19-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అనంతమైన తండ్రికి విశ్వాసపాత్రులుగా ఉన్నట్లయితే పూర్తి శక్తి లభిస్తుంది, మాయపై విజయము లభిస్తూ ఉంటుంది’’

ప్రశ్న:-
తండ్రి వద్ద ఉన్న ముఖ్యమైన అథారిటీ ఏమిటి? దానికి గుర్తు ఏమిటి?

జవాబు:-
తండ్రి వద్ద ముఖ్యముగా ఉన్నది జ్ఞానము యొక్క అథారిటీ. వారు జ్ఞాన సాగరుడు, అందుకే పిల్లలైన మీకు చదువును చదివిస్తున్నారు. వారు తమ సమానముగా నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేస్తారు. మీ వద్ద చదువు యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. చదువు ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందుతారు.

పాట:-
ప్రపంచము మారినా...

ఓంశాంతి
భక్తులు భగవంతుని మహిమను చేస్తారు. ఇప్పుడు మీరైతే భక్తులు కారు. మీరైతే ఆ భగవంతునికి పిల్లలుగా అయ్యారు. అందులోనూ విశ్వాసపాత్రులైన పిల్లలు కావాలి. ప్రతి విషయములోనూ విశ్వాసపాత్రులుగా ఉండాలి. పత్నికి తన పతి పట్ల తప్ప మరియు పతికి తన పత్ని పట్ల తప్ప ఇంకెవరివైపుకు అయినా దృష్టి వెళ్ళినట్లయితే వారిని అవిశ్వాసపాత్రులు అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా అనంతమైన తండ్రి. వారితో అవిశ్వాసపాత్రులు మరియు విశ్వాసపాత్రులు, ఇరువురూ ఉంటారు. విశ్వాసపాత్రులుగా అయి మళ్ళీ అవిశ్వాసపాత్రులుగా అయిపోతారు. తండ్రి ఉన్నతోన్నతమైన అథారిటీ కలవారు. వారు ఆల్మైటీ (సర్వశక్తివంతుడు) కదా. కావున వారి పిల్లలు కూడా అదే విధముగా ఉండాలి. తండ్రిలో శక్తి ఉంది, వారు పిల్లలకు రావణుడిపై విజయాన్ని పొందేందుకు యుక్తిని తెలియజేస్తారు, అందుకే వారిని సర్వశక్తివంతుడు అని కూడా అంటారు. మీరు కూడా శక్తి సైన్యము కదా. మీరు స్వయాన్ని కూడా ఆల్మైటీగా చెప్పుకుంటారు. తండ్రిలో ఏదైతే శక్తి ఉందో, దానిని మనకు ఇస్తారు. మాయా రావణుడిపై మీరు విజయాన్ని ఎలా పొందగలరు అన్నది తెలియజేస్తారు, కావున మీరు కూడా శక్తివంతులుగా అవ్వాలి. తండ్రి జ్ఞానము యొక్క అథారిటీ కలవారు, వారు నాలెడ్జ్ ఫుల్ కదా. ఏ విధంగానైతే ఆ మనుష్యులు శాస్త్రాలు, భక్తి మార్గము యొక్క అథారిటీ కలవారో, అదే విధంగా ఇప్పుడు మీరు ఆల్మైటీ అథారిటీగా, నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు. మీకు కూడా జ్ఞానము లభిస్తుంది. ఇది పాఠశాల. ఇక్కడ మీరు ఏ జ్ఞానాన్ని అయితే చదువుతారో, దాని ద్వారా ఉన్నత పదవిని పొందగలరు. ఇటువంటి పాఠశాల ఒక్కటే ఉంది. మీరైతే ఇక్కడ చదువుకోవాలి, అంతేకానీ ఇతర ప్రార్థనలు మొదలైనవేవీ చేయకూడదు. మీకు చదువు ద్వారా వారసత్వము లభిస్తుంది, ఇది లక్ష్యము-ఉద్దేశ్యము. తండ్రి నాలెడ్జ్ ఫుల్ అని, వారి చదువు పూర్తిగా వేరుగా ఉంటుంది అని పిల్లలైన మీకు తెలుసు. జ్ఞానసాగరుడు తండ్రి కావున వారికే ఈ జ్ఞానము తెలుసు. వారే మనకు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి సమ్ముఖములోకి వచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, తిరిగి వెళ్ళిపోతారు. ఈ చదువు ద్వారా ఏ ప్రారబ్ధము లభిస్తుంది, అది కూడా మీకు తెలుసు. ఇకపోతే సత్సంగాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో మరియు గురువులు, పండితులు ఎవరైతే ఉన్నారో, వారంతా భక్తి మార్గానికి చెందినవారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తుంది. వారిలో కూడా ఎవరైనా ఇక్కడికి చెందినవారు ఉంటే వారు తిరిగి ఇక్కడికి వస్తారు అని కూడా తెలుసు. పిల్లలైన మీరు సేవకు సంబంధించి భిన్న-భిన్న యుక్తులను వెలికితీయాలి. మీ అనుభవాలను వినిపించి అనేకుల భాగ్యాన్ని తయారుచేయాలి. సేవాధారి పిల్లలైన మీ అవస్థ చాలా నిర్భయముగా, అచంచలముగా మరియు యోగయుక్తముగా ఉండాలి. యోగములో ఉంటూ సేవ చేసినట్లయితే సఫలత లభించగలదు.

