21-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 05.03.2008


‘‘సంగమయుగము యొక్క బ్యాంకులో సైలెన్స్ శక్తిని మరియు శ్రేష్ఠ కర్మలను జమ చేసుకోండి, శివమంత్రముతో నేను అన్నదానిని పరివర్తన చేయండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్నేహాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా స్నేహమనే విమానములో ఇక్కడకు చేరుకున్నారు. ఈ స్నేహమనే విమానము చాలా సహజముగా స్నేహితుని వద్దకు చేరుస్తుంది. బాప్ దాదా చూస్తున్నారు - ఈ రోజు విశేషముగా లవలీన ఆత్మలందరూ పరమాత్ముని ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉన్నారు. బాప్ దాదా కూడా నలువైపులా ఉన్న పిల్లల స్నేహములో ఇమిడి ఉన్నారు. ఈ పరమాత్ముని స్నేహము బాబా సమానముగా అశరీరిగా సహజముగా చేస్తుంది. వ్యక్త భావము నుండి అతీతముగా అవ్యక్త స్థితిలో, అవ్యక్త స్వరూపములో స్థితి చేయిస్తుంది. బాప్ దాదా కూడా ప్రతి బిడ్డను సమాన స్థితిలో చూస్తూ హర్షిస్తున్నారు.

ఈ రోజున పిల్లలందరూ శివరాత్రిని, శివజయంతిని, బాబా మరియు స్వయము యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. బాబా మరియు దాదా ఇరువురూ తమ-తమ వతనాల నుండి పిల్లలైన మీ అందరి జన్మదినాన్ని జరపడానికి చేరుకున్నారు. మొత్తము కల్పములో బాబా మరియు మీ యొక్క ఈ జన్మదినము అతీతమైనది మరియు అతి ప్రియమైనది. భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో భావనతో మరియు ప్రేమతో జరుపుకుంటారు. ఈ దివ్య జన్మలో మీరు ఏదైతే శ్రేష్ఠ అలౌకిక కర్మను చేసారో, దానిని ఇప్పుడు కూడా చేస్తున్నారు, దానిని స్మృతిచిహ్నము రూపములో, అల్పకాలము కోసం కావచ్చు, కొద్ది సమయము కోసం జరుపుకుంటారు, కానీ భక్తులది కూడా అద్భుతము. స్మృతిచిహ్నాన్ని జరుపుకునేవారిది, స్మృతిచిహ్నాన్ని తయారుచేసిన వారిది కూడా చూడండి, ఎంతటి అద్భుతము. భక్తులు కాపీ చేయడములో తెలివైనవారిగా ఉన్నారు ఎందుకంటే వారు మీ భక్తులే కదా. మీ శ్రేష్ఠత యొక్క ఫలము స్మృతిచిహ్నాన్ని జరుపుకునేవారికి వరదానము రూపములో లభించింది. మీరు ఒక్క జన్మ కోసం సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని ఒక్కసారి చేపడతారు. భక్తులు దీనిని కాపీ అయితే చేసారు, వారు ఒక్కరోజు కోసం పవిత్రత యొక్క వ్రతాన్ని పెట్టుకుంటారు. మీకు మొత్తం జన్మంతా పవిత్రమైన భోజనము యొక్క వ్రతము ఉంటుంది మరియు వారు ఒక్కరోజు కోసం పెట్టుకుంటారు. కావున బాప్ దాదా ఈ రోజు అమృతవేళలో ఏం చూసారంటే మీ అందరి భక్తులు కూడా తక్కువేమీ కాదు. వారి విశేషత కూడా మంచిగా ఉంది. మరి మీరందరూ మొత్తం జన్మ కోసం పక్కా వ్రతాన్ని, ఆహార పానీయాల విషయములో కావచ్చు, మనసులోని సంకల్పాల పవిత్రత విషయములో కావచ్చు, మాటలో కావచ్చు, కర్మలో కావచ్చు, సంబంధ-సంపర్కములోకి వచ్చేటప్పుడు కర్మల విషయములో కావచ్చు, మొత్తము జన్మ కొరకు పక్కా వ్రతాన్ని తీసుకున్నారా? తీసుకున్నారా లేక కొంచెం-కొంచెం తీసుకున్నారా? పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఆధారము, పూజ్యులుగా కావడానికి