ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలూ అని
ఇలా ఎవరు అన్నారు? ఇద్దరు తండ్రులూ అన్నారు. నిరాకారుడు కూడా అన్నారు, అలాగే
సాకారుడు కూడా అన్నారు, అందుకే వీరిని తండ్రి మరియు దాదా అని అంటారు. దాదా సాకారుడు.
నిజానికి ఈ పాటలు భక్తి మార్గానికి చెందినవి. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు
మరియు తండ్రి మొత్తము సృష్టి చక్ర జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టారు. మేము 84
జన్మలను పూర్తి చేశామని, ఇప్పుడు నాటకము పూర్తి కానున్నదని పిల్లలైన మీ బుద్ధిలో
కూడా ఉంది. ఇప్పుడు మనము యోగము లేక స్మృతి ద్వారా పావనముగా తయారవ్వాలి. స్మృతి మరియు
జ్ఞానము, ఇవి ప్రతి విషయములోనూ ఉంటాయి. బ్యారిస్టరును తప్పకుండా స్మృతి కూడా
చేస్తారు మరియు అతడి నుండి జ్ఞానాన్ని కూడా తీసుకుంటారు. దీనిని కూడా యోగ బలము మరియు
జ్ఞాన బలము అని అంటారు. ఇక్కడ ఇది కొత్త విషయము. ఆ యోగము మరియు జ్ఞానము ద్వారా
హద్దులోని బలము లభిస్తుంది. ఇక్కడ ఈ యోగము మరియు జ్ఞానము ద్వారా అనంతమైన బలము
లభిస్తుంది ఎందుకంటే ఇచ్చేది సర్వశక్తివంతుడైన అథారిటీ. తండ్రి అంటారు, నేను
జ్ఞానసాగరుడిని కూడా. పిల్లలైన మీరు ఇప్పుడు సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. మీకు
మూలవతనము, సూక్ష్మవతనము... అన్నీ గుర్తున్నాయి. తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో, అది కూడా
లభించింది. కావున జ్ఞానాన్ని కూడా ధారణ చేయాలి మరియు రాజ్యము కొరకు తండ్రి పిల్లలకు
యోగము మరియు పవిత్రతను కూడా నేర్పిస్తారు. మీరు పవిత్రముగా కూడా అవుతారు, తండ్రి
నుండి రాజ్యాన్ని కూడా తీసుకుంటారు. తండ్రి తనకంటే కూడా ఉన్నతమైన పదవిని ఇస్తారు.
మీరు 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ పదవిని పోగొట్టుకుంటారు. ఈ జ్ఞానము పిల్లలైన
మీకు ఇప్పుడు లభించింది. ఉన్నతోన్నతముగా తయారయ్యే జ్ఞానము ఉన్నతోన్నతుడైన తండ్రి
ద్వారా లభిస్తుంది. ఇప్పుడు మనము బాప్ దాదా ఇంట్లో కూర్చున్నట్లు ఉంది అని పిల్లలకు
తెలుసు. ఈ దాదా (బ్రహ్మా) మీకు తల్లి కూడా. ఆ తండ్రి వేరు, ఈ దాదా అయితే తల్లి కూడా.
కానీ వీరిది పురుష శరీరమైన కారణముగా మాతను నిమిత్తము చేయడం జరుగుతుంది, వీరిని కూడా
దత్తత తీసుకోవడం జరుగుతుంది. దాదా ద్వారా రచనను రచించడం జరిగింది. రచన కూడా దత్తత
తీసుకోబడ్డవారే. తండ్రి పిల్లలను వారసత్వాన్ని ఇచ్చేందుకు దత్తత తీసుకుంటారు.
బ్రహ్మాను కూడా దత్తత తీసుకున్నారు. ప్రవేశించడమన్నా, దత్తత తీసుకోవడమన్నా, విషయము
ఒక్కటే. పిల్లలు నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం
చేయిస్తారు. అందరికీ ఏమని అర్థం చేయించాలంటే - మేము మా పరమపిత పరమాత్ముని శ్రీమతము
ఆధారముగా ఈ భారత్ ను మళ్ళీ శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా తయారుచేస్తున్నాము. మరి స్వయము
కూడా శ్రేష్ఠముగా తయారవ్వాలి. స్వయాన్ని చూసుకోవాలి - నేను శ్రేష్ఠముగా అయ్యానా?
