ఓంశాంతి
ఆత్మిక తండ్రి బ్రహ్మా ద్వారా సలహా ఇస్తున్నారు - మీరు స్మృతి చేసినట్లయితే ఈ విధంగా
అవుతారు, సతోప్రధానముగా అయి మీ స్వర్గ రాజ్యములోకి ప్రవేశిస్తారు. ఇలా కేవలం మీకు
మాత్రమే చెప్పడం లేదు, ఈ సందేశము మొత్తం భారతదేశమంతటికే కాకుండా విదేశాలలో కూడా
అందరి వద్దకూ వెళ్తుంది. చాలామందికి సాక్షాత్కారము కూడా జరుగుతుంది. ఎవరి
సాక్షాత్కారము జరగాలి? ఇది కూడా బుద్ధిని ఉపయోగించవలసిన విషయమే. తండ్రి బ్రహ్మా
ద్వారానే సాక్షాత్కారము చేయించి ఇలా చెప్తారు - యువరాజుగా అవ్వాలనుకుంటే బ్రహ్మా
వద్దకు లేక బ్రాహ్మణుల వద్దకు వెళ్ళండి అని. యూరప్ వాసులు కూడా దీనిని అర్థం
చేసుకోవాలనుకుంటారు. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు ఎవరి రాజ్యము ఉండేది? ఇది పూర్తిగా
ఎవరికీ తెలియదు. భారత్ యే స్వర్గముగా ఉండేది. ఇప్పుడు మీరు అందరికీ అర్థం
చేయిస్తున్నారు. ఇది సహజ రాజయోగము, దీని ద్వారా భారత్ స్వర్గముగా లేక హెవెన్ గా
అవుతుంది. విదేశీయుల బుద్ధి ఎంతైనా కొంత వరకూ మెరుగుగానే ఉంది. వారు వెంటనే అర్థం
చేసుకుంటారు. మరి ఇప్పుడు సేవాధారులైన పిల్లలు ఏం చేయాలి? అటువంటివారికే డైరెక్షన్లు
ఇవ్వవలసి ఉంటుంది. పిల్లలు ప్రాచీన రాజయోగాన్ని నేర్పించాలి. మీ వద్ద మ్యూజియంలకు,
ప్రదర్శనీలకు ఎంతోమంది వస్తారు. వీరు చాలా మంచి కార్యాన్ని చేస్తున్నారు అని
ఒపీనియన్ ను (అభిప్రాయాన్ని) వ్రాస్తారు. కానీ వారు స్వయం అర్థం చేసుకోరు. ఎంతోకొంత
టచ్ అయితే వస్తారు, కానీ ఎంతైనా పేదవారు తమ భాగ్యాన్ని మంచిగా తయారుచేసుకుంటారు
మరియు అర్థం చేసుకునే పురుషార్థము చేస్తారు. షావుకారులైతే పురుషార్థము చేసేది లేదు.
దేహాభిమానము ఎంతగానో ఉంటుంది కదా. కావున డ్రామానుసారముగా తండ్రి దండన ఇచ్చినట్లు.
అయినా కానీ వారి ద్వారా శబ్దాన్ని వ్యాపింపజేయవలసి ఉంటుంది. విదేశీయులైతే ఈ
జ్ఞానాన్ని కోరుకుంటారు. ఇది విని ఎంతో సంతోషిస్తారు. గవర్నమెంటు ఆఫీసర్ల వెనుక
ఎంతగా కష్టపడుతూ ఉంటారు, కానీ వారికి తీరికే లేదు. వారికి తమ ఇంట్లో కూర్చుని
సాక్షాత్కారము కలిగినా కూడా వారి బుద్ధిలోకి రాదు. కావున పిల్లలకు తండ్రి సలహా
ఇస్తారు, మంచి-మంచి అభిప్రాయాలను పోగు చేసి వాటిని ఒక మంచి పుస్తకముగా తయారుచేయాలి.
చూడండి, ఇది ఎంతమందికి నచ్చుతోంది అని చెప్పి సలహా ఇవ్వవచ్చు. విదేశీయులు లేక
భారతవాసులు కూడా సహజ రాజయోగాన్ని తెలుసుకోవాలనుకుంటారు. స్వర్గపు దేవీ-దేవతల రాజ్యము
సహజ రాజయోగము ద్వారా భారత్ కు ప్రాప్తిస్తుంది అన్నప్పుడు మరి ఆ మ్యూజియంను
గవర్నమెంటు హౌస్ లో, కాన్ఫరెన్సులు మొదలైనవి జరిగే స్థానాలలో ఎందుకు పెట్టకూడదు. ఈ
ఆలోచనలు పిల్లలకు నడవాలి. ఇప్పుడు ఇంకా సమయము పడుతుంది. అంత త్వరగా బుద్ధి మెత్తబడదు.
బుద్ధికి గోద్రెజ్ తాళం వేయబడి ఉంది. ఇప్పుడే శబ్దం వెలువడినట్లయితే రెవెల్యూషన్ (విప్లవం)
జరుగుతుంది. అది ఎలాగైనా తప్పకుండా జరగవలసిందే. గవర్నమెంట్ హౌస్ లో కూడా మ్యూజియం
ఉంటే ఎంతోమంది విదేశీయులు కూడా వచ్చి చూస్తారు అని మీరు చెప్పండి. పిల్లల విజయమైతే
తప్పకుండా జరిగి తీరుతుంది. కావున ఆలోచనలు నడవాలి. దేహీ-అభిమానులకే ఏమి చేయాలి అని
ఇలాంటి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. తద్వారా ఆ అభాగ్యులకు తెలుస్తుంది మరియు వారు
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. ఎటువంటి ఖర్చు లేకుండా... అని మనం
వ్రాస్తాము కూడా. కావున మంచి-మంచి పిల్లలు ఎవరైతే వస్తారో, వారు సలహా ఇస్తారు.
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఓపెనింగ్ చేయడానికి వచ్చారంటే తర్వాత ప్రైమ్ మినిస్టర్,
ప్రెసిడెంట్ కూడా వస్తారు, ఎందుకంటే వారు వెళ్ళి ఇది చాలా అద్భుతమైన జ్ఞానము అని
వాళ్ళకు కూడా చెప్తారు. సత్యమైన శాంతి అయితే ఇలాగే స్థాపన అవ్వనున్నది అని చెప్తారు.
అప్పుడు వారికి నచ్చుతుంది. వివరణ కూడా నచ్చే విధంగా ఉంది. ఈ రోజు నచ్చకపోతే రేపు
నచ్చుతుంది. బాబా చెప్తూ ఉంటారు, గొప్ప-గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళండి, మున్ముందు
వారు కూడా అర్థం చేసుకుంటారు. మనుష్యుల బుద్ధి తమోప్రధానముగా ఉంది, అందుకే తప్పుడు
పనులు చేస్తూ ఉంటారు. రోజురోజుకు ఇంకా తమోప్రధానముగా అవుతూ ఉంటారు.
ఈ వికారీ వ్యాపారాలను ఆపు చేయండి, మీ ఉన్నతిని చేసుకోండి, తండ్రి పవిత్ర దేవతలుగా
తయారుచేయడానికి వచ్చారు అని మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. గవర్నమెంట్
హౌస్ లో మ్యూజియం ఉండే రోజు కూడా చివరికి వస్తుంది. ఖర్చు అయితే మేమే పెట్టుకుంటాము
అని చెప్పండి. గవర్నమెంట్ అయితే ఎప్పుడూ డబ్బు ఇవ్వదు. మేము మా ఖర్చుతో ప్రతి
గవర్నమెంట్ హౌస్ లోనూ ఈ మ్యూజియంను పెట్టగలము అని పిల్లలైన మీరు చెప్తారు. ఒక పెద్ద
గవర్నమెంట్ హౌస్ లో ఇది జరిగినట్లయితే ఇక అన్నింటిలోనూ ఇది జరిగిపోతుంది. అర్థం
చేయించేవారు కూడా తప్పకుండా కావాలి. వారికి, ఒక సమయాన్ని ఫిక్స్ చేయమని చెప్పి, ఆ
సమయములో ఎవరైనా వచ్చి మార్గము చెప్తారు అని చెప్పండి. పైసా ఖర్చు కూడా లేకుండా
జీవితాన్ని తయారుచేసుకునే దారిని తెలియజేస్తాము అని చెప్పండి. ఇది మున్ముందు
జరగనున్నది. కానీ తండ్రి పిల్లల ద్వారానే తెలియజేస్తారు. మంచి-మంచి పిల్లలు ఎవరైతే
స్వయాన్ని మహావీరులుగా భావిస్తారో, వారినే మాయ పట్టుకుంటుంది. ఇది చాలా ఉన్నతమైన
గమ్యము. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాక్సింగ్ తక్కువేమీ కాదు. ఈ బాక్సింగ్ చాలా
పెద్దది. ఇది రావణునిపై విజయాన్ని పొందే యుద్ధ మైదానము. ‘నేను ఇటువంటి సేవను
చేస్తున్నాను, ఇది చేస్తున్నాను...’ అంటూ కొద్దిగా కూడా దేహ-అభిమానము రాకూడదు.
మనమైతే గాడ్లీ సర్వెంట్ (ఈశ్వరీయ సేవకులము). మనము సందేశాన్ని ఇవ్వవలసిందే, ఇందులో
గుప్తమైన శ్రమ ఎంతగానో ఉంది. మీరు జ్ఞానము మరియు యోగబలముతో స్వయానికి అర్థం
చేయిస్తారు. ఇందులో గుప్తముగా ఉంటూ విచార సాగర మథనము చెయ్యాలి, అప్పుడే నషా
ఎక్కుతుంది. ఈ విధంగా ప్రేమగా అర్థం చేయిస్తారు - అనంతమైన తండ్రి వారసత్వము ప్రతి
కల్పమూ భారతవాసులకు లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము
ఉండేది. ఇప్పుడు దీనిని వేశ్యాలయము అని అంటారు. సత్యయుగము శివాలయము. అది శివబాబా
స్థాపన, ఇది రావణుని స్థాపన. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. నిజంగా మేము ఎలా
అయిపోయాము అని పిల్లలు ఫీల్ అవుతారు. బాబా తమ సమానముగా తయారుచేస్తారు. ముఖ్యమైన
విషయము దేహీ-అభిమానులుగా అవ్వాలి. దేహీ-అభిమానులుగా అయి ఆలోచించాలి - ఈ రోజు మేము
ఫలానా ప్రైమ్ మినిస్టర్ వద్దకు వెళ్ళి అర్థం చేయించాలి. వారికి దృష్టి ఇచ్చినట్లయితే
సాక్షాత్కారము జరగవచ్చు. మీరు దృష్టి ఇవ్వవచ్చు. ఒకవేళ దేహీ-అభిమానులుగా అయి
ఉన్నట్లయితే మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. దేహీ-అభిమానులుగా అయి కూర్చోవాలి,
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రితో యోగము జోడించినట్లయితే బ్యాటరీ నిండుతుంది.
పేదవారు వెంటనే తమ బ్యాటరీని నింపుకోగలుగుతారు ఎందుకంటే వారు తండ్రిని ఎంతగానో
స్మృతి చేస్తారు. జ్ఞానము బాగున్నా యోగము తక్కువగా ఉన్నట్లయితే బ్యాటరీ నిండలేదు
ఎందుకంటే దేహ అహంకారము ఎంతగానో ఉంటుంది. యోగము అసలేమీ లేదు, అందుకే జ్ఞాన బాణములో
పదును నిండదు. ఖడ్గానికి కూడా పదును ఉంటుంది. అదే ఖడ్గము 10 రూపాయలు ఉంటుంది, అదే
ఖడ్గము 50 రూపాయలు కూడా ఉంటుంది. గురుగోవింద్ సింగ్ ఖడ్గానికి గాయనము ఉంది. ఇక్కడ
ఇందులో హింస విషయము లేదు. దేవతలు డబుల్ అహింసకులు. ఈ రోజు భారత్ ఇలా ఉంది, రేపు
భారత్ ఇలా అవుతుంది. కావున పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి. నిన్న మనం రావణ రాజ్యములో
ఉన్నప్పుడు ఎంతో ఇబ్బందిలో ఉండేవారము. ఈ రోజు మనం పరమపిత పరమాత్మతో పాటు ఉంటున్నాము.
ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. సత్యయుగములో మీరు దైవీ పరివారానికి
చెందినవారిగా ఉంటారు. ఇప్పుడు స్వయంగా భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు, మనకు
భగవంతుని ప్రేమ ఎంతగా లభిస్తుంది. అర్ధకల్పము రావణుని ప్రేమ లభించడముతో కోతులలా
అయిపోయారు. ఇప్పుడు అనంతమైన తండ్రి ప్రేమ లభించడముతో మీరు దేవతలుగా అయిపోతారు. ఇది
5000 సంవత్సరాల విషయము. వారైతే లక్షల సంవత్సరాలు అని వ్రాసేసారు. ఇతను కూడా మీ వంటి
పూజారిగానే ఉండేవారు. అందరికన్నా చివరి నెంబరులో వృక్షము చివరిలో నిలబడి ఉన్నారు.
సత్యయుగములో మీకు ఎంత అపారమైన ధనము ఉండేది. ఆ తర్వాత ఏ మందిరాలనైతే తయారుచేసారో
వాటిలో కూడా అంతటి అపారమైన ధనము ఉండేది, దానిని వారు వచ్చి దోచుకున్నారు. మందిరాలైతే
ఇంకా ఎన్నో ఉంటాయి. ప్రజల మందిరాలు కూడా ఉంటాయి. ప్రజలైతే ఇంకా ఎక్కువ షావుకార్లుగా
ఉంటారు. ప్రజల నుండి రాజులు అప్పులు తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచము.
అన్నింటికన్నా అశుద్ధమైన స్థానము కలకత్తా. దానిని మార్చేందుకు పిల్లలైన మీరు
శ్రమించాలి. ఎవరు చేస్తారో వారు పొందుతారు. దేహాభిమానము వచ్చిందంటే పడిపోతారు.
మన్మనాభవ అర్థాన్ని అర్థం చేసుకోరు. కేవలం శ్లోకాలను కంఠస్థము చేస్తారు.
బ్రాహ్మణులైన మీలో తప్ప వారిలో జ్ఞానము ఉండదు. మఠాలు, ఆశ్రమాల వారు ఎవరూ దేవతలుగా
అవ్వలేరు. ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీలుగా, బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా
అవ్వగలుగుతారు. ఎవరైతే కల్పపూర్వము తయారయ్యారో వారే తయారవుతారు. సమయం పడుతుంది.
వృక్షము పెద్దదైతే ఇక అది వృద్ధి చెందుతూ ఉంటుంది. చీమ మార్గము నుండి విహంగ
మార్గముగా మారుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, తండ్రిని స్మృతి
చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పండి. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రము ఉంది.
బ్రాహ్మణులైన మీరే మళ్ళీ దేవత మరియు క్షత్రియ వంశానికి చెందినవారిగా అవుతారు.
సూర్యవంశీ, చంద్రవంశీయుల అర్థాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. ఎంతో శ్రమించి అర్థం
చేయించడం జరుగుతుంది. అయినా అర్థం చేసుకోకపోతే ఇప్పుడింకా ఆ సమయం రాలేదని భావించడం
జరుగుతుంది. అయినా వస్తారు. బ్రహ్మాకుమారీలకు బయట ఇటువంటి పేరు ఉంది అని భావిస్తారు.
లోపలికి వచ్చి చూస్తే వీరు చాలా మంచి పని చేస్తున్నారు, వీరు మనుష్యమాత్రుల
క్యారెక్టర్లను తీర్చిదిద్దుతున్నారు అని అంటారు. దేవతల క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి.
వారు సంపూర్ణ నిర్వికారులు... తండ్రి అంటారు, కామము మహాశత్రువు. ఈ ఐదు భూతాల
కారణముగానే మీ క్యారెక్టర్ పాడైపోయింది. ఏ సమయములోనైతే అర్థం చేయిస్తారో, ఆ సమయములో
మంచిగా అవుతారు, మళ్ళీ బయటకు వెళ్ళడంతో అంతా మర్చిపోతారు. అందుకే ఏమంటారంటే - గాడిద
పిల్లను ఎంత శృంగారించి నగలతో అలంకరించినా అది మళ్లీ వెళ్ళి మట్టిలో పొర్లుతుంది,
అలంకారమునంతా పాడు చేసుకుంటుంది. బాబా ఇలా తిట్టడం లేదు, వారు అర్థం చేయిస్తారు.
