21-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 02.02.2007


‘‘పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మ యొక్క గుర్తులు -హోలియెస్ట్ (అత్యంత పవిత్రము), హైయ్యెస్ట్ (ఉన్నతోన్నతము)మరియు రిచెస్ట్ (అత్యంత సంపన్నము)’’

ఈ రోజు విశ్వ పరివర్తకులైన బాప్ దాదా తమ సహచరులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకములో మూడు విశేషమైన పరమాత్మ ప్రాప్తులను చూస్తున్నారు. ఒకటి - హోలియెస్ట్ (అత్యంత పవిత్రము), రెండు - హైయ్యెస్ట్ (ఉన్నతోన్నతము), మూడు - రిచెస్ట్ (అత్యంత సంపన్నము). ఈ జ్ఞానము యొక్క పునాదియే హోలీగా అనగా పవిత్రముగా అవ్వడము. కావున పిల్లలు ప్రతి ఒక్కరూ అత్యంత పవిత్రమైనవారే. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, కానీ మనసా, వాచా, కర్మణా, సంబంధ సంపర్కాలలో పవిత్రత. మీరు చూడండి, పరమాత్మకు చెందిన బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఆదిమధ్యాంతాలు, మూడు కాలాలలోనూ హోలియెస్ట్ గా ఉంటారు. మొట్టమొదట ఆత్మలు ఎప్పుడైతే పరంధామములో ఉంటారో అప్పుడు అక్కడ కూడా హోలియెస్ట్ గా ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆదిలోకి వస్తారో అప్పుడు ఆదికాలములో కూడా దేవతా రూపములో హోలియెస్ట్ ఆత్మలుగా ఉన్నారు. హోలియెస్ట్ అనగా పవిత్ర ఆత్మ యొక్క విశేషత ఏమిటంటే - ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రముగా ఉండటము. ఇతరులు కూడా పవిత్రముగా అవుతారు కానీ మీ పవిత్రత యొక్క విశేషత ఏమిటంటే - స్వప్నమాత్రముగా కూడా అపవిత్రత మనసును, బుద్ధిని స్పర్శించదు. సత్యయుగములో ఆత్మ కూడా పవిత్రముగా అవుతుంది మరియు మీ శరీరము కూడా పవిత్రముగా అవుతుంది. ఆత్మ మరియు శరీరము, ఈ రెండింటి యొక్క పవిత్రత దేవాత్మల రూపములో ఉన్నప్పుడు ఉంటుంది, అది శ్రేష్ఠమైన పవిత్రత. ఎంతగా హోలియెస్ట్ గా అవుతారో, అంతగానే హైయ్యెస్ట్ గా కూడా అవుతారు. అందరికన్నా ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ ఆత్మలుగా మరియు ఉన్నతోన్నతుడైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. ఆదిలో పరంధామములో కూడా హైయ్యెస్ట్ గా అనగా బాబాతోపాటు ఉంటారు. మధ్యలో కూడా పూజ్య ఆత్మలుగా అవుతారు. ఎన్ని సుందరమైన మందిరాలు తయారవుతాయి మరియు ఎంత విధిపూర్వకముగా పూజ జరుగుతుంది. ఎంత విధిపూర్వకముగా దేవతలైన మీకు మందిరాలలో పూజ జరుగుతుందో అంతగా ఇతరులకు మందిరాలు తయారైనా కానీ విధిపూర్వకమైన పూజ మాత్రము మీ దేవతా రూపానికే పూజ జరుగుతుంది. కావున మీరు హోలియెస్ట్ కూడా మరియు హైయ్యెస్ట్ కూడా, దానితోపాటు మీరు రిచ్చెస్ట్ కూడా. ప్రపంచములో రిచ్చెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అంటారు. కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు రిచ్చెస్ట్ ఇన్ ది కల్ప. మీరు మొత్తము కల్పమంతా రిచ్చెస్ట్ గా ఉంటారు. మీ ఖజానాలు గుర్తుకువస్తున్నాయా? మీరు ఎన్ని ఖజానాలకు యజమానులు! అవినాశీ ఖజానాలేవైతే ఈ ఒక్క జన్మలో ప్రాప్తి చేసుకుంటారో, అవి అనేక జన్మలు కొనసాగుతాయి. ఇంకెవ్వరి ఖజానాలు అనేక జన్మలు కొనసాగవు. కానీ మీ ఖజానాలు ఆధ్యాత్మికమైనవి. శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానా మరియు వర్తమాన సమయము యొక్క ఖజానా, ఈ ఖజానాలన్నీ జన్మజన్మలు కొనసాగుతాయి. ఈ ఒక్క జన్మలో ప్రాప్తించిన ఖజానాలు మీతోపాటు వస్తాయి ఎందుకంటే అవి సర్వ ఖజానాల దాత అయిన పరమాత్మ తండ్రి ద్వారా ప్రాప్తిస్తాయి. కావున మా ఖజానాలు అవినాశీ ఖజానాలు అన్న నషా ఉందా?

