‘‘స్వ పరివర్తన యొక్క వేగాన్ని తీవ్రతరము చేసి
స్వభావ-సంస్కారాల సమాప్తి సమారోహాన్ని జరుపుకోండి, ప్రతి
సంకల్పము, మాట మరియు కర్మలో బ్రహ్మాబాబాను కాపీ చేయండి’’
ఈ రోజు బాప్ దాదా అందరి మస్తకముపై మెరుస్తున్న మూడు భాగ్యపు
గుర్తులను చూస్తున్నారు. ఒకటి - తండ్రి ద్వారా పాలన యొక్క
భాగ్యము, రెండు - శిక్షకుని రూపములో శిక్షణ యొక్క భాగ్యము, మూడు
- సద్గురువు ద్వారా వరదానాల భాగ్యము. మూడు భాగ్యాలను మెరుస్తూ
ఉన్నట్లు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకము మూడు భాగ్యాలతో
మెరుస్తూ ఉంది. ఇటువంటి భాగ్యము మరెవ్వరి మస్తకములోనూ మెరుస్తూ
కనిపించదు. కానీ మీ అందరి మస్తకము భాగ్యముతో మెరుస్తూ ఉంది.
మీరందరూ కూడా మీ భాగ్యాన్ని చూసుకుంటున్నారు కదా! బాప్ దాదా ఏమి
చూసారంటే, భాగ్యమైతే అందరికీ లభించింది కానీ భాగ్యపు మెరుపు
అందరిదీ ఒకే విధముగా లేదు. కొందరి మెరుపు చాలా ఎక్కువగా ఉంది,
కొందరి మెరుపు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి బాప్
దాదా అయితే అందరికీ ఒకే సారి, ఒకే విధమైన భాగ్యాన్ని ఇచ్చారు.
అందరికీ ఒకే చదువును చదివిస్తారు, ఒకే విధమైన పాలనను ఇచ్చారు
మరియు వరదానాలు కూడా ఒకే విధముగా ఇచ్చారు. ఆది రత్నాలకు అయినా
లేక చివరి సమయములో వచ్చేవారికైనా, అందరికీ ఒకే మురళి ద్వారా
పాలన లభిస్తుంది, చదువు లభిస్తుంది, వరదానాలు కూడా అందరికీ ఒకటే
లభిస్తాయి. ఆది రత్నాలకు మురళి వేరుగా ఉండదు, అందరికీ ఒకటే
ఉంటుంది. కానీ మెరుస్తూ ఉన్న భాగ్యము నంబరువారుగా కనిపిస్తూ
ఉంది. బాబా యొక్క ప్రేమపూర్వక పాలన అందరికీ ఒకే విధముగా
లభిస్తుంది. ప్రతి ఒక్కరి నోటి నుండి ‘‘నా బాబా’’ అనే వస్తుంది.
ముందు వచ్చినవారైనా లేక వెనక వచ్చినవారైనా కానీ, ప్రతి ఒక్కరూ
తమ అధికారముతో ‘‘నా బాబా’’ అని అంటారు. బాబా నుండి ప్రేమ
లభించిందా అని ఎవరినైనా అడగండి? అప్పుడు ‘నాకైతే బాబా ప్రేమ
అందరికన్నా ఎక్కువ లభిస్తుంది’ అని నషాతో చెప్తారు. నా బాబా అని
మనస్ఫూర్తిగా చెప్పేవారు నా ప్రేమ అందరికన్నా ఎక్కువగా ఉంది అని
నషాతో చెప్తున్నారా? బాబా ప్రేమ ముందుగా నాతో ఉంది అని అంటారు
ఎందుకంటే ప్రేమయే బాబా ఇచ్చే పాలన. నా బాబా అని స్వీకరించిన
కారణముగా మీరు బాబాకు చెందినవారిగా అయ్యారు మరియు బాబా మీ
వారయ్యారు.
ఈ రోజు మీరందరూ వచ్చారు, మీరు ప్రేమ అనే విమానములో
చేరుకున్నారు కదా! ప్రేమ ఆకర్షించి అందరినీ ఇక్కడకు
తీసుకువచ్చింది. అందరూ ప్రేమతో, ప్రశాంతముగా చేరుకున్నారు. ఈ
పరమాత్ముని ప్రేమ కేవలం ఇప్పుడు సంగమములోనే ప్రాప్తిస్తుంది.
