20-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ పాత ప్రపంచములో అల్పకాలికమైన క్షణ భంగురమైన సుఖము ఉంది, ఇది మీతో పాటు రాదు, మీతో పాటు అవినాశీ జ్ఞాన రత్నాలు వస్తాయి, అందుకే అవినాశీ సంపాదనను జమ చేసుకోండి’’

ప్రశ్న:-
తండ్రి చదివించే చదువులో మీకు ఏ విద్య నేర్పించడం జరగదు?

జవాబు:-
భూత విద్య. ఎవరి సంకల్పాలనైనా చదవడము అనేది భూత విద్య, ఈ విద్య మీకు నేర్పించడం జరగదు. తండ్రి ఏమీ థాట్ రీడర్ (ఇతరుల సంకల్పాలను తెలుసుకోగలిగినవారు) కాదు. వారు సర్వము తెలిసినవారు అనగా అర్థము వారు నాలెడ్జ్ ఫుల్ అని. తండ్రి మీకు ఆత్మిక చదువును చదివించడానికి వస్తారు, ఈ చదువు ద్వారా మీకు 21 జన్మల కొరకు విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది.

ఓంశాంతి
భారత్ లో భారతవాసులు - ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు... అని పాడుతారు. ఆత్మలమైన మన తండ్రి అయిన పరమపిత పరమాత్మ మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. వారు తమ పరిచయాన్ని ఇస్తున్నారు మరియు సృష్టి ఆదిమధ్యాంతాల పరిచయాన్ని కూడా ఇస్తున్నారు. కొందరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారు, కొందరు తక్కువగా అర్థం చేసుకుంటారు, నంబరువారుగా అయితే ఉన్నారు కదా. జీవాత్మలమైన మనము పరమపిత పరమాత్ముని సమ్ముఖములో కూర్చున్నామని పిల్లలకు తెలుసు. ఆత్మలు, పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు అని అంటూ ఉంటారు. మూలవతనములో ఆత్మలు ఉన్నప్పుడు తండ్రి నుండి వేరయ్యే విషయమే తలెత్తదు. ఇక్కడకు రావడముతో ఎప్పుడైతే జీవాత్మలుగా అవుతారో అప్పుడు పరమాత్మ అయిన తండ్రి నుండి ఆత్మలందరూ వేరవుతారు. పరమపిత పరమాత్మ నుండి వేరయ్యి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తారు. పూర్వమైతే అర్థము తెలియకుండా ఊరికే అలా పాడుతుండేవారు. ఇప్పుడైతే తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పరమపిత పరమాత్మ నుండి మనము వేరయ్యి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తామని పిల్లలకు తెలుసు. మీరే మొట్టమొదట విడిపోయారు కావున శివబాబా కూడా మొట్టమొదట మిమ్మల్నే కలుస్తారు. మీ కోసము తండ్రికి రావలసి ఉంటుంది. కల్ప పూర్వము కూడా ఈ పిల్లలనే చదివించారు, వీరే స్వర్గానికి యజమానులుగా అయ్యారు. ఆ సమయములో ఇతర ఖండాలేవీ లేవు. మనము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని పిల్లలకు తెలుసు, దానిని దైవీ ధర్మము, దైవీ వంశము అని కూడా అంటారు. ప్రతి ఒక్కరికి తమ ధర్మము ఉంటుంది. ధర్మమే శక్తి అని అంటారు. ధర్మములో శక్తి ఉంటుంది. ఈ లక్ష్మీ-నారాయణులు