23-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
02.11.2004
‘‘స్వ-ఉపకారులుగా అయ్యి అపకారులకు కూడా ఉపకారము
చెయ్యండి, సర్వ శక్తులు, సర్వ గుణాలతో సంపన్నమైన సమ్మాన దాతలుగా
అవ్వండి’’
ఈ రోజు స్నేహ సాగరుడు తమ నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలను
చూసి హర్షిస్తున్నారు. సాకార రూపములో సమ్ముఖముగా ఉన్నా లేక
స్థూల రూపములో దూరముగా కూర్చుని ఉన్నా కానీ స్నేహము, అందరికీ
బాబా వద్ద కూర్చుని ఉన్నాము అని అనుభవము చేయిస్తూ ఉంది. పిల్లలు
ప్రతి ఒక్కరి స్నేహము బాబాను సమీపముగా అనుభవము చేయిస్తుంది.
పిల్లలైన మీరందరూ కూడా బాబా స్నేహములో సమ్ముఖముగా చేరుకున్నారు.
బాప్ దాదా చూసారు, పిల్లలు ప్రతి ఒక్కరి హృదయములో బాప్ దాదా
స్నేహము ఇమిడి ఉంది. ప్రతి ఒక్కరి హృదయములో ‘‘మేరా బాబా’’ (నా
బాబా) అన్న ఈ స్నేహపు పాటే మ్రోగుతూ ఉంది. స్నేహమే ఈ దేహము
మరియు దేహ సంబంధాల నుండి అతీతముగా చేస్తూ ఉంది. స్నేహమే
మాయాజీతులుగా చేస్తూ ఉంది. ఎక్కడైతే హృదయపూర్వకమైన స్నేహము ఉందో
అక్కడ మాయ దూరము నుండే పారిపోతుంది. స్నేహమనే సబ్జెక్టులో
పిల్లలందరూ పాస్ అయ్యారు. ఒకటేమో స్నేహము, మరొకటి
సర్వశక్తివంతుడైన బాబా ద్వారా సర్వశక్తుల ఖజానా.
ఈ రోజు బాప్ దాదా ఒకవైపేమో స్నేహాన్ని చూస్తున్నారు,
మరొకవైపు శక్తి సైన్యము యొక్క శక్తులను చూస్తున్నారు. ఎంతగానైతే
స్నేహము ఇమిడి ఉందో అంతగానే సర్వశక్తులు కూడా ఇమిడి ఉన్నాయా?
బాప్ దాదా పిల్లలందరికీ సర్వ శక్తులను ఒకేలా ఇచ్చారు, మాస్టర్
సర్వశక్తివంతులుగా తయారుచేసారు. కొందరిని సర్వశక్తివంతులుగా,
కొందరిని శక్తివంతులుగా తయారుచేయలేదు. ఇప్పుడు మీరందరూ కూడా మీ
స్వమానము మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు. కావున బాప్ దాదా
నలువైపులా ఉన్న పిల్లలను అడుగుతున్నారు - ప్రతి ఒక్కరూ స్వయములో
సర్వ శక్తులను అనుభవము చేస్తున్నారా? సదా సర్వ శక్తులపై
అధికారము ఉందా? సర్వ శక్తులు బాప్ దాదా ఇచ్చిన వారసత్వము, మరి
మీ వారసత్వముపై అధికారము ఉందా? ఉందా అధికారము? టీచర్లు చెప్పండి,
అధికారము ఉందా? ఆలోచించి చెప్పండి. పాండవులూ, అధికారము ఉందా?
సదా ఉందా లేక అప్పుడప్పుడు ఉందా? ఏ సమయములో ఏ శక్తి అవసరమో, ఆ
శక్తి శక్తి సైన్యమైన మీ ఆర్డర్ తో హాజరవుతుందా? సమయానికి జీ
హజూర్ హాజిర్ (చిత్తం ప్రభు) అని అంటుందా? ఆలోచించండి, చూడండి,
అధికారి ఆర్డర్ చెయ్యాలి మరియు శక్తి జీ హజూర్ హాజిర్ (చిత్తం
ప్రభు) అని అనాలి, ఏ శక్తినైనా ఆహ్వానించండి, ఎటువంటి సమయమో,
ఎటువంటి పరిస్థితియో అటువంటి శక్తిని కార్యములో ఉపయోగించగలగాలి.
