24-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ జ్ఞానము మిమ్మల్ని శీతలముగా
తయారుచేస్తుంది, ఈ జ్ఞానముతో కామ-క్రోధాల అగ్ని సమాప్తమైపోతుంది, భక్తితో ఆ అగ్ని
సమాప్తమవ్వదు’’
ప్రశ్న:-
స్మృతిలో
ముఖ్యమైన శ్రమ ఏమిటి?
జవాబు:-
తండ్రి
స్మృతిలో కూర్చునే సమయములో దేహము కూడా గుర్తుకు రాకూడదు. ఆత్మాభిమానిగా అయి తండ్రిని
స్మృతి చేయండి, ఇందులోనే శ్రమ ఉంది, ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి ఎందుకంటే
అర్ధకల్పము దేహాభిమానులుగా ఉన్నారు. భక్తి అంటేనే దేహము యొక్క స్మృతి.
ఓంశాంతి
స్మృతి కొరకు ఏకాంతము ఎంతో అవసరమని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఏకాంతములో లేదా
శాంతిలో ఎంతగా తండ్రి స్మృతిలో ఉండగలరో అంతగా గుంపులో ఉండలేరు. స్కూల్లో కూడా
పిల్లలు చదువుకునేటప్పుడు ఏకాంతములోకి వెళ్ళి చదువుకుంటారు. ఇక్కడ కూడా ఏకాంతము
అవసరము. విహరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్మృతి యాత్ర ముఖ్యమైనది. చదువైతే
చాలా సహజము. అర్ధకల్పముగా మాయ రాజ్యము రావడముతోనే మీరు దేహాభిమానులుగా అవుతారు.
మొట్టమొదటి శత్రువు దేహాభిమానము. తండ్రిని స్మృతి చేయడానికి బదులుగా దేహాన్ని స్మృతి
చేస్తారు. దీనిని దేహ అహంకారము అని అంటారు. ఇక్కడ పిల్లలైన మీకు చెప్పడం జరుగుతుంది
- ఆత్మాభిమానులుగా అవ్వండి, ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. ఇప్పుడు భక్తి నుండైతే
విముక్తులు అయ్యారు. భక్తి శరీరముతో పాటు జరుగుతుంది. తీర్థ స్థానాలు మొదలైన చోట్లకు
శరీరాన్ని తీసుకువెళ్ళవలసి ఉంటుంది. దర్శనము చేసుకోవాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా
శరీరము వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఇదే చింతన చేయాలి - నేను ఒక ఆత్మను, నేను
పరమపిత పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి, అంతే. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా
పాపాలు కట్ అవుతాయి. భక్తి మార్గములోనైతే ఎప్పుడూ పాపాలు కట్ అవ్వవు. ఎవరైనా
వృద్ధులు మొదలైనవారు ఉన్నట్లయితే వారికి లోపల - మేము భక్తి చేయకపోతే నష్టము
కలుగుతుంది, నాస్తికులైపోతాము అని ఈ భయము ఉంటుంది. భక్తి యొక్క అగ్ని అంటుకున్నట్లు
ఉంటుంది మరియు జ్ఞానములో శీతలత ఉంటుంది. ఇందులో కామ-క్రోధాల అగ్ని సమాప్తమవుతుంది.
