24-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘పవిత్రత అనే గుణాన్ని ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్లపై నడుస్తుంటే దైవీ రాజ్యములోకి వస్తారు’’

(ఉదయం క్లాసులో వినిపించేందుకు జగదంబ తల్లి యొక్క మధుర మహావాక్యాలు)

ఓంశాంతి
ఈ ప్రపంచాన్ని నాటకము అని కూడా అంటారు, డ్రామా అనండి, నాటకమనండి, ఆట అనండి, ఏదన్నా విషయమైతే ఒక్కటే. నాటకము అనేదాంట్లో ఒకటే కథ ఉంటుంది. అందులో ఎన్నో ఉపకథలను మధ్యలో చూపిస్తుంటారు కానీ కథ అయితే ఒకటే ఉంటుంది. అదే విధంగా ఇది అనంతమైన విశ్వ డ్రామా, దీనిని నాటకము అని కూడా అంటారు, ఇందులో మనమందరము పాత్రధారులము. ఇప్పుడు మనము పాత్రధారులము కావున ఈ నాటకము గురించి పూర్తిగా తెలిసి ఉండాలి - ఏ కథతో ఇది ప్రారంభమవుతుంది, మన ఈ పాత్ర ఎక్కడి నుండి ప్రారంభమైంది మరియు ఎక్కడ పూర్తవుతుంది, అంతేకాక అందులో ఎప్పటికప్పుడు ఏయే పాత్రధారులకు ఎలాంటి, ఎలాంటి పాత్ర ఉంటుంది మరియు ఈ నాటకానికి డైరెక్టర్, క్రియేటర్ ఎవరు, మరియు ఈ నాటకములోని హీరో, హీరోయిన్లు పాత్ర ఎవరిది అన్న ఈ అన్ని విషయాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఊరికే నాటకము అని అనినందువల్ల పని జరగదు. నాటకము అని అన్నప్పుడు ఆ నాటకములో మనము పాత్రధారులము కూడా. ఒకవేళ డ్రామాలోని పాత్రధారినెవరినైనా మనము ఈ డ్రామాలోని కథ ఏమిటి, ఇది ఎక్కడి నుండి మొదలవుతుంది, ఎక్కడ పూర్తవుతుంది అని అడిగితే, అప్పుడు వారు, ఏమో నాకు తెలియదు అని చెప్తే దానినేమంటారు? నేను పాత్రధారిని అని అంటారు కానీ ఇతనికి ఈ మాత్రం కూడా తెలియదా... అని అంటారు కదా! పాత్రధారికి అన్ని విషయాలను గురించి తెలిసి ఉండాలి కదా. నాటకం మొదలైందంటే దాని అంతిమము కూడా తప్పకుండా ఉంటుంది. మొదలైన తర్వాత అది అలా నడుస్తూనే ఉంటుంది అని కాదు. కనుక ఈ అన్ని విషయాలను గురించి అర్థం చేసుకోవాలి. ఈ అనంతమైన నాటకానికి రచయిత అయిన వారికి - ఏ విధంగా ఈ నాటకము ప్రారంభమైంది, ఇందులో ముఖ్యమైన పాత్రధారులు ఎవరు, మరియు అంతమంది పాత్రధారులలో హీరో, హీరోయిన్ల పాత్ర ఎవరిది అన్న ఈ అన్ని విషయాలు తెలుసు. ఈ అన్ని విషయాలను తండ్రి అర్థం చేయిస్తున్నారు.

