19-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అందుకే దేహీ-అభిమానులుగా అవ్వండి, ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతమతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయములో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అటువంటి జన్మ లభిస్తుంది)’’

ప్రశ్న:-
అద్భుతమైన తండ్రి మీకు ఏ ఒక్క అద్భుతమైన రహస్యాన్ని వినిపించారు?

జవాబు:-
తండ్రి అంటారు - పిల్లలూ, ఈ అనాది అవినాశీ డ్రామా తయారై ఉంది, ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిశ్చితమై ఉంది. ఏం జరిగినా సరే అది కొత్తేమీ కాదు. తండ్రి అంటారు, పిల్లలూ, ఇందులో నా గొప్పతనము కూడా ఏమీ లేదు, నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. తండ్రి ఈ అద్భుతమైన రహస్యాన్ని వినిపిస్తూ తన పాత్రకు కూడా అంతటి మహత్వాన్ని ఇవ్వటము లేదు.

పాట:-
చివరికి నేడు ఆ రోజు వచ్చింది...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను పాడుతున్నారు. కల్పము తర్వాత మళ్ళీ మమ్మల్ని ధనవంతులుగా, ఆరోగ్యవంతులుగా మరియు ఐశ్వర్యవంతులుగా చేసేందుకు, పవిత్రత, సుఖ, శాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వస్తారని పిల్లలు అర్థం చేసుకుంటారు. బ్రాహ్మణులు కూడా ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ, పుత్రవాన్ భవ అని ఆశీర్వాదాలు ఇస్తారు కదా. పిల్లలైన మీకైతే వారసత్వము లభిస్తుంది, ఇందులో ఆశీర్వాదాల విషయమేమీ లేదు. పిల్లలు చదువుకుంటున్నారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా తండ్రి వచ్చి మనకు మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అయ్యే శిక్షణ ఇచ్చారని మీకు తెలుసు. చదువుకునే పిల్లలకు, మేము ఏం చదువుతున్నాము, చదివించేవారెవరు అన్నది తెలుస్తుంది. వారికి కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుస్తుంది. ఈ రాజధాని స్థాపన అవుతోంది అనగా దైవీ రాజ్యము స్థాపనవుతుంది అని పిల్లలైన మాకు తెలుసు అని మీరు తప్పకుండా అంటారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన జరుగుతోంది. ఇంతకుముందు శూద్రులుగా ఉండేవారు, ఆ తర్వాత బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. ఇప్పుడు మనము శూద్ర వర్ణానికి చెందినవారమని ప్రపంచములోనివారికెవ్వరికీ తెలియదు. ఇది సత్యమైన విషయమని పిల్లలైన మీరు భావిస్తారు. తండ్రి సత్యాన్ని తెలియజేస్తూ సత్య ఖండాన్ని స్థాపన చేస్తున్నారు. సత్యయుగములో అసత్యము, పాపము మొదలైనవేవీ ఉండవు. కలియుగములోనే అజామిళ్ వంటివారు, పాపాత్ములు ఉంటారు. ఈ సమయము పూర్తిగా రౌరవ నరకము వలె ఉంది. రోజురోజుకూ రౌరవ నరకము కనిపిస్తూ ఉంటుంది. మనుష్యులు ఎటువంటి పనులు చేస్తూ ఉంటారంటే, వాటి ద్వారా - ఇది పూర్తిగా తమోప్రధాన ప్రపంచములా తయారవుతూ ఉందని అర్థమవుతుంది. అందులో కూడా కామము మహాశత్రువు. కొంతమంది కష్టము మీద పవిత్రముగా, శుద్ధముగా ఉండగలుగుతారు. పూర్వము ఫకీర్లు అంటుండేవారు - ఎటువంటి కలియుగము రాబోతుందంటే 12-13 సంవత్సరాల కుమారీలు పిల్లలకు జన్మనిస్తారు అని. ఇప్పుడిది ఆ సమయము. కుమార-కుమారీలు మొదలైనవారందరూ అశుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధానమైపోతారో అప్పుడు నేను వస్తాను, నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది, నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. పిల్లలైన మీ కోసం ఇది కొత్త విషయమేమీ కాదు. తండ్రి ఈ విధముగానే అర్థం చేయిస్తారు. చక్రములో తిరిగారు, నాటకము పూర్తవుతుంది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానముగా అయి, సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎంత సాధారణ రీతిలో అర్థం చేయిస్తారు. తండ్రి తన పాత్రకు అంతటి మహత్వాన్ని ఏమీ ఇవ్వరు. ఇది నా పాత్ర, ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. డ్రామాలో నేను బంధింపబడి ఉన్నాను. నేను వచ్చి పిల్లలైన మీకు చాలా సహజమైన స్మృతియాత్రను తెలియజేస్తాను. అంతమతి సో గతి... (అంతిమ సమయములో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అటువంటి జన్మ లభిస్తుంది). ఇది ఈ సమయము కోసమే చెప్పడము జరిగింది. ఇది అంతిమ కాలము కదా. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అవుతారు అని తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు. మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతామని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. తండ్రి పదే-పదే చెప్తుంటారు - నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). ఒక జిన్ను భూతము కథను వినిపిస్తారు కదా - అది పని ఇవ్వమని అడుగుతుంది, అప్పుడు మెట్లు దిగు మరియు ఎక్కు అని చెప్పారు. తండ్రి కూడా అంటారు - ఈ ఆట కూడా దిగడము మరియు ఎక్కడానికి సంబంధించినది. పతితము నుండి పావనముగా, పావనము నుండి పతితముగా అవ్వాలి. ఇది కష్టమైన విషయమేమీ కాదు. ఇది చాలా సహజమైనది, కానీ ఇది ఎటువంటి యుద్ధము అనేది అర్థం చేసుకోని కారణముగా శాస్త్రాలలో యుద్ధము జరిగినట్లు వ్రాసేసారు. వాస్తవానికి మాయా రావణుడిపై విజయము పొందడమనేది చాలా పెద్ద యుద్ధము. మేము ఘడియ-ఘడియ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాము, మళ్ళీ స్మృతి తెగిపోతూ ఉంటుంది అన్నది పిల్లలు చూస్తుంటారు. మాయ దీపాన్ని ఆర్పి వేస్తుంది. దీని గురించే గులేబకావళి కథ కూడా ఉంది. పిల్లలు విజయము పొందుతారు. చాలా బాగా నడుచుకుంటారు, మళ్ళీ మాయ వచ్చి దీపాన్ని ఆర్పి వేస్తుంది. బాబా, మాయా తుఫానులైతే చాలా వస్తున్నాయని పిల్లలు కూడా అంటారు. తుఫానులు కూడా అనేక రకాలవి పిల్లల వద్దకు వస్తాయి. అప్పుడప్పుడు అయితే ఎటువంటి తుఫాన్లు జోరుగా వస్తాయంటే 8-10 సంవత్సరాల పాతవైన మంచి-మంచి వృక్షాలు కూడా పడిపోతాయి. పిల్లలకు తెలుసు, వర్ణన కూడా చేస్తారు. మాలలో మంచి-మంచి మణులుగా ఉండేవారు, ఈ రోజు లేనే లేరు. ఏనుగును మొసలి తినేసింది అన్న ఉదాహరణ కూడా ఉంది. ఇది మాయా తుఫాను.