అటువంటి అధికారీ ఆత్మలుగా అయ్యారా? ఎందుకంటే బాబా వారసత్వాన్ని
ఇచ్చారు మరియు ఆ వారసత్వాన్ని మీరు మీదిగా చేసుకున్నారు, మీదిగా
చేసుకున్నారు కదా! కావున మీది అన్నదానిపై అధికారము ఉంటుంది. ఏ
సమయములో ఏ విధితో అవసరమో ఆ సమయములో దానిని కార్యములో
ఉపయోగించాలి. ఉదాహరణకు మీకు ఇముడ్చుకునే శక్తి యొక్క అవసరము
ఉందనుకోండి మరియు ఇముడ్చుకునే శక్తిని ఆర్డర్ చేసారనుకోండి,
అప్పుడు అది మీ ఆర్డర్ ను గౌరవించి చిత్తం ప్రభు అని అంటూ
అవుతుందా? అలా అవుతుందంటే తల ఊపండి, చేతులు ఊపండి. అప్పుడప్పుడూ
అవుతుందా లేక సదా అవుతుందా? ఇముడ్చుకునే శక్తి హాజరవుతుంది కానీ
10 సార్లు ఇముడ్చుకున్నారు కానీ 11వ సారి కాస్త కింద-మీద
అవుతుందా? సదా మరియు సహజముగా హాజరవ్వాలి, సమయము గడిచిపోయిన
తర్వాత రావడం కాదు. చెయ్యటమైతే ఇది చెయ్యాలనుకున్నాము కానీ అలా
అయిపోయింది, ఇలా ఉండకూడదు. వారిని సర్వ శక్తులకు అధికారి అని
అంటారు. ఈ అధికారాన్ని బాప్ దాదా అయితే అందరికీ ఇచ్చారు, కానీ
సదా అధికారులుగా అవ్వటములో నంబరువారుగా అవుతున్నారు అన్నది
చూడటం జరిగింది. సదా మరియు సహజముగా ఉండాలి, నేచురల్ గా ఉండాలి,
నేచర్ గా ఉండాలి, దానికి విధి ఏమిటంటే - ఏ విధంగా బాబాను హజూర్
(ప్రభువు, స్వామి) అని కూడా అంటారు, హజూర్ హాజిర్ (ప్రభు హాజరై
ఉన్నారు) అని అంటారు, అలాగే హాజిర్ హజూర్ (చిత్తం ప్రభు) అని
అంటారు. కావున ఏ పిల్లలైతే ఆ ప్రభు ఇచ్చే ప్రతి శ్రీమతముపై
చిత్తం ప్రభు అని అంటూ నడుస్తారో వారి ఎదురుగా సర్వశక్తులు కూడా
చిత్తం ప్రభు అని అంటాయి. ప్రతి ఆజ్ఞలో చిత్తం ప్రభు, ప్రతి
అడుగులో చిత్తం ప్రభు. ఒకవేళ ప్రతి శ్రీమతములో చిత్తం ప్రభు అని
అనకపోతే ప్రతి శక్తి కూడా ప్రతి సమయము చిత్తం ప్రభు అని అనలేదు.
ఒకవేళ అప్పుడప్పుడు బాబా శ్రీమతాన్ని లేక ఆజ్ఞను పాలన చేస్తే,
ఇక శక్తులు కూడా మీ ఆజ్ఞకు అప్పుడప్పుడు చిత్తం ప్రభు అని అంటూ
పాలన చేస్తాయి. ఆ సమయములో అధికారులకు బదులుగా ఆధీనులుగా
అయిపోతారు. కావున బాప్ దాదా ఈ రిజల్టు చెక్ చేసారు, అప్పుడు ఏం
చూసారు? నంబరువారుగా ఉన్నారు అన్నది చూసారు. అందరూ నంబర్ వన్
గా లేరు, నంబరువారుగా ఉన్నారు మరియు సదా సహజముగా లేరు.
అప్పుడప్పుడు సహజమవుతుంది, అప్పుడప్పుడు కొద్దిగా కష్టము మీద
శక్తి ఇమర్జ్ అవుతుంది.
బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ బాబా సమానముగా
చూడాలనుకుంటారు, నంబరువారుగా చూడాలనుకోరు మరియు మీ అందరి
లక్ష్యము కూడా బాబా సమానముగా అవ్వడము. సమానముగా అవ్వాలన్న
లక్ష్యము ఉందా లేక నంబరువారుగా అవ్వాలన్న లక్ష్యము ఉందా? ఒకవేళ
అడిగితే అందరూ సమానముగా అవ్వాలి అనే అంటారు. కావున చెక్
చేసుకోండి - ఒకటేమో సర్వ శక్తులు ఉన్నాయా? సర్వ అన్నదానిపై
అండర్ లైన్ చెయ్యండి. సర్వ గుణాలు ఉన్నాయా? బాబా సమానమైన స్థితి
ఉందా? ఒక్కోసారి స్వయం యొక్క స్థితి ఉంటూ ఒక్కోసారి పర-స్థితి
విజయాన్ని పొందటం లేదు కదా? పర-స్థితి ఒకవేళ విజయాన్ని
పొందినట్లయితే మరి దానికి కారణమేమిటో తెలుసు కదా? స్థితి
బలహీనముగా ఉన్నప్పుడు పర-స్థితి దాడి చెయ్యగలదు. సదా స్వ స్థితి
విజయీగా ఉండాలి, దానికి సాధనము - సదా స్వమానము మరియు సమ్మానము
(గౌరవము) యొక్క బ్యాలెన్స్. స్వమానధారి ఆత్మ స్వతహాగానే
గౌరవాన్ని ఇచ్చే దాతగా ఉంటారు. వాస్తవానికి ఎవరికైనా గౌరవాన్ని
ఇవ్వటము అంటే అది ఇవ్వటము కాదు, గౌరవాన్ని ఇవ్వటము అనగా
గౌరవాన్ని తీసుకోవటము. గౌరవాన్ని ఇచ్చేవారు అందరి మనసులలో
స్వతహాగానే గౌరవనీయులుగా అవుతారు. బ్రహ్మాబాబాను చూసారు - వారు
ఆదిదేవ్ అయినప్పటికీ, డ్రామాలో మొదటి ఆత్మ అయినప్పటికీ సదా
పిల్లలకు గౌరవాన్ని ఇచ్చారు. తనకంటే కూడా ఎక్కువగా ఇతరాత్మల
ద్వారా పిల్లలకు గౌరవాన్ని ఇప్పించారు, అందుకే పిల్లలు ప్రతి
ఒక్కరి హృదయములో బ్రహ్మాబాబా గౌరవనీయులుగా అయ్యారు. మరి
గౌరవాన్ని ఇచ్చారా లేక గౌరవాన్ని తీసుకున్నారా? గౌరవాన్ని
ఇవ్వటము అనగా అర్థము ఇతరుల హృదయాలలో హృదయపూర్వకమైన స్నేహమనే
బీజాన్ని నాటడము. విశ్వము ముందు కూడా - మీరు విశ్వ కళ్యాణకారీ
ఆత్మగా ఎప్పుడు అనుభవము అవుతారంటే ఎప్పుడైతే ఆత్మలకు స్నేహముతో
గౌరవాన్ని ఇస్తారో అప్పుడు.
బాప్ దాదా వర్తమాన సమయములో ఒకరికొకరు గౌరవాన్ని ఇవ్వవలసిన
అవసరము చూసారు. గౌరవాన్ని ఇచ్చేవారే విధాత ఆత్మగా కనిపిస్తారు.
గౌరవాన్ని ఇచ్చేవారే బాప్ దాదా యొక్క శ్రీమతమైన శుభ భావనను,
శుభ కామనను పాటించే ఆజ్ఞాకారీ పిల్లలు. గౌరవాన్ని ఇవ్వటమే
ఈశ్వరీయ పరివారము యొక్క హృదయపూర్వకమైన ప్రేమ. గౌరవాన్ని
ఇచ్చేవారు స్వమానములో సహజముగానే స్థితులవ్వగలరు. ఎందుకని? ఏ
ఆత్మలకైతే గౌరవాన్ని ఇస్తారో ఆ ఆత్మల ద్వారా ఏవైతే
హృదయపూర్వకముగా ఆశీర్వాదాలు లభిస్తాయో, ఆ ఆశీర్వాదాల భండారము
స్వమానాన్ని సహజముగా మరియు స్వతహాగా గుర్తు తెప్పిస్తుంది,
అందుకే బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలకు విశేషముగా అండర్ లైన్
చేయిస్తున్నారు - సమ్మాన దాతలుగా అవ్వండి (గౌరవాన్ని ఇచ్చే
దాతలుగా అవ్వండి).
