19-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ స్మృతి చాలా అద్భుతమైనది ఎందుకంటే మీరు ఒకేసారి తండ్రి, టీచర్ మరియు సద్గురువు, ముగ్గురినీ స్మృతి చేస్తారు’’

ప్రశ్న:-
ఏ పిల్లలనైనా మాయ అహంకారులుగా చేసినప్పుడు వారు ఏ విషయములో నిర్లక్ష్యం చేస్తారు?

జవాబు:-
అహంకారులైన పిల్లలు దేహాభిమానములోకి వచ్చి మురళిని నిర్లక్ష్యం చేస్తారు. ఎలుకకు ఒక పసుపు కొమ్ము దొరకగానే తానొక కిరాణా వ్యాపారి అయిపోయాను అని అనుకుందట, ఇలా ఒక సామెత ఉంది. అసలు మురళి చదవనే చదవని వారు చాలా మంది ఉన్నారు, మాకైతే డైరెక్టు శివబాబాతో కనెక్షన్ ఉంది అని అనేస్తారు. బాబా అంటారు, పిల్లలూ, మురళిలోనైతే కొత్త-కొత్త విషయాలు వస్తూ ఉంటాయి, అందుకే మురళిని ఎప్పుడూ మిస్ చేయకండి, దీనిపై చాలా అటెన్షన్ ఉండాలి.

ఓంశాంతి
మధురాతి మధురమైన సికీలధే పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు - ఇక్కడ మీరు కూర్చున్నారు, ఎవరి స్మృతిలో కూర్చున్నారు? (తండ్రి, టీచర్, సద్గురువు స్మృతిలో). అందరూ ఈ ముగ్గురి స్మృతిలో కూర్చున్నారా? ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి - ఇది కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడే స్మృతిలో ఉంటోందా లేక నడుస్తూ, తిరుగుతూ కూడా స్మృతిలో ఉంటోందా? ఎందుకంటే ఇది అద్భుతమైన విషయము. ఇంకే ఆత్మనూ ఎప్పుడూ ఇలా అనడం జరగదు. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఉన్నా కానీ వారి ఆత్మనూ ఎప్పుడూ - వీరు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని అనరు. మొత్తం ప్రపంచమంతటిలో జీవాత్మలెవరైతే ఉన్నారో, వారిలోని ఏ ఆత్మను కూడా ఇలా అనరు. పిల్లలైన మీరే ఇలా స్మృతి చేస్తారు. మీకు లోలోపల అనిపిస్తుంది - ఈ బాబా మా తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా, అది కూడా సుప్రీమ్. ముగ్గురినీ స్మృతి చేస్తారా లేక ఒక్కరినేనా? వాస్తవానికి వారు ఒక్కరే కానీ ఈ మూడు గుణాలతోనూ స్మృతి చేస్తారు. శివబాబా మన తండ్రి కూడా, టీచర్ మరియు సద్గురువు కూడా. వీరిని ఎక్స్ ట్రా ఆర్డినరీ (అసాధారణమైనవారు) అని అంటారు. మీరు కూర్చున్నప్పుడు లేక నడుస్తూ, తిరుగుతూ ఉన్నప్పుడు ఇది గుర్తుండాలి. బాబా అడుగుతారు - వీరు మా తండ్రి, టీచర్, సద్గురువు కూడా అని స్మృతి చేస్తున్నారా? ఇలా ఏ దేహధారులూ ఉండరు. దేహధారులలో నెంబర్ వన్ శ్రీకృష్ణుడు, అతడిని తండ్రి, టీచర్, సద్గురువు అని అనలేరు, ఇది చాలా అద్భుతమైన విషయము. కావున నిజం చెప్పాలి - మూడు రూపాలలోనూ స్మృతి చేస్తున్నారా? భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు కేవలం శివబాబానే స్మృతి చేస్తారా లేక ముగ్గురూ బుద్ధిలోకి వస్తారా? ఇంకే ఆత్మనూ ఇలా అనలేరు. ఇది అద్భుతమైన విషయము. తండ్రి మహిమ విచిత్రమైనది. కావున తండ్రిని స్మృతి కూడా అదే విధంగా చేయాలి, తద్వారా ఎవరైతే ఇలా అద్భుతముగా ఉన్నారో బుద్ధి పూర్తిగా వారి వైపుకు వెళ్ళిపోతుంది. తండ్రే కూర్చుని తమ పరిచయాన్ని ఇస్తారు, అలాగే మొత్తం చక్రమంతటి జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఈ యుగాలు ఇలా ఉన్నాయి, ఇన్ని-ఇన్ని సంవత్సరాలు ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి అని చెప్తారు. ఈ జ్ఞానాన్ని కూడా రచయిత అయిన ఆ తండ్రే ఇస్తారు. కావున వారిని స్మృతి చేయడములో చాలా సహాయము లభిస్తుంది. తండ్రి, టీచర్, గురువు వారొక్కరే. ఇంత ఉన్నతమైన ఆత్మ ఇంకెవ్వరూ ఉండలేరు. కానీ మాయ ఇటువంటి తండ్రి స్మృతిని కూడా మరపింపజేస్తుంది, దానితో టీచర్ మరియు గురువును కూడా మర్చిపోతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ-తమ హృదయానికి హత్తుకోవాలి. బాబా మనల్ని ఈ విధంగా విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వము తప్పకుండా అనంతమైనదే. దానితోపాటు ఈ మహిమ కూడా బుద్ధిలోకి రావాలి, నడుస్తూ-తిరుగుతూ ముగ్గురూ స్మృతిలోకి రావాలి. ఈ ఒక్క ఆత్మ మూడు సేవలను కలిపి చేస్తుంది, అందుకే వారిని ‘సుప్రీమ్’ అని అంటారు.

