ఓంశాంతి
విద్యార్థులందరూ స్కూలులో చదువుకుంటున్నప్పుడు వారికి - మేము చదువుకుని ఎలా
తయారయ్యేది ఉంది అనేది తెలిసి ఉంటుంది. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకైతే - మేము
సత్యయుగ పారసపురికి యజమానులుగా అవుతాము అన్నది బుద్ధిలోకి రావాలి. ఈ దేహ సంబంధాలు
మొదలైనవాటన్నింటినీ విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం పారసపురికి యజమానులుగా,
పారసనాథులుగా అవ్వాలి, మొత్తం రోజంతా ఈ సంతోషము ఉండాలి. పారసపురి అని దేనిని అంటారు
అనేది మీకు తెలుసు. అక్కడ భవనాలు మొదలైనవన్నీ బంగారము-వెండితో నిర్నించినవి ఉంటాయి.
ఇక్కడైతే రాళ్లు, ఇటుకలుతో నిర్మించిన భవనాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు
రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. పారసనాథులుగా తయారుచేసే
తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడే రాతిబుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా
తయారుచేస్తారు కదా! మీరు ఇక్కడ కూర్చున్నారు, మన స్కూలు ఉన్నతోన్నతమైనది అని మీకు
తెలుసు. ఇంతకన్నా పెద్ద స్కూలు ఇంకేదీ ఉండదు. ఈ స్కూలు ద్వారా మీరు కోటాను రెట్ల,
పదమాల రెట్ల భాగ్యశాలులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు, కావున పిల్లలైన మీకు
ఎంతటి సంతోషము ఉండాలి. ఈ రాతిపురి నుండి పారసపురిలోకి వెళ్ళేందుకు ఇది పురుషోత్తమ
సంగమయుగము. నిన్న రాతిబుద్ధి కలవారిగా ఉండేవారు, ఈ రోజు పారసబుద్ధి కలవారిగా
అవుతున్నారు. ఈ విషయము సదా బుద్ధిలో ఉన్నా కూడా మన్మనాభవయే. స్కూలుకు టీచరు
చదివించేందుకు వస్తారు. ఇప్పుడు ఇక టీచరు రాబోతున్నారు అని విద్యార్థులకు మనసులో
ఉంటుంది. అలాగే పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకుంటారు - మా టీచరైతే స్వయం భగవంతుడు.
వారు మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు కావున తప్పకుండా సంగమములో వస్తారు.
ఇప్పుడు మీకు తెలుసు, మనుష్యులేమో వారిని పిలుస్తూ ఉంటారు కానీ వారు ఇక్కడకు
వచ్చేసారు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది, కావుననే వినాశన కాలములో విపరీత బుద్ధి
అని వ్రాయబడి ఉంది ఎందుకంటే వారంతా రాతిబుద్ధి కలవారు. మీది వినాశన కాలములో ప్రీతి
బుద్ధి. మీరు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. కావున మనుష్యులు త్వరగా అర్థం
చేసుకునే విధంగా అటువంటి యుక్తినేదైనా రచించాలి. ఇక్కడకు కూడా ఎంతోమందిని
తీసుకువస్తారు, అయినా కూడా వారు - శివబాబా బ్రహ్మా తనువు ద్వారా ఎలా చదివిస్తారు,
ఎలా వస్తారు అని అడుగుతారు. ఏమీ అర్థం చేసుకోరు. ఇంతమంది సెంటర్లకు వస్తున్నారంటే,
నిశ్చయబుద్ధి కలవారని కదా. అందరూ శివ భగవానువాచ అని అంటారు, శివుడే అందరికీ తండ్రి.
శ్రీకృష్ణుడిని అందరికీ తండ్రి అని అంటారా. ఇందులో తికమకపడే విషయమైతే లేదు. కానీ
భాగ్యము ఆలస్యంగా తెరుచుకునేది ఉందంటే మరి కుంటుతూ ఉంటారు. తక్కువగా చదువుకునేవారిని,
వీరు కుంటుతున్నారు అని అనడం జరుగుతుంది. సంశయబుద్ధి కలవారు వెనుక ఉండిపోతారు.