ప్రతిరోజూ క్లాసుకు వచ్చి వినేవారే ఈ అన్ని విషయాల నాలెడ్జ్ ను అర్థం చేసుకుంటారు, దీని మొదటి డైరెక్టర్ మరియు క్రియేటర్ ఎవరు అన్నది వారికి తెలుసు. క్రియేటర్ అని సుప్రీమ్ సోల్ ను (పరమపిత పరమాత్మను) అంటారు, కానీ ఇందులో వారు కూడా పాత్రధారియే, వారి యాక్టింగ్ ఎటువంటిది? డైరెక్టర్ పాత్ర. వారు ఒకేసారి వచ్చి యాక్టర్ గా అవుతారు. ఇప్పుడు డైరెక్టర్ గా అయ్యి యాక్ట్ చేస్తున్నారు. ఈ నాటక ప్రారంభాన్ని నేను చేస్తాను అని వారు అంటారు, ఎలా చేస్తారు? పావనముగా చేయబడిన సత్యయుగ ప్రపంచము ఏదైతే ఉందో, దేనినైతే కొత్త ప్రపంచము అని అంటారో, ఆ కొత్త ప్రపంచాన్ని నేను రచిస్తాను. ఇప్పుడు మీరందరూ, ఎవరైతే పవిత్రతను ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్లపై నడుస్తున్నారో, ఆ పాత్రధారులందరూ ఇప్పుడు పావనముగా అవుతున్నారు, మళ్ళీ ఈ పాత్రధారుల ద్వారానే అనేక జన్మల చక్రము తిరుగుతుంది. ఇప్పుడు పవిత్రంగా అయిన మనుష్యులు మరుసటి జన్మలో దైవీ రాజ్యములోకి వెళ్తారు అని తండ్రియే అర్థం చేయిస్తారు. ఆ రాజ్యము రెండు యుగాలుగా, సూర్యవంశము-చంద్రవంశముగా నడుస్తుంది, తర్వాత ఆ సూర్యవంశీ, చంద్రవంశీ పాత్రధారుల పాత్ర ఎప్పుడైతే పూర్తవుతుందో, అప్పుడు మళ్ళీ కాస్త కిందకు దిగుతారు అనగా వామమార్గములోకి వస్తారు. ఆ తరువాత ఇతర ధర్మాలవారి టర్న్ వస్తుంది. ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్ట్, ఈ ధర్మ స్థాపకులందరూ నంబరువారుగా వచ్చి తమ-తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు.