దైవీ నడవడికను ఉంచుకోండి, క్రోధములోకి వచ్చి ఎందుకు అరుస్తారు! స్వర్గములో క్రోధము
ఉండదు. తండ్రి ఏదైనా ఎదురుగానే అర్థం చేయించేవారు, ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. బాబా
అన్నీ రిఫైన్ చేసి అర్థం చేయిస్తారు. డ్రామా నియమానుసారముగా నడుస్తూ ఉంటుంది.
డ్రామాలో ఎటువంటి పొరపాటు లేదు. ఇది అనాదిగా, అవినాశీగా రచింపబడి ఉంది. ఏ పాత్ర
అయితే మంచిగా జరుగుతుందో, అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ పర్వతము
కూలిపోయింది, మళ్ళీ అది ఎలా తయారవుతుంది అని చాలామంది అడుగుతారు. నాటకములో చూడండి,
మహలు కూలిపోయినా, మళ్ళీ నాటకము రిపీట్ అయినప్పుడు అదే మహళ్ళు తయారై ఉండడాన్ని
చూస్తారు. అలాగే ఇక్కడ కూడా అదే విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది. అర్థం చేసుకునే తెలివి
కూడా కావాలి. కొందరి బుద్ధిలో కూర్చోవడం చాలా కష్టము. ఇది ప్రపంచము యొక్క
చరిత్ర-భౌగోళికము కదా. రామ రాజ్యములో ఈ దేవీ-దేవతల రాజ్యము ఉండేది, వారి పూజ
జరుగుతుండేది. తండ్రి అర్థం చేయించారు - మీరే పూజ్యులుగా మరియు మీరే పూజారులుగా
అవుతారు. హం సో అనే మాట యొక్క అర్థాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు. మనమే
దేవతలుగా, మనమే క్షత్రియులుగా... అవుతాము. ఇది పిల్లిమొగ్గల ఆట కదా. దీనిని మంచి
రీతిలో అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి. బాబా ఏమీ
వ్యాపారాన్ని వదిలేయండి అని అనరు. అలా కాదు. కేవలం సతోప్రధానముగా అవ్వాలి.
చరిత్ర-భౌగోళికాల రహస్యాన్ని అర్థం చేసుకుని, అర్థం చేయించండి. ముఖ్యమైన విషయము
మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా
అవుతారు. స్మృతియాత్ర నంబరు వన్. నేను పిల్లలందరినీ నాతోపాటు తీసుకువెళ్తాను అని
తండ్రి అంటారు. సత్యయుగములో ఎంత కొద్దిమంది మనుష్యులుంటారు. కలియుగములో ఎంతోమంది
మనుష్యులు ఉన్నారు. వీరందరినీ తిరిగి తీసుకువెళ్ళేవారు ఎవరు. ఇంతటి విశాలమైన అడవిని
ఎవరు శుభ్రం చేసారు? తోట యజమాని, నావికుడు అని తండ్రినే అంటారు. వారే దుఃఖాల నుండి
విడిపించి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. చదువు ఎంత మధురముగా అనిపిస్తుంది ఎందుకంటే
జ్ఞానము సంపాదనకు ఆధారము. మీకు అపారమైన ఖజానా లభిస్తుంది. భక్తిలో ఏమీ లభించదు.
ఇక్కడ కాళ్ళు పట్టుకునే విషయమేదీ లేదు. అక్కడైతే గురువుల ముందు సాష్టాంగ నమస్కారము
చేస్తారు. వాటి నుండి తండ్రి విడిపిస్తారు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. వారు
మన తండ్రి, ఇది అర్థం చేసుకున్నారు కదా. తండ్రి నుండి వారసత్వము తప్పకుండా
లభిస్తుంది. ఆ సంతోషము ఉంటుంది. మేము షావుకార్ల వద్దకు వెళ్ళినప్పుడు మేము పేదవారము
అని సిగ్గు కలిగేది అని అంటారు. బాబా అంటారు, పేదవారిగా ఉండడము ఇంకా మంచిది.
షావుకార్లుగా ఉండి ఉంటే ఇక్కడకు వచ్చేవారే కాదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.