భక్తి మార్గములో మనుష్యులు ఎంతగా భావన పెట్టుకుంటారు, కష్టపడతారు. ఉదాహరణకు
బద్రీనాథ్ కు వెళ్ళారనుకోండి, మూర్తి యొక్క సాక్షాత్కారము జరిగింది అనుకోండి, ఆ
తర్వాత ఏమిటి! వెంటనే భావన ఏర్పడుతుంది, ఇక తర్వాత బద్రీనాథుడి స్మృతి తప్ప
ఇంకెవ్వరి స్మృతి బుద్ధిలో ఉండదు. పూర్వము కాలినడకన వెళ్ళేవారు. తండ్రి అంటారు, నేను
అల్పకాలము కొరకు మనోకామనలు పూర్తి చేస్తాను, సాక్షాత్కారము చేయిస్తాను. అంతేకానీ
నేను వీటి ద్వారా లభించను. నేను లేకుండా వారసత్వము లభించదు. వారసత్వమైతే మీకు నా
నుండే లభించాలి కదా. వీరైతే అందరూ దేహధారులు. వారసత్వము రచయిత అయిన తండ్రి ఒక్కరి
నుండే లభిస్తుంది, ఇక మిగిలిన జడమైనవైనా లేక చైతన్యమైనవైనా, అవన్నీ రచన. రచన నుండి
ఎప్పుడూ వారసత్వము లభించదు. పతిత-పావనుడు తండ్రి ఒక్కరే. కుమారీలైతే సాంగత్య దోషము
నుండి స్వయాన్ని చాలా రక్షించుకోవాలి. తండ్రి అంటారు, ఈ పతితత్వము వలన మీరు
ఆదిమధ్యాంతాలు దుఃఖము పొందుతారు. ఇప్పుడు అందరూ పతితులు. మీరు ఇప్పుడు పావనముగా
అవ్వాలి. నిరాకారుడైన తండ్రియే వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ బ్రహ్మా
చదివిస్తున్నారని ఎప్పుడూ భావించకండి. అందరి బుద్ధి శివబాబా వైపు ఉండాలి. శివబాబా
వీరి ద్వారా చదివిస్తున్నారు. దాదీలైన మిమ్మల్ని కూడా చదివించేవారు శివబాబాయే. మీరు
వారికి ఏ విధంగా మర్యాద చేస్తారు! మీరు శివబాబా కొరకు ద్రాక్ష, మామిడి పళ్ళు
తీసుకువస్తారు, శివబాబా అంటారు - నేను అభోక్తను. పిల్లలైన మీ కోసమే అన్నీ ఉన్నాయి.
భక్తులు భోగ్ అర్పించి ఆ తర్వాత పంచుకుని తింటారు. నేనేమీ తినను. తండ్రి అంటారు,
నేను వచ్చిందే పిల్లలైన మిమ్మల్ని చదివించి పావనముగా తయారుచేయడానికి. పావనముగా అయి
మీరు ఎంతో ఉన్నత పదవిని పొందుతారు. ఇదే నా వ్యాపారము. శివ భగవానువాచ అని అంటారే కానీ
బ్రహ్మా భగవానువాచ అని అనరు. బ్రహ్మా వాచ అని కూడా అనరు. వీరు కూడా మురళి
వినిపిస్తారు కానీ ఎల్లప్పుడూ శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి. ఏ బిడ్డకైనా
మంచిగా బాణము వేయవలసి ఉంటే వారు స్వయంగా ప్రవేశిస్తారు. జ్ఞాన బాణము చాలా పదునైనది
అని అంటూ ఉంటారు కదా. సైన్సులో కూడా ఎంతటి శక్తి ఉంది. బాంబులు మొదలైనవాటితో ఎంత
విస్ఫోటము జరుగుతుంది. మీరు ఎంత సైలెన్స్ లో ఉంటారు. సైన్సు పై సైలెన్స్ విజయము
పొందుతుంది.
మీరు ఈ సృష్టిని పావనముగా తయారుచేస్తారు. మొదటైతే స్వయాన్ని పావనముగా
తయారుచేసుకోవాలి. డ్రామానుసారముగా పావనముగా కూడా అవ్వవలసిందే, అందుకే వినాశనము కూడా
నిశ్చితమై ఉంది. డ్రామాను అర్థం చేసుకుని చాలా హర్షితముగా ఉండాలి. ఇప్పుడు మనము
శాంతిధామానికి వెళ్ళాలి. తండ్రి అంటారు - అది మీ ఇల్లు, మరి ఇంటికి సంతోషముగా
వెళ్ళాలి కదా. ఇందులో దేహీ-అభిమానిగా అయ్యేందుకు ఎంతో పురుషార్థము చేయాలి. ఈ స్మృతి
యాత్రకే బాబా ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు, ఇందులోనే శ్రమ ఉంది. తండ్రి అడుగుతున్నారు
- నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయడము సహజమా లేక ఒక చోట కూర్చుని స్మృతి చేయడము సహజమా?
భక్తి మార్గములో కూడా ఎంతగా మాల తిప్పుతూ ఉంటారు, రామా-రామా అని జపిస్తూ ఉంటారు.
లాభమైతే ఏమీ లేదు. తండ్రి అయితే పిల్లలైన మీకు చాలా సహజమైన యుక్తిని
తెలియజేస్తున్నారు - భోజనము తయారుచేయండి, ఏదైనా చేయండి కానీ తండ్రిని స్మృతి చేయండి.
