19-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈ పాత ప్రపంచము, పాత శరీరము నుండి జీవిస్తూనే మరణించి ఇంటికి వెళ్ళాలి, అందుకే దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి’’

ప్రశ్న:-
మంచి-మంచి పురుషార్థీ పిల్లల గుర్తులు ఏమిటి?

జవాబు:-
మంచి పురుషార్థులు ఎవరైతే ఉంటారో, వారు ఉదయముదయమే లేచి దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేస్తారు. వారు ఒక్క తండ్రినే స్మృతి చేసే పురుషార్థము చేస్తారు. వారికి - ఇతర ఏ దేహధారులు గుర్తుకు రాకూడదు, నిరంతరము తండ్రి మరియు 84 జన్మల చక్రమే గుర్తుండాలి అనే లక్ష్యము ఉంటుంది. దీనిని కూడా అహో సౌభాగ్యము అనే అంటారు.

ఓంశాంతి
ఇప్పుడు పిల్లలైన మీరు జీవిస్తూ మరణించారు. ఎలా మరణించారు? దేహ అభిమానాన్ని వదిలేస్తే ఇక మిగిలింది ఆత్మ మాత్రమే. శరీరమైతే అంతమైపోతుంది. ఆత్మ మరణించదు. తండ్రి అంటారు, జీవిస్తూ స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు పరమపిత పరమాత్మతో యోగాన్ని జోడించడముతో ఆత్మ పవిత్రముగా అయిపోతుంది. ఎప్పటివరకైతే ఆత్మ పూర్తిగా పవిత్రముగా అవ్వదో అప్పటివరకూ పవిత్రమైన శరీరము లభించదు. ఆత్మ పవిత్రముగా అయిపోతే ఇక ఈ పాత శరీరము దానంతట అదే తొలగిపోతుంది. ఏ విధంగా సర్పము యొక్క కుబుసము దానంతట అదే వదిలిపోతుంది, దాని నుండి మమకారము తొలగిపోతుంది, పాతది పోతుంది, నాకు కొత్త కుబుసము లభిస్తుంది అని దానికి తెలుసు. ప్రతీ జీవికి తమ-తమ బుద్ధి ఉంటుంది కదా. మనము జీవిస్తూ ఈ పాత ప్రపంచము నుండి, పాత శరీరము నుండి మరణించాము అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మరి తర్వాత ఆత్మలైన మీరు కూడా శరీరాన్ని వదిలి ఎక్కడకు వెళ్తారు? మీ ఇంటికి వెళ్తారు. మొట్టమొదటైతే ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి - నేను ఆత్మను, ఈ శరీరాన్ని కాను. బాబా, మేము మీకు చెందినవారిగా అయ్యాము, జీవిస్తూ మరణించాము అని ఆత్మయే అంటుంది. ఇప్పుడు ఆత్మకు ఆజ్ఞ లభించి ఉంది - తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా తయారవుతారు. ఈ స్మృతి అభ్యాసము పక్కాగా ఉండాలి. బాబా, మీరు వస్తే మేము మీ వారిగానే అవుతాము అని ఆత్మ అంటుంది. ఆత్మ పురుష్, అంతేకానీ స్త్రీ కాదు. ఎల్లప్పుడూ మనమంతా భాయీ, భాయీ (సోదరులము) అనే అంటారు. మనమంతా సోదరీలము, మనమంతా పిల్లలము అని అనరు. కొడుకులందరికీ వారసత్వము లభిస్తుంది. ఒకవేళ స్వయాన్ని కూతురుగా భావిస్తే వారసత్వము ఎలా లభిస్తుంది? ఆత్మలందరూ పరస్పరము సోదరులే. ఆత్మిక పిల్లలూ, నన్ను స్మృతి చేయండి అని తండ్రి అందరికీ చెప్తున్నారు. ఆత్మ ఎంత చిన్నగా ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. పిల్లలకు స్మృతి నిలవదు. నేను ఎద్దును, ఎద్దును... అని అనటముతో ఎద్దులా అయిపోతారు అని