ఈ ఆధ్యాత్మిక ఖజానాలను ప్రాప్తి చేసుకునేందుకు సహజయోగులుగా అయ్యారు. స్మృతి శక్తి ద్వారా ఖజానాలను జమ చేసుకుంటారు. ఈ సమయములో కూడా ఈ సర్వ ఖజానాలతో సంపన్నముగా, నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారు. ఏదైనా చింత ఉందా? ఉందా ఏదైనా చింత? ఎందుకంటే ఈ ఖజానాలేవైతే ఉన్నాయో వీటిని దొంగలూ దోచుకోలేరు, రాజులూ తినలేరు, అలాగే నీరూ ముంచలేదు, అందుకే మీరు నిశ్చింత చక్రవర్తులు. మరి ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటాయి కదా! అలాగే ఈ స్మృతి కూడా ఎందుకు సహజమైనది? ఎందుకంటే అన్నింటికన్నా ఎక్కువగా స్మృతికి ఆధారము ఏమిటంటే - ఒకటి సంబంధము, రెండవది ప్రాప్తి. ఎంత ప్రియమైన సంబంధము ఉంటుందో, అంతగా స్మృతి స్వతహాగా కలుగుతుంది ఎందుకంటే సంబంధములో స్నేహము ఉంటుంది మరియు ఎక్కడైతే స్నేహముంటుందో, ఆ స్నేహులను స్మృతి చేయడం కష్టమనిపించదు, కానీ మర్చిపోవడం కష్టమనిపిస్తుంది. బాబా సర్వ సంబంధాల ఆధారాన్ని తయారుచేసారు. అందరూ స్వయాన్ని సహజయోగులుగా అనుభవం చేసుకుంటున్నారా లేక కష్టమైన యోగులుగా ఉన్నారా? సహజమేనా? లేక ఒక్కోసారి సహజముగా మరియు ఒక్కోసారి కష్టముగా ఉంటుందా? ఎప్పుడైతే బాబాను సంబంధము మరియు స్నేహముతో స్మృతి చేస్తారో అప్పుడు స్మృతి కష్టముగా ఉండదు. ఇంకా ప్రాప్తులను గుర్తు చేసుకోండి. సర్వ ప్రాప్తుల దాత సర్వ ప్రాప్తులను అందించారు. మరి స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నముగా అనుభవం చేస్తున్నారా? ఖజానాలను జమ చేసుకునే సహజ విధిని కూడా బాప్ దాదా వినిపించారు, అదేమిటంటే - ఏయే అవినాశీ ఖజానాలైతే ఉన్నాయో ఆ ఖజానాలన్నింటినీ ప్రాప్తి చేసుకునేందుకు విధి - బిందువు. ఏ విధంగా వినాశీ ఖజానాలలో కూడా బిందువును (సున్నాను) జోడిస్తూ ఉన్నట్లయితే, అది పెరుగుతూ ఉంటుందో, అలా అవినాశీ ఖజానాలను జమ చేసుకునేందుకు విధి - బిందువు పెట్టడము. మూడు బిందువులు ఉన్నాయి - ఒకటి, ఆత్మనైన నేను బిందువు, బాబా కూడా బిందువు మరియు డ్రామాలో ఏదైతే గతించిపోతుందో అది కూడా ఫుల్ స్టాప్ అనగా బిందువు. మరి బిందువు పెట్టడం వస్తుందా? అన్నింటికన్నా సహజమైన చిహ్నము ఏమిటి? బిందువు పెట్టడం కదా! కావున ఆత్మనైన నేనూ బిందువును, బాబా కూడా బిందువు, ఈ స్మృతి ద్వారా స్వతహాగానే ఖజానాలు జమ అయిపోతాయి. బిందువును క్షణములో స్మృతి చేయడం ద్వారా ఎంతటి సంతోషము ఉంటుంది! ఈ సర్వ ఖజానాలు మీ బ్రాహ్మణ జీవితము యొక్క అధికారము ఎందుకంటే పిల్లలుగా అవ్వడము అనగా అధికారులుగా అవ్వడము. మరియు విశేషముగా మూడు సంబంధాల యొక్క అధికారము ప్రాప్తిస్తుంది - పరమాత్మను తండ్రిగా కూడా చేసుకున్నారు, శిక్షకునిగా కూడా చేసుకున్నారు మరియు సద్గురువుగా కూడా చేసుకున్నారు. ఈ మూడు సంబంధాల ద్వారా పాలన, చదువు ద్వారా సంపాదన మరియు సద్గురువు ద్వారా వరదానాలు లభిస్తాయి. ఎంత సహజముగా వరదానాలు లభిస్తాయి! ఎందుకంటే తండ్రి యొక్క వరదానాలను ప్రాప్తి చేసుకోవడమనేది పిల్లలకు జన్మసిద్ధ అధికారము.

బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి యొక్క జమ ఖాతాను చెక్ చేస్తున్నారు. మీరందరూ కూడ అన్నివేళలా మీ జమ ఖాతాను చెక్ చేసుకోండి. జమ అయ్యిందా లేక అవ్వలేదా అని చెక్ చేసుకునేందుకు విధి ఏమిటంటే - ఏయే కర్మలైతే చేసారో, ఆ కర్మలలో స్వయం కూడా సంతుష్టముగా మరియు ఎవరితోనైతే కర్మలు చేసారో వారు కూడా సంతుష్టముగా ఉండాలి. ఒకవేళ ఇరువురిలోనూ సంతుష్టత ఉన్నట్లయితే ఆ కర్మ యొక్క ఖాతా జమ అయ్యిందని అర్థం చేసుకోండి. ఒకవేళ స్వయములోనైనా లేక ఎవరితోనైతే సంబంధము ఉందో వారిలోనైనా సంతుష్టత కలగకపోతే జమ అవ్వదు.

బాప్ దాదా పిల్లలందరికీ సమయము యొక్క సూచనను కూడా ఇస్తూ ఉంటారు. ఈ వర్తమాన సంగమయుగ సమయము మొత్తం కల్పములో శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన సమయము, ఎందుకంటే ఈ సంగమయుగమే శ్రేష్ఠ కర్మల బీజాలను నాటే సమయము మరియు ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సమయము. ఈ సంగమ సమయములో ఒక్కొక్క క్షణము శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనది. అందరూ ఒక్క క్షణములో అశరీరి స్థితిలో స్థితులవ్వగలరా? బాప్ దాదా సహజ విధిని వినిపించారు, వారు ఏం చెప్పారంటే - నిరంతర స్మృతిలో ఉండేందుకు ఒక విధిని అలవరచుకోండి, అదేమిటంటే, రోజంతటిలో రెండు పదాలను అందరూ ఉపయోగిస్తూ ఉంటారు మరియు అనేక సార్లు ఉపయోగిస్తూ ఉంటారు, ఆ రెండు పదాలు ఏమిటంటే - ‘‘నేను’’ మరియు ‘‘నాది’’. కావున ఎప్పుడైతే ‘‘నేను’’ అన్న పదాన్ని ఉపయోగిస్తారో దానికి బాబా ‘‘నేను ఆత్మను’’ అన్న పరిచయాన్ని ఇచ్చారు. కావున ‘‘నేను’’ అన్న పదాన్ని ఎప్పుడు ఉపయోగించినా ‘‘నేను ఒక ఆత్మను’’ అన్నది గుర్తు చేసుకోండి. కేవలం ‘నేను’ అన్న మాట మాత్రమే అనుకోవడం కాదు, ‘‘నేను ఒక ఆత్మను’’ అన్నది నేనుతోపాటు కలిపి అనుకోండి, ఎందుకంటే ‘‘నేను శ్రేష్ఠ ఆత్మను, పరమాత్మ పాలనలో ఉండే ఆత్మను’’ అని మీకు తెలుసు కదా! మరియు ‘‘నాది’’ అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు ‘‘నా వారు’’ ఎవరు? ‘‘నా బాబా’’ అనగా తండ్రి అయిన పరమాత్మ. కావున నేను మరియు నాది అన్న పదాలను ఎప్పుడు ఉపయోగించినా ఆ సమయములో - నేను ఆత్మను మరియు నా బాబా అన్నది కలపండి. ఎంతగా బాబా పట్ల ‘‘నా వారు’’ అన్న భావాన్ని పెట్టుకుంటారో, అంతగా స్మృతి సహజముగా కలుగుతూ ఉంటుంది, ఎందుకంటే ‘నాది’ అనుకున్నదానిని ఎప్పుడూ మర్చిపోరు. రోజంతటిలో చూడండి, నాది అన్నదే గుర్తుకువస్తుంది. కావున ఈ విధి ద్వారా సహజముగానే నిరంతర యోగులుగా అవ్వగలరు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ స్వమానము అనే సీటుపై కూర్చోబెట్టారు. స్వమానము యొక్క లిస్టును ఒకవేళ స్మృతిలోకి తెచ్చుకున్నట్లయితే అది ఎంత పొడవైన లిస్టు! ఎందుకంటే స్వమానములో స్థితులై ఉన్నట్లయితే దేహాభిమానము రాలేదు. దేహాభిమానమైనా ఉంటుంది లేక స్వమానమైనా ఉంటుంది. స్వమానము యొక్క అర్థమే - స్వ అనగా ఆత్మ యొక్క శ్రేష్ఠ స్మృతి యొక్క స్థానము. కావున అందరూ మీ స్వమానములో స్థితులై ఉన్నారా? ఎంతగా స్వమానములో స్థితులై ఉంటారో అంతగా ఇతరులకు గౌరవాన్ని ఇవ్వడమనేది స్వతహాగానే జరుగుతుంది. స్వమానములో స్థితులై ఉండటము ఎంత సహజము!

