ఓంశాంతి
విద్యార్థులు చదువుకునేటప్పుడు సంతోషముగా చదువుకుంటారు. టీచరు కూడా చాలా సంతోషముగా,
అభిరుచితో చదివిస్తారు. అనంతమైన తండ్రియే టీచరు కూడా, వారు మమ్మల్ని చాలా అభిరుచితో
చదివిస్తున్నారని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఆ చదువులోనైతే తండ్రి వేరుగా ఉంటారు,
చదివించే టీచరు వేరుగా ఉంటారు. కొంతమందికైతే తండ్రియే చదివించే టీచరుగా ఉంటారు,
కనుక వారు చాలా అభిరుచితో చదివిస్తారు, ఎందుకంటే ఎంతైనా రక్త సంబంధము ఉంటుంది కదా.
తమ సొంతవారిగా భావించి చాలా అభిరుచితో చదివిస్తారు. ఈ తండ్రి మిమ్మల్ని ఎంత
అభిరుచితో చదివిస్తూ ఉండవచ్చు కనుక పిల్లలు కూడా ఎంత అభిరుచితో చదువుకోవాలి.
డైరెక్ట్ తండ్రి చదివిస్తున్నారు మరియు ఈ ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు.
పిల్లలకు చాలా అభిరుచి ఉండాలి. భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు మరియు ప్రతి
విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకు చదువుతూ, చదువుతూ
ఉండగా ఒక ఆలోచన వస్తుంది - ఇదేమిటి, డ్రామాలో ఈ రాకపోకల చక్రముంది, అయినా ఈ
నాటకాన్ని అసలు ఎందుకు రచించారు? దీని వలన లాభమేమిటి? ఇలాగే కేవలం చక్రములో తిరగడం
కన్నా, దీని నుండి విడుదలవుతే మంచిది కదా అని అనుకుంటారు. ఈ 84 జన్మల చక్రములో
తిరుగుతూనే ఉండాలి అని తెలుసుకున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ రాకపోకల చక్రము
నుండి అసలు విడుదల కాలేనప్పుడు, భగవంతుడు ఇటువంటి ఆటను ఎందుకు రచించారు, దీని కన్నా
మోక్షము లభిస్తే మంచిది అని అనుకుంటారు. ఇటువంటి ఆలోచనలు కొంతమంది పిల్లలకు వస్తాయి.
ఈ రాకపోకల నుండి, సుఖ-దుఃఖాల నుండి విడుదలవ్వాలని భావిస్తారు. తండ్రి అంటారు, ఇది
ఎప్పటికీ జరగదు. మోక్షము పొందేందుకు ప్రయత్నించడము వ్యర్థమే. తండ్రి అర్థం చేయించారు,
ఒక్క ఆత్మ కూడా పాత్ర నుండి విడుదల కాలేదు. ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. ఆత్మ
ఉన్నదే అనాది, అవినాశీ. పాత్రధారులు పూర్తిగా ఏక్యురేట్ గా ఉన్నారు. ఒక్కరు కూడా
ఎక్కువ తక్కువ అవ్వరు. పిల్లలైన మీకు మొత్తం జ్ఞానమంతా ఉంది. ఈ డ్రామా పాత్ర నుండి
ఎవ్వరూ విడుదల అవ్వలేరు, ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు. అన్ని ధర్మాలవారు నంబరువారుగా
రావాల్సిందే. తండ్రి అర్థము చేయిస్తున్నారు, ఇది తయారై, తయారుచేయబడిన అవినాశీ డ్రామా.
మీరు కూడా అంటారు - బాబా, మేము 84 జన్మల చక్రములో ఎలా తిరుగుతాము అన్నది ఇప్పుడు
తెలుసుకున్నాము. మొట్టమొదట ఎవరైతే వస్తారో, వారు 84 జన్మలు తీసుకుంటారని, వెనుక
వచ్చేవారికి తప్పకుండా తక్కువ జన్మలుంటాయని, ఇది కూడా మీరు అర్థము చేసుకున్నారు.
ఇక్కడైతే పురుషార్థము చేయవలసి ఉంటుంది. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచముగా
తప్పకుండా తయారవ్వనున్నది. బాబా ప్రతి విషయాన్ని పదే-పదే అర్థము చేయిస్తూ ఉంటారు
ఎందుకంటే కొత్త-కొత్త పిల్లలు వస్తూ ఉంటారు. వారికి ఇంతవరకు చదివించిన చదువును ఎవరు
చదివిస్తారు. కనుక తండ్రి కొత్త-కొత్త వారిని చూసి మళ్ళీ పాత పాయింట్లనే రిపీట్
చేస్తారు.
మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ప్రారంభము నుండి మొదలుకొని మనమెలా పాత్రను
అభినయిస్తూ వచ్చాము అనేది మీకు తెలుసు. నంబరువారుగా ఎలా వస్తారు, ఎన్ని జన్మలు
తీసుకుంటారు అనేది మీకు యథార్థ రీతిగా తెలుసు. ఈ సమయములోనే తండ్రి వచ్చి జ్ఞానము
యొక్క విషయాలను వినిపిస్తారు. సత్యయుగములో ఉన్నదే ప్రారబ్ధము. ఇది ఈ సమయములో మీకు
మాత్రమే అర్థం చేయించడం జరుగుతుంది. గీతలో కూడా పార్రంభములో, మళ్ళీ చివరిలో
మన్మనాభవ అన్న విషయము వస్తుంది. హోదా పొందేందుకని చదివించడం జరుగుతుంది. మీరు రాజుగా
అయ్యేందుకు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. ఇతర ధర్మాల వారైతే నంబరువారుగా
వస్తారని అర్థము చేయించారు, ధర్మ స్థాపకుల వెనుక అందరూ రావలసి ఉంటుంది. అక్కడ
రాజ్యము యొక్క విషయము లేదు. ఒక్క గీతా శాస్త్రానికి మాత్రమే చాలా మహిమ ఉంది. భారత్
లోనే తండ్రి వచ్చి వినిపిస్తారు మరియు అందరికీ సద్గతినిస్తారు. ఆ ధర్మ స్థాపకులు
ఎవరైతే వస్తారో, వారు మరణించినప్పుడు గొప్ప-గొప్ప తీర్థ స్థానాలను నిర్మిస్తారు.
వాస్తవానికి అందరి తీర్థ స్థానము ఈ భారత్ యే, ఇక్కడకు అనంతమైన తండ్రి వస్తారు.
తండ్రి భారత్ లోనే వచ్చి సర్వులకు సద్గతిని ఇచ్చారు. తండ్రి అంటున్నారు, నన్ను
లిబరేటర్ (ముక్తిదాత), గైడ్ అని అంటారు కదా. నేను మిమ్మల్ని ఈ పాత ప్రపంచము, దుఃఖపు
ప్రపంచము నుండి విముక్తులుగా చేసి శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తాను. బాబా
మమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తారని పిల్లలకు తెలుసు.
మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. దుఃఖము నుండి బాబా వచ్చి విముక్తులుగా
చేస్తారు. వారికి జనన-మరణాలు ఉండవు. తండ్రి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతారు. తండ్రి
విషయములో వారు మరణించారు అని అనరు. శివానందుడి విషయములో, వారు శరీరాన్ని వదిలేశారు
అని అంటారు, ఆ తర్వాత అంత్యక్రియలు చేస్తారు. ఈ తండ్రి వెళ్ళిపోతే వీరికి
అంత్యక్రియలు మొదలైనవేవీ చేయనవసరము లేదు. వీరు వచ్చినట్లు కూడా ఎవ్వరికీ తెలియదు.
ఇక అంత్యక్రియలు మొదలైనవాటి విషయమే లేదు. మిగిలిన మనుష్యులందరికీ అంత్యక్రియలు
చేస్తారు. తండ్రికి అంత్యక్రియలు ఉండవు, వారికి శరీరమే లేదు. సత్యయుగములో ఈ జ్ఞానము
మరియు భక్తి యొక్క విషయాలు ఉండవు. ఇవి ఇప్పుడు మాత్రమే ఉంటాయి. మిగిలినవారంతా
భక్తిని మాత్రమే నేర్పిస్తారు. అర్ధకల్పము భక్తి ఉంటుంది, మళ్ళీ అర్ధకల్పము తర్వాత
తండ్రి వచ్చి జ్ఞానము యొక్క వారసత్వాన్ని ఇస్తారు. జ్ఞానమేమీ మీతోపాటు అక్కడకు రాదు.
అక్కడ తండ్రిని స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు. ముక్తిలో ఉంటారు. అక్కడ స్మృతి చేయడం
జరుగుతుందా? అక్కడ దుఃఖము గురించి ఫిర్యాదులే ఉండవు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా
ఉంటుంది, ఆ తర్వాత వ్యభిచారిగా అవుతుంది. ఈ సమయములోనైతే అతి వ్యభిచారి భక్తి ఉంటుంది,
దీనిని రౌరవ నరకమని అంటారు. ఇది అన్నింటికన్నా తీవ్రమైన నరకము, మళ్ళీ తండ్రి వచ్చి
ఉన్నతోన్నతమైన స్వర్గాన్ని తయారుచేస్తారు. ఈ సమయములో 100 శాతము దుఃఖముంది, తర్వాత
100 శాతము సుఖ-శాంతులు ఉంటాయి. ఆత్మ తన ఇంటికి వెళ్ళి విశ్రాంతి పొందుతుంది. ఈ
విషయాలు అర్థము చేయించడం చాలా సహజము. తండ్రి అంటారు, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి
పాతదానిని వినాశనము చేయవలసి ఉన్నప్పుడు నేను వస్తాను. ఇంతటి కార్యాన్ని కేవలం ఒక్కరే
చేయరు. సేవాధారులు చాలా మంది కావాలి. ఈ సమయములో మీరు తండ్రికి సేవాధారీ పిల్లలుగా
అయ్యారు. విశేషముగా భారత్ కు సత్యమైన సేవను చేస్తారు. సత్యమైన తండ్రి సత్యమైన సేవను
నేర్పిస్తారు. స్వయం యొక్క కళ్యాణము, భారత్ యొక్క కళ్యాణము మరియు విశ్వము యొక్క
కళ్యాణము కూడా చేస్తారు. మరి ఎంత అభిరుచితో చేయాలి. బాబా ఎంత అభిరుచితో సర్వులకు
సద్గతినిస్తారు. ఇప్పుడు కూడా సర్వుల సద్గతి తప్పకుండా జరగనున్నది. ఇది శుద్ధ
అహంకారము, శుద్ధ భావన.
మీరు సత్యాతి-సత్యమైన సేవను చేస్తారు కానీ గుప్తముగా చేస్తారు. ఆత్మ శరీరము
ద్వారా చేస్తుంది. చాలామంది మిమ్మల్ని - బి.కె.ల ఉద్దేశ్యము ఏమిటి అని అడుగుతారు.
మీరు చెప్పండి - బి.కె.ల ఉద్దేశ్యము విశ్వములో సత్యయుగీ సుఖ-శాంతుల స్వరాజ్యాన్ని
స్థాపించడము. మనము ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత శ్రీమతము ఆధారముగా విశ్వములో
శాంతిని స్థాపన చేసి విశ్వశాంతి బహుమతిని తీసుకుంటాము. యథా రాజా-రాణి తథా ప్రజా
బహుమతిని తీసుకుంటారు. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వడమనేది ఏమైనా చిన్న బహుమతా.
వారు శాంతి పురస్కారాలు తీసుకుని సంతోషపడుతూ ఉంటారు, కానీ వారికేమీ లభించదు. విశ్వ
రాజ్యాధికారమనే సత్యాతి-సత్యమైన బహుమతిని అయితే ఇప్పుడు మనము తండ్రి నుండి
తీసుకుంటున్నాము. మా భారత్ ఉన్నతమైన దేశము అని అంటారు కదా. ఎంత మహిమ చేస్తారు. మేము
భారత్ కు యజమానులము అని అందరూ భావిస్తారు, కానీ యజమానులుగా ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు
పిల్లలైన మీరు తండ్రి శ్రీమతము ఆధారముగా రాజ్య స్థాపన చేస్తున్నారు. ఆయుధాల శక్తి
అయితే ఏమీ లేదు. దైవీ గుణాలను ధారణ చేస్తారు, అందుకే మీకే గాయనము, పూజలు జరుగుతాయి.
అంబను చూడండి, వారికి ఎన్ని పూజలు జరుగుతాయి. కానీ అంబ ఎవరు, ఆమె బ్రాహ్మణినా లేక
దేవతనా... ఇది కూడా తెలియదు. అంబ, కాళి, దుర్గ, సరస్వతి మొదలైన పేర్లు చాలా ఉన్నాయి.
ఇక్కడ కూడా కింద అంబకు చిన్న మందిరము ఉంది. అంబకు చాలా భుజాలను చూపిస్తారు. కానీ అలా
ఉండవు. దీనినే అంధ విశ్వాసము అని అంటారు. క్రైస్టు, బుద్ధుడు మొదలైనవారు వచ్చారు,
వారు తమ-తమ ధర్మాలను స్థాపన చేసారు, తిథి-తారీఖు అన్నీ తెలియజేస్తారు. అక్కడ అంధ
విశ్వాసము యొక్క విషయమేమీ లేదు. మా ధర్మాన్ని ఎప్పుడు మరియు ఎవరు స్థాపన చేశారు
అనేది ఇక్కడ భారతవాసులకు ఏ మాత్రమూ తెలియదు. అందుకే అంధ విశ్వాసము అని అంటారు.
ఇప్పుడు మీరు పూజారులుగా ఉన్నారు, మళ్ళీ పూజ్యులుగా అవుతారు. మీ ఆత్మ కూడా పూజ్యముగా
అవుతుంది, అలాగే శరీరము కూడా పూజ్యముగా అవుతుంది. మీ ఆత్మకు కూడా పూజ జరుగుతుంది,
మళ్ళీ దేవతగా అయ్యాక కూడా పూజ జరుగుతుంది. తండ్రి ఉన్నదే నిరాకారుడు. వారు సదా
పూజ్యులు. వారెప్పుడూ పూజారిగా అవ్వరు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని పిల్లలైన
మీ కోసమే అంటారు. తండ్రి అయితే సదా పూజ్యులు, ఇక్కడకు వచ్చి తండ్రి సత్యమైన సేవను
చేస్తున్నారు. వారు అందరికీ సద్గతినిస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు నన్నొక్కరినే
స్మృతి చేయండి. ఇతర దేహధారులనెవ్వరినీ స్మృతి చేయకూడదు. ఇక్కడైతే గొప్ప-గొప్ప
లక్షాధికారులు, కోటీశ్వరులు వెళ్ళి అల్లా-అల్లా అని అంటారు. ఇది ఎంతటి అంధ విశ్వాసము.
తండ్రి మీకు హమ్ సో అర్థాన్ని కూడా తెలియజేసారు. వారైతే శివోహమ్ అని, ఆత్మయే
పరమాత్మ అని అంటారు. ఇప్పుడు తండ్రి సరి చేసి సరైన అర్థాన్ని చెప్పారు. ఇప్పుడు
నిర్ణయించండి - భక్తి మార్గములో విన్నది రైటా లేక నేను చెప్పింది రైటా? హమ్ సో
అర్థము చాలా పెద్దది. మనమే బ్రాహ్మణులము, దేవతలము, క్షత్రియులము. ఇప్పుడు హమ్ సో
యొక్క రైట్ అర్థము ఏమిటి? ఆత్మనైన నేను చక్రములో ఈ విధముగా వస్తాను. విరాట రూప
చిత్రము కూడా ఉంది, ఇందులో పిలక అయిన బ్రాహ్మణులను మరియు తండ్రిని చూపించలేదు.
దేవతలు ఎక్కడ నుండి వచ్చారు? వారు ఎక్కడి నుండి జన్మించారు? కలియుగములో ఉన్నదైతే
శూద్ర వర్ణము. సత్యయుగములో ఉన్నట్లుండి దేవతా వర్ణము ఎలా వచ్చింది? ఏమీ అర్థము
చేసుకోరు. భక్తి మార్గములో మనుష్యులు ఎంతగా చిక్కుకొని ఉంటారు. ఎవరో గ్రంథ్ చదివారు,
ఆలోచన వచ్చింది, మందిరాన్ని నిర్మించారు, అంతే, ఇక కూర్చొని గ్రంథ్ ను వినిపిస్తారు,
చాలామంది మనుష్యులు వస్తారు, చాలామంది ఫాలోవర్స్ గా అవుతారు. కానీ లాభమేమీ ఉండదు.
