22-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
15.12.2005
‘‘ఇప్పుడు స్నేహము మరియు సహయోగము యొక్క రూపురేఖలను
స్టేజ్ పైకితీసుకురండి, ప్రతి ఒక్కరికీ గుణాలు మరియు శక్తుల
కానుకను ఇవ్వండి’’
ఈ రోజు పరమాత్మ తండ్రి తమ నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు
అధికారులైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ అనేది
విశ్వములో కోట్లలో కొద్దిమందికే ప్రాప్తిస్తుంది. ఈ పరమాత్మ
ప్రేమ నిస్వార్థ ప్రేమ, ఎందుకంటే ఒక్క పరమాత్మ తండ్రియే
నిరాకారుడు, నిరహంకారి. మనుష్య ఆత్మలు శరీరధారులు అయిన కారణముగా
ఏదో ఒక స్వార్థములోకి వచ్చేస్తారు. పరమాత్మ అయిన తండ్రియే తమ
పిల్లలకు ఇటువంటి నిస్వార్థమైన ప్రేమను ఇస్తారు. పరమాత్మ ప్రేమ
బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారము. అది బ్రాహ్మణ జీవితానికి
ప్రాణదానము వంటిది. ఒకవేళ బ్రాహ్మణ జీవితములో పరమాత్మ ప్రేమ
యొక్క అనుభవము తక్కువగా ఉన్నట్లయితే, మరి ప్రేమ లేకపోతే జీవితము
రమణీకముగా ఉండదు, నిస్సారమైన జీవితమైపోతుంది. పరమాత్మ ప్రేమయే
జీవితములో సదా తోడును కూడా అందిస్తుంది మరియు ఆ ప్రేమయే
సహచరునిగా అయ్యి సదా సహయోగిగా ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో,
తోడు ఉంటుందో, అక్కడ అన్నీ చాలా సహజముగా మరియు సరళముగా అవుతాయి,
కష్టము అనుభవమవ్వదు. అటువంటి అనుభవము ఉంది కదా! పరమాత్మ
ప్రియులు ఏ వ్యక్తి లేక ఏ సాధనాల ఆకర్షణలోకి రాలేరు, ఎందుకంటే
పరమాత్మ ఆకర్షణ, పరమాత్మ ప్రేమ ఎలాంటి అనుభవము చేయిస్తుందంటే,
వారు సదా ప్రేమ కారణముగా లవలీనముగా ఉంటారు, దీనినే పరమాత్మలో
లీనమైపోవటము అని మనుష్యులు భావిస్తారు. అలా పరమాత్మలో లీనమవ్వరు,
కానీ పరమాత్మ ప్రేమలో లవలీనమైపోతారు.
బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తుంటారు - పరమాత్మ
ప్రియులుగా అయితే అందరూ అయ్యారు, కానీ ఒకరేమో లవ్లీ (ప్రియమైన)
పిల్లలు, ఇంకొకరు లవలీనులైన పిల్లలు. కనుక మిమ్మల్ని మీరు
ప్రశ్నించుకోండి - అందరూ లవ్లీగా అయితే ఉన్నారు, కానీ
లవలీనులుగా ఎంతవరకు ఉంటున్నారు? లవలీనులైన పిల్లల గుర్తు
ఏమిటంటే - వారు సదా పరమాత్ముని ఆజ్ఞపై సహజముగా నడుస్తారు.
