22-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి శ్రీమతముపై నడుచుకోవడమే తండ్రి
పట్ల గౌరవాన్ని ఉంచడము, మన్మతముపై నడిచేవారు అగౌరవపరుస్తారు’’
ప్రశ్న:-
గృహస్థ
వ్యవహారములో ఉండేవారికి ఏ ఒక్క విషయములో బాబా వద్దని చెప్పరు కానీ వారికి ఒక
డైరెక్షన్ ను ఇస్తారు - అది ఏమిటి?
జవాబు:-
బాబా అంటారు -
పిల్లలూ, మీరు అందరి కనెక్షన్ లోకి రండి, ఉద్యోగాలు మొదలైనవి ఏవైనా చేయండి,
సంపర్కములోకి రావలసి వస్తే, రంగు బట్టలు ధరించాల్సి వస్తే ధరించండి, బాబా అందుకు
వద్దనరు. తండ్రి కేవలం డైరెక్షన్ ను ఇస్తారు - పిల్లలూ, దేహ సహితముగా దేహపు సర్వ
సంబంధాల నుండి మమకారాన్ని తొలగించి నన్ను స్మృతి చేయండి.
ఓంశాంతి
శివబాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు అనగా తమ సమానముగా తయారుచేసేందుకు
పురుషార్థాన్ని చేయిస్తారు. ఏ విధంగా నేను జ్ఞానసాగరుడినో అలా పిల్లలు కూడా
తయారవ్వాలి. అందరూ ఒకేలా తయారవ్వరు అన్నదైతే మధురమైన పిల్లలకు తెలుసు. పురుషార్థమైతే
ప్రతి ఒక్కరూ ఎవరిది వారు చేయవలసి ఉంటుంది. స్కూల్లో విద్యార్థులు అయితే ఎందరో
చదువుకుంటారు కానీ అందరూ ఒకేలా పాస్ విత్ ఆనర్లుగా అవ్వరు. అయినా టీచర్ పురుషార్థము
చేయిస్తూ ఉంటారు. పిల్లలైన మీరు కూడా పురుషార్థము చేస్తారు. మీరు ఏమవుతారు? అని బాబా
అడిగితే, మేము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేందుకే వచ్చాము
అని అందరూ అంటారు. అది సరే కానీ, మీ నడవడికను కూడా చూసుకోండి కదా. తండ్రి కూడా
ఉన్నతోన్నతమైనవారు, వారు టీచర్ కూడా మరియు గురువు కూడా. ఈ తండ్రి గురించి ఎవరికీ
తెలియదు. శివబాబా మనకు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని పిల్లలైన
మీకు తెలుసు. కానీ వారు ఎలా ఉన్నారో అలా వారిని ఆ రీతిగా తెలుసుకోవడం కూడా కష్టమే.
తండ్రిని తెలుసుకున్నట్లయితే వారి టీచరు రూపాన్ని మర్చిపోతారు మరియు గురువు రూపాన్ని
మర్చిపోతారు. పిల్లలు తండ్రి పట్ల గౌరవాన్ని కూడా ఉంచాలి. గౌరవము అని దేనినంటారు?
తండ్రి ఏదైతే చదివిస్తున్నారో దానిని బాగా చదువుకున్నట్లయితే గౌరవము ఉంచినట్లు.
తండ్రి అయితే చాలా మధురమైనవారు. లోలోపల సంతోషపు పాదరసము ఎంతగానో పైకి ఎక్కి ఉండాలి.
అమితమైన సంతోషము ఉండాలి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నాకు అటువంటి
సంతోషము ఉందా? అందరూ ఒకేలా అయితే ఉండలేరు. చదువులో కూడా చాలా తేడా ఉంటుంది. ఆ
స్కూళ్ళలో కూడా ఎంత తేడా ఉంటుంది. అక్కడైతే సాధారణమైన టీచరులే చదివిస్తారు కానీ
ఇక్కడ వీరు అసాధారణమైనవారు. ఇటువంటి టీచర్ ఇంకెవరూ ఉండరు. నిరాకారుడైన తండ్రి
టీచరుగా కూడా అవుతారు అన్నది ఎవరికీ తెలియనే తెలియదు. శ్రీకృష్ణుని పేరు వేసినా కానీ
అతను తండ్రి ఎలా అవ్వగలరు అన్నది వారికి తెలియనే తెలియదు. శ్రీకృష్ణుడైతే దేవత కదా.