ఎంతటి శక్తివంతమైనవారు అనేది పిల్లలైన మీకు తెలుసు. భారతవాసులకు తమ ధర్మము గురించే తెలియదు. తప్పకుండా భారత్ లో వీరి ధర్మమే ఉండేదని ఎవరి బుద్ధిలోకి కూడా రాదు. ధర్మము గురించి తెలియని కారణముగా అధర్మయుక్తముగా అయిపోయారు. ధర్మములోకి రావడముతో మీలో ఎంతటి శక్తి ఉంటుంది. మీరు ఇనుప యుగపు పర్వతాన్ని ఎత్తి స్వర్ణిమ యుగపు పర్వతముగా తయారుచేస్తారు. భారత్ ను బంగారు పర్వతముగా తయారుచేస్తారు. అక్కడైతే గనులలో లెక్కలేనంత బంగారము నిండి ఉంటుంది. బంగారు పర్వతాలు ఉంటాయి, అవి తెరుచుకుంటాయి. బంగారాన్ని కరిగించి దానితో ఇటుకులను తయారుచేయడం జరుగుతుంది. ఇళ్ళు అయితే పెద్ద ఇటుకలతోనే నిర్మిస్తారు కదా. మాయా మశ్చింద్రుని నాటకాన్ని కూడా చూపిస్తారు కదా. అవన్నీ కథలు. తండ్రి అంటారు, వీటన్నింటి సారాన్ని నేను మీకు వినిపిస్తాను. ఆ కథలో - అన్నింటినీ నింపుకుని వెళ్ళినట్లుగా ధ్యానములో కనిపిస్తుంది, మళ్ళీ ధ్యానము నుండి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఏమీ ఉండదు. అలాగే మీ విషయములో కూడా జరుగుతుంది. దీనినే దివ్యదృష్టి అని అంటారు. దీని వలన ఎటువంటి ఉపయోగము లేదు. నవ విధ భక్తిని చాలా చేస్తుంటారు. ఆ భక్తుల మాలయే వేరు, ఈ జ్ఞాన మాల వేరు. రుద్రమాల మరియు విష్ణు మాల ఉన్నాయి కదా. అలా అది భక్తి మాల. ఇప్పుడు మీరు రాజ్యము కొరకు చదువుకుంటున్నారు. మీ బుద్ధియోగము టీచరుతో మరియు రాజ్యముతో జోడించబడి ఉంది. ఉదాహరణకు కాలేజిలో చదివేటప్పుడు బుద్ధియోగము టీచరుతో పాటు ఉంటుంది. బ్యారిస్టర్ స్వయముగా చదివించి తన సమానముగా తయారుచేస్తారు. ఈ బాబా స్వయమైతే ఆ విధంగా అవ్వరు. ఈ అద్భుతము ఇక్కడే ఉంది. ఇది మీ ఆత్మిక చదువు. మీ బుద్ధియోగము శివబాబాతో ఉంది, వారినే నాలెడ్జ్ ఫుల్, జ్ఞానసాగరుడు అని అంటారు. జానీ-జాననహార్ (సర్వము తెలిసినవారు) అనగా అర్థము వారు కూర్చుని అందరి మనసులలో వీరి లోపల ఏం నడుస్తుంది అనేది తెలుసుకుంటారని కాదు. ఆ థాట్ రీడర్లు (ఇతరుల సంకల్పాలను తెలుసుకోగలిగినవారు) ఎవరైతే ఉంటారో, వారు అన్నీ వినిపిస్తారు. దానిని భూత విద్య అని అంటారు. ఇక్కడైతే మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి తండ్రి చదివిస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు అని గాయనము కూడా ఉంది. మనము ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామని, మళ్ళీ మరుసటి జన్మలో దేవతలుగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఆది సనాతన దేవీ-దేవతలే మహిమ చేయబడతారు. శాస్త్రాలలోనైతే ఎన్నో కథలను వ్రాసేశారు. ఇక్కడైతే తండ్రి కూర్చుని డైరెక్టుగా చదివిస్తారు.