అందరూ సంతోషముగా ఉంటున్నారా? ఎందుకంటే సంతోషముగా ఉండేవారు ఇతరులను కూడా సంతోషముగా చేస్తారు. బాప్ దాదా సదా ఏమంటూ ఉంటారంటే, రోజంతటిలో ఎప్పుడూ సంతోషాన్ని పోగొట్టుకోకండి. ఎందుకు? సంతోషము ఎటువంటిదంటే ఆ సంతోషములో ఆరోగ్యము కూడా వస్తుంది, ఐశ్వర్యము కూడా వస్తుంది మరియు సంతోషము కూడా వస్తుంది. సంతోషము లేకపోతే జీవితము నిస్సారముగా అయిపోతుంది. సంతోషము వంటి ఖజానా మరేదీ లేదు అని సంతోషము గురించే అంటారు. ఎన్ని ఖజానాలు ఉన్నా కానీ సంతోషము లేకపోతే ఖజానాలు ఉన్నా కానీ ఆ ప్రాప్తిని అనుభవించలేరు. సంతోషము గురించి ఏమంటూ ఉంటారంటే ‘‘సంతోషము వంటి ఔషధము మరేదీ లేదు’’. కావున వెల్త్ కూడా సంతోషమే మరియు హెల్త్ కూడా సంతోషమే మరియు దాని పేరే హ్యాపినెస్ కావున సంతోషముగా ఎలాగూ ఉంటారు. కావున సంతోషములో ఈ మూడు వస్తువులు ఉన్నాయి. మరియు బాబా అవినాశీ సంతోషము యొక్క ఖజానాను ఇచ్చారు. బాబా ఇచ్చిన ఖజానాను పోగొట్టుకోకండి. మరి సదా సంతోషముగా ఉంటున్నారా?