బాప్ దాదా వద్దకు ఏ పిల్లలు ఎలా వచ్చినా కానీ, బలహీనముగా
వచ్చినా, సంస్కారాలకు వశమై వచ్చినా, పాపాల భారాన్ని తీసుకుని
వచ్చినా, కఠినమైన సంస్కారాలను తీసుకుని వచ్చినా, బాప్ దాదా
ప్రతి బిడ్డను ఏ దృష్టితో చూసారు! నా చాలా కాలం తర్వాత కలిసిన
బిడ్డ, ప్రియమైన బిడ్డ, ఈశ్వరీయ పరివారములోని బిడ్డ. అలా బాబా
గౌరవాన్ని ఇచ్చారు మరియు మీరు స్వమానధారులుగా అయ్యారు. అలా ఫాలో
ఫాదర్ చేయండి. ఒకవేళ సహజముగా సర్వ గుణ సంపన్నులుగా
అవ్వాలనుకుంటే సమ్మాన దాతలుగా అవ్వండి (గౌరవాన్ని ఇచ్చే దాతలుగా
అవ్వండి). అర్థమైందా! సహజమే కదా? సహజమా లేక కష్టమా? టీచర్లు
ఏమని భావిస్తారు, సహజమేనా? కొందరిని గౌరవించటము సహజము, కొందరిని
గౌరవించటము కష్టమా లేక అందరినీ గౌరవించటము సహజమేనా? మీ టైటిల్
- సర్వుల ఉపకారి. అపకారము చేసేవారికి కూడా ఉపకారము చేసేవారు.
కావున చెక్ చేసుకోండి - సర్వులపై ఉపకారి దృష్టి, వృత్తి, స్మృతి
ఉంటున్నాయా? ఇతరులకు ఉపకారము చెయ్యటము అనగా స్వయానికే ఉపకారము
చేసుకోవటము. మరి ఏం చెయ్యాలి? గౌరవాన్ని ఇవ్వాలి కదా! అప్పుడు
వేర్వేరు విషయాలను ధారణ చెయ్యటములో ఏదైతే కష్టపడతారో, దాని
నుండి విముక్తులైపోతారు ఎందుకంటే బాప్ దాదా చూస్తున్నారు, సమయము
యొక్క వేగము తీవ్రమవుతూ ఉంది, సమయము ఎదురుచూస్తూ ఉంది కావున
మీరందరూ ఏర్పాట్లు చేసుకోవాలి. సమయము కోసం ఎదురుచూడటాన్ని
సమాప్తము చెయ్యాలి. ఏ ఏర్పాట్లు చేసుకోవాలి? మీ సంపూర్ణత మరియు
సమానత యొక్క వేగాన్ని తీవ్రము చేసుకోవాలి. చేసుకుంటూ ఉన్నాము
అని అనవద్దు, తీవ్రగతిని చెక్ చేసుకోండి - తీవ్రగతి ఉందా?
ఇకపోతే స్నేహముతో కొత్త-కొత్త పిల్లలు కూడా చేరుకున్నారు,
బాప్ దాదా కొత్త-కొత్త పిల్లలను చూసి సంతోషిస్తారు. ఎవరైతే
మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. బాబా
ఇంటికి విచ్చేసారు, మీ ఇంటికి విచ్చేసారు, మంచిది, అభినందనలు.
అచ్ఛా!
సేవా టర్న్ కర్నాటకది:-
కర్నాటక వారు లేచి నిలబడండి. సేవ యొక్క సువర్ణావకాశానికి
అభినందనలు. చూడండి, మొదటి నంబరు టర్ను తీసుకున్నారు కావున మొదటి
నంబరువారిగానే ఉండాలి కదా! పురుషార్థములో, విజయులుగా అవ్వటములో,
అన్నింటిలోనూ మొదటి నంబరు తీసుకునేవారు. రెండవ నంబరు
తీసుకోకూడదు, మొదటి నంబరు తీసుకోవాలి. మరి ఉందా ధైర్యము!
ధైర్యము ఉందా? ధైర్యము మీది మరియు వెయ్యి రెట్లు సహాయము బాబాది.
