ఓంశాంతి
మధురాతి మధురమైన సికీలధే పిల్లలు పాట విన్నారు. మీరు భగవంతుని పిల్లలు కదా. భగవంతుడు
మనకు దారి చూపిస్తున్నారని మీకు తెలుసు. మేము అంధకారములో ఉన్నాము అని వాళ్ళు
పిలుస్తూ ఉంటారు ఎందుకంటే భక్తి మార్గము ఉన్నదే అంధకార మార్గము. మేము మిమ్మల్ని
కలుసుకునేందుకు భ్రమిస్తున్నాము అని భక్తులు అంటారు. ఒకోసారి తీర్థయాత్రలకు వెళ్తారు,
ఒకోసారి ఒకోచోట దానపుణ్యాలు చేస్తూ ఉంటారు, మంత్రాలు జపిస్తూ ఉంటారు. అనేక రకాల
మంత్రాలను ఇస్తారు, అయినా కానీ, తాము అంధకారములో ఉన్నారు అని ఎవరూ అర్థం చేసుకోరు.
ప్రకాశము అంటే ఏమిటి అనేది ఏమీ అర్థం చేసుకోరు ఎందుకంటే వారు అంధకారములో ఉన్నారు.
ఇప్పుడు మీరైతే అంధకారములో లేరు. మీరు వృక్షములో మొట్టమొదట వస్తారు, కొత్త
ప్రపంచములోకి వెళ్ళి రాజ్యము చేస్తారు, మళ్ళీ మెట్లు దిగుతారు. మధ్యలో ఇస్లాములు,
బౌద్ధులు, క్రిస్టియన్లు వస్తారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ అంటు కడుతున్నారు. ఉదయాన్నే
లేచి ఈ విధంగా జ్ఞాన విషయాలలో రమించాలి. ఇది ఎంత అద్భుతమైన నాటకము, ఈ డ్రామా యొక్క
ఫిల్మ్ రీల్ వ్యవధి 5000 సంవత్సరాలు. సత్యయుగ ఆయువు ఇంత, త్రేతాయుగ ఆయువు ఇంత...
బాబాలో కూడా ఈ జ్ఞానమంతా ఉంది కదా. ప్రపంచములో ఇంకెవ్వరికీ తెలియదు. పిల్లలు
ఉదయాన్నే లేచి, ఒకటి తండ్రిని స్మృతి చేయాలి, రెండు సంతోషముగా జ్ఞానాన్ని స్మరణ
చేయాలి. ఇప్పుడు మనము మొత్తము డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నాము. తండ్రి
అంటారు, కల్పము యొక్క ఆయువు 5000 సంవత్సరాలే. కానీ మనుష్యులు లక్షల సంవత్సరాలు అని
అంటారు. ఇది ఎంత అద్భుతమైన నాటకము. తండ్రి కూర్చుని ఏ శిక్షణనైతే ఇస్తారో, దానిని
మళ్ళీ నెమరువేయాలి, రివైజ్ చేయాలి. విద్యార్థులు చదువును రివైజ్ చేస్తారు కదా.
మధురాతి మధురమైన పిల్లలైన మీరు మొత్తం డ్రామాను తెలుసుకున్నారు. ఇది అనాది,
అవినాశీ డ్రామా అని బాబా ఎంత సహజ రీతిలో అర్థం చేయించారు. ఇందులో గెలుస్తారు, మళ్ళీ
ఓడిపోతారు. ఇప్పుడు చక్రము పూర్తయ్యింది, ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. తండ్రినైన
నన్ను స్మృతి చేయండి అని తండ్రి నుండి ఆజ్ఞ లభించింది. ఈ డ్రామా జ్ఞానాన్ని తండ్రి
ఒక్కరే ఇస్తారు. నాటకమనేది ఎప్పుడైనా లక్షల సంవత్సరాలు ఉంటుందా! ఉంటే అది ఎవరికీ
గుర్తుండదు కూడా. ఇది 5000 సంవత్సరాల చక్రము, ఇది మొత్తం మీ బుద్ధిలో ఉంది. ఇది ఎంత
చక్కని గెలుపు-ఓటముల ఆట. ఉదయము లేచి ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. మన చేత బాబా
రావణుడిపై విజయము పొందేలా చేస్తారు. ఇటువంటి విషయాలను ఉదయముదయమే లేచి మీతో మీరే
మాట్లాడుకుంటూ ఉండాలి, అప్పుడు అలవాటైపోతుంది. ఈ అనంతమైన నాటకము గురించి ఎవ్వరికీ
తెలియదు. నటులై ఉండి కూడా డ్రామా ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. ఇప్పుడు మనము బాబా
ద్వారా యోగ్యులుగా తయారవుతున్నాము.