బాప్ దాదా హోమ్ వర్క్ ఇచ్చారు, సంతోషముగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి ఎందుకంటే సంతోషము ఎటువంటిదంటే దానిని మీరు ఎంతగా పంచుతూ ఉంటారో అది అంతగా పెరుగుతుంది. అనుభవం చేసి చూసారు కదా! అనుభవం చేసారు కదా? ఒకవేళ సంతోషాన్ని పంచుతున్నట్లయితే దానిని పంచే కంటే ముందు అది మీ దగ్గర పెరుగుతుంది. ఎవరినైతే సంతోషపరుస్తారో వారికంటే ముందు స్వయం సంతోషపడతారు. మరి అందరూ హోమ్ వర్క్ చేసారా? చేసారా? ఎవరెవరైతే చేసారో వారు చేతులెత్తండి. ఎవరైతే - సంతోషముగా ఉండాలి, కారణము కాదు నివారణ చేయాలి, సమాధాన స్వరూపులుగా అవ్వాలి అన్న హోమ్ వర్క్ ను చేసారో, వారు చేతులెత్తండి. ఇప్పుడు మళ్ళీ ‘అలా అయిపోయింది’ అని అనరు కదా! బాప్ దాదాకు చాలామంది పిల్లలు తమ రిజల్టు కూడా వ్రాసి ఇచ్చారు. మేము ఎంత శాతము ఓకేగా ఉన్నాము అన్నది వ్రాసారు, మరియు లక్ష్యము పెట్టకున్నట్లయితే లక్ష్యము ద్వారా లక్షణాలు స్వతహాగానే వస్తాయి. అచ్ఛా!

డబుల్ విదేశీ సోదరీ సోదరులతో - విదేశీయులు తమ ఒరిజినల్ విదేశమునైతే మర్చిపోరు కదా. ఒరిజినల్ గా మీరు ఏ దేశానికి చెందినవారో, అది మీకు గుర్తుంటుంది కదా, అందుకే అందరూ మిమ్మల్ని డబుల్ విదేశీయులు అని అంటారు. కేవలం విదేశీయులు కారు, మీరు డబుల్ విదేశీయులు. కావున మీరు మీ మధురమైన ఇంటిని ఎప్పుడూ మర్చిపోకపోవచ్చు. మీరు ఎక్కడ ఉంటారు? బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు కదా. బాప్ దాదా అంటారు, ఎప్పుడైనా, ఏదైనా చిన్న-పెద్ద సమస్య వచ్చినప్పుడు, అది సమస్య కాదు, అది ముందుకు వెళ్ళేందుకు పరీక్ష. బాప్ దాదా యొక్క హృదయ సింహాసనమైతే మీ అధికారము. హృదయ సింహాసనాధికారులుగా అయినట్లయితే సమస్య ఒక ఆటబొమ్మగా అయిపోతుంది. అప్పుడు సమస్యను చూసి భయపడరు, దానితో ఆడుకుంటారు. అది ఒక ఆటబొమ్మ. మీరందరూ ఎగిరేకళ కలవారే కదా? ఎగిరేకళ ఉందా? లేక నడిచేవారా? మీరు ఎగిరేవారా లేక నడిచేవారా? ఎవరైతే ఎగిరేవారో వారు చేతులెత్తండి. ఎగిరేవారు? సగం-సగం చేతులెత్తుతున్నారు. మీరు ఎగిరేవారేనా? అచ్ఛా! అప్పుడప్పుడు ఎగరడం మానేస్తుంటారా? ఏదో నడుస్తున్నాము అని కాదు. ఎంతోమంది బాప్ దాదాతో ఏమంటారంటే - బాబా, మేము చాలా బాగా నడుస్తున్నాము. అప్పుడు బాప్ దాదా అడుగుతారు - మీరు నడుస్తున్నారా లేక ఎగురుతున్నారా? ఇప్పుడు ఇది నడిచే సమయము కాదు, ఎగిరే సమయము. ఉల్లాస-ఉత్సాహాలు మరియు ధైర్యము అనే రెక్కలు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. కావున రెక్కలతో ఎగరవలసి ఉంటుంది. కావున రోజూ చెక్ చేసుకోండి - మీరు ఎగిరే కళలో ఎగురుతూ ఉన్నారా? మంచిది. రిజల్టులో బాప్ దాదా ఏం చూసారంటే - సెంటర్లు విదేశాలలో కూడా పెరుగుతున్నాయి మరియు ఇంకా పెరిగేదే ఉంది. ఏ విధంగా మీరు డబుల్ విదేశీయులో, అలా డబుల్ సేవ అనగా మనసా కూడా, వాచా కూడా కలిపి-కలిపి చేస్తూ వెళ్ళండి. మనసా శక్తి ద్వారా ఆత్మల యొక్క ఆత్మిక వృత్తిని తయారుచేయండి. వాయుమండలాన్ని తయారుచేయండి. ఇప్పుడు దుఃఖము పెరుగుతూ ఉండటాన్ని చూసి దయ కలగటం లేదా? మీ జడచిత్రాల ఎదురుగా - దయ చూపించండి, దయ చూపించండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దయళువుగా, కృపాళువుగా, దయాహృదయులుగా అవ్వండి. మీపై మీరు కూడా దయ చూపించుకోండి మరియు ఇతర ఆత్మలపై కూడా దయ చూపించండి. మంచిది - ప్రతి సీజన్ లోనూ, ప్రతి టర్న్ లోనూ వస్తారు, ఈ విషయములో అందరికీ సంతోషము కలుగుతుంది, కావున ఎగురుతూ ఉండండి, ఎగిరేలా చేస్తూ ఉండండి. మంచిది. రిజల్టులో ఏం చూసారంటే - ఇప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవడములో కూడా వేగముగా ముందుకు వెళ్తున్నారు కావున స్వ పరివర్తన యొక్క వేగము విశ్వ పరివర్తన యొక్క వేగాన్ని పెంచుతుంది. అచ్ఛా!

ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు లేవండి - మీ అందరికీ బ్రాహ్మణ జన్మ యొక్క అభినందనలు. మిఠాయి అయితే లభిస్తుంది, మంచిది, కానీ బాప్ దాదా దిల్ ఖుష్ మిఠాయిని తినిపిస్తున్నారు. మొదటిసారి మధుబన్ కు రావడము అనే ఈ దిల్ ఖుష్ మిఠాయిని సదా గుర్తుంచుకోండి. ఆ మిఠాయి అయితే నోటిలో వేసుకోగానే సమాప్తమైపోతుంది కానీ ఈ దిల్ ఖుష్ మిఠాయి సదా తోడుగా ఉంటుంది. వచ్చారు, మంచిది. బాప్ దాదా మరియు దేశ-విదేశాలలో ఉన్న పరివారమైన మీరంతా మీ సోదరీ, సోదరులను చూసి సంతోషిస్తున్నారు. అందరూ చూస్తున్నారు. అమెరికావారు కూడా చూస్తున్నారు, ఆఫ్రికావారు కూడా చూస్తున్నారు, రష్యావారు కూడా చూస్తున్నారు, లండన్ వారు కూడా చూస్తున్నారు, ఐదు ఖండాల వారు చూస్తున్నారు. కావున మీ అందరికీ జన్మదినము సందర్భముగా అక్కడ కూర్చునే మీకు అభినందనలను తెలియజేస్తున్నారు. అచ్ఛా!

బాప్ దాదా యొక్క ఆత్మిక డ్రిల్ గుర్తుంది కదా! ఇప్పుడు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి నుండి - వారు కొత్తవారైనా లేక పాతవారైనా, వారు చిన్నవారైనా లేక పెద్దవారైనా, చిన్నవారైతే బాబా సమానముగా ఇంకా త్వరగా అవ్వగలరు. కావున ఇప్పుడు క్షణములో మనసును ఎక్కడ ఏకాగ్రము చేయాలనుకుంటే అక్కడ అది ఏకాగ్రమైపోవాలి. ఈ ఏకాగ్రతా డ్రిల్ ను సదా చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక్క క్షణములో మనసుకు యజమానులుగా అయి ‘నేను మరియు నా బాబాయే నా ప్రపంచము, ఇంకెవ్వరూ లేరు’ అన్న ఈ ఏకాగ్ర స్మృతిలో స్థితులవ్వండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న సర్వ తీవ్ర పురుషార్థీ పిల్లలకు, సదా ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే కళ యొక్క అనుభవీమూర్తులైన పిల్లలకు, సదా తమ స్వమానమనే సీటుపై సెట్ అయి ఉండే పిల్లలకు, సదా దయార్ద్ర హృదయులుగా అయి విశ్వములోని ఆత్మలకు మనసా శక్తి ద్వారా సుఖ-శాంతుల అంచలిని ఎంతోకొంత ఇచ్చే దయాళువు, కృపాళువు అయిన పిల్లలకు, సదా బాబా స్నేహములో ఇమిడి ఉన్న హృదయ సింహాసనాధికారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

అచ్ఛా! అందరూ చాలా, చాలా, చాలా సంతోషముగా ఉన్నారు! సంతోషముగా ఉన్నారా! చాలా సంతోషముగా ఉన్నారా? చాలా అంటే ఎంత సంతోషముగా ఉన్నారు? కావున సదా ఇలా ఉండండి. ఏది జరిగితే అది జరగనివ్వండి, ఇప్పుడు సంతోషముగా ఉండాలి. మనం ఎగరాలి, మనల్ని ఎవ్వరూ కిందకు తీసుకురాలేరు. పక్కానా! పక్కా ప్రతిజ్ఞయేనా? ఎంత పక్కా? కేవలం సంతోషముగా ఉండండి, అందరికీ సంతోషాన్ని ఇవ్వండి, అంతే. ఏదైనా విషయము మంచిగా అనిపించకపోయినా కానీ సంతోషాన్ని పోగొట్టుకోకండి. విషయాన్ని నడిపించేయండి, కానీ సంతోషాము పోకూడదు. విషయమనేది ఎలాగైనా సమాప్తమవ్వవలసిందే, కానీ సంతోషమైతే మీతోపాటు రాబోతుంది కదా! ఏదైతే మీతోపాటు రాబోతుందో దానిని వదిలేస్తారు, కానీ ఏదైతే పోయేది ఉందో, ఆ పోయేదానిని మీతోపాటు పెట్టుకుంటారు. ఇలా చేయకండి. అమృతవేళ రోజూ ముందుగా మీకు మీరు సంతోషమనే ఔషధాన్ని తినిపించుకోండి. అచ్ఛా!

వరదానము:-
స్వీట్ సైలెన్స్ యొక్క లవలీన స్థితి ద్వారా నష్టోమోహా సమర్థ స్వరూప భవ

దేహము, దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, వ్యక్తులు మరియు వైభవాలు, వాయుమండలము, వైబ్రేషన్లు అన్నీ ఉన్నా కానీ అవి తమ వైపుకు ఆకర్షించకూడదు. మనుష్యులు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నా మీరు అచలముగా ఉండండి. ప్రకృతి, మాయ అన్నీ చివరి పన్నాగము పన్నడానికి తమవైపుకు ఎంతగా ఆకర్షించినా కానీ మీరు అతీతముగా మరియు బాబాకు ప్రియముగా అయ్యే స్థితిలో లవలీనులై ఉండండి - దీనినే చూస్తూ కూడా చూడకుండా ఉండటము, వింటూ కూడా వినకుండా ఉండటము అని అంటారు. ఇదే స్వీట్ సైలెన్స్ స్వరూపము యొక్క లవలీన స్థితి, ఎప్పుడైతే ఇటువంటి స్థితి తయారవుతుందో అప్పుడు వారిని నష్టోమోహా సమర్థ స్వరూపపు వరదానీ ఆత్మలు అని అంటారు.

స్లోగన్:-
హోలీ హంసలుగా అయి అవగుణాల రూపీ రాళ్ళను వదిలి మంచితనము రూపీ ముత్యాలను గ్రోలుతూ వెళ్ళండి.

అవ్యక్త ప్రేరణలు- ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

జ్వాలా రూపముగా అయ్యేందుకు ‘ఇప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి’ అన్న ఈ ధ్యాసయే సదా ఉండాలి. వెళ్ళాలి అనగా ఉపరామముగా ఉండటము. తమ నిరాకారీ ఇంటికి వెళ్ళాలి అన్నప్పుడు మరి తమ వేషాన్ని ఆ విధముగా తయారుచేసుకోవాలి. కావున వెళ్ళాలి మరియు అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి - ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాల నుండి, ప్రకృతి యొక్క సర్వ ఆకర్షణల నుండి ఉపరామముగా అనగా సాక్షీగా అయిపోతారు. సాక్షీగా అవ్వడము ద్వారా సహజముగానే బాబా యొక్క సహచరులుగా మరియు బాబా సమానముగా అయిపోతారు.

సూచన - ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, రాజయోగీ తపస్వీ సోదరీ-సోదరులందరూ సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు, విశేషముగా యోగాభ్యాసము సమయములో మీ ఆకారీ ఫరిశ్తా స్వరూపములో స్థితులై, భక్తుల పిలుపును వినండి మరియు వారికి ఉపకారము చేయండి. మాస్టర్ దయాళువుగా, కృపాళువుగా అయి అందరిపై దయా దృష్టిని ప్రసరింపజేయండి. ముక్తి, జీవన్ముక్తుల యొక్క వరదానాన్ని ఇవ్వండి.