23-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 17.02.2004


‘‘సర్వులకు సహయోగాన్ని ఇవ్వండి మరియు సహయోగులుగా తయారుచెయ్యండి, సదా అఖండ భండారా నడుస్తూ ఉండాలి’’

ఈ రోజు బాప్ దాదా స్వయంగా తమతోపాటు పిల్లల యొక్క వజ్రతుల్య జన్మదినమైన శివజయంతిని జరపడానికి వచ్చారు. పిల్లలైన మీరందరూ మీ పారలౌకిక, అలౌకిక తండ్రి యొక్క జన్మదినాన్ని జరపడానికి వచ్చారు, బాబా ఏమో మీ జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. బాబా పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు - వాహ్ నా శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలూ, వాహ్! మీరు విశ్వములోని అంధకారాన్ని తొలగించేందుకు బాబాతోపాటుగా అవతరించినవారు. పిల్లలైన మీరు పరమాత్మ తండ్రితోపాటుగా జరుపుకుంటున్న ఇటువంటి జన్మదినము మొత్తం కల్పములో మరెవ్వరికీ ఉండదు. ఈ అలౌకికమైన, అతి అతీతమైన, అతి ప్రియమైన జన్మదినాన్ని భక్తాత్మలు కూడా జరుపుకుంటారు కానీ పిల్లలైన మీరు మిలనాన్ని జరుపుకుంటారు మరియు భక్తాత్మలు కేవలము మహిమను గానము చేస్తూ ఉంటారు. మహిమను కూడా గానము చేస్తారు, పిలుస్తూ కూడా ఉంటారు. బాప్ దాదా భక్తులు చేసే మహిమను మరియు వారి పిలుపును విని వారికి కూడా నంబరువారుగా వారి భావనకు తగిన ఫలాన్ని తప్పకుండా ఇస్తారు. కానీ భక్తులు మరియు పిల్లలు, ఇరువురికీ మధ్యన చాలా వ్యత్యాసము ఉంది. మీరు చేసిన శ్రేష్ఠ కర్మలను, శ్రేష్ఠ భాగ్యము యొక్క స్మృతి చిహ్మాన్ని చాలా బాగా జరుపుకుంటారు, అందుకే బాప్ దాదా భక్తుల యొక్క భక్తి లీలను చూసి వారికి కూడా అభినందనలు తెలియజేస్తారు ఎందుకంటే స్మృతిచిహ్నాలన్నింటినీ చాలా బాగా కాపీ చేసారు. వారు కూడా ఈ రోజే వ్రతాన్ని పెట్టుకుంటారు, వారు వ్రతాన్ని కొద్ది సమయము కొరకు పెట్టుకుంటారు, అల్పకాలికముగా ఆహార-పానీయాల శుద్ధతను పాటిస్తారు. మీరు సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని చేపడతారు, ఇందులో ఆహార-వ్యవహారాలు, మాటలు, కర్మలు, పూర్తి జన్మ కొరకు వ్రతాన్ని తీసుకుంటారు. ఎప్పటివరకైతే సంగమయుగపు జీవితములో జీవించి ఉండాలో, అప్పటివరకు మనసా, వాచా, కర్మలలో పవిత్రముగా అవ్వాల్సిందే. కేవలము తయారవ్వటము మాత్రమే కాదు, కానీ తయారుచెయ్యాలి కూడా. కనుక చూడండి, భక్తుల బుద్ధి కూడా తక్కువైనదేమీ కాదు, స్మృతిచిహ్నాలను చాలా బాగా కాపీ చేసారు. మీరందరూ అన్ని వ్యర్థాలను సమర్పణ చేసి సమర్థులుగా అయ్యారు అనగా మీ అపవిత్ర జీవితాన్ని సమర్పణ చేసారు, మీ సమర్పణతకు స్మృతిచిహ్నముగా వారు బలి ఇస్తారు, కానీ స్వయాన్ని బలి ఇవ్వరు, మేకను బలి ఇస్తారు. చూడండి ఎంత బాగా కాపీ చేసారు, మేకను ఎందుకు బలి ఇస్తారు? దీనిని కూడా చాలా సుందరముగా కాపీ చేసారు. మేక ఏం చేస్తుంది? మే-మే-మే అంటుంది కదా! మరియు మీరు ఏం సమర్పణ చేసారు? మై, మై, మై (నేను, నేను, నేను). దేహ భానముతో కూడిన మైపన్ (నేను అన్న భావన) ను సమర్పణ చేసారు ఎందుకంటే ఈ నేను అన్న భావనలోనే దేహ-అభిమానము వస్తుంది. ఈ దేహ-అభిమానము అన్ని వికారాలకు బీజము.

బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - సర్వ సమర్పణ అవ్వటములో ఈ దేహ భానానికి చెందిన మైపన్ (నేను అన్న భావన) అనేదే ఆటంకాన్ని కలిగిస్తుంది. సాధారణ మైపన్ అనగా నేను దేహాన్ని మరియు దేహ-సంబంధాల మైపన్, దేహ పదార్థాల సమర్పణ, ఇది సహజమే. దీనినైతే చేసేసారు కదా? లేక చెయ్యలేదా, దీనిని కూడా చెయ్యలేదా! ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా మైపన్ (నేను అన్న భావన) కూడా అతి సూక్ష్మము అవుతూ ఉంటుంది. స్థూల రూపములో ఉండే, పైపైకి ఉండే మైపన్ సమాప్తమవ్వటము సహజమే. కానీ సూక్ష్మమైన మైపన్ ఏమిటంటే - పరమాత్మ జన్మ సిద్ధ అధికారము ద్వారా ఏవైతే విశేషతలు ప్రాప్తిస్తాయో, బుద్ధి యొక్క వరదానము, జ్ఞాన స్వరూపులుగా అయ్యే వరదానము, సేవా వరదానము మరియు విశేషతలు, వీటిని ప్రభువు ఇచ్చిన కానుకలు అనండి, ఒకవేళ వీటిలో మైపన్ వచ్చినట్లయితే దానిని సూక్ష్మ మైపన్ (నేను అన్న భావన) అని అంటారు. నేను ఏదైతే చేస్తానో, నేను ఏదైతే చెప్తానో, అదే కరక్ట్, అలాగే జరగాలి, ఈ రాయల్ మైపన్ ఎగిరే కళలోకి వెళ్ళేందుకు భారముగా తయారవుతుంది. కనుక బాబా అంటారు, ఈ మైపన్ ను కూడా సమర్పణ చెయ్యండి. ప్రభువు ఇచ్చిన కానుకలో మైపన్ (నేను అన్న భావన) ఉండదు. నేను అనేదీ ఉండదు, నాది అనేదీ ఉండదు. అవి ప్రభు ఇచ్చిన కానుక, ప్రభు ఇచ్చిన వరదానము, ప్రభు ఇచ్చిన విశేషత. మరి మీ అందరి సమర్పణత ఎంతటి సూక్ష్మమైనది. చెక్ చేసుకున్నారా? సాధారణ మైపన్ మరియు రాయల్ మైపన్, ఈ రెండింటినీ సమర్పణ చేసారా? చేసారా లేక చేస్తున్నారా? చెయ్యాల్సే ఉంటుంది. మీరు పరస్పరం నవ్వుతూ అంటుంటారు కదా, మరణించాల్సే ఉంటుంది అని. కానీ ఇలా మరణించటము అంటే భగవంతుని ఒడిలో జీవించటము. ఈ మరణించటము అనేది మరణించటము కాదు. 21 జన్మలు దేవాత్మల ఒడిలో జన్మించాలి, అందుకే చాలా సంతోషముతో సమర్పణ అవుతారు కదా! బాధతో ఆర్తనాదాలు చేస్తూ అయితే అవ్వరు కదా? లేదు. భక్తిలో కూడా బలి ఇచ్చేటప్పుడు ఆ జంతువు అరిచినట్లయితే ఆ బలి స్వీకరింపబడదు. కనుక ఎవరైతే హద్దుకు చెందిన నేను మరియు నాదిలో సంతోషముగా సమర్పితమవుతారో, వారు జన్మ-జన్మలకు వారసత్వానికి అధికారులుగా అవుతారు.

