23-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు, తండ్రిని కలవడముతో భక్తి మార్గపు అలసట అంతా దూరమైపోతుంది’’

ప్రశ్న:-
పిల్లలైన మిమ్మల్ని బాబా ఏ విధితో రిఫ్రెష్ చేస్తారు?

జవాబు:-
1) బాబా జ్ఞానాన్ని వినిపించి, వినిపించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు. 2) స్మృతి ద్వారా కూడా పిల్లలైన మీరు రిఫ్రెష్ అవుతారు. వాస్తవానికి సత్యయుగము నిజమైన విశ్రాంతిపురి. దేనినైనా ప్రాప్తి చేసుకోవడానికి శ్రమించేందుకు అక్కడ అసలు ఆప్రాప్తి అనే వస్తువే లేదు. 3) శివబాబా ఒడిలోకి వస్తూనే పిల్లలైన మీకు విశ్రాంతి లభిస్తుంది. అలసట అంతా దూరమైపోతుంది.

ఓంశాంతి
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, దానితో పాటుగా ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు ఎందుకంటే తండ్రి కూర్చుని ఈ దాదా ద్వారా అర్థం చేయిస్తారు. మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అలాగే ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. దాదాను భగవంతుడు అని అనరు. ఇది భగవానువాచ. తండ్రి ఏమి అర్థం చేయిస్తున్నారు? దేహీ అభిమానీ భవ, ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించకుండా పరమపిత పరమాత్మను స్మృతి చేయలేరు. ఈ సమయములోనైతే ఆత్మలందరూ పతితముగా ఉన్నారు. పతితులనే మనుష్యులు అని అంటారు, పావనులను దేవతలు అని అంటారు. ఇవి చాలా సహజముగా అర్థం చేసుకునే మరియు అర్థం చేయించే విషయాలు. మనుష్యులే పిలుస్తారు - ఓ పతితులను పావనముగా చేసేవారా రండి అని. దేవీ-దేవతలు ఎప్పుడూ ఇలా పిలవరు. పతిత పావనుడైన తండ్రి పతితుల పిలుపుకు వస్తారు. ఆత్మలను పావనముగా చేసి కొత్త పావన ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు. ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. శరీరమైతే పిలవదు. పారలౌకిక తండ్రి, ఎవరైతే సదా పావనముగా ఉంటారో, వారినే అందరూ స్మృతి చేస్తారు. ఇది పాత ప్రపంచము. తండ్రి కొత్త పావన ప్రపంచాన్ని తయారుచేస్తారు. కొందరు ఎలాంటివారు ఉన్నారంటే, వారు - మాకు ఇక్కడే అపారమైన సుఖము ఉంది, ధనము, సంపద చాలా ఉంది అని అంటారు. వారు మా కొరకు ఇదే స్వర్గము అని భావిస్తారు. వారు మీ మాటలను ఎలా అంగీకరిస్తారు? కలియుగ ప్రపంచాన్ని స్వర్గముగా భావించడము - ఇది కూడా తెలివితక్కువతనమే. ఎంతటి శిథిలావస్థకు చేరుకుంది. అయినా మనుష్యులు - మేము స్వర్గములో కూర్చున్నాము అని అంటారు. పిల్లలు అర్థం చేయించకపోతే తండ్రి అంటారు కదా - నీవేమన్నా రాతిబుద్ధి కలవాడివా, ఇతరులకు అర్థం చేయించలేవా? ఎప్పుడైతే స్వయం పారసబుద్ధి కలవారిగా అవుతారో అప్పుడే కదా ఇతరులను కూడా తయారుచేయగలిగేది. పురుషార్థము బాగా చెయ్యాలి, ఇందులో సిగ్గు పడే విషయమేదీ లేదు. కానీ మనుష్యుల బుద్ధిలో అర్ధకల్పము నుండి ఏవైతే తప్పుడు అభిప్రాయాలు నిండి ఉన్నాయో అవి ఏమంత త్వరగా