ఆధారము, శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారము. కావున భాగ్యశాలీ ఆత్మలు ఎవరైతే ఇక్కడకు చేరుకున్నారో వారు చెక్ చేసుకోండి - పవిత్రముగా అయ్యే ఈ జన్మ యొక్క ఉత్సవములో నాలుగు రూపాలలోనూ, కేవలం బ్రహ్మచర్యపు పవిత్రత మాత్రమే కాదు, కానీ మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కాలలో కూడా పవిత్రత ఉండాలి. ఇటువంటి పక్కా వ్రతాన్ని చేపట్టారా? చేపట్టారా? ఎవరైతే చేపట్టారో, పక్కా వ్రతాన్ని, కొంచెం-కొంచెం కచ్చా కాదు, వారు చేతులెత్తండి. పక్కానా, పక్కానా? పక్కానా? ఎంత పక్కా? ఎవరైనా కదిలిస్తే కదులుతారా? కదులుతారా? కదలరా? అప్పుడప్పుడు అయితే మాయ వచ్చేస్తుంది కదా, లేక రాదా, మాయకు వీడ్కోలు ఇచ్చేసారా? లేక అప్పుడప్పుడు అనుమతి ఇచ్చేస్తారా, వచ్చేస్తుందా! చెక్ చేసుకోండి - మరి పక్కా వ్రతాన్ని చేపట్టారా? సదా కోసం వ్రతాన్ని చేపట్టారా? లేక అప్పుడప్పుడూనా? ఒక్కోసారి కొంచెం, ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి పక్కా, ఒకసారి కచ్చా - ఇలా అయితే లేరు కదా! ఎందుకంటే బాప్ దాదాపై ఉన్న ప్రేమ విషయములో అందరూ 100 శాతం కన్నా కూడా ఎక్కువ ప్రేమ అని ఒప్పుకుంటారు. బాబా పట్ల ఎంత ప్రేమ ఉంది అని ఒకవేళ బాప్ దాదా అడిగితే, అందరూ చాలా ఉల్లాస-ఉత్సాహాలతో చేతులెత్తుతారు. ప్రేమలో శాతము అన్నది కేవలం కొద్దిమందికే ఉంటుంది, మెజారిటీకి ప్రేమ ఉంది. కావున ఏ విధముగా ప్రేమలో పాస్ అయ్యారో, మెజారిటీ ప్రేమ విషయములో పాస్ అయ్యారు అని బాప్ దాదా కూడా ఒప్పుకుంటారు, కానీ పవిత్రత యొక్క వ్రతములో నాలుగు రూపాలలోనూ - మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కాలు, నాలుగు రూపాలలోనూ సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని పాటించడములో శాతము వచ్చేస్తుంది. ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే - సమానముగా అయ్యే విషయములో ప్రతిజ్ఞ చేసారు కదా, కావున పిల్లలు ప్రతి ఒక్కరి ముఖములో బాబా మూర్తి కనిపించాలి. ప్రతి ఒక్క మాటలో బాబా సమానమైన మాటలు ఉండాలి, బాప్ దాదా మాటలు వరదానము రూపముగా అవుతాయి. కావున మీరందరూ చెక్ చేసుకోండి - మా ముఖములో బాబా మూర్తి కనిపిస్తుందా? బాబా మూర్తి అంటే ఏమిటి? సంపన్నము, అన్ని విషయాలలోనూ సంపన్నము. ఇదే విధముగా ప్రతి బిడ్డ యొక్క నయనాలు, ప్రతి బిడ్డ యొక్క ముఖము బాబా సమానముగా ఉందా? సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖము ఉందా? లేక ఒక్కోసారి ఆలోచించేవారిగా, ఒక్కోసారి వ్యర్థ సంకల్పాల నీడ కలవారిగా, ఒక్కోసారి ఉదాసీనులుగా, ఒక్కోసారి చాలా శ్రమ చేసేవారిగా, ఇటువంటి ముఖమైతే లేదు కదా? సదా గులాబి, ఒక్కోసారి గులాబి వలె వికసించి ఉన్న ముఖము ఉంటూ, మరోసారి మరోలా అయిపోకూడదు ఎందుకంటే బాప్ దాదా ఒక విషయాన్ని జన్మించగానే చెప్పారు, అదేమిటంటే - మాయ మీ ఈ శ్రేష్ఠ జీవితాన్ని ఎదిరిస్తుంది, కానీ మాయ పని రావడము, సదా పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకునే ఆత్మలైన మీ పని దూరము నుండే మాయను పారద్రోలడము.