ఆజ్ఞలో కూడా ఉంటారు మరియు దేహభానము నుండి బలిహారమై కూడా ఉంటారు
ఎందుకంటే ప్రేమలో బలిహారమవ్వటమనేది కష్టము కాదు. అన్నింటికన్నా
మొదటి ఆజ్ఞ - యోగీ భవ, పవిత్ర భవ. బాబాకు పిల్లలపై ప్రేమ ఉన్న
కారణముగా పిల్లలు కష్టపడటాన్ని బాబా చూడలేరు, ఎందుకంటే బాబాకు
తెలుసు - పిల్లలు 63 జన్మలు చాలా కష్టపడ్డారు, ఇప్పుడు ఈ
అలౌకిక జన్మ కష్టపడటము నుండి ముక్తులై అతీంద్రియ సుఖము యొక్క
ఆనందాన్ని అనుభవించే జన్మ. మరి ఆనందాన్ని అనుభవిస్తున్నారా లేక
కష్టపడాల్సి వస్తుందా? ప్రేమ ఉన్నప్పుడు ఆజ్ఞపై నడవటము
కష్టమనిపించదు. ఒకవేళ కష్టపడాల్సి వస్తుందంటే ప్రేమ యొక్క శాతము
తక్కువగా ఉందని అర్థము. ఎక్కడో అక్కడ ప్రేమలో ఏదో ఒక లీకేజ్
ఉంది. రెండు విషయాలలో లీకేజ్ కృషి చేయిస్తుంది - ఒకటేమో పాత
ప్రపంచపు ఆకర్షణ, ప్రపంచము అనగా సంబంధాలు, పదార్థాలు అన్నీ
వస్తాయి. మరియు రెండవది - పాత సంస్కారాల ఆకర్షణ. ఈ పాత ప్రపంచము
మరియు పాత సంస్కారాలు తమవైపుకు ఆకర్షిస్తాయి కనుక పరమాత్మ
ప్రేమలో శాతము వచ్చేస్తుంది. మరి చెక్ చేసుకోండి - ఈ రెండు
లీకేజ్ ల నుండి ముక్తులుగా ఉన్నారా? గుర్తు చేసుకోండి -
ఆత్మలైన మీ అనాది సంస్కారాలు మరియు ఆది సంస్కారాలు ఏమిటి మరియు
ఇప్పుడు అంతిమములోని బ్రాహ్మణ జీవితపు సంస్కారాలు ఏమిటి?
అనాదిలో కూడా, ఆదిలో కూడా మరియు అంతిమములో కూడా శ్రేష్ట
సంస్కారాలు ఉన్నాయి. ఈ పాత సంస్కారాలు మధ్యకాలములోవి, ఇవి
అనాదిలోవి కావు, ఆదిలోవి కావు, అంతిమములోవి కావు. కానీ అందరి
లక్ష్యము ఏమిటి? పిల్లలు ఎవరిని అడిగినా వారు ఒకే
సమాధానమిస్తారు - బాబా సమానముగా అవ్వడమే లక్ష్యము. ఇదే కదా! ఇదే
అయితే చేతులెత్తండి. ఇదే లక్ష్యమా, పక్కానా? లేక మధ్యమధ్యలో
మారిపోతుందా?
బాబా మరియు దాదా, వీరిరువురిలో ఉన్న సమాన సంస్కారాలు ఏవి అని
బాబా పిల్లలను అడుగుతున్నారు. బాబా సదా ప్రతి ఆత్మ పట్ల
ఉదారచిత్తులుగా ఉన్నారు. ప్రతి ఆత్మ పట్ల స్నేహముగా ఉంటూ, గౌరవ
స్వరూపములో సహయోగిగా ఉన్నారు. ఇలానే మీరు కూడా స్వయాన్ని ప్రతి
ఆత్మ పట్ల సహయోగిగా అనుభవము చేస్తున్నారా? సహయోగము ఇస్తే
సహయోగిగా అవుతాము అని కాదు, స్నేహము ఇస్తే స్నేహీగా అవుతాము అని
కాదు. ఏ విధంగా బ్రహ్మాబాబా పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల సహయోగిగా
అయ్యారో, స్నేహీగా అయ్యారో, అదే విధంగా సర్వులకు సదా స్నేహీగా
మరియు సహయోగీగా ఉండటము, దీనినే సమానముగా అవ్వటము అని అంటారు.
ఒకవేళ పిల్లలు ఎవరికైనా సంస్కారాలను పరివర్తన చేసుకోవటంలో
కష్టమనిపిస్తుందంటే దానికి కారణమేమిటి? బ్రహ్మాబాబా తనపై
అటెన్షన్ పెట్టుకున్నారు, కానీ కష్టపడలేదు. సంస్కార పరివర్తనలో
కష్టపడటానికి కల కారణము ఏమిటంటే - లవ్లీగా అయ్యారు కానీ
లవలీనులుగా అవ్వలేదు.
బాప్ దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరినీ లవ్లీ పిల్లలుగా
భావిస్తారు. వారికి తెలుసు కూడా, ప్రతి ఒక్కరి జన్మపత్రి తెలుసు,
అయినా కూడా ఏమంటారు? లవ్లీ (ప్రియమైనవారు) గా ఉన్నారు అని
అంటారు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ఒకే చదువును, ఒకే
పాలనను, ఒకే వరదానాన్ని సదా ఇస్తారు. వీరు చివరి నంబర్ లోని
వారు అని తెలిసినా కూడా బాప్ దాదా ఏ బిడ్డలోని అవగుణాన్ని,
బలహీనతను సంకల్పములో కూడా పెట్టుకోరు. ప్రియమైన బిడ్డ, చాలా
కాలం దూరమై తర్వాత కలిసిన బిడ్డ, మధురాతి మధురమైన బిడ్డ...