కనుక చెక్ చేసుకోండి - ఎటువంటి వ్యర్థ సంకల్పాలనైనా, వ్యర్థ మాటలనైనా, వ్యర్థ నడవడికనైనా పరివర్తన చేసుకోవటములో సంతోషముగా పరివర్తన చేసుకుంటారా లేక తప్పదు కదా అనా? ప్రేమతో పరివర్తన అవుతారా లేక కష్టముగా పరివర్తన అవుతారా? పిల్లలైన మీరందరూ జన్మ తీసుకోగానే మీ జీవితం యొక్క వృత్తిగా ఇదే చేసుకున్నారు - విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తకులు. ఇది మీ అందరి, బ్రాహ్మణ జన్మ యొక్క ఆక్యుపేషన్ (వృత్తి) కదా! ఇది పక్కా అయితే చేతులూపండి. జెండాను ఊపుతున్నారు, చాలా మంచిది. (అందరి చేతులలో శివబాబా జెండాలు ఉన్నాయి, వాటిని అందరూ ఊపుతున్నారు) ఈ రోజు జెండాల రోజు కదా, చాలా మంచిది. కానీ జెండాను ఊరికే అలా ఊపవద్దు. ఊరికే అలా జెండాను ఊపటమైతే చాలా సహజము, మనసును ఊపాలి. మనసును పరివర్తన చేసుకోవాలి. ధైర్యము కలవారు కదా. ధైర్యము ఉందా? చాలా ధైర్యము ఉంది, మంచిది.

బాప్ దాదా ఒక శుభవార్తకు సంబంధించిన విషయము చూసారు, అది ఏమిటి, తెలుసా? బాప్ దాదా ఈ సంవత్సరము కొరకు విశేషమైన కానుకను ఇచ్చారు, అదేమిటంటే - ‘‘ఈ సంవత్సరము ఒకవేళ కొద్దిగానైనా ధైర్యము పెట్టినట్లయితే, ఏ కార్యములోనైనా, స్వ పరివర్తనలోనైనా, కార్యములోనైనా, విశ్వ సేవలోనైనా, ఒకవేళ ధైర్యముతో చేసినట్లయితే - ఎక్స్ ట్రా సహాయము లభించే వరదానము ఈ సంవత్సరానికి లభించింది’’. మరి బాప్ దాదా ఏ సంతోషకరమైన కబురును విన్నారు లేక ఏ దృశ్యాన్ని చూసారు! ఈ సారి శివజయంతి సేవలో నలువైపులా చాలా చాలా చాలా మంచి ధైర్యముతో మరియు ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు (అందరూ చప్పట్లు కొట్టారు) ఆ, చప్పట్లు కొట్టండి. సదా ఇలా చప్పట్లు కొడతారా లేక శివరాత్రి రోజేనా? సదా చప్పట్లు కొడుతూ ఉండండి. అచ్ఛా. నలువైపుల నుండైతే మధుబన్ కు సమాచారము వ్రాస్తారు, బాప్ దాదా అయితే వతనములోనే చూసేస్తారు. ఉల్లాసము బాగుంది మరియు ప్లాన్ ను కూడా మంచిగా తయారుచేసారు. సేవలో ఇటువంటి ఉల్లాస-ఉత్సాహాలు విశ్వాత్మలలో ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతాయి. చూడండి, నిమిత్త దాది వేసిన అంటు అద్భుతము చేసింది కదా! మంచి రిజల్టు వచ్చింది. అందుకే బాప్ దాదా ఇప్పుడు ఒక్కొక్క సెంటరు పేరు తీసుకోరు కానీ విశేషముగా అన్నివైపుల చేసిన సేవా రిజల్టుకు, బాప్ దాదా ప్రతి ఒక్క సేవాధారి బిడ్డ యొక్క విశేషత మరియు పేరు తీసుకుని పదమాల రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. చూస్తున్నారు కూడా, పిల్లలు తమ-తమ స్థానాలలో ఉండి చూస్తూ సంతోషిస్తున్నారు. విదేశాలలో కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే మీరందరూ అయితే ఆ విశ్వాత్మల కొరకు ఇష్ట దేవీ-దేవతలు కదా. బాప్ దాదా పిల్లల సభను చూసినప్పుడు మూడు రూపాలలో చూస్తారు. 1 - వర్తమాన స్వరాజ్య అధికారులు, ఇప్పుడు కూడా రాజులే. లౌకికములో కూడా తండ్రి పిల్లలను - నా రాజా పిల్లలు, రాజా బిడ్డ అని అంటారు. పేదవారైనా కూడా రాజా బిడ్డ అనే అంటారు. కానీ బాబా వర్తమాన సంగమములో కూడా ప్రతి బిడ్డను స్వరాజ్య అధికారీ రాజా బిడ్డగా చూస్తారు. మీరు రాజులు కదా! స్వరాజ్య అధికారులు. కనుక వర్తమానములో స్వరాజ్య అధికారులు. 2 - భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారులు మరియు 3 - ద్వాపరము నుండి కలియుగ అంతిమము వరకు పూజ్యులు, పూజకు అధికారులు - పిల్లలు ప్రతి ఒక్కరినీ ఈ మూడు రూపాలలో బాప్ దాదా చూస్తారు. సాధారణమైనవారిగా చూడరు. మీరు ఎటువంటివారైనా కానీ బాప్ దాదా ప్రతి బిడ్డను స్వరాజ్య అధికారీ రాజా బిడ్డగా చూస్తారు. రాజయోగులు కదా! వీరిలో ఎవరైనా ప్రజాయోగులుగా ఉన్నారా? ప్రజాయోగులా? కాదు. అందరూ రాజయోగులే! మరి రాజయోగి అనగా రాజా. ఇటువంటి స్వరాజ్య అధికారీ పిల్లల జన్మదినాన్ని జరపడానికి స్వయంగా బాబా వచ్చారు. చూడండి, డబుల్ విదేశీయులైన మీరైతే జన్మదినాన్ని జరుపుకునేందుకు విదేశాల నుండి వచ్చారు. డబుల్ విదేశీయులు చేతులెత్తండి. మరి అన్నింటికంటే దూరముగా ఉన్న దేశమేది? అమెరికానా లేక దానికంటే దూరమైనది ఉందా? మరి బాప్ దాదా ఎక్కడి నుండి వచ్చారు? బాప్ దాదా అయితే పరంధామము నుండి వచ్చారు. అంటే పిల్లల పట్ల ప్రేమ ఉంది కదా! మరి భగవంతుడికి కూడా రావలసి వచ్చే ఈ జన్మదినము ఎంతటి శ్రేష్ఠమైనది! (పుట్టినరోజుకు సంబంధించి అన్ని భాషలలో తయారుచేసిన ఒక బ్యానర్ ను చూపిస్తున్నారు) బాగా తయారుచేసారు, అన్ని భాషలలో వ్రాసారు. బాప్ దాదా అన్ని దేశాలలోని అన్ని భాషల పిల్లలకు పుట్టినరోజు శుభాకాంక్షలను ఇస్తున్నారు.

చూడండి, బాబా యొక్క శివజయంతిని జరుపుతున్నారు కానీ బాబా ఎలా ఉన్నారు? బిందువు. బిందువు యొక్క జయంతిని, అవతరణను జరుపుతున్నారు. అందరికంటే వజ్రతుల్యమైన జయంతి ఎవరిది? బిందువుది, చుక్కది. మరి బిందువుకు ఎంతటి మహిమ ఉంది! అందుకే బాప్ దాదా ఎప్పుడూ చెప్తూ ఉంటారు - మూడు బిందువులను సదా గుర్తు పెట్టుకోండి. ఎనిమదో నంబరును, ఏడో నంబరును అయితే కొంత గడబిడతో రాయాల్సి వస్తుంది, కానీ బిందువు ఎంత సహజము. మూడు బిందువులను సదా గుర్తు పెట్టుకోండి. మూడింటి గురించి బాగా తెలుసు కదా. మీరు కూడా బిందువు, బాబా కూడా బిందువు. బిందువు పిల్లలు బిందువులు. మరియు కర్మలోకి వచ్చినప్పుడు ఈ సృష్టి రంగస్థలముపైకి కర్మలు చేయడానికి వచ్చారు. ఈ సృష్టి రంగస్థలము డ్రామా. కనుక డ్రామాలో ఏదైతే కర్మ చేసారో, జరిగిపోయిందో, దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ అంటే కూడా ఏమిటి? బిందువు. అందుకే మూడు బిందువులను సదా గుర్తు పెట్టుకోండి. మొత్తం అద్భుతము చూడండి, ఈ రోజుల్లోని ప్రపంచములో అన్నింటికంటే ఎక్కువ మహత్వము దేనికి ఉంది? ధనానికి. ధనానికి మహత్వము ఉంది కదా! తల్లిదండ్రులు కూడా అసలేమీ కాదు, డబ్బే సర్వస్వము. అందులో కూడా చూడండి, ఒకవేళ 1 తర్వాత ఒక బిందువు (సున్నా)ను పెడితే ఎంతవుతుంది! పది అవుతుంది కదా. రెండో బిందువును పెట్టండి, 100 అవుతుంది. మూడో బిందువును పెట్టండి, 1000 అవుతుంది. మరి ఇది బిందువు యొక్క అద్భుతము కదా. ధనములో కూడా బిందువు యొక్క అద్భుతము ఉంది మరియు శ్రేష్ఠాత్మగా అవ్వటములో కూడా బిందువు యొక్క అద్భుతము ఉంది మరియు చేసి-చేయించేవారు కూడా బిందువే. మరి అన్నివైపుల నుండి దేనికి మహత్వము ఉంది! బిందువుకే కదా. కేవలం బిందువును గుర్తు పెట్టుకోండి, చాలు, వేరే విస్తారములోకి వెళ్ళకండి, బిందువునైతే గుర్తు చేసుకోగలరు. బిందువుగా అవ్వండి, బిందువును గుర్తు చేసుకోండి మరియు బిందువు పెట్టండి, అంతే. ఇదే పురుషార్థము. కష్టమా? లేక సహజమా? ఎవరైతే సహజమని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సహజమైతే మరి బిందువు పెట్టవలసి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిందువు పెడతారా లేక ప్రశ్నార్థకాన్ని పెడతారా? ప్రశ్నార్థకాన్ని పెట్టకండి, బిందువు పెట్టండి. ప్రశ్నార్థకము ఎంత వంకరగా ఉంటుంది. చూడండి, ప్రశ్నార్థకము వ్రాయండి, ఎంత వంకరగా ఉంటుంది, కానీ బిందువు ఎంత సహజమైనది. మరి బిందువుగా అవ్వటము వస్తుందా? వస్తుందా? అందరూ తెలివైనవారు.

బాప్ దాదా విశేషముగా సేవలలోని ఉల్లాస-ఉత్సాహాలకు శుభాకాంక్షలనైతే ఇచ్చారు, చాలా బాగా చేస్తున్నారు, చేస్తూ ఉంటారు కానీ ఇక ముందు కొరకు ప్రతి సమయము, ప్రతి రోజు - నేను వరల్డ్ సర్వెంట్ ను (విశ్వ సేవాధారిని) అన్నది గుర్తుంచుకోండి. మీకు గుర్తుందా - బ్రహ్మాబాబా ఏమని సంతకము చేసేవారు? వరల్డ్ సర్వెంట్ (విశ్వ సేవాధారి). మరి విశ్వ సేవాధారులైతే, కేవలం శివరాత్రి సేవతో విశ్వ సేవ సమప్తమైపోదు. లక్ష్యము పెట్టుకోండి - నేను వరల్డ్ సర్వెంట్ ను (విశ్వ సేవాధారిని), మరి విశ్వ సేవను ప్రతి శ్వాసలో, ప్రతి సెకండు చెయ్యాలి. ఎవరు వచ్చినా, ఎవరితో సంపర్కములో ఉన్నా, వారికి దాతగా అయ్యి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. ఖాళీ చేతులతో ఎవ్వరూ వెళ్ళకూడదు. అఖండ భండారా ప్రతి సమయము తెరిచే ఉండాలి. తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరి పట్ల శుభ భావము మరియు