సన్యాసులు ఒక దృష్టాంతాన్ని ఇస్తారు. ఇప్పుడు వాస్తవానికి ఎవరూ ఎద్దులా అవ్వరు. తండ్రి అయితే అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ ఆత్మ మరియు పరమాత్మ యొక్క జ్ఞానమైతే ఎవరికీ లేదు, అందుకే వారు అటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి, నేను ఒక ఆత్మను, ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి నేను కొత్త శరీరాన్ని తీసుకోవాలి. మనుష్యులు తమ నోటితో చెప్తారు కూడా - ఆత్మ ఒక నక్షత్రము వంటిది, భృకుటి మధ్యలో ఉంటుంది అని, కానీ మళ్ళీ ఆత్మ అంగుష్టాకారములో ఉంటుందని అంటారు. ఇప్పుడు నక్షత్రము ఎక్కడ, అంగుష్ట రూపము ఎక్కడ! అలాగే మట్టి సాలిగ్రామాలను కూర్చుని తయారుచేస్తారు. ఆత్మ అంత పెద్దగా అయితే ఉండదు. మనుష్యులు దేహాభిమానులు కదా, అందుకే స్థూలముగా పెద్ద రూపాన్ని తయారుచేస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన లోతైన విషయాలు. భక్తిని కూడా మనుష్యులు ఏకాంతములో, ఒక గదిలో కూర్చుని చేస్తూ ఉంటారు. మీరైతే గృహస్థ వ్యవహారములో, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటిలో ఉంటూ బుద్ధిలో ఇది పక్కా చేసుకోవాలి - నేను ఒక ఆత్మను. తండ్రి అంటారు - మీ తండ్రినైన నేను కూడా ఎంతో చిన్న బిందువును. నేను పెద్దగా ఉంటాను అని కాదు. నాలో జ్ఞానమంతా ఉంది. ఆత్మ మరియు పరమాత్మ, ఇద్దరూ ఒకేలా ఉంటారు, కేవలము వారిని సుప్రీమ్ అని అంటారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి అంటారు - నేను అమరుడిని. నేను అమరుడిని కానట్లయితే మిమ్మల్ని పావనముగా ఎలా తయారుచేస్తాను. మిమ్మల్ని మధురమైన పిల్లలూ, అని ఎలా అంటాను. ఆత్మయే అన్నీ చేస్తుంది. తండ్రి వచ్చి దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు, ఇందులోనే శ్రమ ఉంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి. యోగీలు అయితే ప్రపంచములో ఎంతోమంది ఉన్నారు. కన్యకు నిశ్చితార్థము అయిన తర్వాత తన పతితో యోగము జోడించబడుతుంది కదా. అంతకంటే ముందు అతనితో యోగము ఉండదు. పతిని చూసిన తర్వాత ఇక అతని స్మృతిలో ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ అభ్యాసము చాలా బాగా ఉండాలి. మంచి-మంచి పురుషార్థీ పిల్లలెవరైతే ఉంటారో, వారు ఉదయముదయమే లేచి దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేస్తారు. భక్తిని కూడా ఉదయమే చేస్తారు కదా. తమ-తమ ఇష్ట దేవతలను తలచుకుంటారు. హనుమంతుడిని కూడా ఎంతగా పూజిస్తూ ఉంటారు కానీ వారి గురించి ఏమీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - మీ బుద్ధి కోతి వలె అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు దేవతలుగా తయారవుతున్నారు. ఇప్పుడు ఇది పతిత తమోప్రధాన ప్రపంచము. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు. నేనైతే పునర్జన్మ రహితుడిని. ఈ శరీరము ఈ దాదాది. నాకు ఎటువంటి శారీరక పేరు లేదు. నా పేరే కళ్యాణకారి శివ. కళ్యాణకారి అయిన శివబాబా వచ్చి నరకాన్ని స్వర్గముగా తయారుచేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఎంత కళ్యాణము చేస్తారు. నరకాన్ని పూర్తిగా వినాశనము చేయించేస్తారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఇప్పుడు స్థాపన అవుతోంది. వీరు ప్రజాపిత బ్రహ్మా ముఖ వంశావళి. నడుస్తూ-తిరుగుతూ ఒకరికొకరు - మన్మనాభవ అని సావధాన పరచుకోవాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. పతిత-పావనుడైతే తండ్రి కదా. వారు పొరపాటున భగవానువాచకు బదులుగా శ్రీకృష్ణ భగవానువాచ అని వ్రాసేసారు. భగవంతుడైతే నిరాకారుడు, వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. వారి పేరు శివ. శివుని పూజ కూడా చాలా జరుగుతూ ఉంటుంది. శివకాశి, శివకాశి అని అంటూ ఉంటారు. భక్తి మార్గములో అనేక రకాల పేర్లు పెట్టారు. సంపాదన కోసం అనేక మందిరాలను నిర్మించారు. అసలు నామము శివ. ఆ తర్వాత సోమనాథుడు అన్న పేరు పెట్టారు, సోమనాథుడు సోమరసాన్ని తాగిస్తారు, జ్ఞాన ధనాన్ని ఇస్తారు. తిరిగి పూజారిగా అయినప్పుడు వారి మందిరాలను నిర్మించడానికి ఎంత ఖర్చు చేస్తారు ఎందుకంటే వారు సోమరసాన్ని ఇచ్చారు కదా. సోమనాథుడితో పాటు సోమనాథిని కూడా ఉంటారు. యథా రాజా రాణి తథా ప్రజా, అందరూ సోమనాథ, సోమనాథినులే. మీరు బంగారు ప్రపంచములోకి వెళ్తారు. అక్కడ బంగారు ఇటుకలు ఉంటాయి. లేకపోతే గోడలు మొదలైనవి ఎలా తయారవుతాయి! చాలా బంగారము ఉంటుంది, అందుకే దానిని బంగారు ప్రపంచము అని అంటారు. ఇది ఇనుము మరియు రాళ్ళ ప్రపంచము. స్వర్గము పేరు వినగానే నోరూరుతుంది. విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మి-నారాయణులు వేర్వేరుగా తయారవుతారు కదా. మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు మీరు రావణపురిలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, కేవలము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. తండ్రి కూడా పరంధామములో ఉంటారు. ఆత్మలైన మీరు కూడా పరంధామములో ఉంటారు. తండ్రి అంటారు, మీకు ఎటువంటి కష్టమూ ఇవ్వను. ఇది చాలా సహజము. కానీ ఈ రావణుడు అనే శత్రువు మీ ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇతను విఘ్నాలను కలిగిస్తాడు. జ్ఞానములో విఘ్నాలు కలగవు, విఘ్నాలు స్మృతిలోనే కలుగుతాయి. ఘడియ-ఘడియ మాయ స్మృతిని మరపింపజేస్తుంది. దేహాభిమానములోకి తీసుకువస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యనివ్వదు, ఈ యుద్ధము జరుగుతూ ఉంటుంది. తండ్రి అంటారు, మీరు ఎలాగూ కర్మయోగులే. అచ్ఛా, దినములో స్మృతి చేయలేకపోతే రాత్రివేళ స్మృతి చేయండి. రాత్రి చేసిన అభ్యాసము దినములో ఉపయోగపడుతుంది.