ఏదైనా భ్రష్టాచారపు పని చేసి ఎవరికీ దుఃఖాన్ని అయితే ఇవ్వడము లేదు కదా? తండ్రి
అంటారు, నేను పిల్లలను సుఖవంతులుగా చేయడానికి వచ్చాను కావున మీరు కూడా అందరికీ
సుఖాన్ని ఇవ్వాలి. తండ్రి ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేరు. వారి పేరే
దుఃఖహర్త-సుఖకర్త. పిల్లలు తమను తాము చెక్ చేసుకోవాలి - మనసా, వాచా, కర్మణా నేను
ఎవరికీ దుఃఖము ఇవ్వడము లేదు కదా? శివబాబా ఎప్పుడూ ఎవరికీ దుఃఖము ఇవ్వరు. తండ్రి
అంటారు, నేను కల్ప-కల్పము పిల్లలైన మీకు ఈ అనంతమైన కథను వినిపిస్తాను. మేము మా
ఇంటికి వెళ్తాము, మళ్ళీ కొత్త ప్రపంచములోకి వస్తాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది.
ఇప్పటి చదువు అనుసారముగా అంతిమములో మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. తిరిగి ఇంటికి వెళ్ళి
మళ్ళీ నంబరువారుగా పాత్రను అభినయించడానికి వస్తారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది.
ఇప్పుడు ఏ పురుషార్థమైతే చేస్తారో, అదే మీ పురుషార్థముగా కల్ప-కల్పానికి
నిశ్చితమవుతుందని పిల్లలకు తెలుసు. మొట్టమొదట అందరికీ బుద్ధిలో ఈ విషయాన్ని
కూర్చోబెట్టాలి - రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము తండ్రికి తప్ప
ఇంకెవ్వరికీ తెలియదు అని. ఉన్నతోన్నతుడైన తండ్రి పేరునే మాయం చేసేసారు. త్రిమూర్తి
అన్న పేరు అయితే ఉంది, త్రిమూర్తి మార్గము కూడా ఉంది, త్రిమూర్తి హౌస్ కూడా ఉంది.
త్రిమూర్తి అని బ్రహ్మా-విష్ణు-శంకరులను అంటారు. ఈ ముగ్గురికీ రచయిత అయిన శివబాబా
పేరును అనగా ఆ మూలమైనవారి పేరునే మాయం చేసేసారు. ఉన్నతోన్నతమైనవారు శివబాబా అని, ఆ
తర్వాత త్రిమూర్తులు అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి నుండి పిల్లలైన మనము ఈ
వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి యొక్క జ్ఞానము మరియు వారసత్వము, ఈ రెండూ స్మృతిలో
ఉన్నట్లయితే సదా హర్షితముగా ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటూ మీరు ఎవరికైనా జ్ఞాన
బాణాన్ని వేస్తే మంచి ప్రభావము ఉంటుంది. అవతలివారిలోకి శక్తి వస్తూ ఉంటుంది. స్మృతి
యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది. ఇప్పుడు శక్తి మాయమైపోయింది ఎందుకంటే ఆత్మ
పతితముగా, తమోప్రధానముగా అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమైన చింత ఏం పెట్టుకోవాలంటే -
మేము తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. మన్మనాభవ అర్థము కూడా ఇదే. గీతను
ఎవరైతే చదువుతారో, వారిని ఇలా అడగాలి - మన్మనాభవ అర్థమేమిటి? నన్ను స్మృతి చేస్తే
వారసత్వము లభిస్తుంది అని ఎవరన్నారు? కొత్త ప్రపంచాన్ని స్థాపించేది శ్రీకృష్ణుడేమీ
కాదు. అతను ఒక రాజకుమారుడు. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటూ ఉంటారు. నిజానికి
చేసేవారు, చేయించేవారు ఎవరు? ఇది మర్చిపోయారు. వారిని సర్వవ్యాపి అని అనేస్తారు.
బ్రహ్మా, విష్ణు, శంకరులు మొదలైనవారందరిలోనూ వారే ఉన్నారని అంటారు. ఇప్పుడు దీనిని
అజ్ఞానము అని అంటారు. తండ్రి అంటారు, మిమ్మల్ని పంచ వికారాల రూపీ రావణుడు ఎంత
బుద్ధిహీనులుగా చేసేశాడు. తప్పకుండా మేము కూడా ఇంతకుముందు ఇలానే ఉండేవారమని మీకు
తెలుసు. అయితే, మొదట్లో ఉత్తమోత్తములుగా కూడా మేమే ఉండేవారము, మళ్ళీ కిందకు పడిపోతూ
మహా పతితులుగా అయ్యాము. రామ భగవానుడు వానర సైన్యాన్ని తీసుకున్నారని శాస్త్రాల్లో
చూపించారు, అది కూడా కరక్టే. మేము నిజంగానే వానరుల వలె ఉండేవారము అని మీకు తెలుసు.
