23-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు సమయానికి తమ ఇంటికి తిరిగివెళ్ళాలి, అందుకే స్మృతి వేగాన్ని పెంచండి, ఈ దుఃఖధామాన్ని మరచి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి’’

ప్రశ్న:-
ఏ ఒక్క గుహ్యమైన రహస్యాన్ని మీరు మనుష్యులకు వినిపించినట్లయితే వారి బుద్ధిలో అలజడి మొదలవుతుంది?

జవాబు:-
వారికి గుహ్యమైన రహస్యాన్ని వినిపించండి, అదేమిటంటే - ఆత్మ ఇంత చిన్నని బిందువు, అందులో సదాకాలపు పాత్ర నిండి ఉంది, అది పాత్రను అభినయిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ అలసిపోదు. మోక్షము ఎవ్వరికీ లభించదు. మనుష్యులు ఎంతో దుఃఖాన్ని చూసి, మోక్షం లభిస్తే మంచిది అని భావిస్తారు, కానీ అవినాశీ ఆత్మ పాత్రను అభినయించకుండా ఉండలేదు. ఈ విషయాన్ని విని వారి లోపల అలజడి మొదలవుతుంది.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు, ఇక్కడ ఉన్నది ఆత్మిక పిల్లలు. తండ్రి ప్రతిరోజూ అర్థం చేయిస్తారు - ఈ ప్రపంచంలో పేదవారికి ఎంతటి దుఃఖము ఉంది, ఈ వరదలు మొదలైనవి వచ్చినప్పుడు పేదవారికి దుఃఖము కలుగుతుంది, వారి సామానులకు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దుఃఖమైతే కలుగుతుంది కదా! అపారమైన దుఃఖాలు ఉన్నాయి. షావుకార్లకు సుఖము ఉంది కానీ అది కూడా అల్పకాలికమైనదే. షావుకార్లు కూడా రోగగ్రస్థులుగా అవుతారు, మరణాలు కూడా చాలా జరుగుతాయి - ఈరోజు ఫలానావారు మరణించారు, ఈ రోజు ఇది జరిగింది... ఈరోజు ప్రెసిడెంట్ గా ఉంటారు, రేపు గద్దెను వదలాల్సి వస్తుంది. అందరూ చుట్టుముట్టి వారిని దింపేస్తారు. దీని వలన కూడా దుఃఖము కలుగుతుంది. బాబా అన్నారు - ఈ దుఃఖధామములో ఏయే రకాల దుఃఖాలు ఉన్నాయి, దుఃఖాల లిస్టును తయారుచేయండి. పిల్లలైన మీకు సుఖధామం గురించి కూడా తెలుసు, ప్రపంచానికేమీ తెలియదు. దుఃఖధామాన్ని, సుఖధామాన్ని వారు పోల్చలేరు. తండ్రి అంటారు - మీకు అన్నీ తెలుసు, వీరు తప్పకుండా నిజమే చెప్తున్నారు అని కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ ఎవరికైతే పెద్ద-పెద్ద ఇళ్ళు ఉన్నాయో, విమానాలు మొదలైనవి ఉన్నాయో వారు - ఈ కలియుగము ఇంకా 40,000 సంవత్సరాలు కొనసాగనున్నది, ఆ తర్వాత సత్యయుగము వస్తుంది అని భావిస్తారు. ఘోర అంధకారంలో ఉన్నారు కదా. ఇప్పుడు వారిని సమీపంగా తీసుకురావాలి. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. వారు లక్షల సంవత్సరాలు అని చెప్పడం ఎక్కడ, మీరు 5000 సంవత్సరాలు అన్నది నిరూపించడం ఎక్కడ. ఈ 5 వేల సంవత్సరాల తర్వాత చక్రము రిపీట్ అవుతుంది. డ్రామా ఏమైనా లక్షల సంవత్సరాలు ఉంటుందా. ఏదైతే జరుగుతుందో, అదంతా 5000 సంవత్సరాలలోనే జరుగుతుందని మీరు అర్థం చేసుకున్నారు. కావున ఇక్కడ దుఃఖధామములో వ్యాధులు మొదలైనవన్నీ ఉంటాయి. మీరు ముఖ్యమైన కొన్ని విషయాలను వ్రాయండి. స్వర్గములో దుఃఖము అన్న మాట కూడా ఉండదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు - మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, ఇది ఆ గీతా అధ్యాయమే కొనసాగుతుంది. తప్పకుండా సంగమయుగములోనే సత్యయుగ స్థాపన జరుగుతుంది. తండ్రి అంటారు - నేను రాజులకే రాజులుగా తయారుచేస్తాను, మరి తప్పకుండా సత్యయుగానికి చెందినవారిగానే చేస్తారు కదా. బాబా మంచి రీతిలో అర్థం చేయిస్తారు.