పిల్లలూ, మీరు స్వయాన్ని పూర్తిగా సంభాళించుకోవాలి. ఎప్పుడూ ఆవేశము మొదలైనవి రాకూడదు, పక్కా యోగయుక్తముగా ఉండాలి. తండ్రి అర్థం చేయించారు - వాస్తవానికి మీరందరూ వానప్రస్థులు, వాణి నుండి అతీతమైన అవస్థ కలవారు. వానప్రస్థులు అనగా వాణి నుండి అతీతముగా ఉంటూ ఇంటిని మరియు తండ్రిని స్మృతి చేసేవారు. ఇది తప్ప ఇంకే ఇతర కోరిక ఉండదు. నాకు మంచి బట్టలు కావాలి, ఇలాంటివన్నీ ఛీ-ఛీ కోరికలు. దేహాభిమానము కలవారు సేవ చేయలేరు. దేహీ-అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. భగవంతుని పిల్లలకైతే శక్తి అవసరము. అది కూడా యోగము యొక్క శక్తి. బాబా అయితే పిల్లలందరి గురించి తెలుసుకోగలరు కదా. ఈ-ఈ లోపాలను తొలగించుకోండి అని బాబా అయితే వెంటనే తెలియజేస్తారు. బాబా అర్థం చేయించారు, శివుని మందిరాలకు వెళ్ళండి, అక్కడ మీకు ఎంతోమంది లభిస్తారు. కాశీకి వెళ్ళి నివాసముండేవారు ఎంతోమంది ఉన్నారు. కాశీనాథుడు మా కళ్యాణము చేస్తారు అని భావిస్తారు. అక్కడ మీకు చాలామంది కస్టమర్లు లభిస్తారు, కానీ ఇందులో చాలా తెలివైన బుద్ధి కావాలి. గంగా స్నానాలు చేసేవారి వద్దకు కూడా వెళ్ళి అర్థము చేయించవచ్చు. మందిరాలకు కూడా వెళ్ళి అర్థం చేయించండి. గుప్త వేషములో వెళ్ళవచ్చు. హనుమంతుని ఉదాహరణ ఉంది కదా. వాస్తవానికి అది మీరే కదా. ఇక్కడ చెప్పుల వద్ద కూర్చోవలసిన విషయమేమీ లేదు. ఇందులో బాగా అర్థం చేసుకునే తెలివైనవారు కావాలి. బాబా అర్థం చేయించారు, ప్రస్తుతం ఎవ్వరూ కర్మాతీతులుగా అవ్వలేదు. ఏదో ఒక లోపము తప్పకుండా ఉంది.