మర్చిపోలేరు. ఎప్పటివరకైతే తండ్రిని యథార్థముగా గుర్తించరో అప్పటివరకూ ఆ శక్తి రాదు. తండ్రి అంటారు, ఈ వేద-శాస్త్రాలు మొదలైనవాటితో మనుష్యులేమీ బాగుపడరు. రోజురోజుకు ఇంకా పాడవుతూ వచ్చారు. సతోప్రధానము నుండి తమోప్రధానమే అయ్యారు. మేమే ఒకప్పుడు సతోప్రధాన దేవీ-దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ ఎలా కిందకు వచ్చామని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఎవ్వరికీ కొద్దిగా కూడా తెలియదు. అంతేకాక 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలు అని అనేసేటప్పటికి ఇక ఎలా తెలుస్తుంది. తండ్రి తప్ప జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవారు ఇంకెవ్వరూ లేరు. అందరూ ఒకరి వెనుక ఒకరు ప్రతి ద్వారము వద్ద ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. కిందకు పడుతూ, పడుతూ పూర్తిగా నేల మీదకొచ్చేసారు, శక్తి అంతా అంతమైపోతుంది. తండ్రిని యథార్థముగా తెలుసుకునేందుకు బుద్ధిలో కూడా శక్తి లేదు. తండ్రియే వచ్చి అందరి బుద్ధి తాళాలను తెరుస్తారు. అప్పుడు ఎంత రిఫ్రెష్ అవుతారు. తండ్రి వద్దకు పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇంటిలో విశ్రాంతి దొరుకుతుంది కదా. తండ్రిని కలవడముతో భక్తి మార్గపు అలసట అంతా దూరమైపోతుంది. సత్యయుగాన్ని కూడా విశ్రాంతిపురి అని అంటారు. అక్కడ మీకు ఎంత విశ్రాంతి లభిస్తుంది. మీరు కష్టపడడానికి, అక్కడ అప్రాప్తి అనే వస్తువంటూ ఏదీ ఉండదు. ఇక్కడ తండ్రి కూడా రిఫ్రెష్ చేస్తారు, ఈ దాదా కూడా రిఫ్రెష్ చేస్తారు. శివబాబా ఒడిలోకి రావడముతో ఎంత విశ్రాంతి లభిస్తుంది. విశ్రాంతి అంటేనే శాంతి. మనుష్యులు కూడా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్తూ ఉంటారు కదా. కానీ ఆ విశ్రాంతిలో రిఫ్రెష్మెంట్ అనేది లేదు. ఇక్కడైతే తండ్రి మీకు ఎంతగా జ్ఞానాన్ని వినిపించి రిఫ్రెష్ చేస్తారు. తండ్రి స్మృతితో కూడా ఎంతగా రిఫ్రెష్ అవుతారు, అంతేకాక తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతూ ఉంటారు. సతోప్రధానముగా అయ్యేందుకు ఇక్కడ తండ్రి వద్దకు వస్తారు. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి. మొత్తం సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది, సర్వాత్మలకు విశ్రాంతి ఎలా మరియు ఎక్కడ లభిస్తుంది అనేది తండ్రి అర్థం చేయించారు. అందరికీ తండ్రి సందేశాన్ని అందించడము పిల్లలైన మీ కర్తవ్యము. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే ఈ వారసత్వానికి మీరు అధిపతులు అవుతారు. తండ్రి ఈ సంగమయుగములో కొత్త స్వర్గ ప్రపంచాన్ని రచిస్తారు. అక్కడకు మీరు వెళ్ళి అధిపతులవుతారు. మళ్ళీ ద్వాపరములో మాయా రావణుని ద్వారా మీకు శాపము లభిస్తుంది, అప్పుడు పవిత్రత, సుఖము, శాంతి, ధనము మొదలైనవన్నీ అంతమైపోతాయి. మెల్లమెల్లగా ఎలా అంతమవుతాయి అన్నది కూడా తండ్రి