శుభ భావన, ఇది తప్పకుండా ఇవ్వండి. శుభ భావముతో చూడండి, వినండి, సంబంధములోకి రండి మరియు శుభభావనతో ఆ ఆత్మకు సహయోగాన్ని ఇవ్వండి. ఇప్పుడు సర్వాత్మలకు మీ సహయోగము చాలా చాలా అవసరము. కనుక సహయోగాన్ని ఇవ్వండి మరియు సహయోగిగా తయారుచెయ్యండి. ఏదో ఒక సహయోగము, అది మనసుకు సంబంధించి అయినా, మాటల ద్వారానైనా ఏదైనా సహయోగాన్ని ఇవ్వండి, సంబంధ-సంపర్కాల ద్వారానైనా సహయోగాన్ని ఇవ్వండి, మరి ఈ శివరాత్రి జన్మోత్సవము యొక్క విశేష స్లోగన్ ను గుర్తు పెట్టుకోండి - ‘‘సహయోగాన్ని ఇవ్వండి మరియు సహయోగులుగా తయారుచెయ్యండి.’’ తక్కువలో తక్కువ ఎవరు సంపర్క-సంబంధములోకి వచ్చినా, వారికి సహయోగాన్ని ఇవ్వండి, సహయోగిగా తయారుచెయ్యండి. ఎవరో ఒకరు సంబంధములోకి వస్తూనే ఉంటారు, వారికి వేరే ఏ పాలనను ఇవ్వకపోయినా సరే, ప్రతి ఒక్కరికీ దిల్ ఖుష్ మిఠాయిని తప్పకుండా తినిపించండి. ఇక్కడ భండారాలో తయారుచేసే ఆ మిఠాయిలు కాదు. మనసును సంతోషపరచండి. మనసును సంతోషపరచటము అనగా దిల్ ఖుష్ మిఠాయిని తినిపించటము. తినిపిస్తారా! ఇందులో అయితే ఎటువంటి కష్టమూ ఉండదు. ఎక్స్ ట్రా సమయము ఇవ్వాల్సిన అవసరము లేదు, కష్టమూ లేదు. శుభ భావనతో దిల్ ఖుష్ మిఠాయిని తినిపించండి. అప్పుడు మీకు కూడా సంతోషము, వారికి కూడా సంతోషము, ఇంకేమి కావాలి. కనుక సంతోషముగా ఉంటారు మరియు సంతోషాన్ని ఇస్తారు, ఎప్పుడూ కూడా మీ అందరి ముఖాలు ఎక్కువ గంభీరముగా ఉండకూడదు. చాలా ఎక్కువ గంభీరముగా ఉండటము కూడా బాగా అనిపించదు. చిరునవ్వు అయితే ఉండాలి కదా. గంభీరముగా ఉండటము మంచిదే, కానీ టూ మచ్ గంభీరముగా ఉంటే అది, వీరు ఎక్కడ మాయమైపోయారో ఏంటో తెలియదు అన్నట్లు అనిపిస్తుంది. చూస్తూ ఉన్నారు కూడా కానీ మాయమై ఉన్నట్లు ఉన్నారు. మాట్లాడుతూ కూడా ఉన్నారు కానీ ఇక్కడ నుండి మాయమైపోయినట్లుగా మాట్లాడుతున్నారు. అందుకే ఆ ముఖము బాగుండదు. ముఖము ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. ముఖము సీరియస్ గా పెట్టుకోకండి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అనుకుంటే సీరియస్ అయిపోతారు. చాలా కష్టము, చాలా పని ఉంది... అని సీరియస్ అయిపోతారు, కానీ ఎంత ఎక్కువ పని ఉంటే అంత ఎక్కువ చిరునవ్వుతో ఉండండి. చిరునవ్వు నవ్వటము వస్తుంది కదా? వస్తుందా? మీ జడ చిత్రాలను చూడండి, ఎప్పుడైనా వాటిని అలా సీరియస్ గా చూపిస్తారా! ఒకవేళ సీరియస్ గా చూపిస్తే ఆర్టిస్ట్ బాగోలేరు అని అంటారు. అలాగే ఒకవేళ మీరు కూడా సీరియస్ గా ఉంటే, వీరికి జీవించే కళ రాదు అని అంటారు. అందుకే ఏం చేస్తారు? టీచర్లు ఏం చేస్తారు? అచ్ఛా, చాలామంది టీచర్లు ఉన్నారు, టీచర్లు, అభినందనలు. సేవకు అభినందనలు. అచ్ఛా.