తండ్రి అంటున్నారు, ఈ 5 వికారాల నుండి సంభాళించుకుంటూ ఉండండి. స్మృతిలో ఉన్నట్లయితే దృఢముగా అయిపోతారు. దేహీ-అభిమానులుగా అవ్వండి. తండ్రి యొక్క ఈ శిక్షణ ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఈ విధముగా ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. సత్యయుగములో కూడా ఇలా చెప్పరు. నామము, రూపము, దేశము, కాలము అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఈ సమయములో మీకు అర్థం చేయిస్తాను. మీరు మొదట సతోప్రధానముగా ఉండేవారు, సతో, రజో, తమోలలోకి వస్తూ మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. అందులో కూడా నంబరువన్ వీరు (బ్రహ్మా). ఇతరులకు 83 జన్మలు కూడా ఉండవచ్చు కానీ వీరికి పూర్తి 84 జన్మలు ఉన్నాయి. వీరు మొట్టమొదట శ్రీనారాయణునిగా ఉండేవారు. వీరి కోసం చెప్తే అందరి కోసమని అనుకుంటారు, అనేక జన్మల అంతిమములో జ్ఞానము తీసుకుని మళ్ళీ వీరు నారాయణునిగా అవుతారు. వృక్షములో కూడా చూపించారు కదా - ఇక్కడ శ్రీ నారాయణుడు మరియు చివరిలో బ్రహ్మా నిలబడి ఉన్నారు. కింద రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ప్రజాపితను ఎప్పుడూ పరమపిత అని అనరు. పరమపిత అని ఒక్కరినే అంటారు. వీరినేమో ప్రజాపిత అని అంటారు. వీరు దేహధారి, వారు విదేహీ, విచిత్రుడు. లౌకిక తండ్రిని పిత అని అంటారు, వీరిని ప్రజాపిత అని అంటారు. ఆ పరమపిత అయితే పరంధామములో ఉంటారు. ప్రజాపిత బ్రహ్మాను పరంధామములో ఉంటారని అనరు. వారు ఇక్కడ సాకారీ ప్రపంచములో ఉన్నారు. సూక్ష్మవతనములో కూడా లేరు. ప్రజలైతే స్థూల వతనములో ఉన్నారు. ప్రజాపితను భగవంతుడని అనరు. భగవంతునికి శారీరక పేరేమీ ఉండదు. మనుష్య తనువుకు పేరు ఉంటుంది, వారు దానికి అతీతమైనవారు. ఆత్మలు అక్కడ ఉన్నప్పుడు స్థూల నామ-రూపాలకు అతీతముగా ఉంటారు. కానీ ఆత్మ అయితే ఉంటుంది కదా. సాధు-సన్యాసులు మొదలైనవారు కేవలం ఇళ్ళు-వాకిళ్ళను వదులుతారు కానీ ప్రపంచములోని వికారాల యొక్క అనుభవీలే కదా. చిన్న పిల్లలకు ఏమీ తెలియదు, అందుకే వారిని మహాత్మ అని అంటారు. 5 వికారాల గురించి వారికి తెలియనే తెలియదు. అందుకే చిన్న పిల్లలను పవిత్రమైనవారు అని అంటారు. ఈ సమయములోనైతే పవిత్ర ఆత్మలెవరూ ఉండరు. చిన్నవారి నుండి పెద్దవారిగా అవుతారు కానీ పతితులనే అంటారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ డ్రామాలో అందరికి వేర్వేరు పాత్రలు నిశ్చితమై ఉన్నాయి. ఈ చక్రములో ఎన్ని శరీరాలను తీసుకుంటారో, ఎన్ని కర్మలు చేస్తారో, అవన్నీ మళ్ళీ రిపీట్ అవ్వనున్నాయి. మొట్టమొదట ఆత్మను గుర్తించాలి. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంది. ఇదే అన్నింటికన్నా అద్భుతమైన విషయము. ఆత్మ కూడా అవినాశీ అయినది. డ్రామా కూడా అవినాశీ అయినది. అది తయారై, తయారుచేయబడినది. అది ఎప్పటినుండి ప్రారంభమయ్యింది అని అనము. సృష్టి అద్భుతము అని అంటాము కదా. ఆత్మ ఎలా ఉంటుంది, ఈ డ్రామా ఎలా తయారై ఉంది, ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. సముద్రము మరియు ఆకాశము యొక్క