మరి నాటకములోని కథ ఎక్కడి నుండి మొదలైందో, ఎక్కడ పూర్తయ్యిందో చూడండి. దాని మధ్యలో వేరే-వేరే ఉపకథలు ఎలా నడుస్తాయి అన్న ఈ వృత్తాంతాన్నంతా కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ నాటకము పూర్తయ్యేదుంది. ఆ నాటకమైతే మూడు గంటలలో పూర్తవుతుంది, కానీ ఈ నాటకం పూర్తవ్వటానికి 5000 సంవత్సరాలు పడుతుంది. అందులో ఇప్పుడు ఇంకా కొన్ని సంవత్సరాలే మిగిలి ఉన్నాయి, అందుకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నాటకము పూర్తయిన తరువాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కనుక ఈ మొత్తము వృత్తాంతమంతా బుద్ధిలో ఉండాలి, దీనిని జ్ఞానము అని అంటారు. ఇప్పుడు చూడండి, తండ్రి వచ్చి కొత్త భారత్ ను, కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తున్నారు. భారత్ కొత్తగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రపంచముగా ఉండేది కాదు. ఇప్పుడు ఉన్నది పాత భారత్, కనుక ప్రపంచము కూడా పాతదైపోయింది. తండ్రి వచ్చి భారత్ ను అవినాశీ ఖండముగా చేస్తారు, మన దేశము ప్రాచీనమైనది. ఇప్పుడు దేశము అని అంటారు ఎందుకంటే ఇతర దేశాలలో ఇది కూడా ఒక ముక్కలాగా అయిపోయింది. కానీ వాస్తవానికి మొత్తము ప్రపంచములో, మొత్తము భూమిపై ఒకే భారత్ రాజ్యము ఉండేది, దానినే ప్రాచీన భారత్ అని అంటారు. ఆ సమయములోని భారత్ కే బంగారు పిచ్చుక అన్న గాయనము ఉంది. మొత్తము భూమిపై కేవలం భారత్ యొక్క కంట్రోలే ఉండేది, ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండేది. ఆ సమయములో పూర్తి సుఖము ఉండేది, ఇప్పుడు ఆ సుఖము ఎక్కడ ఉంది. అందుకే తండ్రి అంటున్నారు, దీనిని వినాశనము చేసి మళ్ళీ ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని మరియు ప్రాచీనమైన ఆ కొత్త భారత్ ను, కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తాను. అర్థమైందా. ఆ ప్రపంచములో ఎటువంటి దుఃఖము లేదు, ఎటువంటి రోగము లేదు, ఎప్పుడూ ఎటువంటి అకాల మృత్యువులు లేవు. కనుక అటువంటి జీవితాన్ని పొందడానికి పురుషార్థము చెయ్యండి. అది ఊరికే ఏమైనా లభిస్తుందా. ఎంతోకొంత శ్రమించాలి. బీజాన్ని నాటితేనే పొందుతారు. నాటకపోతే ఎలా పొందుతారు? ఇది కర్మక్షేత్రము, ఈ క్షేత్రములో కర్మల ద్వారా నాటాలి. మనము ఎటువంటి కర్మను నాటితే, అటువంటి ఫలాన్ని పొందుతాము. తండ్రి కర్మలనే బీజాలను నాటడమును నేర్పిస్తున్నారు. ఏ విధంగానైతే వ్యవసాయాన్ని చెయ్యటము నేర్పిస్తారు కదా, ఎలా విత్తనాలు వెయ్యాలి, ఎలా వాటిని సంభాళించాలి అని ఆ ట్రైనింగ్ ను కూడా ఇస్తారు కదా, అలా తండ్రి వచ్చి మనకు కర్మల పొలంలో కర్మలను ఎలా నాటాలి అన్న ట్రైనింగ్ ను ఇస్తున్నారు, అందులో వారు ఏం చెప్తున్నారంటే, మీ కర్మలను ఉన్నతంగా చేసుకోండి, మంచి బీజాలను వేసినట్లయితే ఫలాలు మంచిగా లభిస్తాయి. కర్మ మంచిగా ఉన్నప్పుడు మరి ఏది నాటితే దాని ఫలము కూడా మంచిగానే లభిస్తుంది. ఒకవేళ కర్మ అనే బీజములో శక్తి లేకపోతే, చెడు కర్మను నాటితే ఎటువంటి ఫలము లభిస్తుంది? ఇప్పుడు అదే తింటున్నారు, అందుకే ఏడుస్తున్నారు. ఏదైతే తింటున్నారో దానికే ఏడుస్తున్నారు, దుఃఖము మరియు అశాంతి ఉన్నాయి. ఏదో ఒక రోగము మొదలైన విఘ్నాలు వస్తూనే ఉంటాయి, ఈ విషయాలన్నీ మనుష్యులను దుఃఖితులుగా చేస్తాయి కదా, అందుకే తండ్రి అంటారు, ఇప్పుడు మీ కర్మలను నేను ఉన్నతమైన క్వాలిటీ కలవాటిగా చేస్తాను. విత్తనాలు కూడా క్వాలిటీవే నాటుతారు కదా, అప్పుడు వాటి ఫలము కూడా మంచిగా వెలువడుతుంది. ఒకవేళ విత్తనము మంచి క్వాలిటీదిగా లేకపోతే మరి మంచి క్వాలిటీ కల ఫలము లభించదు. మన కర్మలు కూడా మంచి క్వాలిటీవిగా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు తండ్రి మన కర్మలనే విత్తనాలను మంచి క్వాలిటీవిగా తయారుచేస్తున్నారు. అటువంటి శ్రేష్ఠ క్వాలిటీ కల విత్తనాలను నాటితే శ్రేష్ఠమైన ఫలాలు లభిస్తాయి. కనుక మీ కర్మలనే విత్తనాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మంచిగా తయారుచేసుకోండి మరియు మంచిగా నాటడాన్ని నేర్చుకోండి. కనుక ఈ అన్ని విషయాలను అర్థం చేసుకుని ఇప్పుడు మీ పురుషార్థము చెయ్యండి.