ఇప్పుడు కాన్ఫరెన్స్ లు మొదలైనవాటిని జరుపుతారు, విశ్వములో శాంతి ఎలా ఏర్పడగలదు? అని ప్రశ్నిస్తారు. అదైతే ఇప్పుడు ఏర్పడుతోంది, వచ్చి అర్థం చేసుకోండి. ఎవరు చేస్తున్నారు? మీరు తండ్రి కర్తవ్యాన్ని నిరూపించి తెలియజేయాలి. తండ్రి కర్తవ్యానికి మరియు శ్రీకృష్ణుని కర్తవ్యానికి చాలా తేడా ఉంది. ఇతరులందరి విషయములో శరీరము యొక్క పేర్లే తీసుకోవడం జరుగుతుంది కానీ వారి విషయములో వారి ఆత్మ పేరు మహిమ చేయబడుతుంది. ఆ ఆత్మ తండ్రి కూడా, టీచర్ మరియు గురువు కూడా. ఆత్మలో జ్ఞానము ఉంది కానీ అది ఎలా ఇవ్వాలి? శరీరము ద్వారానే ఇస్తారు కదా. అలా ఇస్తారు కావుననే మహిమ గానం చేయబడుతుంది. ఇప్పుడు శివ జయంతినాడు పిల్లలు కాన్ఫరెన్స్ లు జరుపుతారు, అన్ని ధర్మాల నేతలనూ పిలుస్తారు. అక్కడ మీరు ఇలా అర్థం చేయించాలి - ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే కాదు, ఒకవేళ అందరిలోనూ ఈశ్వరుడు ఉన్నట్లయితే మరి ప్రతి ఆత్మా భగవంతుడైన తండ్రి, టీచర్ మరియు గురువా! అలాగే, ప్రతి ఆత్మలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉందా చెప్పండి? అదైతే ఎవ్వరూ వినిపించలేరు.

