21-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
16.12.20
‘‘సాక్షాత్తు బ్రహ్మాబాబా సమానంగా కర్మయోగీ ఫరిశ్తాగా
అవ్వండి, అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి’’
ఈ రోజు బ్రాహ్మణ ప్రపంచము యొక్క రచయిత అయిన బాప్ దాదా తమ
బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తూ-చూస్తూ హర్షిస్తున్నారు. ఇది ఎంత
చిన్నని ప్రియమైన ప్రపంచము. ప్రతి బ్రాహ్మణుని మస్తకముపై
భాగ్యపు సితార మెరుస్తూ ఉంది. నంబరువారుగా ఉన్నప్పటికీ ప్రతి
ఒక్కరి సితారలో భగవంతుడిని గుర్తించే మరియు భగవంతునికి
చెందినవారిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యపు మెరుపు ఉంది. ఏ తండ్రి
గురించైతే ఋషులు, మునులు, తపస్వీలు మాకు తెలియదు, మాకు తెలియదు
అంటూ వెళ్ళిపోయారో, అటువంటి తండ్రిని బ్రాహ్మణ ప్రపంచములోని
ఎంతో అమాయకులైన ఆత్మలు తెలుసుకున్నారు మరియు పొందారు. ఈ భాగ్యము
ఏ ఆత్మలకు ప్రాప్తిస్తుంది? సాధారణ ఆత్మలకు. బాబా కూడా సాధారణ
తనువులో వస్తారు, అలాగే సాధారణ ఆత్మలైన పిల్లలే గుర్తిస్తారు.
నేటి ఈ సభలో చూడండి, ఎవరు కూర్చుని ఉన్నారు? మిలియనీర్లు,
బిలియనీర్లు కూర్చుని ఉన్నారా? సాధారణ ఆత్మల గాయనమే ఉంది.
బాబాకు పేదల పెన్నిధి అన్న గాయనము ఉంది. మిలియనీర్ల పెన్నిధి
అని గాయనము లేదు. బుద్ధివంతులకంటే బుద్ధివంతుడైన బాబా
మిలియనీర్ల బుద్ధిని మార్చలేరా? అదేమంత పెద్ద విషయము! కానీ
డ్రామాలో చాలా మంచి కళ్యాణకారీ నియమము తయారై ఉంది, అదేమిటంటే
పరమాత్మ కార్యములో చుక్క-చుక్క కలిసి చెరువు తయారవ్వటము అనేది
ఉంది. అనేకాత్మల భవిష్యత్తు తయారవ్వాలి. 10-20 మందిది కాదు,
అనేక ఆత్మలది సఫలమవ్వాలి, అందుకే చుక్క-చుక్క కలిసి చెరువు
తయారవ్వటము అన్న గాయనము ఉంది. మీరంతా ఎంతగా తనువు-మనసు-ధనమును
సఫలం చేసుకుంటూ ఉంటారో, అంతగానే సఫలతా సితారలుగా తయారయ్యారు.
అందరూ సఫలతా సితారలుగా అయ్యారా? అలా తయారయ్యారా లేక ఇప్పుడింకా
తయారవ్వాలా, ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. చేస్తాము, చూస్తాము,
చేయవలసిందే కదా... ఇలా ఆలోచించటము కూడా సమయాన్ని పోగొట్టుకోవటము,
భవిష్యత్తు మరియు వర్తమానము యొక్క ప్రాప్తిని పోగొట్టుకోవటము.
బాప్ దాదా వద్దకు కొంతమంది పిల్లల యొక్క ఒక సంకల్పము
చేరుకుంటుంది. బయటివారైతే పాపం అభాగ్యులు కానీ బ్రాహ్మణ ఆత్మలు
అభాగ్యులు కారు, ఆలోచనాపరులు, వివేకవంతులు. కానీ అప్పుడప్పుడు
కొంతమంది పిల్లల్లో ఒక బలహీన సంకల్పము తలెత్తుతుంది, అదేమిటో
చెప్పమంటారా. చెప్పమంటారా? అందరూ చేతులు ఎత్తుతున్నారు, చాలా
మంచిది. వినాశనమవుతుందా లేక అవ్వదా అని అప్పుడప్పుడు ఇలా
ఆలోచిస్తారు! 1999 యొక్క చర్చ కూడా పూర్తయిపోయింది, 2000 కూడా
పూర్తవ్వబోతుంది. ఇప్పుడిది ఇంకా ఎంతవరకు? బాప్ దాదా అనుకుంటూ
ఉంటారు - ఇది నవ్వొచ్చే విషయము ఎందుకంటే వినాశనం గురించి
ఆలోచించటము అంటే బాబాకు వీడ్కోలు ఇవ్వటము ఎందుకంటే వినాశనమైపోతే
బాబా పరంధామానికి వెళ్ళిపోతారు కదా! సంగమయుగముతో అలసిపోయారా?