భక్తి మార్గములో శ్రీనాథ ద్వారములో నైవేద్యాన్ని తయారుచేసేటప్పుడు కొద్దిగా కూడా
శబ్దము రాకూడదని నోటికి గుడ్డను కట్టుకుంటారు. అది భక్తి మార్గము. మీరైతే తండ్రిని
స్మృతి చేయాలి. వారు అంతగా నైవేద్యము అర్పిస్తారు, అయినా కానీ ఎవరూ తినరు. పండాల
కుటుంబాలు ఉంటాయి, వారు తింటారు. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని మీకు ఇక్కడ
తెలుసు. భక్తిలో శివబాబాయే మమ్మల్ని చదివిస్తున్నారని భావించరు. శివ పురాణము
తయారుచేసారు కానీ అందులో శివ-పార్వతులు, శివ-శంకరులు అని అంతా కలిపేసారు, దానిని
చదవడము వలన ఏ లాభము ఉండదు. ప్రతి ఒక్కరూ తమ-తమ శాస్త్రాన్ని చదవవలసి ఉంటుంది.
భారతవాసులది ఒక్క గీతయే. క్రిస్టియన్లకు బైబిల్ ఒక్కటే ఉంటుంది. దేవీ-దేవతా ధర్మము
యొక్క శాస్త్రము గీత. అందులోనే జ్ఞానము ఉంది. జ్ఞానమునే చదవడము జరుగుతుంది. మీరు
జ్ఞానాన్ని చదవాలి. యుద్ధాలు మొదలైనవాటి విషయాలు ఏ పుస్తకాలలోనైతే ఉన్నాయో, వాటితో
మీకు ఏ పని లేదు. మనము యోగబలము కలవారము, కావున బాహుబలము కలవారి కథలను ఎందుకు వినాలి!
వాస్తవానికి మీ యుద్ధమంటూ ఏదీ లేదు. మీరు యోగబలము ద్వారా పంచ వికారాలపై విజయాన్ని
పొందుతారు. మీ యుద్ధము పంచ వికారాలతో ఉంటుంది. అక్కడ మనుష్యులు మనుష్యులతో యుద్ధము
చేస్తారు. మీరు మీలోని వికారాలతో యుద్ధము చేస్తారు. ఈ విషయాలను సన్యాసులు మొదలైనవారు
అర్థం చేయించలేరు. మీకు డ్రిల్ మొదలైనవి కూడా నేర్పించడము జరగదు. మీ డ్రిల్ ఒక్కటే.
మీది యోగబలము. స్మృతి బలముతో పంచ వికారాలపై విజయము పొందుతారు. ఈ పంచ వికారాలు
శత్రువులు. వాటిలో కూడా నంబరువన్ దేహాభిమానము. తండ్రి అంటారు - మీరైతే ఆత్మ కదా,
ఆత్మ అయిన మీరు వస్తారు, వచ్చి గర్భములో ప్రవేశిస్తారు. నేనైతే ఈ శరీరములో
విరాజమానమై ఉన్నాను. నేనేమీ గర్భములో ప్రవేశించను. సత్యయుగములో మీరు గర్భ మహలులో
ఉంటారు. ఆ తర్వాత రావణ రాజ్యములో గర్భ జైలులోకి వెళ్తారు. నేనైతే ప్రవేశిస్తాను.
దీనిని దివ్య జన్మ అని అంటారు. డ్రామానుసారముగా నేను వీరిలోకి రావలసి ఉంటుంది.
వీరికి బ్రహ్మా అన్న పేరును పెడతాను ఎందుకంటే నాకు చెందినవారిగా అయ్యారు కదా. దత్తత
తీసుకున్న తర్వాత ఎంత మంచి-మంచి పేర్లు పెడతారు. మీకు కూడా చాలా మంచి-మంచి పేర్లు
పెట్టాము. సందేశీ ద్వారా చాలా అద్భుతమైన లిస్ట్ వచ్చింది. బాబాకు ఆ పేర్లన్నీ ఏమీ
గుర్తు లేవు. పేరుతో పనేమీ లేదు. శరీరానికి పేరు పెట్టడము జరుగుతుంది కదా. ఇప్పుడైతే
తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి, అంతే. మీకు
తెలుసు, మనము పూజ్య దేవతలుగా అవుతాము, ఆ తర్వాత రాజ్యము చేస్తాము, మళ్ళీ భక్తి
మార్గములో మన చిత్రాలనే తయారుచేస్తారు. దేవీల చిత్రాలను ఎన్నో తయారుచేస్తారు.
ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. మట్టితో సాలిగ్రామాలను తయారుచేస్తారు, మళ్ళీ
రాత్రివేళ వాటిని పగలగొడతారు. దేవీలను కూడా అలంకరించి, పూజ చేసి, మళ్ళీ సముద్రములో
వేసేస్తారు. తండ్రి అంటారు - నా రూపాన్ని కూడా తయారుచేసి, తినిపించి-త్రాగించి మళ్ళీ
నన్ను రాయి-రప్పలలో ఉన్నారు అని అనేస్తారు. అందరికన్నా ఎక్కువగా నా దశ దుర్దశ
చేస్తారు. మీరు ఎంత నిరుపేదలుగా అయిపోయారు. పేదవారే మళ్ళీ ఉన్నత పదవిని పొందుతారు.
షావుకారులు కష్టము మీద జ్ఞానాన్ని తీసుకుంటారు. బాబా కూడా షావుకారుల నుండి అంతగా
తీసుకుని ఏం చేస్తారు! ఇక్కడైతే పిల్లల యొక్క ఒక్కొక్క బిందువుతో ఈ ఇళ్ళు మొదలైనవి
తయారవుతాయి. బాబా, మా పేరు మీద ఒక ఇటుకను పెట్టండి అని అంటారు. దానికి రిటర్నులో
మాకు బంగారము-వెండి యొక్క మహళ్ళు లభిస్తాయని భావిస్తారు. అక్కడైతే బంగారము ఎంతగానో
ఉంటుంది. బంగారు ఇటుకలు ఉంటాయి, అందుకే కదా వాటితో ఇళ్ళు తయారవుతాయి. కావున తండ్రి
చాలా ప్రేమతో అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి,
ఇప్పుడు నాటకము పూర్తవుతుంది.
తండ్రి పేద పిల్లలకు షావుకారులుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు -
మధురమైన పిల్లలూ, మీ వద్ద ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ ఏదీ ఉండేది లేదు.
ఇక్కడ ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అది కొత్త ప్రపంచములో మీకు వంద రెట్లు అయ్యి
లభిస్తుంది. బాబా ఏదీ యాచించరు. వారు దాత. ఈ యుక్తిని తెలియజేయడం జరుగుతుంది.
ఇక్కడైతే అంతా మట్టిలో కలిసిపోనున్నది. కొంత ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు కొత్త
ప్రపంచములో లభిస్తుంది. ఇది ఈ పాత ప్రపంచము యొక్క వినాశన సమయము. ఇవేవీ ఉపయోగపడవు.
అందుకే బాబా అంటారు - ఇంటి-ఇంటిలోనూ యూనివర్శిటీని మరియు హాస్పిటల్ ను తెరవండి,
తద్వారా ఆరోగ్యము మరియు సంపద లభిస్తాయి. ఇదే ముఖ్యము. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
రాత్రి క్లాసు 12-3-68
ఈ సమయములో పేద, సాధారణ మాతలైన మీరు పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందుతారు.
యజ్ఞములో సహాయము మొదలైనవి కూడా మాతలు ఎంతగానో చేస్తారు, సహాయకులుగా అయ్యే పురుషులు
చాలా తక్కువమంది ఉంటారు. మాతలకు లౌకిక వారసులుగా అయ్యే విషయములో నషా ఉండదు. వారు
బీజాలను నాటుతూ ఉంటారు, తమ జీవితాన్ని తయారుచేసుకుంటూ ఉంటారు. మీ జ్ఞానము
యథార్థమైనది, మిగిలినదంతా భక్తి. ఆత్మిక తండ్రియే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు.
తండ్రిని అర్థం చేసుకున్నట్లయితే తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటారు.
మీ చేత తండ్రి పురుషార్థము చేయిస్తూ ఉంటారు, అర్థం చేయిస్తూ ఉంటారు. సమయము వృధా
చెయ్యకండి. కొందరు మంచి పురుషార్థులు ఉన్నారని, కొందరు మధ్యస్థముగా ఉన్నారని, కొందరు
మూడవ శ్రేణిలో ఉన్నారని తండ్రికి తెలుసు. బాబాను అడిగినట్లయితే - నీవు ఫస్ట్ లో
ఉన్నావా లేక సెకండులో ఉన్నావా లేక థర్డ్ లో ఉన్నావా అన్నది వెంటనే చెప్తారు. ఎవరికీ
జ్ఞానాన్ని ఇవ్వకపోతే థర్డ్ క్లాస్ అయినట్లు. ఋజువును ఇవ్వకపోతే బాబా తప్పకుండా
అంటారు కదా. భగవంతుడు వచ్చి ఏ జ్ఞానమునైతే నేర్పిస్తారో అది మళ్ళీ కనుమరుగైపోతుంది.
ఇది ఎవ్వరికీ తెలియదు. డ్రామా ప్లాన్ అనుసారముగా ఇది భక్తి మార్గము, దీని ద్వారా
నన్ను ఎవ్వరూ పొందలేరు, సత్యయుగములోకి ఎవ్వరూ వెళ్ళలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు
పురుషార్థము చేస్తున్నారు. కల్ప పూర్వము వలె ఎవరు ఎంతగా పురుషార్థము చేసారో, అంతగానే
చేస్తూ ఉంటారు. తమ కళ్యాణము ఎవరు చేసుకుంటున్నారు అన్నది తండ్రి అర్థం చేసుకోగలరు.
తండ్రి అయితే అంటారు - ప్రతి రోజూ ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము ఎదురుగా వచ్చి
కూర్చోండి. బాబా, మీ శ్రీమతముపై ఈ వారసత్వాన్ని మేము తప్పకుండా తీసుకుంటాము. మీ
సమానముగా తయారుచేసే సేవా అభిరుచి తప్పకుండా ఉండాలి. సెంటర్లలో ఉన్నవారికి కూడా
వ్రాస్తూ ఉంటాను - ఇన్ని సంవత్సరాలు చదువుకున్నారు, మరి ఎవరినీ చదివించలేకపోతే ఇక
ఏం చదువుకున్నట్లు! పిల్లల యొక్క ఉన్నతినైతే చెయ్యాలి కదా. బుద్ధిలో మొత్తము రోజంతా
సేవా ఆలోచనలు నడవాలి.
మీరు వానప్రస్థులు కదా. వానప్రస్థులకు కూడా ఆశ్రమము ఉంటుంది. వానప్రస్థుల వద్దకు
వెళ్ళాలి, మరణించేందుకు ముందే లక్ష్యమునైతే తెలియజేయండి. వాణి నుండి అతీతముగా మీ
ఆత్మ ఎలా వెళ్తుంది! పతిత ఆత్మ అయితే వెళ్ళలేదు. భగవానువాచ - నన్నొక్కరినే స్మృతి
చేసినట్లయితే మీరు వానప్రస్థములోకి వెళ్ళిపోతారు. బెనారస్ లో కూడా సేవ చాలా ఉంది.
చాలామంది సాధువులు కాశీ వాసము చేయడానికి అక్కడ ఉంటారు, మొత్తము రోజంతా శివకాశి
విశ్వనాథ గంగ అని అంటూ ఉంటారు. మీ లోపల ఎల్లప్పుడూ సంతోషముతో కూడిన చప్పట్లు
మ్రోగుతూ ఉండాలి. మీరు విద్యార్థులు కదా! సేవ కూడా చేస్తారు, చదువుకుంటారు కూడా.
తండ్రిని స్మృతి చెయ్యాలి, వారసత్వాన్ని తీసుకోవాలి. మనము ఇప్పుడు శివబాబా వద్దకు
వెళ్తాము, ఇది మన్మనాభవ. కానీ చాలామందికి స్మృతి ఉండదు. పరచింతనతో కూడిన మాటలు
మాట్లాడుతూ ఉంటారు. స్మృతిదే ముఖ్యమైన విషయము. స్మృతియే సంతోషములోకి తీసుకువస్తుంది.
విశ్వములో శాంతి నెలకొనాలని అందరూ కోరుకుంటారు. బాబా కూడా అంటారు - విశ్వములో శాంతి
ఇప్పుడు స్థాపన అవుతోందన్న విషయము వారికి తెలియజేయండి. అందుకే బాబా
లక్ష్మీ-నారాయణుల చిత్రానికి ఎక్కువ మహత్వము ఇస్తారు. సుఖము-శాంతి, పవిత్రత అన్నీ
ఉన్న ఆ ప్రపంచము స్థాపన అవుతోందని చెప్పండి. విశ్వములో శాంతి ఉండాలని అందరూ అంటారు.