ఈ ప్రపంచమే భ్రష్టాచారీ ప్రపంచము అని ఇప్పుడు అనుభవమవుతుంది. ఒకరినొకరు
నిందించుకుంటూ, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి. అది పుష్పాల తోట. అడవి
చాలా పెద్దగా ఉంటుంది. పుష్పాల తోట చిన్నగా ఉంటుంది. పుష్పాల తోట ఎప్పుడూ పెద్దగా
ఉండదు. తప్పకుండా ఈ సమయములో ఇది చాలా పెద్ద ముళ్ళ అడవేనని పిల్లలు భావిస్తారు.
సత్యయుగములో పుష్పాల తోట ఎంత చిన్నగా ఉంటుంది. ఈ విషయాలను పిల్లలైన మీలో కూడా
నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు. ఎవరిలోనైతే జ్ఞాన-యోగాలు లేవో,
సేవలో తత్పరులై లేరో, వారికి లోపల అంత సంతోషము కూడా ఉండదు. దానము చేయటము ద్వారా
మనుష్యులకు సంతోషము కలుగుతుంది. ఇతను తన ముందు జన్మలో దాన-పుణ్యాలు చేసారు, అందుకే
మంచి జన్మ లభించింది అని భావిస్తారు. కొందరు భక్తులు ఉంటారు, వారు - భక్తుడినైన నేను
మంచి భక్తుల ఇంట్లోకి వెళ్ళి జన్మ తీసుకుంటాను అని భావిస్తారు. మంచి కర్మలకు ఫలము
కూడా మంచిగా లభిస్తుంది. తండ్రి కూర్చుని కర్మ-అకర్మ-వికర్మల గతులను పిల్లలకు అర్థం
చేయిస్తారు. ప్రపంచానికి ఈ విషయాలేవీ తెలియవు. ఇప్పుడు ఇది రావణ రాజ్యమైన కారణముగా
మనుష్యుల కర్మలన్నీ వికర్మలుగా అవుతాయని మీకు తెలుసు. పతితులుగానైతే అవ్వవలసిందే.
పంచ వికారాలు అందరిలోనూ ప్రవేశించి ఉన్నాయి. దానపుణ్యాలు మొదలైనవి చేస్తారు కానీ
వాటికి అల్పకాలికమైన ఫలము లభిస్తుంది. కానీ పాపాలు కూడా చేస్తూనే ఉంటారు. రావణ
రాజ్యములో ఏయే ఇచ్చిపుచ్చుకోవడాలైతే జరుగుతాయో, అవన్నీ పాపముతో కూడుకున్నవే. దేవతల
ముందు ఎంత స్వచ్ఛతతో భోగ్ పెడతారు. స్వచ్ఛముగా తయారై వస్తారు. కానీ వారికి ఏమీ
తెలియదు. అనంతమైన తండ్రిని కూడా ఎంతగా గ్లాని చేశారు. ఈశ్వరుడు సర్వవ్యాపి,
సర్వశక్తివంతుడు అని అంటూ మేము వారిని మహిమ చేస్తున్నామని అనుకుంటారు కానీ తండ్రి
అంటారు, అది వారి తప్పుడు అభిప్రాయము.
మీరు మొట్టమొదట తండ్రి మహిమను ఇలా వినిపిస్తారు - ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే,
మేము వారినే స్మృతి చేస్తాము అని. రాజయోగము యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము కూడా ఎదురుగా
ఉంది. ఈ రాజయోగాన్ని తండ్రియే నేర్పిస్తారు. శ్రీకృష్ణుడిని తండ్రి అని అనరు, అతను
చిన్న బాలుడు, శివుడిని తండ్రి అని అంటారు. వారికి తనదంటూ దేహము లేదు. దీనిని నేను
అప్పుగా తీసుకుంటాను. అందుకే వీరిని బాప్ దాదా అని అంటారు. వారు ఉన్నతోన్నతుడైన
నిరాకార తండ్రి. రచనకు రచన ద్వారా వారసత్వము లభించదు. లౌకిక సంబంధములో కొడుకులకు
తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. కూతురుకు లభించదు.
ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - ఆత్మలైన మీరు నాకు కొడుకులు. ప్రజాపిత
బ్రహ్మాకు మీరు కొడుకులు, కూతురులు. బ్రహ్మా నుండి వారసత్వము లభించేది లేదు.