అంతాన్ని తెలుసుకోలేరు. ఇది అవినాశీ డ్రామా. ఎంత అద్భుతమనిపిస్తుంది. ఏ విధముగా బాబా అద్భుతమైనవారో, అదే విధముగా జ్ఞానము కూడా చాలా అద్భుతమైనది. ఇది ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. ఇంతమంది పాత్రధారులంతా తమ-తమ పాత్రలను అభినయిస్తూనే ఉంటారు. నాటకము ఎప్పుడు తయారయ్యింది అన్న ప్రశ్నను ఎవ్వరూ అడగటానికి లేదు. చాలామంది ఏమంటారంటే - భగవంతునికి ఏం అవసరమొచ్చిందని సుఖ-దుఃఖాల ప్రపంచాన్ని కూర్చుని తయారుచేసారు. అరే, ఇది అనాది అయినది. ప్రళయము మొదలైనవి జరగవు. ఇది తయారై, తయారుచేయబడినది. దీనిని ఎందుకు తయారుచేసారు అని అనడానికి లేదు! ఆత్మ జ్ఞానాన్ని కూడా తండ్రి మీకు ఎప్పుడు వినిపిస్తారంటే మీరు తెలివైనవారిగా అయినప్పుడు. మీరు రోజురోజుకూ ఉన్నతి చెందుతూ ఉంటారు. మొదటిలోనైతే బాబా చాలా కొద్ది-కొద్దిగా వినిపించేవారు. అద్భుతమైన విషయాలు ఉండేవి, అంతేకాక ఆకర్షణ కూడా ఉండేది కదా. వారు ఆకర్షించారు. భట్టి యొక్క ఆకర్షణ కూడా ఉండేది. కృష్ణుడిని కంసపురి నుండి బయటకు తీసుకువెళ్ళారని శాస్త్రాలలో చూపించారు. కంసుడు మొదలైనవారైతే అక్కడ అసలు ఉండనే ఉండరని ఇప్పుడు మీకు తెలుసు. గీత, భాగవతము, మహాభారతము వీటన్నింటికీ కనెక్షన్ జోడిస్తారు, కానీ వాస్తవానికి అందులో ఏమీ లేదు. ఈ దసరా మొదలైనవన్నీ పరంపర నుండి కొనసాగుతూ వస్తున్నాయని భావిస్తారు. రావణుడంటే ఎవరు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే దేవీ-దేవతలుగా ఉండేవారో, వారు కిందకు దిగుతూ-దిగుతూ పతితముగా అయిపోయారు. ఎవరైతే ఎక్కువ పతితముగా అయ్యారో, వారే మొరపెట్టుకుంటారు, అందుకే - ఓ పతిత-పావనా అని పిలుస్తారు కూడా. ఈ విషయాలన్నింటినీ తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు తెలుసుకోవడము ద్వారా చక్రవర్తీ రాజులుగా అవుతారు. త్రిమూర్తి చిత్రములో - ఇది మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము అని వ్రాసి ఉంది. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన... వినాశనము కూడా తప్పకుండా జరగనున్నది. కొత్త ప్రపంచములో చాలా తక్కువమంది ఉంటారు. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే లేదని భావిస్తారు. మళ్ళీ తప్పకుండా ఆ ఒక్క ధర్మమే ఉండాలి. మహాభారత్ కు కూడా గీతతో సంబంధముంటుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఒక్క క్షణము కూడా ఆగదు. ఇది కొత్త విషయమేమీ కాదు, చాలా సార్లు రాజ్యాన్ని తీసుకున్నారు. కడుపు నిండుగా ఉన్నవారు గంభీరముగా ఉంటారు. మీరు లోలోపల ఇలా భావిస్తారు - మేము ఎన్ని సార్లు రాజ్యము తీసుకున్నాము, ఇది నిన్నటి విషయమే. నిన్నే దేవీ-దేవతలుగా ఉండేవారము, మళ్ళీ చక్రములో తిరిగి ఈ రోజు మేము పతితముగా అయ్యాము, మళ్ళీ మేమే యోగబలముతో విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. తండ్రి అంటారు, కల్ప-కల్పము మీరే రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. రాజ్యములో కొంతమంది తక్కువగా, కొంతమంది ఉన్నతముగా అవుతారు. ఇది పురుషార్థము ద్వారానే జరుగుతుంది.

