగా
అయిపోతుంది. అర్థమైందా!
ఇప్పుడు సమయము యొక్క సమీపత, తండ్రి సమానముగా అయ్యే సమీపత,
సమాధాన స్వరూపాన్ని అనుభవం చేయించాలి. చాలా సమయము బట్టి సమస్య
రావడము, దానిని సమాధానపరచటము అనే శ్రమను చేసారు, ఇప్పుడు బాప్
దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ స్వమానధారిగా, స్వరాజ్య అధికారిగా,
సమాధాన స్వరూపముగా చూడాలనుకుంటున్నారు. అనుభవీ మూర్తులు
క్షణములో పరివర్తన చెయ్యగలరు. అచ్ఛా!
అన్ని వైపుల వారు చేరుకున్నారు. డబుల్ విదేశీయులు కూడా ప్రతి
గ్రూపులో మంచిగా అవకాశాన్ని తీసుకుంటున్నారు. అచ్ఛా - ఈ
గ్రూపులో పాండవులు కూడా తక్కువగా లేరు. పాండవులందరూ
చేతులెత్తండి. మాతలు, కుమారీలు, టీచర్లు చేతులెత్తండి. మొదటి
గ్రూపులో మాతలు ఎక్కువమంది ఉన్నారు కానీ ఈ గ్రూపులో పాండవులు
కూడా మంచి రేస్ చేసారు. పాండవుల నషా మరియు నిశ్చయము ఇప్పటివరకు
గాయనములో కూడా మహిమ చేయబడింది. ఏమని మహిమ చేయబడింది? తెలుసా?
పాండవులు ఐదుగురే కానీ నషా మరియు నిశ్చయము యొక్క ఆధారముతో
విజయులుగా అయ్యారు, ఈ గాయనము ఇప్పటివరకు ఉంది. మరి అటువంటి
పాండవులేనా? అచ్ఛా - నషా ఉందా? కావున పాండవులు, మీరు పాండవులు
అన్న మాటను ఎప్పుడు విన్నా సరే, పాండవులనేవారు పాండవపతిని
మర్చిపోరు కదా! అప్పుడప్పుడు మర్చిపోతారా? పాండవులు మరియు
పాండవపతి, పాండవులు ఎప్పుడూ పాండవపతిని మర్చిపోలేరు. పాండవులకు
ఈ నషా ఉండాలి - మేము కల్ప-కల్పపు పాండవులము, పాండవపతికి
ప్రియమైనవారము. స్మృతిచిహ్నములో పాండవుల పేరు కూడా తక్కువగా ఏమీ
లేదు. పాండవుల టైటిల్ యే విజయీ పాండవులు. మరి అటువంటి
పాండవులేనా? అంతే, మేము విజయీ పాండవులము. కేవలం పాండవులు కాదు,
విజయీ పాండవులు. విజయ తిలకము అవినాశీగా మస్తకముపై దిద్దబడే ఉంది.
మాతలకు ఏ నషా ఉంటుంది? చాలా నషా ఉంటుంది! మాతలు నషాతో ‘బాబా
వచ్చింది మా కోసమే’ అని అంటారు. అంతే కదా! ఎందుకంటే అర్ధకల్పము
మాతలకు పదవి లభించలేదు, ఇప్పుడు సంగమములో రాజనీతిలో కూడా మాతలకు
అధికారము లభించింది. ప్రతి డిపార్టుమెంటులో బాబా శక్తులైన
మిమ్మల్ని ముందుంచారు కదా, కనుక ప్రపంచములో కూడా ప్రతి వర్గములో
ఇప్పుడు మాతలకు అధికారము లభిస్తుంది. మాతలు లేని వర్గమంటూ ఏదీ
లేదు. ఇది సంగమయుగ పదవి. కనుక మాతలకు - ‘మా బాబా’ అని ఉంటుంది.
‘నా బాబా’ అని ఉంటుందా? నషా ఉందా? మాతలు చేతులు ఊపుతున్నారు.