దీనిని వజ్రతుల్యమైనది అని అంటారు కానీ బంగారు ప్రపంచాన్ని
ఎక్కువగా గుర్తు చేస్తారు, వినాశనము జరిగేదే ఉంది కానీ దాని
కోసం ఎందుకు ఎదురుచూస్తున్నారు? కొంతమంది పిల్లలు ఎలా
ఆలోచిస్తారంటే - సఫలం చేద్దాము కానీ రేపో, ఎల్లుండో
వినాశనమైపోతే మాది ఉపయోగపడనే పడదు, మాది సేవలో వినియోగించనే
వినియోగించబడదు కాబట్టి - చేద్దాము, ఆలోచించి చేద్దాము,
లెక్కపెట్టుకుని చేద్దాము, కొంచెం-కొంచెం చొప్పున చేద్దాము, ఈ
సంకల్పాలు బాబా వద్దకు చేరుకుంటాయి. కానీ ఒకవేళ ఈ రోజు
పిల్లలైన మీరు మీ తనువును సేవలో సమర్పణ చేసారనుకోండి, మనసును
విశ్వ పరివర్తన అనే వైబ్రేషన్లు వ్యాపింపజేయటంలో నిరంతరం
పెట్టారనుకోండి, ధనమేదైతే ఉందో అది వాస్తవానికి ప్రాప్తి ముందు
అసలేమీ కాదు, కానీ ఈ రోజు మీరు అర్పించారు మరియు రేపే వినాశనం
అయిపోతే మీది సఫలమైనట్లా లేక వ్యర్థమైనట్లా? ఆలోచించండి, సేవలో
అయితే ఉపయోగించలేదు, మరి సఫలమైనట్లా? మీరు ఎవరికోసం సఫలం చేసారు?
బాప్ దాదా కోసం సఫలం చేసారు కదా? మరి బాప్ దాదా అయితే అవినాశీ,
వారు వినాశనమవ్వరు! అవినాశీ ఖాతాలో అవినాశీ బాప్ దాదా వద్ద ఈ
రోజు మీరు జమ చేసారంటే, ఒక గంట క్రితమే జమ చేసినా సరే అవినాశీ
బాబా దగ్గర మీ ఖాతా ఒకటికి పదమాల రెట్లు జమ అవుతుంది. ఒకటికి
పదమాల రెట్లు ఇవ్వటానికి బాబా బంధించబడి ఉన్నారు. బాబా అయితే
వెళ్ళిపోరు కదా! పాత సృష్టి వినాశనమవుతుంది కదా! అందుకే మీరు
మనస్ఫూర్తిగా చెయ్యాలి. తప్పదు కదా అని చేసినా లేక ఎవరినో చూసి
చేసినా దానికి పూర్తి రిటర్న్ లభించదు. లభించటమైతే తప్పకుండా
లభిస్తుంది ఎందుకంటే దాతకు ఇచ్చారు కదా, కానీ పూర్తిగా లభించదు.
అందుకే ఇలా ఆలోచించకండి - అచ్ఛా, ఇప్పుడు వినాశనమైతే 2001 వరకు
కూడా కనిపించటం లేదు, ఇప్పుడైతే ఇంకా ప్రోగ్రాములు
తయారవుతున్నాయి, ఇళ్ళు తయారవుతున్నాయి, పెద్ద-పెద్ద ప్లాన్లు
తయారవుతున్నాయి, అందుకే 2001 వరకు కూడా వినాశనము అయ్యేలా
కనిపించటం లేదు. ఎప్పుడూ కూడా ఈ విషయాలను ఆధారంగా చేసుకొని
నిర్లక్ష్యులుగా అవ్వకండి. అకస్మాత్తుగా జరగనున్నది. ఈ రోజు
ఇక్కడ కూర్చున్నారు, గంట తర్వాత అయినా అవ్వవచ్చు, ఏమీ
అవ్వదులేండి, ఒక గంట తర్వాత ఏమవుతుందో అని భయపడకండి, కానీ అది
సంభవమే. ఇంత ఎవర్రెడీగా అయితే ఉండాల్సిందే. శివరాత్రి కల్లా
చేయాలి అని ఇలా ఆలోచించకండి. సమయము కోసం ఎదురుచూడకండి. సమయము
మీ రచన, మీరు మాస్టర్ రచయిత. రచయిత రచనకు ఆధీనమవ్వరు. రచన అయిన
సమయము మీ ఆజ్ఞానుసారంగా నడుస్తుంది. మీరు సమయము కోసం
ఎదురుచూడకండి, కానీ ఇప్పుడు సమయము మీ కోసం ఎదురుచూస్తూ ఉంది.
కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే - బాప్ దాదా 6 నెలల కోసం
అన్నారు కదా, కావున 6 నెలలైతే తప్పకుండా ఉంటుంది, ఉంటుంది కదా!
కానీ బాప్ దాదా అంటారు - ఈ హద్దు విషయాలను ఆధారంగా చేసుకోకండి,
ఎవర్రెడీగా ఉండండి. నిరాధారంగా ఉండాలి, ఒక్క క్షణములో
జీవన్ముక్తి. ఒక్క క్షణములో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి
అని ఛాలెంజ్ చేస్తారు. మరి మీరు ఒక్క క్షణములో స్వయమును
జీవన్ముక్తులుగా చేసుకోలేరా? అందుకే ఎదురుచూడకండి, సంపన్నంగా
అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోండి.
బాప్ దాదాకు పిల్లల ఆటను చూసి నవ్వు వస్తుంది కూడా. ఏ ఆటను చూసి
నవ్వు వస్తుంది? చెప్పమంటారా? ఈ రోజు మురళిని వినిపించటం లేదు,
సమాచారాన్ని వినిపిస్తున్నాము. ఇప్పటికీ చాలామంది పిల్లలకు
ఆటబొమ్మలతో ఆడుకోవటము చాలా మంచిగా అనిపిస్తుంటుంది.
చిన్న-చిన్న విషయాలు అనే ఆటబొమ్మలతో ఆడుకోవటము, చిన్న విషయాలను
పట్టుకుని ఉండటము, వీటిలో సమయాన్ని పోగొట్టుకుంటారు. ఇవన్నీ
సైడ్ సీన్స్. భిన్న-భిన్న సంస్కారాలకు చెందిన విషయాలు మరియు
నడవడిక అనేవి సంపూర్ణ గమ్యానికి చేరుకునేటప్పుడు మార్గ మధ్యములో
వచ్చే సైడ్ సీన్స్. వాటిని చూసి ఆగిపోవటము అంటే ఆలోచించటము,
ప్రభావములోకి రావటము, సమయాన్ని పోగొట్టుకోవటము, అభిరుచితో
వినటము, వినిపించటము, అటువంటి వాయుమండలాన్ని తయారుచెయ్యటము...
ఆగిపోవటము అంటే ఇదే. దీని వలన సంపూర్ణత అనే గమ్యానికి
దూరమైపోతారు. బాబా సమానంగా అవ్వాల్సిందే అని చాలా కష్టపడతారు,
చాలా కోరుకుంటారు, శుభ సంకల్పము, శుభ కోరిక ఉంది కానీ
శ్రమిస్తున్నా సరే ఆటంకం వచ్చేస్తుంది. రెండు చెవులు ఉన్నాయి,
రెండు కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది కనుక చూడటం, వినటం, మాట్లాడటం
జరుగుతుంది అని అంటారు. కానీ బాబా యొక్క చాలా పాత స్లోగన్ సదా
గుర్తు పెట్టుకోండి - చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి.
వింటూ కూడా దాని గురించి ఆలోచించకండి, వింటూ దానిని లోపల
ఇముడ్చుకోండి, వ్యాపింపజేయకండి. ఈ పాత స్లోగన్ ను గుర్తు
పెట్టుకోవడం తప్పనిసరి ఎందుకంటే రోజురోజుకూ ఎలా అయితే అందరి
పాత శరీరాల లెక్కలు పూర్తవుతూ ఉన్నాయో, అదే విధంగా అందరి పాత
సంస్కారాలు కూడా, పాత వ్యాధులు కూడా బయటికి వచ్చి సమాప్తం
అవ్వనున్నాయి. అందుకే - ఏమిటో ఇప్పుడు ఇంకా విషయాలు
పెరిగిపోతున్నాయి, ఇంతకుముందైతే ఇవి లేవు అని గాభరా పడకండి.