అందరూ రావలసిన దుకాణము ఇది ఒక్కటేనని పిల్లలైన మీకు నషా ఉండాలి. ఒక రోజు ఈ సన్యాసులు మొదలైనవారందరూ వస్తారు. ఒకటే దుకాణము ఉన్నప్పుడు మరి ఇంకెక్కడికి వెళ్తారు. ఎవరైతే బాగా భ్రమించి ఉంటారో, వారికే మార్గము లభిస్తుంది, మరియు ఇదొక్కటే దుకాణము అని అర్థం చేసుకుంటారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే కదా. ఇటువంటి నషా ఎక్కాలి. పతితులను పావనముగా చేసి శాంతిధామము- సుఖధామము యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అని తండ్రికి ఇదే చింత ఉంది కదా. మీది కూడా ఇదే వ్యాపారము. సర్వుల కళ్యాణము చేయాలి. ఇది పాత ప్రపంచము. దీని ఆయువు ఎంత? ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నది అని కొద్ది సమయములో అర్థం చేసుకుంటారు. కొత్త ప్రపంచ స్థాపన జరిగితేనే పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది అన్న విషయము సర్వ ఆత్మల బుద్ధిలోకి వస్తుంది. తప్పకుండా భగవంతుడు ఇక్కడే ఉన్నారని మున్ముందు అంటారు. రచయిత అయిన తండ్రినే మర్చిపోయారు. త్రిమూర్తులలో శివుని చిత్రాన్ని తీసేశారు కావున అది ఎందుకూ పనికిరాదు. రచయిత అయితే వారే కదా. శివుని చిత్రాన్ని అందులో చేర్చడము వల్ల బ్రహ్మా ద్వారా స్థాపన అన్నది స్పష్టమవుతుంది. ప్రజాపిత బ్రహ్మా ఉంటే మరి తప్పకుండా బి.కె.లు కూడా ఉండాలి కదా. బ్రాహ్మణ కులము అన్నింటికంటే ఉన్నతమైనది. మీరు బ్రహ్మా సంతానము, బ్రాహ్మణులను ఎలా రచిస్తారు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. ఇవి చాలా క్లిష్టమైన విషయాలు. తండ్రి ఎప్పుడైతే సమ్ముఖములోకి వచ్చి అర్థం చేయిస్తారో, అప్పుడే అర్థం చేసుకుంటారు. దేవతలుగా ఎవరైతే ఉండేవారో, వారు శూద్రులుగా అయ్యారు. మరి ఇప్పుడు వారిని ఎలా వెతకాలి, దాని కొరకు యుక్తులను వెలికితీయాలి, తద్వారా ఈ బి.కె.ల కార్యము చాలా భారీ కార్యమని అర్థం చేసుకోవాలి. ఎన్ని కరపత్రాలు మొదలైనవి పంచుతారు! బాబా విమానాల నుండి కూడా కరపత్రాలను వేయాలి అని అర్థం చేయించారు. కనీసము ఒక్కొక్క కాగితము వార్తాపత్రికలోని కాగితమంత ఉండాలి, అందులో ముఖ్యమైన పాయింట్లు, మెట్ల వరుస మొదలైనవి కూడా ముద్రించవచ్చు. ముఖ్యమైనవి ఇంగ్లీషు మరియు హిందీ భాషలు. కనుక సేవను ఎలా పెంచాలి అని పిల్లలు రోజంతా ఇదే ఆలోచన పెట్టుకోవాలి. డ్రామానుసారముగా పురుషార్థము జరుగుతూ ఉంటుంది అని కూడా తెలుసు. వీరు సేవ బాగా చేస్తున్నారు కావున వీరి పదవి కూడా ఉన్నతముగా ఉంటుంది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి పాత్రధారికి తన పాత్ర ఉంది, ఈ వాక్యాన్ని కూడా తప్పకుండా వ్రాయాలి. తండ్రి కూడా ఈ డ్రామాలోకి నిరాకారీ ప్రపంచము నుండి వచ్చి సాకార శరీరాన్ని ఆధారముగా తీసుకుని పాత్రను అభినయిస్తారు. ఎవరెవరు ఎంతెంత పాత్రను అభినయిస్తారు అనేది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. కావున ఈ వాక్యము కూడా ముఖ్యమైనది. ఈ సృష్టిచక్రాన్ని తెలుసుకోవడము ద్వారా మనుష్యులు స్వదర్శన చక్రధారులుగా అయి చక్రవర్తి రాజులుగా, విశ్వానికి యజమానులుగా అవ్వగలుగుతారు అని నిరూపించి తెలియజేయాలి. మీ వద్దనైతే మొత్తము జ్ఞానమంతా ఉంది కదా. తండ్రి వద్ద గీతా జ్ఞానమే ఉంది, దీని ద్వారా మనుష్యులు నరుని నుండి నారాయణునిగా అవుతారు. పూర్తి జ్ఞానము బుద్ధిలోకి వచ్చినట్లయితే ఇక మరి పూర్తి రాజ్యాధికారము కావాలి. కావున పిల్లలు ఈ-ఈ విధంగా ఆలోచిస్తూ తండ్రి సేవలో నిమగ్నమైపోవాలి.