భగవానువాచ - భగవంతుడే జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, శాంతి సాగరుడు. వారు పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తారు. ఈ చదువు మీ 21 జన్మల కొరకు ఉంటుంది. కావున ఎంత బాగా చదువుకోవాలి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడము కోసము ఈ ఆత్మిక చదువును తండ్రి ఒక్కసారే వచ్చి చదివిస్తారు. కొత్త ప్రపంచములో ఈ దేవీ-దేవతల రాజ్యము ఉండేది. తండ్రి అంటారు, నేను బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. ఈ ధర్మము ఉండేటప్పుడు ఇంకే ఇతర ధర్మాలు ఉండేవి కాదు. ఇప్పుడు మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి. అందుకే త్రిమూర్తి చిత్రముపై కూడా మీరు - బ్రహ్మా ద్వారా ఏక ధర్మ స్థాపన జరుగుతుందని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఆ ధర్మము లేదు. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవు, మీరే నాపై దయ చూపండి... అని పాడుతారు కూడా. మాలో ఏ గుణాలు లేవు అని అనేటప్పుడు బుద్ధి గాడ్ ఫాదర్ వైపుకే వెళ్తుంది, వారినే దయా స్వరూపుడు అని అంటారు. తండ్రి వచ్చేదే పిల్లల యొక్క అన్ని దుఃఖాలను సమాప్తము చేసి 100 శాతము సుఖాన్ని ఇవ్వడానికి. వారు ఎంత దయ చూపిస్తారు. బాబా వద్దకు మేము వచ్చాము కావున ఈ తండ్రి నుండి పూర్తి సుఖాన్ని తీసుకోవాలి అని మీరు భావిస్తారు. అది ఉన్నదే సుఖధామము, ఇది దుఃఖధామము. ఈ చక్రాన్ని కూడా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేసినట్లయితే అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. శాంతిధామాన్ని స్మృతి చేసినట్లయితే తప్పకుండా శరీరాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది, అప్పుడు ఆత్మలు శాంతిధామానికి వెళ్తాయి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. లైన్ పూర్తిగా క్లియిర్ గా (స్పష్టముగా) ఉండాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయడము ద్వారా లోపల సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది. ఈ పాత ప్రపంచములోనైతే అల్పకాలికమైన, క్షణభంగురమైన సుఖము ఉంది. ఇది మీతోపాటు రాదు. మీతోపాటు ఈ అవినాశీ జ్ఞాన రత్నాలే వస్తాయి అనగా ఈ జ్ఞాన రత్నాల సంపాదనే మీతోపాటు వస్తుంది, అదే మళ్ళీ 21 జన్మలు మీరు ప్రారబ్ధముగా అనుభవిస్తారు. అయితే, ఎవరైతే తండ్రికి సహాయము చేస్తారో వినాశీ ధనము కూడా వారితోపాటు వెళ్తుంది. బాబా, మా గవ్వలను కూడా తీసుకుని అక్కడ మహళ్ళను ఇవ్వండి అని అంటారు. తండ్రి గవ్వలకు బదులుగా ఎన్ని రత్నాలను ఇస్తారు. అమెరికన్లు ఉంటారు కదా, వారు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి పురాతనమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత వస్తువులను మనుష్యులు ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. అమెరికన్ల నుండి పైసా విలువ చేసే వస్తువుకు వెయ్యి రూపాయలు తీసేసుకుంటారు. బాబా కూడా ఎంత మంచి కొనుగోలుదారుడు. వారిని భోళానాథుడు అని అంటూ ఉంటారు కదా. మనుష్యులకు ఇది కూడా తెలియదు, వారైతే శివ-శంకరులను ఒక్కరే అని అనేస్తారు. నా జోలిని నింపండి అని వారితో అంటారు. మనకు జ్ఞాన రత్నాలు లభిస్తున్నాయని, వాటితో మన జోలి నిండుతుందని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. వీరు అనంతమైన తండ్రి. వారు శంకరుడి గురించి - ఉమ్మెత్తను తినేవారని, భంగు తాగేవారని అంటారు మరియు అలాగే చూపిస్తారు. ఎలాంటి విషయాలను కూర్చుని తయారుచేసారు! పిల్లలైన మీరు ఇప్పుడు సద్గతి కొరకు చదువును చదువుకుంటున్నారు. ఈ చదువు పూర్తిగా శాంతిలో ఉండేందుకు ఉన్న చదువు. ఈ దీపాలు మొదలైనవి ఏవైతే వెలిగిస్తారో, ఆర్భాటము చేస్తారో, ఇది కూడా ఎందుకు చేస్తారంటే మనుష్యులు వచ్చి మీరు శివజయంతిని ఇంతగా ఎందుకు జరుపుకుంటున్నారు అని అడగాలని. శివుడే భారత్ ను సంపన్నముగా తయారుచేస్తారు కదా. ఈ లక్ష్మీ-నారాయణులను స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారుచేసారు - ఇది మీకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు ముందు జన్మలో ఎవరు? వీరు ముందు జన్మలో జగదాంబ, జ్ఞాన-జ్ఞానేశ్వరిగా ఉండేవారు, వారే మళ్ళీ రాజ-రాజేశ్వరిగా అవుతారు. ఇప్పుడు మరి ఎవరి పదవి గొప్పది? చూడటానికైతే ఆమె స్వర్గానికి యజమాని. మరి జగదాంబ దేనికి యజమానిగా ఉండేవారు? మరి జగదాంబ వద్దకు ఎందుకు వెళ్తారు? బ్రహ్మాను కూడా వంద భుజాలు కలిగినవారిగా, రెండు వందల భుజాలు కలిగినవారిగా, 1000 భుజాలు కలిగినవారిగా చూపిస్తారు కదా. పిల్లలు ఎంతగా పెరుగుతూ ఉంటారో, అంతగా భుజాలు పెరుగుతూ ఉంటాయి. జగదాంబకు కూడా లక్ష్మి కంటే ఎక్కువ భుజాలను చూపించారు, ఆమె వద్దకే వెళ్ళి అన్నీ కోరుకుంటారు. పిల్లలు కావాలని, ఇది కావాలని, అది కావాలని... ఎన్నో కోరికలు పెట్టుకుని వెళ్తారు. లక్ష్మి వద్దకు ఎప్పుడూ ఇటువంటి కోరికలతో వెళ్ళరు. ఆమె కేవలం ధనవంతురాలు మాత్రమే. జగదాంబ నుండైతే స్వర్గము యొక్క రాజ్యాధికారము లభిస్తుంది. జగదాంబను ఏం కోరుకోవాలి అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇది చదువు కదా. జగదాంబ ఏం చదివిస్తున్నారు? రాజయోగము. దీనిని బుద్ధియోగము అనే అంటారు. మీ బుద్ధి ఇతర వైపులన్నింటి నుండి తొలగి ఒక్క తండ్రితో జోడించబడుతుంది. బుద్ధి అయితే అనేక వైపులకు పరుగెడుతుంది కదా. ఇప్పుడు తండ్రి అంటారు, నాతో బుద్ధియోగాన్ని జోడించండి, లేదంటే వికర్మలు వినాశనమవ్వవు, అందుకే బాబా ఫోటో తీసేందుకు కూడా అనుమతించరు. మరి ఇది ఇతని దేహము కదా.