ఒకప్పుడు లేనివి ఇప్పుడు బయటికి వస్తున్నాయి మరియు రావాల్సిందే.
మీ ఇముడ్చుకునే శక్తికి, సహన శక్తికి, సర్దుబాటు శక్తికి,
నిర్ణయ శక్తికి పరీక్షలు ఇవి. 10 సంవత్సరాల కింద వచ్చిన పరీక్షే
ఇప్పుడు వస్తుందా ఏమిటి? బి.ఎ. క్లాసులో వచ్చే పేపర్ యమ్.ఏ.
క్లాసులో వస్తుందా? అందుకే - ఏమి జరుగుతుంది, ఇది జరుగుతుంది,
అది జరుగుతుంది... అని గాభరా పడకండి. ఆటను చూడండి. పరీక్షనైతే
పాస్ అవ్వండి, పాస్ విత్ ఆనర్ గా అవ్వండి.
బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు, పాస్ అయ్యేందుకు
అన్నింటికన్నా సహజ సాధనము - బాప్ దాదాకు పాస్ (దగ్గర) గా ఉండండి,
మీకు అవసరం లేని దృశ్యాలేవైతే ఉన్నాయో వాటిని పాస్ చేయండి (దాటెయ్యండి).
పాస్ గా ఉండండి (దగ్గరగా ఉండండి), పాస్ చెయ్యండి (దాటెయ్యండి),
పాస్ అవ్వండి (ఉత్తీర్ణులవ్వండి). ఇది కష్టమా? టీచర్లు
వినిపించండి, మధుబన్ వారు వినిపించండి. మధుబన్ వారు
చేతులెత్తండి. మధుబన్ వారు తెలివైనవారు. ముందుకు వచ్చి
కూర్చుంటారు, మంచిదే రండి. బాప్ దాదాకు సంతోషము అనిపిస్తుంది.
మీ హక్కును తీసుకుంటారు కదా? మంచిది, ఈ విషయంలో బాప్ దాదా
అసంతుష్టంగా లేరు, ముందు కూర్చోండి, ఏం ఫరవాలేదు. మధుబన్ లో
ఉంటున్నారు కావున ప్రత్యేక పాలన ఉండాలి కదా! కానీ పాస్ అన్న
మాటను గుర్తుంచుకోండి. మధుబన్ లో కొత్త-కొత్త విషయాలు జరుగుతాయి
కదా, దొంగలు కూడా వస్తారు. ఎన్నో కొత్త-కొత్త విషయాలు జరుగుతాయి.
ఇప్పుడు అందరి సమక్షంలో బాప్ దాదా వాటిని ఏం వినిపిస్తారు,
కొంచెం గుప్తంగా ఉంచుతారు కానీ అవి ఏమిటో మధుబన్ వారికి తెలుసు.
మనోరంజనం చేసుకోండి, తికమకపడకండి. తికమకపడటం ఒకటి, లేదంటే
మనోరంజనంగా భావించి ఆనందములో పాస్ చెయ్యటం (దాటెయ్యటం) మరొకటి.
మరి తికమకపడటము మంచిదా లేక వాటిని దాటి వేసి ఆనందములో ఉండటము
మంచిదా? పాస్ చెయ్యాలి (దాటెయ్యాలి) కదా! పాస్ అవ్వాలి (ఉత్తీర్ణులవ్వాలి)
కదా! కనుక పాస్ చెయ్యండి (దాటెయ్యండి). ఇదేమైనా పెద్ద విషయమా?
పెద్ద విషయమేమీ కాదు. విషయాన్ని పెద్దదిగా చేయటము లేక చిన్నదిగా
చేయటము అనేది మీ బుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే విషయాన్ని
పెద్దదిగా చేస్తారో, అటువంటివారి గురించి అజ్ఞానకాలములో కూడా
ఏమంటారంటే - వీరు తాడును కూడా పాముగా చేస్తారు అని. సింధీ భాషలో
‘‘నోరీ కో నాగ్’’ (తాడును పాముగా) గా చేస్తారు అని అంటారు.