చాలా దుకాణాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ దుకాణాలన్నీ సమాప్తమైపోతాయి. ఆ వ్యాపారము అంతా
భక్తి మార్గములోనిది, దాని ద్వారా చాలా ధనాన్ని సంపాదిస్తారు. మేము బ్రహ్మయోగులము,
తత్త్వయోగులము అని సన్యాసులు అంటారు. వాస్తవానికి భారతవాసులు దేవీ-దేవతా ధర్మానికి
చెందినవారు, కానీ హిందూ ధర్మమని అనేస్తారు. అలాగే, బ్రహ్మము అనేది తత్త్వము, అక్కడ
ఆత్మలు నివసిస్తాయి. కానీ వారు బ్రహ్మజ్ఞానులు, తత్త్వజ్ఞానులు అన్న పేర్లు పెట్టారు.
వాస్తవానికి బ్రహ్మ తత్త్వము అనేది నివసించే స్థానము. తండ్రి అర్థము చేయిస్తున్నారు,
ఎంత పెద్ద పొరపాటు చేశారు. ఇదంతా భ్రమ. నేను వచ్చి అన్ని భ్రమలను దూరము చేస్తాను.
భక్తి మార్గములో - ఓ ప్రభూ, నీవు ఇచ్చే గతి, నీవు చూపే మార్గము అతీతమైనవి అని
అంటుంటారు కూడా. గతి అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. మార్గాలైతే అనేకులవి లభిస్తాయి. ఇక్కడి
మతము ఎంత అద్భుతము చేస్తుంది. మొత్తము విశ్వాన్ని పరివర్తన చేస్తుంది.
ఇన్ని ధర్మాలు ఎలా వస్తాయి, మళ్ళీ ఆత్మలు వెళ్ళి తమ-తమ సెక్షన్లలో ఎలా ఉంటాయి
అనేది ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది.
దివ్యదృష్టి దాత ఒక్క తండ్రి మాత్రమే అని కూడా పిల్లలకు తెలుసు. ఈ దివ్యదృష్టి
తాళముచెవిని మాకు ఇవ్వండి, అప్పుడు మేము ఎవరికైనా సాక్షాత్కారము చేయించగలుగుతాము అని
బాబాను అడిగితే, బాబా అన్నారు - లేదు, ఈ తాళముచెవి ఎవ్వరికీ లభించదు, దీనికి బదులుగా
మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తాను, అది నేను తీసుకోను. సాక్షాత్కారము చేయించడము
నా పాత్రే. సాక్షాత్కారము లభిస్తే ఎంత సంతోషిస్తారు. కానీ దాని ద్వారా ఏమీ లభించదు.
సాక్షాత్కారము ద్వారా ఎవరైనా నిరోగిగా అవుతారు లేక ధనము లభిస్తుంది అనేమీ కాదు. అలా
కాదు. మీరాకు సాక్షాత్కారము లభించింది కానీ ఆమె ముక్తిని పొందలేదు. ఆమె వైకుంఠములో
ఉండేవారని మనుష్యులు భావిస్తారు. కానీ వైకుంఠము అనగా కృష్ణపురి ఎక్కడుంది. అవన్నీ
సాక్షాత్కారాలు. తండ్రి కూర్చొని అన్ని విషయాలను అర్థము చేయిస్తారు. వీరికి కూడా
మొట్టమొదట విష్ణు సాక్షాత్కారము జరిగింది, అప్పుడు చాలా సంతోషించారు. అది కూడా నేను
మహారాజుగా అవుతాను అని చూసినప్పుడు చాలా సంతోషించారు. వినాశనాన్ని కూడా చూసారు,
మళ్ళీ రాజ్యాన్ని కూడా చూసారు, అప్పుడు - ఓహో! నేను అయితే విశ్వానికి యజమానిగా
అవుతాను అని నిశ్చయము ఏర్పడింది. బాబా ప్రవేశము జరిగింది. అప్పుడిక - బాబా, ఇదంతా
మీరు తీసుకోండి, నాకైతే విశ్వ రాజ్యాధికారము కావాలి, అంతే అని అన్నారు. మీరు కూడా ఈ
వ్యాపారము చేసేందుకే వచ్చారు కదా. ఎవరైతే జ్ఞానము తెలుసుకుంటారో, వారి భక్తి
సమాప్తమైపోతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.