తండ్రికి చెందినవారిగా అవ్వడము ద్వారానే వారసత్వము లభిస్తుంది. ఈ తండ్రి పిల్లలైన
మీకు సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలకు సంబంధించిన శాస్త్రాలు
తయారవ్వవు. మీరు వ్రాస్తారు కూడా, లిటరేచరును కూడా ముద్రిస్తారు, అయినా కానీ టీచర్
తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. టీచర్ లేకుండా పుస్తకాల ద్వారా ఎవరూ అర్థం
చేసుకోలేరు. ఇప్పుడు మీరు ఆత్మిక టీచర్లు. తండ్రి బీజరూపుడు, వారి వద్ద మొత్తము
వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. టీచర్ రూపములో కూర్చుని మీకు అర్థం
చేయిస్తారు. పిల్లలైన మీకైతే సదా ఈ సంతోషము ఉండాలి - మమ్మల్ని సుప్రీమ్ తండ్రి తన
పిల్లలుగా చేసుకున్నారు, వారే మమ్మల్ని టీచరుగా అయి చదివిస్తున్నారు, సత్యమైన
సద్గురువు కూడా వారే, వారే తనతోపాటు తీసుకునివెళ్తారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే.
ఉన్నతోన్నతమైనవారు తండ్రే, వారే భారత్ కు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వారసత్వాన్ని
ఇస్తారు. వారి పేరు మీద శివ జయంతిని జరుపుకుంటారు. వాస్తవానికి శివునితోపాటు
త్రిమూర్తి అని కూడా ఉండాలి. మీరు త్రిమూర్తి శివజయంతిని జరుపుకుంటారు. కేవలం
శివజయంతిని జరుపుకోవడం వలన ఏ విషయమూ నిరూపణ అవ్వదు. తండ్రి వచ్చినప్పుడు బ్రహ్మా
యొక్క జన్మ జరుగుతుంది. పిల్లలుగా అయ్యాక, బ్రాహ్మణులుగా అయ్యాక లక్ష్యము-ఉద్దేశ్యము
ఎదురుగా వస్తుంది. తండ్రి స్వయంగా వచ్చి స్థాపన చేస్తారు. లక్ష్యము-ఉద్దేశ్యము కూడా
చాలా స్పష్టముగా ఉంది, కేవలం శ్రీకృష్ణుని పేరు వేయడముతో మొత్తము గీత యొక్క
మహత్వమంతా పోయింది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ పొరపాటు మళ్ళీ కూడా జరిగేది
ఉంది. ఇదంతా జ్ఞానము మరియు భక్తి యొక్క ఆటే. తండ్రి అంటారు - ప్రియమైన పిల్లలూ,
సుఖధామాన్ని, శాంతిధామాన్ని స్మృతి చేయండి. అల్ఫ్ మరియు బే (భగవంతుడు మరియు
రాజ్యాధికారము), ఎంత సహజము. మన్మనాభవ యొక్క అర్థమేమిటి అని మీరు ఎవరినైనా అడగండి,
వారు ఏమంటారో చూడండి. భగవంతుడు అని ఎవరిని అనాలి, భగవంతుడు ఉన్నతోన్నతమైనవారు కదా,
మరి వారిని సర్వవ్యాపి అని అనవచ్చా - అని అడగండి. వారు అందరికీ తండ్రి. ఇప్పుడు
త్రిమూర్తి శివ జయంతి వస్తుంది. మీరు త్రిమూర్తి శివుని చిత్రాన్ని తయారుచెయ్యాలి.
ఉన్నతోన్నతమైనవారు శివుడు, ఆ తర్వాత సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా-విష్ణు-శంకరులు.
ఉన్నతోన్నతమైనవారు శివబాబా. వారు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. వారి జయంతిని
మీరెందుకు జరుపుకోరు? తప్పకుండా భారత్ కు వారసత్వాన్ని ఇచ్చారు. వారి రాజ్యము ఉండేది.
ఇందులోనైతే మీకు ఆర్య సమాజము వారు కూడా సహాయము చేస్తారు ఎందుకంటే వారు కూడా శివుడిని
నమ్ముతారు. మీరు మీ జెండాను ఎగురవేయండి. ఒకవైపు త్రిమూర్తి మరియు సృష్టిచక్రము,
ఇంకొకవైపు కల్పవృక్షము. వాస్తవానికి మీ జెండా ఇలా ఉండాలి. ఇలా తయారుచేయవచ్చు కదా.
జెండాను ఎగురవేయండి, అప్పుడు అందరూ చూస్తారు. మొత్తం వివరణ అంతా ఇందులో ఉంది.