బాప్ దాదా ఏమి చూసారంటే, చాలామంది పిల్లలు మాయను దూరము నుండే పారద్రోలరు, మాయ వచ్చేస్తుంది, మాయను రానిస్తారు అనగా మాయ ప్రభావములోకి వచ్చేస్తారు. ఒకవేళ దూరముగా నుండే పారద్రోలకపోతే మాయకు కూడా అలవాటైపోతుంది ఎందుకంటే ఇక్కడ నన్ను కూర్చోనిస్తారు అని దానికి తెలిసిపోతుంది, కూర్చోనిస్తున్నారు అన్నదానికి గుర్తు ఏమిటంటే మాయ వస్తుంది. ఇది మాయ అని అనుకుంటారు, కానీ అప్పుడు కూడా ఏమి ఆలోచిస్తారు? ఇప్పుడు సంపూర్ణము ఏమైనా అయ్యానా, ఎవ్వరూ సంపూర్ణముగా అవ్వలేదు, ఇప్పుడింకా తయారవుతూ ఉన్నాములే, తయారైపోతాములే, లే, లే అని అనడము మొదలుపెడతారు, అప్పుడు మాయకు కూర్చుండిపోవడము అలవాటు అయిపోతుంది. మరి ఈ రోజు జన్మదినాన్ని అయితే జరుపుకుంటున్నారు, బాబా కూడా ఆశీర్వాదాలను, అభినందనలను ఇస్తున్నారు, కానీ బాబా ప్రతి బిడ్డను, లాస్ట్ నంబర్ బిడ్డను కూడా ఏ రూపములో చూడాలని కోరుకుంటున్నారు? లాస్ట్ నంబర్ వారు కూడా బాబాకు ప్రియమైనవారే కదా! బాబా లాస్ట్ నంబర్ బిడ్డను కూడా సదా గులాబీలా చూడాలని కోరుకుంటున్నారు, వికసించి ఉన్న గులాబీలా, వాడిపోయిన గులాబీలా కాదు. వాడిపోవడానికి కారణము కొద్దిపాటి నిర్లక్ష్యము. అయిపోతుందిలే, చూస్తాములే, చేసేస్తాములే, చేరుకుంటాములే... ఈ లే, లే అనే భాష కింద పడేస్తుంది. కావున చెక్ చేసుకోండి - ఎంత సమయము గడిచిపోయింది, ఇప్పుడు సమయము యొక్క సమీపత గురించి మరియు అకస్మాత్తుగా అయ్యే విషయము గురించి బాప్ దాదా అయితే సూచనను ఇచ్చేసారు, ఇస్తున్నారు కాదు, ఇచ్చేసారు. ఇటువంటి సమయము కొరకు ఎవర్రెడీగా మరియు అలెర్ట్ గా ఉండటము అవసరము. అలెర్టుగా ఉండేందుకు చెక్ చేసుకోండి - మా మనసు మరియు బుద్ధి సదా క్లీన్ మరియు క్లియర్ గా (స్వచ్ఛముగా మరియు స్పష్టముగా) ఉన్నాయా? స్వచ్ఛముగా కూడా ఉండాలి, స్పష్టముగా కూడా ఉండాలి. దీని కొరకు సమయముపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మనసులో, బుద్ధిలో క్యాచింగ్ పవర్ మరియు టచింగ్ పవర్, రెండూ చాలా అవసరము. ఎటువంటి పరిస్థితులు రానున్నాయంటే ఎక్కడో దూరముగా కూర్చుని ఉన్నా కానీ స్వచ్ఛమైన మరియు స్పష్టమైన మనసు మరియు బుద్ధి ఉన్నట్లయితే బాబా యొక్క సూచనలు, డైరెక్షన్లు, శ్రీమతము ఏవైతే లభించనున్నాయో, వాటిని క్యాచ్ చేయగలుగుతారు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని టచ్ అవుతుంది, అందుకే బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, వర్తమాన సమయములో సైలెన్స్ శక్తిని మీ వద్ద ఎంత వీలైతే అంత జమ చేసుకోండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా, మనను మరియు బుద్ధిని కంట్రోల్ చేయగలగాలి. వ్యర్థ సంకల్పాలు స్వప్నములో కూడా టచ్ చేయకూడదు, అటువంటి మైండ్ కంట్రోల్ కావాలి, అందుకే మనసును