అచ్ఛా, ఇప్పుడు రెండు నిమిషాలు సైలెన్స్. సైలెన్స్ గా ఉండటమంటే నేను ఆత్మను అని అనుకోవటము, మొదట సైలెన్స్, ఆ తరువాత టాకీ(మాటల)లోకి వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, సైలెన్స్ ప్రపంచములోకి పదండి, సైలెన్స్, శాంతి అనేది మన స్వధర్మము. ఆ సైలెన్స్ లోకి వెళ్ళేందుకు ఏమంటారంటే, ఈ దేహము మరియు దేహ సహితంగా దేహ సంబంధాలపై ఇప్పుడు మోహాన్ని వదలండి, వాటి నుండి డిటాచ్ అవ్వండి. సుప్రీమ్ సోల్ సంతానమైన మీరు, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి మరియు నా ధామములోకి వచ్చేయండి అని బాబా అంటారు. కనుక ఇప్పుడు వెళ్ళే విషయముపై అటెన్షన్ పెట్టండి. ఇప్పుడు రావాలని ఆలోచించకండి. అంతమతి సో గతి. ఇప్పుడు ఎవరి పట్ల మోహము ఉండకూడదు. ఇప్పుడు శరీరముపై ఉన్న మోహాన్ని కూడా వదిలిపెట్టండి. అర్థమైందా! మీ ధారణను ఇలా తయారుచేసుకోవాలి. అచ్ఛా, ఇప్పుడు సైలెన్స్ లో కూర్చోండి. నడుస్తూ, తిరుగుతున్నప్పుడు కూడా సైలెన్స్, మాట్లాడుతున్నప్పుడు కూడా సైలెన్స్. మాట్లాడేటప్పుడు సైలెన్స్ ఎలా ఉంటుంది? తెలుసా? మాట్లాడే సమయంలో మన బుద్ధియోగాన్ని - నేను ఆత్మను, మొదట పవిత్రమైన ఆత్మను మరియు సైలెన్స్ ఆత్మను అన్నదానిపై పెట్టుకోవాలి, దీనిని గుర్తు పెట్టుకోండి. మాట్లాడే సమయంలో - నేను ఆత్మను, ఈ శరీర ఇంద్రియాల ద్వారా మాట్లాడుతాను అన్న ఈ జ్ఞానం ఉండాలి. ఈ అభ్యాసము ఉండాలి. మనము దీని ఆధారమును తీసుకుని మాట్లాడుతాము అన్నట్లు ఉండాలి. ఉదాహరణకు, ఇప్పుడు కనుల ఆధారాన్ని తీసుకుని చూస్తాము. ఏ ఇంద్రియము యొక్క అవసరము ఉంటే దాని ఆధారాన్ని తీసుకుని పని చెయ్యండి. ఈ విధంగా వాటి ఆధారాన్ని తీసుకుని పని చేసినట్లయితే చాలా సంతోషము ఉంటుంది, అప్పుడు ఎటువంటి చెడు పని జరగదు. అచ్ఛా.

బాప్ దాదా మరియు మమ్మా యొక్క ఇటువంటి మధురాతి మధురమైన, చాలా మంచి, సదా సైలెన్స్ యొక్క అనుభూతిని చేసే పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. అచ్ఛా.

సందేశీ తనువు ద్వారా ఆల్మైటీ తండ్రి ఉచ్చరించిన మహావాక్యాలు (మాతేశ్వరి గారి గురించి)

