ఓంశాంతి
తండ్రే పిల్లలకు అర్థం చేయిస్తారు - పిల్లలూ, మన్మనాభవ. పిల్లలు కూర్చుని తండ్రికి
అర్థం చేయించగలరని కాదు. శివబాబా, మన్మనాభవ అని పిల్లలు చెప్పరు. అలా చెప్పరు.
పిల్లలు పరస్పరం కూర్చుని చిట్ చాట్ చేస్తారు, ఉపాయాలు కనుగొంటారు కానీ మూల
మహామంత్రమేదైతే ఉందో, దానినైతే తండ్రే ఇస్తారు. గురువులు మంత్రము ఇస్తారు. ఈ ఆచారము
ఎక్కడ నుండి వెలువడింది? కొత్త సృష్టిని రచించే ఈ తండ్రియే మొట్టమొదట మంత్రాన్ని
ఇస్తారు - మన్మనాభవ. దీని పేరే వశీకరణ మంత్రము అనగా మాయపై విజయాన్ని పొందే మంత్రము.
దీనిని లోలోపల జపించడం కాదు. దీనిని అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి అర్థ సహితముగా
వివరిస్తారు. ఇది గీతలో ఉన్నా కానీ దీని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. ఇది గీతా
అధ్యాయము కూడా. కానీ కేవలం పేరును మార్చేసారు. ఎంత పెద్ద-పెద్ద పుస్తకాలు మొదలైనవి
భక్తి మార్గములో తయారవుతాయి. వాస్తవానికి వీటిని తండ్రి కూర్చుని నోటి మాటలతో
పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రి ఆత్మలో జ్ఞానము ఉంది. పిల్లల విషయములో కూడా
ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. ఇకపోతే కేవలం సహజము చేసి అర్థం చేయించేందుకని ఈ
చిత్రాలు మొదలైనవి తయారుచేయబడతాయి. పిల్లలైన మీ బుద్ధిలోనైతే ఈ జ్ఞానమంతా ఉంది.
తప్పకుండా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేదని, అప్పుడు ఇంకే ఇతర ఖండమూ ఉండేది
కాదని మీకు తెలుసు. ఆ తర్వాత ఈ ఖండాలు మొదలైనవన్నీ చేరాయి. కావున ఆ చిత్రాన్ని కూడా
ఒక మూల పెట్టి ఉంచాలి, ఆ చిత్రములో మీరు - భారత్ లో వీరి రాజ్యమున్నప్పుడు ఇంకే
ధర్మమూ ఉండేది కాదని చూపిస్తారు. ఇప్పుడైతే ఎన్ని ధర్మాలు ఉన్నాయి, ఇక తర్వాత ఇవేవీ
ఉండవు. ఇది బాబా ప్లాన్. పాపం వారికైతే ఎంత చింత పట్టి ఉంది. ఇది పూర్తిగా
యథార్థమేనని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా స్థాపన
చేస్తారని వ్రాయబడి కూడా ఉంది. దేనిని? కొత్త ప్రపంచాన్ని. జమునా నదీ తీరము రాజధాని.
అక్కడ ఒకే ధర్మముంటుంది. వృక్షము చాలా చిన్నగా ఉంటుంది. ఈ వృక్షము యొక్క జ్ఞానాన్ని
కూడా తండ్రే ఇస్తారు. చక్రము యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. సత్యయుగములో ఒకే భాష ఉంటుంది,
ఇంకే భాషా ఉండదు. ఒకే భారత్ ఉండేదని, ఒకే రాజ్యముండేదని, ఒకే భాష ఉండేదని మీరు
నిరూపించవచ్చు. ప్యారడైజ్ లో సుఖ-శాంతులు ఉండేవి. దుఃఖపు నామ-రూపాలు కూడా ఉండేవి
కావు. ఆరోగ్యము, సంపద, సంతోషము అన్నీ ఉండేవి. భారత్ కొత్తగా ఉన్నప్పుడు ఆయువు కూడా
చాలా ఎక్కువగా ఉండేది ఎందుకంటే పవిత్రత ఉండేది. పవిత్రతలో మనుష్యులు ఆరోగ్యముగా
ఉంటారు. అపవిత్రతలో మనుష్యుల పరిస్థితి ఎలా అయిపోతుందో చూడండి. కూర్చుని, కూర్చుని
ఉండగానే అకాలమృత్యువు జరుగుతుంది. యవ్వనములో ఉన్నవారు కూడా మరణిస్తారు. దుఃఖము ఎంత
ఉంటుంది. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. పూర్ణాయుష్షు ఉంటుంది. వృద్ధాప్యము వరకూ ఎవరూ
మరణించరు.
