20-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉంటున్నాను, దేహీ-అభిమానీ స్థితి ఎంత సమయము ఉంటుంది?’’

ప్రశ్న:-
తండ్రి యొక్క ఏ డైరెక్షన్ ను భాగ్యశాలీ పిల్లలు మాత్రమే పాలన చేస్తారు?

జవాబు:-
తండ్రి డైరెక్షన్ ఏమిటంటే - మధురమైన పిల్లలూ, ఆత్మాభిమానీ భవ. ఆత్మలైన మీరంతా మేల్ (పురుష్), అంతేకానీ ఫీమేల్ (స్త్రీ) కాదు. ఆత్మలైన మీలోనే మొత్తము పాత్ర అంతా నిండి ఉంది. మేము దేహీ-అభిమానులుగా ఎలా ఉండాలి అన్న కృషిని మరియు అభ్యాసమునే ఇప్పుడు చేయండి. ఇదే ఉన్నతమైన గమ్యము.

పాట:-
భాగ్యాన్ని మేలుకొలుపుకుని వచ్చాను...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. మేము కొత్త ప్రపంచపు భాగ్యాన్ని అనగా స్వర్గ భాగ్యాన్ని తయారుచేసుకుని ఆత్మిక తండ్రి వద్ద కూర్చున్నామని ఆత్మిక పిల్లలు అనగా జీవాత్మలు అన్నారు. ఇప్పుడు పిల్లలు ఆత్మిక-అభిమానులుగా అనగా ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇదే అన్నింటికంటే పెద్ద కృషి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకున్నాను అని భావించండి. ఒకసారి బ్యారిస్టరుగా, ఒకసారి ఒకలా, మరొకసారి మరోలా అయ్యాను. ఆత్మ మేల్ (పురుష్), పరస్పరము అందరూ సోదరులు, అంతేకానీ సోదరీలు కాదు. ఇది నా శరీరము అని ఆత్మ అంటుంది, ఆ లెక్కలో ఆత్మ మేల్ (పురుష్), ఈ శరీరము ఫీమేల్ (స్త్రీ) అయినట్లు. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తండ్రి చాలా విశాలబుద్ధి కలవారిగా, సూక్ష్మబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకున్నాను - అని ఇప్పుడు మీకు తెలుసు. మంచి లేక చెడు సంస్కారాలనేవి ఆత్మలోనే ఉంటాయి. ఆ సంస్కారాల అనుసారముగా శరీరము కూడా అటువంటిదే లభిస్తుంది. మొత్తమంతా ఆత్మపైనే ఆధారపడి ఉంటుంది. ఇది చాలా పెద్ద కృషి. జన్మజన్మలుగా లౌకిక తండ్రిని స్మృతి చేసారు, ఇప్పుడు పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఘడియ-ఘడియ ఆత్మగా భావించాలి. ఆత్మలమైన మనము ఈ శరీరాలను తీసుకుంటాము. ఇప్పుడు ఆత్మలమైన మనల్ని తండ్రి చదివిస్తారు. ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని ఆత్మిక తండ్రి ఇస్తారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయమేమిటంటే - పిల్లలు దేహీ-అభిమానులుగా అయి ఉండాలి. దేహీ-అభిమానులుగా అయి ఉండటము, ఇది ఎంతో ఉన్నతమైన గమ్యము. జ్ఞానము ఉన్నతమైనది కాదు. జ్ఞానములో కృషి ఏమీ లేదు. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడము - ఇది చరిత్ర-భౌగోళికము. ఉన్నతోన్నతమైనవారు తండ్రి, ఆ తర్వాత సూక్ష్మవతనములోని దేవతలు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలైతే మనుష్య సృష్టిలో ఉంటాయి. మూలవతనము, సూక్ష్మవతనములో చరిత్ర-భౌగోళికాలేవీ ఉండవు. అది శాంతిధామము. సత్యయుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. ఇక్కడ రావణ రాజ్యములో ఎవరికీ శాంతి లభించదు.