ప్రైజ్లు కూడా ఎంతోమందికి లభిస్తూ ఉంటాయి. ప్రపంచములో శాంతిని స్థాపించేవారైతే
యజమానే కదా. వారి రాజ్యములో విశ్వములో శాంతి ఉండేది. ఒకే భాష, ఒకే రాజ్యము, ఒకే
ధర్మము ఉండేవి. మిగిలిన ఆత్మలందరూ నిరాకారీ ప్రపంచములో ఉండేవారు. ఇటువంటి
ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేసారు! శాంతిని ఎవరు స్థాపన చేసారు! అది ప్యారడైజ్ గా
ఉండేదని, వీరి రాజ్యము ఉండేదని విదేశీయులు కూడా అర్థం చేసుకుంటారు. ప్రపంచములో శాంతి
అయితే ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. ప్రాతః కాలములో చేసే ఊరేగింపులో కూడా ఈ
లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని ఉంచండి అని బాబా అర్థం చేయించారు, తద్వారా వీరి రాజ్య
స్థాపన జరుగుతూ ఉందని అందరి చెవులలో పడాలి. నరకము యొక్క వినాశనము ఎదురుగా నిలిచి
ఉంది. డ్రామా అనుసారముగా బహుశా ఆలస్యము ఉందన్నదైతే తెలుసు. పెద్ద-పెద్దవారి
భాగ్యములో ఇప్పుడు లేదు. అయినా కూడా బాబా పురుషార్థము చేయిస్తూ ఉంటారు. డ్రామా
అనుసారముగా సేవ జరుగుతూ ఉంది. అచ్ఛా. గుడ్ నైట్.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సాంగత్య దోషము నుండి స్వయాన్ని చాలా-చాలా సంభాళించుకోవాలి. ఎప్పుడూ పతితుల
సాంగత్యములోకి రాకూడదు. సైలెన్స్ బలముతో ఈ సృష్టిని పావనముగా తయారుచేసే సేవ చేయాలి.
2. డ్రామాను మంచి రీతిలో అర్థం చేసుకుని హర్షితముగా ఉండాలి. తమ సర్వస్వాన్ని
కొత్త ప్రపంచము కొరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
వరదానము:-
తండ్రి ద్వారా సఫలతా రూపీ తిలకాన్ని ప్రాప్తి చేసుకునే సదా
ఆజ్ఞాకారీ, హృదయ సింహాసనాధికారీ భవ
భాగ్య విధాత అయిన తండ్రి ప్రతి రోజు అమృతవేళ తమ ఆజ్ఞాకారీ
పిల్లలకు సఫలత యొక్క తిలకాన్ని దిద్దుతారు. ఆజ్ఞాకారులైన బ్రాహ్మణ పిల్లలు ఎప్పుడూ
కష్టము లేక శ్రమ అన్న పదాలను నోటి నుండి ఏమిటి, సంకల్పములో కూడా తీసుకురాలేరు. వారు
సహజయోగిగా అవుతారు. అందుకే ఎప్పుడూ నిరుత్సాహపడకండి, సదా హృదయ సింహాసనాధికారులుగా
అవ్వండి, దయార్ద్ర హృదయులుగా అవ్వండి. అహం భావాన్ని మరియు అనుమానపు భావాన్ని
సమాప్తము చేయండి.
స్లోగన్:-
విశ్వ
పరివర్తన యొక్క డేట్ గురించి ఆలోచించకండి, స్వ పరివర్తన యొక్క ఘడియను ఫిక్స్
చేసుకోండి.
అవ్యక్త ప్రేరణలు -
సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి
పవిత్రతా పర్సనాలిటీతో
సంపన్నమైన రాయల్ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారిని సభ్యతా దేవీ అని అంటారు. వారిలో
క్రోధమనే వికారము యొక్క అపవిత్రత కూడా ఉండదు. క్రోధము యొక్క సూక్ష్మ రూపాలైన ఈర్ష్య,
ద్వేషము, అయిష్టము అనేవి ఒకవేళ లోపల ఉన్నట్లయితే అవి కూడా అగ్ని వంటివి, అవి లోలోపలే
కాల్చేస్తాయి. బయటకు ఎరుపుగా, పచ్చగా ఉండరు, కానీ నల్లగా ఉంటారు. కనుక ఇప్పుడు ఈ
నలుపుదనాన్ని సమాప్తము చేసి సత్యముగా మరియు స్వచ్ఛముగా అవ్వండి.
| | |