జయిస్తే జగత్తును జయించినట్లు అని సామెత ఉంది. ఉదాహరణకు స్థూల కర్మేంద్రియమైన చేయి ఉంది, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎప్పటివరకు కావాలనుకుంటే అప్పటివరకు దానిని ఆర్డర్ అనుసారముగా నడిపించగలరు. అదే విధముగా మనసు మరియు బుద్ధి యొక్క కంట్రోలింగ్ పవర్ ఆత్మలో అన్నివేళలా ఇమర్జ్ అయి ఉండాలి. యోగము సమయములో అనుభవమవుతుంది కానీ కర్మల సమయములో, వ్యవహారము సమయములో, సంబంధాల సమయములో అనుభవము తక్కువగా ఉండటము కాదు. అకస్మాత్తుగా పరీక్షలు రానున్నాయి ఎందుకంటే అంతిమ రిజల్ట్ కంటే ముందు మధ్యమధ్యలో పరీక్షలు పెట్టడము జరుగుతుంది.

మరి ఈ జన్మదినము నాడు ఏ విశేషతను చూపిస్తారు? సైలెన్స్ శక్తిని ఎంతగా జమ చేసుకోగలిగితే, ఒక్క క్షణములో స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతిలో నిమగ్నమైపోండి ఎందుకంటే సైన్స్ మరియు సైలెన్స్, సైన్స్ కూడా అతిలోకి వెళ్తూ ఉంది. కావున సైన్స్ పై సైలెన్స్ శక్తి యొక్క విజయము పరివర్తన చేస్తుంది. సైలెన్స్ శక్తితో దూరముగా కూర్చున్నా ఏ ఆత్మకైనా సహయోగాన్ని కూడా ఇవ్వగలరు, సకాష్ ను ఇవ్వగలరు. భ్రమిస్తూ ఉన్న మనసును శాంతపర్చగలరు. బ్రహ్మాబాబాను చూసారు - ఎప్పుడైనా ఎవరైనా అనన్యమైన బిడ్డ కొద్దిగా అలజడిలో ఉన్నా సరే లేక శారీరక లెక్కాచారాలలో ఉన్నా సరే ఉదయముదయమే లేచి ఆ బిడ్డకు సైలెన్స్ శక్తి యొక్క సకాష్ ను ఇచ్చారు మరియు ఆ బిడ్డ అనుభవము చేసేవారు. అంతిమములో ఈ సైలెన్స్ సేవ యొక్క సహయోగాన్ని ఇవ్వవలసి ఉంటుంది. పరిస్థితుల అనుసారముగా ఈ విషయము పట్ల చాలా శ్రద్ధ పెట్టండి, సైలెన్స్ శక్తిని మరియు తమ శ్రేష్ఠ కర్మల శక్తిని జమ చేసుకునే బ్యాంకు కేవలం ఇప్పుడే తెరుచుకుంటుంది, మరే జన్మలోనూ జమ చేసుకునే బ్యాంకు ఉండదు. ఇప్పుడు ఒకవేళ జమ చేసుకోలేదంటే ఇక తర్వాత బ్యాంకే ఉండదు, అప్పుడిక ఎందులో జమ చేసుకుంటారు! అందుకే జమ శక్తిని ఎంతగా జమ చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. మామూలుగా కూడా అందరూ ఏమంటారంటే - ఏది చెయ్యాలన్నా దానిని ఇప్పుడే చెయ్యండి, ఏది ఆలోచించాలన్నా దానిని ఇప్పుడే ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచన, ఆలోచనగానే ఉండిపోతుంది మరియు కొద్ది సమయము తర్వాత ఎప్పుడైతే సమయము యొక్క హద్దు సమీపిస్తుందో అప్పుడు ఆ ఆలోచన పశ్చాత్తాపము రూపములోకి మారిపోతుంది. ఇది చేసి ఉండేవాడిని, ఇది చెయ్యాల్సింది... అప్పుడు అది ఆలోచనగా ఉండదు, పశ్చాత్తాపము రూపములోకి మారిపోతుంది, అందుకే బాప్ దాదా ముందు నుండే సూచనను ఇస్తున్నారు. సైలెన్స్ శక్తి, ఒక్క క్షణములో ఏమి జరిగినా కానీ, సైలెన్స్ లో నిమగ్నమైపోండి. పురుషార్థము చేస్తున్నాను అని అనుకోవడము కాదు. జమ యొక్క పురుషార్థాన్ని ఇప్పుడే చేయగలరు.

బాప్ దాదాకు పిల్లల పట్ల స్నేహము ఉంది, బాప్ దాదా ఒక్కొక్క బిడ్డను తనతోపాటు తీసుకువెళ్ళాలని అనుకుంటారు. తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము... అని ఏదైతే ప్రతిజ్ఞ ఉందో, ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకునేందుకు సమానమైవారు తోడుగా వెళ్తారు. వినిపించాము కదా - డబుల్ విదేశీయులకు చేతిలో చేయి వేసి నడవడము మంచిగా అనిపిస్తుంది, కావున శ్రీమతమనే చేతిలో చేయి ఉండాలి. బాబా యొక్క శ్రీమతము - అదే మీ మతము, దీనినే చేతిలో చేయి అని అంటారు. మరి సరేనా - ఈ రోజు జన్మదిన ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు కదా! వీరు నా పిల్లలు అని బాప్ దాదాకు కూడా సంతోషముగా ఉంది, నా పిల్లలు సదా ఉత్సాహములో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అని బాబాకు నషా ఉంది. ప్రతి రోజు ఉత్సవాన్ని జరుపుకుంటారా లేక విశేషమైన రోజునే జరుపుకుంటారా? సంగమయుగమే ఉత్సవము. యుగమే ఉత్సవాలది. మరే యుగము సంగమయుగములా లేదు. కావున - మేము సమానముగా తయారవ్వాల్సిందే అని అందరికీ ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి కదా. ఉన్నాయా? తయారవ్వాల్సిందేనా, లేక చూస్తాములే, అవుతాములే, చేస్తాములే, లే, లే, అనైతే అనటము లేదు కదా? తయారవ్వాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. తయారవ్వాల్సిందే, దాని కోసం త్యాగము చెయ్యవలసి ఉంటుంది, తపస్య చెయ్యవలసి ఉంటుంది. సిద్ధముగా ఉన్నారా, ఏమి త్యాగము చెయ్యవలసి వచ్చినా సరే సిద్ధముగా ఉన్నారా. అన్నింటికన్నా గొప్ప త్యాగము ఏమిటి? త్యాగము చెయ్యడము విషయములో అన్నింటికన్నా అతి పెద్ద పదము ఒకటి విఘ్నము వేస్తుంది. త్యాగము, తపస్య, వైరాగ్యము, అనంతమైన వైరాగ్యము, ఇందులో ఒకే ఒక్క పదము విఘ్నము వేస్తుంది, మీకైతే తెలుసు. ఏమిటా ఒక్క పదము? ‘‘నేను’’, దేహాభిమానము యొక్క నేను. అందుకే బాప్ దాదా అన్నారు, ఏ విధముగా ఇప్పుడు, నాది అని అన్నప్పుడల్లా ముందుగా ఏమి గుర్తుకువస్తుంది? నా బాబా. నా బాబా అని గుర్తుకువస్తుంది కదా! నాది అని దేనినైనా అనవచ్చు కానీ నాది అని అన్నప్పుడల్లా ముందుగా బాబా అన్నది రావడం అలవాటైపోయింది. అదే విధముగా ఎప్పుడెప్పుడైతే నేను అని అంటారో, అప్పుడు నా బాబా అన్నది ఎలాగైతే మర్చిపోరో, ఎప్పుడైనా ఎవరినైనా నా అని అన్నా అప్పుడు బాబా అన్న పదము తప్పకుండా వస్తుంది, అదే విధముగా ఎప్పుడైతే నేను అని అంటారో అప్పుడు ముందుగా