1) ఓ శిరోమణి రాధే బేటీ, నీవు ప్రతిరోజూ నా సమానంగా దివ్య కార్యములో తత్పరమై ఉన్నావు, అనగా వైష్ణవ శుద్ధ స్వరూపిణివి, శుద్ధమైన సేవ చేస్తావు, అందుకే నీవు సాక్షాత్తు నా స్వరూపానివి. ఏ పిల్లలైతే తమ తండ్రి అడుగుజాడలలో నడవరో, అటువంటివారికి నేను పూర్తిగా దూరంగా ఉన్నాను, ఎందుకంటే సంతానము అంటే తప్పకుండా తండ్రి సమానంగా ఉండాలి. ఈ నియమము ఇప్పుడు స్థాపన అవుతుంది, ఇది సత్య-త్రేతాయుగాల వరకు నడుస్తుంది, అక్కడ తండ్రి ఎలా ఉంటారో, కొడుకు అలానే ఉంటారు. కానీ ద్వాపర, కలియుగాలలో తండ్రి ఎలా ఉంటారో, సంతానము అలా ఉండరు. ఇప్పుడు పిల్లలు తండ్రి సమానంగా అయ్యేందుకు కష్టపడవలసి ఉంటుంది, కానీ అక్కడ నేచురల్ గానే తండ్రి వలె సంతానము ఉండే నియమము ఉంటుంది. ఈ అనాది నియమాన్ని ఈ సంగమ సమయములో ఈశ్వరుడైన తండ్రి పత్ర్యక్షమై స్థాపన చేస్తారు.

2) మధురమైన తోటమాలి యొక్క మధురమైన, తీయని, దివ్య పురుషార్థి బేటీ, ఇప్పుడు నీవు ఎంతో రమణీకంగా, మధురంగా తయారవ్వాలి మరియు తయారుచేయాలి. ఇప్పుడు విశ్వ రాజ్యము యొక్క తాళంచెవిని క్షణములో ప్రాప్తి చేసుకోవడము మరియు చేయించడము నీ చేతిలోనే ఉంది. చూడు, ఏ ఆల్మైటీ అయితే ప్రతి జీవికి, ప్రాణికి యజమానిగా ఉన్నారో, వారెప్పుడైతే ప్రాక్టికల్ గా ఈ కర్మక్షేత్రములోకి వచ్చారో, అప్పుడు సృష్టి మొత్తం హ్యాపీ హౌస్ (సంతోష నిలయం)గా అవుతుంది. ఈ సమయంలో ఆ జీవప్రాణుల యజమానే అవ్యక్త రీతిలో సృష్టిని నడిపిస్తున్నారు. కానీ ఎప్పుడైతే వారు ప్రత్యక్ష రూపంలో దేహధారిగా అయ్యి యజమానత్వముతో కర్మక్షేత్రముపైకి వస్తారో, అప్పుడు సత్య-త్రేతాయుగ సమయంలో సమస్త జీవకోటి సంతోషంగా ఉంటారు. అక్కడ సత్యము యొక్క దర్బారు తెరిచి ఉంటుంది. ఎవరైతే ఈశ్వరీయ సుఖాన్ని పొందడానికి పురుషార్థం చేసారో, వారికి అక్కడ సదా కొరకు సుఖం ప్రాప్తిస్తుంది. ఈ సమయంలో సమస్త జీవకోటికి సుఖం యొక్క దానం లభించదు, పురుషార్థమే ప్రారబ్ధాన్ని ఆకర్షిస్తుంది. ఎవరికైతే ఈశ్వరుడితో యోగం ఉంటుందో, వారికి ఈశ్వరుని ద్వారా సంపూర్ణ సుఖము యొక్క దానం లభిస్తుంది.