బాబా తమ పిల్లలను తమ సమానముగా తయారుచేస్తారు. తమ సమానముగా ఏమిటి, తండ్రి అయితే
పిల్లలను తమ భుజాలపైకి ఎక్కించుకుంటారు. బాబాకు పిల్లలపై ఎంత ప్రేమ ఉంది. ఎంత చక్కగా
అర్థం చేయిస్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా
తయారుచేస్తాను, నేను అవ్వను, పిల్లలైన మిమ్మల్ని తయారుచేస్తాను. పిల్లలైన మిమ్మల్ని
పుష్పాలుగా తయారుచేసి మళ్ళీ టీచరుగా అయి చదివిస్తాను. మళ్ళీ సద్గతి కొరకు జ్ఞానాన్ని
ఇచ్చి మిమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి యజమానులుగా తయారుచేస్తాను. నేనైతే
నిర్వాణధామములో కూర్చుండిపోతాను. లౌకిక తండ్రి కూడా కష్టపడి, ధనాన్ని సంపాదించి,
సర్వస్వాన్ని పిల్లలకు ఇచ్చి, స్వయం వానప్రస్థములోకి వెళ్ళి భజనలు మొదలైనవి చేస్తారు.
కానీ ఇక్కడైతే తండ్రి అంటారు, ఒకవేళ మీది వానప్రస్థావస్థ అయితే మీరు పిల్లలకు అర్థం
చేయించి ఇక మీరు ఈ సేవలో నిమగ్నమవ్వాలి. ఇక మళ్ళీ గృహస్థ వ్యవహారములో చిక్కుకోకూడదు.
మీరు స్వకళ్యాణమును మరియు ఇతరుల కళ్యాణమును చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ అందరిదీ
వానప్రస్థావస్థ. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని వాణి నుండి అతీతముగా
తీసుకువెళ్ళేందుకు వచ్చాను. అపవిత్ర ఆత్మలైతే వెళ్ళలేరు. ఇది తండ్రి సమ్ముఖముగా
అర్థం చేయిస్తున్నారు. మజా కూడా సమ్ముఖముగా ఉండటములోనే ఉంటుంది. అక్కడైతే పిల్లలు
కూర్చుని వినిపిస్తారు. ఇక్కడ తండ్రి సమ్ముఖముగా ఉన్నారు, అందుకే మధుబన్ కు మహిమ
ఉంది కదా. తండ్రి అంటారు, ఉదయమే లేచే అలవాటు చేసుకోండి. భక్తిని కూడా మనుష్యులు
ఉదయమే లేచి చేస్తారు కానీ దాని ద్వారా వారసత్వమైతే లభించదు, వారసత్వమనేది రచయిత
అయిన తండ్రి ద్వారా లభిస్తుంది. ఎప్పుడూ రచన ద్వారా వారసత్వము లభించదు, అందుకే -
మాకు రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అని అంటారు. ఒకవేళ వారికి
తెలిసి ఉన్నట్లయితే అది పరంపరగా కొనసాగి ఉండేది. మనము ఎంత శ్రేష్ఠ ధర్మము వారిగా
ఉండేవారము, మళ్ళీ ఎలా ధర్మభ్రష్టముగా, కర్మభ్రష్టముగా అయ్యాము అని పిల్లలు ఇది కూడా
అర్థం చేయించాలి. మాయ బుద్ధికి గోద్రెజ్ తాళం వేసేస్తుంది, అందుకే భగవంతుడిని - మీరు
బుద్ధివంతుల బుద్ధి వంటివారు, ఇతని బుద్ధి తాళాన్ని తెరవండి అని అంటారు. ఇప్పుడైతే
తండ్రి సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నారు. నేను జ్ఞాన సాగరుడిని, మీకు ఇతని ద్వారా
అర్థం చేయిస్తాను. ఏ జ్ఞానమును? ఈ సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఏ
మనుష్యమాత్రులూ ఇవ్వలేరు.