నిజానికి కృష్ణ అన్న పేరు కూడా ఎంతోమందికి ఉంది, కానీ కృష్ణ అని అనడముతోనే
శ్రీకృష్ణుడు ఎదురుగా వచ్చేస్తాడు. అతనైతే దేహధారి కదా. ఈ శరీరము వీరిది కాదు అని
మీకు తెలుసు. నేను అప్పుగా తీసుకున్నాను అని వీరు స్వయం అంటారు. ఇతను అంతకుముందు
కూడా మనిషిగానే ఉన్నారు, ఇప్పుడు కూడా మనిషిగానే ఉన్నారు. ఇతడు భగవంతుడు కారు.
భగవంతుడు ఒక్క నిరాకారుడే. ఇప్పుడు పిల్లలైన మీకు ఎన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు.
అయినా పూర్తిగా తండ్రిగా భావించడము, టీచరుగా భావించడము అనేది ఇప్పుడు జరగదు,
ఘడియ-ఘడియ మర్చిపోతారు. బుద్ధి దేహధారుల వైపుకు వెళ్ళిపోతుంది. ఫైనల్ గా తండ్రే
తండ్రి, టీచరు మరియు సద్గురువు - అన్న ఈ నిశ్చయము బుద్ధిలో ఇప్పుడు లేదు. ఇప్పుడైతే
మర్చిపోతూ ఉంటారు. విద్యార్థులు ఎప్పుడైనా టీచరును మర్చిపోతారా! హాస్టల్లో ఎవరైతే
ఉంటారో వారైతే ఎప్పుడూ మర్చిపోరు. ఏ విద్యార్థులైతే హాస్టల్లో ఉంటారో వారికైతే
పక్కాగా ఉంటుంది కదా. ఇక్కడైతే ఆ నిశ్చయము కూడా పక్కాగా లేదు. నంబరువారు
పురుషార్థానుసారముగా హాస్టల్లో కూర్చున్నారు కావున తప్పకుండా విద్యార్థులే కదా, కానీ
ఈ పక్కా నిశ్చయము లేదు. అందరూ తమ-తమ పురుషార్థానుసారముగా పదవులు తీసుకుంటున్నారని
మీకు తెలుసు. ఆ చదువులో అయితే కొందరు బ్యారిస్టర్లుగా అవుతారు, కొందరు ఇంజనీర్లుగా
అవుతారు, కొందరు డాక్టర్లుగా అవుతారు. ఇక్కడైతే మీరు విశ్వాధిపతులుగా అవుతున్నారు.
కావున ఇటువంటి విద్యార్థుల బుద్ధి ఎలా ఉండాలి. నడవడిక, మాటతీరు ఎంత బాగుండాలి.
తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, మీరు ఎప్పుడూ ఏడవకూడదు. మీరు విశ్వాధిపతులుగా
అవుతారు కావున మీరు ఎప్పుడూ ఓ భగవంతుడా అని మొరపెట్టుకోకూడదు. ఈ విధంగా
మొరపెట్టుకోవడమనేది ఏడుపులో అన్నింటికంటే పెద్ద రూపము. తండ్రి అంటారు - ఎవరైతే
ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు... వారు విశ్వము యొక్క ఉన్నతోన్నతమైన
రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటారు. మేము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చాము
అని అయితే అంటారు కానీ నడవడిక అలా ఎక్కడ ఉంది! నంబరువారు పురుషార్థానుసారముగా అందరూ
పురుషార్థము చేస్తున్నారు. కొందరైతే బాగా పాస్ అయి స్కాలర్షిప్ ను తీసుకుంటారు,
కొందరు ఫెయిల్ అయిపోతారు. నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. మీలో కూడా కొందరు
చదువుతారు, కొందరు చదవరు కూడా. ఉదాహరణకు పల్లెటూరివారికి చదవడం నచ్చదు, గడ్డి కోయమని
చెప్తే సంతోషముగా వెళ్తారు. అందులో స్వతంత్రమైన జీవితము ఉందని భావిస్తారు, చదవడాన్ని
బంధనముగా భావిస్తారు, అలా కూడా ఎందరో ఉంటారు. షావుకార్లలో జమిందార్లు కూడా తక్కువేమీ
కారు. తమను తాము స్వతంత్రులుగా, చాలా సంతోషముగా ఉన్నట్లుగా భావిస్తారు. ఉద్యోగము
అన్న పేరైతే ఉండదు కదా. ఆఫీసులు మొదలైనవాటిలోనైతే మనుష్యులు ఉద్యోగాలు చేస్తారు కదా.
ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి విశ్వాధిపతులుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు.
వారు ఉద్యోగము కోసం చదివించడం లేదు. మీరైతే ఈ చదువుతో విశ్వాధిపతులుగా అవ్వనున్నారు
కదా. ఇది చాలా ఉన్నతమైన చదువు. మీరు విశ్వాధిపతులుగా, పూర్తిగా స్వతంత్రులుగా
అయిపోతారు. విషయము ఎంత సహజముగా ఉంది. ఈ ఒక్క చదువు ద్వారానే మీరు ఇంత ఉన్నతమైన
మహారాజు, మహారాణులుగా అవుతారు, అది కూడా పవిత్రమైనవారిగా అవుతారు. ఏ ధర్మము వారైనా
వచ్చి చదువుకోవచ్చు అని మీరు అంటారు. ఈ చదువు చాలా ఉన్నతమైనది అని భావిస్తారు.
విశ్వాధిపతులుగా అవుతారు. ఇది తండ్రే చదివిస్తారు. మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాలముగా
అయ్యింది. హద్దులోని బుద్ధి నుండి అనంతమైన బుద్ధిలోకి నంబరువారు పురుషార్థానుసారముగా
వచ్చారు. మేమందరమూ ఇతరులను విశ్వాధిపతులుగా తయారుచేయాలి అని ఎంతటి సంతోషము ఉంటుంది.
వాస్తవానికి ఉద్యోగాలు అనేవి అక్కడ కూడా ఉంటాయి. దాస-దాసీలు, నౌకర్లు మొదలైనవారైతే
కావాలి కదా. చదువుకున్నవారి ముందు చదువుకోనివారు సేవకులు అవుతారు, అందుకే తండ్రి
అంటారు, మీరు బాగా చదువుకోండి, అప్పుడు ఈ విధంగా అవ్వగలుగుతారు. మేము ఇలా అవుతాము
అని అంటారు కూడా. కానీ చదువుకోకపోతే ఏమవుతారు. చదువుకోకపోతే తండ్రిని అంత గౌరవముతో
స్మృతి చేయరు. తండ్రి అంటారు, ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా మీ వికర్మలు
వినాశనమవుతాయి. పిల్లలు అంటారు, బాబా, మీరు ఎలా నడిపిస్తే అలా. తండ్రి కూడా మతమును
(డైరెక్షన్లను) ఇతని ద్వారానే ఇస్తారు కదా. కానీ ఇతని మతము కూడా తీసుకోరు. ఎంతైనా
కుళ్ళిపోయిన మనుష్య మతముపైనే నడుస్తారు. శివబాబా ఈ రథము ద్వారా మతము ఇస్తున్నారు అని
గమనిస్తారు కూడా, అయినా కానీ తమ సొంత మతమనుసారముగానే నడుస్తారు. దానిని పైసకు
కొరగాని గవ్వతుల్యమైన మతము అని అంటారు, దానిపై నడుస్తారు. రావణుని మతముపై నడుస్తూ,
నడుస్తూ ఈ సమయములో గవ్వతుల్యముగా అయిపోయారు. ఇప్పుడు రాముడైన శివబాబా మతాన్ని
ఇస్తారు. నిశ్చయములోనే విజయము ఉంది, ఇందులో ఎప్పుడూ నష్టం వాటిల్లదు. నష్టాన్ని కూడా
తండ్రి లాభములోకి మారుస్తారు, కానీ అది నిశ్చయబుద్ధి కలవారి విషయములో. సంశయబుద్ధి
కలవారు లోలోపల గుటకలు మింగుతూ ఉంటారు. నిశ్చయబుద్ధి కలవారికి ఎప్పుడూ గుటకలు
మింగాల్సి రావడము, నష్టము వాటిల్లడము అనేది జరగదు. బాబా స్వయం గ్యారంటీ ఇస్తారు -
శ్రీమతముపై నడవడం ద్వారా ఎప్పుడూ అకళ్యాణము జరగదు. మనుష్య మతాన్ని దేహధారీ మతము అని
అంటారు. ఇక్కడ ఉన్నదే మనుష్య మతము. మనుష్య మతము, ఈశ్వరీయ మతము మరియు దైవీ మతము అని
అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభించింది, దీని ద్వారా మీరు మనుష్యుల
నుండి దేవతలుగా అవుతారు. మళ్ళీ అక్కడ స్వర్గములోనైతే మీరు సుఖాన్నే పొందుతారు.