3) ఓహో! నీ ఈశ్వరీయ శక్తి యొక్క రంగును చూపించి ఈ ఆసురీ ప్రపంచాన్ని వినాశనం చేసి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేసే శక్తివి నీవే, ఆ తర్వాతే ఇతర శక్తులందరి మహిమ వెలువడుతుంది. ఇప్పుడు ఆ శక్తి నీలో నిండుతుంది. నీవు సదా నీ ఈశ్వరీయ బలము మరియు ఆత్మికత అనే హోదాలో ఉండు, అప్పుడు సదా అపారమైన సంతోషం ఉంటుంది. నిత్య హర్షిత ముఖము. నేను ఎవరిని? ఎవరికి చెందినదానిని? నాది ఎంతటి సౌభాగ్యము? నాది ఎంతటి గొప్ప పదవి? అన్న నషా నీకు ఉండాలి. ఇప్పుడు నీవు ముందుగా స్వయం యొక్క స్వరాజ్యాన్ని పొందుతావు, ఆ తర్వాత సత్యయుగంలో యువరాజుగా అవుతావు. మరి ఎంత నషా ఉండాలి! నీ ఈ భాగ్యాన్ని చూసుకుని సంతోషంలో ఉండు, నీ అదృష్టాన్ని చూసుకో, దానితో ఎంత లాటరీ లభిస్తుంది! ఓహో, నీదెంత శ్రేష్ఠమైన అదృష్టము, ఈ అదృష్టముతో వైకుంఠ లాటరీ లభిస్తుంది. అర్థమయిందా, లక్కీయెస్ట్ దైవీ పుష్పమైన బచ్చీ!

4) ఈ మనోహరమైన సంగమ సమయములో స్వయంగా నిరాకార పరమాత్మ సాకారములోకి వచ్చి ఈ ఈశ్వరీయ ఫ్యాక్టరీని తెరిచారు, ఇక్కడ ఏ మనిషైనా తనలోని వినాశీ చెత్తను ఇచ్చి అవినాశీ జ్ఞాన రత్నాలను తీసుకోవచ్చు. ఈ అవినాశీ జ్ఞాన రత్నాల కొనుగోలు అతి సూక్ష్మమైనది, దీనిని బుద్ధితో కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇదేమీ స్థూలమైన వస్తువు కాదు. ఇది ఈ నయనాలకు కనిపించేది కాదు, ఇది అతి సూక్ష్మమైనది, గుప్తమైనది, కనిపించనిది కనుక దీనిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇటువంటి సర్వోత్తమమైన జ్ఞాన ఖజానా ప్రాప్తించడం ద్వారా అతి నిస్సంకల్ప, సుఖదాయక అవస్థ ఏర్పడుతుంది. ఎవరైనా సరే, ఈ అవినాశీ జ్ఞాన రత్నాల కొనుగోలును చేయనంతవరకు నిశ్చింతగా, చింతాముక్తులుగా, నిస్సంకల్పంగా ఉండలేరు, అందుకే ఈ అవినాశీ జ్ఞాన రత్నాల సంపాదనను చేసుకుని, దీనిని మీ బుద్ధి అనే సూక్ష్మ లాకరులో ధారణ చేసి, నిత్యము నిశ్చింతగా ఉండాలి. వినాశీ ధనములోనైతే దుఃఖము ఇమిడి ఉంది మరియు అవినాశీ జ్ఞాన ధనములో సుఖము ఇమిడి ఉంది.

5) ఎలా అయితే సూర్యుడు సాగరములోని నీటిని ఆకర్షిస్తాడో, ఆ నీరు మళ్ళీ ఎత్తైన పర్వతాలపై వర్షిస్తుందో, అలాగే ఇది కూడా డైరెక్టుగా ఈశ్వరుని ద్వారా వర్షం కురుస్తుంది. శివుని జటాజూటముల నుండి గంగ వెలువడింది అని అంటారు. ఇప్పుడు వీరి ముఖ కమలం ద్వారా జ్ఞాన అమృతధార వర్షిస్తుంది, దీనినే అవినాశీ ఈశ్వరీయ ధార అంటారు, ఈ ధార ద్వారా భగీరథ పుత్రులైన మీరందరూ పావనంగా, అమరులుగా అవుతున్నారు. ఇది కిరీటధారులుగా తయారుచేసే అద్భుతమైన మండలి, ఇక్కడకు వచ్చే ప్రతి నరుడు, నారి కిరీటధారులుగా అవుతారు. ప్రపంచాన్ని కూడా మండలి అని అంటారు. మండలి అనగా స్థానము, ఇప్పుడు ఈ మండలి ఎక్కడ ఉంది? ఓం ఆకారములో అనగా మనము స్వధర్మములో స్థితులై ఉన్నాము మరియు మొత్తం ప్రపంచమంతా స్వధర్మాన్ని మర్చిపోయి ప్రకృతి ధర్మములో స్థితియై ఉంది. శక్తులైన మీరేమో ప్రకృతిని మర్చిపోయి మీ స్వధర్మములో స్థితులై ఉన్నారు.