అన్న ఈ దృష్టి, వృత్తితోనే చూస్తారు ఎందుకంటే బాప్ దాదాకు
తెలుసు, ఏమనంటే - ఇటువంటి వృత్తి మరియు శ్రేష్ఠ దృష్టి ద్వారానే
బలహీనముగా ఉన్నవారు మహావీరులుగా అయిపోతారు. అలాగే మీ శ్రేష్ఠ
వృత్తి మరియు శుభ భావన, శుభ కామనల ద్వారా ఎవరినైనా పరివర్తన
చెయ్యగలరు. ప్రకృతిని కూడా పరివర్తన చేసి చూపిస్తాము అని మీరు
ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆత్మల పరివర్తనను చెయ్యలేరా!
ప్రకృతిజీతులుగా అవ్వగలిగినప్పుడు ఆత్మ అనే శ్రేష్ఠ భావన ద్వారా,
కళ్యాణ కామన ద్వారా ఆత్మను పరివర్తన చెయ్యలేరా!
ఇప్పుడు కొత్త సంవత్సరము ప్రారంభమవ్వబోతుంది కదా - కనుక కొత్త
సంవత్సరములో అనంతమైన బ్రాహ్మణ పరివారమందరిలో ఒకరి పట్ల మరొకరు
తమ శుభ భావన, శ్రేష్ఠ కామన ద్వారా ప్రతి ఒక్కరూ ఇతరులను
పరివర్తన చెయ్యటంలో సహయోగిగా అవ్వండి. ఎదుటివారు బలహీనమైనవారైనా,
వారి సంస్కారములో ఫలానా బలహీనత ఉంది అని తెలిసినా కానీ మీరు
స్నేహము మరియు సహయోగ శక్తి ద్వారా సహయోగులుగా అవ్వండి. ఒకరితో
ఒకరు సహయోగము అనే చేతిని కలపండి. ఈ సహయోగం యొక్క చేతులు కలపటమనే
దృశ్యము ఎలా తయారవుతుందంటే, చేయి, చేయి కలిపి స్నేహ మిలనం చేయడం,
సహయోగం లభించటం, తద్వారా మాల తయారవుతుంది. కేవలం శిక్షణను
ఇవ్వకండి, స్నేహముతో నిండిన సహయోగాన్ని ఇవ్వండి. అతీతముగా
అవ్వకండి, పక్కకు వెళ్ళిపోకండి, ఆధారముగా అవ్వండి ఎందుకంటే మీ
స్మృతిచిహ్నము విజయమాల. ప్రతి ఒక్క మణి మరొక మణితో సహచరునిగా,
సహయోగిగా ఉంది, అందుకే మాల చిత్రము తయారైంది.
అందరూ బాప్ దాదాను అడుగుతారు - కొత్త సంవత్సరములో ఏం చెయ్యాలి?
సందేశము ఇచ్చే కార్యమునైతే ఎంతగానో చేసారు, చేస్తున్నారు,
చేస్తూ ఉంటారు. ఇప్పుడు సందేశ వాహకుల సహయోగము మరియు స్నేహము
యొక్క రూపురేఖలను స్టేజ్ పైకి తీసుకురండి. మహాదానులుగా అవ్వండి,
మీ గుణాలతో సహయోగిగా అవ్వండి, సహయోగులుగా తయారుచెయ్యండి. ఇలా
మీ గుణాలతో, వాస్తవానికి అవి పరమాత్ముని గుణాలే, కానీ ఏ
గుణాలనైతే మీరు మీలో అలవరచుకున్నారో, ఆ గుణాల శక్తితో వారిలోని
బలహీనతను దూరం చెయ్యండి. ఇది చెయ్యగలరా? చెయ్యగలరా లేక కష్టమా?
టీచర్లు చెప్పండి, చెయ్యగలరా? చెయ్యగలరా లేక చెయ్యాల్సిందేనా?
చెయ్యాల్సిందే. ఎవరూ బలహీనముగా ఉండకూడదు, ఎందుకంటే కోట్లలో
కొద్దిమందే కదా! చివరి పూస అయినా కానీ, వాస్తవానికి వారు
కోట్లలో కొద్దిమంది అయినవారే. మీకు ఉన్న టైటిల్ - మాస్టర్
సర్వశక్తివాన్. మరి సర్వశక్తివంతుల కర్తవ్యము ఏమిటి? శక్తిని
ఇచ్చి-పుచ్చుకోవటము. బాబా ద్వారా లభించిన గుణాలను పరస్పరంలో
ఇచ్చి-పుచ్చుకోండి. ఈ సహయోగమనే కానుకనే ఒకరికొకరు ఇచ్చుకోండి.
కొత్త సంవత్సరములో ఒకరికొకరు కానుకలను ఇచ్చుకుంటారు కదా! అలా ఈ
సంవత్సరములో ఇతరులకు గుణాలనే కానుకను ఇవ్వండి. ఒకవేళ కళ్యాణ
భావనను ఉంచుకున్నట్లయితే, భాషణ చేసి వాణి ద్వారా సందేశాన్ని
ఇస్తారు కదా, అలా మీ కళ్యాణ భావన ద్వారా, కళ్యాణ వృత్తి ద్వారా,
కళ్యాణ వాయుమండలము ద్వారా ఈ గుణాల కానుకను ఇవ్వండి, శక్తుల
కానుకను ఇవ్వండి. బలహీనమైనవారికి సహయోగాన్ని ఇవ్వటము, ఇది
అవసరమైన సమయములో కానుకను ఇవ్వటము లాంటిది. పడిపోయినవారిని ఇంకా
పడెయ్యకండి, లేపండి, పైకి లేపండి. వీరు ఇలా, వారు అలా... ఇలా
అనకండి. వీరు ప్రభువు ప్రేమకు పాత్రులైనవారు, కోట్లలో
కొద్దిమంది అయినవారు, విశేష ఆత్మలు, విజయులుగా అయ్యే ఆత్మలు
అన్న ఈ దృష్టిని పెట్టుకోండి. ఇప్పుడు వృత్తి, దృష్టి,
వాయుమండలాన్ని పరివర్తన చెయ్యండి. ఏదైనా నవీనత చెయ్యాలి కదా!
బలహీనతను చూస్తూ కూడా చూడకండి, ఉల్లాసాన్ని ఇవ్వండి, సహయోగాన్ని
ఇవ్వండి. ఇటువంటి బ్రాహ్మణ సంగఠనను తయారుచేసినట్లయితే బాప్ దాదా
ఆ విజయానికి చప్పట్లు కొడతారు. మీరు కూడా పదే-పదే చప్పట్లు
కొడతారు కదా, బాప్ దాదా కూడా శుభాకాంక్షలు, అభినందనలు మరియు
గ్రీటింగ్స్... అనే చప్పట్లను కొడతారు. మీరు కూడా వారితో పాటు
చప్పట్లు కొడతారు కదా. ఇప్పుడు చప్పట్లు కొట్టారు, బాగుంది,
కానీ విశ్వమంతటి ముందు చప్పట్లు మ్రోగాలి. మా ఇష్టదేవతలు
వచ్చారు, మా పూజ్యులు వచ్చారు అని అందరి నోటి నుండి ఈ శబ్దము
వెలువడాలి. లక్ష్యము పక్కాగా ఉంది కదా! పక్కాగా ఉందా లక్ష్యము?
చెయ్యాల్సిందే కదా? లేక చూస్తాములే, ప్లాన్ తయారుచేస్తాములే
అంటారా! చెయ్యాల్సిందే, ప్లాన్ చేస్తాము అంటారేమిటి,
చెయ్యాల్సిందే. ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు, ఇప్పుడు వారి
ఎదురుచూపులను సమాప్తము చెయ్యండి. ప్రత్యక్షమయ్యేందుకు ఏర్పాట్లు
చెయ్యండి. చూడండి, ప్రకృతి కూడా ఇప్పుడు ఎంతగా విసిగిపోతూ ఉంది,
కనుక ప్రకృతిని కూడా శాంతపరచండి. మీరు ప్రత్యక్షమైతే ఇక
విశ్వశాంతి స్వతహాగానే జరుగుతుంది. అచ్ఛా!
ఈ రోజుల్లో విశ్వములో రెండు విషయాలు విశేషముగా జరుగుతున్నాయి -
1. ఎక్సర్సైజ్ (వ్యాయామము) మరియు 2. భోజనముపై అటెన్షన్ పెట్టడము.