నిరంతరము స్మృతి ఉండాలి - ఏ తండ్రి అయితే మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారో, మనము వారిని స్మృతి చేస్తాము! తండ్రి స్మృతి మరియు 84 జన్మల చక్రము యొక్క స్మృతి ఉన్నట్లయితే అది అహో సౌభాగ్యము. ఇతరులకు కూడా వినిపించాలి - సోదరీ-సోదరులారా, ఇప్పుడు కలియుగము పూర్తయి సత్యయుగము వస్తుంది. తండ్రి వచ్చారు, సత్యయుగము కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. కలియుగము తర్వాత సత్యయుగము రానున్నది. ఇప్పుడు ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు. వానప్రస్థులెవరైతే ఉంటారో, వారు సన్యాసుల వద్దకు వెళ్ళి వారి సాంగత్యము చేస్తారు. వానప్రస్థములో వాణితో పని ఉండదు. ఆత్మ శాంతిగా ఉంటుంది. లీనమైతే అవ్వదు. డ్రామా నుండి ఏ పాత్రధారి బయటకు రాలేరు. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు అని కూడా తండ్రి అర్థం చేయించారు. చూస్తూ కూడా స్మృతి చేయకండి. ఈ పాత ప్రపంచమైతే వినాశనమవ్వనున్నది, ఇది ఒక స్మశానము కదా. శవాలను ఎప్పుడైనా స్మృతి చేయడము జరుగుతుందా! తండ్రి అంటారు, వీరందరూ చనిపోయి ఉన్నారు. నేను వచ్చాను, పతితులను పావనముగా తయారుచేసి నాతోపాటు తీసుకువెళ్తాను. ఇక్కడ ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఈ రోజుల్లో బాంబులు మొదలైనవి ఏవైతే తయారుచేస్తున్నారో అవి చాలా-చాలా శక్తివంతమైనవి తయారుచేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చుని ఎవరి మీదకైతే వేస్తామో, వారి పైనే పడతాయి అని వారు అంటారు. ఇది నిశ్చితము, మళ్ళీ వినాశనము జరగనున్నది. భగవంతుడు వస్తారు, కొత్త ప్రపంచము కోసము రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది మహాభారత యుద్ధము, ఇది శాస్త్రాలలో గాయనము చేయబడినది. తప్పకుండా భగవంతుడు వచ్చారు, స్థాపన మరియు వినాశనము చేయడానికి. చిత్రాలు కూడా స్పష్టముగా ఉన్నాయి. మేము ఈ విధంగా అవుతాము అని మీరు సాక్షాత్కారము పొందుతున్నారు. ఇక్కడి ఈ చదువు ఇక సమాప్తమైపోతుంది. అక్కడైతే బ్యారిస్టర్లు, డాక్టర్లు మొదలైనవారి అవసరము ఉండదు. మీరైతే ఇక్కడి వారసత్వాన్ని తీసుకుని వెళ్తారు. నైపుణ్యాలు కూడా అన్నీ ఇక్కడి నుండే తీసుకువెళ్తారు. భవనాలు మొదలైనవి తయారుచేసేవారు ఫస్ట్ క్లాస్ గా ఉంటారు కావున వారు అక్కడ కూడా తయారుచేస్తారు. అక్కడ బజారులు మొదలైనవి కూడా ఉంటాయి కదా. పనులు అవుతూ ఉంటాయి. ఇక్కడ నేర్చుకున్న తెలివిని తీసుకువెళ్తారు. సైన్స్ ద్వారా కూడా మంచి తెలివిని నేర్చుకుంటారు. ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి. వారు ప్రజల్లోకి వెళ్తారు. పిల్లలైన మీరైతే ప్రజల్లోకి రాకూడదు. మీరు బాబా మరియు మమ్మా యొక్క సింహాసనాధికారులుగా అయ్యేందుకే ఇక్కడకు వచ్చారు. తండ్రి ఏ శ్రీమతాన్ని అయితే ఇస్తారో, దానిపై నడుచుకోవాలి. ఫస్ట్ క్లాస్ శ్రీమతమైతే ఒకటే ఇస్తున్నారు - నన్ను స్మృతి చేయండి. కొందరి భాగ్యము అనాయాసముగా ఏ కష్టమూ లేకుండా తెరుచుకుంటుంది. ఏదో ఒక కారణము నిమిత్తమవుతుంది. కుమారీలకు కూడా బాబా చెప్తారు - వివాహము చేసుకుంటే సర్వనాశనము అవుతుంది, ఈ మురికి గుంటలో పడకండి. మీరు తండ్రి చెప్పింది వినరా! స్వర్గ మహారాణిగా అవ్వరా! మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి - మేము ఆ ప్రపంచములోకి ఎప్పటికీ వెళ్ళము, ఆ ప్రపంచాన్ని అసలు స్మృతి కూడా చేయము అని. స్మశానాన్ని ఎప్పుడైనా స్మృతి చేస్తారా! ఇక్కడైతే మీరు అంటారు - ఈ శరీరము వదిలేస్తే మేము మా స్వర్గములోకి వెళ్తాము కదా అని. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్తాము. ఇతరులకు కూడా ఇదే వినిపించాలి. బాబా తప్ప సత్యయుగ రాజ్యాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు అని కూడా అర్థం చేసుకుంటారు.