6) ఈ ప్రపంచములో మనుష్యులందరూ నిరాకారుడైన ఈశ్వరుడిని స్మృతి చేస్తారు. వారిని ఈ నయనాలతో చూడలేదు కూడా. ఆ నిరాకారుడిపై వారికి ఎంతటి అమితమైన ప్రేమ ఉంటుందంటే, వారంటారు, ఓ ఈశ్వరా, నీలో నన్ను లీనం చేసుకో. కానీ ఎంత విచిత్రమంటే స్వయంగా ఈశ్వరుడు ఎప్పుడైతే సాకారంలో ప్రత్యక్షమవుతారో, అప్పుడు వారిని గుర్తించరు. ఈశ్వరునికి ఎంతో ప్రియమైన భక్తులు ఏమంటారంటే - ఎక్కడ చూసినా అక్కడ నీవే నీవు కనిపిస్తున్నావు. అయితే, వారు ఈ నయనాలతో చూడకపోయినా కానీ బుద్ధియోగముతో మాత్రము ఈశ్వరుడు సర్వత్రా ఉన్నట్లుగా భావిస్తారు. కానీ మీరు అనుభవముతో చెప్తారు - స్వయంగా నిరాకారుడైన ఈశ్వరుడు ప్రాక్టికల్ గా సాకారములో ఇక్కడకు విచ్చేసి ఉన్నారు, ఇప్పుడు సహజముగానే మీరు వచ్చి నన్ను కలుసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ నా పిల్లలలో కూడా ఎంతోమంది సాకారములో తండ్రి అయిన ప్రభువును గుర్తించడం లేదు. వారికి నిరాకారుడు అతి మధురంగా అనిపిస్తారు, కానీ ఆ నిరాకారుడినే ఇప్పుడు సాకారములో ప్రత్యక్షంగా ఉన్నప్పుడు, వారిని గుర్తిస్తే ఎంత ప్రాప్తిని పొందవచ్చు, ఎందుకంటే ప్రాప్తి అయితే ఎంతైనా సాకారుని ద్వారానే జరుగుతుంది. ఇకపోతే ఎవరైతే ఈశ్వరుడిని దూరంగా నిరాకారునిగా భావిస్తారో మరియు అలా చూస్తారో, వారికి ఎటువంటి ప్రాప్తి లభించదు, వారు భక్తులుగానే ఉంటారు, వారిలో జ్ఞానము ఏమీ లేదు. ఇప్పుడు సాకార ప్రభు తండ్రిని తెలుసుకున్న జ్ఞానీ పిల్లలు, సర్వ దైవీ గుణాల సుగంధముతో నిండి ఉన్న మధురమైన పుష్పాలు తమ తండ్రి అయిన ప్రభుపై తమ జీవితాన్నే సమర్పించేస్తారు, దీని వలన వారికి జన్మజన్మాంతరాలు సంపూర్ణ దైవీ దివ్య శోభనీయమైన తనువు ప్రాప్తిస్తుంది.