ఇప్పుడు మనం సుఖధామములోకి వెళ్తాము. తండ్రి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే నిరంతరమూ స్మృతి చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు, దాని కొరకు బాబా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. స్మృతి వేగాన్ని పెంచండి. కుంభమేళాకి కూడా సమయానికి వెళ్ళవలసి ఉంటుంది. మీరు కూడా సమయానికి వెళ్ళాలి. అంతేకానీ త్వరత్వరగా వెళ్తారు అని కాదు. అలా కాదు, ఈ విధంగా త్వరత్వరగా చేయడం మన చేతుల్లో లేదు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. మహిమ అంతా డ్రామాదే. ఇక్కడ జీవజంతువులు మొదలైనవి ఎన్ని ఉన్నాయి. సత్యయుగములో అవి ఉండవు. అక్కడ ఇవి-ఇవి ఉంటాయి అని లోలోపల ఆలోచించాలి. సత్యయుగమైతే గుర్తుకొస్తుంది కదా. సత్యయుగ స్థాపనను తండ్రి చేస్తారు. చివరిలో జ్ఞానమంతా సారములో బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఉదాహరణకు బీజం ఎంత చిన్నగా ఉంటుంది, వృక్షం ఎంత పెద్దగా ఉంటుంది. అవి జడమైనవి, ఇవి చైతన్యమైనవి. దీని గురించి ఎవ్వరికీ తెలియదు, కల్పము యొక్క ఆయుష్షును ఎంత పెద్దగా చేసేసారు. భారత్ యే ఎంతో సుఖాన్ని పొందుతుంది, అలాగే దుఃఖము కూడా భారత్ యే పొందుతుంది. వ్యాధులు మొదలైనవి కూడా భారత్ లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనుష్యులు దోమల వలె మరణిస్తారు ఎందుకంటే ఆయుష్షు తక్కువగా ఉంది. ఇక్కడ శుభ్రం చేసేవారు మరియు విదేశాలలో శుభ్రం చేసేవారిలో ఎంత వ్యత్యాసం ఉంది. విదేశాల నుండి మొత్తం ఆవిష్కరణలన్నీ ఇక్కడకు వస్తాయి. సత్యయుగము పేరే ప్యారడైజ్. అక్కడ అందరూ సతోప్రధానముగా ఉంటారు. మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి. ఇప్పుడు ఇది సంగమయుగము, ఈ సమయంలో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, అర్థం చేయిస్తూ ఉంటారు, కొత్త-కొత్త విషయాలను వినిపిస్తూ ఉంటారు. తండ్రి అంటారు - నేను రోజురోజుకూ గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. ఇంతకుముందు ఇవేవీ తెలియవు, బాబా ఇంత చిన్నని బిందువు, వారిలో సదాకాలికముగా పాత్ర అంతా నిండి ఉంది. మీరు పాత్రను అభినయిస్తూ వచ్చారు, మీరు ఎవరికైనా తెలియజేస్తే వారి బుద్ధిలో ఎంతో అలజడి కలుగుతుంది - వీరు ఏమి చెప్తున్నారు, ఇంత చిన్నని బిందువులో మొత్తం పాత్ర అంతా నిండి ఉందా, ఆ పాత్రను ఎప్పుడూ అభినయిస్తూనే ఉంటుందా, ఎప్పుడూ అలసిపోదా! ఇది ఎవ్వరికీ తెలియదు. అర్ధకల్పం సుఖము ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎంతో దుఃఖాన్ని చూసి మనుష్యులు అంటారు - దీనికన్నా మోక్షాన్ని పొందడం మంచిది అని. ఎప్పుడైతే మీరు సుఖములో, శాంతిలో ఉంటారో, అక్కడ ఈ విధంగా ఏమైనా అంటారా. ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఏ విధంగా తండ్రి బీజమైన కారణంగా వారి వద్ద మొత్తం వృక్షానికి సంబంధించిన జ్ఞానం ఉంది. వృక్షము యొక్క మోడల్ రూపాన్ని చూపించారు. పెద్దదానిని ఏమైనా చూపించగలరా. బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. మరి పిల్లలైన మీ బుద్ధి ఎంత విశాలంగా ఉండాలి. ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది, ఫలానా-ఫలానావారు ఇంత సమయం తర్వాత పాత్రను అభినయించేందుకు మళ్ళీ వస్తారు, ఇది ఎంత పెద్ద విశాలమైన డ్రామా. ఈ మొత్తం డ్రామానంతటినీ ఎప్పుడూ, ఎవ్వరూ చూడలేరు కూడా. అది అసంభవము. దివ్యదృష్టి ద్వారా మంచివి చూడడం జరుగుతుంది. వినాయకుడు, హనుమంతుడు - వీరంతా భక్తి మార్గానికి చెందినవారు. కానీ మనుష్యుల భావన ఉన్న కారణంగా వాటిని వదలలేకపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి, కల్పక్రితం వలె పదవిని పొందేందుకు చదువుకోవాలి. పునర్జన్మలైతే ప్రతి ఒక్కరూ తీసుకోవలసిందేనని మీకు తెలుసు. మెట్లు ఎలా దిగారు అన్నది పిల్లలు తెలుసుకున్నారు. ఎవరైతే స్వయం తెలుసుకుంటారో, వారు ఇతరులకు కూడా అర్థం చేయించడం మొదలుపెడతారు. కల్పక్రితం కూడా ఇదే చేసి ఉంటారు. ఇలాగే మ్యూజియంను తయారుచేసి కల్పక్రితం కూడా పిల్లలకు నేర్పించి ఉంటారు. పురుషార్థము చేస్తూ ఉంటారు, ఇకపై చేస్తూనే ఉంటారు. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఈ విధంగా ఎంతోమంది తయారవుతారు, వీధి-వీధిలోనూ, ఇంటింటిలోనూ ఈ స్కూలు ఉంటుంది. ఇది కేవలం ధారణ చేయవలసిన విషయము. మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు, అందులో పెద్ద ఎవరు అని అడగండి. వారినే - దయ చూపించండి, కృప చూపించండి అని పిలుస్తారు. తండ్రి అంటారు - అడగడం వలన ఏమీ లభించదు. నేనైతే మార్గాన్ని చూపించాను. నేను మార్గాన్ని చూపించేందుకే వస్తాను. మొత్తం వృక్షమంతా మీ బుద్ధిలో ఉంది.

