22-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - దేహీ-అభిమానులుగా అయినట్లయితే శీతలముగా అవుతారు, వికారాల దుర్గంధం తొలగిపోతుంది, అంతర్ముఖులుగా అవుతారు, పుష్పాలుగా అవుతారు’’

ప్రశ్న:-
బాప్ దాదా పిల్లలందరికీ ఏ రెండు వరదానాలను ఇస్తారు? వాటిని స్వరూపములోకి తీసుకువచ్చేందుకు విధి ఏమిటి?

జవాబు:-
బాబా పిల్లలందరికీ శాంతి మరియు సుఖము యొక్క వరదానాలను ఇస్తారు. బాబా అంటారు - పిల్లలూ, మీరు శాంతిలో ఉండే అభ్యాసము చేయండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు వారికి జవాబు ఇవ్వకండి, మీరు శాంతిగా ఉండాలి. వ్యర్థమైన పరచింతన విషయాలను మాట్లాడకూడదు. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. నోటిలో శాంతి అనే నాణెమును వేసుకున్నట్లయితే ఆ రెండు వరదానాలూ స్వరూపములోకి వచ్చేస్తాయి.

ఓంశాంతి
మధురాతి-మధురమైన పిల్లలు ఒక్కోసారి సమ్ముఖంగా ఉంటారు, ఒక్కోసారి దూరంగా వెళ్ళిపోతారు. ఎవరైతే స్మృతి చేస్తారో వారే సమ్ముఖంగా ఉంటారు ఎందుకంటే స్మృతి యాత్రలోనే అంతా ఇమిడి ఉంది. దృష్టి ద్వారా అతీతముగా చేసారు అని గానం చేయబడుతుంది కదా. ఆత్మ దృష్టి పరమపిత వైపుకు వెళ్తుంది, తనకు ఇంకేమీ నచ్చదు. వారిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. కావున తమపై తాము ఎంత జాగ్రత్తను ఉంచుకోవాలి. స్మృతి చేయకపోతే, వీరి యోగము తెగిపోయి ఉంది అని మాయ భావిస్తుంది, కావున తనవైపుకు లాగుతుంది, ఏదో ఒక తప్పుడు కర్మను చేయించేస్తుంది, ఇటువంటి తండ్రిని నిందింపజేస్తారు. బాబా, నావారైతే మీరొక్కరు, ఇంకెవ్వరూ లేరు అని భక్తి మార్గములో గానం చేస్తారు. కావుననే తండ్రి అంటారు - పిల్లలూ, గమ్యము చాలా ఉన్నతమైనది. పని చేస్తూ తండ్రిని స్మృతి చేయడం - ఇది ఉన్నతోన్నతమైన గమ్యము. దీనికి చాలా మంచి అభ్యాసము కావాలి. లేకపోతే తప్పుడు పనులు చేసే నిందకులుగా అయిపోతారు. ఉదాహరణకు ఎవరికైనా క్రోధము వస్తే, వారు పరస్పరం కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటే అది కూడా నిందింపజేసినట్లే కదా, ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గృహస్థ వ్యవహారములలో ఉంటూ బుద్ధిని తండ్రితో జోడించాలి. ఎవరూ సంపూర్ణముగా అయ్యారని కాదు. మేము దేహీ-అభిమానులుగా అవ్వాలి అనే విధంగా ప్రయత్నం చేయాలి. దేహాభిమానములోకి రావడం వల్ల ఏవో తప్పుడు పనులు చేస్తారు అనగా తండ్రిని నిందింపజేస్తారు. తండ్రి అంటారు, ఇటువంటి సద్గురువును నిందింపజేసేవారు లక్ష్మీ-నారాయణులుగా అయ్యే గమ్యాన్ని చేరుకోలేరు, అందుకే పూర్తి పురుషార్థము చేస్తూ ఉండండి, తద్వారా మీరు చాలా శీతలముగా అవుతారు, పంచ వికారాల విషయాలన్నీ తొలగిపోతాయి, తండ్రి ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. కార్యవ్యవహారాలు కూడా చేయాలి. తండ్రి కర్మలు చేయకండి అని అనరు. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. కలియుగములో ఏ కర్మలైతే జరుగుతాయో అవి వికర్మలుగా అవుతాయి. ఇప్పుడు సంగమయుగములో మీరు నేర్చుకోవలసి ఉంటుంది, అక్కడ నేర్చుకునే విషయమేదీ ఉండదు. ఇక్కడి శిక్షణయే అక్కడకు మీతో పాటు వస్తుంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - బాహ్యముఖత మంచిది కాదు, అంతర్ముఖీ భవ. పిల్లలైన మీరు అంతర్ముఖులుగా అయ్యే సమయం కూడా వస్తుంది. తండ్రి తప్ప ఇంకేదీ గుర్తుకు రాదు. మీరు రావడం కూడా అలాగే వచ్చారు, అప్పుడు మీకు ఎవ్వరి స్మృతీ లేదు. గర్భము నుండి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు వీరు నా తల్లి-తండ్రి, వీరు ఫలానా అని తెలిసింది. కావున ఇప్పుడు మళ్ళీ అలాగే వెళ్ళాలి. మనం ఒక్క తండ్రికి చెందినవారము, వారు తప్ప ఇంకెవ్వరూ బుద్ధిలో గుర్తుకు రాకూడదు. ఇంకా సమయం ఉంది కానీ పురుషార్థమైతే పూర్తిగా చేయాలి. శరీరముపై ఏ నమ్మకమూ లేదు. ఇంట్లో కూడా ఎంతో శాంతి ఉండాలి, కలహాలు ఉండకూడదు అని ప్రయత్నిస్తూ ఉండాలి లేకపోతే వీరిలో ఎంత అశాంతి ఉంది అని అందరూ అంటారు. పిల్లలైన మీరైతే చాలా శాంతిగా ఉండాలి. మీరు శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు ముళ్ళ మధ్యలో ఉంటున్నారు. మీరు పుష్పాల మధ్యలో లేరు. ముళ్ళ మధ్యలో ఉంటూ పుష్పాలుగా అవ్వాలి. మీరు ముళ్ళగా అయిపోకూడదు. ఎంతగా మీరు తండ్రిని స్మృతి చేస్తారో అంతగా శాంతిగా ఉంటారు. ఎవరైనా తప్పుగా మాట్లాడినా మీరు శాంతిగా ఉండండి. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము. ఆత్మ స్వధర్మము శాంతి. ఇప్పుడు మనము ఆ ఇంటికి వెళ్ళాలి అని మీకు తెలుసు. తండ్రి కూడా శాంతిసాగరుడు. మీరు కూడా శాంతిసాగరులుగా అవ్వాలి అని వారు అంటారు. వ్యర్థమైన పరచింతన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి. అటువంటి విషయాలను మాట్లాడకూడదు, వాటి ద్వారా మీరు తండ్రిని నిందింపజేస్తారు అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు. శాంతిలో ఎటువంటి నింద లేక వికర్మ జరగదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఇంకా వికర్మలు వినాశనమవుతాయి. స్వయమూ అశాంతి చెందకూడదు, ఇతరులను అశాంతపరచకూడదు. ఎవరికైనా దుఃఖమునిస్తే ఆత్మ అసంతుష్టమవుతుంది. బాబా, వీరు ఇంట్లోకి వస్తే అంతా గొడవ-గొడవ చేస్తారు అని ఎంతోమంది రిపోర్ట్ వ్రాస్తారు. అప్పుడు బాబా వ్రాస్తారు - మీరు మీ శాంతి స్వధర్మములో ఉండండి. హాతమతాయి కథ కూడా ఉంది కదా, అతనితో నీవు నోటిలో నాణెము వేసుకో, అప్పుడు ఇక శబ్దమే వెలువడదు, మాట్లాడలేవు అని అన్నారు.

