20-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలు - ఇప్పుడిక పిడికెడు శనగలు వెనుక మీ సమయాన్ని వృధా చేసుకోకండి, ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అయి తండ్రి పేరును ప్రఖ్యాతము చేయండి’’ (విశేషముగా కుమారీల కోసము)

ప్రశ్న:-
ఈ జ్ఞాన మార్గములో మీ అడుగులు ముందుకు వెళ్తున్నాయి అనడానికి గుర్తులు ఏమిటి?

జవాబు:-
ఏ పిల్లలకైతే శాంతిధామము మరియు సుఖధామము సదా గుర్తుంటాయో, స్మృతి చేసే సమయములో బుద్ధి ఎటువైపుకూ భ్రమించదో, బుద్ధిలో వ్యర్థమైన ఆలోచనలు రావో, బుద్ధి ఏకాగ్రముగా ఉంటుందో, కునికిపాట్లు పడరో, సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉంటుందో... దీనితో వారి అడుగులు ముందుకు వెళ్తున్నాయి అన్నది నిరూపించబడుతుంది.

ఓంశాంతి
పిల్లలు ఇంత సమయము ఇక్కడ కూర్చొని ఉన్నారు. మేము శివాలయములో కూర్చుని ఉన్నట్లుగా ఉంది అని మనసుకు కూడా అనిపిస్తుంది. శివబాబా కూడా స్మృతిలోకి వస్తారు, స్వర్గము కూడా స్మృతిలోకి వస్తుంది. స్మృతి ద్వారానే సుఖము లభిస్తుంది. మేము శివాలయములో కూర్చున్నాము అన్నది బుద్ధిలో స్మృతి ఉన్నా కూడా సంతోషము కలుగుతుంది. చివరికైతే అందరూ శివాలయములోకి వెళ్ళాల్సిందే. శాంతిధామములో ఎవ్వరూ కూర్చుండిపోయేది లేదు. వాస్తవానికి శాంతిధామాన్ని కూడా శివాలయము అని అంటారు, సుఖధామాన్ని కూడా శివాలయము అని అంటారు. రెండింటినీ స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు స్మృతి కూడా రెండింటినీ చేయాలి. ఆ శివాలయము శాంతి కొరకు మరియు ఈ శివాలయము సుఖము కొరకు ఉన్నాయి. ఇది దుఃఖధామము. ఇప్పుడు మీరు సంగమములో కూర్చొని ఉన్నారు. శాంతిధామము మరియు సుఖధామము తప్ప ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. ఎక్కడ కూర్చొని ఉన్నా కానీ, వ్యాపార-వ్యవహారాలలో కూర్చొని ఉన్నా కానీ, బుద్ధిలో మాత్రం రెండు శివాలయాలు గుర్తుకురావాలి, దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఈ వేశ్యాలయము, దుఃఖధామము ఇప్పుడు అంతమవ్వనున్నదని పిల్లలకు తెలుసు.

ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు పిల్లలైన మీకు కునికిపాట్లు మొదలైనవి కూడా రాకూడదు. చాలామంది బుద్ధి ఎక్కడెక్కడికో ఇతర వైపులకు వెళ్ళిపోతుంది. మాయ విఘ్నాలు కలుగుతాయి. పిల్లలైన మీకు తండ్రి ఘడియ-ఘడియ చెప్తారు - పిల్లలూ, మన్మనాభవ. వారు రకరకాల యుక్తులను కూడా తెలియజేస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో గుర్తుంచుకోండి - మేము మొదట శాంతిధామమైన శివాలయములోకి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామములోకి వస్తాము. ఈ విధంగా స్మృతి చేయడం ద్వారా పాపాలు అంతమవుతూ ఉంటాయి. ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా అడుగులు ముందుకు వేస్తారు. ఇక్కడ ఇంకే ఇతర ఆలోచనల్లో కూర్చోకూడదు, లేకపోతే మీరు ఇతరులకు నష్టాన్ని కలిగిస్తారు. లాభానికి బదులుగా ఇంకా నష్టపరచుకుంటారు. పూర్వము కూర్చునేటప్పుడు - ఎవరెవరు కునికిపాట్లు పడుతున్నారు, ఎవరెవరు కళ్ళు మూసుకుని కూర్చున్నారు అన్నది చెక్ చేయడానికి ఎదురుగా ఎవరినైనా కూర్చోబెట్టేవారు, అందుకే చాలా జాగ్రత్తగా ఉండేవారు. తండ్రి కూడా చూసేవారు - వీరి బుద్ధియోగము ఎక్కడైనా భ్రమిస్తుందా లేక కునికిపాట్లు ఏమైనా పడుతున్నారా? ఏమీ అర్థం చేసుకోనివారు కూడా ఎంతోమంది వస్తారు. బ్రాహ్మణీలు తీసుకువస్తారు. శివబాబా ఎదురుగా చాలా మంచి పిల్లలు ఉండాలి, వారు నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఎందుకంటే వీరు సామాన్యమైన టీచర్ కారు. తండ్రి కూర్చొని నేర్పిస్తారు. ఇక్కడ చాలా అప్రమత్తులై కూర్చోవాలి. బాబా 15 నిమిషాలు శాంతిలో కూర్చోబెడతారు. మీరైతే గంట, రెండు గంటలు కూర్చుంటారు. అందరూ మహారథులు కారు. ఎవరైతే అపరిపక్వంగా ఉన్నారో, వారిని అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేయడం ద్వారా సుజాగృతులు అవుతారు. ఎవరైతే స్మృతిలో ఉండరో, వ్యర్థమైన ఆలోచనలను నడిపిస్తూ ఉంటారో, వారు విఘ్నాలు కలిగిస్తున్నట్లే, ఎందుకంటే బుద్ధి ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. మహారథులు, గుర్రపు స్వారీవారు, పాదచారులు అందరూ కూర్చున్నారు.