తండ్రి అంటారు, సత్సంగాలు మొదలైనవాటికి వెళ్ళడంకన్నా స్కూల్లో చదువుకోవడం మంచిది.
చదువు సంపాదనకు ఆధారము. సత్సంగాలలోనైతే ఏమీ లభించదు. దానపుణ్యాలు చేయడం, ఇది-అది
చేయడం, కానుకలు ఇవ్వడం, అంతా ఖర్చే-ఖర్చు. ధనాన్ని కూడా సమర్పించడం, తల వంచి
నమస్కరించడం, నుదురు అరిగిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో,
దానిని స్మరణ చేసే అలవాటు చేసుకోండి మరియు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. తండ్రి
అంటారు, ఇప్పుడు మీ ఆత్మపై బృహస్పతి దశ ఉంది. వృక్షపతి అయిన భగవంతుడు మిమ్మల్ని
చదివిస్తున్నారు, మీకు ఎంత సంతోషముండాలి. భగవంతుడు చదివించి మనల్ని భగవాన్-భగవతీలుగా
చేస్తారు. ఓహో! ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు
వినాశనమవుతాయి. ఇలా-ఇలా విచార సాగర మంథనము చేసే అలవాటు చేసుకోవాలి. తాతగారు మనకు ఈ
తండ్రి ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు. నేను ఈ రథాన్ని ఆధారముగా తీసుకుంటాను అని
వారు స్వయం అంటారు. మీకు జ్ఞానము లభిస్తోంది కదా. జ్ఞాన గంగలు జ్ఞానాన్ని వినిపించి
పవిత్రముగా తయారుచేస్తారా లేక గంగా నీరు పవిత్రముగా తయారుచేస్తుందా? ఇప్పుడు తండ్రి
అంటారు - పిల్లలూ, మీరు భారత్ కు సత్యాతి-సత్యమైన సేవను చేస్తారు. ఆ సంఘ-సేవకులైతే
హద్దు సేవ చేస్తారు. ఇది ఆత్మికమైన సత్యమైన సేవ. తండ్రి అర్థం చేయిస్తారు, భగవంతుడు
పునర్జన్మ రహితుడని భగవానువాచ ఉంది. శ్రీకృష్ణుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు.
గీతలో వారి పేరు వేశారు. నారాయణుని పేరు ఎందుకు వేయరు? శ్రీకృష్ణుడే శ్రీనారాయణునిగా
అవుతారని కూడా ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడు రాకుమారుడు, ఆ తర్వాత రాధతో స్వయంవరం
జరిగింది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది. శివబాబా మనల్ని
చదివిస్తున్నారని అర్థం చేసుకుంటారు. వారు తండ్రి కూడా, టీచరు మరియు సద్గురువు కూడా.
సద్గతిని ఇస్తారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు శివుడే. వారు అంటారు, నన్ను నిందించేవారు
ఉన్నత స్థానాన్ని పొందలేరు. పిల్లలు ఒకవేళ చదవకపోతే టీచరు పరువు పోతుంది. తండ్రి
అంటారు, మీరు నా పరువు పోగొట్టకండి. చదువుతూ ఉండండి. లక్ష్యము-ఉద్దేశ్యము అయితే
ఎదురుగా నిలబడి ఉంది. గురువును నిందించేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు అన్న మాటను
ఆ గురువులు తమకు వర్తించేలా చెప్పుకుంటారు, దానితో మనుష్యులు భయపడిపోతారు. ఏ శాపము
ఇవ్వకూడదు అని అనుకుంటారు. గురువు ద్వారా లభించిన మంత్రాన్నే వినిపిస్తూ ఉంటారు.