ఉన్నతోన్నతమైన తండ్రికి ఎంత మహిమ ఉంది అని పిల్లలైన మీకు లోలోపల అనుభవమవ్వాలి. వారైతే మొత్తం వృక్షమంతటినీ పావనముగా తయారుచేస్తారు. ప్రకృతి కూడా పావనముగా అయిపోతుంది. కాన్ఫరెన్స్ లో మొట్టమొదట మీరు - గీతా భగవంతుడు ఎవరు? అని ప్రశ్నిస్తారు, అలాగే సత్యయుగ దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసేవారు ఎవరు? అని ప్రశ్నిస్తారు. ఒకవేళ శ్రీకృష్ణుడు అని అన్నట్లయితే మరి తండ్రిని మాయం చేసేసినట్లు లేదా అతను నామ-రూపాలకు అతీతుడు అని అనేస్తారు అనగా అసలు వారు లేనే లేరని అర్థము. మరి తండ్రి లేకపోతే అనాథలుగా ఉన్నట్లే కదా. అనంతమైన తండ్రి గురించే తెలియదు. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఎంతగా విసిగిస్తూ ఉంటారు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. కావున ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో నడవాలి. వ్యత్యాసాన్ని చూపించాలి - ఈ లక్ష్మీ-నారాయణులు భగవతీ, భగవానులు కదా, వీరిది కూడా వంశావళి ఉంది కదా, కావున తప్పకుండా అందరూ ఇలా దేవి-దేవతల్లా ఉండాలి. మీరు అన్ని ధర్మాల వారినీ పిలుస్తారు. ఎవరైతే బాగా చదువుకున్నవారో, తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరో వారినే పిలవాలి. మీరు ఇలా వ్రాయవచ్చు - ఎవరైతే వచ్చి రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇవ్వగలరో వారి కొరకు మేము రాను పోను ఏర్పాట్లు మరియు ఉండేందుకు ఏర్పాట్లు అన్నీ చేస్తాము, అది కూడా ఒకవేళ రచయిత మరియు రచనల పరిచయాన్ని ఇస్తే. ఎవరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరనైతే మీకు తెలుసు. ఎవరైనా విదేశాల నుండి వచ్చినా ఫర్వాలేదు, రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల పరిచయము ఇచ్చినట్లయితే మేము ఖర్చులు ఇచ్చేస్తాము. ఈ విధంగా ఇంకెవ్వరూ ఎడ్వర్టైజ్ చేయలేరు. మీరు చాలా ధైర్యవంతులు కదా. మీరు మహావీరులు, మహావీరినీలు. వీరు (లక్ష్మీ-నారాయణులు) విశ్వ రాజ్యాధికారాన్ని ఎలా తీసుకున్నారు, వారు ఏ సాహసాన్ని చూపించారు అనేది మీకు తెలుసు. బుద్ధిలోకి ఈ విషయాలన్నీ రావాలి. మీరు ఎంత ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నారు. మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారుచేస్తున్నారు. కావున తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వాన్ని కూడా స్మృతి చేయాలి. కేవలం శివబాబా గుర్తున్నారు అని భావించడం కాదు. వారి మహిమను కూడా తెలియజేయాలి. ఈ మహిమ అంతా ఆ నిరాకారునిదే. కానీ నిరాకారుడు తమ పరిచయాన్ని ఎలా ఇవ్వగలరు? తప్పకుండా రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వడానికి నోరు కావాలి కదా. నోటికి ఎంతటి మహిమ ఉంది. మనుష్యులు గోముఖము వద్దకు వెళ్తారు, ఎంతగా కష్టపడతారు. ఎలాంటి, ఎలాంటి విషయాలను తయారుచేసారో చూడండి. బాణం వేయగానే గంగ వెలువడింది అని అంటారు. గంగను పతిత పావనిగా భావిస్తారు. ఇప్పుడు నీరు పతితము నుండి పావనముగా ఎలా చేయగలదు? పతిత-పావనుడైతే తండ్రి మాత్రమే. తండ్రి పిల్లలైన మీకు ఎంతగా నేర్పిస్తూ ఉంటారు. ఇలా, ఇలా చేయండి అని తండ్రి చెప్తారు. రచయిత అయిన తండ్రి మరియు రచనల పరిచయాన్ని ఎవరు వచ్చి ఇస్తారు? సాధు సన్యాసులు మొదలైనవారికి ఇది కూడా తెలుసు - ఋషులు, మునులు మొదలైనవారంతా నేతి, నేతి అని అనేవారు, అనగా మాకు తెలియదు అని అనేవారు అనగా వారు నాస్తికులే కదా. మరి ఇప్పుడు ఎవరైనా ఆస్తికులు వెలువడతారేమో చూడండి. ఇప్పుడు పిల్లలైన మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు. మీకు అనంతమైన తండ్రి గురించి తెలుసు, వారే మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేస్తారు. ఓ గాడ్ ఫాదర్, మమ్మల్ని విముక్తులుగా చేయండి అని పిలుస్తారు కూడా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ సమయములో రావణుని రాజ్యము మొత్తం విశ్వమంతటిపైనా ఉంది. అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు, తర్వాత శ్రేష్ఠాచారులుగా కూడా అవుతారు కదా. మొట్టమొదట పవిత్ర ప్రపంచము ఉండేది అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి అపవిత్ర ప్రపంచాన్ని అయితే తయారుచేయరు. తండ్రి వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు, దానిని శివాలయము అని అంటారు. శివబాబా శివాలయాన్ని తయారుచేస్తారు కదా. వారు ఎలా తయారుచేస్తారు అన్నది కూడా మీకు తెలుసు. మహాప్రళయము, జలమయము మొదలైనవైతే జరగవు. శాస్త్రాలలో ఏమేమో వ్రాసేసారు. చివరికి పంచ పాండవులు మిగిలారని, వారు హిమాలయ పర్వతాలపై కరిగిపోయారని వ్రాసారు, ఆ తర్వాత రిజల్టు ఏమైంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆ తండ్రి తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అన్నది మీకే తెలుసు. అక్కడైతే ఈ మందిరాలు ఉండవు. ఈ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు, ఆ స్మృతిచిహ్న మందిరాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. క్షణ-క్షణమూ కొత్త విషయము జరుగుతూ ఉంటుంది, చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు డైరెక్షన్లు అయితే చాలా మంచివి ఇస్తారు. మేమైతే అంతా తెలిసేసుకున్నాము అని భావించే దేహాభిమానులైన పిల్లలు చాలామంది ఉన్నారు. వారు మురళిని కూడా చదవరు, దాని పట్ల విలువే లేదు. బాబా గట్టిగా అటెన్షన్ ఇప్పిస్తారు, కొని సమయాల్లో మురళి చాలా బాగా నడుస్తుంది, మిస్ చేయకూడదు. 10-15 రోజుల మురళిలేవైతే మిస్ అవుతాయో వాటిని కూర్చుని చదువుకోవాలి. తండ్రి ఇది కూడా చెప్తున్నారు - మీరు ఇలాంటి ఛాలెంజ్ ఇవ్వండి - ఈ రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఎవరైనా వచ్చి ఇస్తే మేము వారికి ఖర్చులు మొదలైనవన్నీ ఇస్తాము. ఎవరికైతే స్వయం తెలుసో వారే ఇటువంటి ఛాలెంజ్ చేయగలరు కదా. టీచరుకు స్వయం తెలిస్తేనే అడుగుతారు కదా. తెలియకపోతే ఎలా అడగగలరు.