తండ్రి స్వయం మధ్యవర్తిగా అయి అంటున్నారు - ఇప్పుడు మీ ఆ బంధము క్యాన్సల్ అయ్యింది. కామ చితిపై నుండి దిగి ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చోండి. కామ చితి నుండి దిగండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇతర మనుష్యులెవరూ ఈ విధంగా చెప్పలేరు. మనుష్యులను భగవంతుడు అని కూడా అనరు. తండ్రియే పతిత-పావనుడు అని పిల్లలైన మీకు తెలుసు. వారే వచ్చి కామ చితిపై నుండి దించి జ్ఞాన చితిపై కూర్చోబెడతారు. వారు ఆత్మిక తండ్రి. వారు ఇతనిలో కూర్చుని చెప్తున్నారు - మీరు కూడా ఆత్మయే, ఇతరులకు కూడా ఇదే అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రి అంటున్నారు - మన్మనాభవ. మన్మనాభవ అని అనడముతోనే స్మృతి వచ్చేస్తుంది. ఈ పాత ప్రపంచపు వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది మహా భారీ మహాభారత యుద్ధము. వారంటారు, యుద్ధమైతే విదేశాలలో కూడా జరుగుతుంది కదా, మరి దీనిని మహాభారత యుద్ధము అని ఎందుకు అంటారు? ఎందుకంటే భారత్ లోనే యజ్ఞము రచింపబడి ఉంది, దీని నుండే వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. మీ కొరకు కొత్త ప్రపంచము కావాలి కావున మధురమైన పిల్లలూ, పాత ప్రపంచ వినాశనము తప్పకుండా జరగవలసిందే. కావున ఈ యుద్ధము యొక్క వేర్లు ఇక్కడి నుండే వెలువడుతాయి. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారా మహాభారీ యుద్ధము, వినాశన జ్వాల ప్రజ్వలితమయ్యింది. శాస్త్రాలలో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి కానీ వీటిని ఎవరు చెప్పారు అనేది తెలియదు. ఇప్పుడు తండ్రి కొత్త ప్రపంచము కొరకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు రాజ్యాన్ని తీసుకుంటారు, మీరు దేవీ-దేవతలుగా అవుతారు. మీ రాజ్యములో ఇతరులెవ్వరూ ఉండకూడదు. ఆసురీ ప్రపంచము వినాశనమవుతుంది. బుద్ధిలో గుర్తుండాలి - నిన్న మనము రాజ్యము చేసాము, తండ్రి రాజ్యాన్ని ఇచ్చారు, మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి ఉన్నారు. పిల్లలైన మీలో ఈ జ్ఞానమైతే ఉంది కదా. తండ్రి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. దైవీ ధర్మము యొక్క స్థాపన జరిగినప్పుడు మిగిలిన ఆసురీ ప్రపంచమంతటి వినాశనమవుతుంది. ఈ తండ్రి కూర్చుని బ్రహ్మా ద్వారా అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మా కూడా శివుని సంతానము, బ్రహ్మాయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మాగా అవుతారు అని విష్ణువు గురించిన రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. మనము బ్రాహ్మణులుగా ఉన్నాము, తర్వాత దేవతలుగా అవుతాము, అలా 84 జన్మలు తీసుకుంటాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రియే కావున మనుష్యులెవరి ద్వారానైనా ఈ జ్ఞానము ఎలా లభిస్తుంది? ఇందులో అంతా బుద్ధికి సంబంధించిన విషయము ఉంది. తండ్రి అంటారు, మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధిని తెంచండి. బుద్ధియే పాడవుతుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. గృహస్థ వ్యవహారములో ఉండండి, కానీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. మేము చదువుకుని ఈ విధంగా అవుతాము అని తెలుసు. మీ చదువు సంగమయుగములో చదువుకునేది. ఇప్పుడు మీరు ఇటువైపూ లేరు, అటువైపూ లేరు. మీరు బయట ఉన్నారు. తండ్రిని నావికుడు అని కూడా అంటారు, మా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు కూడా. దీనిపై ఒక కథ కూడా తయారై ఉంది. కొందరు నడుస్తూ ఉంటారు, కొందరు ఆగిపోతారు. ఇప్పుడు తండ్రి అంటారు - నేను కూర్చుని ఈ బ్రహ్మా ముఖము ద్వారా వినిపిస్తాను. బ్రహ్మా ఎక్కడి నుండి వచ్చారు? ప్రజాపిత అయితే తప్పకుండా ఇక్కడే కావాలి కదా. నేను వీరిని దత్తత తీసుకుంటాను, వీరికి కూడా పేరు పెడతాను. మీరు కూడా బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు, మీరు కలియుగ అంతిమములో ఉన్నారు, మళ్ళీ మీరే సత్యయుగ ఆదిలోకి వెళ్తారు. మీరే మొట్టమొదట తండ్రి నుండి విడిపోయి పాత్రను అభినయించడానికి వచ్చారు. మనలో కూడా అందరూ ఆ విధంగా అనరు కదా. ఎవరు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు అనేది కూడా తెలిసిపోతుంది! ఈ లక్ష్మీ-నారాయణుల విషయములోనైతే గ్యారంటీ ఉంది కదా. వీరి గురించే శ్యామ-సుందరుడు అన్న గాయనము ఉంది. దేవీ-దేవతలు సుందరముగా ఉండేవారు, వారు నల్లని వారి నుండి సుందరముగా అయ్యారు. పల్లెటూరి బాలుడి నుండి మారి సుందరముగా అవుతారు, ఈ సమయములో అందరూ అనాథ బాలురు, బాలికలు. ఇది అనంతమైన విషయము, దీని గురించి ఎవరికీ తెలియదు. ఎంత మంచి-మంచి వివరణలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సర్జన్ ఒక్కరే. వీరు అవినాశీ సర్జన్.