నిశ్చయబుద్ధి కలవారు, బాగా చదువుకునేవారు వేగముగా పరుగెత్తుకంటూ ముందుకు వెళ్తూ
ఉంటారు. ఎంత సింపుల్ గా అర్థం చేయించడం జరుగుతుంది. ఏ విధంగా పిల్లలు పరుగు తీసి
లక్ష్యము వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారో, అలా తండ్రి కూడా అంటారు, బుద్ధిని
త్వరగా శివబాబా వద్దకు పరుగు తీయిస్తే సతోప్రధానముగా అయిపోతారు. ఇక్కడ బాగానే అర్థం
చేసుకుంటారు, బాణము తగులుతుంది, అయినా మళ్ళీ బయటకు వెళ్ళగానే సమాప్తము. బాబా జ్ఞాన
ఇంజెక్షన్ వేస్తారు, మరి దాని నషా ఎక్కాలి కదా. కానీ అది ఎక్కనే ఎక్కదు. ఇక్కడ
జ్ఞానామృతము యొక్క పాత్ర నుండి తాగుతారు, దానితో ప్రభావము పడుతుంది. బయటకు వెళ్ళగానే
మర్చిపోతారు. జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు, సద్గతిదాత, ముక్తిప్రదాత ఆ తండ్రి
ఒక్కరేనని పిల్లలకు తెలుసు. వారే ప్రతి విషయము యొక్క వారసత్వాన్ని ఇస్తారు. వారంటారు,
పిల్లలూ, మీరు కూడా పూర్తి సాగరులుగా అవ్వండి. నాలో ఎంత జ్ఞానము ఉందో, అంత మీరు కూడా
ధారణ చేయండి.
శివబాబాకు దేహము యొక్క నషా లేదు. తండ్రి అంటారు, పిల్లలూ, నేనైతే సదా శాంతిగా
ఉంటాను. మీకు కూడా ఎప్పుడైతే దేహము ఉండేది కాదో, అప్పుడు నషా ఉండేది కాదు. ఇది నా
తనువు అని శివబాబా ఏమైనా అంటారా. ఈ తనువును లోన్ గా తీసుకున్నాను, లోన్ గా
తీసుకున్న వస్తువు నాది అవుతుందా. నేను కొద్ది సమయము కొరకు సేవార్థము వీరిలోకి
ప్రవేశించాను. ఇప్పుడు పిల్లలైన మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి, భగవంతుడిని
కలుసుకునేందుకు పరుగు తీయాలి. ఇన్ని యజ్ఞ-తపాదులు మొదలైనవి చేస్తూ ఉంటారు కానీ వారు
ఎలా లభిస్తారు అన్నది ఏమైనా అర్థం చేసుకుంటారా. భగవంతుడు ఏదో ఒక రూపములో వచ్చేస్తారు
అని భావిస్తారు. తండ్రి అర్థం చేయించడమైతే చాలా సహజముగా అర్థం చేయిస్తారు,
ప్రదర్శినీలో కూడా మీరు అర్థం చేయించండి. సత్య-త్రేతా యుగాల ఆయువు కూడా వ్రాయబడి
ఉంది. అందులో 2,500 సంవత్సరాల వరకు పూర్తిగా ఏక్యురేట్ గా ఉంది. సూర్యవంశీయుల
తర్వాత చంద్రవంశీయులు ఉంటారు, ఆ తర్వాత రావణ రాజ్యము ప్రారంభమయ్యింది మరియు భారత్
పతితముగా అవ్వడం మెదలయ్యింది అని చూపించండి. ద్వాపర-కలియుగాలలో రావణ రాజ్యము ఉంది,
తిథి-తారీఖు వ్రాయబడి ఉన్నాయి. మధ్యలో సంగమయుగాన్ని పెట్టండి. రథ సారథి కూడా
తప్పకుండా కావాలి కదా. ఈ రథములోకి ప్రవేశించి తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు,
తద్వారా వీరు లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. లక్ష్మీ-నారాయణుల వంశావళి ఎంత కాలం
నడుస్తుంది అనేది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. మిగిలిన వంశాలన్నీ హద్దుకు
సంబంధించినవి, ఇది అనంతమైనది. ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవాలి కదా.