ఎవరికి అర్థం చేయించినా ఇది బుద్ధిలో కూర్చోబెట్టాలి - అనంతమైన తండ్రిని స్మృతి
చేయండి, వారే పతిత-పావనుడు, వారే సద్గతిదాత. మీ వద్ద ఆ మ్యాప్ కూడా ఉండాలి, తద్వారా
నిరూపించి అర్థం చేయించగలుగుతారు. ఈ నాటి మ్యాప్ ఇది, రేపటి మ్యాప్ అది అని చెప్పాలి.
కొందరైతే బాగా వింటారు కూడా. దీనిని బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ భారత్ అవినాశీ
ఖండము. ఈ దేవీ-దేవతా ధర్మమున్నప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మము లేదు. ఈ లక్ష్మీ-నారాయణులు ఏమయ్యారు, ఎవ్వరూ చెప్పలేరు. ఇది
చెప్పగలిగే శక్తి ఎవ్వరిలోనూ లేదు. పిల్లలైన మీరు చాలా బాగా రహస్యయుక్తముగా అర్థం
చేయించగలుగుతారు. ఇందులో తికమకపడే అవసరం లేదు. మీకు అన్నీ తెలుసు మరియు మీరు రిపీట్
కూడా చేయగలుగుతారు. వీరు ఏమయ్యారు - అని మీరు ఎవరినైనా అడుగవచ్చు. మీ ప్రశ్న విని
ఆశ్చర్యపోతారు. వీరు కూడా ఏ విధముగా 84 జన్మలు తీసుకుంటారు అనేది మీరు నిశ్చయముతో
చెప్తారు. బుద్ధిలో అయితే ఉంది కదా. కావున మీరు వెంటనే చెప్తారు - సత్యయుగమైన కొత్త
ప్రపంచములో మా రాజ్యముండేది, ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇంకే ధర్మమూ
ఉండేది కాదు, అంతా కొత్తగా ఉండేది, ప్రతి వస్తువూ సతోప్రధానముగా ఉంటుంది. బంగారము
కూడా ఎంత అపారముగా ఉంటుంది. అది ఎంత సహజముగా వెలువడుతూ ఉండవచ్చు, వాటితో వెంటనే
ఇటుకలు, భవనాలు మొదలైనవి తయారవుతూ ఉండవచ్చు. అక్కడైతే అన్నీ బంగారముతోనే ఉంటాయి.
గనులన్నీ కొత్తగా ఉంటాయి కదా. అక్కడ ఇమిటేషన్ (నకిలీవి) ఏవీ ఉండవు ఎందుకంటే రియల్ (స్వచ్ఛమైనది)
ఎంతో ఉంటుంది. ఇక్కడ రియల్ యొక్క పేరే లేదు. ఇమిటేషన్ జోరు ఎంతగా ఉంది, అందుకే
అసత్యమైన మాయ, అసత్యమైన శరీరము... అని అంటారు. సంపద కూడా అసత్యమైనదే. వజ్రాలు,
ముత్యాలు ఎటువంటివి వెలువడతాయంటే, అవి సత్యమైనవా, అసత్యమైనవా అన్నది తెలియను కూడా
తెలియదు. షో ఎంతగా ఉంటుందంటే నిజమైనదా లేక నకిలీదా అన్నది పరిశీలించలేరు. అక్కడైతే
ఈ నకిలీ వస్తువులు మొదలైనవేవీ ఉండవు. వినాశనము జరిగితే అన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి.
ఇంత పెద్ద-పెద్ద రాళ్ళు, వజ్రాలు మొదలైనవాటిని భవనాలకు పొదుగుతూ ఉండవచ్చు. అవన్నీ
ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి, వాటిని ఎవరు కట్ చేస్తూ ఉండవచ్చు. భారత్ లో కూడా
నిపుణులు ఎందరో ఉన్నారు, చురుకైనవారిగా అవుతూ ఉంటారు. తర్వాత అక్కడకు ఈ కళను
తీసుకునివస్తారు కదా. కిరీటాలు మొదలైనవి కేవలం వజ్రాలతోనే తయారవ్వవు. అవి పూర్తిగా
స్వచ్ఛమైన రిఫైన్డ్ వజ్రాలుగా ఉంటాయి. ఈ విద్యుత్, టెలిఫోన్, మోటార్లు మొదలైనవేవీ
ఇంతకుముందు ఉండేవి కావు. బాబా యొక్క ఈ జీవితములోనే ఏమేమి వెలువడ్డాయి! ఇవన్నీ
వెలువడి 100 సంవత్సరాలైంది. అక్కడైతే చాలామంది నిపుణులు ఉంటారు. ఇప్పటివరకూ ఇంకా
నేర్చుకుంటూ ఉన్నారు. చురుకైనవారిగా అవుతూ ఉంటారు. ఇవి కూడా పిల్లలకు సాక్షాత్కారం
చేయించడం జరుగుతుంది. అక్కడ హెలికాప్టర్లు కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉంటాయి. పిల్లలు కూడా
చాలా సతోప్రధానముగా, చురుకైన బుద్ధికలవారిగా ఉంటారు. కాస్త ముందుకు వెళ్ళండి, మీకు
అన్నీ సాక్షాత్కారమవుతూ ఉంటాయి. తమ దేశము దగ్గరకు వస్తున్న కొలది చెట్లు అవి
కనిపిస్తూ ఉంటాయి కదా. అప్పుడు - ఇక ఇల్లు వచ్చేసినట్లే, ఇప్పుడిక చేరుకున్నట్లే అని
లోలోపల సంతోషము కలుగుతూ ఉంటుంది. చివరిలో మీకు కూడా ఇటువంటి సాక్షాత్కారాలు జరుగుతూ
ఉంటాయి. బాబా అత్యంత ప్రియమైనవారు అని పిల్లలు భావిస్తారు. వారు సుప్రీమ్ ఆత్మ.
వారిని అందరూ తలచుకుంటూ కూడా ఉంటారు. భక్తి మార్గములో మీరు కూడా పరమాత్మను తలచుకుంటూ
ఉండేవారు కదా. కానీ వారు చిన్నగా ఉంటారా లేక పెద్దగా ఉంటారా అనేది తెలియదు. భృకుటి
మధ్యలో ఒక అద్భుతమైన సితార ప్రకాశిస్తూ ఉంటుంది... అని గానం చేస్తారు కూడా. కనుక
తప్పకుండా బిందువులా ఉంటుంది కదా. వారినే సుప్రీమ్ ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు.
వారిలో విశేషతలైతే అన్నీ ఉన్నాయి. వారు జ్ఞానసాగరుడు, ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు.
అది వారు ఎప్పుడైతే వినిపిస్తారో అప్పుడే తెలుస్తుంది కదా. మీకు కూడా ఇంతకుముందు
తెలిసేదా ఏమిటి, మీకు కేవలం భక్తియే తెలిసేది. ఇప్పుడైతే - ఇది అద్భుతము అని
భావిస్తారు. ఆత్మను కూడా ఈ కనులతో చూడలేరు కావున తండ్రిని కూడా మర్చిపోతారు.
డ్రామాలో పాత్రయే ఇలా ఉంది. ఎవరినైతే విశ్వాధిపతిగా తయారుచేస్తారో అతని పేరును
వేస్తారు మరియు అలా తయారుచేసేవారి పేరును మాయం చేసేస్తారు. శ్రీకృష్ణుడిని
త్రిలోకనాథుడు, వైకుంఠనాథుడు అని అనేసారు, దాని అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోరు. కేవలం
మహిమ చేస్తూ ఉంటారు. భక్తి మార్గములో కూర్చుని అనేక విషయాలను తయారుచేసారు.
భగవంతునికి ఎంతో శక్తి ఉందని, వారు వేలాది సూర్యుల కన్నా తేజోమయుడని, వారు అందరినీ
భస్మము చేయగలరని అంటారు. ఇటువంటి విషయాలను తయారుచేసారు. తండ్రి అంటారు, నేను
పిల్లలను ఎలా తగులబెట్టగలను! అది జరగనే జరగదు. తండ్రి ఎక్కడైనా పిల్లలను అంతం
చేస్తారా? లేదు. అది డ్రామాలోని పాత్ర. పాత ప్రపంచము అంతమవ్వనున్నది. పాత ప్రపంచ
వినాశనము కొరకు ఈ ప్రకృతి వైపరీత్యాలు అన్నీ సేవకులు. ఇవి ఎంత గొప్ప సేవకులు. అలాగని
వినాశనం చేయమని వాటికి తండ్రి ఆజ్ఞను ఇస్తారని కాదు. అలా కాదు. తుఫానులు వస్తాయి,
కరువు వస్తుంది. ఇది ఇలా చేయమని... భగవంతుడేమైనా చెప్తారా ఏమిటి? ఎప్పుడూ చెప్పరు.
ఇది డ్రామాలోని పాత్ర. బాంబులు తయారుచేయండి అని తండ్రి ఏమీ చెప్పరు. వీటన్నింటినీ
రావణ మతము అనే అంటారు. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. ఇది రావణ రాజ్యము కావున
ఆసురీబుద్ధి కలవారిగా అయిపోతారు. ఎంతమంది మరణిస్తారు. చివరికి అంతా తగలబెట్టేస్తారు.
ఇది తయారై, తయారుచేయబడిన నాటకము, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. అంతేకానీ శంకరుడు కన్ను
తెరవడంతో వినాశనమైపోతుందని కాదు. వీటిని ఈశ్వరీయ వైపరీత్యాలు అని కూడా అనరు. ఇవి
ప్రాకృతికమైనవే.
ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఎవరికైనా దుఃఖము మొదలైనవి
ఇచ్చే విషయమే లేదు. తండ్రి సుఖము యొక్క మార్గాన్ని చూపించేవారు. డ్రామా ప్లాన్
అనుసారముగా ఇల్లు పాతబడుతూనే ఉంటుంది. ఈ ప్రపంచమంతా పాతగా అయిపోయింది, ఇది ఇక
అంతమైపోవాలి అని తండ్రి కూడా అంటారు. పరస్పరం ఎలా కొట్లాడుకుంటూ ఉంటారో చూడండి!
ఆసురీ బుద్ధి కదా. ఈశ్వరీయ బుద్ధి ఉన్నప్పుడు ఎవరూ హతమార్చడం మొదలైనవాటి విషయమేమీ
ఉండదు. తండ్రి అంటారు, నేనైతే అందరికీ తండ్రిని, నాకు అందరిపైనా ప్రేమ ఉంది. బాబా
ఇక్కడ చూస్తారు కానీ వారి దృష్టి అనన్యులైన పిల్లల వైపుకే, ఎవరైతే తండ్రిని చాలా
ప్రేమగా స్మృతి చేస్తారో, సేవ కూడా చేస్తారో, వారి వైపుకే వెళ్తుంది. ఇక్కడ కూర్చుని
ఉన్నా తండ్రి దృష్టి సర్వీసబుల్ పిల్లల వైపుకు వెళ్ళిపోతుంది. ఒక్కోసారి డెహ్రాడూన్,
ఒక్కోసారి మీరట్, ఒక్కోసారి ఢిల్లీ... ఏ పిల్లలైతే నన్ను స్మృతి చేస్తారో నేను కూడా
వారిని స్మృతి చేస్తాను. ఎవరైనా నన్ను స్మృతి చేయకపోయినా కూడా నేను అందరినీ స్మృతి
చేస్తాను ఎందుకంటే నేనైతే అందరినీ తీసుకువెళ్ళేది ఉంది కదా. ఎవరైతే నా ద్వారా సృష్టి
చక్ర జ్ఞానాన్ని నంబరువారుగా అర్థం చేసుకుంటారో వారు మళ్ళీ ఉన్నత పదవిని పొందుతారు.
ఇవి అనంతమైన విషయాలు. ఆ టీచర్లు మొదలైనవారు హద్దులోనివారు. వీరు అనంతమైనవారు. కావున
పిల్లల్లో ఎంతటి సంతోషము ఉండాలి. తండ్రి అంటారు, అందరి పాత్రా ఒకే విధంగా ఉండదు.
ఇతనికైతే ఆ పాత్ర ఉంది. కానీ ఫాలో చేసేవారు కోట్లాదిమందిలో ఏ ఒక్కరో వెలువడ్డారు.
బాబా, నేను ఏడు రోజుల పిల్లవాడిని, ఒక్క రోజు పిల్లవాడిని అని అంటారు, మరి వారు
పిల్లిపిల్లల వంటివారే కదా. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. నదిని
కూడా దాటి వచ్చారు. బాబా రావడముతోనే జ్ఞానము ప్రారంభమయ్యింది. వారి మహిమ ఎంతగా ఉంది.
ఆ గీతా అధ్యాయాలనైతే మీరు జన్మ-జన్మాంతరాలూ ఎన్ని సార్లు చదివి ఉంటారు. ఎంత తేడా
ఉందో చూడండి. శ్రీకృష్ణ భగవానువాచ ఎక్కడ, శివపరమాత్మ వాచ ఎక్కడ. రాత్రికి, పగలుకి
ఉన్నంత తేడా ఉంది. మేము సత్యఖండములో ఉండేవారము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది.
సుఖాన్ని కూడా ఎంతో చూసారు. ముప్పావు వంతు సుఖాన్ని చూస్తారు. తండ్రి డ్రామాను సుఖము
కోసము తయారుచేసారు, అంతేకానీ దుఃఖము కోసము కాదు. ఈ దుఃఖమైతే మీకు తర్వాత లభించింది.
యుద్ధమైతే అంత త్వరగా జరగదు. మీకు ఎంతో సుఖము లభిస్తుంది. సగం-సగం ఉన్నా అంత ఆనందం
ఉండదు. 3,500 సంవత్సరాలైతే ఎటువంటి యుద్ధమూ లేదు. రోగాలూ మొదలైనవీ లేవు. ఇక్కడైతే
ఒకదాని వెనుక మరొక రోగము వస్తూనే ఉంటుంది. సత్యయుగములో ధాన్యాన్ని తినేసే పురుగులు
మొదలైనవేవీ ఉండవు, అందుకే దాని పేరే స్వర్గము. కావున ప్రపంచ పటాన్ని కూడా మీరు
చూపించాలి, అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. వాస్తవానికి భారత్ ఇలా ఉండేది, అప్పుడు
ఇంకే ధర్మమూ ఉండేది కాదు. ఆ తర్వాత నంబరువారుగా ధర్మ స్థాపన చేసేవారు వస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీకు ప్రపంచ చరిత్ర, భౌగోళికముల గురించి తెలుసు. మీరు తప్ప
మిగిలినవారంతా నేతి నేతి, మాకు తండ్రి గురించి తెలియదు అని అంటారు. వారికి ఎటువంటి
నామ, రూప, దేశ, కాలాలు లేవు అని అనేస్తారు. నామ-రూపాలు లేకపోతే మరి దేశము కూడా ఉండదు.
ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు తండ్రి తమ యథార్థ పరిచయాన్ని పిల్లలైన మీకు ఇస్తారు.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.