తండ్రి ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇంకా చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. నాకు సేవాధారులైన పిల్లలు కావాలి. ఇంటింటిలోనూ గీతా పాఠశాల ఉండాలి. వేరే చిత్రాలు మొదలైనవి పెట్టకపోయినా కేవలం బయట వ్రాయండి. చిత్రము ఈ బ్యాడ్జి ఒక్కటే సరిపోతుంది. చివరిలో ఈ బ్యాడ్జియే మీకు ఉపయోగపడుతుంది. ఇది సూచనాప్రాయమైన విషయము. అనంతమైన తండ్రి తప్పకుండా స్వర్గమునే రచిస్తారు అని తెలిసిపోతుంది. మరి తండ్రిని స్మృతి చేసినప్పుడే స్వర్గములోకి వెళ్తారు కదా. మనం పతితులుగా ఉన్నాము, స్మృతి ద్వారానే పావనముగా అవుతాము, ఇంకే ఉపాయమూ లేదు అని కూడా అర్థం చేసుకున్నారు. స్వర్గము పావన ప్రపంచము, స్వర్గానికి యజమానిగా అవ్వాలంటే పావనంగా తప్పకుండా అవ్వాలి. స్వర్గములోకి వెళ్ళేవారు మళ్ళీ నరకములో ఎలా మునకలు వేస్తారు, అందుకే మన్మనాభవ అని అంటారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. స్వర్గములోకి వెళ్ళేవారు వికారాలలోకి వెళ్తారా. భక్తులు అంతగా వికారాలలోకి వెళ్ళరు. సన్యాసులు కూడా పవిత్రముగా అవ్వండి అని అనరు ఎందుకంటే వారు స్వయమే వివాహాలు చేయిస్తారు. నెలకి ఒకసారి వికారాలలోకి వెళ్ళండి అని వారు గృహస్థులకు చెప్తారు. మీరు వివాహం చేసుకోకూడదు అని వారు బ్రహ్మచారులకు చెప్పరు. మీ వద్ద గంధర్వ వివాహం చేసుకుంటారు, మళ్ళీ మరుసటి రోజే ఆట అంతమైపోతుంది. మాయ ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎంతైనా పవిత్రముగా అయ్యే పురుషార్థము ఈ సమయంలోనే జరుగుతుంది, ఆ తర్వాత ప్రారబ్ధము లభిస్తుంది. అక్కడైతే రావణ రాజ్యమే లేదు. వికారీ ఆలోచనలే ఉండవు. వికారీగా రావణుడు చేస్తాడు. నిర్వికారిగా శివబాబా చేస్తారు. ఇది కూడా స్మృతి చేయాలి. ఇంటింటిలోనూ క్లాస్ ఉన్నట్లయితే అందరూ అర్థం చేయించేవారిగా అవుతారు. ఇంటింటిలోనూ గీతా పాఠశాలను తయారుచేసి ఇంటివారిని తీర్చిదిద్దాలి. అలా వృద్ధి జరుగుతూ ఉంటుంది. సాధారణమైనవారు మరియు పేదవారు, వారు హమ్ జీన్స్ (తోటివారు). గొప్ప-గొప్ప వ్యక్తులకు చిన్న-చిన్న వ్యక్తుల సత్సంగములోకి రావడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంద్రజాలం చేస్తారు, సోదరీ-సోదరులుగా చేస్తారు అని విన్నారు కదా! అరే, అది మంచిదే కదా. గృహస్థములో ఎన్ని జంజాటాలు ఉంటాయి. ఎంతగా దుఃఖితులుగా అవుతారు. ఇది ఉన్నదే దుఃఖమయమైన ప్రపంచము. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది, మళ్ళీ అక్కడ సుఖము కూడా అపారమైనది ఉంటుంది. మీరు లిస్టు తయారుచేసే ప్రయత్నం చేయండి. 25-30 ముఖ్యమైన దుఃఖపు విషయాలను వ్రాయండి.

అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు ఎంతగా పురుషార్థం చేయాలి. తండ్రి ఈ రథము ద్వారా మనకు అర్థం చేయిస్తారు. ఈ దాదా కూడా విద్యార్థియే. దేహధారులందరూ విద్యార్థులే. చదివించే టీచర్ విదేహి. మిమ్మల్ని కూడా విదేహులుగా తయారుచేస్తారు, అందుకే తండ్రి అంటారు - శరీర అభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. ఈ ఇళ్ళు మొదలైనవేవీ ఉండవు. అక్కడ అన్నీ కొత్తవి లభించనున్నాయి. చివరిలో మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. అటువైపు అటామిక్ బాంబుల ద్వారా వినాశనం ఎంతగానో జరుగుతుందని మీకు తెలుసు. ఇక్కడేమో రక్తపు నదులు ప్రవహిస్తాయి, అందుకు సమయం పడుతుంది. ఇక్కడ మృత్యువు చాలా చెడ్డది. ఇది అవినాశీ ఖండము, మ్యాప్ లో హిందుస్థాన్ ఒక మూల వంటిది. డ్రామానుసారంగా ఇక్కడ వాటి ప్రభావమే కనిపించదు. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరిలో వీరికి బాంబులను కూడా అప్పుగా ఇవ్వవచ్చు. అంతేకానీ ఏ బాంబులను వేయడంతో ప్రపంచం అంతమైపోతుందో, అవేమైనా అప్పుగా ఇస్తారా. మామూలు క్వాలిటీవి ఇస్తారు. అవసరమైన వస్తువులను ఎవరికైనా ఇవ్వడం జరుగుతుందా. వినాశనమైతే కల్పక్రితం వలె జరగాల్సిందే. ఇదేమీ కొత్త విషయము కాదు. అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన జరుగుతుంది. భారతఖండము ఎప్పుడూ వినాశనాన్ని పొందదు. ఎంతో కొంతైతే మిగులుతుంది. అందరూ మరణించినట్లయితే ప్రళయం జరిగినట్లే. రోజురోజుకూ మీ బుద్ధి విశాలంగా అవుతూ ఉంటుంది. మీపై ఎంతో గౌరవము ఉంటుంది. ఇప్పుడు అంతటి గౌరవము ఏమైనా ఉందా, అందుకే తక్కువ మంది పాస్ అవుతారు. ఎన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుంది, మళ్ళీ రావడం కూడా ఆలస్యంగా వస్తారు అన్నది బుద్ధిలోకి రాదు. ఒకవేళ పడినట్లయితే చేసిన సంపాదన అంతా అంతమైపోతుంది. నల్లనివారిగా అయిపోతారు. ఇక వారు నిలబడలేరు. ఎంతోమంది వెళ్ళిపోయారు, అలాగే ఎంతోమంది వెళ్ళిపోనున్నారు. ఈ పరిస్థితిలో శరీరం వదిలితే తమకు ఎటువంటి గతి లభిస్తుంది అన్నది వారు స్వయమే అర్థం చేసుకోగలరు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. తండ్రి అంటారు - పిల్లలైన మీరు శాంతిని స్థాపన చేసేవారు, మీలోనే అశాంతి ఉన్నట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. తండ్రి ఎంత ప్రేమగా అందరినీ పిల్లలూ-పిల్లలూ అంటూ మాట్లాడుతారు. వీరు అనంతమైన తండ్రి కదా. వీరిలో మొత్తం ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఉంది, అందుకే కదా అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి. లెక్కలేనన్ని దుఃఖపు విషయాలను మీరు వ్రాయవచ్చు. ఎప్పుడైతే మీరు వీటిని నిరూపించి తెలియజేస్తారో, అప్పుడు ఈ విషయం పూర్తిగా యథార్థమైనదని అర్థం చేసుకుంటారు. ఈ అపారమైన దుఃఖాలను ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ దూరం చేయలేరు. దుఃఖముల లిస్ట్ ఉన్నట్లయితే ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే వినీ-విననట్లుగా వదిలేస్తారు. గొర్రెలకు ఏమి తెలుసు సురమండలం యొక్క స్వరాలు... అని ఇటువంటి వారి గురించే అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలైన మీరు ఈ విధముగా పుష్పాల వలె అవ్వాలి, ఎటువంటి అశాంతి, అశుద్ధత ఉండకూడదు. అశాంతిని వ్యాపింపజేసేవారు దేహాభిమానులు, వారి నుండి దూరముగా ఉండాలి. వారిని ముట్టుకోకూడదు కూడా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విధముగా చదివించే టీచర్ విదేహియో, వారికి దేహభానము లేదో, అదే విధముగా విదేహిగా అవ్వాలి. శరీర భానాన్ని వదులుతూ ఉండాలి. వికారీ దృష్టిని మార్చి నిర్వికారీ దృష్టిని తయారుచేసుకోవాలి.