మంచిది. భగవంతుడిని తమవారిగా చేసుకున్నారు కనుక ఇంద్రజాలికులు
మాతలే కదా! బాప్ దాదా చూస్తారు - మాతలైనా లేక పాండవులైనా, బాప్
దాదాతో సర్వ సంబంధాలలో, ప్రేమ అయితే సర్వ సంబంధాలలోనూ ఉంది కానీ
ఎవరికి ఏ విశేష సంబంధము అంటే ప్రేమ ఉంది అన్నది కూడా చూస్తారు.
కొంతమంది పిల్లలకు ఖుదాను (భగవంతుడిని) దోస్త్ (మిత్రుని) గా
చేసుకోవటము చాలా బాగా అనిపిస్తుంది, అందుకే ఖుదా దోస్త్ కథ కూడా
ఉంది. బాప్ దాదా ఏమంటారంటే - ఏ సమయములో ఏ సంబంధము యొక్క అవసరము
ఉంటుందో భగవంతుడిని ఆ సంబంధముతో మీ వారిగా చేసుకోవచ్చు. సర్వ
సంబంధాలను నిర్వర్తించవచ్చు. పిల్లలు ‘బాబా నా వారు’ అని
అన్నారు మరియు బాబా ఏమన్నారు, ‘నేను మీ వాడిని’.
మధుబన్ లోని శోభ బాగా అనిపిస్తుంది కదా! ఎంత దూరములో
కూర్చుని విన్నా, చూసినా కూడా మధుబన్ శోభ మధుబన్ దే. మధుబన్ లో
బాప్ దాదా అయితే తప్పకుండా కలుస్తారు, ఇదే కాక ఎన్ని ప్రాప్తులు
ఉంటాయి? ఒకవేళ లిస్ట్ తయారుచేస్తే ఎన్ని ప్రాప్తులు ఉంటాయి?
అన్నింటికన్నా అతి పెద్ద ప్రాప్తి ఏమిటంటే సహజ యోగము, స్వతహా
యోగము ఉంటుంది. శ్రమ చేయవలసిన అవసరము ఉండదు. ఒకవేళ ఎవరైనా
మధుబన్ వాయుమండలానికి మహత్వము ఇచ్చినట్లయితే మధుబన్ యొక్క
వాయుమండలము, మధుబన్ యొక్క దినచర్య సహజయోగిగా, స్వతహాయోగిగా
తయారుచేస్తుంది, ఎందుకు? మధుబన్ లో బుద్ధికి కేవలం ఒకటే పని
ఉంటుంది. సేవాధారీ గ్రూపువారు వస్తారు, అది వేరే విషయము, కానీ
ఎవరైతే రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారో వారికి మధుబన్ లో ఏం పని
ఉంటుంది? ఏదైనా బాధ్యత ఉంటుందా? తినండి, త్రాగండి, ఆనందముగా
ఉండండి, చదువుకోండి. కనుక మధుబన్ మధుబనే. విదేశాలలో కూడా
వింటున్నారు. కానీ అక్కడ వినటానికి మరియు మధుబన్ కు వచ్చి
వినటానికి, ఇందులో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. బాప్ దాదా
సాధనాల ద్వారా వినేవారికి, చూసేవారికి కూడా ప్రియస్మృతులను
ఇస్తారు, కొంతమంది పిల్లలైతే రాత్రి మేల్కొని కూడా వింటారు.
అసలు లేనిదానికన్నా ఇది మంచిదే కానీ చాలా చాలా మంచిది అంటే
ప్రియమైన మధుబనే. మధుబన్ కు రావటము బాగా అనిపించిందా, లేక
అక్కడే కూర్చుని మురళిని వింటారా! ఏది బాగా అనిపిస్తుంది?
అక్కడ కూడా మురళి వింటారు కదా. ఇక్కడ కూడా వెనుక కూర్చుని
టి.వి.లోనే చూస్తారు. మరి ఎవరైతే మధుబన్ కు రావటమే బాగుంటుంది
అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు)
మంచిది. అయినా చూడండి, భక్తిలో కూడా గాయనము ఏమి ఉంది? మధుబన్
లో మురళి మ్రోగింది అని ఉంది. లండన్ లో మురళి మ్రోగింది అని
లేదు. ఎక్కడ ఉన్నా సరే మధుబన్ మహిమ యొక్క మహత్వాన్ని
తెలుసుకోవటము అనగా స్వయాన్ని మహానులుగా చేసుకోవటము.