బాబా ఈ రోజు విచార సాగర మంథనము చేసి వచ్చారు - మ్యూజియంలో లేక ప్రదర్శనీలో పిల్లలైన మీరు శివాలయము, వేశ్యాలయము మరియు పురుషోత్తమ సంగమయుగము, ఈ మూడింటి గురించి ఏదైతే తెలియజేస్తారో, ఇది అర్థం చేయించడానికి చాలా బాగుంటుంది. ఈ చిత్రాలను చాలా పెద్ద-పెద్దగా తయారుచేయాలి. అన్నింటి కంటే పెద్ద మంచి హాల్ వీటి కోసమే ఉండాలి, తద్వారా మనుష్యుల బుద్ధిలో ఈ విషయాలు వెంటనే కూర్చోగలిగేలా ఉండాలి. దీనిని మేము ఇంకా ఏ విధంగా మెరుగుపర్చవచ్చు అని పిల్లలకు ఆలోచన నడవాలి. పురుషోత్తమ సంగమయుగాన్ని చాలా బాగా తయారుచేయాలి. తద్వారా మనుష్యులకు చాలా మంచి వివరణ లభించగలదు. తపస్యలో కూడా మీరు 5-6 మంది కూర్చున్నట్లు చూపిస్తారు, అలా కాదు, 10-15 మంది తపస్యలో కూర్చున్నట్లు చూపించాలి. పెద్ద-పెద్ద చిత్రాలను తయారుచేసి స్పష్టమైన అక్షరాలతో వ్రాయాలి. మీరు ఎంతగానో అర్థం చేయిస్తారు, అయినా కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీరు అర్థం చేయించడానికి కష్టపడతారు, కానీ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు కదా. కావున ఎంత వీలైతే అంత మంచి రీతిలో అర్థం చేయించాలి. ఎవరైతే సేవలో ఉంటారో వారు సేవ పెంచడానికి ఆలోచించాలి. ఎంతగానైతే మ్యూజియంలో మజా ఉంటుందో, అంతగా ప్రొజెక్టర్, ప్రదర్శనీలలో ఉండదు. ప్రొజెక్టర్ ద్వారానైతే ఏమీ అర్థం చేసుకోరు. అన్నింటికన్నా బాగుండేది మ్యూజియం, చిన్నదైనా పర్వాలేదు. ఒక గదిలోనైతే ఈ శివాలయము, వేశ్యాలయము మరియు పురుషోత్తమ సంగమయుగము యొక్క దృశ్యము ఉండాలి. అర్థం చేయించడానికి చాలా విశాల బుద్ధి ఉండాలి.