మంచి అవకాశాన్ని తీసుకున్నారు. మీ పుణ్య ఖాతాను చాలా-చాలా జమ
చేసుకున్నారు. అచ్ఛా, కర్నాటక వారు మెగా ప్రోగ్రామ్ చేసారా?
చెయ్యలేదా, ఎందుకని? ఎందుకు చెయ్యలేదు? కర్నాటక అన్నింటిలోనూ
మొదటి నంబరు తీసుకోవాలి. (బెంగుళూరులో చేస్తాము) అచ్ఛా,
ఎవరెవరైతే పెద్ద ప్రోగ్రాములు చేసారో వారు లేచి నిలబడండి. ఎన్ని
ప్రోగ్రాములు జరిగాయి? (8-10 జరిగాయి). కావున బాప్ దాదా పెద్ద
ప్రోగ్రాములకు పెద్ద అభినందనలు ఇస్తున్నారు. జోన్లు ఎన్ని
ఉన్నాయి! ప్రతి జోన్ వారు పెద్ద ప్రోగ్రామ్ చెయ్యాలి ఎందుకంటే
అలా చేస్తే మీ పట్టణములో ఫిర్యాదులు చేసేవారు ఫిర్యాదు
చెయ్యకుండా ఉంటారు. పెద్ద ప్రోగ్రామ్ లో మీరు అడ్వర్టైజ్మెంట్
కూడా పెద్దగానే చేస్తారు కదా, మీడియా ద్వారా కావచ్చు, పోస్టర్ల
ద్వారా కావచ్చు, హోర్డింగ్లు మొదలైన రకరకాల సాధనాల ద్వారా
చేస్తారు కనుక ఫిర్యాదులు తగ్గుతాయి. బాప్ దాదాకు ఈ సేవ అంటే
ఇష్టము కానీ... కానీ అనేది ఉంది. ప్రోగ్రాములైతే పెద్ద పెద్దవి
చేసారు, అందుకు అభినందనలు, కానీ ప్రతి ప్రోగ్రామ్ నుండి
తక్కువలో తక్కువ 108 మాల అయితే తయారవ్వాలి. అది ఎక్కడ తయారైంది?
తక్కువలో తక్కువ 108, ఎక్కువలో ఎక్కువ 16000. కానీ ఇంతగా ఏదైతే
శక్తిని వెచ్చించారో, సంపత్తిని వెచ్చించారో, దానికి రిజల్టుగా
తక్కువలో తక్కువ 108 మందైతే తయారవ్వాలి. అందరి అడ్రస్ లు మీ
వద్ద ఉండాలి. పెద్ద ప్రోగ్రాములకు తీసుకునివచ్చేవారు ఎవరైతే
ఉంటారో, వాళ్ళ వద్దనైతే ఆ వచ్చినవారి పరిచయము ఉంటుంది కదా,
కావున వాళ్ళను మళ్ళీ సమీపముగా తీసుకురావాలి. అంతేకానీ మేమైతే
చేసేసాము కదా అని కాదు. ఏ కార్యమునైతే చేస్తారో, దానికి ఫలమైతే
వెలువడాలి కదా. కనుక పెద్ద ప్రోగ్రాములు చేసే ప్రతి ఒక్కరూ ఈ
రిజల్టును బాప్ దాదాకు ఇవ్వాలి. వాళ్ళు వేరే-వేరే సెంటర్లకు
వెళ్ళినా కానీ, ఏ పట్టణానికి చెందినవారు అక్కడికి వెళ్ళినా కానీ,
రిజల్టు అయితే వెలువడాలి. సరేనా, వీలవుతుంది కదా! కాస్త
అటెన్షన్ పెట్టినట్లయితే వెలువడుతారు, 108 అసలు ఏమీ కాదు. కానీ
రిజల్టును బాప్ దాదా చూడాలనుకుంటారు, కనీసం స్టూడెంట్స్ గా
అయినా తయారవ్వాలి, సహయోగములో ముందుకు రావాలి, ఎవరెవరు ఎంతమందిని
వెలువడేలా చేస్తారు, అది బాప్ దాదా ఈ సీజన్ లో రిజల్టును
చూడాలనుకుంటున్నారు. సరేనా? పాండవులూ సరేనా? మరి నంబరువన్ ఎవరు
అనేది చూద్దాము? ఎంతమందినైనా వెలువడేలా చేయండి, కానీ తప్పకుండా
చేయండి. ఏమవుతుందంటే, ప్రోగ్రామ్ అయిపోతుంది కానీ మున్ముందు
వారితో సంపర్కములో ఉండటములో కాస్త అటెన్షన్ తక్కువైపోతుంది.
అంతేకాక వారిని వెలికితీయటము అనేది పెద్ద కష్టమేమీ కాదు. బాప్
దాదా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. అర్థమైందా.
అచ్ఛా!
అచ్ఛా - ఇప్పుడు అందరూ ఒక్క సెకండులో, ఒక్క సెకండులో ఒక్క
నిమిషము కాదు, ఒక్క సెకండులో ‘‘నేను ఫరిశ్తా సో దేవతను’’ - ఈ
మనసా డ్రిల్ ను సెకండులో అనుభవము చెయ్యండి. ఇటువంటి డ్రిల్ ను
రోజంతటిలో ఒక్క సెకండులో పదే-పదే చెయ్యండి. ఏ విధంగా శారీరక
డ్రిల్ శరీరాన్ని శక్తిశాలిగా తయారుచేస్తుందో, అలా ఈ మనసు
యొక్క డ్రిల్ మనసును శక్తిశాలిగా తయారుచేస్తుంది. నేను
ఫరిశ్తాను, ఈ పాత ప్రపంచము, పాత దేహము, పాత దేహము యొక్క
సంస్కారాల నుండి అతీతమైన ఫరిశ్తా ఆత్మను. అచ్ఛా!
నలువైపులా ఉన్న అతి స్నేహీ, సదా స్నేహ సాగరములో లవలీనమై ఉన్న
ఆత్మలు, సదా సర్వశక్తులకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలు, సదా బాబా
సమానముగా తయారయ్యే బాబాకు ప్రియమైన ఆత్మలు, సదా స్వమానములో ఉంటూ
ప్రతి ఆత్మకు గౌరవాన్ని ఇచ్చేవారు, సర్వులకు గౌరవనీయులుగా అయ్యే
ఆత్మలు, సదా సర్వులకు ఉపకారీ ఆత్మలు, బాప్ దాదా యొక్క
హృదయపూర్వకమైన ప్రియస్మృతులను మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను
స్వీకరించండి. అలాగే విశ్వానికి యజమానులైన ఆత్మలకు నమస్తే.
దాదీజీతో:-
గౌరవము ఇవ్వటములో నంబరు వన్ లో పాస్ అయ్యారు. మంచిది, దాదీలందరి
వలన మధుబన్ కు శోభ మరియు ప్రకాశము వచ్చింది. (సభతో) వీరందరికీ
దాదీల శోభ మరియు ప్రకాశము మంచిగా అనిపిస్తుంది కదా. ఎలాగైతే
దాదీల శోభ మరియు ప్రకాశముతో మధుబన్ శోభనీయముగా, ప్రకాశవంతముగా
అవుతుందో, అలా మీరందరూ దాదీలు కాదు కానీ దీదీలు మరియు దాదాలు.
కావున అందరు దీదీలు మరియు అందరు దాదాలు, మీరందరూ ఇది ఆలోచించాలి,
చెయ్యాలి, మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆ శోభ మరియు ప్రకాశము ఉండాలి.
ఏ విధంగా దాదీల వలన శోభ మరియు ప్రకాశము ఉంటుందో, అలా ప్రతి
స్థానములోనూ ఆ శోభ మరియు ప్రకాశము ఉండాలి ఎందుకంటే దాదీల వెనుక
మీరు దీదీలు కదా, తక్కువేమీ కాదు. దాదాలు కూడా ఉన్నారు, దీదీలు
కూడా ఉన్నారు. కావున ఏ సెంటరులోనూ నిస్సారముగా ఉండకూడదు, శోభ
మరియు ప్రకాశము ఉండాలి. మీరు ప్రతి ఒక్కరూ విశ్వములో శోభను
మరియు ప్రకాశాన్ని తీసుకువచ్చే ఆత్మలు. కనుక ఏ స్థానములో ఉన్నా
సరే అది శోభనీయమైన, ప్రకాశవంతమైన స్థానముగా కనిపించాలి. సరే కదా?