సన్యాసులను, మీ ఇంటిని ఎలా వదిలారు? అని అడిగితే, ఈ వ్యక్త విషయాలను అడగకండి అని
అంటారు. అరే, ఎందుకు చెప్పరు, మీరు ఎవరు అనేది మాకు ఎలా తెలుస్తుంది? తెలివైన బుద్ధి
కలవారు ఇలా మాట్లాడుతారు. అజ్ఞాన కాలములో కొందరికి నషా ఉంటుంది. స్వామి
రామతీర్థుడికి స్వామి నారాయణ అనే అనన్య శిష్యుడు ఉండేవారు. అతని పుస్తకాలు మొదలైనవి
బాబా చదివారు. బాబాకు ఇవన్నీ చదివే అభిరుచి ఉండేది. బాల్యములో వైరాగ్యము కలుగుతూ
ఉండేది. ఆ తర్వాత ఒకసారి సినిమా చూసారు, అంతే, వృత్తి పాడైపోయింది. సాధు వృత్తి
మారిపోయింది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఆ గురువులు మొదలైనవారంతా భక్తి
మార్గమువారు. సర్వుల సద్గతిదాత అయితే ఒక్కరే, వారినే అందరూ తలచుకుంటారు. నాకైతే
గిరిధర గోపాలుడు తప్ప ఇంకెవ్వరూ లేరు అని పాడుతారు కూడా. గిరిధరా అని శ్రీకృష్ణుడిని
అంటారు. వాస్తవానికి నిందలు ఈ బ్రహ్మా పొందుతారు. శ్రీకృష్ణుని ఆత్మ అంతిమములో
పల్లెటూరి బాలునిగా, తమోప్రధానముగా ఉన్నప్పుడు నిందలు పడ్డారు. వాస్తవానికి ఇతనే
శ్రీకృష్ణుని ఆత్మ కదా. పల్లెటూరిలో పెరిగారు. దారిలో వెళ్తుండగా బ్రాహ్మణుడు
చిక్కుకుపోయారు అనగా బాబా ప్రవేశించారు, ఆ తర్వాత ఎన్ని నిందలు పడ్డారు. అమెరికా
వరకూ విషయము వ్యాపించింది. ఇది అద్భుతమైన డ్రామా. ఇప్పుడు మీకు తెలిసింది కావున
సంతోషము కలుగుతుంది. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు తండ్రి అర్థం
చేయిస్తారు. మనము బ్రాహ్మణులుగా ఎలా ఉండేవారము, ఆ తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా...
ఎలా అయ్యాము అనేది అర్థం చేయిస్తారు. ఇది 84 జన్మల చక్రము, ఇదంతా స్మృతిలో
ఉంచుకోవాలి. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి, వీటి గురించి ఎవరికీ
తెలియదు. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని పిల్లలైన మీరు భావిస్తారు, ఇందులో
కష్టమేమీ లేదు. ఇక్కడ ఆసనాలు మొదలైనవి వేయమని ఎవరూ చెప్పరు. హఠయోగాన్ని ఎంత కఠినముగా
నేర్పిస్తారంటే, ఇక అడగకండి. కొందరికైతే మెదడే పాడైపోతుంది. తండ్రి ఎంత సహజముగా
సంపాదన చేయిస్తారు. ఇది 21 జన్మల కొరకు సత్యమైన సంపాదన. మీ అరచేతిలో వైకుంఠము ఉంది.
తండ్రి పిల్లల కోసం స్వర్గమనే కానుకను తీసుకువస్తారు. ఇలా మనుష్యులెవ్వరూ అనలేరు.
తండ్రియే అంటారు, ఇతని ఆత్మ కూడా వింటుంది. పిల్లలు ఉదయాన్నే లేచి ఇలా-ఇలా
ఆలోచించాలి. భక్తులు కూడా ఉదయాన్నే ఒక చిన్న సంచిలో చేయి పెట్టి గుప్తముగా మాలను
జపిస్తూ ఉంటారు. దానిని గోముఖము అని అంటారు. దాని లోపల చేయి పెట్టి రామా, రామా...
అని అంటూ మాల తిప్పుతారు. వాయిద్యము మోగుతున్నట్లుగా ఉంటుంది. వాస్తవానికి తండ్రిని
స్మృతి చేయడమే గుప్తమైన స్మృతి. అజపాజపము (నిరంతర స్మృతి) అని దీనినే అంటారు. ఇది
ఎంత అద్భుతమైన డ్రామా అనే సంతోషము ఉంటుంది. ఇది అనంతమైన నాటకము. ఇది మీ బుద్ధిలో
తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా ఇది నంబరువారు పురుషార్థానుసారముగా ఉంది.