అనంతమైన తండ్రి, అనంతమైన టీచర్ వచ్చారు, వారు పిల్లలు ఇంకా ఎం.ఎ, బి.ఎ. పాసవ్వాలి కదా అని చూస్తూ కూర్చుండిపోరు కదా. తండ్రి అలా కూర్చొని ఉండరు. వారు కొద్ది సమయంలో వెళ్ళిపోతారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది, అయినా కానీ పిల్లలు మేల్కోరు. మంచి-మంచి కుమారీలు ఎవరైతే ఉంటారో వారు ఈ 4-5 వందల రూపాయల కోసం మేము వ్యర్థముగా మా సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి, అలా చేస్తే మేము శివాలయములో ఏ పదవిని పొందుతాము అని అంటారు. కుమారీలు అయితే ఫ్రీగా ఉన్నారని బాబా చూస్తున్నారు. ఎంత పెద్ద జీతం దొరికినా కానీ, అవి పిడికెడు శనగల వంటివే కదా, అవన్నీ అంతమైపోతాయి, ఏవీ ఉండవు. తండ్రి ఇప్పుడు ఈ పిడికెడు శనగలను వదిలించడానికి వచ్చారు, అయినా కానీ వదలనే వదలరు. అందులో ఉన్నది పిడికెడు శనగలు, కానీ ఇక్కడైతే విశ్వ రాజ్యాధికారము ఉంది. అవి కేవలం పైసకు కొరగాని శనగలు, వాటి వెనుక ఎంతగా హైరానా పడుతూ ఉంటారు. కుమారీలైతే ఫ్రీగా ఉన్నారు. ఆ చదువు పైసకు కొరగాని చదువు, దానిని వదిలి ఈ జ్ఞానాన్ని చదువుతూ ఉన్నట్లయితే బుద్ధి కూడా తెరుచుకుంటుంది. ఇటువంటి చిన్న-చిన్న కుమారీలు కూర్చొని పెద్ద-పెద్ద వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి, శివాలయాన్ని స్థాపన చేయడానికి తండ్రి వచ్చారు అని చెప్పాలి. ఇక్కడ ఉన్నదంతా మట్టిలో కలిసిపోనున్నదని మీకు తెలుసు. ఈ శనగలు కూడా భాగ్యములో రావు. ఎవరి పిడికిలిలోనైనా 5 శనగలు అనగా 5 లక్షలు ఉన్నా, అవి కూడా అంతమైపోతాయి. ఇప్పుడు చాలా కొద్ది సమయమే ఉంది. రోజురోజుకు పరిస్థితి పాడైపోతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆపదలు వస్తాయి. మృత్యువులు కూడా అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. పిడికిలిలో ఆ శనగలు ఉంటుండగానే ప్రాణాలు పోతాయి. కావున మనుష్యులను ఈ కోతి సంస్కారాల నుండి విడిపించాలి. కేవలం మ్యూజియంను చూసి సంతోషపడడం కాదు, అద్భుతం చేసి చూపించాలి. మనుష్యులను తీర్చిదిద్దాలి. తండ్రి పిల్లలైన మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. ఇకపోతే ఈ శనగలు కూడా ఎవరికీ భాగ్యములో రావు. అన్నీ అంతమైపోతాయి, మరి దాని కన్నా తండ్రి నుండి రాజ్యాధికారాన్ని ఎందుకు తీసుకోకూడదు. ఇందులో కష్టమైన విషయం ఏదీ లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. మీ పిడికిలి నుండి ఈ శనగలను ఖాళీ చేసి దానిని రత్నాలతో, వజ్రాలతో నింపుకొని వెళ్ళాలి.

తండ్రి అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, ఈ పిడికెడు శనగల వెనుక మీరు మీ సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఒకవేళ ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే, పిల్లా-పాపలు ఎందరో ఉన్నట్లయితే వారిని సంభాళించవలసి ఉంటుంది. కుమారీల కొరకైతే ఇది చాలా సహజము. ఎవరైనా వస్తే - తండ్రి మాకు ఈ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారని వారికి అర్థం చేయించండి. మరి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి కదా. ఇప్పుడు మీ పిడికిలి వజ్రాలతో నిండుతోంది, మిగిలినవారంతా వినాశనమైపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు 63 జన్మలు పాపాలు చేసారు. ఇంకొక పాపమేమిటంటే - తండ్రిని మరియు దేవతలను గ్లాని చేయడము. వికారులుగా కూడా అయ్యారు మరియు నిందించారు కూడా. తండ్రిని ఎంతగా గ్లాని చేసారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు - పిల్లలూ, సమయాన్ని వృధా చేయకూడదు. బాబా, మేము స్మృతి చేయలేకపోతున్నాము అని అనడం కాదు. బాబా, మేము స్వయాన్ని ఆత్మగా స్మృతి చేయలేకపోతున్నాము అని అనండి. స్వయాన్ని మర్చిపోతారు. దేహాభిమానంలోకి రావడం అనగా స్వయాన్ని మర్చిపోవడం. స్వయాన్ని ఆత్మగానే స్మృతి చేయలేకపోతే ఇక తండ్రిని ఎలా స్మృతి చేయగలరు? ఇది చాలా పెద్ద గమ్యము, అలాగే ఇది చాలా సహజమైనది కూడా. ఇకపోతే మాయ అపోజిషన్ అయితే తప్పకుండా ఉంటుంది.