అర్థం చేయించారు. దుఃఖధామములో విశ్రాంతి ఏమైనా ఉంటుందా. సుఖధామములో విశ్రాంతియే విశ్రాంతి. మనుష్యులను భక్తి ఎంతగా అలసిపోయేలా చేస్తుంది. జన్మ-జన్మాంతరాలు భక్తి ద్వారా ఎంత అలసిపోతారు. ఒక్కసారిగా ఎలా పేదవారైపోయారు, ఈ రహస్యమంతటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. కొత్త-కొత్తవారు వస్తే వారికి ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది. ప్రతీ ఒక్క విషయానికి మనుష్యులు ఎంతగా ఆలోచిస్తారు. ఏదైనా ఇంద్రజాలము జరుగుతుందేమో అని అనుకుంటారు. అరే, మీరే అంటారు కదా, భగవంతుడు ఇంద్రజాలికుడు అని. తండ్రి అంటారు, అవును, నేను తప్పకుండా ఇంద్రజాలికుడినే. కానీ మనుష్యులను గొర్రెలు, మేకలుగా చేసే ఇంద్రజాలము కాదు. ఫలానావారు గొర్రెల వలె ఉన్నారు అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సురమండలం (దేవతల సమూహము) యొక్క స్వరాలు గొర్రెకు ఏమి తెలుసు అన్న నానుడి ఉంది (అర్థం చేసుకోలేనివారిని కాన్ని సార్లు గొర్రెతో పోలుస్తారు). ఈ సమయములోనైతే మనుష్యులందరూ గొర్రెలు, మేకల వలె ఉన్నారు. ఈ విషయాలన్నీ ఇక్కడివే. ఈ సమయానికి చెందిన గాయనమే. కల్పము యొక్క అంతిమమును కూడా మనుష్యులు అర్థం చేసుకోలేరు. చండికకు ఎంత పెద్ద మేళా జరుగుతుంది. ఆమె ఎవరు? ఆమె ఒక దేవి అని అంటారు. ఇటువంటి పేర్లు అయితే అక్కడ అసలు ఉండనే ఉండవు. సత్యయుగములో ఎంత చక్కని సుందరమైన పేర్లు ఉంటాయి. సత్యయుగీ సాంప్రదాయాన్ని శ్రేష్ఠాచారీ సాంప్రదాయమని అంటారు. కలియుగీ సాంప్రదాయానికి ఎంత ఛీ-ఛీ టైటిల్స్ ఇస్తారు. ఇప్పటి మనుష్యులను శ్రేష్ఠమైనవారు అని అనరు. దేవతలను శ్రేష్ఠులు అని అంటారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు అని గాయనం కూడా ఉంది. మనుష్యుల నుండి దేవతలుగా, దేవతల నుండి మనుష్యులుగా ఎలా తయారవుతారు, ఈ రహస్యాన్ని తండ్రి మీకు అర్థం చేయించారు. దానిని దైవీ ప్రపంచమని, దీనిని మానవ ప్రపంచమని అంటారు. పగలును వెలుగు అని, రాత్రిని అంధకారమని అంటారు. జ్ఞానము వెలుగు, భక్తి అంధకారము. అజ్ఞాన నిద్ర అని అంటారు కదా. ఇంతకుముందు మాకు ఏమీ తెలియని కారణముగా నేతి-నేతి అనగా మాకు తెలియదు అని అనేవారమని మీకు కూడా అర్థమయ్యింది. మేము కూడా ఇంతకుముందు నాస్తికులమే కదా అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు అనంతమైన తండ్రి గురించి తెలియదు. వారు నిజమైన అవినాశీ బాబా. వారిని సర్వాత్మల తండ్రి అని అంటారు. ఇప్పుడు మనము ఆ అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి పిల్లలకు గుప్త జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానము మనుష్యులెవ్వరి వద్దా దొరకదు. ఆత్మ కూడా గుప్తమే, గుప్త జ్ఞానాన్ని ఆత్మ ధారణ చేస్తుంది. ఆత్మయే నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తుంది. ఆత్మయే గుప్తమైన తండ్రిని గుప్తముగా స్మృతి చేస్తుంది.