ఇటువంటి ఆటను ఆడకండి. ఇప్పుడు ఈ ఆట సమాప్తమైపోవాలి.
ఈ రోజు విశేష సమాచారాన్ని అయితే వినిపించాము కదా, బాప్ దాదా
ఇప్పుడు ఒక సహజ పురుషార్థాన్ని వినిపిస్తారు. కష్టమైనదేమీ కాదు.
బాబా సమానంగా అవ్వాల్సిందే అని అందరికీ ఈ సంకల్పమైతే ఉండనే ఉంది.
అవ్వాల్సిందే, పక్కా కదా! విదేశీయులు, అవ్వాల్సిందే కదా?
టీచర్లు, అవ్వాలి కదా? ఎంతమంది టీచర్లు వచ్చారు! వాహ్! టీచర్లది
అద్భుతము. బాప్ దాదా ఈ రోజు టీచర్ల గురించి ఒక సంతోషకరమైన
వార్తను విన్నారు. ఆ సంతోషకరమైన వార్త ఏమిటో చెప్పండి. టీచర్లకు
ఈ రోజు గోల్డెన్ మెడల్ (బ్యాడ్జి) లభించింది. ఎవరికైతే గోల్డెన్
మెడల్ (బంగారు బ్యాడ్జి) లభించిందో వారు చేతులెత్తండి.
పాండవులకు కూడా లభించిందా? బాబా యొక్క తోటివారు మిగిలిపోకూడదు
కదా. పాండవులు బ్రాహ్మాబాబా యొక్క తోటివారు. (వారికి వేరే
రకమైన గోల్డెన్ ది లభించింది) పాండవులది రాయల్ గోల్డ్ మెడల్.
గోల్డెన్ మెడల్ లభించినవారికి బాప్ దాదా యొక్క కోటానుకోట్ల
రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు.
ఎవరైతే దేశ-విదేశాలలో వింటున్నారో మరియు ఎవరికైతే గోల్డెన్
మెడల్ లభించిందో, వారందరూ కూడా, మాకు కూడా బాప్ దాదా అభినందనలు
ఇచ్చారు అని భావించండి. వారు పాండవులైనా లేక శక్తులైనా, ఏ
కార్యానికి నిమిత్తులుగా అయినవారైనా కానీ, పరివారములో
ఉండేవారికి కూడా ఏదో ఒక విశేషత ఆధారంగా, ప్రత్యేకంగా దాదీలు
గోల్డెన్ మెడల్ ను ఇస్తారు. కనుక ఎవరికి ఏ విశేషత ఆధారంగా
లభించినా సరే, అంటే సమర్పణ అయినందుకైనా లేక ఏదైనా సేవలో
విశేషంగా ముందుకు వెళ్ళినవారికైనా దాదీల ద్వారా కూడా గోల్డెన్
బ్యాడ్జి లభించింది, అందుకే దూరంగా కూర్చుని వింటున్నవారికి
కూడా చాలా, చాలా అభినందనలు. దూరంగా కూర్చుని మురళిని వినేవారి
కోసమూ, గోల్డెన్ మెడల్ లభించినవారి కోసమూ, మీరందరూ ఒక్క చేతితో
చప్పట్లు కొట్టండి, వారు మీ చప్పట్లను చూస్తున్నారు. వారు కూడా
నవ్వుతున్నారు, సంతోషిస్తున్నారు.
బాప్ దాదా సహజ పురుషార్థం గురించి వినిపిస్తున్నారు - ఇప్పుడు
సమయమైతే అకస్మాత్తుగా వచ్చేదే ఉంది, ఒక గంట ముందు కూడా బాప్
దాదా ఎనౌన్స్ చెయ్యరు, చెయ్యరు, చెయ్యరు. నంబరు ఎలా తయారవుతుంది?
ఒకవేళ అకస్మాత్తుగా జరగకపోతే అది పరీక్ష ఎలా అవుతుంది? పాస్
విత్ ఆనర్ సర్టిఫికేట్, ఫైనల్ సర్టిఫికేట్ అయితే అకస్మాత్తుగా
జరిగినప్పుడే లభిస్తుంది. అందుకే దాదీల ఒక సంకల్పము బాప్ దాదా
వద్దకు చేరుకుంది. దాదీలు ఏం కోరుకుంటున్నారంటే - ఇప్పుడు బాప్
దాదా సాక్షాత్కారాల తాళాన్ని తెరవాలి, ఇది వారి సంకల్పము.
మీరందరూ కూడా కోరుకుంటున్నారా? బాప్ దాదా తాళాన్ని తెరుస్తారా
లేక మీరు నిమిత్తులుగా అవుతారా? అచ్ఛా, బాప్ దాదా తాళం తెరవాలా,
సరే. బాప్ దాదా హాజీ అంటారు, (అందరూ చప్పట్లు కొట్టారు) ముందు
పూర్తిగా వినండి. బాప్ దాదాకు తాళం తెరవడానికి ఆలస్యమేముంది,
కానీ ఎవరి ద్వారా తెరిపిస్తారు? ప్రత్యక్షత ఎవరు చెయ్యాలి?
పిల్లలా లేక బాబానా? బాబా కూడా పిల్లల ద్వారానే చెయ్యాలి
ఎందుకంటే ఒకవేళ జ్యోతిర్బిందు యొక్క సాక్షాత్కారము జరిగినా సరే...
కొంతమంది అభాగ్యులు... పాపం, అభాగ్యులే కదా, వారు అదేమిటి అనేది
కూడా తెలుసుకోలేరు. చివరిలో శక్తులు మరియు పాండవులైన పిల్లల
ద్వారానే బాబా ప్రత్యక్షమవ్వాలి. అందుకే బాప్ దాదా ఏం
చెప్తున్నారంటే - బాబా సమానంగా తయారవ్వవలసిందే అని పిల్లలందరి
సంకల్పము ఒక్కటే అయినప్పుడు, ఈ విషయంలో రెండు ఆలోచనలు లేవు కదా!
అందరి ఆలోచన ఒక్కటే కదా! అయితే బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యండి.
అశరీరిగా, బిందువుగా ఆటోమేటిక్ గా అయిపోతారు. బ్రహ్మాబాబా
పట్లనైతే అందరికీ ప్రేమ ఉంది కదా! చాలా వరకు ఏం గమనించడం
జరిగిందంటే - మామూలుగా అయితే అందరికీ ప్రేమ ఉంది, కానీ
విదేశీయులకు బ్రాహ్మాబాబాపై చాలా ప్రేమ ఉంది. వారు ఈ కళ్ళ
ద్వారా చూడలేదు కానీ అనుభవమనే నేత్రం ద్వారా విదేశీయులు
మెజారిటీ బ్రహ్మాబాబాను చూసారు మరియు ప్రేమ కూడా చాలా ఉంది. ఆ
మాటకొస్తే భారత్ లోని గోపికలు మరియు గోపులు కూడా ఉన్నారు, అయినా
కానీ బాప్ దాదా అప్పుడప్పుడు విదేశీయుల అనుభవాల కథలను
వింటుంటారు, భారతవాసులు కొంచెం గుప్తంగా ఉంచుతారు. వారు
బ్రహ్మాబాబా గురించి వినిపిస్తారు, వారు వినిపించే కథలను బాప్
దాదా కూడా వింటారు మరియు ఇతరులకు కూడా వినిపిస్తారు,
విదేశీయులకు అభినందనలు. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా,
ఆసియా, రష్యా, జర్మనీ... అనగా నలువైపుల ఉన్న విదేశీయులకు,
ఎవరైతే దూరంలో కూర్చుని కూడా వింటున్నారో, వారందరికీ కూడా బాప్
దాదా అభినందనలను తెలుపుతున్నారు, ప్రత్యేకంగా బ్రహ్మాబాబా
అభినందనలను తెలుపుతున్నారు. భారతీయులది కొంచెం గుప్తంగా ఉంటుంది,
వారు అంతగా ప్రసిద్ధి చెయ్యలేరు, గుప్తంగా ఉంచుతారు. ఇప్పుడు
ప్రత్యక్షం చెయ్యండి. ఇకపోతే, భారత్ లో కూడా చాలా మంచి-మంచివారు
ఉన్నారు. ఎటువంటి గోపికలు ఉన్నారంటే, ఒకవేళ వారి అనుభవాన్ని
ఇప్పటి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ విన్నారంటే వారి కళ్ళు
నుండి కూడా కన్నీరు వస్తుంది. అటువంటి అనుభవాలు ఉన్నాయి, కానీ
గుప్తంగా ఉంచుతారు. అంతగా తెలియజేయరు, అవకాశము కూడా తక్కువగా
లభిస్తుంది. బాప్ దాదా ఏమంటున్నారంటే - బ్రహ్మాబాబాపై అందరికీ
ప్రేమ అయితే ఉంది, కనుకనే మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు?