ఇంతకుముందు మనము కోతుల కన్నా కూడా హీనముగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మందిర యోగ్యులుగా చేస్తున్నారు. మంచి-మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారి ఆత్మ రియలైజ్ అవుతుంది - నిజముగానే మేము దేనికీ పనికిరానట్లు ఉండేవారము, ఇప్పుడు మేము విలువైనవారిగా తయారవుతున్నాము అని. కల్ప-కల్పము తండ్రి మనల్ని విలువలేనివారి నుండి విలువైనవారిగా తయారుచేస్తారు. కల్పక్రితము వారే ఈ విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. మీరు కూడా ప్రదర్శనీలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు, ఇది కొత్తేమీ కాదు. వీటి ద్వారానే మీరు అమరపురిని స్థాపన చేస్తున్నారు. భక్తి మార్గములో దేవీలు మొదలైనవారికి ఎన్ని మందిరాలు ఉన్నాయి. అదంతా పూజారీ స్థితి యొక్క సామాగ్రి. పూజ్య స్థితి యొక్క సామాగ్రి ఏదీ లేదు. తండ్రి అంటున్నారు, రోజురోజుకూ మీకు గుహ్యమైన పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటాను. ఇంతకుముందు వినిపించిన అనేక పాయింట్లు మీ వద్ద ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఏం చేస్తారు. అవి అలాగే పడి ఉంటాయి. వర్తమానములోనైతే బాప్ దాదా కొత్త-కొత్త పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటారు. ఆత్మ ఇంత చిన్నని బిందువు, అందులో మొత్తం పాత్రంతా నిండి ఉంది. ఈ పాయింట్ ఇంతకుముందు ఉన్న కాపీలలో ఉండదు. మరి పాత పాయింట్లను మీరు ఏమి చేస్తారు. చివరిలో వెలువడే ఫలితమే ఉపయోగపడుతుంది. తండ్రి అంటారు, కల్పక్రితము కూడా మీకు ఇలాగే వినిపించాను. నంబరువారుగా చదువుతూ ఉంటారు. ఏదో ఒక సబ్జెక్టులో కింద-మీద అవుతూ ఉంటారు. వ్యాపారములో కూడా గ్రహచారము కూర్చుంటుంది, ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు (నిరాశ చెందకూడదు). మళ్ళీ లేచి పురుషార్థము చేయడం జరుగుతుంది. మనుష్యులు దివాలా తీస్తే, మళ్ళీ వ్యాపారము మొదలైనవి చేసి చాలా ధనవంతులుగా అయిపోతారు. ఇక్కడ కూడా ఎవరైనా వికారాలలో పడిపోతే, అయినా తండ్రి అంటారు, మంచి రీతిలో పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందండి, మళ్ళీ ఎక్కడము మొదలుపెట్టాలి. తండ్రి అంటారు, పడిపోయారు, మళ్ళీ ఎక్కండి. పడిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కే ప్రయత్నము చేసేవారు చాలామంది ఉన్నారు. బాబా వద్దు అనేమీ అనరు. ఇటువంటివారు కూడా చాలామంది వస్తారని తండ్రికి తెలుసు. తండ్రి అంటారు, పురుషార్థము చేయండి. ఏదో ఒక రకముగా సహాయకులుగా అయితే అవుతారు కదా. డ్రామా ప్లాన్ అనుసారముగానే అంటారు. తండ్రి అంటారు, సరే పిల్లలూ, ఇప్పుడు తృప్తి చెందారా, చాలా మునకలు వేసారు, ఇప్పుడిక మళ్ళీ పురుషార్థము చేయండి. అనంతమైన