మరి మీరు కూడా ఈ రెండింటినీ చేస్తున్నారా? మీ ఎక్సర్సైజ్ ఏమిటి?
శారీరక ఎక్సర్సైజ్ అయితే అందరూ చేస్తారు కానీ మనసు యొక్క
ఎక్సర్సైజ్ ఏమిటంటే - ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, బ్రాహ్మణుల
నుండి ఫరిశ్తాలు మరియు ఫరిశ్తాల నుండి దేవతలు. ఈ మనసా డ్రిల్
యొక్క అభ్యాసాన్ని సదా చేస్తూ ఉండండి మరియు శుద్ధ భోజనము అంటే
మనసులోని శుద్ధ సంకల్పాలు. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు, నెగెటివ్
సంకల్పాలు నడిచినట్లయితే అవి మనసు యొక్క అశుద్ధ భోజనము. కనుక
మనసులో సదా శుద్ధ సంకల్పాలు ఉండాలి. మరి ఈ రెండూ చెయ్యటము
వస్తుంది కదా! ఎంత సమయము కావాలంటే అంత సమయము శుద్ధ సంకల్పాల
స్వరూపముగా అయిపోండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారులైన విశేష ఆత్మలకు, సదా
ఒకరికొకరు సహయోగులుగా అయ్యే బాబాకు స్నేహీ మరియు సహయోగీ ఆత్మలకు,
సదా విజయులు మరియు విజయ పతాకాన్ని విశ్వములో వ్యాపింపజేయాలి అనే
ఈ లక్ష్యాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చే విజయీ పిల్లలకు,
సదా ఈ పాత ప్రపంచము మరియు సంస్కారాల ఆకర్షణ నుండి దూరంగా ఉండే
బాబా సమానమైన పిల్లలకు మనోభిరాముడైన బాబా యొక్క హృదయపూర్వకమైన
ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో - చాలా మంచి పాత్రను పోషిస్తున్నారు. మిమ్మల్ని చూసి
అందరికీ ఫరిశ్తా జీవితము గుర్తుకొస్తుంది. అతీతమైనవారు మరియు
ప్రియమైనవారు.
గుజరాత్ కు చెందిన ముఖ్యమైన 13 మంది అక్కయ్యలతో - మంచి మంచి
మహావీరులు. మహావీరుల పని - విజయులుగా అయ్యి విజయులుగా
తయారుచెయ్యటము. అందరూ మంచి సేవను చేస్తున్నారు మరియు ఇకముందు
కూడా సేవ జరుగుతూ ఉంటుంది. బాప్ దాదా పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను
చూసి సంతోషిస్తారు. గుజరాత్ లో మంచిగా వ్యాపింపజేస్తున్నారు
మరియు ఇక ముందు కూడా వ్యాపింపజేస్తూ ఉంటారు. బాప్ దాదాకు
పిల్లలందరూ ఆశా దీపాలుగా అనిపిస్తున్నారు. మంచిది. సంగఠన కూడా
బాగుంది. ప్రతి ఒక్కరికీ విశేషత ఉంది. అచ్ఛా! సంతోషంగా ఉండేవారు,
సంతోషాన్ని పంచేవారు (సరళ దీదీ అడుగుతున్నారు, మాలలో దాదీ
ఎవరిని పెట్టారు?) మీరేమనుకుంటున్నారు? నేనైతే తప్పకుండా ఉంటాను
అని అనుకుంటున్నారా? ఒకరికొకరు కొంచెం సహయోగాన్ని ఇచ్చుకోండి,
ఇక ఏదైనా మిగిలి ఉంటే, అది సమాప్తమైపోతుంది. అందరూ బాబా సమానంగా
అయ్యేవారే. (ఏ నవీనతను చెయ్యాలి) వినిపించాము కదా - ప్రతి ఒక్క
సెంటరు తక్కువలో తక్కువ ఒక వారసుడిని తయారుచెయ్యాలి. ఈ
సంవత్సరము వారిని తీసుకురండి, 21 వారసులనైతే తీసుకురండి. ఇది
ప్రారంభించండి. మొదటి నంబర్ లోకి రండి. అందరూ సరే అని
అంటున్నారు. వారసుల అర్హత తెలుసు కదా. మీరు అందరినీ బాబాకు
చెందినవారిగానే తయారుచేస్తారు కదా, మీ వారిగా అయితే
తయారుచెయ్యరు కదా. అచ్ఛా. ఓం శాంతి.