ఇప్పుడు ఇది సంగమయుగము. దైవీ రాజ్య స్థాపన మళ్ళీ జరుగుతోంది. ఈ రాతిపురి, పాత
ప్రపంచము యొక్క వినాశనము జరగనున్నది. వినాశనము జరగకపోతే ఇక కొత్త ప్రపంచము ఎలా
తయారవుతుంది! కొత్త ఢిల్లీ అని ఇప్పుడు అంటారు. కొత్త ఢిల్లీ ఎప్పుడు ఉంటుంది అనేది
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కొత్త ప్రపంచములో కొత్త ఢిల్లీ ఉంటుంది. యమునా
తీరములో మహళ్ళు ఉంటాయి అని పాడుతారు కూడా. ఎప్పుడైతే ఈ లక్ష్మీ-నారాయణుల
రాజ్యముండేదో, అప్పుడు కొత్త ఢిల్లీ, పారసపురి అని అంటారు. కొత్త రాజ్యమైతే
సత్యయుగములో లక్ష్మీ-నారాయణులదే ఉంటుంది. మనుష్యులైతే డ్రామా ఏ విధంగా
ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ముఖ్యమైన పాత్రధారులు ఎవరెవరు
అన్నది తెలుసుకోవాలి కదా. పాత్రధారులైతే ఎందరో ఉన్నారు, అందుకే ముఖ్యమైన పాత్రధారుల
గురించి మీకు తెలుసు. మీరు కూడా ముఖ్యమైన పాత్రధారులుగా అవుతున్నారు. అందరికన్నా
ముఖ్యమైన పాత్రను మీరు అభినయిస్తున్నారు. మీరు ఆత్మిక సమాజ సేవకులు. మిగిలిన సమాజ
సేవకులందరూ దైహికమైనవారు. మీరు ఆత్మలకు అర్థం చేయిస్తారు, చదువుకునేది ఆత్మ.
మనుష్యులు దేహము చదువుకుంటుందని భావిస్తారు. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా చదువుకుంటుంది
అన్నది ఎవ్వరికీ తెలియదు. ఆత్మ అయిన నేను బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతాను అని
భావిస్తారు. ఇక్కడ బాబా మనల్ని చదివిస్తారు. సంస్కారాలు కూడా ఆత్మలో ఉంటాయి.
సంస్కారాలను తీసుకువెళ్తారు, మళ్ళీ వచ్చి కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు.
సత్యయుగములో ఏ విధంగా రాజధాని కొనసాగిందో, అదే విధంగానే ప్రారంభమవుతుంది. ఇందులో ఏమీ
అడగవలసిన అవసరం ఉండదు. ముఖ్యమైన విషయము ఏమిటంటే - దేహాభిమానములోకి ఎప్పుడూ రాకండి.
స్వయాన్ని ఆత్మగా భావించండి. ఎటువంటి వికర్మ చేయకండి, స్మృతిలో ఉండండి, లేదంటే ఒక్కో
వికర్మకు 100 రెట్ల భారం ఏర్పడుతుంది. ఎముకలన్నీ పూర్తిగా విరిగిపోతాయి. అందులో కూడా
ముఖ్యమైన వికారము కామము. కొంతమంది అంటారు - పిల్లలు విసిగిస్తున్నారు, మరి అప్పుడు
కొట్టవలసి వస్తుంది అని. ఇప్పుడిది అడగవలసిన అవసరమేమీ లేదు. దీనిని చిన్న సాధారణమైన
పాపము అని అంటారు. మీ శిరస్సు పైనైతే జన్మజన్మాంతరాల పాపాలు ఉన్నాయి, మొదట వాటినైతే
భస్మము చేసుకోండి. తండ్రి పావనముగా అయ్యేందుకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తారు.
మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా పావనముగా అవుతారు. పిల్లల కోసం భగవానువాచ - నేను
ఆత్మలైన మీతో మాట్లాడుతాను. ఇతర మనుష్యులెవ్వరూ ఈ విధంగా అర్థం చేసుకోలేరు. వారంతా
తమను తాము శరీరముగానే భావిస్తారు. తండ్రి అంటారు, నేను ఆత్మలకు అర్థం చేయిస్తాను.
ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా జరుగుతుంది అని అంటూ ఉంటారు కూడా, ఇందులో శబ్దము
మొదలైనవేవీ చేయవలసిన అవసరం లేదు. ఇది చదువు. దూరదూరాల నుండి బాబా వద్దకు వస్తారు.
నిశ్చయబుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో, వారికి మున్ముందు చాలా ఎక్కువగా ఆకర్షణ
కలుగుతుంది. ఇప్పుడు అంతటి ఆకర్షణ ఎవరికీ కలగడం లేదు ఎందుకంటే స్మృతి చేయడం లేదు.