కొందరు పిల్లలు మురళిని కూడా నిర్లక్ష్యం చేస్తారు. మాకైతే శివబాబాతోనే కనెక్షన్ ఉంది అని అంటారు. కానీ శివబాబా ఏదైతే వినిపిస్తారో అది కూడా వినాలి కదా లేక కేవలం వారిని స్మృతి చేస్తూ ఉండాలా? తండ్రి ఎటువంటి మంచి-మంచి, మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తారు. కానీ మాయ పూర్తిగా అహంకారులుగా చేసేస్తుంది. ఎలుకకు ఒక పసుపు కొమ్ము దొరకగానే తానొక కిరాణా వ్యాపారి అయిపోయాను అని అనుకుందట, ఇలా ఒక సామెత ఉంది కదా. మురళిని అసలు చదవనే చదవనివారు చాలామంది ఉన్నారు. మురళిలో అయితే కొత్త, కొత్త విషయాలు వస్తూ ఉంటాయి కదా. కావున ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవలసినవి. తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు ఇది కూడా గుర్తు చేసుకోవాలి - వారు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. లేకపోతే ఎలా చదువుతారు. తండ్రి అయితే పిల్లలకు అంతా అర్థం చేయించారు. పిల్లలే తండ్రిని ప్రత్యక్షము చేస్తారు. సన్ షోస్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు). పిల్లలను మళ్ళీ తండ్రి ప్రత్యక్షము చేస్తారు. ఆత్మను ప్రత్యక్షము చేస్తారు. పిల్లల పని తండ్రిని ప్రత్యక్షము చేయడము. తండ్రి కూడా పిల్లలను వదలరు. ఈ రోజు ఫలానా చోటుకు వెళ్ళండి, ఈ రోజు ఇక్కడకు వెళ్ళండి అని చెప్తారు. వీరికి ఆర్డర్ ఇచ్చేవారు ఎవ్వరూ ఉండరు. ఈ ఆహ్వానాలు మొదలైనవన్నీ వార్తాపత్రికల్లో వస్తాయి. ఈ సమయములో మొత్తం ప్రపంచమంతా నాస్తికులుగా ఉన్నారు. తండ్రే వచ్చి ఆస్తికులుగా తయారుచేస్తారు. ఈ సమయములో మొత్తం ప్రపంచమంతా పైసకు కొరగానిదిగా ఉంది. అమెరికా వద్ద ఎంత ధన-సంపదలు ఉన్నా సరే, అది పైసకు కొరగానిదే. అదంతా అంతమైపోనున్నది కదా. మొత్తం ప్రపంచమంతటిలో కల్లా మీరు ఎంతో విలువైనవారిగా అవుతున్నారు. అక్కడ నిరుపేదలు ఎవ్వరూ ఉండరు.