ఒక్క క్షణములో మీ పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోగలరా? అదే దేవీ-దేవతల స్వరూపపు స్మృతిలో మిమ్మల్ని మీరు చూసుకోగలరా? ఏ దేవి అయినా, దేవత అయినా సరే అలా చూసుకోగలరా. నేను పూర్వజుడిని, సంగమయుగములో పూర్వజులు మరియు ద్వాపరము నుండి పూజ్యులు. సత్య, త్రేతా యుగాలలో రాజ్య అధికారులు. కనుక ఒక్క క్షణములో అందరూ ఇతర సంకల్పాలన్నింటినీ సమాప్తము చేసి తమ పూర్వజ మరియు పూజ్య స్వరూపములో స్థితులైపోండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న అలౌకిక దివ్య అవతరణ కల పిల్లలకు, బాబా యొక్క జన్మదినము మరియు పిల్లల జన్మదినము యొక్క ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు, మనోభిరాముడైన బాబా యొక్క మనసులో కుడి భుజాలైన సేవాధారి పిల్లలు సదా ఇమిడి ఉన్నారు. ఇటువంటి హృదయ సింహాసనాధికారి శ్రేష్ఠాత్మలకు, సదా బిందువు యొక్క మహత్వాన్ని తెలుసుకునే శ్రేష్ఠ బిందు స్వరూప పిల్లలకు, సదా తమ స్వమానములో స్థితులై ఉంటూ సర్వులకు ఆత్మిక గౌరవాన్ని ఇచ్చే స్వమానధారి ఆత్మలకు, సదా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతగా అయ్యి ప్రతి ఒక్కరికీ తమ అఖండ భండారా నుండి ఏదో ఒకటి ఇచ్చే మాస్టర్ దాతలైన పిల్లలకు బాప్ దాదా యొక్క చాలా-చాలా, పదమాల రెట్ల, కోహినూరు వజ్రము కంటే కూడా విలువైన ప్రభు రత్నాలైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
ప్రతి శక్తిని ఆర్డర్ అనుసారముగా నడిపించే మాస్టర్ రచయిత భవ

కర్మ ప్రారంభించే ముందు ఎటువంటి కర్మనో, అటువంటి శక్తిని ఆహ్వానించండి. యజమానిగా అయి ఆర్డర్ చేయండి ఎందుకంటే ఈ సర్వ శక్తులు మీ భుజాల వంటివి, మీ భుజాలు మీ ఆర్డర్ లేకుండా ఏమీ చేయలేవు. ‘సహన శక్తి, కార్యాన్ని సఫలము చేయు’ అని ఆర్డర్ చేయండి, అప్పుడు సఫలత తప్పకుండా ఎలా లభించే ఉందో చూడండి. కానీ ఆర్డర్ చేయడానికి బదులుగా - చేయగలుగుతానా లేదా అని భయపడతారు. ఈ విధమైన భయము ఉన్నట్లయితే ఆర్డర్ నడవదు, అందుకే మాస్టర్ రచయితగా అయి ప్రతి శక్తిని ఆర్డర్ అనుసారముగా నడిపించేందుకు నిర్భయులుగా అవ్వండి.

స్లోగన్:-
ఆధారదాత అయిన బాబాను ప్రత్యక్షము చేసి అందరినీ తీరానికి చేర్చండి.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ఏ విధంగా ఎవరైనా ఆవిష్కరణ చేసేవారు, ఏదైనా ఆవిష్కరణను కొనుగొనేందుకు ఏకాంతములో ఉంటారు. అలా ఇక్కడ ఏకాంతము అనగా ఒక్కరి అంతములో మైమరచిపోవడము, బయటి ఆకర్షణల నుండి ఏకాంతము కావాలి. కేవలం గదిలో కూర్చుని ఉండే ఏకాంతము కావాలని కాదు, కానీ మనసు ఏకాంతములో ఉండాలి. మనసు యొక్క ఏకాగ్రత అనగా ఒక్కరి స్మృతిలో ఉండటము, ఏకాగ్రము అవ్వటము, ఇదే ఏకాంతము.