ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మల తండ్రి వచ్చి
స్వర్గాన్ని లేక కొత్త ప్రపంచాన్ని ఎలా స్థాపన చేస్తారు అనేది
ప్రపంచములోనివారెవ్వరికీ తెలియదు. అసలు ఎవ్వరికీ తెలియదు. మీరు తండ్రిని ఏమీ
అడగవలసిన అవసరము లేదు. తండ్రి అన్నీ అర్థం చేయిస్తారు. ఏదీ అడగవలసిన అవసరముండదు,
అన్నీ వారంతట వారే అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, నేను కల్ప-కల్పము ఈ
భారత ఖండములోకి వచ్చి ఏమి చేయాలి అనేది నాకు తెలుసు, మీకు తెలియదు. ప్రతి రోజూ అర్థం
చేయిస్తూ ఉంటారు. ఎవ్వరూ ఏమీ అడగకపోయినా కూడా వారు అన్నీ అర్థం చేయిస్తూ ఉంటారు.
అప్పుడప్పుడు ఆహార-పానీయాల విషయములో కష్టమవుతుంది అని బాబాను అడుగుతారు. ఇప్పుడు ఇది
అర్థం చేసుకునే విషయము. బాబా ఇంతకుముందే చెప్పారు, ప్రతి విషయములోనూ యోగబలముతో పని
చేయండి, స్మృతియాత్రతో పని చేయండి మరియు ఎక్కడికి వెళ్ళినా సరే తప్పకుండా తండ్రిని
స్మృతి చేయాలి అనేది ముఖ్యమైన విషయము. అంతేకాక ఎటువంటి ఆసురీ కర్మలు చేయకూడదు. మనము
ఈశ్వరీయ సంతానము, వారు అందరికీ తండ్రి, వారు అందరికీ ఈ ఒక్క శిక్షణనే ఇస్తారు.
తండ్రి శిక్షణను ఇస్తున్నారు - పిల్లలూ, స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. రాజ్యములో
కూడా పొజిషన్ లైతే ఉంటాయి కదా. ప్రతి ఒక్కరి పురుషార్థానుసారముగా పదవి ఉంటుంది.
పురుషార్థము పిల్లలే చేయాలి మరియు ప్రారబ్ధము కూడా పిల్లలే పొందాలి. పురుషార్థము
చేయించేందుకు తండ్రి వస్తారు. తండ్రి ఎప్పుడు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, ఎక్కడికి
తీసుకువెళ్తారు అనేది ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు. డ్రామా ప్లాన్ అనుసారముగా మీరు
ఎక్కడి నుండి పడిపోయారు అనేది తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఒక్కసారిగా
ఉన్నతమైన శిఖరము నుండి పడిపోయారు. నేను ఎవరు అన్నది ఏమాత్రము బుద్ధిలోకి రాదు.
ఇప్పుడు అనుభవం చేస్తున్నారు కదా. తండ్రి వచ్చి ఏమి చేస్తారు అనేది మీకు స్వప్నములో
కూడా లేదు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. ఇప్పుడు తండ్రి లభించారు కావున
ఇటువంటి తండ్రిపైనైతే బలిహారము అవ్వాలి అని భావిస్తారు. ఉదాహరణకు పతివ్రతా స్త్రీ
పతిపై ఎంతగా బలిహారమవుతుంది. చితిపైకి ఎక్కేందుకు కూడా భయపడదు. ఎంత ధైర్యశాలిగా
ఉంటుంది. పూర్వము చాలామంది చితిపైకి ఎక్కేవారు. ఇక్కడ బాబా అయితే అటువంటి కష్టమేదీ
ఇవ్వరు. జ్ఞానచితి అన్న పేరు ఉన్నా కానీ ఇక్కడ కాలిపోయే విషయమేమీ లేదు. తండ్రి
వెన్న నుండి వెంట్రుక తీసినంత సహజముగా అర్థం చేయిస్తారు. తప్పకుండా జన్మ-జన్మాంతరాల
భారము తలపై ఉందని పిల్లలు అర్థం చేసుకుంటారు. కేవలం ఒక్క అజామిళ్ మాత్రమే కాదు.