గుజరాత్ వారిదే సేవ, గుజరాత్ వారే మిలనము చేసుకునేందుకు వచ్చారు
- గుజరాత్ వారు ఎవరైతే వచ్చారో, వచ్చినవారు, సేవలో వచ్చినవారు
అందరూ చేతులెత్తండి. చాలామంది ఉన్నారు, చాలా మంచిది. మంచి
అవకాశాన్ని తీసుకున్నారు. గుజరాత్ వారిని బాప్ దాదా ఏమంటారంటే,
ఎవరైతే పొయ్యి దగ్గర ఉంటారో వారు మనసులో ఉంటారు అని సింధీలో ఒక
సామెత ఉంది. అందరికంటే అతి సమీపముగా ఉన్నవారు గుజరాత్ వారు.
ఎవరైతే సమీపముగా ఉంటారో, వారిని చాలా దగ్గరివారు అని అంటారు,
పిలిచిన వెంటనే చేరుకుంటారు. కనుక గుజరాత్ వారు ఇలా ఎవర్రెడీగా
ఉన్నారు కదా, రమ్మని ఎప్పుడు పిలిచినా వచ్చేస్తారు కదా?
అటువంటివారే కదా? పరివారమువారిని చూసుకోరా, ఏం చేస్తారు,
వచ్చేస్తారా? ఎవర్రెడీగా ఉన్నారు. మంచిది, గుజరాత్ సాకార
బ్రహ్మా యొక్క ప్రేరణ ద్వారా స్థాపన అయ్యింది. గుజరాత్ కు
గుజరాత్ ఆహ్వానమివ్వలేదు, బ్రహ్మాబాబా గుజరాత్ లో తెరిచారు.
కనుక గుజరాత్ పై బ్రహ్మాబాబాకు విశేషమైన దృష్టి ఉంది. గుజరాత్
మంచి పురుషార్థము కూడా చేసింది, మంచి సెంటర్లు తెరిచారు. ఎన్ని
సెంటర్లు ఉన్నాయి? (300 సేవాకేంద్రాలు, ఉప సేవాకేంద్రాలు
ఉన్నాయి మరియు 3,000 గీతా పాఠశాలలు ఉన్నాయి). అచ్ఛా, అందరికంటే
ఎక్కువ సెంటర్లు ఏ జోన్ లో ఉన్నాయి? (ముంబయి, మహారాష్ట్ర) అచ్ఛా
- మహారాష్ట్ర వారు వచ్చారా? (ఇప్పుడు రాలేదు) గుజరాత్ వారు సేవ
అయితే బాగా చేస్తున్నారు, గుజరాత్ యొక్క విస్తారము కూడా బాగుంది.
ఇప్పుడు ఏం చెయ్యాలి? విస్తారమైతే ఉంది, విస్తారమైతే బాగా
చేసారు, ఇప్పుడు గుజరాత్ వారు నంబర్ వన్ వారసులను తయారుచెయ్యాలి.
తక్కువలో తక్కువ పెద్ద సేవాకేంద్రాలు ఏవైతే ఉన్నాయో, పాత
వారసులు ఎవరైతే ఉన్నారో, వారు అయితే ఎలాగూ ఉన్నారు, కానీ ఎవరైనా
కొత్త వారసులను తయారుచెయ్యండి. సరే, ఒక్కొక్కరి చొప్పున
తయారుచెయ్యండి, ఎందుకంటే ఎవరైతే వారస క్వాలిటీవారు ఉంటారో, వారే
మాలలోని మణులుగా అవుతారు. కనుక మాలనైతే తయారుచెయ్యాలి కదా!
16,108 మాల కూడా తయారై ఉంది. 108 మణుల మాలను తయారుచెయ్యండి అని
ఇప్పుడు బాప్ దాదా అంటే తయారుచెయ్యగలరా? తయారవ్వగలదా? దాదీలు
చెప్పండి, 108 మాలను తయారుచెయ్యగలరా? (తయారవ్వగలదు అని దాది
చెప్పారు) తయారుగా ఉందా? 108 మాల తయారైపోయిందా? (అవును బాబా,
తయారుగా ఉంది). అచ్ఛా, వ్రాసి చూపించండి. తయారుగా ఉంటే చాలా
మంచిది, అభినందనలు. అచ్ఛా, 16,000 మణుల మాల సగం వరకు అయ్యిందా?