యాత్ర నుండి తిరిగి వస్తున్నప్పుడు, ఇంటికి సమీపముగా వచ్చే కొద్దీ ఇల్లు
గుర్తుకువస్తుంది, పిల్లలు గుర్తుకువస్తారు, ఇంటికి చేరుకోగానే సంతోషముగా వచ్చి
కలుసుకుంటారు, సంతోషము పెరుగుతూ ఉంటుంది. మొట్టమొదట పత్ని గుర్తుకువస్తుంది, ఆ
తర్వాత పిల్లలు మొదలైనవారు గుర్తుకువస్తారు. అలాగే, మేము ఇంటికి వెళ్తున్నాము,
అక్కడ తండ్రి మరియు పిల్లలే ఉంటారు అని మీకు గుర్తుకువస్తుంది. డబుల్ సంతోషము
కలుగుతుంది. శాంతిధామమైన ఇంటికి వెళ్తారు, ఆ తర్వాత రాజధానిలోకి వస్తారు. కేవలం
స్మృతియే చేయాలి. తండ్రి అంటారు, మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని
మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. బాబా పిల్లలైన మిమ్మల్ని పుష్పాల వలె తయారుచేసి,
నయనాలపై కూర్చోబెట్టుకుని తమతోపాటు తీసుకువెళ్తారు. కొద్దిగా కూడా ఏ కష్టమూ లేదు. ఏ
విధంగా దోమల గుంపు వెళ్తుంది కదా. ఆత్మలైన మీరు కూడా అదే విధంగా తండ్రితో పాటు
వెళ్తారు. పావనముగా అయ్యేందుకు మీరు తండ్రిని స్మృతి చేస్తారు, ఇంటిని కాదు.
బాబా దృష్టి మొట్టమొదట పేద పిల్లల వైపుకు వెళ్తుంది. బాబా పేదల పెన్నిధి కదా.
మీరు కూడా గ్రామాలకు సేవ చేయడానికి వెళ్తారు. తండ్రి అంటారు, నేను కూడా మీ
గ్రామానికి వచ్చి పారసపురిగా తయారుచేస్తాను. ఇప్పుడైతే ఇది నరకము, పాత ప్రపంచము.
దీనిని తప్పకుండా సమాప్తము చేయవలసి ఉంటుంది. కొత్త ప్రపంచములో కొత్త ఢిల్లీ ఉంటుంది,
అది సత్యయుగములోనే ఉంటుంది. అక్కడ రాజ్యము కూడా మీదే ఉంటుంది. మేము మళ్ళీ మా
రాజధానిని స్థాపన చేసుకుంటాము అని మీకు నషా ఎక్కుతుంది, కల్పక్రితము చేసినట్లుగానే
చేసుకుంటాము. మేము ఇలా-ఇలా భవనాలను నిర్మిస్తాము అని ఇలా ఏమైనా అంటారా. అనరు. మీరు
అక్కడకు వెళ్తారు, అక్కడ మీరు ఆటోమెటిక్ గా వాటిని నిర్మించడం మొదలుపెడతారు,
ఎందుకంటే ఆత్మలో ఆ పాత్ర నిండి ఉంది. ఇక్కడ కేవలం చదువుకునే పాత్ర ఉంది. మేము ఇలా,
ఇలా మహళ్ళు నిర్మిస్తాము అని అక్కడ మీ బుద్ధిలోకి దానంతట అదే వస్తుంది. కల్పక్రితము
ఏ విధంగా తయారుచేసారో, అదే విధంగా వాటిని తయారుచేయడం మొదలుపెడతారు. ఆత్మలో కూడా
ముందు నండే రచింపబడి ఉంది. ఏ మహళ్ళలోనైతే మీరు కల్ప-కల్పము ఉంటారో, మీరు ఆ మహళ్ళనే
నిర్మిస్తారు. ఈ విషయాలను కొత్తవారెవరూ అర్థం చేసుకోలేరు. మనం వస్తాము, కొత్త-కొత్త
పాయింట్లను విని రిఫ్రెష్ అయి వెళ్తాము అని మీరు భావిస్తారు. కొత్త-కొత్త పాయింట్లు
వెలువడుతాయి, అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది.
బాబా అంటారు, పిల్లలూ, నేను ఈ ఎద్దు (రథము)పై సదా స్వారీ చేయడమంటే అందులో నాకు
సుఖము అనిపించదు. నేనైతే పిల్లలైన మిమ్మల్ని చదివించడానికి వస్తాను. అంతేకానీ,
ఎద్దుపై కూర్చుని స్వారీ చేస్తూనే ఉంటానని కాదు. రాత్రింబవళ్ళు ఏమైనా ఎద్దుపై స్వారీ
జరుగుతుందా? వారైతే క్షణములో రావడం-వెళ్ళడం జరుగుతుంది. నిత్యం కూర్చుని ఉండిపోయే
నియమమే లేదు. చదివించడం కోసం బాబా ఎంత దూరం నుండి వస్తారు, వారి ఇల్లు అయితే అది కదా.
మొత్తం రోజంతా ఏమైనా శరీరములో కూర్చుంటారా, అందులో వారికి సుఖమే అనిపించదు. పంజరములో
చిలుక చిక్కుకున్నట్లుగా అనిపిస్తుంది. మీకు అర్థం చేయించేందుకని నేను దీనిని లోన్
గా తీసుకుంటాను. మీరు అంటారు, మమ్మల్ని చదివించడానికి జ్ఞాన సాగరుడైన బాబా వస్తారు.