అక్కడ దుఃఖపు విషయమేదీ ఉండదు. అది కూడా స్థిరమైన సుఖముగా అయిపోతుంది. ఈ సమయములో మీరు
ఆ ఫీలింగ్ ను అనుభూతిలోకి తెచ్చుకోవలసి ఉంటుంది. మీరు భవిష్యత్తును అనుభూతి చేస్తారు.
ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగము, ఇప్పుడు శ్రీమతము లభిస్తుంది. తండ్రి అంటారు,
నేను కల్ప-కల్పమూ కల్పము యొక్క సంగమయుగములో వస్తాను, దాని గురించి మీకు తెలుసు. మీరు
వారి మతమనుసారముగా నడుచుకుంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, గృహస్థ వ్యవహారములో
ఉండండి, మీరు వస్త్రాలు మొదలైనవి మార్చేయాలి అని మీకు ఎవరు చెప్పారు? ఏదైనా ధరించండి.
చాలామందితో కనెక్షన్ లోకి రావలసి వస్తుంది. రంగు వస్త్రాలు వేసుకోవడానికి వద్దనేమీ
చెప్పరు. ఏ వస్త్రాలైనా ధరించండి, దానితో ఎటువంటి సంబంధమూ లేదు. తండ్రి అంటారు, దేహ
సహితముగా దేహపు సర్వ సంబంధాలను వదలండి. ఇకపోతే అన్నీ ధరించవచ్చు. కేవలం స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇది పక్కా నిశ్చయము చేసుకోండి. ఆత్మయే
పతితముగా, మళ్ళీ పావనముగా అవుతుందని కూడా మీకు తెలుసు. మహాత్మను కూడా మహాన్ ఆత్మ అని
అంటారు, అంతేకానీ మహాన్ పరమాత్మ అని అనరు. అలా అనడం శోభించదు కూడా. ఇవి అర్థం
చేసుకునేందుకు ఎంత మంచి పాయింట్లు. సర్వులకూ సద్గతినిచ్చే సద్గురువు ఒక్క తండ్రే.
అక్కడ ఎప్పుడూ అకాలమృత్యువు జరగదు. బాబా మమ్మల్ని మళ్ళీ ఈ విధంగా దేవతలుగా
తయారుచేస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు ఇది బుద్ధిలో
లేదు. కల్పము ఆయువు ఎంత అనేది కూడా ఇంతకుముందు తెలియదు. ఇప్పుడైతే అంతా స్మృతిలోకి
వచ్చింది. ఆత్మనే పాపాత్మ, పుణ్యాత్మగా పిలువబడుతుందని కూడా పిల్లలు అర్థం
చేసుకుంటారు. పాప పరమాత్మ అని ఎప్పుడూ అనరు. మరి ఎవరైనా పరమాత్మ సర్వవ్యాపి అని అంటే,
అది కూడా ఎంత అవివేకత. ఈ విషయాలను తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. 5000
సంవత్సరాల తర్వాత పాపాత్ములను పుణ్యాత్ములుగా తండ్రే వచ్చి తయారుచేస్తారని ఇప్పుడు
పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారు ఒక్కరినే కాదు, పిల్లలందరినీ తయారుచేస్తారు.
తండ్రి అంటారు, పిల్లలైన మిమ్మల్ని అలా తయారుచేసేది అనంతమైన తండ్రినైన నేనే.
తప్పకుండా పిల్లలకు అనంతమైన సుఖాన్ని ఇస్తాను. సత్యయుగములో పవిత్ర ఆత్మలే ఉంటారు.
రావణునిపై విజయాన్ని పొందడము ద్వారానే మీరు పుణ్యాత్ములుగా అయిపోతారు. మాయ ఎన్ని
విఘ్నాలను కలిగిస్తుంది అనేది మీరు అనుభవం చేస్తారు. బాగా ఇబ్బంది పెట్టేస్తుంది.