(సగమేమిటి, దానికంటే ఎక్కువే తయారైంది) మంచిదే కదా! చూడండి, అది
గుప్త రూపములో తయారైంది మరియు మీ దాదీ చూసేసారు. మంచిది. మాలలో
నా పేరు ఉందా అని ఇప్పుడు అందరూ మిమ్మల్ని అడుగుతారు. మంచిది.
ఇటువంటి శుభ భావనలు మరియు శుభ ఆశలు తయారుచేసేస్తాయి. ఇప్పుడు
అందరూ విన్నారు కదా! మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - నేను ఆ
మాలలో ఎవర్రెడీగా ఉన్నానా? అచ్ఛా! ఇంకేం చెయ్యాలి?
క్యాడ్ గ్రూప్ (హార్ట్ పేషంట్ల గ్రూప్) వచ్చింది - మంచిది.
శబ్దము వ్యాపింపజేసేందుకు ఈ సాధనము కూడా చాలా మంచిగా ఉంది,
ఎందుకంటే ప్రాక్టికల్ ఋజువును చూస్తారు కదా, అంతేకాక ఖర్చు
లేకుండా మెడిటేషన్ ద్వారానే బాగైపోవటము, ఇది అందరికీ చాలా బాగా
అనిపిస్తుంది. ఇప్పుడు మెల్లమెల్లగా దీనిని వృద్ధి చేస్తూ
ఉండండి. చేస్తున్నారు మరియు సఫలత కూడా లభిస్తూ ఉంది అని
విన్నాము. ఇంకా కూడా సఫలత లభిస్తూ ఉంటుంది. ఇకపోతే బాప్ దాదా ఈ
కార్యము కొరకు నిమిత్తులైనవారిని అభినందిస్తున్నారు. అఫీషియల్
గా గవర్నమెంటు వరకు రిజల్టు చేరుకుంటూ ఉంది, ఇంకా కూడా
వ్యాపింపజేస్తూ ఉన్నట్లయితే మెడిటేషన్ యొక్క మహత్వము పెరుగుతూ
ఉంటుంది. బాప్ దాదాకు అయితే ఈ విధి మంచిగా అనిపిస్తుంది. అచ్ఛా!
వరదానము:-
మనస్సు యొక్క మౌనము ద్వారా సేవలో కొత్త
ఇన్వెన్షన్లను కనుగొనే సిద్ధి స్వరూప భవ
ఏ విధంగా ప్రారంభములో మౌన వ్రతాన్ని
పాటించేటప్పుడు అందరూ ఫ్రీ అయిపోయారు, సమయము మిగిలింది, అలా
ఇప్పుడు మనస్సు యొక్క మౌనము పెట్టుకోండి, తద్వారా వ్యర్థ
సంకల్పాలు రానే రాకుండా ఉంటాయి. ఏ విధంగా నోటి నుండి శబ్దము
రాదో అలా వ్యర్థ సంకల్పాలు రాకుండా ఉండాలి - ఇదే మనసు యొక్క
మౌనము. అప్పుడు సమయము మిగులుతుంది. ఈ మనస్సు మౌనము ద్వారా సేవలో
ఎటువంటి కొత్త ఇన్వెన్షన్లు వెలువడుతాయంటే, వాటి ద్వారా సాధన
తక్కువగా మరియు సిద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా సైన్స్
సాధనాలు క్షణములో విధిని ప్రాప్తింపజేయిస్తాయో, అలా ఈ సైలెన్స్
సాధనాల ద్వారా క్షణములో విధి ప్రాప్తిస్తుంది.
స్లోగన్:-
ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో - సర్వుల సహయోగము కూడా
వారి ముందు సమర్పితమవుతుంది.
అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి,
అంతర్ముఖులుగా అవ్వండి
అనేక రకాల వ్యక్తులు, వైభవాలు మరియు అనేక రకాల వస్తువుల
సంపర్కములోకి వస్తూ ఆత్మిక భావాన్ని మరియు అనాసక్త భావాన్ని
ధారణ చెయ్యండి. ఈ వైభవాలు మరియు వస్తువులు అనాసక్తులుగా
ఉన్నవారి ముందు దాసీ రూపములో ఉంటాయి మరియు ఆసక్తి భావము కలవారి
ముందు అయస్కాంతము వలె చిక్కింపజేసేవిగా ఉంటాయి.
|
|
|