అచ్ఛా - వచ్చినవారందరూ యోగీ జీవితాన్ని, జ్ఞాన స్వరూప ఆత్మ
జీవితాన్ని, ధారణా స్వరూపాన్ని అనుభవం చేస్తున్నారు. ఇప్పుడు
మొదటి టర్నులో ఈ సీజన్ కొరకు విశేషముగా ఏం అటెన్షన్ ఇప్పించటం
జరిగిందంటే - ఈ పూర్తి సీజన్ అంతా సంతుష్టమణిగా అయి ఉండాలి
మరియు సంతుష్టపరచాలి. కేవలం సంతుష్టమణిగా అవ్వటమే కాదు, ఇతరులను
కూడా సంతుష్టపరచాలి. దానితోపాటుగా ఇప్పటి సమయమనుసారముగా
ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, ఎప్పుడవుతుంది, ఒక సంవత్సరములో
అవుతుందా, 6 నెలల్లో అవుతుందా అన్న ప్రశ్న అడగవద్దు.
అకస్మాత్తుగా ఏదైనా, ఏ సమయములోనైనా జరగవచ్చు, అందుకే మీ స్మృతి
అనే స్విచ్ ను శక్తిశాలిగా చేసుకోండి. క్షణములో స్విచ్ ఆన్
చెయ్యండి మరియు అనుభవీ స్వరూపులుగా అయిపోండి. స్విచ్ ఢీలాగా
ఉన్నట్లయితే ఘడియ, ఘడియ ఆన్, ఆఫ్ చేయవలసి వస్తుంది మరియు అది
బాగవటానికి సమయము పడుతుంది. కానీ క్షణములో స్వమానము యొక్క,
స్వరాజ్య అధికారము యొక్క స్విచ్ ను ఆన్ చేసి, అంతర్ముఖీగా అయి
అనుభవం చేస్తూ వెళ్ళండి. అనుభవాల సాగరములో ఇమిడిపోండి. అనుభవమనే
అథారిటీని ఏ అథారిటీ కూడా జయించలేదు. ఏం చెయ్యాలో అర్థమైందా?
బాప్ దాదా సూచననైతే ఇస్తారు కానీ ఎదురుచూడకండి,
ఎప్పుడు-ఎప్పుడు-ఎప్పుడు అని కాదు, ఇప్పుడు. ఎవర్రెడీ. క్షణములో
స్మృతి అనే స్విచ్ ను ఆన్ చెయ్యగలరా? చెయ్యగలరా? ఎటువంటి
పరిస్థితి అయినా, ఎటువంటి సమస్య అయినా, స్మృతి అనే స్విచ్ ను
ఆన్ చెయ్యండి. ఈ అభ్యాసము చెయ్యండి ఎందుకంటే అంతిమ పరీక్ష
క్షణకాలముదే ఉంటుంది, నిమిషము కూడా కాదు. ఆలోచించేవారు పాస్
అవ్వలేరు, అనుభవం కలవారు పాస్ అయిపోతారు. కనుక ఇప్పుడు క్షణములో
అందరూ ‘‘నేను పరంధామ నివాసి శ్రేష్ఠ ఆత్మను’’, అనే ఈ స్మృతి
స్విచ్ ను ఆన్ చెయ్యండి, మరే ఇతర స్మృతి ఉండకూడదు. బుద్ధిలో
ఎటువంటి అలజడి ఉండకూడదు, అచలము. (డ్రిల్). అచ్ఛా.
నలువైపులా ఉన్న శ్రేష్ఠ స్వమానధారులకు, అనుభవీ ఆత్మలకు, సదా
ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకువచ్చేవారికి, సదా యోగీ
జీవితములో నడిచే నిరంతర యోగీ ఆత్మలకు, సదా తమ విశేష భాగ్యాన్ని
ప్రతి కర్మలో ఇమర్జ్ స్వరూపములో ఉంచుకునే కోట్లలో కొందరైన,
కొందరిలో కూడా కొందరైన విశేష ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు
మరియు నమస్తే.