పిల్లలైన మీరు శాంతిలో ఉండాలి. మనుష్యులు శాంతి కొరకు ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. మన మధురమైన బాబా శాంతిసాగరుడని పిల్లలైన మీకు తెలుసు. శాంతింప చేస్తూ, చేస్తూ విశ్వములో శాంతి స్థాపనను చేస్తారు. మీ భవిష్య పదవిని కూడా స్మృతి చేయండి. అక్కడ ఒకే ధర్మము ఉంటుంది, ఇంకే ధర్మమూ ఉండదు, దానినే విశ్వములో శాంతి అని అంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఇతర ధర్మాలు వస్తాయో అప్పుడు హంగామాలు జరుగుతాయి. ఇప్పుడు ఎంతటి శాంతి ఉంటుంది. మా ఇల్లు అదే, మా స్వధర్మము శాంతి అని మీరు భావిస్తారు. శరీరము యొక్క స్వధర్మము శాంతి అనైతే అనరు. శరీరము వినాశీ వస్తువు, ఆత్మ అవినాశీ వస్తువు. ఎంత సమయమైతే ఆత్మలు అక్కడ ఉంటాయో అంత సమయమూ ఎంత శాంతిగా ఉంటాయి. ఇక్కడైతే మొత్తం ప్రపంచములో అశాంతి ఉంది, అందుకే శాంతిని కోరుకుంటూ ఉంటారు. కానీ సదా శాంతిలో ఉండాలని ఎవరైనా కోరుకున్నా అదైతే జరగదు. 63 జన్మలు అక్కడ ఉన్నా కానీ మళ్ళీ తప్పకుండా ఇక్కడకు రావలసి ఉంటుంది. తమ సుఖ-దుఃఖాల పాత్రను అభినయించి మళ్ళీ అక్కడకు వెళ్ళిపోతారు. డ్రామాను చాలా బాగా ధ్యానములో ఉంచుకోవలసి ఉంటుంది.