మనుష్యులు గీత మొదలైనవి చదువుతారు కానీ దాని అర్థాన్ని ఏమాత్రమూ అర్థం చేసుకోరు. భారత్ కు ముఖ్యమైనది గీతయే. ప్రతి ధర్మానికీ తమ-తమ శాస్త్రము ఒకటి ఉంటుంది. ధర్మ స్థాపన చేసేవారిని సద్గురువు అని అనలేరు, అది చాలా పెద్ద పొరపాటు. సద్గురువు అయితే ఒక్కరే, గురువులుగా పిలవబడేవారైతే ఎందరో ఉన్నారు. ఎవరైనా కార్పెంటర్ పని నేర్పించినా, ఇంజనీర్ పని నేర్పించినా, అతను కూడా గురువవుతారు. అలా నేర్పించే ప్రతి ఒక్కరూ గురువవుతారు, కానీ సద్గురువు ఒక్కరే. ఇప్పుడు మీకు సద్గురువు లభించారు, వారు సత్యమైన తండ్రి కూడా, అలాగే సత్యమైన టీచర్ కూడా, అందుకే పిల్లలు ఎక్కువ నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడి నుండి బాగా రిఫ్రెష్ అయి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో ఇక్కడిదంతా మర్చిపోతారు. గర్భ జైలులో ఎన్నో శిక్షలు లభిస్తాయి. అక్కడైతే గర్భ మహలు ఉంటుంది. శిక్షలు అనుభవించేందుకు అక్కడ ఎటువంటి వికర్మలూ జరుగవు. మేము తండ్రి నుండి సమ్ముఖముగా చదువుకుంటున్నాము అని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు. బయట తమ ఇంట్లోనైతే ఈ విధంగా అనరు. అక్కడ సోదరులు చదివిస్తున్నారు అని భావిస్తారు. ఇక్కడైతే డైరెక్టు తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి పిల్లలకు బాగా అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయించడానికి మరియు పిల్లలు అర్థం చేయించడానికి తేడా ఉంటుంది. తండ్రి కూర్చొని పిల్లలను అప్రమత్తం చేస్తారు. పిల్లలూ, పిల్లలూ అంటూ అర్థం చేయిస్తారు. మీరు శివాలయాన్ని మరియు వేశ్యాలయాన్ని అర్థం చేసుకున్నారు, ఇది అనంతమైన విషయము. ఇది స్పష్టముగా చూపించినట్లయితే మనుష్యులకు ఆనందం కలుగుతుంది. అక్కడ ఏదో సరదాగా అర్థం చేయించినట్లు అర్థం చేయిస్తారు, కానీ సీరియస్ గా అర్థం చేయించినట్లయితే బాగా అర్థం చేసుకోగలుగుతారు. మీపై మీరు దయ చూపించుకోండి, మీరు ఈ వేశ్యాలయములోనే ఉంటారా! ఎలా, ఎలా అర్థం చేయించాలి అని బాబాకైతే ఆలోచనలు నడుస్తాయి కదా. పిల్లలు ఎంత కష్టపడుతూ ఉంటారు, అయినా అది డబ్బాలో మట్టిపెంకుల వలె ఉంటుంది (అర్థం చేసుకోలేక వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు). సరే, సరే అని అంటూ ఉంటారు, చాలా బాగుంది, ఇది ఊర్లో అర్థం చేయించాలి అని అంటారు, కానీ స్వయం అర్థం చేసుకోరు. షావుకార్లు, ధనికులు అయితే అర్థం చేసుకోరు కూడా. ఏమాత్రమూ అటెన్షన్ పెట్టరు. అటువంటివారు చివరిలో వస్తారు. అప్పుడిక టూ లేట్ అయిపోతుంది. వారి ధనమూ ఉపయోగపడదు, అలాగే వారు యోగములోనూ ఉండలేరు. అయితే ఒకవేళ వారు వింటే, ప్రజలలోకి వస్తారు. పేదలు చాలా ఉన్నతమైన పదవిని పొందవచ్చు. కన్యలైన మీ వద్ద ఏముంది. కన్యను నిరుపేద అని అంటారు, ఎందుకంటే తండ్రి ఆస్తి అయితే కొడుకుకే లభిస్తుంది. ఇకపోతే కన్యను దానం చేయడం జరుగుతుంది, అప్పుడు ఆమె వికారాలలోకి వెళ్తుంది. వివాహం చేసుకుంటే ధనం ఇస్తాము, పవిత్రంగా ఉంటే ఒక్క పైస కూడా ఇవ్వము అని అంటారు. మనోవృత్తి చూడండి, ఎలా ఉందో! మీరు ఎవ్వరికీ భయపడకండి. చాలా స్పష్టంగా అర్థం చేయించాలి. చురుకుగా ఉండాలి. మీరైతే పూర్తిగా సత్యమే చెప్తారు. ఇది సంగమయుగము. అటువైపు ఉన్నది పిడికెడు శనగలు, ఇటువైపు పిడికిలిలో వజ్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కోతి నుండి మందిరయోగ్యులుగా అవుతారు. పురుషార్థము చేసి వజ్రతుల్యమైన జన్మను తీసుకోవాలి కదా. మీ ముఖము కూడా సాహసవంతముగా, సింహము వలె ఉండాలి, కొందరి ముఖమైతే పిరికి మేక వలె ఉంటుంది. కొద్దిపాటి శబ్దానికే భయపడిపోతారు. కావున తండ్రి పిల్లలందరినీ అప్రమత్తం చేస్తారు. కన్యలు చిక్కుకోకూడదు. ఇంకా బంధనములో చిక్కుకున్నట్లయితే వికారాల కోసం దెబ్బలు తింటారు. జ్ఞానాన్ని బాగా ధారణ చేసినట్లయితే విశ్వ మహారాణిగా అవుతారు. తండ్రి అంటారు, నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను. కానీ అది కొందరి భాగ్యములో లేదు. తండ్రి పేదల పాలిటి పెన్నిధి. కన్యలు పేదలు. తల్లిదండ్రులు వివాహం చేయించలేకపోతే వారిని ఇచ్చేస్తారు. వారికి నషా ఎక్కాలి. మేము బాగా చదువుకుని మంచి పదవిని పొందాలి అని భావించాలి. మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు, మేము పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలి అని చదువుపై శ్రద్ధ పెడతారు. వారికే మళ్ళీ స్కాలర్షిప్ లభిస్తుంది. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. అది కూడా 21 జన్మల కొరకు. ఇక్కడున్నది అల్పకాలికమైన సుఖము. ఈ రోజు ఏదైనా పదవి ఉంటుంది, మళ్ళీ రేపు మృత్యువు వస్తే అంతా సమాప్తము. యోగికి మరియు భోగికి తేడా ఉంది కదా. పేదలపై ఎక్కువ అటెన్షన్ పెట్టండి అని తండ్రి అంటారు. షావుకార్లు కష్టం మీద తీసుకుంటారు. వారు కేవలం - చాలా బాగుంది, ఈ సంస్థ ఎంతో బాగుంది, అనేకుల కళ్యాణము చేస్తుంది అని అంటారు కానీ, తమ కళ్యాణమును ఏమీ చేసుకోరు. చాలా బాగుంది అని అంటారు, బయటకు వెళ్ళిన తర్వాత సమాప్తము. మాయ కర్ర పట్టుకొని కూర్చుంది, అది ఉత్సాహాన్నంతా పోగొట్టేస్తుంది. ఒక్క దెబ్బ వేయడంతో బుద్ధిని పని చేయకుండా చేసేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - భారత్ పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి. పిల్లలు డ్రామానైతే బాగా అర్థం చేసుకున్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పిడికెడు శనగలను వదిలి తండ్రి నుండి విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. ఏ విషయములోనూ భయపడకూడదు, నిర్భయులుగా అయి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. తమ సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి.

2. ఈ దుఃఖధామాన్ని మరచి శివాలయాన్ని అనగా శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. మాయ విఘ్నాలను తెలుసుకొని వాటి నుండి అప్రమత్తంగా ఉండాలి.

వరదానము:-

గీతా పాఠాన్ని చదివే మరియు చదివించే నష్టోమోహా స్మృతి స్వరూప భవ

గీతా జ్ఞానము యొక్క మొట్టమొదటి పాఠము - అశరీరి ఆత్మగా అవ్వండి మరియు అంతిమ పాఠము - నష్టోమోహా స్మృతి స్వరూపులుగా అవ్వండి. మొదటి పాఠము విధి మరియు అంతిమ పాఠము విధి ద్వారా సిద్ధి. కావున ప్రతి సమయము మొదట ఈ పాఠాన్ని చదవండి, ఆ తర్వాత ఇతరులకు చదివించండి. ఎటువంటి శ్రేష్ఠ కర్మలను చేసి చూపించండంటే, మీ శ్రేష్ఠ కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ఠ కర్మలు చేసి వారి భాగ్య రేఖను శ్రేష్ఠంగా తయారుచేసుకోగలగాలి.

స్లోగన్:-

పరమాత్మ స్నేహములో ఇమిడిపోయి ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులుగా అవుతారు.