తండ్రి అయితే ఇలాగే చెప్తారు కదా. బాబాను కలుసుకునేందుకని బాబా వద్దకు ఎంతమంది వస్తారు. నేను అంటాను - అనంతమైన తండ్రి చెప్పేది వినరా, పవిత్రముగా అవ్వరా! తండ్రి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు చెప్తారు కావున బాణము తప్పకుండా తగులుతుంది. స్త్రీకి బాణము తగిలింది అనుకోండి, అప్పుడు ఆమె - నేనైతే ప్రతిజ్ఞ చేస్తాను అని అంటుంది. పురుషునికి తగలదు. అప్పుడు మున్ముందు అతడిని కూడా ఉన్నతిలోకి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నము చేస్తుంది. పత్ని జ్ఞానములోకి తీసుకొచ్చినవారు కూడా చాలామంది వస్తుంటారు. అప్పుడు వారు - పత్ని నాకు గురువు అని అంటారు. ముడి వేసే సమయములో ఆ బ్రాహ్మణులు - పతి నీకు గురువు, ఈశ్వరుడు అని చెప్తారు. ఇక్కడ తండ్రి అంటారు, ఒక్క తండ్రే మీకు సర్వస్వము. నాకైతే ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. అందరూ వారినే స్మృతి చేస్తారు. ఆ ఒక్కరితోనే యోగము జోడించాలి. ఈ దేహము కూడా నాది కాదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏదైనా గ్రహచారము వస్తే నిరుత్సాహపడి కూర్చుండిపోకూడదు. మళ్ళీ పురుషార్థము చేసి, తండ్రి స్మృతిలో ఉంటూ ఉన్నత పదవిని పొందాలి.

2. స్వయము యొక్క స్థితిని స్మృతి ద్వారా ఎంత దృఢముగా చేసుకోవాలంటే, ఇక ఏ మాయా తుఫాను కూడా దాడి చేయలేకపోవాలి. వికారాల నుండి స్వయాన్ని సంభాళించుకుంటూ ఉండాలి.

వరదానము:-
సర్వ శక్తుల లైట్ ద్వారా ఆత్మలకు దారిని చూపించే చైతన్య లైట్ హౌస్ భవ

ఆత్మనైన నేను విశ్వ కళ్యాణ సేవ కోసం పరంధామము నుండి అవతరించాను అన్న స్మృతిలో సదా ఉన్నట్లయితే, అప్పుడు ఏ సంకల్పాలు చేసినా, ఏ మాటలు మాట్లాడినా అందులో విశ్వ కళ్యాణము ఇమిడి ఉంటుంది మరియు ఈ స్మృతియే లైట్ హౌస్ లా పని చేస్తుంది. ఏ విధముగా ఆ లైట్ హౌస్ నుండి ఒక రంగు లైట్ వెలువడుతూ ఉంటుందో, అలా చైతన్యమైన లైట్ హౌస్ లైన మీ ద్వారా సర్వ శక్తుల లైట్ ఆత్మలకు ప్రతి అడుగులోను దారిని చూపించే కార్యము చేస్తూ ఉంటుంది.

స్లోగన్:-
స్నేహము మరియు సహయోగముతోపాటు శక్తి రూపముగా అయినట్లయితే రాజధానిలో ముందు నంబరు లభిస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

ఏ విధముగా కర్మలలోకి రావటము స్వాభావికమైపోయిందో అదే విధముగా కర్మాతీతముగా అవ్వటము కూడా స్వాభావికమైపోవాలి. కర్మలు కూడా చెయ్యండి మరియు స్మృతిలో కూడా ఉండండి. ఎవరైతే సదా కర్మయోగీ స్టేజ్ లో ఉంటారో, వారు సహజముగానే కర్మాతీతము అవ్వగలరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మలలోకి రావాలి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతముగా అవ్వాలి, ఈ ప్రాక్టీస్ ను కర్మలు చేసేటప్పుడు మధ్యమధ్యలో చేస్తూ ఉండండి.