సంతోషములో రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఆ సంతోషము మళ్ళీ తగ్గకూడదు. ఈ యజమాని (బ్రహ్మాబాబా)
అయితే ఈ దేహములో ఎప్పుడూ కూర్చునే ఉంటారు. మరి ఒకే ఎద్దుపై ఇద్దరి స్వారీ సదా
జరుగుతుందా? శివబాబా తన ధామములో ఉంటారు. వారు ఇక్కడకు వస్తారు, రావడానికి సమయము
పట్టదు. రాకెట్లు చూడండి, ఎంత వేగవంతముగా ఉంటాయి. శబ్దము కన్నా కూడా వేగవంతమైనవి.
ఆత్మ కూడా చాలా చిన్న రాకెట్. ఆత్మ ఎలా పరుగెడుతుంది, ఇక్కడి నుండి వెంటనే లండన్
వెళ్ళిపోతుంది. ఒక్క క్షణములో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు. బాబా స్వయం కూడా రాకెట్.
వారంటారు, నేను మిమ్మల్ని చదివించడానికి వస్తాను, మళ్ళీ నా ఇంటికి వెళ్తాను. ఈ
సమయములో చాలా బిజీగా ఉంటాను. నేను దివ్య దృష్టి దాతను, కావున భక్తులను
సంతుష్టపరచవలసి ఉంటుంది. మిమ్మల్ని చదివిస్తాను. సాక్షాత్కారము లభించాలని భక్తులు
కోరుకుంటారు లేదా ఇంకేదైనా అడుగుతూ ఉంటారు. అందరికన్నా ఎక్కువగా జగదంబను యాచిస్తారు.
మీరు జగదంబ కదా. మీరు విశ్వ రాజ్యాధికారమనే భిక్షము ఇస్తారు. పేదవారికి భిక్ష
లభిస్తుంది కదా. మనం కూడా పేదవారమే, కావున శివబాబా స్వర్గ రాజ్యాధికారాన్ని
భిక్షముగా ఇస్తారు. భిక్షమంటే ఇంకేదో కాదు, కేవలం ఒకటే చెప్తారు - తండ్రిని స్మృతి
చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, శాంతిధామానికి వెళ్ళిపోతారు. నన్ను స్మృతి
చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీ ఆయుష్షు కూడా పెరిగిపోతుంది.
సత్యయుగములో మృత్యువు యొక్క పేరు ఉండదు. అది అమరలోకము, అక్కడ మృత్యువు యొక్క పేరు
ఉండదు. కేవలం ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు, దీనిని మృత్యువు అని అంటారా!
అది అమరపురి. నేను ఇప్పుడు చిన్న బాలుడిగా జన్నించబోతున్నాను అని
సాక్షాత్కారమవుతుంది. అది సంతోషకరమైన విషయము. ఇప్పుడు వెళ్ళి చిన్న బాలుడిగా అవ్వాలి
అని బాబాకు మనసు కలుగుతుంది. నోట్లో బంగారు చెంచా ఉంటుందని తెలుసు. తండ్రికి నేను
చాలాకాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన ఒకే ఒక్క ప్రియమైన బిడ్డను. తండ్రి దత్తత
తీసుకున్నారు. నేను చాలాకాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన ప్రియమైన బిడ్డను
కావున బాబా ఎంతగా ప్రేమ చేస్తారు. ఒక్కసారిగా ప్రవేశిస్తారు. ఇది కూడా ఆట కదా. ఆటలో
ఎల్లప్పుడూ సంతోషము ఉంటుంది. ఇది తప్పకుండా చాలా-చాలా భాగ్యశాలి రథమని కూడా తెలుసు.
జ్ఞాన సాగరుడు, వీరిలోకి ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తారు అని ఈ రథము కోసమే
గాయనము ఉంది. పిల్లలైన మీకైతే ఒక్క సంతోషమే ఎంతగానో ఉంది, అదేమిటంటే - మమ్మల్ని
భగవంతుడు వచ్చి చదివిస్తారు. భగవంతుడు స్వర్గము యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు.
మనం వారికి పిల్లలము అన్నప్పుడు మరి మనం నరకములో ఎందుకు ఉన్నాము! ఇది ఎవరి
బుద్ధిలోకి కూడా రాదు. మీరైతే భాగ్యశాలులు, మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు
చదువుకుంటారు. ఇటువంటి చదువుపై ఎంత అటెన్షన్ పెట్టాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.