జయపూర్ లో కూడా ఈ ఆత్మిక మ్యూజియం ఎప్పుడూ ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్నట్లయితే మనుష్యులు విశ్వానికి యజమానులుగా అవ్వగలరు అని అక్కడ వ్రాసి ఉంది. ఎవరైతే చూస్తారో వారు ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. పిల్లలు సదా సేవలో ఉండాలి. మమ్మా కూడా సేవలో ఉన్నారు, ఆమెను నిమిత్తము చేసారు. సరస్వతి ఎవరు అనేది ఏ శాస్త్రాలలోనూ లేదు. ప్రజాపిత బ్రహ్మాకు కేవలము ఒక్క పుత్రిక మాత్రమే ఉంటారా? అనేక పేర్లు కల అనేక పుత్రికలు ఉంటారు కదా. మమ్మా దత్తత తీసుకోబడిన కుమార్తె. ఏ విధంగా మీరు దత్తత తీసుకోబడ్డారో, అలాగే వారు కూడా. ఒక అధికారి వెళ్ళిపోతే ఆ స్థానములో ఇంకొకరిని నియమించడం జరుగుతుంది. ప్రధానమంత్రిని అయినా ఇంకొకరిని నియమించడం జరుగుతుంది. సమర్థునిగా భావించినట్లయితే వారిని ఎన్నుకుంటారు, సమయము పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని ఎన్నుకోవలసి ఉంటుంది. తండ్రి పిల్లలకు మొట్టమొదట నేర్పించే మ్యానర్స్ ఏమిటంటే - మీరు ఎవరిని ఎలా గౌరవించాలి! చదువురానివారు ఎవరైతే ఉంటారో, వారికి ఇతరులను గౌరవించడము కూడా రాదు. ఎవరైతే బాగా చురుకైనవారో, వారిని అందరూ గౌరవించవలసిందే. పెద్దవారిని గౌరవించినట్లయితే అది చూసి అందరూ నేర్చుకుంటారు. చదువురానివారైతే అమాయకులుగా ఉంటారు. తండ్రి కూడా వచ్చి చదువురానివారిని పైకి ఎత్తారు. ఈ రోజుల్లో స్త్రీలను ముందు ఉంచుతారు. ఆత్మలమైన మన నిశ్చితార్థము పరమాత్మతో జరిగిందని పిల్లలైన మీకు తెలుసు. మేము వెళ్ళి విష్ణుపురికి యజమానులుగా అవుతాము అని మీరు ఎంతో సంతోషిస్తారు. కన్య తనకు కాబోయేవారిని చూడకపోయినా సరే, ఆమెకు బుద్ధియోగము జోడించబడుతుంది కదా. ఇక్కడ ఆత్మ మరియు పరమాత్మల ఈ నిశ్చితార్థము చాలా అద్భుతమైనది అని ఆత్మకు ఇది కూడా తెలుసు. ఒక్క తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది. వారు - గురువును స్మృతి చేయండి, ఫలానా మంత్రాన్ని స్మృతి చేయండి అని అంటారు, కానీ ఇక్కడ తండ్రియే సర్వస్వము. తండ్రి వీరి ద్వారా వచ్చి నిశ్చితార్థము చేయిస్తున్నారు. వారు అంటారు, నేను మీ తండ్రిని కూడా, నా నుండి వారసత్వము లభిస్తుంది. కన్యకు నిశ్చితార్థమైతే ఇక ఆమె అతడిని ఎప్పుడూ మర్చిపోదు. మరి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? కర్మాతీత అవస్థను పొందడానికి సమయము పడుతుంది. కర్మాతీత అవస్థను పొంది తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. ముందు ప్రియుడు వెళ్తుంటే అతని వెనక మొత్తము ఊరేగింపు అంతా వెళ్తుంది. ఇది శంకరుని ఊరేగింపు కాదు, ఇది శివుని ఊరేగింపు. ప్రియుడు ఒక్కరే, మిగిలినవారందరూ ప్రేయసులే. కావున ఇది శివబాబా ఊరేగింపు. కానీ కొడుకు అయిన శంకరుడి పేరు పెట్టేసారు. ఉదాహరణ ఇచ్చి అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రి వచ్చి పుష్పాలుగా తయారుచేసి అందరినీ తీసుకువెళ్తారు. ఏ పిల్లలైతే కామచితిపై కూర్చుని పతితులుగా అయిపోయారో, వారిని జ్ఞానచితిపై కూర్చోబెట్టి పుష్పాలుగా తయారుచేసి అందరినీ తీసుకువెళ్తారు. ఇది పాత ప్రపంచము కదా! కల్పకల్పమూ తండ్రి వస్తారు, ఛీ-ఛీగా ఉన్న మనల్ని పుష్పాలుగా తయారుచేసి తీసుకువెళ్తారు. రావణుడు ఛీ-ఛీగా తయారుచేస్తాడు మరియు శివబాబా పుష్పాలుగా తయారుచేస్తారు. కావున బాబా ఎన్నో యుక్తులను అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తినాలి, తాగాలి అనే ఛీ-ఛీ కోరికలను వదిలి దేహీ-అభిమానులుగా అయి సేవ చేయాలి. స్మృతి ద్వారా శక్తిని తీసుకుని నిర్భయ మరియు అచంచలమైన అవస్థను తయారుచేసుకోవాలి.