2. మీ బుద్ధిని విశాలముగా చేసుకోవాలి. శిక్షల నుండి విముక్తులయ్యేందుకు తండ్రిపై మరియు చదువుపై గౌరవాన్ని ఉంచాలి. ఎప్పుడూ దుఃఖమునివ్వకూడదు. అశాంతిని వ్యాపింపజేయకూడదు.

వరదానము:-

బ్రాహ్మణ జీవితము యొక్క న్యాచురల్ నేచర్ ద్వారా రాతిని కూడా నీటిగా మార్చేసే మాస్టర్ ప్రేమసాగర భవ

ప్రేమ రాయిని కూడా నీరుగా మార్చేస్తుందని ప్రపంచములోనివారు అంటారు, అలా బ్రాహ్మణులైన మీ న్యాచురల్ నేచర్ - మాస్టర్ ప్రేమ సాగరము. మీ వద్ద ఆత్మిక ప్రేమ, పరమాత్మ ప్రేమకు చెందిన ఎటువంటి శక్తి ఉందంటే దీని ద్వారా భిన్న-భిన్న స్వభావాలను పరివర్తన చెయ్యగలరు. ఏ విధంగా ప్రేమ సాగరుడు తమ ప్రేమ స్వరూపపు అనాది నేచర్ ద్వారా పిల్లలైన మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారో, అలా మీరు కూడా మాస్టర్ ప్రేమ సాగరులుగా అయ్యి విశ్వాత్మలకు సత్యమైన, నిస్వార్థమైన ఆత్మిక ప్రేమను ఇచ్చినట్లయితే వారి నేచర్ మారిపోతుంది.

స్లోగన్:-

మీ విశేషతలను స్మృతిలో ఉంచుకొని వాటిని సేవలో పెట్టినట్లయితే ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు.