19-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఆత్మాభిమాని భవ, నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చుంటూ ఈ అభ్యాసమునే చేస్తూ ఉన్నట్లయితే మీ ఉన్నతి ఎంతగానో జరుగుతూ ఉంటుంది’’

ప్రశ్న:-
తండ్రి యొక్క యథార్థ స్మృతి ఏ పిల్లల బుద్ధిలో ఉంటుంది?

జవాబు:-
ఏ పిల్లలైతే తండ్రిని యథార్థముగా తెలుసుకున్నారో, వారి బుద్ధిలో యథార్థ స్మృతి ఉంటుంది. బిందువును ఎలా స్మృతి చేయాలి అని చాలామంది పిల్లలు అడుగుతారు. భక్తిలోనైతే అఖండ జ్యోతిగా భావిస్తూ స్మృతి చేస్తూ వచ్చారు, ఇప్పుడు బిందువు అని అనేటప్పటికి తికమకపడతారు. అందుకే, మొట్టమొదటగా తండ్రి అఖండ జ్యోతి కాదు, వారు అతి సూక్ష్మ బిందువు అన్న నిశ్చయము ఉన్నట్లయితే యథార్థ స్మృతి ఉండగలదు.

ఓంశాంతి
పిల్లలందరూ స్మృతిలో కూర్చున్నారు. మన్మనాభవ. వాస్తవానికి ఇది సంస్కృత పదము కాదు. తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పించినప్పుడు, ఈ సంస్కృత పదాన్ని చెప్పలేదు. అసలు వీరికి (బ్రహ్మా) సంస్కృతము తెలియదు. తండ్రి అయితే హిందీలోనే అర్థం చేయిస్తారు. ఈ రథము హిందీ, సింధీ మరియు ఇంగ్లీషు తెలిసినవారు కానీ తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తారు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో, వారికి వారి ఆ భాష ఉంటుంది. ఇక్కడ హిందీ భాషనే నడుస్తుంది, ఈ భాషను అర్థం చేసుకోవడము సహజము మరియు ఈ స్కూల్ కూడా అద్భుతమైనది. ఇక్కడ పేపరు, పెన్సిల్, పేజీలు మొదలైనవాటి అవసరము ఉండదు. ఇక్కడ కేవలం ఒక్క మాటను స్మృతి చేయాలి అనగా తండ్రిని స్మృతి చేయాలి. గాడ్ ను లేదా ఈశ్వరుడిని లేదా పరమపిత పరమాత్మను ఎవరూ స్మృతి చేయకుండా ఉండడమనేది కష్టము, అందరూ వారిని స్మృతి చేస్తారు కానీ వారి పరిచయము లేదు. తండ్రియే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. శాస్త్రాలలో ఇంత ఎక్కువగా వ్రాసిన కల్పము యొక్క ఆయువు గురించి తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇది చాలా పెద్ద విషయము కూడా కాదు. అహల్యలు, వృద్ధ మాతలు ఏమి అర్థం చేసుకుంటారు. ఇది చాలా సహజము. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. బాబా అన్న పదము కొత్తదేమీ కాదు. శివుని మందిరానికి వెళ్ళినప్పుడు వీరు శివబాబా అని, వీరు నిరాకారుడని బుద్ధిలోకి వస్తుంది. మనుష్యమాత్రులందరూ బాబా అని అంటారు. ఆత్మలైన మనందరికీ తండ్రి ఒక్కరే. శరీరములో నివసించే జీవాత్మలందరూ తండ్రిని స్మృతి చేస్తారు. అన్ని ధర్మాల వారెవరైతే ఉన్నారో, అందరూ పరమపిత పరమాత్మను తప్పకుండా స్మృతి చేస్తారు. వారు పరంధామములో నివసించే తండ్రి. మనము కూడా అక్కడ నివసించేవారము. కావున ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మేము పావనముగా అవ్వాలి అని కోరుకుంటారు కూడా. ఓ పతితులను పావనముగా చేసేవారా రండి, అని పిలుస్తారు కూడా. కొత్త ప్రపంచము పావనముగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పాతదిగా అయ్యింది, దీనిని ఎవరూ కొత్తది అని అనరు. కొత్త భారత్ లో దేవీ-దేవతలు రాజ్యము చేసేవారని భారతవాసులకు తెలుసు. కొత్త భారత్ ఉండేది అన్నప్పుడు, మరి దాని కన్నా ముందు ఏముండేది? సంగమము. ఇంతకన్నా సింపుల్ గా చెప్పాలి అంటే, కొత్తదాని కంటే ముందు పాతది ఉండేది. సంగమమును మనుష్యులు అంత సహజముగా అర్థం చేసుకోలేరు. న్యూ వరల్డ్, ఓల్డ్ వరల్డ్, వీటి మధ్యన ఉన్నదానిని సంగమము అని అంటారు. ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి, మేము పతితముగా అయిపోయాము అని తండ్రి విషయములోనే పిలుస్తారు. కొత్త ప్రపంచములో ఎవరూ పిలవరు. ఈ భారత్ పావనముగా ఉండేది అని ఇప్పుడు మీకు అర్థమయ్యింది. ఓ పతిత-పావనా రండి అని చాలా సమయము నుండి పిలుస్తూ వచ్చారు. పతిత ప్రపంచము ఎప్పుడు సమాప్తమవుతుంది అనేది వారికి తెలియదు. కలియుగము (పతిత ప్రపంచము) ఇంకా 40 వేల సంవత్సరాలు కొనసాగుతుందని శాస్త్రాలలో వ్రాసి ఉన్నట్లుగా చెప్తారు. పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రకాశములో ఉన్నారు. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు ప్రకాశములోకి తీసుకువచ్చారు. ఈ సృష్టి చక్రము 5 వేల సంవత్సరాలలో పూర్తవుతుంది. ఇది నిన్నటి విషయమే. మీరు రాజ్యము చేసేవారు, ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, స్వర్గముండేది. పావన ప్రపంచములో ఉపద్రవాలు మొదలైనవేవీ జరగవు. రావణ రాజ్యములోనే ఉపద్రవాలు జరుగుతాయి. ఇక్కడ మీకు తండ్రి అర్థం చేయిస్తారు, మీరు సమ్ముఖముగా చెవుల ద్వారా వింటారు. ఎవరు వింటారు? ఆత్మ. తండ్రి మళ్ళీ వచ్చి మమ్మల్ని కలుసుకున్నారని ఆత్మకు చాలా సంతోషము కలుగుతుంది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఇందులో వ్రాయాల్సిన, చదవాల్సిన విషయమేమీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు, మీరు ఎందుకు వచ్చారు అని అడగడము జరుగుతుంది, అప్పుడు వారు ఇక్కడ ఉండే మహాత్మను కలుసుకునేందుకు వచ్చామని అంటారు. ఎందుకని? మీకు ఏమి కావాలి? ఏమైనా భిక్ష కావాలా చెప్పండి అని అడగండి. సన్యాసులకైతే రొట్టె కావాలి. సన్యాసులు ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు లేదా వారు దారిలో కలిసినప్పుడు, ధార్మిక వ్యక్తులు ఏమని భావిస్తారంటే - వీరు ఎంతైనా పవిత్రమైన వ్యక్తులు, వీరికి భోజనము పెట్టడము మంచిది అని. ఇప్పుడైతే పవిత్రత కూడా లేదు. ఇది పూర్తి తమోప్రధానమైన ప్రపంచము, ఇందులో చాలా మురికి ఉంది. మనుష్యులు ఎంతగా కలత చెందుతారు. ఇక్కడ కలత చెందే విషయమేమీ లేదు. ఏమీ వ్రాయాల్సిన పని కూడా లేదని తండ్రి అంటారు. ఈ పాయింట్లు మొదలైనవి కూడా ధారణ చేయడానికని వ్రాసుకుంటారు. ఉదాహరణకు డాక్టర్ల దగ్గర కూడా ఎన్ని మందులు ఉంటాయి, వారికి ఆ మందులన్నీ గుర్తుంటాయి. బ్యారిస్టర్ల బుద్ధిలో లా కు సంబంధించిన విషయాలు ఎన్ని గుర్తుంటాయి. మీరు ఏమి గుర్తు ఉంచుకోవాలి, ఒకే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి, అది కూడా చాలా సహజమైనది. ఒక్క శివబాబాను గుర్తు చేయండి అని మీరు చెప్తారు. శివబాబా ఎలా వస్తారని వారు అడుగుతారు. ఇది కూడా మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నారు అని అడిగితే, వారు నామ-రూపాలకు అతీతమైనవారు అని అంటారు లేదా వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఈ రెండింటికీ రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. నామ-రూపాలకు అతీతమైన వస్తువైతే ఏదీ లేదు. ఇంకొకవైపు కుక్క, పిల్లి అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నారని అనేస్తారు. రెండూ ఆపోజిట్ (వ్యతిరేక) విషయాలు అయినట్లు. కావున తండ్రి తమ పరిచయాన్ని ఇస్తూ అంటున్నారు - మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. సహజ రాజయోగము అని అంటూ ఉంటారు కూడా. బాబా అంటారు - యోగము అన్న పదాన్ని తొలగించండి, కేవలం స్మృతి చేయండి. ఉదాహరణకు చిన్న పిల్లలు తల్లిదండ్రులను చూసిన వెంటనే హత్తుకుంటారు. అంతేకానీ, వీరు నా తల్లిదండ్రులేనా అని ముందు ఏమైనా ఆలోచిస్తారా? లేదు, ఇందులో ఆలోచించాల్సిన విషయమే లేదు. మీరు కూడా కేవలం శివబాబాను స్మృతి చేయాలి. భక్తి మార్గములో కూడా మీరు శివునికి పుష్పాలను అర్పిస్తూ వచ్చారు. సోమనాథుని మందిరము ఎంత వైభవముగా నిర్మించబడింది, దానిని తర్వాత మహమ్మద్ గజని వచ్చి దోచుకున్నారు. సోమనాథ మందిరము భారత్ లో ప్రసిద్ధమైనది. అందరికన్నా ముందు శివుని పూజ జరగాలి. పిల్లలకు ఈ జ్ఞానమంతా ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. మీరు పూజలు మొదలైనవి చేస్తూ వచ్చారు కానీ అది జడ చిత్రమని, తప్పకుండా వారు చైతన్యములో ఎప్పుడో వచ్చి ఉంటారని, కావుననే ప్రతి సంవత్సరము శివజయంతిని కూడా జరుపుకుంటామని మీకు తెలియదు. శివ పరమాత్మ నిరాకారుడని కూడా అంటారు. నేను కూడా నిరాకారిని - అని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు, ఇది చాలా సహజము. వారు మన బాబా. వారు జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, పతిత-పావనుడు. వారికి చాలా మహిమ ఉంది. బ్రహ్మా-విష్ణు-శంకరులకు అంత మహిమ లేదు. ఒక్కరి మహిమనే పాడుతారు.