యోగాన్ని అగ్ని అని అంటారు ఎందుకంటే యోగము ద్వారానే ఆత్మలోని మాలిన్యము తొలగుతుంది. యోగాగ్ని ద్వారా తమోప్రధాన ఆత్మ సతోప్రధానముగా అవుతుంది. ఒకవేళ అగ్ని చల్లబడిపోతే మాలిన్యము తొలగదు. స్మృతిని యోగాగ్ని అని అంటారు, దాని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి అంటారు, మీకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటాను. మరి ధారణ కూడా జరగాలి కదా. అచ్ఛా, మన్మనాభవ, ఇందులోనైతే అలసిపోకూడదు కదా. తండ్రిని స్మృతి చేయడం కూడా మర్చిపోతారు. పతులకే పతి అయిన వీరు మిమ్మల్ని జ్ఞానముతో ఎంతగా అలంకరిస్తారు. నిరాకారుడైన తండ్రి అంటారు - మిగిలిన వారందరి నుండి బుద్ధియోగాన్ని తెంచి మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. తండ్రి అందరికీ ఒక్కరే. మీది ఇప్పుడు ఎక్కే కళ. నీవు ఉన్నతిలోకి వెళ్ళే సమయములో సర్వులకు మేలు జరుగుతుంది అని అంటారు కదా. తండ్రి అందరికీ మేలు చేయడానికి వచ్చారు. రావణుడైతే అందరినీ దుర్గతిలోకి తీసుకువెళ్తాడు, రాముడు అందరినీ సద్గతిలోకి తీసుకువెళ్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి స్మృతితో అపారమైన సుఖాలను అనుభవం చేసేందుకు బుద్ధి లైను స్పష్టముగా ఉండాలి. స్మృతి ఎప్పుడైతే అగ్ని రూపాన్ని దాలుస్తుందో, అప్పుడు ఆత్మ సతోప్రధానముగా అవుతుంది.