ఆత్మనైన నేను శాంతిధామ నివాసిని అన్న జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. ఈ ఇంద్రియాలు కర్మలు చేయడం కోసం ఉన్నాయి. కర్మలు చేయవచ్చు, చేయకపోవచ్చు. నేను ఒక ఆత్మను, నా స్వధర్మము శాంతి. మనము కర్మయోగులము కదా. కర్మలు కూడా తప్పకుండా చేయాలి. కర్మ-సన్యాసులుగా ఎప్పుడూ అవ్వలేరు. అది కూడా ఆ సన్యాసుల పాత్ర. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదలి వెళ్తారు, భోజనము వండుకోరు, గృహస్థులను భిక్షము యాచిస్తారు, అంటే ఎంతైనా ఆ గృహస్థుల వద్దనే తింటున్నారు కదా. ఇళ్ళు-వాకిళ్ళను వదిలినా, ఎంతైనా కర్మలనైతే చేస్తున్నారు. కర్మ-సన్యాసులుగా అవ్వలేరు. ఆత్మ శాంతిధామములో ఉన్నప్పుడు కర్మ సన్యాసము జరుగుతుంది. అక్కడ కర్మేంద్రియాలే ఉండవు కనుక కర్మలు ఎలా చేస్తారు, దీనిని కర్మక్షేత్రమని అంటారు. కర్మక్షేత్రముపైకి అందరూ రావలసి ఉంటుంది. అది శాంతిధామము లేక మూలవతనము. బ్రహ్మతత్వములో ఆత్మ లీనమవుతుందని కాదు. ఆత్మలు శాంతిధామములో నివసిస్తాయి, ఆ తర్వాత పాత్రను అభినయించడానికి ఇక్కడ కర్మక్షేత్రముపైకి వస్తాయి. ఇవి విస్తారమైన విషయాలు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయని సారములో చెప్తున్నారు. దీనినే భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటారు. వాస్తవానికి దీనిని యోగమని కూడా అనకూడదు, స్మృతి అని అనాలి, ఇది శ్రమతో కూడుకున్నది. యోగులుగా చాలా తక్కువమంది అవుతారు. ముందు యోగము యొక్క శిక్షణ అవసరము, ఆ తర్వాత జ్ఞానము. మొట్టమొదటిది తండ్రి స్మృతి.

తండ్రి అంటారు - దేహీ-అభిమానీ భవ, ఇది ఆత్మిక స్మృతి యాత్ర. ఇది జ్ఞాన యాత్ర కాదు, ఇందులో చాలా శ్రమించవలసి ఉంటుంది. కొందరు బి.కె.లుగా చెప్పుకుంటారు కానీ తండ్రిని స్మృతి చేయరు. తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా పిల్లలైన మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. ఇతను (బ్రహ్మా) దేహాభిమానిగా ఉండేవారు. ఇప్పుడు వీరి ద్వారా దేహీ-అభిమానిగా అయ్యే పురుషార్థము జరుగుతుంది. బ్రహ్మా భగవంతుడేమీ కారు. ఇక్కడైతే మనుష్యమాత్రులందరూ పతితముగా ఉన్నారు. పావనమైన శ్రేష్ఠాచారులు ఒక్కరు కూడా లేరు. పుణ్యాత్మ, పాపాత్మ అని ఆత్మ గురించే చెప్పడము జరుగుతుంది. నా ఆత్మను విసిగించవద్దు అని మనుష్యులు కూడా అంటారు. కానీ నేను ఎవరు అన్నది అర్థం చేసుకోరు. ఓ జీవాత్మ, నీవు ఏమి పని చేస్తున్నావు అని అడగడము జరుగుతుంది. ఆత్మనైన నేను ఈ శరీరము ద్వారా ఫలానా వ్యాపారాన్ని చేస్తున్నానని అంటారు. కనుక మొట్టమొదట ఇది నిశ్చయము చేసుకుని తండ్రిని స్మృతి చేయండి. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి వచ్చి దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. జ్ఞానములో ఎవరైనా చురుకుగా మందుకు వెళ్తుంటే, వారు పక్కా దేహీ-అభిమానులుగా అయ్యారని కాదు. ఎవరైతే జ్ఞానాన్ని మంచి రీతిలో ధారణ చేస్తారో, వారు దేహీ-అభిమానులు. ఇకపోతే జ్ఞానాన్ని మంచి రీతిలో అర్థం చేసుకున్నవారు చాలామంది ఉన్నారు, కానీ శివబాబా స్మృతిని మర్చిపోతున్నారు. ఘడియ-ఘడియ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, ఇందులో జిన్ను వలె తయారవ్వాలి. జిన్ను కథ ఉంది కదా. తండ్రి కూడా ఈ పని ఇస్తున్నారు - నన్ను స్మృతి చేయండి, లేదంటే మాయ మిమ్మల్ని తినేస్తుంది. మాయ జిన్ను వంటిది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి మరియు మీకు చాలా ఆకర్షణ కలుగుతుంది. మాయ మిమ్మల్ని తలకిందులుగా చేసి చాలా తుఫానుల్లోకి తీసుకువస్తుంది. ఆత్మలమైన మనము ఆ తండ్రి పిల్లలమని బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి. అంతే, ఈ సంతోషములో ఉండాలి.

దేహాభిమానములోకి రావడముతో మాయ చెంపదెబ్బ వేస్తుంది. హాతిమతాయి ఆటను కూడా చూపిస్తారు. నోటిలో నాణెము వేసుకోగానే సమస్య దూరమైపోతుంది. అలాగే ఒకవేళ తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే, మిమ్మల్ని కూడా మాయ విసిగించదు. ఈ విషయములోనే యుద్ధము నడుస్తుంది. మీరు స్మృతి చేసేందుకు పురుషార్థము చేస్తారు కానీ మాయ ఏ విధముగా ముక్కు పట్టుకుంటుంది అంటే, అది స్మృతి చేయనివ్వదు, మీరు విసిగిపోయి నిద్రపోతారు. అంతగా మాయతో యుద్ధము నడుస్తుంది. ఇకపోతే ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు అయితే చాలా సాధారణమైనవి. ఇప్పుడు మా 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు మేము బాబాను కలుసుకునేందుకు వెళ్తాము అని భావించండని మీకు ఘడియ-ఘడియ చెప్పడము జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవడమే కష్టము. ఇకపోతే, ఎవరికైనా అర్థం చేయించడము కష్టమేమీ కాదు. అలాగని మేము చాలా బాగా అర్థం చేయిస్తాము కదా అని కాదు. అలా కాదు, స్మృతియే మొట్టమొదటి విషయము. ప్రదర్శనీలకు ఎంతోమంది వస్తారు. మొట్టమొదట ఈ పాఠాన్ని వారికి నేర్పించాలి - స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని తండ్రిని స్మృతి చేసినట్లయితే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. ముందు ఈ పాఠాన్నే చెప్పాలి. భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని ఎవరూ నేర్పించలేరు. తండ్రి ఎప్పుడైతే వచ్చి నేర్పిస్తారో, అప్పుడే నేర్చుకోగలరు. మనుష్యులు మనుష్యులకు రాజయోగాన్ని నేర్పించలేరు, అది అసాధ్యము. సత్యయుగములోనైతే పావనమైనవారే ఉంటారు, అక్కడ ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ జ్ఞానము-అజ్ఞానము యొక్క విషయాలే ఉండవు. మీరు వచ్చి దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని భక్తి మార్గములోనే తండ్రిని పిలుస్తారు. సత్య, త్రేతాయుగాలలో గురువులు మొదలైనవారెవరూ ఉండరు. అక్కడ సద్గతిని పొంది ఉంటారు. మీరు సద్గతి యొక్క వారసత్వాన్ని 21 జన్మల కోసం పొందగలరు, 21 తరాల కోసం. బ్రహ్మాకుమారి అనగా 21 తరాలను ఉద్ధరించేవారు అని అంటారు. భారత్ లోనే ఈ విధముగా అంటూ ఉంటారు. భారత్ లోనే మీకు 21 తరాల వారసత్వము లభిస్తుంది. అక్కడ మీరు ఒక్క దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా మాత్రమే ఉంటారు, వేరే ధర్మమేదీ ఉండదు. తండ్రి వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. పవిత్రముగా అవ్వకుండా మనము తిరిగి ఎలా వెళ్ళగలము. ఇక్కడైతే అందరూ వికారులుగా, పతితులుగా ఉన్నారు. ధర్మ స్థాపకులు ఎవరైతే ఉన్నారో, వారు పాలన చేస్తారు, వారి ధర్మము వృద్ధి చెందుతూ ఉంటుంది. తిరిగి ఎవరూ వెళ్ళలేరు. పాత్రధారులు ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అందరూ సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి రావాల్సిందే. బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి అని బ్రహ్మాను గురించి కూడా అంటారు. అంటే సృష్టిలో బ్రహ్మా ఒక్కరే ఉంటారా ఏమిటి? ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అవుతున్నారు. మీరు రాత్రిలో ఉండేవారు, ఇప్పుడు పగలులోకి వెళ్తున్నారు.

పూజ్యులుగా ఎంత సమయము ఉంటారు, పూజారులుగా ఎన్ని జన్మలు అవుతారు అనేది మీకు అర్థం చేయించారు. తండ్రి ఎప్పటివరకైతే రారో, అప్పటివరకు ఎవరూ భ్రష్టాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా అవ్వలేరు. ఎవరైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారో, వారిని భ్రష్టాచారులని అంటారు, అందుకే దీనిని నరకము అని అంటారు. నరకము మరియు స్వర్గము - ఒకవేళ రెండింటిలోనూ దుఃఖము ఉన్నట్లయితే, ఇక దానిని స్వర్గము అనే అనకూడదు. ఎప్పటివరకైతే పూర్తిగా అర్థం చేసుకోరో, అప్పటివరకు వ్యతిరేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. భారత్ చాలా ఉన్నతముగా ఉండేదని మీరు అర్థం చేయించాలి. ఏ విధముగా ఈశ్వరుని మహిమ అపారమైనదో, అదే విధముగా భారత్ యొక్క మహిమ కూడా అపారమైనది. భారత్ ఎలా ఉండేది, ఆ విధముగా ఎవరు తయారుచేసారు? తండ్రి తయారుచేసారు. వారి మహిమను పాడుతారు. తండ్రియే వచ్చి పిల్లలను విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు, మనుష్యమాత్రులను దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకువెళ్తారు, శాంతిధామానికి తీసుకువెళ్తారు, దాని కోసమే మనుష్యులు పురుషార్థము చేస్తారు. దానినే సంపూర్ణ సుఖము, సంపూర్ణ శాంతి, సంపూర్ణ పవిత్రత అని అంటారు. అక్కడ మీరు సుఖములో కూడా ఉంటారు, శాంతిలో కూడా ఉంటారు. మిగిలిన ఆత్మలు శాంతిలో ఉంటారు. అందరికంటే ఎక్కువ జన్మలు మీరు తీసుకుంటారు. మిగిలినవారు ఎవరైతే అందరికంటే తక్కువ జన్మలు తీసుకుంటారో, వారు సంపూర్ణ శాంతిలో ఉంటారు. వారు దోమల వలె వస్తారు, ఒకటి-అర జన్మ పాత్రను అభినయిస్తారు, ఇదేమిటి? వారికి ఏ విలువ ఉండదు. దోమలకు ఏమి విలువ ఉంటుంది. రాత్రివేళ జన్మిస్తాయి, రాత్రివేళే మరణిస్తాయి. ఈ సమయములో చాలావరకు శాంతినే కోరుకుంటారు ఎందుకంటే ఈ సమయములోని గురువులు శాంతిలోకి వెళ్ళేటటువంటివారు.

మీరు ఇక్కడకు స్వర్గవాసులుగా అవ్వడానికి వచ్చారు. స్వర్గవాసులను శాంతివాసులని అనరు. శాంతివాసులు అని నిరాకారీ లోకములో ఉండేవారిని అంటారు. ముక్తి అనే పదాన్ని గురువుల నుండి నేర్చుకుంటారు. వైకుంఠపురికి వెళ్ళేందుకు మాతలు వ్రతాలు, నోములు చేస్తారు. ఎవరైనా మరణించినా కూడా, స్వర్గస్థులయ్యారని అంటారు. అలా ఎవరూ స్వర్గస్థులవ్వరు కానీ భారతవాసులు స్వర్గాన్నే నమ్ముతారు. భారత్ ప్యారడైజ్ గా (స్వర్గముగా) ఉండేదని భావిస్తారు. శివబాబా భారత్ లోనే వచ్చి, స్వర్గ రచనను రచిస్తారు కావున తప్పకుండా ఇక్కడే రచిస్తారు, వారు స్వర్గములోకైతే రారు. నేను స్వర్గము మరియు నరకము యొక్క సంగమములో వస్తానని వారు అంటారు. వారు కల్ప-కల్పము యొక్క సంగమములో వస్తారు. కానీ వారు ప్రతి యుగములోనూ వస్తారని వ్రాసేసారు. కల్పము అన్న పదాన్ని మర్చిపోయారు. ఇది కూడా తయారుచేయబడిన ఆట, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈ అంతిమ జన్మలో మీరు తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. స్థాపన ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు నంబరువారుగా తెలుసు. ఈ ఆటంతా భారతవాసులైన మీపైనే తయారుచేయబడింది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటారు. తండ్రి స్మృతి ద్వారానే రాజ్యాన్ని పొందుతారు. చిత్రాలు కూడా ఉన్నాయి కదా. ఈ చిత్రాలన్నింటినీ ఎవరు తయారుచేసారు! వీరికి గురువు ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా గురువు ఉన్నా కూడా, ఆ గురువుకు ఒకే శిష్యుడు ఉండరు, అనేకమంది ఉంటారు కదా. ఈ జ్ఞానము ఒక్క తండ్రికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఈ చిత్రాలను మీ దాదా తయారుచేయించారా అని చాలామంది అడుగుతారు. వీటిని తండ్రి దివ్యదృష్టి ద్వారా సాక్షాత్కారము చేయించారు. వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారము చేయించారు. అక్కడ స్కూలు ఎలా నడుస్తుంది, ఏ భాష ఉంటుంది, అన్ని సాక్షాత్కారాలు జరిగాయి. పిల్లలు భట్టీలో ఉండేటప్పుడు బాబా పిల్లలను ఆహ్లాదపరిచేవారు. కరాచీలో కేవలం మీరు మాత్రమే వేరుగా ఉండేవారు, అది మీ రాజ్యము వలె ఉండేది. మీ తపన, మీ భాష... ఇంకెవరూ అర్థం చేసుకోలేకపోయేవారు. ఇది ఖుదా యొక్క సభ అని అనుకునేవారు. బాబా అర్థం చేయించారు - మీరు నన్స్. నన్ బట్ ఒన్. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు. ఆ నన్స్ కు క్రైస్టు మాత్రమే తెలుసు, క్రైస్టు తప్ప ఇంకెవరూ తెలియదు.

వారసత్వము ఒక్క శివబాబా నుండే లభిస్తుందని మీకు తెలుసు. శివబాబా అయితే బిందువు. వారు కూడా ఎవరి ద్వారానో అర్థం చేయిస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు. తండ్రి అంటారు, వీరి అనేక జన్మల అంతిమ జన్మలో పతిత శరీరములో ప్రవేశిస్తాను. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానాన్ని మంచి రీతిలో ధారణ చేసి దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఇదే శ్రమతో కూడుకున్నది. ఇదే ఉన్నతమైన గమ్యము. ఈ కృషితో ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకోవాలి.

2. జిన్ను భూతములా అయి స్మృతియాత్ర చేయాలి. మాయ ఎన్ని విఘ్నాలను కలిగించినా కానీ నోటిలో నాణెము వేసుకోవాలి. మాయతో విసిగిపోకూడదు. ఒక్కరి స్మృతిలో ఉంటూ తుఫానులను తొలగించుకోవాలి.

వరదానము:-
సాధనాలను ఉపయోగిస్తూ సాధనను తమ ఆధారముగా చేసుకునే సిద్ధి స్వరూప భవ

పాత ప్రపంచములోని ఏ ఆకర్షణీయ దృశ్యాన్ని చూసినా, అల్పకాలిక సుఖాన్ని ఇచ్చే సాధనాలను ఉపయోగించినా లేక చూసినా, ఆ సాధనాలకు వశీభూతులైపోతారు. సాధనాల ఆధారముగా చేసే సాధన ఎలా ఉంటుందంటే, ఇసుక పునాదిపై బిల్డింగ్ ఉన్నట్లుగా ఉంటుంది, అందుకే అవినాశీ సాధన అనేది ఏ వినాశీ సాధనము ఆధారముపైనా ఉండకూడదు. సాధనాలు నిమిత్తమాత్రము మరియు సాధన అనేది నిర్మాణానికి ఆధారము, అందుకే సాధనకు మహత్వము ఇచ్చినట్లయితే సాధన సిద్ధిని ప్రాప్తి చేయిస్తుంది.

స్లోగన్:-
ఏ బలహీనత యొక్క అంశము ఉన్నా వంశము ఉత్పన్నమవుతుంది మరియు పరవశులుగా చేస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

బుద్ధిని ఒకే చోట నిలిపి ఉంచేందుకు ఏ యుక్తి అయితే లభించిందో, దానిని గుర్తుంచుకోండి, దానిని కదలనివ్వకండి. దేహము మరియు దేహపు ప్రపంచము నుండి అతీతులుగా అయ్యి మనసు-బుద్ధి అనే విమానము ద్వారా సెకండ్ లో ఆకారీ మరియు నిరాకారీ స్థితులను అనుభవము చేయండి. బుద్ధిని కదలనివ్వకండి, లేదంటే యుద్ధములో చాలా సమయము వ్యర్థమైపోతుంది. ఏ విధముగా తపస్వీలు సదా ఆసనముపై కూర్చుని ఉంటారో, అదే విధముగా మీ ఏకరస స్థితి అనే ఆసనముపై విరాజమానమై ఉండండి, అప్పుడు భవిష్య సింహాసనము లభిస్తుంది.