మనుష్యులు ప్రతి ఒక్కరూ ఒకరికన్నా ఒకరు ఎక్కువ అజామిళ్ లా ఉన్నారు. గత జన్మలలో ఏమేమి
చేసారు అనేది మనుష్యులకేమి తెలుసు. మనం పాపాలే చేసామని ఇప్పుడు మీరు అర్థం
చేసుకున్నారు, వాస్తవానికి పుణ్యాత్మ ఒక్కరు కూడా లేరు. అందరూ పాపాత్ములే. పుణ్యము
చేసినట్లయితే పుణ్యాత్మగా అవుతారు. పుణ్యాత్ములు సత్యయుగములో ఉంటారు. ఎవరైనా
హాస్పిటల్ మొదలైనవి కట్టిస్తే ఏమవుతుంది. మెట్లు దిగడం నుండైతే రక్షింపబడరు. ఎక్కే
కళ అయితే జరగదు కదా. పడిపోతూనే ఉంటారు. ఈ తండ్రి ఎంతటి ప్రియమైనవారంటే, వీరిపై
జీవిస్తూనే బలిహారమైపోతాము అని అంటారు, ఎందుకంటే వారు పతులకే పతి, తండ్రులకే తండ్రి,
అందరికన్నా ఉన్నతమైనవారు.
పిల్లలను ఇప్పుడు తండ్రి మేలుకొలుపుతున్నారు. స్వర్గానికి యజమానులుగా తయారుచేసే
ఈ తండ్రి ఎంత సాధారణముగా ఉన్నారు. ప్రారంభములో పిల్లలు ఆనారోగ్యంపాలైతే బాబా స్వయంగా
వారికి సేవ చేసేవారు. అహంకారము ఏమాత్రమూ లేదు. బాప్ దాదా ఉన్నతోన్నతమైనవారు. వారు
అంటారు, నేను ఎటువంటి కర్మనైనా వీరి ద్వారా చేయిస్తాను లేక చేస్తాను. ఇద్దరూ ఒక్కరే
అనిపిస్తారు. తండ్రి ఏం చేస్తారు, దాదా ఏం చేస్తారు అనేది అసలు తెలియనే తెలియదు.
కర్మ-అకర్మ-వికర్మల గతులను తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి చాలా
ఉన్నతమైనవారు. మాయ ప్రభావము కూడా ఎంతగా ఉంది. ఈ విధంగా చేయవద్దు అని ఈశ్వరుడైన
తండ్రి చెప్పినా సరే వినరు. మధురమైన పిల్లలూ, ఈ పని చేయవద్దు అని భగవంతుడు చెప్పినా
కూడా తప్పుడు పనులు చేసేస్తారు. తప్పుడు పనుల గురించే వద్దని చెప్తారు కదా. కానీ
మాయ కూడా చాలా శక్తివంతమైనది. పొరపాటున కూడా తండ్రిని మర్చిపోకూడదు. కొట్టినా లేక
ఏం చేసినా కానీ నేను మిమ్మల్ని వదలను అని అంటారు. తండ్రి అటువంటిదేమీ చేయరు కానీ
ఎక్స్ ట్రీమ్ లో ఈ విధముగా అంటాము. మీరు ఏమన్నా సరే నేను మీ గడపను ఎప్పుడూ
వదిలిపెట్టను అని పాట కూడా ఉంది. అయినా బయట అసలు ఏముందని. ఎక్కడికి వెళ్తావు అని
బుద్ధి కూడా అంటుంది. తండ్రి రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు, ఇది మళ్ళీ ఎప్పుడూ
లభించదు. మరుసటి జన్మలో ఈ విధముగా ఏమీ లభించదు. ఈ పారలౌకిక తండ్రి మిమ్మల్ని
అనంతమైన సుఖధామానికి యజమానులుగా చేస్తారు. పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి
అని తండ్రి సలహానిస్తున్నారు. పోలీసు మొదలైన పనులు కూడా మీవి చేసుకోండి లేకపోతే
డిస్మిస్ చేసేస్తారు. మీ పని అయితే చేయాల్సిందే, కన్నెర్ర చేయాల్సి ఉంటుంది.