బ్రహ్మాకుమారి అనా శివకుమారి అనా? బ్రహ్మాకుమారీ అని
పిలుచుకుంటారు కదా, అంటే బ్రహ్మాబాబాపై ప్రేమైతే ఉండనే ఉంది కదా.
ఒకవేళ అశరీరులుగా అవ్వాలంటే కొంచెం శ్రమ అనిపించవచ్చు, కానీ
బ్రహ్మాబాబా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? ఏ రూపంలో ఉన్నారు?
చెప్పండి. (ఫరిశ్తా రూపములో), మరి బ్రహ్మాపై ప్రేమ ఉండటము అనగా
ఫరిశ్తా రూపముపై ప్రేమ ఉండటము. బిందువుగా అవ్వటం కొంచెం కష్టం
అనిపిస్తుంది, ఫరిశ్తాగా అవ్వటమైతే దానికంటే సహజమే కదా!
చెప్పండి, బిందు రూపము కంటే ఫరిశ్తా రూపము సహజము కదా! మీరు
అకౌంట్స్ పని చేస్తూ బిందువుగా అవ్వగలరా? ఫరిశ్తాగా అయితే
అవ్వగలరు కదా! బిందు రూపములో కర్మలు చేస్తూ అప్పుడప్పుడు
వ్యక్త శరీరములోకి రావలసి వస్తుంది కానీ బాప్ దాదా చూసారు -
సైన్స్ వారు విద్యుత్తు ఆధారంగా రోబోట్ ను (మరమనిషిని)
తయారుచేసారు, విన్నారు కదా! చూడకపోయినా కానీ వినటమైతే విన్నారు
కదా! మాతలు విన్నారా? మీకు ఆ చిత్రాన్ని చూపిస్తారు. వారు
విద్యుత్తు ఆధారంతో రోబోట్ ను తయారుచేసారు మరియు అది అన్ని
పనులను చేస్తుంది. మరియు విద్యుత్తు ఆధారంతో చాలా వేగంగా
చేస్తుంది. ఇది సైన్సుకు ప్రత్యక్ష ప్రమాణము. కావున బాప్ దాదా
అంటున్నారు - సైలెన్స్ శక్తితో, సైలెన్స్ విద్యుత్తుతో మీరు
కర్మలను చెయ్యలేరా? చెయ్యలేరా? ఇంజనీర్లు మరియు వైజ్ఞానికులు
కూర్చుని ఉన్నారు కదా! మీరు కూడా ఒక ఆత్మిక రోబోట్ వంటి
స్థితిని తయారుచేసుకోండి. వారినే ఆత్మిక కర్మయోగులు, ఫరిశ్తా
కర్మయోగులు అని అంటారు. ముందు మీరు తయారవ్వండి. ఇంజనీర్లు
ఉన్నారు, వైజ్ఞానికులు ఉన్నారు, కనుక ముందుగా మీరు అనుభవము
చెయ్యండి. చేస్తారా? చెయ్యగలరా? అచ్ఛా, అటువంటి ప్లాన్ ను
తయారుచెయ్యండి. బాప్ దాదా ఇటువంటి నడుస్తూ-తిరుగుతూ ఉన్న
ఆత్మిక కర్మయోగి ఫరిశ్తాలను చూడాలనుకుంటున్నారు. అమృతవేళ లేవండి,
బాప్ దాదాతో మిలనం చేసుకోండి, ఆత్మిక సంభాషణను చెయ్యండి,
వరదానాన్ని తీసుకోండి. ఏది చెయ్యాలో అది చెయ్యండి. కానీ బాప్
దాదా నుండి ప్రతిరోజూ అమృతవేళ కర్మయోగీ ఫరిశ్తా భవ అన్న
వరదానాన్ని తీసుకుని, ఆ తర్వాత కార్యవ్యవహారాలలోకి రండి. ఇది
వీలవుతుందా?
ఈ కొత్త సంవత్సరములో లక్ష్యము పెట్టుకోండి - సంస్కార పరివర్తన.