పిల్లలైన మీరు సదా జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితముగా ఉండాలి. అతీంద్రియ సుఖము గురించి తెలుసుకోవాలనుకుంటే గోప-గోపికలను అడగండి అని దీని గురించే గాయనము ఉంది. ఇవి సంగమయుగ విషయాలే. సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలియదు. విహంగ మార్గపు సేవను చేయడం ద్వారా బహుశా మహిమ వెలువడవచ్చు. అహో ప్రభూ మీ లీల అన్న గాయనము కూడా ఉంది. భగవంతుడు తండ్రి, టీచర్, సద్గురువు కూడా అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అయితే పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. పిల్లలకు ఈ నషా స్థిరముగా ఉండాలి. అంతిమము వరకూ నషా ఉండాలి. ఇప్పుడైతే నషా వెంటనే సోడా వాటర్ లా అయిపోతూ ఉంటుంది. సోడా కూడా ఇలాగే ఉంటుంది కదా. దానిని కాసేపు అలా వదిలేస్తే ఉప్పునీరులా అయిపోతుంది. మీరు అలా అవ్వకూడదు. ఎవరికైనా సరే ఎలా అర్థం చేయించాలంటే, వారు కూడా ఆశ్చర్యపోవాలి. బాగుంది, బాగుంది అని అంటారు కూడా, కానీ వారు సమయం కేటాయించి అర్థం చేసుకోవాలి, జీవితాన్ని తయారుచేసుకోవాలి, అది చాలా కష్టము. బాబా ఏమీ వ్యాపారాలు మొదలైనవి చేయడానికి వద్దు అని చెప్పరు. పవిత్రముగా అవ్వండి మరియు ఏదైతే చదివిస్తానో దానిని స్మృతి చేయండి. వీరు టీచర్ కదా. మరియు ఇది అసాధారణమైన చదువు. దీనిని మనుష్యులెవ్వరూ చదివించలేరు. తండ్రే భాగ్యశాలీ రథముపై వచ్చి చదివిస్తారు. తండ్రి అర్థం చేయించారు - ఇది మీ ఆసనము, దీనిపై అకాలమూర్తి అయిన ఆత్మ వచ్చి కూర్చుంటుంది. ఆత్మకు ఈ పాత్ర అంతా లభించి ఉంది. ఇది యథార్థమైన విషయమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మిగిలినవన్నీ కృత్రిమ విషయాలు. ఈ విషయాలను బాగా ధారణ చేసి కొంగు ముడి వేసుకోండి, ఆ ముడికి చేయి తగలడంతో గుర్తుకువస్తుంది కానీ ముడి ఎందుకు వేసుకున్నాము అన్నది కూడా కొందరు మర్చిపోతారు. మీరైతే ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి. తండ్రి స్మృతితోపాటు జ్ఞానము కూడా కావాలి. ముక్తి కూడా ఉంది, అలాగే జీవన్ముక్తి కూడా ఉంది. చాలా మధురాతి మధురమైన పిల్లలుగా అవ్వండి. కల్ప-కల్పమూ ఈ పిల్లలు చదువుతూ ఉంటారు అని బాబా లోలోపల భావిస్తారు. నంబరువారు పురుషార్థానుసారముగానే వారసత్వాన్ని తీసుకుంటారు, అయినా కానీ టీచర్ అయితే చదివించే పురుషార్థము చేయిస్తారు కదా. మీరు ఘడియ, ఘడియ మర్చిపోతారు, అందుకే స్మృతి కలిగించడం జరుగుతుంది. శివబాబాను స్మృతి చేయండి, వారు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. చిన్న పిల్లలు ఇలా స్మృతి చేయరు. శ్రీకృష్ణుడిని తండ్రి, టీచర్, సద్గురువు అని అనరు కదా. శ్రీకృష్ణుడు సత్యయుగ యువరాజు, అతను గురువు ఎలా అవుతారు. గురువు దుర్గతిలోనే అవసరము. తండ్రి వచ్చి అందరికీ సద్గతిని కలిగిస్తారు అని గాయనము కూడా ఉంది. శ్రీకృష్ణుడినైతే నల్లని బొగ్గులా చేసేస్తారు. తండ్రి అంటారు, ఈ సమయములో అందరూ కామ చితిపైకి ఎక్కి నల్ల బొగ్గులా అయిపోయారు, అందుకే నల్లనివారిగా పిలవబడతారు. ఇవి అర్థం చేసుకోవలసిన ఎంతటి గుహ్యమైన విషయాలు. గీతను అయితే అందరూ చదువుతారు. అన్ని శాస్త్రాలను విశ్వసించేవారు భారతవాసులే. అందరి చిత్రాలను పెట్టుకుంటూ ఉంటారు. మరి దానినేమంటారు? అది వ్యభిచారీ భక్తియే కదా. అవ్యభిచారీ భక్తి ఒక్క శివుని భక్తియే. జ్ఞానము కూడా ఒక్క శివబాబా నుండే లభిస్తుంది. ఈ జ్ఞానమే వేరు, దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. వినాశీ నషాను వదిలి ఈ అలౌకిక నషా ఉండాలి - మేము ఇప్పుడు పైసకు కొరగానివారి నుండి ఎంతో విలువైనవారిగా అవుతున్నాము, స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తారు, మా చదువు అసాధారణమైనది.