తండ్రి అంటారు, పిల్లలూ, దేహాభిమానులుగా అవ్వకండి. దేహాభిమానము వలన ఆత్మ శక్తి అంతమైపోతుంది. ఆత్మ-అభిమానిగా అవ్వడము వలన ఆత్మలో శక్తి జమ అవుతుంది. తండ్రి అంటారు, డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకుని నడుచుకోవాలి. ఈ అవినాశీ డ్రామా రహస్యము గురించి ఎవరికైతే సరిగ్గా తెలుసో, వారు సదా హర్షితముగా ఉంటారు. ఈ సమయములో మనుష్యులు పైకి వెళ్ళేందుకు ఎంతగా ప్రయత్నిస్తారు, పైన ప్రపంచము ఉందని భావిస్తారు. పైన ప్రపంచము ఉందని శాస్త్రాలలో విని ఉన్నారు, కావున అక్కడకు వెళ్ళి చూద్దామనుకుంటారు. అక్కడ ప్రపంచాన్ని తయారుచేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడి ప్రపంచములో చాలామంది అయిపోయారు కదా. భారత్ లో కేవలం ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇక ఏ ఇతర ఖండాలు మొదలైనవి ఉండేవి కావు. మళ్ళీ ఇప్పుడు ఎన్నింటిలో నివసిస్తున్నారు. మీరు ఆలోచించండి, భారత్ యొక్క ఎంత చిన్న భాగములో దేవతలు ఉంటారు. జమునా నదీ తీరముపైనే పరిస్తాన్ ఉండేది, అక్కడ ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేసేవారు. ఎంతటి సుందరమైన, శోభాయమానమైన, సతోప్రధానమైన ప్రపంచమది. ప్రకృతిసిద్ధమైన సౌందర్యముండేది. ఆత్మలోనే చమత్కారమంతా ఉంటుంది. శ్రీకృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది అన్నది పిల్లలకు చూపించాము. గది అంతా ప్రకాశవంతమైపోయినట్లు అవుతుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు, ఇప్పుడు మీరు పరిస్తాన్ లోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. అంతేకానీ సరోవరములో మునక వేయడముతో దేవతలుగా అయిపోతారు అని కాదు. ఇవన్నీ అసత్యమైన పేర్లు పెట్టేసారు. లక్షల సంవత్సరాలు అని అనేటప్పటికి అంతా మర్చిపోయారు. ఇప్పుడు మీరు నంబరువారు పురుషార్థానుసారముగా మర్చిపోనివారిగా అవుతున్నారు. ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రను శరీరము ద్వారా అభినయిస్తుంది, మళ్ళీ శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరము పరిస్థితి ఎలా అయిపోతుందో చూడండి. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. ఇది ఎంతగా ఆలోచించవలసిన పెద్ద విషయము. మొత్తం ప్రపంచములోని పాత్రధారులు (ఆత్మలు) తమ పాత్రానుసారముగానే పాత్రను అభినయిస్తారు. కొద్దిగా కూడా తేడా వచ్చే అవకాశము లేదు. అదే విధంగా మొత్తం పాత్ర అంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇందులో సంశయము కలగకూడదు. ప్రతి ఒక్కరి బుద్ధిలో తేడా ఉండొచ్చు ఎందుకంటే ఆత్మ మనుస్సు, బుద్ధి సహితముగా ఉంది కదా. మేము స్కాలర్షిప్ తీసుకోవాలి అని పిల్లలకు తెలుసు కావున హృదయము లోలోపల సంతోషిస్తుంది. ఇక్కడ కూడా లోపలికి వస్తూనే లక్ష్యము ఎదురుగా కనిపించేటప్పటికి తప్పకుండా సంతోషము కలుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, మేము ఈ దేవీ-దేవతలుగా తయారయ్యేందుకు ఇక్కడ చదువుతున్నాము. వేరే జన్మ యొక్క లక్ష్యాన్ని ఇప్పుడే చూడగలిగే స్కూల్ ఇంకెక్కడా లేదు. మీరు లక్ష్మీ-నారాయణుల వలె తయారవుతున్నారు అన్నది మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనము సంగమయుగములో ఉన్నాము, భవిష్యత్తులో వీరి వలె లక్ష్మీ-నారాయణులుగా తయారయ్యే చదువును చదువుతున్నాము. ఇది ఎంతటి గుప్తమైన చదువు. లక్ష్యము-ఉద్దేశ్యమును చూసి ఎంత సంతోషము కలగాలి. సంతోషానికి అవధులు లేవు. స్కూల్ లేక పాఠశాల అంటే ఇలా ఉండాలి. ఉండడం ఎంత గుప్తముగా ఉంది, కానీ ఇది చాలా గొప్ప పాఠశాల. ఎంత పెద్ద చదువో అన్ని ఎక్కువ సదుపాయాలు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు నేలపై కూర్చుని చదువుకుంటారు. ఆత్మయే చదవవలసి ఉంటుంది, ఇక నేలపై కూర్చున్నా లేక ఆసనముపై కూర్చున్నా కానీ సంతోషముతో గంతులు వేస్తూ ఉండండి, ఈ చదువులో పాస్ అయిన తర్వాత వెళ్ళి ఇలా తయారవుతాము అని. నేను వీరిలో ఏ విధంగా ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తాను అని ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి వచ్చి తన పరిచయాన్ని ఇచ్చారు. తండ్రి దేవతలనైతే చదివించరు. దేవతలకు ఈ జ్ఞానమెక్కడ ఉంది. దేవతలలో జ్ఞానము లేదా? అని మనుష్యులు తికమకపడతారు. దేవతలే ఈ జ్ఞానము ద్వారా దేవతలవుతారు. దేవతలుగా అయిన తర్వాత ఇక జ్ఞానము యొక్క అవసరమేముంది. లౌకిక చదువు ద్వారా బ్యారిస్టర్ అయిన తర్వాత, సంపాదన మొదలుపెట్టిన తర్వాత, మళ్ళీ బ్యారిస్టరీ చదువుతారా ఏమిటి? అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అవినాశీ డ్రామా రహస్యాన్ని యథార్థముగా అర్థం చేసుకుని హర్షితముగా ఉండాలి. ఈ డ్రామాలో ప్రతి ఒక్క పాత్రధారి పాత్ర ఎవరిది వారిది, దానిని అదే విధంగా అభినయిస్తున్నారు.