వాస్తవానికి ఇది చాలా సహజము. మనల్ని అయితే ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు. కేవలం
వారినే స్మృతి చేయాలి. వారసత్వము కూడా వారి నుండే లభిస్తుంది. ఈ బాబా అయితే తక్షణమే
అంతా వదిలేశారు ఎందుకంటే మధ్యలో బాబా ప్రవేశించారు కదా. సర్వస్వాన్ని ఈ మాతలకు
అర్పించారు. ఇంత పెద్ద స్థాపన చేయాలి కావున సర్వస్వాన్ని ఈ సేవలో పెట్టండి అని
తండ్రి అన్నారు. ఒక్క పైసా కూడా ఎవరికీ ఇవ్వకూడదు. అంతగా నష్టోమోహులుగా ఉండాలి. ఇది
చాలా ఉన్నతమైన గమ్యము. మీరాబాయి లోకమర్యాదలను, వికారీ కులమర్యాదలను వదిలేశారు కావున
ఆమె పేరు ఎంత ప్రఖ్యాతి చెందింది. ఈ కన్యలు కూడా మేము వివాహము చేసుకోము అని అంటారు.
లక్షాధికారులవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, మేము వివాహము చేసుకోము, మేమైతే
అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. ఇటువంటి నషా ఎక్కాలి.
పిల్లలను అనంతమైన తండ్రి కూర్చుని అలంకరిస్తారు. ఇందులో ధనము మొదలైనవాటి అవసరము కూడా
లేదు. వివాహానికి ముందు వనవాహములో కూర్చోబెడతారు, చినిగిపోయిన పాత బట్టలను
వేయిస్తారు. మళ్ళీ వివాహము తర్వాత కొత్త బట్టలు, నగలు మొదలైనవి వేయిస్తారు. ఈ తండ్రి
అంటారు, నేను మిమ్మల్ని జ్ఞాన రత్నాలతో అలంకరిస్తున్నాను, తర్వాత మీరు ఈ
లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇలా ఇంకెవ్వరూ అనలేరు.
తండ్రియే వచ్చి పవిత్ర ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తారు, అందుకే విష్ణువుకు
కూడా 4 భుజాలను చూపిస్తారు. శంకరునితో పాటు పార్వతిని, బ్రహ్మాతోపాటు సరస్వతిని
చూపించారు. ఇప్పుడు బ్రహ్మాకు పత్ని ఎవరూ లేరు. ఇతను తండ్రికి చెందినవారిగా
అయిపోయారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. తల్లి-తండ్రి అయితే వీరే కదా. ఇతను ప్రజాపిత
కూడా, మళ్ళీ ఇతని ద్వారా తండ్రి రచిస్తున్నారు కావున ఇతను తల్లి కూడా అవుతారు.
సరస్వతి బ్రహ్మాకు కుమార్తెగా పిలువబడతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తారు. ఏ విధంగా బాబా ఉదయాన్నే లేచి విచార సాగర మంథనము చేస్తారో, అలా పిల్లలు
కూడా ఫాలో చేయాలి. పిల్లలైన మీకు తెలుసు - ఈ గెలుపు-ఓటముల అద్భుతమైన ఆట తయారుచేయబడి
ఉంది, దీనిని చూసి సంతోషము కలుగుతుందే కానీ ద్వేషము కలగదు. మనము మొత్తం డ్రామా
ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నాము కావున ద్వేషము అన్న మాటే లేదు అని మనం భావిస్తాము.
పిల్లలైన మీరు కష్టపడాలి కూడా. గృహస్థ వ్యవహారములో ఉండాలి, పావనముగా తయారయ్యే
బాధ్యతను తీసుకోవాలి. యుగళులమైన మేము కలిసి ఉంటూ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా
అవుతాము. అయితే కొందరు ఫెయిల్ కూడా అవుతారు. బాబా చేతిలో శాస్త్రాలు మొదలైనవేమీ లేవు.
నేను బ్రహ్మా ద్వారా మీకు సర్వ వేద-శాస్త్రాల సారాన్ని వినిపిస్తాను అని శివబాబా
చెప్తున్నారు, శ్రీకృష్ణుడు కాదు. ఎంత తేడా ఉంది! అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.