భవిష్యత్తులో దేవాత్మల ప్రేమ ప్రాప్తిస్తుంది కానీ పరమాత్ముని
ప్రేమ ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది. బాప్ దాదా కూడా ఇటువంటి
పాత్రులైన ఆత్మలను చూసి ఏమంటారు? వాహ్ పిల్లలూ వాహ్! మీరు
మాత్రమే కోట్లలో కొద్దిమంది అయిన పాత్రులుగా అయ్యారు మరియు
ప్రతి కల్పము మీరే పాత్రులుగా అవుతారు. ఇటువంటి నషా
నడుస్తూ-తిరుగుతూ ఉంటుంది కదా! మీ హృదయము కూడా - ‘వాహ్ నా
భాగ్యము!’ అన్న పాటను పాడుతూ ఉంటుంది! ఈ పాటను పాడుతూ ఉంటారు
కదా! ఈ పిల్లలందరూ అధికారులు అని బాబాకు కూడా సంతోషము
కలుగుతుంది. స్వయాన్ని ఎవ్వరూ పరమాత్మ ప్రేమలో తక్కువగా
భావించడము లేదు. ప్రేమలో అందరూ పాస్ అయ్యారు. అందరికన్నా
ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది? అని బాప్ దాదా అడుగుతున్నారు.
అప్పుడు ఎవరిదని అంటారు? తమ ప్రేమ తక్కువ కాదు అని అందరికీ
తెలుసు. బాబా కూడా అంటారు - ప్రేమ అనే సబ్జెక్టులో అందరూ పాస్,
అందుకే నా బాబా అని అంటారు. ఎంత ప్రేమ ఉంది, అది ప్రతి ఒక్కరికీ
తెలుసు. కావున బాప్ దాదా ఏమి చూసారంటే, ప్రేమలో అయితే అందరూ
పాస్ అయ్యారు, కానీ ఇప్పుడు సమయమనుసారముగా స్వ పరివర్తన, ఇది
కూడా అవసరము. కేవలం స్వ పరివర్తన. ఈ సమయములో స్వ పరివర్తనలో
విశేషముగా సంస్కార పరివర్తన, స్వభావ పరివర్తన, వీటి అవసరముంది
అని బాబా వినిపించి ఉన్నారు.
ఇప్పుడు స్వ పరివర్తన యొక్క వేగము తీవ్రముగా ఉండాలి.
చేస్తున్నారు కూడా, అటెన్షన్ కూడా ఉంది, కానీ వేగము ఇప్పుడు
తీవ్రముగా ఉండాలి. బాప్ దాదాకు గుర్తుంది - కొత్త సంవత్సరములో
స్వ పరివర్తన, సంస్కార పరివర్తన చేయవలసిందే అని ఇంతకుముందు కూడా
బాబాకు ప్రతిజ్ఞ చేసారు, కానీ బాప్ దాదా ఏమి చూసారంటే సంస్కార
పరివర్తనలో ఎంత ఫాస్ట్ పురుషార్థము ఉండాలో, దాని వేగము మరింత
తీవ్రముగా ఉండాలి. మీరందరూ ఏమని భావిస్తున్నారు? సమయమనుసారముగా
ఎంతటి తీవ్ర వేగము ఉండాలో, దాని అనుసారముగా ప్రతి ఒక్కరిదీ
తీవ్ర పురుషార్థము ఉందా లేక మరింత ఎక్కువ ఉండాలా? ఎందుకంటే,
సమయమనుసారముగా, సమయములో పరివర్తన ఫాస్ట్ గా వస్తుంది. కావున
మీలో కూడా తీవ్ర పరివర్తన ఎప్పుడు జరుగుతుందంటే, సంకల్పము
చేసిన వెంటనే జరిగిపోవాలి. అయథార్థమైన సంకల్పాలు ఎలా
సమాప్తమవ్వాలంటే కాగితముపై బిందువు పెట్టినంత సహజముగా అవ్వాలి.
కాగితముపై బిందువును ఎంతసేపటిలో పెడతారు? అయథార్థ అనగా అనవసర
సంకల్పాలు, ఎంతో వేగముగా పరివర్తన అవ్వాలి. మరి బాప్ దాదా
ఆశిస్తున్న అంతటి వేగాన్ని తీసుకురాగలరా? ఉందా ధైర్యము?
ఇప్పటినుండి అంతటి వేగముతో బిందువును పెట్టగలము అని ఎవరైతే
భావిస్తున్నారో, ధైర్యము చేసే పిల్లలకు తండ్రి సహాయము చేస్తారు
అని అనుకుంటున్నారో, వారు చేతులెత్తండి. బాప్ దాదా పిల్లల
యొక్క దృఢ సంకల్పాన్ని చూసి అభినందనలు తెలియజేస్తున్నారు. బాప్
దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - చేయవలసిందే అన్న సంకల్పమే
దృఢ సంకల్పము. మరి ఈ రోజు ఈ సభలో అందరూ ఈ దృఢ సంకల్పాన్ని
చేసారు కదూ! మీరు చూసారా, దాదీలు చూసారా, మెజారిటీ అందరూ
చేతులెత్తారు. చూసారా! మరి రేపటి నుండి స్వభావ సంస్కారాల
సమాప్తి సమారోహాన్ని జరుపుకోవాలి. జరుపుకుందామా? ఎవరైతే
చేతులెత్తారో వారు మళ్ళీ చేతులెత్తండి, సమారోహాన్ని
జరుపుకుందామా? ఈ సమారోహాన్ని అయితే చాలా గొప్పగా జరుపుకోండి. ఏ
విధముగానైతే లక్ష్యాన్ని ధైర్యముతో పెట్టుకున్నారో, అదే విధముగా
లక్షణాలు కూడా ధైర్యముతో కూడినవి పెట్టుకున్నట్లయితే, అది
పెద్ద విషయమేమీ కాదు. లక్ష్యమే బాబా సమానముగా అవ్వడము అని
అన్నప్పుడు, ఇక లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానము చేసుకోవాలి.
బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. ఏ సంకల్పము, మాట, కర్మ చేసినా,
ముందుగా దానిని బ్రహ్మాబాబాతో పోల్చి చూడండి. కాపీ చేయండి. బయట
ప్రపంచములో కాపీ చేయడము నిషిద్ధము, కానీ బాప్ దాదా చెప్తున్నారు,
బ్రహ్మాబాబాను కాపీ చేయండి. నిరాకార బాబా గురించైతే ఏమంటారంటే
- వారికైతే దేహమే లేదు కనుక దేహభానము ఏముంటుంది! కానీ
బ్రహ్మాబాబా దేహధారియే కదా! వాస్తవానికి చూస్తే, సమర్పణ
అవ్వబోయేవారు చేతులెత్తండి, సమర్పణ అయినవారు చేతులెత్తండి.
సమర్పణ అయినప్పుడు ఏ సంకల్పము చేసారు? బాబా, ఈ తనువు, మనసు,
ధనము అన్నీ మీవే. ఇలానే సంకల్పము చేసారు కదా! చేసారా? చేసారా?
ఇందులో చేతులెత్తండి. మరి ఇప్పుడు సమర్పణ చేసారు, నాది అంటూ ఏదీ
లేదు, తనువు కూడా నాది కాదు, ధనము కూడా నాది కాదు. ఏ విధముగా
బ్రహ్మాబాబా శివబాబాకు సేవార్థము తమ శరీరాన్ని ఇచ్చేసారు. ఈ
శరీరము నాది కాదు, ఇది సేవ కోసమే అని బ్రహ్మాబాబాకు తెలుసు.
అలాగే మీరు మీ తనువు, మనసు, ధనము మూడింటినీ అర్పించినప్పుడు మీ
శరీరము బాబా సేవ కోసం నిమిత్తమైనది. బ్రహ్మాబాబా శరీరము సేవ
కోసం ఉన్నట్లుగా మీ శరీరము కూడా మీది కాదు, సేవ కోసమే ఉంది.
అటువంటప్పుడు దేహ-అభిమానము లేక దేహ-భానము యొక్క సంస్కారాలు
ఉండవచ్చా? ఒకవేళ - ఈ శరీరము విశ్వ సేవ కోసం ఉంది, ఇది నాది కాదు,
ఇది బాబా నాకు సేవ కోసం ఇచ్చారు అని స్మృతిలో ఉంచుకున్నట్లయితే,
దేహ-భానము కానీ, దేహ-అభిమానము కానీ ఉండదు. దేహ-అభిమానము ఎక్కువ
నష్టాన్ని కలిగిస్తుంది, దేహ-భానము దానికన్నా కొద్దిగా తక్కువ.
కానీ రెండింటినీ ఇచ్చేసారు కదా. ఫారమ్ నింపేటప్పుడు ఏమని
వ్రాస్తారు? టీచర్లు ఫారమ్ నింపిస్తారు కదా. ఏమని నింపిస్తారు?
నా ఈ జీవితము ఇక సేవ కోసమే. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో,
వారందరూ బాబాతో ప్రతిజ్ఞ చేసారు - తనువు, మనసు, ధనము బాబావే,
నావి కావు. ఈ సంస్కారాలేవైతే ఉత్పన్నమవుతాయో, అవి దేహ-భానము
లేక దేహ-అభిమానము కారణముగా వస్తున్నాయి. అందుకే, సంస్కార
సమాప్తి కోసం ఈ రోజు కూడా ప్రతిజ్ఞ చేసారు కదా. ఎందుకంటే బాబాను
ప్రత్యక్షము చెయ్యటములో విఘ్నాలు వేసేవి ఇవే. అందరికీ ఉత్సాహము
ఉంది, బాప్ దాదా వింటూ ఉంటారు, మీరు కూడా అంటూ ఉంటారు, బాబాను
ప్రత్యక్షము చేయాలి అని. ఇప్పటివరకు బ్రహ్మాకుమారీలు,
బ్రహ్మాకుమారులు ప్రత్యక్షమయ్యారు. తండ్రి అయిన భగవంతుడు
వచ్చారు అన్న తండ్రి ప్రత్యక్షత ఇంకా గుప్తముగా ఉంది.
పురుషార్థము చేస్తున్నారు కానీ ఇప్పుడు - మా తండ్రి వచ్చేసారు,
ఇది భగవానువాచ అన్న ధ్వని ప్రత్యక్షముగా వ్యాపించాలి, అంతేకానీ
బ్రహ్మాకుమారీల వాచా కాదు. ఇప్పుడు ఈ ప్రత్యక్షత జరిగేదే ఉంది.
ఈ స్వభావ సంస్కారాలు పరివర్తన అవ్వటము ద్వారా మీ ఒక్కొక్కరి
ముఖము మరియు నడవడికతో ప్రత్యక్షత జరుగుతుంది. బాబాను
ప్రత్యక్షము చేయాలి, చేస్తున్నారు, కానీ అందరి చెవులలో ఈ శబ్దము
వ్యాపించాలి - భగవంతుడు వచ్చేసారు, తండ్రి వచ్చేసారు. ఇది
జరగవలసిందే కదా! చెతులెత్తండి, జరగవలసిందేనా? జరగవలసిందేనా?
చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు. అందరి మనసులలో తపన ఉంది
మరియు ప్రత్యక్షత జరగవలసిందే అని బాప్ దాదా సంతోషిస్తున్నారు.
దీని కోసం రేపటి నుండి సంస్కార స్వభావాలను పరివర్తన చేసుకోవాలి,
దానికి సాధనమేమిటంటే - బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ తమ చార్టులో
శుభ భావన, శుభ కామనల పట్ల విశేషముగా అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది.
బయటివారికి శుభ భావనలు, కామనలు పెట్టే హోమ్ వర్కును ఇచ్చి మీరు
పెట్టగలరు అని చెప్పారు కదా. మరి మీరైతే తప్పకుండా పెట్టగలరు.
ఏ సమయములోనైనా ఎవరి స్వభావ, సంస్కారాలైనా ఎప్పుడు ఎదిరిస్తాయంటే,
ఆ ఆత్మ పట్ల ఆ సమయములో శుభ భావన, శుభ కామన లేనప్పుడు. ఒకవేళ
మీరు కూడా - నేను ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామనను
ఉంచాల్సిందే అని అమృతవేళ నుండి సంకల్పము చేసినట్లయితే, అప్పుడు
- స్వభావ-సంస్కారాలను పరివర్తన చేయాల్సిందే అన్న సంకల్పమేదైతే
మీరు చేసారో, దానిని పూర్తి చేయగలుగుతారు. పరిస్థితులు వస్తాయి,
వాటి పని రావడము, మాయ కదా! మీ పని విజయాన్ని పొందడము. కావున
రేపు, నిమిత్తమైనవారు పరస్పరములో గ్రూపుగా అయ్యి, ఏదైతే
సంకల్పము చేసారో, దాని గురించి పరస్పరము ఆత్మిక సంభాషణ చేసుకుని,
ఆ చేసిన సంకల్పాన్ని భవిష్యత్తులో ఎలా ప్రాక్టికల్లోకి
తీసుకురావాలి అని మాట్లాడుకోండి. ఫినిష్, బిందువును పెట్టేయండి.
చేతులెత్తారు కదా! ముందువారు చేతులెత్తారు! కనుక మీరు నిమిత్తం
అవ్వాల్సి ఉంటుంది. బ్రహ్మాబాబా ఎదురుగా ఎన్ని సంస్కారాలు
కలవారు ప్రారంభములో వచ్చారు. ఆదిలో బ్రహ్మాబాబా ఎంతగా
సంస్కారాల ఆటను చూసారు. కానీ బాబా యొక్క సహయోగముతో ముందుకు
వెళ్తూ ఇతరులను కూడా ముందుకు నడిపించారు, దాని ప్రతిఫలమే ఈ రోజు
ఇంతటి సంఖ్య. కదిలించే విషయాలు వచ్చినప్పటికీ అచలముగా ఉన్నారు.
దాని పరిణామముగా ఎన్ని సెంటర్లు తెరుచుకున్నాయి, ఎన్ని
కార్యక్రమాలు జరుగుతున్నాయి!
ఈ మధ్య ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి! జరిగాయి కదా! ఈ
రిజల్టుకు కారణము బ్రహ్మాబాబా ధైర్యము. మొదటిలో బ్రహ్మాబాబా
ఒక్కరే ఉన్నారు, మీరు తర్వాత వచ్చారు, కానీ ఒక్కరిగానే ఉంటూ
ధైర్యాన్ని ఉంచి ముందుకు నడిచారు. రిజల్టులో ప్రాక్టికల్
ప్రమాణముగా మీరందరూ సహచరులు వచ్చారు. కనుక ధైర్యముంది కదా!
బ్రహ్మాబాబా ఒక్కరిగానే ధైర్యమును ఉంచారు, మీరైతే చాలామంది
ఉన్నారు. కావున ఫాలో ఫాదర్. అందరూ స్వయాన్ని బ్రహ్మాబాబా
పిల్లలుగా, సహచరులైన పిల్లలుగా భావిస్తున్నారు కదా! తోడుగా
ఉన్నారు, తోడుగా నడుస్తారు మరియు బ్రహ్మాబాబాతో పాటు
రాజ్యములోకి వస్తారు. ఇప్పుడింకా సమయముంది. ఎలా అయితే
బ్రహ్మాబాబా ధైర్యమును ఉంచారో, దాని రిజల్టును చూస్తున్నారో,
అంతటి సంగఠనలో ధైర్యమనే అడుగును మీరు వేస్తే జరగనిదంటూ
ఏముంటుంది! కల్పకల్పము జరిగింది, జరిగేదే ఉంది.
మరి ఇప్పుడు బాబా ఏమి కోరుకుంటున్నారు అనేది వినిపించారు.
మీరందరూ కేవలం ఒక్క విషయాన్ని చేయండి. ఆ ఒక్క విషయమేమిటంటే -
సాధారణ పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థములోకి పరివర్తన చేయండి.
బాప్ దాదా ఏమి చూసారంటే, అక్కడక్కడ నిర్లక్ష్యము వస్తుంది -
‘అయ్యేదే ఉందిలే, విజయము మన జన్మ సిద్ధ అధికారము కదా’, ఈ మాటలు
జ్ఞానము ఆధారముగా నిశ్చితమే కానీ నిర్లక్ష్యములో కూడా ఇవే మాటలు
వస్తాయి, ‘మా విజయము నిశ్చితము, అది లభించే తీరుతుంది, ఏ పనీ
ఆగలేదు, జరగవలసిందే’. ఒకటి, పురుషార్థముతో ఈ మాటలను అనడము,
రెండు, నిర్లక్ష్యములో కూడా ఇవే మాటలు వస్తాయి. ఏ పనీ ఆగదు,
జరగవలసిందే... ఇది నిర్లక్ష్యము, ఈ సంస్కారాన్ని కూడా చెక్
చేసుకోండి. నిర్లక్ష్యానికి గుర్తు ఏమిటంటే - వారి జీవితములో
చిన్న-చిన్న విషయాలలో అలసట కనిపిస్తుంది. ముఖములో ఆ సంతోషపు
మెరుపు కనిపించదు. సేవతో పుణ్యము తయారవుతున్నప్పుడు ముఖములో
సంతోషము కనిపించాలి. ఏదో ఒక విధమైన అలసట ఉండటానికి కారణము
ఏమిటంటే ఏదో ఒక విషయము యొక్క నిర్లక్ష్యము. చేయాల్సిందే
అన్నప్పుడు సంతోషముగా చేయండి. మీ ముఖము సేవ చేయాలి, మీ నడవడిక
సేవ చేయాలి. ఈ రోజు మెజారిటీ పిల్లలు సంస్కార సమాప్తిలో
చేతులెత్తినందుకు బాప్ దాదా పదే-పదే అభినందనలు
తెలియజేస్తున్నారు.
అచ్ఛా - ఈ గ్రూపులో మొదటిసారిగా వచ్చినవారు లేవండి. ఎంతమంది
ఉన్నారో చూసారా? చాలామంది ఉన్నారు. చేతులు ఊపండి. మొదటిసారి
వచ్చినవారికి బాబాను కలుసుకుంటున్నందుకు అభినందనలు. విశేషముగా
సమయమనుసారముగా ఇప్పుడు మీరు తీవ్ర పురుషార్థము చేయవలసి ఉంటుంది.
బాప్ దాదా ఏం చెప్తున్నారంటే - ఎవరైతే తీవ్ర పురుషార్థము
చేస్తారో, ఢీలా-ఢాలాగా చెయ్యటం కాదు, వారు లాస్ట్ సో ఫాస్ట్,
ఫాస్ట్ సో ఫస్ట్ అవుతారు. అటువంటి అద్భుతము చేయండి. అవకాశము
ఉంది. మేము ఆలస్యముగా వచ్చాము కదా అని అనుకోకండి. అలా కాదు.
ఫాస్ట్ గా వెళ్ళగలరు. కానీ ప్రతి సమయము తీవ్ర పురుషార్థము
చేయవలసిందే, మారవలసిందే. చూద్దాములే, ఆలోచిద్దాములే అని లే,
లే... అనవద్దు. బాగుంది, మీ ఇల్లు, దాత ఇల్లు మంచిగా
అనిపించింది కదా. సోదర-సోదరీలందరూ కూడా మీకు స్వాగతము
పలుకుతున్నారు. అచ్ఛా!
ఇప్పుడు నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలు బాప్ దాదా యొక్క
స్నేహపూర్వక ప్రియస్మృతులను స్వీకరించండి. దూరంగా
కూర్చున్నప్పటికీ కొంతమంది పిల్లలు చూస్తున్నారు కూడా, మిలనము
కూడా జరుపుకుంటున్నారు అని బాప్ దాదాకు తెలుసు. నలువైపులా ఉన్న
ఆ పిల్లలకు బాప్ దాదా ఇదే చెప్తున్నారు - ఎలా అయితే ఇప్పుడు
అందరూ మెజారిటీ చేతులెత్తారో, సంస్కార సమాప్తిలో, ఇప్పుడు
మీరందరూ కలిసి ఒకే సంకల్పము రూపీ చేతిని ఎత్తుతున్నారు, మేమంతా
కలిసి సమాప్తి సమయాన్ని సమీపముగా తీసుకురావడానికి సంకల్పము
చేస్తున్నాము మరియు నలువైపులా సంపూర్ణ సమయము వచ్చినప్పుడు ‘మా
బాబా వచ్చేసారు’ అని బ్రహ్మాబాబా, శివబాబా, ఇద్దరినీ
ప్రత్యక్షము చేస్తాము. అందరి నోటి నుండి బాబా ప్రత్యక్షత
గురించిన మాటలే వస్తాయి. ఈ సంవత్సరము ‘బాబాను ప్రత్యక్షము
చేయవలసిందే’ అని ఇదే దృఢ సంకల్పము చేయండి. సగం పనైతే చేసారు,
పిల్లలను బాబా విశ్వము ఎదుట ప్రత్యక్షము చేసారు. ఇప్పుడు
పిల్లల పనేమిటంటే - ‘భగవంతుడు వచ్చేసారు’ అన్న శబ్దాన్ని
విశ్వములోని ఒక్కొక్క బిడ్డ వరకు చేర్చాలి. కావున అందరినీ బాప్
దాదా చూసి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్నేహాన్ని, హృదయపూర్వక
ప్రేమను, మనసులోని ఉల్లాస-ఉత్సాహాల సహితముగా ప్రియస్మృతులను
అందిస్తున్నారు. అచ్ఛా!
సేవా టర్న్ కర్ణాటక జోన్ వారిది: సేవ అవకాశాన్ని తీసుకోవడము
అనగా బాబాకు సమీపముగా వచ్చే అవకాశము లభించడము. చూడండి, సేవ
కారణముగా ఎంతమందికి వచ్చే అవకాశము లభించింది. అందరి ఆశీర్వాదాలు
నిమిత్త టీచర్లు అయిన మీకు లభిస్తాయి ఎందుకంటే సేవలో ధైర్యము
ఉంచారు మరియు ఇంతమందికి అవకాశము లభించింది. బాప్ దాదా చూసారు -
కొత్తకొత్తవారు కూడా మొదటిసారిగా చాలామంది వచ్చారు. కర్ణాటక
నుండి మొదటిసారి వచ్చినవారు పొడవుగా చేతులెత్తండి. మొదటిసారి
వచ్చినవారు కూడా చాలామంది ఉన్నారు. మంచిది. కర్ణాటక వృద్ధి
బాగుంది. ఇప్పుడు ఎలా అయితే వృద్ధి అయ్యిందో అలాగే తీవ్ర
పురుషార్థము యొక్క విధి యొక్క అలను కూడా నలువైపులా
వ్యాపింపజేయండి. నంబరు తీసుకోండి. సంస్కార సమాప్తిలో నంబరు
తీసుకోండి. తీసుకోగలరా? మేము మొదటి నంబరు తీసుకోగలము అని
భావించేవారు చేతులెత్తండి. మంచిది. ఇలా పరస్పరము సంగఠనలా అయ్యి
ప్రోగ్రామ్ తయారుచేయండి, అందరూ ఒక్కటే. భిన్న-భిన్న స్థానాలు
ఉన్నాయి కానీ అందరూ ఒక్కటే. ఈ అద్భుతము చేసి చూపించండి. ఉంది
కదా ధైర్యము? ధైర్యముందా? బాప్ దాదా వద్దకు సమాచారమైతే వస్తూ
ఉంటుంది. మధుబన్ కు ప్రతి నెల మీ పరివర్తన యొక్క సమాచారాన్ని
వ్రాయండి. వ్రాస్తారు కదా! ప్రతి నెల యొక్క సమాచారము.
అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడిక నంబరువన్ గా అయ్యి చూపించండి.
మంచిది. బాప్ దాదా ఏమి చూసారంటే - సేవ బాగుంది, ఇప్పుడు సంగఠనను
చూడాలని కోరుకుంటున్నారు. ఉదాహరణగా అవ్వండి. రెడీనా? రెడీ?
చేతులెత్తండి. మీరు చూడండి, ఒక్క నెలలో రిజల్టు వస్తుంది. అచ్ఛా,
చాలా-చాలా విశేషమైన ప్రియస్మృతులు.