2. ఆస్తికులుగా అయి తండ్రిని ప్రత్యక్షము చేసే సేవను చేయాలి. ఎప్పుడూ అహంకారులుగా అయి మురళిని మిస్ చేయకూడదు.

వరదానము:-
పవిత్రత యొక్క ఫౌండేషన్ ద్వారా సదా శ్రేష్ఠ కర్మలను చేసే పూజ్య ఆత్మ భవ

పవిత్రత పూజ్యులుగా చేస్తుంది. ఎవరైతే సదా శ్రేష్ఠ కర్మలు చేస్తారో వారే పూజ్యులుగా అవుతారు. కానీ పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు. మనసా సంకల్పములో కూడా ఎవరి పట్ల నెగెటివ్ సంకల్పము ఉత్పన్నమవ్వకూడదు, మాటలు కూడా అయథార్థముగా ఉండకూడదు, సంబంధ, సంపర్కములో కూడా తేడా ఉండకూడదు, అందరితో ఒకే విధమైన మంచి సంబంధము ఉండాలి. మనసా, వాచా, కర్మణా ఎందులోనూ పవిత్రత ఖండితమవ్వకూడదు, అప్పుడే పూజ్య ఆత్మ అని అంటారు. నేను పరమ పూజ్య ఆత్మను - ఈ స్మృతితో పవిత్రత యొక్క ఫౌండేషన్ ను దృఢముగా చేయండి.

స్లోగన్:-
సదా - ‘‘వాహ్ నేను’’ అన్న ఈ అలౌకిక నషాలోనే ఉండండి, అప్పుడు మనసుతో మరియు తనువుతో సహజముగా సంతోషపు డ్యాన్స్ చేస్తూ ఉంటారు.