మాయతో యుద్ధము ఎలా నడుస్తుంది అనేది మీరు అర్థం చేసుకుంటారు. కానీ వారు పాండవులు
మరియు కౌరవుల యుద్ధాన్ని, సైన్యాన్ని మొదలైనవేవేవో చూపించారు. ఈ యుద్ధము గురించి
ఎవరికీ తెలియదు. ఇది గుప్తమైనది. దీని గురించి మీకే తెలుసు. మాయతో ఆత్మలమైన మనము
యుద్ధము చేయాలి. తండ్రి అంటారు, మీకు అన్నింటికన్నా పెద్ద శత్రువు కామము. యోగబలముతో
మీరు దీనిపై విజయాన్ని పొందుతారు. యోగబలము అర్థాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు.
ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో వారే తమోప్రధానముగా అయ్యారు. అనేక జన్మల అంతిమములో
నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను అని తండ్రి స్వయంగా అంటారు. ఇతనే తమోప్రధానముగా అయ్యారు,
అది మీకు కూడా వర్తిస్తుంది. బాబా ఒక్కరికే చెప్పరు కదా. నంబరువారుగా అందరికీ
చెప్తారు. నంబరువారుగా ఎవరెవరు ఉన్నారు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. మున్ముందు
మీకు చాలా తెలుస్తుంది. మీకు మాల సాక్షాత్కారాన్ని చేయిస్తారు. స్కూల్లో ఎప్పుడైతే
ట్రాన్స్ఫర్ అవుతారో అప్పుడు అంతా తెలిసిపోతుంది కదా. రిజల్టు అంతా బయటకు
తెలుస్తుంది.
బాబా ఒక కుమార్తెను - నీ పరీక్షా పత్రాలు ఎక్కడి నుండి వస్తాయి అని అడిగితే, ఆమె
లండన్ నుండి వస్తాయి అని చెప్పారు. మరి మీ పేపర్లు ఎక్కడి నుండి వస్తాయి? పై నుండి.
మీ పేపరు పై నుండి వస్తుంది. అంతా సాక్షాత్కారములో చూస్తారు. ఇది ఎంతటి అద్భుతమైన
చదువు. ఎవరు చదివిస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణ భగవానువాచ అని
అనేస్తారు. చదువులో అందరూ నంబరువారుగా ఉన్నారు కావున సంతోషము కూడా నంబరువారుగానే
ఉంటుంది. అతీంద్రియ సుఖము గురించి గోప, గోపికలను అడగండి అన్న ఈ గాయనమేదైతే ఉందో, అది
చివరిలోని విషయము. తండ్రి అర్థం చేయించారు - ఈ పిల్లలు ఎప్పుడూ పడిపోరు అని బాబాకు
తెలిసినా కానీ, ఏమవుతుందో అనేది ఏమి తెలియదు. చదువును చదవనే చదవరు, భాగ్యములో లేదు.
ఆ ప్రపంచములోకి వెళ్ళి ఇల్లు ఏర్పాటు చేసుకోండి అని కొంచెం చెప్పినా, వెంటనే
వెళ్ళిపోతారు. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతారు. వారి నడవడిక, మాటలు, చేతలు అన్నీ
అలాగే ఉంటాయి. మాకు ఒకవేళ ఇంత లభిస్తే మేము వెళ్ళి వేరుగా ఉంటాము అని భావిస్తారు.
నడవడిక ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. దీని అర్థమేమిటంటే, వారికి నిశ్చయము లేదు,
తప్పదు కదా అని కూర్చున్నారు. జ్ఞానము యొక్క అ, ఆ, ఇ, ఈ లు కూడా తెలియనివారు ఎందరో
ఉన్నారు. వారు ఎప్పుడూ కూర్చోరు కూడా. మాయ చదువుకోనివ్వదు. ఇలాంటివారు అన్ని
సెంటర్లలోనూ ఉన్నారు. ఎప్పుడూ చదువుకునేందుకు రానే రారు. ఆశ్చర్యము కదా. ఇది ఎంత
ఉన్నతమైన జ్ఞానము. భగవంతుడు చదివిస్తారు. ఈ పని చేయకండి అని బాబా చెప్తే వినరు.