ఆత్మ గుర్తుకు రావాలి. నేను ఎవరిని? ఆత్మను. నేను ఆత్మను, ఇది చేస్తున్నాను. నేను మరియు నాది అనేవి హద్దులో నుండి అనంతములోకి మారిపోవాలి. వీలవుతుందా? వీలవుతుందా? తల అయితే ఊపండి. అలవాటు చేసుకోండి, నేను అని అన్న వెంటనే ఆత్మ అని రావాలి. మరియు ఎప్పుడైతే నేను అనే భావన వస్తుందో, అప్పుడు ఒక్క పదము గుర్తుకు రావాలి - చేయించేవారు ఎవరు? చేయించేవారైన బాబా చేయిస్తున్నారు. చేయించేవారు అన్న పదము చేసే సమయములో సదా గుర్తుండాలి. నేను అనే భావన రాదు. నా ఆలోచన, నా డ్యూటీ. డ్యూటీ యొక్క నషా కూడా చాలా ఉంటుంది. నా డ్యూటీ అని అంటారు... కానీ అది ఇచ్చిన దాత ఎవరు! ఈ డ్యూటీలు ప్రభువు ఇచ్చిన కానుకలు. ప్రభువు యొక్క కానుకలను నావిగా భావించడము, ఆలోచించండి, ఇది మంచిదా?

బాప్ దాదా ప్రతి ఒక్క స్థానము నుండి ఇప్పుడు రిజల్ట్ ను కోరుకుంటున్నారు. ఈ ఒక్క నెల ఇటువంటి నేచురల్ నేచర్ ను (సహజ స్వభావమును) తయారుచేసుకోండి ఎందుకంటే నేచురల్ నేచర్ త్వరగా మారదు. కావున నేచురల్ నేచర్ ను తయారుచేసుకోండి, చెప్పాను కదా - సదా మీ ముఖము ద్వారా బాబా గుణాలు కనిపించాలి, నడవడిక ద్వారా బాబా శ్రీమతము కనిపించాలి. సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖము ఉండాలి. సదా సంతుష్టముగా ఉండే మరియు సంతుష్టపరిచే వ్యవహారము ఉండాలి. ప్రతి కర్మలో, కర్మ మరియు యోగము యొక్క బ్యాలెన్స్ ఉండాలి. కొంతమంది పిల్లలు బాప్ దాదాకు చాలా మంచి-మంచి విషయాలను వినిపిస్తారు, ఏమంటారో చెప్పాలా? ఏమంటారంటే - బాబా, మీరు అర్థం చేసుకోండి కదా, ఇది నా నేచర్, వేరే ఏమీ కాదు, నా నేచరే ఇది. అప్పుడు బాప్ దాదా ఏమనాలి? నా నేచరా? నా మాటే ఇలా ఉంటుంది అని అంటారు, చాలామంది ఏమంటూ ఉంటారంటే - నేనేమీ క్రోధము చేయలేదు, నా మాట కాస్త గట్టిగా ఉంటుంది, కొద్దిగా గట్టిగా మాట్లాడాను, క్రోధమేమీ చేయలేదు, కేవలం గట్టిగా మాట్లాడాను. చూడండి, ఇవి ఎంతటి మధురాతి మధురమైన విషయాలు. బాప్ దాదా అంటారు, దేనినైతే మీరు నా నేచర్ అని అంటారో, ఈ నాది అని అనడమే తప్పు. నా నేచర్ అన్నది రావణుడి నేచరా లేక మీ నేచరా? మీ నేచర్ అనాది కాలములో, ఆది కాలములో, పూజ్య కాలములో ఉంటుంది, అది ఒరిజినల్ నేచర్. రావణుడి వస్తువును నాది-నాది అని అంటారు కదా, అందుకే అది వెళ్ళదు. పరాయి వస్తువును తమదిగా చేసి పెట్టుకున్నారు కదా, ఎవరైనా పరాయి వస్తువును తమ వద్ద సంభాళించుకుని పెట్టుకుంటే, దాచి పెట్టుకుని ఉంచుకుంటే, దానిని