7) స్వయాన్ని తెలుసుకోవడం ద్వారానే మీకు రైట్-రాంగ్, సత్య-అసత్యముల పరిశీలన వచ్చింది. ఈ ఈశ్వరీయ జ్ఞానముతో వాక్కు సత్యంగా ఉంటుంది, దీని వలన ఎవరి సాంగత్య దోషము ఉండదు. ఎవరైతే స్వయం అజ్ఞానానికి వశమై ఉంటారో, వారిపై సాంగత్య దోషము యొక్క నీడ పడుతుంది. ఈ కాలం సత్యము యొక్క కాలం కాదు, అందుకే ఎవరైనా మాట ఇస్తే ఆ మాటను నమ్మకుండా వారితో వ్రాతపూర్వకంగా వ్రాయించుకుంటారు. మనుష్యుల మాట అసత్యంగా ఉంటుంది. ఒకవేళ సత్యత ఉంటే వారి మహావాక్యాలు పూజించబడతాయి. ఉదాహరణకు చూడండి, డివైన్ ఫాదర్ యొక్క సత్యమైన మహావాక్యాల యొక్క శాస్త్రాలే తయారయ్యాయి, వాటికి గాయనము మరియు పూజ జరుగుతుంది. వారి సత్యమైన మహావాక్యాలను ధారణ చేయడం ద్వారా ఈశ్వరీయ క్వాలిటీ వస్తుంది. అంతేకాదు, కొందరైతే చదువుతూ-చదువుతూ శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మా యొక్క సాక్షాత్కారాలను కూడా పొందుతారు.

ఓహో, పవిత్ర హృదయ కమలము, పవిత్ర హస్త కమలము, పవిత్ర నయన కమలము అయిన బేటీ రాధే, నీ పూర్తి శరీరము మారిపోయి కమల పుష్ప సమానంగా కోమల కాంచనముగా తయారైంది. కానీ ముందుగా ఎప్పుడైతే ఆత్మ కాంచనంగా తయారవుతుందో, అప్పుడు పూర్తి తనువు కాంచనంగా, పవిత్రంగా అవుతుంది. ఆ పవిత్రమైన కోమల తనువులోనే అతి ఆకర్షణ నిండి ఉంటుంది. నీవు నీ తండ్రి అయిన పరమేశ్వరుని ద్వారా అజ్ఞానమనే మంటను ఆర్పి జ్ఞాన తేజస్సును వెలిగించి అతి శీతల స్వరూపిణిగా తయారయ్యావు. స్వయం శీతల స్వరూపిణిగా అయ్యి నీ తోటివారికి కూడా ఇటువంటి సత్యమైన శీతలతను దానం చేయడానికి ఈ మనోహరమైన సంగమ సమయంలో నిమిత్తమయ్యావు. నీ జడ చిత్రాల ద్వారా కూడా పూర్తి ప్రపంచానికి శీతలత మరియు శాంతి దానం లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీవు మొత్తం సృష్టికి విముక్తిని ఇచ్చి అంతిమములో నీ దివ్య తేజస్సును చూపించి, కొత్త వైకుంఠములోకి, స్వర్ణిమ పూలతోటలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటావు. అచ్ఛా.

వరదానము:-

‘‘బాబా’’ అన్న పదము రూపీ తాళంచెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే భాగ్యవాన్ ఆత్మా భవ

జ్ఞానము యొక్క విస్తారమును వేరే ఏమీ తెలుసుకోలేకపోయినా లేక వినిపించలేకపోయినా కానీ, ‘‘బాబా’’ అన్న ఒక్క మాటను హృదయపూర్వకంగా స్వీకరించి, హృదయపూర్వకంగా ఇతరులకు వినిపించినట్లయితే విశేష ఆత్మగా అయినట్లే, ప్రపంచము ముందు మహాన్ ఆత్మ స్వరూపములో గాయన యోగ్యముగా అయినట్లే ఎందుకంటే ‘‘బాబా’’ అన్న ఒక్క పదము సర్వ ఖజానాలు మరియు భాగ్యము యొక్క తాళంచెవి. తాళంచెవిని ఉపయోగించేందుకు విధి ఏమిటంటే, హృదయపూర్వకముగా తెలుసుకోటము మరియు స్వీకరించటము. హృదయపూర్వకంగా బాబా అని అన్నట్లయితే ఖజానాలు సదా హాజరై ఉంటాయి.

స్లోగన్:-

బాప్ దాదాపై స్నేహము ఉన్నట్లయితే స్నేహములో పాత ప్రపంచమునంతటినీ బలిహారము చేసెయ్యండి.