2. ఎవరైతే చదువులో చురుకుగా, తెలివైనవారిగా ఉన్నారో, వారిని గౌరవించాలి. ఎవరైతే భ్రమిస్తున్నారో, వారికి మార్గాన్ని చూపించేందుకు యుక్తిని రచించాలి. అందరి కళ్యాణము చెయ్యాలి.

వరదానము:-
తమ మహత్వము మరియు కర్తవ్యము గురించి తెలుసుకునే సదా వెలిగే జ్యోతి భవ

పిల్లలైన మీరు జగత్తుకు జ్యోతి వంటివారు, మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరగాలి - అందుకే గతం గతః చేసి తమ మహత్వము మరియు కర్తవ్యము గురించి తెలుసుకుని సదా వెలిగే జ్యోతిగా అవ్వండి. మీరు క్షణములో స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తనను చెయ్యగలరు. కేవలము ఏం ప్రాక్టీస్ చెయ్యండి అంటే - ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి. ఏ విధంగా మీ రచన అయిన తాబేలు క్షణములో అన్ని కర్మేంద్రియాలను సర్దుకుంటుందో, అదే విధంగా మాస్టర్ రచయితలైన మీరు సర్దుబాటు శక్తి ఆధారముగా క్షణములో అన్ని సంకల్పాలను ఇముడ్చుకుని ఒక్క సంకల్పములో స్థితులవ్వండి.