వీలైనంత వరకూ ప్రేమతో పని కానివ్వండి, లేకపోతే యుక్తిగా కన్నెర్ర చేయండి. చెయ్యి
చేసుకోకూడదు. బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. బాబాకు కూడా పిల్లల గురించి చింత
ఉంటుంది కదా. ముఖ్యమైన విషయము పవిత్రముగా ఉండటము. ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని
పావనముగా చేయండి అని జన్మ-జన్మాంతరాలుగా మీరు పిలిచారు కదా. కానీ దాని అర్థం ఏ
మాత్రము అర్థం చేసుకోరు. పిలుస్తున్నారు అంటే తప్పకుండా పతితముగా ఉన్నారు, లేకపోతే
పిలవాల్సిన అవసరము ఉండదు, పూజ చేయవలసిన అవసరము కూడా ఉండదు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, అబలలైన మీపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి, సహనము చేయవలసిందే. బాబా
యుక్తులను కూడా తెలియజేస్తూ ఉంటారు. మీరు చాలా నమ్రతతో నడుచుకోండి. పతితో ఈ విధముగా
చెప్పండి - మీరు భగవంతుడు కదా, మరి వికారాలను అడుగుతున్నారేమిటి, వివాహ సమయములో ముడి
వేసేటప్పుడు నేను నీకు పతి, ఈశ్వర్, గురువు, అన్నీ అని అన్నారు కదా, మరి ఇప్పుడు
నేను పవిత్రముగా ఉండాలనుకుంటున్నాను, దానికి మీరెందుకు అడ్డుకుంటున్నారు,
భగవంతుడినైతే పతిత-పావనుడు అని అంటారు కదా, మరి మీరే నన్ను పావనముగా తయారుచేసేవారిగా
అవ్వండి. పతితో ఈ విధముగా ప్రేమగా, నమ్రతతో మాట్లాడాలి. వారు క్రోధము చేస్తే మీరు
పుష్పాల వర్షము కురిపించండి. వారు కొడతారు, తర్వాత పశ్చాత్తాపపడతారు కూడా. ఉదాహరణకు
మద్యము తాగినవారికి చాలా నషా ఎక్కుతుంది కదా, స్వయాన్ని చక్రవర్తిగా భావిస్తారు,
అలానే ఈ విషము కూడా ఎటువంటిదంటే ఇక అడగకండి. పశ్చాత్తాపపడతారు కూడా కానీ అది
అలవాటైపోయిందంటే ఇక ఆ అలవాటు పోదు. 1-2 సార్లు వికారాలలోకి వెళ్తారు, ఇక అంతే, నషా
ఎక్కుతుంది, ఇక పడిపోతూనే ఉంటారు. ఏ విధముగా మత్తు పదార్థాలు తాత్కాలిక సంతోషాన్ని
కలిగిస్తాయో, వికారాలు కూడా అటువంటివే. ఇక్కడ చాలా శ్రమ ఉంటుంది. యోగబలము లేకుండా ఏ
కర్మేంద్రియాన్నీ వశము చేసుకోలేరు. చమత్కారమంతా యోగబలముదే, అందుకే దీని పేరు
ప్రసిద్ధమైనది. ఇక్కడ యోగము నేర్చుకునేందుకు విదేశాల నుండి వస్తారు. శాంతిగా
కూర్చుని ఉంటారు. ఇళ్ళు-వాకిళ్ళ నుండి దూరముగా వెళ్ళిపోతారు. అది అర్ధకల్పము కోసం
కృత్రిమమైన శాంతి. సత్యమైన శాంతి గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. తండ్రి
చెప్తున్నారు - పిల్లలూ, మీ స్వధర్మమే శాంతి, ఈ శరీరముతో మీరు కర్మలు చేస్తారు.
శరీరాన్ని ధారణ చేయనంతవరకూ ఆత్మ శాంతిగా ఉంటుంది. ఇక ఎక్కడో ఒక చోటకు వెళ్ళి
ప్రవేశిస్తుంది. ఇక్కడైతే కొందరు సూక్ష్మ శరీరముతో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. అది
నీడ వంటి శరీరము, కొందరు దుఃఖమునిచ్చేవారు ఉంటారు, కొందరు మంచివారు ఉంటారు. ఇక్కడ
కూడా మనుష్యులలో కొందరు ఎవ్వరికీ దుఃఖమునివ్వరు, కొందరైతే చాలా దుఃఖమునిస్తారు.
కొందరు సాధు, మహాత్మల వలె ఉంటారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురాతి-మధురమైన, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలూ,
మీరు 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఏమి తీసుకునేందుకు వచ్చారు?
మీకు ఏం లభిస్తుంది అనేది తండ్రి తెలియజేసారు. బాబా, మీ నుండి ఏం లభిస్తుంది అనేది
అసలు ప్రశ్నే కాదు. మీరు ఉన్నదే హెవెన్లీ గాడ్ ఫాదర్, కొత్త ప్రపంచ రచయిత, కావున
తప్పకుండా మీ నుండి రాజ్యాధికారమే లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, కొద్దిగా ఏదైనా
అర్థం చేసుకుని వెళ్ళినా స్వర్గములోకి తప్పకుండా వచ్చేస్తారు. నేను స్వర్గ స్థాపన
చేసేందుకు వచ్చాను. అత్యంత గొప్ప ఆసామి భగవంతుడు మరియు ప్రజాపిత బ్రహ్మా. విష్ణువు
ఎవరో మీకు తెలుసు. ఇంకెవ్వరికీ తెలియదు. మేము వీరి వంశస్థులమని మీరు అంటారు, ఈ
లక్ష్మీ-నారాయణులు సత్యయుగములో రాజ్యము చేస్తారు. ఈ చక్రము మొదలైనవి వాస్తవానికి
విష్ణువుకు లేవు. ఈ అలంకారాలు బ్రాహ్మణులైన మనవి. ఇప్పుడు ఈ జ్ఞానము ఉంది.
సత్యయుగములో వీటిని అర్థం చేయించరు. ఇటువంటి విషయాలను తెలియజేసేందుకు ఎవ్వరిలోనూ
శక్తి లేదు. మీకు ఈ 84 జన్మల చక్రము గురించి తెలుసు. దీని అర్థాన్ని ఎవ్వరూ అర్థం
చేసుకోలేరు. పిల్లలకు తండ్రి అర్థం చేయించారు. ఈ అలంకారాలు మాకు శోభించవు అని
పిల్లలు అర్థం చేసుకున్నారు. మనము ఇప్పుడు శిక్షణ పొందుతున్నాము. పురుషార్థము
చేస్తున్నాము. ఆ తర్వాత ఈ విధముగా తయారవుతాము. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ-తిప్పుతూ
మనము దేవతలుగా అయిపోతాము. స్వదర్శన చక్రము అనగా రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను
తెలుసుకోవడము. ఈ సృష్టి చక్రమెలా తిరుగుతుంది అనేది మొత్తం ప్రపంచములో ఎవ్వరూ అర్థం
చేయించలేరు. ఈ చక్రము యొక్క ఆయుష్షు ఇంత ఎక్కువగా ఉండదు అన్న విషయాన్ని తండ్రి ఎంత
సహజముగా అర్థం చేయిస్తున్నారు. ఇంతమంది మనుష్యులు ఉన్నారు అని మనుష్య సృష్టి గురించే
సమాచారము వినిపించడం జరుగుతుంది. అంతేకానీ తాబేళ్ళు ఎన్ని ఉన్నాయి, చేపలు మొదలైనవి
ఎన్ని ఉన్నాయి అనేది తెలియజేయడం జరగదు, ఇది కేవలం మనుష్యుల విషయమే. మిమ్మల్ని కూడా
ప్రశ్నలు అడుగుతారు, తండ్రి అన్నీ తెలియజేస్తూ ఉంటారు. కేవలం వాటిపై పూర్తిగా
ధ్యానముంచాలి.
బాబా అర్థం చేయించారు - యోగబలముతో మీరు సృష్టిని పావనముగా తయారుచేస్తారు, మరి
యోగబలముతో ఆహారము శుద్ధముగా అవ్వదా? అచ్ఛా, మీరైతే ఈ విధముగా తయారయ్యారు, మరి
ఎవరినైనా మీ సమానముగా తయారుచేస్తున్నారా? స్వర్గ రాజ్యాధికారాన్ని మళ్ళీ ఇవ్వడానికి
తండ్రి వచ్చారు అని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కనుక దీనిని
తిరస్కరించకూడదు. విశ్వ రాజ్యాధికారాన్ని తిరస్కరించినట్లయితే ఇక సమాప్తము.
అప్పుడిక వెళ్ళి చెత్తకుండీలో పడిపోతారు. ఈ ప్రపంచమంతా చెత్త వలె ఉంది. కావున దీనిని
చెత్తకుండీ అనే అంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. మనం విశ్వానికి
యజమానులుగా అవుతామని మీకు తెలుసు. సత్యయుగములో ఒకే రాజ్యముండేదని ఎవ్వరికీ తెలియదు,
వారు అంగీకరించరు. వారికి అహంకారము ఉంటుంది కావున కొంచెము కూడా వినరు. ఇదంతా మీ ఊహ,
ఈ శరీరము మొదలైనవి ఊహ ద్వారానే తయారయ్యాయి అని అంటారు. కొంచెము కూడా అర్థం చేసుకోరు.
ఇది కేవలం ఈశ్వరుని ఊహ, ఈశ్వరుడు ఎలా కోరుకుంటే మనం అలా తయారవుతాము, ఈ ఆట వారిదే అని
అంటారు. ఎటువంటి మాటలు మాట్లాడుతారంటే, ఇక అడగకండి. బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు
పిల్లలైన మీకు తెలుసు. బాబా, ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మేము మీ నుండి స్వర్గ
వారసత్వాన్ని తీసుకుంటామని వృద్ధ మాతలు కూడా అంటారు. మనము ఇప్పుడు స్వర్గ
రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు వచ్చాము. పాత్రధారులందరికీ తమ-తమ పాత్రలు ఉన్నాయని
మీకు తెలుసు. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. మీరు మళ్ళీ ఇవే నామ-రూపాలతో ఇదే సమయములో
వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థము చేస్తారు. ఇది ఎంత అపారమైన
సంపాదన. కొద్దిగా విన్నా కూడా స్వర్గములోకి వచ్చేస్తారు అని బాబా చెప్తారు, కానీ
ప్రతి మనిషి ఉన్నతముగా అయ్యేందుకే పురుషార్థము చేస్తారు కదా. కనుక పురుషార్థము ఫస్ట్.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.