22-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - దానము ఇంటి నుండే ప్రారంభమవుతుంది
అనగా దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉన్నారో, శివుడు మరియు దేవతల పూజారులు
ఎవరైతే ఉన్నారో, వారికి మొట్టమొదట జ్ఞానము ఇవ్వండి’’
ప్రశ్న:-
తండ్రి యొక్క
ఏ కర్తవ్యాన్ని మనుష్యులెవ్వరూ చేయలేరు మరియు ఎందుకు?
జవాబు:-
మొత్తము
విశ్వములో శాంతిని స్థాపన చేసే కర్తవ్యము ఒక్క తండ్రిదే. మనుష్యులు విశ్వములో
శాంతిని స్థాపన చేయలేరు ఎందుకంటే అందరూ వికారులుగా ఉన్నారు. ఎప్పుడైతే తండ్రిని
తెలుసుకుంటారో మరియు పవిత్రముగా అవుతారో అప్పుడు శాంతి స్థాపన జరుగుతుంది. తండ్రిని
తెలుసుకోని కారణముగా అనాథలుగా అయిపోయారు.
పాట:-
నీ దారిలోనే
మరణించాలి...
ఓంశాంతి
ఓం శాంతి అర్థాన్ని కూడా ఘడియ-ఘడియ తెలియజేయవలసి ఉంటుంది ఎందుకంటే ఓం శాంతి యొక్క
అర్థం ఎవరికీ తెలియదు. మన్మనాభవ అనగా అనంతమైన తండ్రిని స్మృతి చేయండి అని పదే-పదే
చెప్పవలసి ఉంటుంది. ఓం అనగా భగవంతుడు అని వారు ఓం యొక్క అర్థాన్ని చెప్తారు. తండ్రి
అంటారు - ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరము. పరమపిత పరమాత్మ కూడా ఓం అని అంటారు.
నేను కూడా ఆత్మను, పరంధామ నివాసిని. ఆత్మలైన మీరు జనన-మరణ చక్రములోకి వస్తారు, నేను
రాను. అయితే, నేను పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల సారాన్ని అర్థం చేయించేందుకు
సాకారములోకి తప్పకుండా వస్తాను. ఇతరులెవరూ ఇది అర్థం చేయించలేరు. ఒకవేళ మీకు
నిశ్చయము లేకపోతే మొత్తము ప్రపంచమంతా తిరగండి, వెతకండి, స్వయము గురించి మరియు సృష్టి
ఆదిమధ్యాంతాల గురించి జ్ఞానాన్ని ఇచ్చేవారు ప్రపంచములో ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి.
పరమపిత పరమాత్మ తప్ప సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఇంకెవరూ
తెలియజేయలేరు, ఇంకెవరూ రాజయోగాన్ని నేర్పించలేరు, పతితులను పావనముగా తయారుచేయలేరు.
దేవీ-దేవతల పూజారులు ఎవరైతే ఉంటారో, మొట్టమొదట వారికి అర్థం చేయించే పురుషార్థాన్ని
చేయండి. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము వారే పూర్తి 84 జన్మలను తీసుకున్నారు, వారే
మంచి రీతిలో అర్థం చేసుకోగలరు. తర్వాత వచ్చేవారు 84 జన్మలను తీసుకోలేరు. దేవతల
పూజారులుగా ఎవరైతే ఉంటారో మరియు గీతను చదివేవారు ఎవరైతే ఉంటారో వారే ఇది వింటారు.
గీతలో కేవలం ఈ పొరపాటును చేసారు - భగవంతునికి బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసేశారు.
కనుక గీతను చదివేవారికి అర్థం చేయించాలి. పరమపిత పరమాత్మ అయిన శివునితో మీకు ఏమి
సంబంధము ఉంది అని అడగాలి. వారిని భగవంతుడు అని అంటారు. శ్రీకృష్ణుడైతే దైవీ గుణాలు
కలిగినవారు, అతనికి దైవీ రాజధాని ఉండేది, అందులో అందరూ దైవీ గుణాలు కలిగినవారే
ఉండేవారు. ఇప్పుడు వారే పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు. కనుక ప్రయత్నము చేసి
మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము వారిని మేలుకొలపాలి. దానము ఇంటి నుండే
ప్రారంభమవుతుంది. ఎవరైతే శివుని పూజారులు ఉన్నారో, వారికి కూడా అర్థం చేయించవలసి
ఉంటుంది. శివుడు తప్పకుండా వస్తారు, అందుకే వారి జయంతిని జరుపుకుంటారు, వారు పరమపిత
పరమాత్మ. వారు తప్పకుండా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉండవచ్చు, ఇతర
మనుష్యమాత్రులెవరూ దీనిని నేర్పించలేరు. శ్రీకృష్ణుడిని గాని, బ్రహ్మాను గాని
భగవంతుడు అని అనలేరు ఎందుకంటే సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే. వారు జ్ఞానసాగరుడు
అయిన కారణముగా వారు అందరికీ శిక్షకుడు కూడా. సృష్టి ఆదిమధ్యాంతాల చరిత్ర-భౌగోళికాల
గురించి ఇతురులెవరికీ తెలియదు.
తండ్రి అంటారు - నన్ను జ్ఞాన సాగరుడు, చైతన్య బీజ రూపుడు అని కూడా అంటారు.
తలకిందులుగా ఉన్న ఈ వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము, ఆ బీజము వద్దనే ఉంటుంది,
అందుకే నన్ను జ్ఞానసాగరుడు, ఆల్మైటీ అథారిటీ అని అంటారు. దేనికి అథారిటీ. అన్ని
వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు మొదలైనవాటన్నింటి గురించి తెలుసు. పిల్లలైన మీకు అర్థం
చేయిస్తున్నారు. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని ఆ శాస్త్రాలు వినిపించేవారు అంటారు.
కానీ అలా ఉండదు. ఇది వెరైటీ ధర్మాల మనుష్య సృష్టి రూపీ వృక్షము, భాగవతములో దీని
ఆయువును చాలా ఎక్కువగా వ్రాసేశారు. భాగవతము అనేది ధర్మ శాస్త్రమేమీ కాదు. గీత ధర్మ
శాస్త్రము, దీని ద్వారా దేవీ-దేవతా ధర్మము స్థాపన అయ్యింది. ఇకపోతే భాగవతము,
మహాభారతము మొదలైనవాటి ద్వారా ధర్మ స్థాపనేమీ జరగదు. వారు శ్రీకృష్ణుని చరిత్రను
వ్రాశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, వారు 84 జన్మలను తీసుకున్నారు అని
దేవీ-దేవతా ధర్మము వారికి మీరు అర్థం చేయించండి. సత్యయుగములో కేవలం భారత్ యే ఉండేది,
ఇంకే ధర్మము ఉండేది కాదు. భారత్ యే స్వర్గముగా ఉండేది. భారత్ యే ఉన్నతోన్నతమైనదిగా
గాయనము చేయబడుతుంది మరియు ఇది పరమపిత పరమాత్మ అయిన శివుని జన్మ స్థలము, వారు వచ్చి
పతితులను పావనముగా తయారుచేస్తారు. శివుని పూజ కూడా ఇక్కడే జరుగుతుంది, వారి జయంతి
కూడా ఇక్కడే జరుపుకోబడుతుంది. వారు తప్పకుండా పతిత ప్రపంచములోనే వచ్చి ఉంటారు.
పతిత-పావనా రండి అని అందరూ పిలుస్తారు కూడా. భారత్ పావనముగా ఉండేది, తర్వాత
భారతవాసులు 84 జన్మల చక్రములో తిరిగారు. ఎవరైతే పావనులుగా, స్వర్గవాసులుగా ఉండేవారో,
వారే ఇప్పుడు నరకవాసులుగా, పతితులుగా అయ్యారు. శివబాబా పావనముగా తయారుచేసారు,
రావణుడు పతితముగా తయారుచేశాడు. ఈ సమయములో రావణ రాజ్యమే ఉంది. ప్రతి నరుడు-నారిలో 5
వికారాలు ఉన్నాయి. సత్యయుగములో వికారాలు ఉండేవే కావు, నిర్వికారులుగా ఉండేవారు.
ఇప్పుడు పతితులుగా ఉన్నారు, కావుననే - రండి, వచ్చి మమ్మల్ని మళ్ళీ పావనముగా చేయండి
అని పిలుస్తారు. సత్యయుగములో మనమే పావనముగా ఉండేవారము, 21 జన్మలు రామరాజ్యములో
ఉండేవారము. ఇప్పుడిది రావణ రాజ్యము, అందరూ వికారులుగా ఉన్నారు. తండ్రి అంటారు -
కామము మహాశత్రువు, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది, ఇప్పుడు దీనిపై విజయాన్ని
పొంది పావనముగా అవ్వండి. మీరు జన్మ-జన్మలుగా పాపాలు చేసారు. అందరికన్నా ఎక్కువ
తమోప్రధానముగా అయ్యారు, ఆత్మలో మాలిన్యము చేరుతూ వచ్చింది. ముందు బంగారు యుగము
వారిగా ఉండేవారు, తర్వాత వెండి యుగము వారిగా, తర్వాత రాగి యుగము వారిగా... అలా
మాలిన్యము చేరుతూ-చేరుతూ మెట్లు దిగుతూ వచ్చారు. ఇది భారత్ యొక్క విషయమే.
సత్యయుగములో 8 జన్మలు ఉంటాయి, తర్వాత త్రేతాలో 12 జన్మలు ఉంటాయి, తర్వాత ఆ
భారతవాసులే చంద్రవంశీయులుగా, వైశ్య వంశీయులుగా... అవుతారు. ఆత్మ అపవిత్రముగా
అవుతుంది.
తండ్రి అంటారు - నేను వచ్చి కల్ప-కల్పము భారత్ ను స్వర్గముగా తయారుచేస్తాను, మళ్ళీ
రావణుడు నరకముగా తయారుచేస్తాడు. డ్రామా ఈ విధముగా తయారై ఉంది. ఇప్పుడు తండ్రి అర్థం
చేయిస్తున్నారు - జ్ఞానసాగరుడైతే శివబాబాయే కదా. ఉన్నతోన్నతమైనవారు శివుడు, వారు
అందరికీ పూజ్యుడు. మొట్టమొదట వారి పూజ జరుగుతుంది. వారు అనంతమైన తండ్రి. తప్పకుండా
వారి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. భారతవాసులు మర్చిపోయారు, భగవంతుడు అని
ఒక్క నిరాకారుడినే అంటారు. వారిని మనుష్యులు స్మృతి కూడా చేస్తారు. అలాగని అందరూ
భగవంతులే భగవంతులని కాదు. ఒకవైపు భగవంతుడిని స్మృతి కూడా చేస్తారు, ఇంకొకవైపు
నిందిస్తారు కూడా. ఒకవైపు సర్వవ్యాపి అని అంటారు, మరోవైపు పతిత-పావనా రండి, అని
అంటారు. తండ్రి వచ్చి బ్రహ్మా తనువు ద్వారా బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులకే అర్థం
చేయిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. బ్రాహ్మణులకన్నా పైన శివుడు
ఉన్నారు. విరాట రూపములో దేవతలను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను చూపిస్తారు.
అందులో బ్రాహ్మణుల పేరే లేదు ఎందుకంటే లౌకిక బ్రాహ్మణులను వికారులుగా ఉండటం చూస్తారు,
కావున వారిని దేవతలకన్నా ఉత్తములు అని ఎలా అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు,
వారు కూడా - బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని పాడుతారు. దేవతల రాజ్యము ఎప్పుడు ఉండేది,
స్వర్గము ఎక్కడ నుండి వచ్చింది అనేది ఏక్యురేట్ గా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు
అర్థం చేసుకున్నారు - బాబా వచ్చి బ్రహ్మా ద్వారా స్వర్గాన్ని స్థాపన చేస్తారు,
శంకరుని ద్వారా నరకాన్ని వినాశనము చేయిస్తారు. మహాభారత యుద్ధము కూడా జరిగింది కదా,
దాని ద్వారా స్వర్గము యొక్క గేట్లు తెరుచుకున్నాయి. ఇలా అంటారు కానీ ఏమీ అర్థం
చేసుకోరు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని కూడా చూపిస్తారు.
ఇప్పుడు సరిగ్గా అదే పాత్ర నడుస్తుంది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా యుద్ధము
జరిగింది, అప్పుడు పతిత ప్రపంచము వినాశనమైంది. గీతా జ్ఞానాన్ని వినిపించేటప్పుడు
మూడు సైన్యాలు ఉండేవని అంటారు. యూరోప్ వాసులైన యాదవ సైన్యము ఉండేది, వారు సైన్స్
ద్వారా మిసైల్స్ ను కనుగొన్నారు. గీతను వినిపించి పూర్తి 5 వేల సంవత్సరాలైంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ మూడు సైన్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. వినాశకాలే
విపరీత బుద్ధి అని అంటూ ఉంటారు అనగా పరమపిత పరమాత్ముని పట్ల ప్రీత బుద్ధి లేకపోవటము
అని అంటారు. వారికేమీ తెలియదు. మీకు తప్ప ఇంకెవరికీ ప్రీతి లేదు. అందరిదీ వినాశకాలే
విపరీత బుద్ధిగా ఉంది. ఇకపోతే పాండవులైన మీది ప్రీతి బుద్ధి. మీరు శివబాబానే స్మృతి
చేస్తారు. శివబాబా మాకు 21 జన్మల వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని మీకు తెలుసు.
మీకు శివబాబా పట్ల ప్రీతి బుద్ధి ఉంది. ఇకపోతే ఎవరికీ తండ్రి గురించి తెలియనే
తెలియదు. కావున మూడు సైన్యాలు ఉన్నట్లు కదా. మీరు పాండవ సైన్యము. ఇప్పుడిది వినాశన
కాలము. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. శివబాబా అంటారు, మీరు పవిత్రముగా
అయినట్లయితే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. సత్యయుగములో ఒక్క దేవీ-దేవతా
ధర్మముండేది, ఇంకే ధర్మము ఉండేది కాదు. ఇప్పుడు మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి, కానీ
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము లేదు. తమను తాము దేవీ-దేవతలుగా భావించనే భావించరు.
మేమైతే పతితులుగా ఉన్నామని అంటారు. దేవతల ఎదురుగా - మీరు సర్వ గుణ సంపన్నులు, 16
కళల సంపూర్ణులు అని మహిమను పాడుతారు. స్వయము గురించి - మేము వికారులము,
నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవని అంటారు. తండ్రిని స్మృతి చేస్తారు. మీరు కూడా
ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయకుండా పావనముగా అవ్వలేరు, అప్పుడు
ఉన్నత పదవిని పొందలేరు. అపవిత్ర ప్రపంచము ఎప్పుడైతే వినాశనమవుతుందో, అప్పుడే
ప్రపంచములో శాంతి ఏర్పడుతుంది. భారత్ లో మరియు ప్రపంచములో శాంతి ఏర్పడాలని మనుష్యులు
ప్రయత్నము చేస్తారు. కానీ అది ఒక్క తండ్రి పని మాత్రమే. మనుష్యులైతే వికారులుగా
ఉన్నారు. వారు శాంతిని ఎలా స్థాపన చేయగలరు. ప్రతి ఇంటిలోనూ గొడవలు ఉన్నాయి. తండ్రిని
తెలుసుకోని కారణముగా పూర్తిగా అనాథలుగా అయిపోయారు. సత్యయుగములో పూర్తి పవిత్రత,
సుఖ-శాంతులు ఉండేవి. ఇప్పుడు మళ్ళీ తండ్రి ఆ పవిత్రత, సుఖ-శాంతులను స్థాపన
చేస్తున్నారు, ఇతరులెవ్వరూ చేయలేరు. భారతవాసులు ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు.
స్వర్గములో ఉండేటప్పుడు పునర్జన్మలు కూడా స్వర్గములోనే తీసుకునేవారు. ఇప్పుడు
పతితులుగా ఉన్నారు, అందుకే పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. పారలౌకిక
తండ్రిని స్మృతి చేయడముతోనే వికర్మలు వినాశనమవుతాయని ఇప్పుడు పిల్లలకు తెలుసు.
లౌకిక తండ్రి నుండి అయితే హద్దు వారసత్వము లభిస్తుంది. పారలౌకిక అనంతమైన తండ్రి
నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది
సత్సంగమేమీ కాదు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము.
బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారుచేస్తారని మీకు సంతోషము కలుగుతుంది. ఎవరైతే
కల్పక్రితం స్వర్గవాసులుగా అయ్యారో, వారే ఇప్పుడు అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా
దేవతలుగా ఎప్పుడూ అవ్వలేరు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. ఇప్పుడైతే భారత్ లో
ఏ కళలు లేవు. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్నారు,
మిమ్మల్ని తండ్రి ఇప్పుడు మేలుకొలిపారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు
వచ్చారు. తండ్రి తప్ప ఇంకెవరూ అలా తయారుచేయలేరు. స్వర్గమని సత్యయుగాన్ని, నరకమని
కలియుగాన్ని అంటారు. యథా రాజా-రాణి తథా ప్రజ, ఇప్పుడు అందరూ వికారాల ద్వారా
జన్మిస్తారు, దేవతలెప్పుడూ వికారాల ద్వారా పునర్జన్మలను తీసుకోరు. పిల్లలు ఇప్పుడు
తండ్రితో పవిత్రముగా ఉంటామని ప్రతిజ్ఞను చేస్తారు కానీ నడుస్తూ-నడుస్తూ ఓడిపోతారు,
అప్పుడు చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. చాలా తీవ్రముగా దెబ్బ తగులుతుంది.
ఆశ్చర్యము కలిగించేలా వింటారు, వినిపిస్తారు, మళ్ళీ పారిపోతారు. సాక్షాత్కారాలు కూడా
కలుగుతాయి కానీ సాక్షాత్కారాలలో మాయ చాలా ప్రవేశిస్తుంది. ఏ విధముగా రేడియో తరంగాల
ద్వారా ఒకరి మాటలు ఒకరికి వినిపించకూడదు అని మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తారో, ఇది
కూడా అటువంటిదే. యోగములో మాయ విఘ్నాలను వేస్తుంది. శ్రమంతా యోగములోనే ఉంది. భారత్
యొక్క ప్రాచీన యోగము గాయనము చేయబడింది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతిని పెట్టుకుని సత్యాతి-సత్యమైన పాండవులుగా
అవ్వాలి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, అందుకే పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచానికి
యజమానులుగా అవ్వాలి.
2. కామము మహాశత్రువు, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది, దానిపై విజయాన్ని
ప్రాప్తి చేసుకుని పావనముగా అవ్వాలి, స్మృతితో వికారాల మాలిన్యాన్ని తొలగించుకుని
ఆత్మను బంగారు యుగానికి చెందినదిగా తయారుచేసుకోవాలి.
వరదానము:-
మరజీవా జన్మ యొక్క స్మృతి ద్వారా కర్మ బంధనాలను సంబంధములోకి
పరివర్తన చేసుకునే పరోపకారి భవ
ఇప్పుడిది మరజీవా జన్మ కావున లౌకిక కర్మ బంధనాల సంబంధాలు
ఏవైతే ఉన్నాయో, అవి శ్రీమతము ఆధారముగా సేవా సంబంధాలకు ఆధారము. అది కర్మ బంధనము కాదు,
అది సేవా సంబంధము. సేవా సంబంధములో - అందరూ వెరైటీ ఆత్మలు అన్న జ్ఞానాన్ని ధారణ చేసి
నడుచుకున్నట్లయితే బంధనములో విసుగు చెందరు. కానీ అతి పాపాత్మ, అపకారీ ఆత్మ పట్ల కూడా
అయిష్టము మరియు ద్వేషానికి బదులుగా దయార్ద్ర హృదయులుగా అయి దయా భావన ఉంచుతూ, సేవా
సంబంధముగా భావిస్తూ సేవ చేసినట్లయితే ప్రసిద్ధి చెందిన విశ్వ కళ్యాణకారులుగా మరియు
పరోపకారులుగా మహిమ చేయబడతారు.
స్లోగన్:-
సమయము లేక
పరిస్థితి అనుసారముగా వైరాగ్యము కలిగితే, అది కూడా అల్పకాలిక వైరాగ్యమే, సదాకాలపు
వైరాగులుగా అవ్వండి.
అవ్యక్త ప్రేరణలు -
‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’
ఏ విధమైన విఘ్నము లేక
సమస్య వచ్చినా లేక మాయ దాడి జరిగినా, అది దాడి కాదు, అది ఆట వలె అనుభవమవ్వాలి. ఆటగా
భావించటం వలన సంతోషముగా దాటివేస్తారు మరియు అవస్థ ఏకరసముగా ఉంటుంది. కానీ ఒకవేళ
దానిని దాడిగా భావించినట్లయితే భయపడతారు కూడా మరియు అలజడిలోకి కూడా వస్తారు. మాయ పని
రావటము మరియు మీ పని విజయులుగా అవ్వటము.