మంచిగా భావించడం జరుగుతుందా? మరి రావణుడి నేచర్, పరాయి నేచర్, దానిని నాది అని ఎందుకు అంటారు? నా దోషము లేదు, నా నేచర్ అని చాలా నషాతో అంటారు. బాప్ దాదాను కూడా సంతోషపెట్టే ప్రయత్నము చేస్తారు. ఇప్పుడు దీని సమాప్తి సమారోహాన్ని చేస్తారా! చేస్తారా? చేస్తారా? చూడండి, మనస్ఫూర్తిగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెయ్యండి, ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ అంతా జరిగిపోతుంది. ఇది నా నేచర్ కాదు అని మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. ఇది ఇతరుల వస్తువు, దానిని ఉంచుకోకూడదు. మీరైతే మరజీవాగా అయిపోయారు కదా. మీది బ్రాహ్మణ నేచరా లేక పాత నేచరా? మరి బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారో అర్థమయిందా? మనోరంజనాన్ని జరుపుకోండి, డ్యాన్స్ చెయ్యండి, ఆటలు ఆడండి, కానీ... కానీ ఉంది. అన్నీ చేస్తూ కూడా సమానముగా అవ్వాల్సిందే. సమానముగా అవ్వకుండా తోడుగా ఎలా వెళ్ళగలరు! కస్టమ్స్ (తనిఖీ)లో, ధర్మరాజపురిలో ఆగవలసి ఉంటుంది, తోడుగా వెళ్ళరు. మరేమిటి, చెప్పండి దాదీలు, ఒక్క నెల రిజల్ట్ చూద్దామా! చూద్దామా? చెప్పండి, చూద్దామా? ఒక్క నెల అటెన్షన్ పెడతారా? ఒక్క నెల ఒకవేళ అటెన్షన్ పెట్టినట్లయితే అది నేచురల్ అయిపోతుంది. నెలలోని ఒక్క రోజును కూడా విడిచిపెట్టకండి. మంచిది, దాదీలు బాధ్యత తీసుకుంటారు. అందరూ కలిసి ఒకరి పట్ల ఒకరు శుభ భావన, శుభ కామనల చేతిని అందించుకోండి. ఏ విధముగా ఎవరైనా పడిపోతారు కదా, అప్పుడు వారికి చేతిని అందించి ప్రేమగా లేపుతారు, అలాగే శుభ భావన మరియు శుభ కామనల చేతిని, పరస్పరములో సహయోగాన్ని ఇచ్చుకుంటూ ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. సరేనా? కేవలం మీరు చెక్ చేసుకోవడము తక్కువగా చేసుకుంటారు. చేసేసిన తర్వాత చెక్ చేసుకుంటారు, అప్పటికే అది అయిపోయింది కదా! ముందు ఆలోచించండి, ఆ తర్వాత చెయ్యండి. ముందు చేసి, ఆ తర్వాత ఆలోచించడము కాదు. చెయ్యాల్సిందే.

అచ్ఛా! ఇప్పుడు బాప్ దాదా ఏ డ్రిల్ ను చేయించాలనుకుంటున్నారు? ఒక్క సెకండులో శాంతి యొక్క శక్తి స్వరూపులుగా అయిపోండి. ఏకాగ్ర బుద్ధి, ఏకాగ్ర మనసు. రోజంతటిలో ఒక్క సెకండును మధ్యమధ్యలో తీసి అభ్యాసము చెయ్యండి. సైలెన్స్ యొక్క సంకల్పము చేసారు మరియు స్వరూపముగా అయ్యారు. దాని కోసం సమయము యొక్క అవసరము లేదు. ఒక్క సెకండు యొక్క అభ్యాసము చెయ్యండి, సైలెన్స్. అచ్ఛా!