తప్పకుండా తప్పుడు పని చేసి చూపిస్తారు. రాజధాని స్థాపన అవుతోంది కావున అందులో అన్ని
రకాల వారూ కావాలి కదా. పై నుండి మొదలుకుని కింది వరకూ అందరూ తయారవుతారు. పదవులలో
తేడా అయితే ఉంటుంది కదా. ఇక్కడ కూడా నంబరువారు పదవులు ఉన్నాయి. కేవలం తేడా ఏమిటి?
అక్కడ ఆయువు ఎక్కువగా ఉంటుంది మరియు సుఖము ఉంటుంది. ఇక్కడ ఆయువు తక్కువగా ఉంటుంది
మరియు దుఃఖము ఉంటుంది. పిల్లల బుద్ధిలో ఈ అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈ డ్రామా ఏ
విధంగా తయారయ్యిందో చూడండి. మళ్ళీ కల్ప-కల్పమూ మనం అదే పాత్రను అభినయిస్తాము.
కల్ప-కల్పమూ అభినయిస్తూనే ఉంటాము. ఇంత చిన్నని ఆత్మలో ఎంతటి పాత్ర నిండి ఉంది. అవే
ముఖకవళికలు, అవే కర్మలు... ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టి నాటకము
తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది
లేదు, జరగరానిది ఏమైనా జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు...ఈ చక్రము మళ్ళీ రిపీట్
అవుతుంది. సతోప్రధాన, సతో, రజో, తమోలలోకి వస్తారు. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు.
అచ్ఛా, స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా? ఆత్మకు తండ్రి శివబాబా అని అయితే అర్థం
చేసుకున్నారు కదా. ఎవరైతే సతోప్రధానముగా అవుతారో వారే మళ్ళీ తమోప్రధానముగా అవుతారు,
మళ్ళీ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అయిపోతారు. ఇది మంచిదే కదా అని
అక్కడే ఆపాలి. అనంతమైన తండ్రి ఈ స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, వారే పతిత-పావనుడు అని
చెప్పండి. తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు, ఇందులో శాస్త్రాలు మొదలైనవాటి విషయమేదీ లేదు.
శాస్త్రాలు ప్రారంభములో ఎక్కడి నుండి వస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ చాలామంది అయిపోతారో
అప్పుడు తర్వాత కూర్చుని శాస్త్రాలను తయారుచేస్తారు. సత్యయుగములో శాస్త్రాలు ఉండవు.
పరంపరగా ఏదీ ఉండదు. నామ-రూపాలైతే మారిపోతాయి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎప్పుడూ కూడా ఓ భగవంతుడా అంటూ మొరపెట్టుకోకూడదు. బుద్ధిలో ఉండాలి -
మేము విశ్వాధిపతులుగా అవ్వనున్నాము, మా నడవడిక, మాట్లాడే తీరు చాలా మంచిగా ఉండాలి.
ఎప్పుడూ ఏడవకూడదు.
2. నిశ్చయబుద్ధి కలవారిగా అయి ఒక్క తండ్రి మతముపై నడుస్తూ ఉండాలి, ఎప్పుడూ
తికమకపడకూడదు లేక గుటకలు మింగకూడదు. నిశ్చయములోనే విజయము ఉంది, అందుకే ఎందుకూ
కొరగాని మీ మతాన్ని నడిపించకూడదు.
వరదానము:-
ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్స్టాప్ పెట్టి స్వయాన్ని
పరివర్తన చేసుకునే సర్వుల ఆశీర్వాదాలకు పాత్ర భవ
ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టగలరంటే
- బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూప ఆత్మ, ఈ రెండింటి స్మృతి ఉన్నప్పుడు
మరియు కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పుడు. ఏ పిల్లలైతే ఏ పరిస్థితిలోనైనా స్వయాన్ని
పరివర్తన చేసుకుని ఫుల్స్టాప్ పెట్టడములో స్వయాన్ని ముందుగా ఆఫర్ చేసుకుంటారో, వారు
ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు. వారికి స్వయానికి స్వయము కూడా ఆశీర్వాదాలు అనగా
సంతోషము లభిస్తుంది, తండ్రి ద్వారా మరియు బ్రాహ్మణ పరివారము ద్వారా కూడా ఆశీర్వాదాలు
లభిస్తాయి.
స్లోగన్:-
ఏ సంకల్పాలనైతే చేస్తారో,
వాటికి మధ్య-మధ్యలో దృఢత అనే స్టాంప్ ను వేసినట్లయితే విజయీగా అయిపోతారు.
| | |