ఎందుకంటే ప్రపంచములో హద్దు శోభ మరియు ప్రకాశము ఉంది మరియు
మీలోని ప్రతి ఒక్కరి నుండి అనంతమైన శోభ మరియు ప్రకాశము ఉంటుంది.
స్వయం సంతోషము, శాంతి మరియు అతీంద్రియ సుఖముతో కూడిన శోభ మరియు
ప్రకాశములో ఉన్నట్లయితే స్థానము కూడా శోభ మరియు ప్రకాశములోకి
వచ్చేస్తుంది ఎందుకంటే స్థితితో స్థానములో వాయుమండలము
వ్యాపిస్తుంది. కావున అందరూ చెక్ చేసుకోవాలి - ఎక్కడైతే మేము
ఉంటామో, అక్కడ ఆ శోభ మరియు ప్రకాశము ఉందా? ఉదాసీనత అయితే లేదు
కదా? అందరూ సంతోషములో నాట్యము చేస్తున్నారా? అలాగే ఉన్నారు కదా!
దాదీలైన మీకైతే ఇదే పని కదా! దీదీలను మరియు దాదాలను ఫాలో చేయండి.
అచ్ఛా!
అన్నివైపుల నుండి స్నేహీ పిల్లలు ఎవరైతే బాప్ దాదాను
హృదయపూర్వకముగా స్మృతి చేస్తున్నారో లేదా ఉత్తరాలు, ఈ-మెయిల్స్
ద్వారా స్మృతులను పంపించారో, నలువైపులా ఉన్న ఆ పిల్లలను బాప్
దాదా దూరముగా ఉన్నట్లుగా చూడటం లేదు, హృదయ సింహాసనముపై
చూస్తున్నారు. అన్నింటికంటే సమీపముగా ఉన్నది హృదయము. కావున బాప్
దాదా హృదయపూర్వకముగా స్మృతులను పంపినవారిని మరియు స్మృతులను
పంపకపోయినా కానీ స్మృతిలోనే ఉన్నవారిని, వారందరినీ కూడా హృదయ
సింహాసనాధికారులుగా చూస్తున్నారు. బదులు ఇస్తున్నారు. దూరముగా
కూర్చుని ఉన్నా కానీ నంబరు వన్ తీవ్ర పురుషార్థీ భవ.
వరదానము:-
నిర్లక్ష్యము అనే నిద్రను త్యజించే
నిద్రాజీత్, చక్రవర్తి భవ
సాక్షాత్కారమూర్తులుగా అయి భక్తులకు
సాక్షాత్కారము చేయించేందుకు మరియు చక్రవర్తిగా అయ్యేందుకు
నిద్రాజీతులుగా అవ్వండి. ఎప్పుడైతే వినాశ కాలాన్ని మర్చిపోతారో,
అప్పుడు నిర్లక్ష్యము అనే నిద్ర వస్తుంది. భక్తుల పిలుపును
వినండి, దుఃఖిత ఆత్మల దుఃఖపు పిలుపును వినండి, దాహముతో ఉన్న
ఆత్మల ప్రార్థనను వినండి, అప్పుడిక ఎప్పుడూ నిర్లక్ష్యము అనే
నిద్ర రాదు. కావున ఇప్పుడు సదా వెలుగుతూ ఉన్న జ్యోతిగా అయ్యి
నిర్లక్ష్యపు నిద్రను త్యజించండి మరియు సాక్షాత్కార మూర్తులుగా
అవ్వండి.
స్లోగన్:-
తనువు-మనసు-ధనము, మనసు-వాణి-కర్మ - ఏ విధంగానైనా బాబా
కర్తవ్యములో సహయోగులుగా అయినట్లయితే సహజయోగులుగా అవుతారు.
అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని)
అలవరచుకోండి
తండ్రిని ‘‘గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము)’’ అని అంటారు,
సత్యతయే తండ్రికి ప్రియము. సత్యమైన హృదయముపై స్వామి రాజీ
అవుతారు. కావున హృదయ సింహాసనాధికారులైన సేవాధారీ పిల్లల యొక్క
సంబంధ-సంపర్కములో, ప్రతి సంకల్పములో మరియు మాటలో సత్యత మరియు
స్వచ్ఛత కనిపిస్తాయి. వారి ప్రతి సంకల్పము, ప్రతి మాట సత్యముగా
ఉంటాయి.
|
|
|