ఈ రథానికి కూడా కర్మభోగము ఉంటుంది కదా. బాప్ దాదాలకు మధ్య కూడా పరస్పరము ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉంటుంది - ఈ బాబా అంటారు, బాబా ఆశీర్వదించండి, ఈ దగ్గుకు ఏదైనా మందు ఇవ్వండి లేక దీనిని మాయం చేయండి. బాబా అంటారు - లేదు, దీనిని అనుభవించవలసిందే. నేను నీ రథాన్ని తీసుకుంటాను కావున దానికి రిటర్ను ఇస్తాను కానీ ఇది మాత్రము నీ లెక్కాచారము. అంతిమము వరకూ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. నిన్ను ఆశీర్వదిస్తే మరి అందరినీ ఆశీర్వదించవలసి ఉంటుంది కదా. ఈ రోజు ఈ కుమార్తె ఇక్కడ కూర్చుంది, రేపు ట్రైన్ లో వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదము జరిగి మరణిస్తే, బాబా దానిని డ్రామా అని అంటారు. బాబా ముందే ఎందుకు చెప్పలేదు అని అనడానికి లేదు. అలా చెప్పడము అనేది నియమము కాదు. నేనైతే పతితము నుండి పావనముగా తయారుచేయడానికే వస్తాను, అంతేకానీ ఇవన్నీ చెప్పడానికి రాలేదు. ఈ లెక్కాచారాలన్నింటినీ మీవి మీరే సమాప్తము చేసుకోవాలి. ఇందులో ఆశీర్వాదము యొక్క విషయమేమీ లేదు. దీని కోసం సన్యాసుల వద్దకు వెళ్ళండి. బాబా అయితే ఒకే విషయము చెప్తారు. నన్ను పిలిచిందే - మమ్మల్ని నరకము నుండి స్వర్గములోకి తీసుకువెళ్ళండి అని. పతిత-పావన సీతారామ్ అని పాడుతారు కూడా. కానీ దానికి తప్పుడు అర్థాన్ని తీసారు. ఇంకా రఘుపతి రాఘవ రాజా రామ్ అని కూర్చుని రాముని మహిమను చేస్తారు. తండ్రి అంటారు, ఈ భక్తి మార్గములో మీరు ఎంత ధనాన్ని పోగొట్టారు. ఏం వింత చూసాము... అని ఒక పాట కూడా ఉంది కదా. దేవీల మూర్తులను తయారుచేసి, వాటిని పూజించి, మళ్ళీ సముద్రములో ముంచేస్తారు. ఎంత ధనాన్ని పాడు చేస్తారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇది మళ్ళీ కూడా జరుగుతుంది. సత్యయుగములోనైతే ఇటువంటి పనులు ఉండనే ఉండవు. క్షణక్షణము నిశ్చితమై ఉంది. కల్పము తర్వాత మళ్ళీ ఇదే విషయము రిపీట్ అవుతుంది. డ్రామాను చాలా బాగా అర్థం చేసుకోవాలి. అచ్ఛా, ఎవరైనా ఎక్కువగా స్మృతి చేయలేకపోతే తండ్రి అంటారు, కేవలము అల్ఫ్ మరియు బే, తండ్రిని మరియు రాజ్యాధికారాన్ని స్మృతి చేయండి. ఆత్మనైన నేను ఏ విధంగా 84 జన్మల చక్రములో తిరిగి వచ్చాను అని లోపల ఇదే ధ్యాస పెట్టుకోండి. చిత్రాల ద్వారా అర్థం చేయించండి, ఇది చాలా సహజము. ఇది ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ. తండ్రి తన పిల్లలతోనే ఆత్మిక సంభాషణ చేస్తారు. ఇంకెవ్వరితోనూ చేయలేరు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మయే అన్నీ చేస్తుంది. మీరు 84 జన్మలు తీసుకున్నారు అని తండ్రి గుర్తు తెప్పిస్తున్నారు. మనుష్యులుగానే తయారయ్యారు. ఏ విధంగానైతే తండ్రి వికారాలలోకి వెళ్ళకూడదు అనే చట్టాన్ని జారీ చేస్తారో, అలాగే ఎవ్వరూ ఏడవకూడదు అనే చట్టాన్ని కూడా జారీ చేస్తున్నారు. సత్య, త్రేతాయుగాలలో ఎప్పుడూ ఎవరూ ఏడవరు, చిన్న పిల్లలు కూడా ఏడవరు. ఏడ్చేందుకు అనుమతి లేదు. ఆ ప్రపంచమే హర్షితముగా ఉండే ప్రపంచము. ఆ అభ్యాసము అంతా ఇక్కడే చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రిని ఆశీర్వాదము అడిగేందుకు బదులుగా స్మృతియాత్ర ద్వారా తమ లెక్కలన్నింటినీ సమాప్తము చేసుకోవాలి. పావనముగా అయ్యే పురుషార్థము చెయ్యాలి. ఈ డ్రామాను యథార్థ రీతిగా అర్థము చేసుకోవాలి.

2. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా స్మృతి చేయకూడదు. కర్మయోగిగా అవ్వాలి. సదా హర్షితముగా ఉండే అభ్యాసము చెయ్యాలి. ఎప్పుడూ ఏడవకూడదు.

వరదానము:-
ప్రవృత్తిలో ఉంటూ నాది అన్న భావనను త్యాగము చేసే సత్యమైన ట్రస్టీ, మాయాజీత్ భవ

ఏ విధంగా మురికిలో పురుగులు పుడతాయో, అలాగే ఎప్పుడైతే నాది అనే భావన వస్తుందో అప్పుడు మాయ జన్మిస్తుంది. మాయాజీతులుగా అయ్యేందుకు సహజ విధానము - స్వయాన్ని సదా ట్రస్టీగా భావించండి. బ్రహ్మాకుమారులు అనగా ట్రస్టీ, ట్రస్టీకు ఎవరి పట్ల మోహము ఉండదు ఎందుకంటే వారిలో నా అనే భావన ఉండదు. గృహస్థులుగా భావించినట్లయితే మాయ వస్తుంది మరియు ట్రస్టీగా భావించినట్లయితే మాయ పారిపోతుంది, అందుకే అతీతముగా అయి ప్రవృత్తి కార్యాలలోకి రండి, అప్పుడు మాయాప్రూఫ్ గా ఉంటారు.

స్లోగన్:-
ఎక్కడైతే అభిమానము ఉంటుందో, అక్కడ అవమానము యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

మీ ఆంతరిక స్వచ్ఛత మరియు సత్యత అనేవి లేవటములో, కూర్చోవటములో, మాట్లాడటములో, సేవ చెయ్యటములో అందరికీ అనుభవమవ్వాలి, అప్పుడు పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తము అవ్వగలరు, దీని కొరకు పవిత్రత అనే దీపము సదా వెలుగుతూ ఉండాలి, అది కొంచెము కూడా రెపరెపలాడకూడదు (అలజడిలోకి రాకూడదు). ఎంతగా పవిత్రత అనే దీపము అచలముగా ఉంటుందో, అంత సహజముగా అందరూ తండ్రిని గుర్తించగలరు.