నలువైపులా ఉన్న జన్మ ఉత్సవాన్ని జరుపుకునే భాగ్యశాలీ ఆత్మలకు, సదా ఉత్సాహములో ఉంటూ సంగమయుగ ఉత్సవాన్ని జరుపుకునేవారికి, ఇటువంటి ఉల్లాస-ఉత్సాహాల రెక్కలతో ఎగిరే పిల్లలందరికీ, సదా మనసు మరియు బుద్ధిని ఏకాగ్రత యొక్క అనుభవీగా చేసుకునే మహావీరులైన పిల్లలకు, సదా సమానముగా అయ్యే ఉల్లాసాన్ని సాకార రూపములోకి తీసుకువస్తూ ఫాలో ఫాదర్ చేసే పిల్లలకు, సదా ఒకరి పట్ల ఒకరికి స్నేహీగా, సహయోగిగా ఉంటూ ధైర్యాన్ని ఇప్పించేవారికి, బాబా నుండి సహాయము యొక్క వరదానాన్ని ఇప్పించే వరదానీ పిల్లలకు, మహాదానీ పిల్లలకు, బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు పదమాల, పదమాల, పదమాల, పదమాల రెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు.

వరదానము:-
సదా ఏకాంతములో మరియు స్మరణలో బిజీగా ఉండే అనంతమైన వానప్రస్థీ భవ

వర్తమాన సమయానుసారముగా మీరందరూ వానప్రస్థ అవస్థకు సమీపముగా ఉన్నారు. వానప్రస్థులు ఎప్పుడూ బొమ్మలాటను ఆడరు. వారు సదా ఏకాంతములో మరియు స్మరణలో ఉంటారు. అనంతమైన వానప్రస్థులైన మీరందరూ సదా ఒక్కరి అంతములో అనగా నిరంతరము ఏకాంతములో ఉండండి, అంతేకాక ఒక్కరినే స్మరణ చేస్తూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. పిల్లలందరి పట్ల బాప్ దాదా యొక్క శుభ ఆశ ఇదే - ఇప్పుడు బాబా మరియు పిల్లలు సమానముగా అయిపోవాలి అని. సదా స్మృతిలో ఇమిడిపోయి ఉండాలి. సమానముగా అవ్వడమే ఇమిడిపోవడము - ఇదే వానప్రస్థ స్థితికి గుర్తు.

స్లోగన్:-
మీరు ధైర్యము యొక్క ఒక్క అడుగును వేసినట్లయితే బాబా సహాయమనే వేయి అడుగులను వేస్తారు.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అయ్యే ధ్యాసలోనే ఉండండి

ఏ విధముగా బాబా గురించి అందరి నోటి నుండి ఒకటే మాట వెలువడుతుంది - ‘‘నా బాబా’’, అదే విధముగా సర్వ శ్రేష్ఠ ఆత్మలైన మీ అందరి పట్ల కూడా ఈ భావన ఉండాలి, అనుభూతి ఉండాలి. ప్రతి ఒక్కరి నుండి ‘నా వారు’ అన్న అనుభూతి కలగాలి. వీరు నా శుభచింతక, సహయోగీ, సేవా సహచరులు అని ప్రతి ఒక్కరూ భావించాలి, వీరిని - బాబా సమానమైనవారు, కర్మాతీత స్థితి యొక్క సింహాసనాధికారులు అని అంటారు.

సూచన - ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, రాజయోగీ తపస్వీ సోదరీ సోదరులందరూ సాయంత్రము 6.30 నుండి 7.30 గంటల వరకు, విశేషముగా యోగాభ్యాస సమయములో తమ లైట్-మైట్ స్వరూపములో స్థితులై, భృకుటి మధ్యలో బాప్ దాదాను ఆహ్వానిస్తూ, కంబైండ్ స్వరూపము యొక్క అనుభవాన్ని చెయ్యాలి మరియు నలువైపులా లైట్ మైట్ కిరణాలను వ్యాపింపజేసే సేవను చెయ్యాలి.