స్వయానిది కూడా, మరియు సహయోగము ద్వారా ఇతరులది కూడా. ఎవరైనా
బలహీనులు ఉంటే వారికి సహయోగాన్ని ఇవ్వండి, వారి బలహీనతను
వర్ణించకండి, అటువంటి వాతావరణాన్ని తయారుచెయ్యకండి. సహయోగాన్ని
ఇవ్వండి. ఈ సంవత్సరము యొక్క టాపిక్ ‘‘సంస్కార పరివర్తన’’.
ఫరిశ్తా సంస్కారాలు, బ్రహ్మాబాబా సమానమైన సంస్కారాలు. మరి ఇది
సహజ పురుషార్థమా లేక కష్టమా? కొంచెం-కొంచెం కష్టమా? ఎప్పుడూ ఏ
విషయమూ కష్టము కాదు, తమ బలహీనతే కష్టంగా చేస్తుంది. అందుకే బాప్
దాదా అంటున్నారు - ‘‘ఓ మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలూ,
ఇప్పుడు శక్తులతో కూడిన వాయుమండలాన్ని వ్యాపింపజేయండి.’’
ఇప్పుడు వాయుమండలానికి మీ అవసరము చాలా-చాలా ఉంది. ఎలా అయితే ఈ
రోజుల్లో విశ్వములో కాలుష్య సమస్య ఉందో, అలా విశ్వములో ఒక్క
క్షణకాలమైనా మనసులో శాంతి, సుఖముల వాయుమండలము యొక్క అవసరము ఉంది
ఎందుకంటే మానసిక కాలుష్యము చాలా ఉంది, గాలి కాలుష్యము కంటే కూడా
అది ఎక్కువగా ఉంది. అచ్ఛా.
నలువైపులా బాప్ దాదా సమానంగా అవ్వాల్సిందే అన్న లక్ష్యం
పెట్టుకున్న వారందరికీ, నిశ్చయబుద్ధీ విజయీ ఆత్మలకు, సదా పాత
ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను దృఢ సంకల్పం ద్వారా
పరివర్తన చేసే మాస్టర్ సర్వ శక్తివాన్ ఆత్మలకు, సదా ఏ
కారణంగానైనా, పరిస్థితుల కారణంగానైనా, స్వభావ-సంస్కారాల
కారణంగానైనా బలహీనులుగా ఉన్న తమ తోటి సహచరులకు, ఆత్మలకు
సహయోగాన్ని ఇచ్చేవారికి, కారణాన్ని చూడకుండా నివారణ చేసే
ధైర్యవంతులైన ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా స్నేహానికి రిటర్న్
ఇచ్చే కర్మయోగీ ఫరిశ్తా ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు
మరియు నమస్తే.
వరదానము:-
శుభచింతక స్థితి ద్వారా సర్వుల
సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సర్వుల స్నేహీ భవ
శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి
హృదయములో స్నేహము ఉత్పన్నమవుతుంది మరియు ఆ స్నేహమే సహయోగిగా
తయారుచేస్తుంది. ఎక్కడైతే స్నేహము ఉంటుందో అక్కడ సమయాన్ని,
సంపదను, సహయోగాన్ని సదా బలిహారము చేసేందుకు సిద్ధముగా ఉంటారు.
కావున శుభచింతకులు స్నేహీలుగా తయారుచేస్తారు మరియు స్నేహము
అన్ని రకాల సహయోగములలో బలిహారమయ్యేలా చేస్తుంది. అందుకే సదా
శుభచింతనతో సంపన్నంగా ఉండండి మరియు శుభచింతకులుగా అయ్యి
సర్వులను స్నేహీలుగా, సహయోగులుగా తయారుచెయ్యండి.
స్లోగన్:-
ఈ సమయములో దాతగా అయినట్లయితే మీ
రాజ్యములో జన్మజన్మలు ప్రతి ఆత్మ నిండుగా ఉంటుంది.
సూచన:- ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము,
అంతర్జాతీయ యోగ దివసము, బ్రహ్మావత్సలందరూ సంగఠిత రూపములో
సా.6.30 నుండి 7.30 గం. వరకు విశేషంగా తమ మాస్టర్ సర్వశక్తివాన్
స్వరూపములో స్థితులై, సర్వ నిర్బల, బలహీన ఆత్మలకు శుభ భావన
యొక్క కిరణాలను ఇస్తూ పరమాత్మ శక్తులను అనుభవం చేస్తూ నలువైపులా
శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేసే సేవను చెయ్యండి.
|
|
|