కల్పవృక్షము మరియు డ్రామా, వీటిలోనైతే వివరణ చాలా స్పష్టముగా ఉంది. తమ ధర్మము మళ్ళీ
ఎప్పుడు వస్తుంది అనేది ఇది చూసి అందరికీ అర్థమైపోతుంది. తమకు తామే అందరూ తమ-తమ
ధర్మము వచ్చే సమయాన్ని లెక్కించుకుంటారు. అందరికీ ఈ చక్రము మరియు వృక్షముపై అర్థం
చేయించాలి. క్రైస్టు ఎప్పుడు వచ్చారు? అంతవరకూ ఆ ఆత్మలు ఎక్కడుంటారు? నిరాకారీ
ప్రపంచములో ఉంటారని తప్పకుండా చెప్తారు. ఆత్మలైన మనము రూపాన్ని మార్చుకుని ఇక్కడికి
వచ్చి సాకారులుగా అవుతాము. తండ్రితో కూడా అంటారు కదా, మీరు కూడా రూపాన్ని మార్చుకుని
సాకారములోకి రండి అని. తండ్రి అయితే ఇక్కడికే వస్తారు కదా. సూక్ష్మవతనములోకైతే రారు.
ఏ విధంగా మేము రూపాన్ని మార్చుకుని పాత్రను అభినయిస్తామో, అలా మీరు కూడా రండి, మళ్ళీ
వచ్చి రాజయోగాన్ని నేర్పించండి అని అంటారు. రాజయోగము భారత్ ను స్వర్గముగా
మార్చేటటువంటిది. ఇవి చాలా సహజమైన విషయాలు. పిల్లలకు అభిరుచి ఉండాలి. ధారణ చేసి
ఇతరుల చేత ధారణ చేయించాలి. దీని కోసం ఉత్తర-ప్రత్యుత్తరాలు వ్రాయాలి. తండ్రి వచ్చి
భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. తప్పకుండా క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం
భారత్ స్వర్గముగా ఉండేదని అంటారు, అందుకే త్రిమూర్తి శివుని చిత్రాన్ని అందరికీ
పంపించాలి. త్రిమూర్తి శివుని స్టాంపు కూడా తయారుచేయాలి. ఈ స్టాంపులు తయారుచేసేవారి
డిపార్టుమెంటు కూడా ఉంటుంది. ఢిల్లీలోనైతే చదువుకున్నవారు చాలామంది ఉన్నారు. వారు ఈ
పని చేయగలరు. మీ రాజధానిగా కూడా ఢిల్లీయే ఉండబోతుంది. మొదట ఢిల్లీని పరిస్తాన్ అని
అనేవారు. ఇప్పుడది స్మశానములా ఉంది. కావున ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలోకి రావాలి.
ఇప్పుడు మీరు సదా సంతోషముగా ఉండాలి, చాలా-చాలా మధురముగా తయారవ్వాలి, అందరినీ
ప్రేమతో నడిపించాలి. సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా తయారయ్యే పురుషార్థము
చెయ్యాలి. మీ పురుషార్థము యొక్క లక్ష్యము ఇదే. కానీ ఇప్పటివరకు ఎవరూ అలా తయారవ్వలేదు.
ఇప్పుడు మీరు ఎక్కే కళలోకి వెళ్తూ ఉంటారు. మెల్లమెల్లగా ఎక్కుతారు కదా. బాబా శివ
జయంతికి అన్ని రకాలుగా సేవ చేయమని సూచన ఇస్తున్నారు. తద్వారా, వీరి జ్ఞానము
తప్పకుండా ఉన్నతమైనదేనని మనుష్యులు భావిస్తారు. మనుష్యులకు అర్థం చేయించడానికి ఎంత
కష్టపడవలసి ఉంటుంది. కష్టపడకుండా రాజధాని ఎలా స్థాపన అవుతుంది. ఎక్కుతారు, పడిపోతారు,
మళ్ళీ ఎక్కుతారు. పిల్లలకు కూడా ఏదో ఒక తుఫాను వస్తూ ఉంటుంది. ముఖ్యమైన విషయము
స్మృతి. స్మృతి ద్వారానే సతోప్రధానముగా తయారవ్వాలి. జ్ఞానము సహజమైనది. పిల్లలు చాలా
మధురాతి మధురముగా అవ్వాలి. లక్ష్యము-ఉద్దేశ్యము అయితే ఎదురుగా నిలబడి ఉంది. ఈ
లక్ష్మీ-నారాయణులు ఎంత మధురమైనవారు. వీరిని చూస్తే ఎంత సంతోషము కలుగుతుంది. ఇది
విద్యార్థులైన మన లక్ష్యము-ఉద్దేశ్యము. చదివించేవారు భగవంతుడు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.