బాబా వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. లౌకిక తండ్రి పిల్లల ఆలన-పాలన చేస్తారు కానీ చదివించరు. చదువుకునేందుకు స్కూలుకు వెళ్తారు, ఆ తర్వాత వానప్రస్థములో గురువులను ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లోనైతే చిన్న-పెద్ద, అందరూ గురువులను ఆశ్రయించేలా చేస్తారు. ఇక్కడైతే పిల్లలైన మీకు శివబాబాను స్మృతి చేయండి అని చెప్పడము జరుగుతుంది, అందరికీ హక్కు ఉంది. అందరూ నా పిల్లలే. మీలో కూడా కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు. బాబా, ఎవరిని స్మృతి చేయాలి, బిందువును ఎలా స్మృతి చేయాలి అని చాలామంది అడుగుతారు. పెద్ద వస్తువును స్మృతి చేయడము జరుగుతుంది. అచ్ఛా, పరమాత్మ అని మీరు ఎవరినైతే స్మృతి చేస్తున్నారో, వారెవరు? వారు అఖండ జ్యోతి స్వరూపమని చెప్తారు. కానీ అలా కాదు. అఖండ జ్యోతిని స్మృతి చేయడము రాంగ్ అవుతుంది. స్మృతి యథార్థముగా ఉండాలి. ముందు యథార్థముగా తెలుసుకోవాలి. తండ్రియే వచ్చి వారి పరిచయాన్ని ఇస్తారు మరియు పిల్లలకు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల సమాచారాన్ని కూడా వినిపిస్తారు. వివరముగా కూడా వినిపిస్తారు మరియు క్లుప్తముగా కూడా వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, మీరు పావనముగా అవ్వాలంటే దానికి ఒకే ఉపాయము ఉంది, నన్ను స్మృతి చేయండి, నన్నే పతిత-పావనా అని అంటారు. ఆత్మను పావనముగా తయారుచేయాలి. నేను పతితముగా అయిపోయానని ఆత్మనే అంటుంది. ఒకప్పుడు నేను పావనముగా ఉన్నాను, ఇప్పుడు పతితముగా అయ్యాను. అందరూ తమోప్రధానముగా ఉన్నారు. ప్రతి వస్తువు ముందు సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత తమోప్రధానముగా అవుతుంది. నేను పతితముగా అయ్యాను, నన్ను పావనముగా చేయండి అని ఆత్మనే స్వయంగా అంటుంది. శాంతిధామములో పతితులు ఉండరు. ఇక్కడ పతితులు ఉన్నారు కావున దుఃఖితులుగా ఉన్నారు. పావనముగా ఉన్నప్పుడు సుఖముగా ఉండేవారు. కావున, నన్ను పావనముగా చేసినట్లయితే నేను దుఃఖము నుండి విముక్తి చెందుతానని ఆత్మనే అంటుంది. ఆత్మనే అన్నీ చేస్తుందని మీరు భావిస్తారు. ఆత్మనే జడ్జి, బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతుంది. నేను రాజును, నేను ఫలానాను అని ఆత్మనే అంటుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకోవాలి. దీనినే ఆత్మాభిమానిగా ఉండటము అని అంటారు. దేహము ఉన్నప్పటికీ ఆత్మాభిమానిగా ఉండటము. రావణ రాజ్యములో దేహాభిమానులుగా ఉంటారు. ఆత్మాభిమానులుగా తండ్రి ఇప్పుడే తయారుచేస్తారు. ఈ సమయములో ఆత్మ పతితముగా, దుఃఖమయముగా ఉంది కావున, ఓ బాబా రండి, అని పిలుస్తుంది. డ్రామా ప్లాన్ అనుసారముగా పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూ వచ్చామని కూడా మీకు తెలుసు. ఇలా చక్రము తిరుగుతూనే ఉంటుంది. మనము 84 జన్మలను ఎలా తీసుకున్నామనేది ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది. ఇప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. స్వదర్శన చక్రధారులుగా ఉండండి. లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ మనకు బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. అనంతమైన తండ్రి నుండి మనము అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయాలి, రొట్టె ముక్క తినాలి. అంతే.

మధురాతి మధురమైన, చాలా కాలం వేరైన తర్వాత కలిసిన పిల్లలకు పదే-పదే తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, పొట్ట కోసం కేవలం రొట్టె ముక్కను తినాలి. పొట్ట ఎక్కువగా ఏమీ తినదు. ఒక పావు పిండి అంత తింటుంది. పప్పు, రొట్టె అంతే, 10 రూపాయలలో కూడా మనిషి కడుపు నిండుతుంది, అలాగే 10 వేల రూపాయలతో కూడా కడుపు నింపుకుంటారు. అసలు పేదవారు ఏమి తింటారని? అయినా సరే వారు దృఢముగా ఉంటారు. మనుష్యులు రకరకాల పదార్థాలను తింటే ఇంకా ఎక్కువ అనారోగ్యం పాలు అవుతారు. ఒకే రకమైన భోజనాన్ని తీసుకున్నట్లయితే, అనారోగ్యం పాలు అవ్వరని డాక్టర్లు కూడా అంటారు. కావున తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు - రొట్టె ముక్క తినండి, ఏది దొరికితే అందులో సంతోషముగా ఉండండి. పప్పు-రొట్టె వంటి పదార్థము మరేదీ ఉండదు. ఎక్కువ లోభము కూడా ఉండకూడదు. సన్యాసులు ఏమి చేస్తారు? ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు. తత్వాన్ని పరమాత్మగా భావిస్తూ స్మృతి చేస్తారు, మేము బ్రహ్మములో లీనమైపోతామని భావిస్తారు. కానీ అలా జరగదు. ఆత్మ అయితే అమరమైనది. లీనమయ్యే విషయమే లేదు. ఇకపోతే, ఆత్మ పవిత్రముగా, అపవిత్రముగా అవుతుంది. మీకు ఎంత మంచి జ్ఞానము లభించింది. మీరే ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు, అప్పుడిక ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. ఇక తర్వాత మెట్లు దిగవలసి ఉంటుంది. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తము జ్ఞానము కూర్చుని ఉంది. మనము 84 జన్మలను ఎలా అనుభవిస్తాము. ఈ పాత్ర ఎప్పుడూ ఎవరిదీ ఆగిపోదు. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇది తిరుగుతూనే ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు, ఎలా, ఎక్కడ కూర్చుని ఈ డ్రామాను తయారుచేసారు అని అనలేము. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ విషయాల గురించి అసలు ఎవరూ అర్థం చేసుకోరు. మనము డ్రామా ప్లాన్ అనుసారముగా వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ డ్రామానుసారముగా రాజ్యము తీసుకుంటున్నాము. ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. డ్రామా సర్వశక్తివంతమైనదా లేదా ఈశ్వరుడు సర్వశక్తివంతుడా అని అడగడము జరుగుతుంది? అప్పుడు, ఈశ్వరుడు సర్వశక్తివంతుడు అని అంటారు. ఈశ్వరుడు అన్నీ చేయగలరని భావిస్తారు. తండ్రి అంటారు - నేను కూడా డ్రామా బంధనములో బంధించబడి ఉన్నాను. పతితులను పావనముగా చేయడానికి నేను రావలసి ఉంటుంది. మీరు సత్యయుగములో సుఖమయముగా అవుతారు. నేను కూడా పరంధామానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. మీరు నా శిరస్సు పైకి ఎక్కి కూర్చుంటారు. మీరు సింహముపై సవారీ చేస్తారు (బంగారు యుగములోకి వెళ్తారు).

క్షణ-క్షణము ఏదైతే నడుస్తుందో, అది డ్రామాలో నిశ్చితమని మీకు తెలుసు. పిల్లలైన మీకు ఎంత మంచి జ్ఞానముంది. ఇప్పుడు కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, అంతే. పేపరు, పెన్సిల్ మొదలైనవాటి అవసరమేమీ లేదు. బ్రహ్మాబాబా కూడా చదువుకుంటారు, వీరైతే ఏమీ ఉంచుకోరు. కేవలం తండ్రిని స్మృతి చేస్తే వారసత్వము లభిస్తుంది. ఇది ఎంత సహజము. స్మృతితో మీరు ఎవర్ హెల్దీ (సదా ఆరోగ్యవంతులు) గా అవుతారు. ఇది ధారణ చేసే విషయము. వ్రాయడము వలన ఏమి లాభముంటుంది, ఇదంతా వినాశనమైపోతుంది. కానీ కొందరు జ్ఞాపకము ఉంచుకునేందుకని వ్రాసుకుంటారు. ఇలా ఏ విషయాన్ని అయినా గుర్తుంచుకోవాలనుకుంటే కొంతమంది కొంగు ముడి వేసుకుంటారు కదా. అలా మీరు కూడా శివబాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలని ముడి వేసుకోండి. ఇది చాలా సులభము. యోగము అనగా స్మృతి. బాబా, స్మృతి నిలవడము లేదు, యోగములో ఎలా కూర్చోవాలి అని అడుగుతారు. అరే! లౌకిక తండ్రి స్మృతి లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ ఉంటుంది, మీరు కూడా కేవలం స్మృతి చేయండి చాలు, నావ తీరానికి చేరుతుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వదర్శన చక్రధారులుగా అయి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేసి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి, పావనముగా అవ్వాలి.

2. ఏ వస్తువు పట్ల లోభము ఉండకూడదు. ఏది లభిస్తే, దానితో సంతోషముగా ఉండాలి. రొట్టె ముక్క తినాలి, తండ్రి స్మృతిలో ఉండాలి.

వరదానము:-
సర్వుల హృదయాలలోని రహస్యాలను తెలుసుకుని సర్వులను రాజీ చేసే సదా విజయీ భవ

విజయులుగా అయ్యేందుకు ప్రతి ఒక్కరి హృదయములోని రహస్యాలను తెలుసుకోవాలి. ఎవరి నోటి నుండైనా వెలువడే శబ్దము ద్వారా వారి హృదయములోని రహస్యాలను తెలుసుకుంటే విజయులుగా అవ్వగలరు. కానీ హృదయములోని రహస్యాలను తెలుసుకునేందుకు అంతర్ముఖత కావాలి. ఎంతగా అంతర్ముఖులుగా ఉంటారో, అంతగా ప్రతి ఒక్కరి హృదయములోని రహస్యాలను తెలుసుకుని, వారిని రాజీ చేయగలరు. రాజీ చేయగలిగేవారే విజయులుగా అవుతారు.

స్లోగన్:-
వైరాగ్యమనేది ఎటువంటి యోగ్యమైన ధరణి అంటే, దానిలో ఏ ఫలము వేసినా, అది తప్పకుండా ఫలిస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఏకరసముగా ఉండేందుకు ఎవరు సంబంధములోకి వచ్చినా - స్టూడెంట్ అయినా, సహచరులైనా, అందరినీ సంతుష్చపరిచే ఉత్సుకత ఉండాలి. ఎవరిని చూసినా వారి నుండి ప్రతి సమయము గుణాలను తీసుకుంటూ ఉండండి. అందరిలోని గుణాల బలము లభించటము ద్వారా సదాకాలము కొరకు ఉత్సాహముగా, ఏకరసముగా ఉంటారు. గుణగ్రాహకులుగా అవ్వండి. అవగుణాలను చూస్తూ కూడా చూడకండి.