బాబా మాకు సుఖము మరియు శాంతి వరదానాలను ఇస్తారు అన్నది పిల్లలైన మీకు కూడా ధ్యానములో ఉండాలి. బ్రహ్మా ఆత్మ కూడా అంతా వింటారు. అందరికన్నా సమీపముగా వీరి చెవులే వింటాయి. వీరి నోరు ఈ చెవులకు సమీపముగా ఉంది, మీ చెవులు కాస్త దూరములో ఉన్నాయి, వీరు వెంటనే వినేస్తారు. అన్ని విషయాలనూ అర్థం చేసుకోగలరు. మధురాతి మధురమైన పిల్లలూ అని తండ్రి అంటారు. మధురాతి మధురమైనవారు అని అందరినీ అంటారు ఎందుకంటే అందరూ పిల్లలే. జీవాత్మలెవరైతే ఉన్నారో వారంతా తండ్రికి అవినాశీ పిల్లలు. శరీరమైతే వినాశీ, తండ్రి అవినాశీ. అలాగే పిల్లలైన ఆత్మలు కూడా అవినాశీయే. తండ్రి పిల్లలతో సంభాషిస్తారు - దీనినే ఆత్మిక జ్ఞానం అని అంటారు. సుప్రీమ్ ఆత్మ కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి ప్రేమ అయితే ఉండనే ఉంది. ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో, వారంతా తమోప్రధానంగా ఉన్నారు. వీరంతా ఇంట్లో ఉన్నప్పుడు సతోప్రధానముగా ఉండేవారు అని తెలుసు. కల్ప-కల్పమూ నేను వచ్చి అందరికీ శాంతి మార్గాన్ని తెలియజేస్తాను. ఇక్కడ వరాలు ఇచ్చే విషయమేదీ లేదు. ధనవాన్ భవ, ఆయుష్మాన్ భవ అని అనరు. సత్యయుగములో మీరు ఇలా ఉండేవారు కానీ ఆశీర్వాదమునేమీ ఇవ్వరు. కృపను లేక ఆశీర్వాదమును అడగకూడదు. తండ్రి, తండ్రి కూడా, టీచర్ కూడా - ఈ విషయాన్నే గుర్తు చేసుకోవాలి. ఓహో! శివబాబా తండ్రి కూడా, టీచర్ కూడా, జ్ఞాన సాగరుడు కూడా. తండ్రే కూర్చొని తమ మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు, దాని ద్వారా మీరు చక్రవర్తీ మహారాజులుగా అవుతారు. ఇది మొత్తం ఆల్రౌండ్ చక్రము కదా. ఈ సమయములో మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యములో ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. రావణుడు కేవలం లంకలో లేడు, ఇది అనంతమైన లంక, నలువైపులా నీరు ఉంది. మొత్తం లంక అంతా రావణునికి చెందినదిగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ రాముడికి చెందినదిగా అవుతుంది. లంక అయితే బంగారు లంకగా ఉండేది, అక్కడ ఎంతో బంగారము ఉంటుంది. ఒక ఉదాహరణను కూడా చెప్తారు, ధ్యానములోకి వెళ్ళినప్పుడు అక్కడ బంగారు ఇటుకను చూసారని, ఇక్కడ ఏ విధముగా మట్టి ఇటుక ఉంటుందో అక్కడ అలా బంగారు ఇటుక ఉంటుందని, అప్పుడు ఆ బంగారమును తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిందని చెప్తారు. ఏవేవో నాటకాలను తయారుచేసారు. భారత్ అయితే ప్రసిద్ధిమైనది, ఇతర ఖండాలలో ఇన్ని వజ్ర-వైఢూర్యాలు ఉండవు. తండ్రి అంటారు, నేను గైడ్ గా అయి అందరినీ తిరిగి తీసుకువెళ్తాను. పదండి పిల్లలూ, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఆత్మలు పతితముగా ఉన్నాయి, పావనముగా అవ్వకుండా అవి ఇంటికి వెళ్ళలేవు. పతితులను పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రే, అందుకే అందరూ ఇక్కడే ఉన్నారు, ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు, అలా వెళ్ళే నియమము లేదు. తండ్రి అంటారు - పిల్లలూ, మాయ మిమ్మల్ని ఇంకా జోరుగా దేహాభిమానములోకి తీసుకువస్తుంది. అది మిమ్మల్ని తండ్రిని స్మృతి చేయనివ్వదు. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయములోనే యుద్ధం ఉంది. కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి. ఈ కనులను మీ ఆధీనములో (అధికారములో) ఉంచుకోవాలి. సోదరీ, సోదరుల దృష్టి కూడా సరిగ్గా ఉండదు అని గమనించడం జరిగింది, కావున పరస్పరం సోదరులుగా భావించండి అని ఇప్పుడు అర్థం చేయించడం జరుగుతుంది. మనమంతా సోదరులమే అని అందరూ అంటూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఏ విధంగా కప్పలు బెకబెకమంటూ ఉంటాయో అలా అంటూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు ప్రతి విషయము యొక్క యథార్థ అర్థాన్ని అర్థం చేసుకున్నారు.

తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు - మీరు భక్తి మార్గములో కూడా ప్రేయసులుగా ఉండేవారు, ప్రియుడిని స్మృతి చేసేవారు. దుఃఖములో ఉన్నప్పుడు అందరూ వారిని - ఓ రామా! ఓ భగవంతుడా, దయ చూపించండి అని వెంటనే స్మృతి చేస్తారు. స్వర్గములోనైతే ఎప్పుడూ ఇలా అనరు. అక్కడ అసలు రావణ రాజ్యమే ఉండదు. వారు మిమ్మల్ని రామ రాజ్యములోకి తీసుకువెళ్తారు కావున వారి మతముపై నడవాలి. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ దైవీ మతము లభిస్తుంది. ఈ కళ్యాణకారీ సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే కలియుగము ఇప్పుడింకా బాల్యావస్థలో ఉందని, ఇంకా లక్షల సంవత్సరాలు ఉన్నాయని అందరికీ చెప్పడం జరిగింది. ఇది భక్తి యొక్క ఘోర అంధకారము అని బాబా అంటారు. జ్ఞానము ప్రకాశము. డ్రామానుసారంగా భక్తి కూడా రచింపబడి ఉంది, ఇది మళ్ళీ జరుగుతుంది. భగవంతుడు లభించారు కావున ఇక ఎటూ భ్రమించవలసిన అవసరం లేదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మేము బాబా వద్దకు లేక బాప్ దాదా వద్దకు వెళ్తాము అని మీరు అంటారు. ఈ విషయాలను మనుష్యులు అర్థం చేసుకోలేరు. మీలో కూడా ఎవరికైతే పూర్తి నిశ్చయం కూర్చోదో వారిని మాయ ఒక్కసారిగా మింగేస్తుంది. ఒక్కసారిగా ఏనుగును మొసలి మింగేస్తుంది. ఆశ్చర్యము కలిగించేలా వింటారు... పాతవారైతే వెళ్ళిపోయారు, వారి గాయనము కూడా ఉంది, మంచి-మంచి మహారథులను మాయ ఓడించేసింది. బాబాకు వ్రాస్తారు - బాబా, మీరు మీ మాయను పంపించకండి. అరే, అది నాదేమీ కాదు. రావణుడు తన రాజ్యం చేస్తున్నాడు, మనము మన రాజ్యాన్ని స్థాపిస్తున్నాము. ఇది పరంపరగా నడుస్తూ వస్తుంది. రావణుడే మీకు అందరికన్నా పెద్ద శత్రువు. రావణుడు శత్రువని తెలుసు, అందుకే అతడిని ప్రతి సంవత్సరమూ కాలుస్తారు. మైసూరులో దసరాను ఎంతగానో జరుపుకుంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీ పేరు శివశక్తి సైన్యము. కానీ వారు వానర సైన్యము అన్న పేరును పెట్టారు. తప్పకుండా మనం కోతుల వలె ఉండేవారమని, ఇప్పుడు రావణుడిపై విజయాన్ని పొందేందుకు శివబాబా నుండి శక్తిని తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వీటిపై కథలను కూడా అనేకం తయారుచేసారు. అమరకథ అని కూడా అంటారు. బాబా మనకు అమరకథను వినిపిస్తారని కూడా మీకు తెలుసు. అయితే ఈ కథను పర్వతముపై ఏమీ వినిపించరు. శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారు అని అంటారు. శివశంకరుల చిత్రాన్ని కూడా పెడతారు, వారిరువురినీ కలిపేసారు. ఇదంతా భక్తి మార్గము. రోజురోజుకు అందరూ తమోప్రధానముగా అవుతూ వచ్చారు. సతోప్రధానుల నుండి సతోగా అయితే రెండు కళలు తగ్గుతాయి. త్రేతాను కూడా వాస్తవానికి స్వర్గము అని అనరు. బాబా పిల్లలైన మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారుచేయడానికి వస్తారు. బ్రాహ్మణ కులము మరియు సూర్యవంశ, చంద్రవంశ కులము, రెండూ స్థాపన అవుతున్నాయని తండ్రికి తెలుసు. రామచంద్రునికి క్షత్రియ గుర్తును చూపించారు. మీరందరూ మాయపై విజయాన్ని పొందే క్షత్రియులే కదా. తక్కువ మార్కులతో పాస్ అయ్యేవారిని చంద్రవంశీయులు అని అంటారు, అందుకే రాముడికి బాణాలు మొదలైనవి ఇచ్చారు. హింస అయితే త్రేతాలో కూడా ఉండదు. రాముని రాజ్యములో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరములో అందరూ దాతలే కాబట్టి ధర్మమునకు సదా ఉపకారము జరుగుతుంది అన్న గాయనము కూడా ఉంది, కానీ ఈ క్షత్రియత్వపు గుర్తును చూపించడంతో మనుష్యులు తికమకపడతారు. ఈ ఆయుధాలు మొదలైనవేవీ ఉండవు. శక్తులకు కూడా ఈ కత్తులు మొదలైనవి చూపిస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి జ్ఞానసాగరుడు కావున తండ్రే ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అనంతమైన తండ్రికి పిల్లలపై ఏ ప్రేమ అయితే ఉందో అది హద్దులోని తండ్రికి ఉండదు. వారు 21 జన్మల కొరకు పిల్లలను సుఖవంతులుగా చేస్తారు. కావున వారు ప్రియమైన తండ్రి కదా! తండ్రి ఎంత ప్రియమైనవారు, వారు మీ అన్ని దుఃఖాలను దూరం చేస్తారు. సుఖము యొక్క వారసత్వము లభిస్తుంది. అక్కడ దుఃఖము యొక్క నామ-రూపాలే ఉండవు. ఇప్పుడు ఇది బుద్ధిలో ఉండాలి కదా. ఇది మరచిపోకూడదు. ఇది ఎంత సహజము, కేవలం మురళిని చదివి వినిపించాలి, అయినా బ్రాహ్మణి కావాలి అని అంటారు. బ్రాహ్మణి లేకుండా ధారణ జరగదు అని అంటారు. అరే, సత్యనారాయణుని కథనైతే చిన్న పిల్లలు కూడా గుర్తుచేసుకొని వినిపిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని నేను మీకు రోజూ అర్థం చేయిస్తాను. ఈ జ్ఞానమైతే 7 రోజుల్లో బుద్ధిలో కూర్చుండిపోవాలి కానీ పిల్లలు మర్చిపోతారు, బాబా అయితే ఆశ్చర్యపోతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రిని ఆశీర్వదించమని లేక కృప చూపించమని అడగకూడదు. తండ్రిని, టీచరును, గురువును స్మృతి చేసి మీపై మీరే కృప చూపించుకోవాలి. మాయతో అప్రమత్తంగా ఉండాలి, కళ్ళు మోసగిస్తాయి, వీటిని మీ ఆధీనములో ఉంచుకోవాలి.

2. వ్యర్థమైన పరచింతన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి, అందుకే ఎంత వీలైతే అంత శాంతిగా ఉండాలి, నోటిలో నాణెమును వేసుకోవాలి. ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. స్వయమూ అశాంతిగా అవ్వకూడదు, అలాగే ఎవరినీ అశాంతపరచకూడదు.

వరదానము:-

తండ్రి సహాయముతో శూలమును ముల్లుగా చేసే సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవ

గతములోని లెక్కాచారాలు శూలము వంటివి కానీ తండ్రి సహాయముతో అవి ముల్లులా అయిపోతాయి. పరిస్థితులు తప్పకుండా వస్తాయి ఎందుకంటే అన్నింటినీ ఇక్కడే సమాప్తము చెయ్యాలి, కానీ తండ్రి సహాయము వాటిని ముల్లులా చేస్తుంది, పెద్ద విషయాన్ని చిన్నగా చేస్తుంది ఎందుకంటే పెద్ద తండ్రి తోడుగా ఉన్నారు. ఈ నిశ్చయము ఆధారముతోనే సదా నిశ్చింతగా ఉండండి మరియు ట్రస్టీగా అయ్యి నాది అన్నదానిని నీదిలోకి మార్చి తేలికగా అవ్వండి, అప్పుడు అన్నీ భారాలు ఒక్క క్షణములో సమాప్తమైపోతాయి.

స్లోగన్:-

శుభ భావన స్టాక్ ద్వారా నెగెటివ్ ను పాజిటివ్ కి పరివర్తన చెయ్యండి.