2. లక్ష్యము-ఉద్దేశ్యమును ముందు ఉంచుకుని సంతోషములో గంతులు వేయాలి. మేము ఈ చదువు ద్వారా ఈ విధంగా లక్ష్మీ-నారాయణుల వలె తయారవుతామని బుద్ధిలో ఉండాలి.

వరదానము:-

స్మృతి మరియు సేవ యొక్క శక్తిశాలీ ఆధారము ద్వారా తీవ్రగతితో ముందుకు వెళ్ళే మాయాజీత్ భవ

బ్రాహ్మణ జీవితానికి ఆధారము స్మృతి మరియు సేవ, ఈ రెండు ఆధారాలు సదా శక్తిశాలిగా ఉన్నట్లయితే తీవ్రగతితో ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ సేవ చాలా ఎక్కువ ఉండి, స్మృతి బలహీనముగా ఉన్నా లేక స్మృతి చాలా బాగుండి, సేవ బలహీనముగా ఉన్నా, తీవ్రగతి ఉండదు. స్మృతి మరియు సేవ, రెండింటిలో తీవ్రగతి ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థ సేవ తోడుతోడుగా ఉన్నట్లయితే మాయాజీతులుగా అవ్వటము సహజము. ప్రతి కర్మలో కర్మ సమాప్తికి ముందే సదా విజయము కనిపిస్తుంది.

స్లోగన్:-

ఈ ప్రపంచాన్ని అలౌకిక ఆటగా మరియు పరిస్థితులను అలౌకిక ఆటబొమ్మలుగా భావిస్తూ నడుచుకోండి.