2. తండ్రి గవ్వలకు బదులుగా రత్నాలను ఇస్తారు. ఇటువంటి భోళానాథుడైన తండ్రి నుండి తమ జోలిని నింపుకోవాలి. శాంతిలో ఉండేటువంటి చదువును చదువుకుని సద్గతిని ప్రాప్తి చేసుకోవాలి.

వరదానము:-
మాయ బంధనాల నుండి సదా నిర్బంధనులుగా ఉండే యోగయుక్త, బంధనముక్త భవ

బంధనముక్తులకు గుర్తు సదా యోగయుక్తముగా ఉండడము. యోగయుక్తులైన పిల్లలు, బాధ్యతల బంధనాల నుండి మరియు మాయ యొక్క బంధనాల నుండి విముక్తులుగా ఉంటారు. మనస్సు యొక్క బంధనము కూడా ఉండకూడదు. లౌకిక బాధ్యత అనేది ఆట వంటిది, అందుకే డైరెక్షన్ అనుసారముగా ఆటలా భావిస్తూ నవ్వుకుంటూ ఆడినట్లయితే ఎప్పుడూ చిన్న-చిన్న విషయాలలో అలసిపోరు. ఒకవేళ బంధనముగా భావించినట్లయితే విసుగు చెందుతారు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కానీ బాధ్యత తండ్రిది, మీరు నిమిత్తులు - ఈ స్మృతితో బంధనముక్తులుగా అయినట్లయితే యోగయుక్తులుగా అవుతారు.

స్లోగన్:-
చేసేవారు, చేయించేవారు అనే స్మృతితో భానాన్ని మరియు అభిమానాన్ని సమాప్తము చేయండి.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను అలవరచుకోండి

అపవిత్రత అంటే కేవలము ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వటము లేక పాప కర్మ చెయ్యటము అని కాదు కానీ స్వయములో సత్యత, స్వచ్ఛతలను ఒకవేళ విధి పూర్వకముగా అనుభవము చేసినట్లయితే పవిత్రముగా ఉన్నట్లు. ఒక సామెత ఉంది కదా - సత్యము యొక్క నావ మునగదు కానీ ఊగిసలాడుతుంది అని. కనుక విశ్వాసమనే నావ - సత్యత మరియు నిజాయితీ, అది ఊగిసలాడుతుంది కానీ మునగదు, అందుకే సత్యత యొక్క ధైర్యముతో పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తులుగా అవ్వండి.