స్లోగన్:-
లవలీన స్థితిని అనుభవము చేసేందుకు స్మృతి-విస్మృతుల యుద్ధాన్ని సమాప్తము చెయ్యండి.

మాతేశ్వరిగారి మధుర మహావాక్యాలు

‘‘అర్ధకల్పము జ్ఞానము బ్రహ్మా యొక్క పగలు మరియు అర్ధకల్పము భక్తి బ్రహ్మా యొక్క రాత్రి’’

అర్ధకల్పము బ్రహ్మా యొక్క పగలు, అర్ధకల్పము బ్రహ్మా యొక్క రాత్రి, ఇప్పుడు రాత్రి పూర్తయ్యి ఉదయము రావాలి. ఇప్పుడు పరమాత్మ వచ్చి అంధకారాన్ని అంతము చేసి ప్రకాశము యొక్క ఆదిని తీసుకువస్తారు. జ్ఞానము ద్వారా ప్రకాశము, భక్తి ద్వారా అంధకారము. పాటలో కూడా, ఈ పాపపు ప్రపంచము నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళండి, మనశ్శాంతి లభించే చోటుకు తీసుకువెళ్ళండి అని అంటారు. ఇది ప్రశాంతత లేని ప్రపంచము, ఇక్కడ ప్రశాంతత ఉండదు. ముక్తిలో ప్రశాంతత కూడా ఉండదు, అలాగని అశాంతి కూడా ఉండదు. సత్య, త్రేతా యుగాలు ప్రశాంతత కల ప్రపంచము, ఆ సుఖధామాన్ని అందరూ తలచుకుంటారు. ఇప్పుడు మీరు ప్రశాంతత కల ప్రపంచములోకి వెళ్తున్నారు, అక్కడకు అపవిత్ర ఆత్మ వెళ్ళలేదు, అక్కడ అంతిమములో ధర్మరాజు శిక్షలను అనుభవించి కర్మబంధనము నుండి ముక్తులై శుద్ధ సంస్కారాలను తీసుకువెళ్తారు, ఎందుకంటే అక్కడ అశుద్ధ సంస్కారాలు ఉండవు, పాపము ఉండదు. ఆత్మ ఎప్పుడైతే తన అసలైన తండ్రిని మర్చిపోతుందో, అప్పుడు ఈ గెలుపు-ఓటముల తికమకదారుల అనాది ఆట తయారయ్యింది. అందుకే స్వయం ఈ సర్వశక్తివంతుడైన పరమాత్మ ద్వారా శక్తిని తీసుకుని వికారాలపై విజయాన్ని పొంది 21 జన్మల కొరకు రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. అచ్ఛా - ఓం శాంతి.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

ఆత్మనైన నా ద్వారా చేయించేవారు ఆ సుప్రీమ్ ఆత్మ. చేయించేవారి ఆధారంగా నేను నిమిత్తముగా చేసేవాడిని. నేను చేసేవాడిని, వారు చేయించేవారు. వారు నడిపిస్తున్నారు, నేను నడుస్తున్నాను. ప్రతి డైరెక్షన్ లో ఆత్మనైన నా కోసం సంకల్పము, మాట మరియు కర్మలో సదా ఆ ప్రభువు హాజరై ఉన్నారు, అందుకే ఆ ప్రభువు ఎదురుగా సదా ఆత్మనైన నేను కూడా హాజరై ఉన్నాను. సదా ఈ కంబైండ్ రూపములోనే ఉండండి.