24-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి నుండి హోల్ సేల్ వ్యాపారము చేయడం నేర్చుకోండి, మన్మనాభవ - అల్లాను స్మృతి చేయడము మరియు చేయించడము, ఇదే హోల్ సేల్ వ్యాపారము, మిగిలినదంతా రిటేల్ వ్యాపారమే’’

ప్రశ్న:-
తండ్రి తమ ఇంట్లోకి ఏ పిల్లలను ఆహ్వానిస్తారు?

జవాబు:-
ఏ పిల్లలైతే తండ్రి మతముపై బాగా నడుస్తారో, ఇతరులెవ్వరినీ స్మృతి చేయరో, దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్కరి స్మృతిలోనే ఉంటారో, అటువంటి పిల్లలను తండ్రి తమ ఇంట్లోకి రిసీవ్ చేసుకుంటారు. తండ్రి ఇప్పుడు పిల్లలను పుష్పాల వలె తయారుచేస్తారు, అప్పుడు పుష్పాలుగా అయిన పిల్లలను తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

ఓంశాంతి
పిల్లలు తమ తండ్రి స్మృతిలో, శాంతిధామము మరియు సుఖధామము యొక్క స్మృతిలో కూర్చోవాలి. ఆత్మ తన తండ్రినే స్మృతి చేయాలి, ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి మరియు పిల్లల మధురమైన సంబంధము. ఇటువంటి మధురమైన సంబంధము ఇంకే తండ్రిదీ ఉండదు. సంబంధము ఒకటేమో, తండ్రితో ఉంటుంది, ఇంకొకటి టీచర్ మరియు గురువుతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ముగ్గురూ ఒక్కరే. ఇది కూడా బుద్ధిలో ఉండాలి, ఇది సంతోషకరమైన విషయం కదా. ఒకే తండ్రి లభించి ఉన్నారు, వారు చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. తండ్రిని, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి, ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. విహరించండి, తిరగండి కానీ బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి. ఇక్కడైతే వ్యాపార-వ్యవహారాలు మొదలైనవేవీ లేవు, ఇక్కడ ఇంట్లో కూర్చున్నారు. తండ్రి కేవలం మూడు పదాలను స్మృతి చేయమని చెప్తారు. వాస్తవానికి ఒకటే పదము - తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా సుఖధామము మరియు శాంతిధామము రెండు వారసత్వాలు గుర్తుకొస్తాయి. వాటిని ఇచ్చేవారు ఒక్క తండ్రే. స్మృతి చేయడం ద్వారా సంతోషము యొక్క పాదరసం పైకి ఎక్కుతుంది. పిల్లలైన మీ సంతోషమైతే ప్రసిద్ధమైనది. బాబా మనల్ని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానిస్తారని, రిసీవ్ చేసుకుంటారని పిల్లల బుద్ధిలో ఉంది కానీ ఎవరైతే తండ్రి మతముపై బాగా నడుస్తారో మరియు ఇంకెవ్వరినీ స్మృతి చేయరో వారినే ఆహ్వానిస్తారు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంచి నన్నొక్కరినే స్మృతి చేయాలి. భక్తి మార్గములోనైతే మీరు ఎంతో సేవను చేసారు కానీ ఇక్కడి నుండి వెళ్ళే దారి అయితే లభించనే లభించదు. ఇప్పుడు తండ్రి ఎంత సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు, కేవలం ఇదే స్మృతి చేయండి - తండ్రి తండ్రి కూడా, శిక్షకుడు కూడా, సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు, దానిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి అని తండ్రి అంటారు. మళ్ళీ మొట్టమొదట సత్యయుగములోకి వస్తారు. ఈ ఛీ-ఛీ ప్రపంచం నుండి ఇప్పుడిక వెళ్ళాలి. ఇక్కడ కూర్చున్నా కానీ ఇక్కడి నుండి ఇప్పుడు ఇక వెళ్ళిపోనున్నారు. తండ్రి కూడా సంతోషిస్తారు, పిల్లలైన మీరు ఎంతో కాలంగా తండ్రిని ఆహ్వానించారు. ఇప్పుడు మళ్ళీ తండ్రిని రిసీవ్ చేసుకున్నారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేసి మళ్ళీ శాంతిధామములో రిసీవ్ చేసుకుంటాను. ఇక మీరు నంబరువారుగా వెళ్ళిపోతారు. ఇది ఎంత సహజము. ఇటువంటి తండ్రిని మర్చిపోకూడదు. విషయం చాలా మధురమైనది మరియు స్పష్టమైనది. ఒకటే విషయము - తండ్రిని స్మృతి చేయండి. విస్తారంగా అర్థం చేయించినా కానీ మళ్ళీ చివరిలో తండ్రినే స్మృతి చేయండి, ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి అని అంటారు. మీరు ఒక్క ప్రియునికి జన్మజన్మాంతరాల ప్రేయసులు. బాబా, మీరు వస్తే మేము మీకు చెందినవారిగానే అవుతాము అని గానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు వారు వచ్చారు కావున ఆ ఒక్కరికి చెందినవారిగానే అవ్వాలి. నిశ్చయబుద్ధీ విజయంతి. రావణుడిపై విజయాన్ని పొందుతారు, మళ్ళీ రామరాజ్యములోకి రావలసి ఉంటుంది. కల్ప-కల్పము మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు. బ్రాహ్మణులుగా అవ్వడముతోనే రావణుడిపై విజయాన్ని పొందారు. రామరాజ్యముపై మీకు హక్కు ఉంది. తండ్రిని గుర్తించగానే రామరాజ్యముపై హక్కు ఏర్పడింది. ఇక మిగిలింది ఉన్నత పదవిని పొందేందుకు చేయవలసిన పురుషార్థము. విజయమాలలోకి రావాలి. చాలా పెద్ద విజయమాల ఉంది. రాజుగా అయితే అంతా లభిస్తుంది. దాస-దాసీలందరూ నంబరువారుగా తయారవుతారు. అందరూ ఒకేలా ఉండరు. కొందరైతే చాలా సమీపంగా ఉంటారు, రాజు-రాణులేవైతే తింటారో, భండారాలో ఏదైతే తయారవుతుందో అదంతా దాస-దాసీలకు లభిస్తుంది, దానినే 36 రకాల భోజనము అని అంటారు. పదమపతులు అని కూడా రాజులనే అంటారు, ప్రజలను పదమపతులు అని అనరు. అక్కడ ధనము యొక్క పట్టింపు ఉండదు. కానీ ఈ చిహ్నాలు దేవతలవే. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సూర్యవంశీయులలోకి వస్తారు. కొత్త ప్రపంచములోకి రావాలి కదా. మహారాజు-మహారాణిగా అవ్వాలి. తండ్రి నరుడి నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానాన్ని ఇస్తారు, దానినే రాజయోగము అని అంటారు. ఇకపోతే భక్తి మార్గపు శాస్త్రాలను కూడా అందరికన్నా ఎక్కువగా మీరే చదివారు, అందరికన్నా ఎక్కువ భక్తిని పిల్లలైన మీరే చేసారు, ఇప్పుడు మీరు వచ్చి తండ్రిని కలుసుకున్నారు. తండ్రి అయితే చాలా సహజమైన మరియు స్పష్టమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు, అదేమిటంటే - తండ్రిని స్మృతి చేయండి. బాబా పిల్లలూ, పిల్లలూ అని అంటూ అర్థం చేయిస్తారు. తండ్రి పిల్లలపై బలిహారమవుతారు. వారసులైనట్లయితే మరి తప్పకుండా బలిహారమవ్వవలసి ఉంటుంది. బాబా, మీరు వచ్చినట్లయితే మేము మీపై బలిహారమవుతాము, తనువు, మనస్సు, ధనముల సహితముగా బలిహారమవుతాము అని మీరు కూడా అన్నారు. మీరు ఒక్కసారి బలిహారమవుతారు, బాబా 21 సార్లు బలిహారమవుతారు. తండ్రి పిల్లలకు స్మృతిని కూడా కలిగిస్తారు. పిల్లలందరూ నంబరువారు పురుషార్థానుసారంగా తమ-తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు అని అర్థం చేసుకోగలరు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, విశ్వరాజ్యాధికారము మన ఆస్తి, ఇప్పుడిక మీరు ఎంత పురుషార్థం చేస్తే అంత. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. నెంబర్ వన్ లో ఉన్నవారు ఇప్పుడు లాస్ట్ నెంబర్ లో ఉన్నారు. మళ్ళీ తప్పకుండా నెంబర్ వన్ లోకి వెళ్తారు. మొత్తం ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది. తండ్రి పిల్లలను ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి. అది కామాగ్ని, ఇది యోగాగ్ని. కామాగ్నిలో కాలుతూ, కాలుతూ మీరు నల్లగా అయిపోయారు, పూర్తిగా బూడిదగా అయిపోయారు. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని మేల్కొలుపుతాను, తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అయ్యే యుక్తిని తెలియజేస్తాను, ఇది చాలా సహజము. నేను ఆత్మను. ఇంత సమయము దేహాభిమానములో ఉన్న కారణంగా మీరు తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉండేవారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, తండ్రి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. మీరు ఆహ్వానమును ఇచ్చారు మరియు తండ్రి వచ్చారు. పతితులను పావనంగా చేసి మార్గదర్శకునిగా అయి ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. ఆత్మయే ఈ యాత్రలో వెళ్ళాలి.

మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. పాండవుల రాజ్యము లేదు. కౌరవుల రాజ్యము ఉండేది. ఇక్కడైతే ఇప్పుడు రాజ్యము కూడా అంతమైపోయింది. ఇప్పుడు భారత్ యొక్క పరిస్థితి ఎంత పాడైపోయింది. మీరు పూజ్య విశ్వాధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. కావున విశ్వాధిపతులుగా ఎవ్వరూ లేరు. విశ్వాధిపతులుగా కేవలం దేవీ-దేవతలే అవుతారు. విశ్వములో శాంతి ఏర్పడాలి అని వారు అంటారు. విశ్వములో శాంతి అని దేనిని అంటారు, విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేది అని మీరు వారిని అడగండి. ప్రపంచ చరిత్ర-భౌగోళము రిపీట్ అవుతూ ఉంటుంది. చక్రము తిరుగుతూ ఉంటుంది. విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేది, మీరు ఏ శాంతిని కోరుకుంటున్నారు - అని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - విశ్వములో శాంతి అయితే స్వర్గములో ఉండేది, దానినే పారడైజ్ అని అంటారు. క్రైస్టుకు 3,000 సంవత్సరాల క్రితం పారడైజ్ ఉండేది అని క్రిస్టియన్లు అంటారు. వారి బుద్ధి పారసబుద్ధిగానూ అవ్వదు, అలాగే రాతిబుద్ధిగానూ అవ్వదు. భారతవాసులే పారసబుద్ధి కలవారిగా మరియు రాతిబుద్ధి కలవారిగా అవుతారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు, పాతదానినైతే స్వర్గము అని అనరు. పిల్లలకు తండ్రి స్వర్గము మరియు నరకము యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. ఇది రిటేల్ విషయము. హోల్ సేల్ లో అయితే కేవలం ఒకటే మాట చెప్తారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి నుండే అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఇది కూడా పాత విషయమే. 5000 సంవత్సరాల క్రితం భారత్ లో స్వర్గము ఉండేది. తండ్రి పిల్లలకు సత్యాతి-సత్యమైన కథను తెలియజేస్తారు. సత్యనారాయణుని కథ, మూడవ నేత్రము యొక్క కథ, అమరకథ ఎంతో ప్రసిద్ధమైనవి. మీకు కూడా జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభిస్తుంది, దానినే మూడవ నేత్రము యొక్క కథ అని అంటారు. వారైతే భక్తి మార్గములో పుస్తకాన్ని తయారుచేసారు. ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని విషయాలు బాగా అర్థం చేయించడం జరుగుతుంది. రిటేల్ మరియు హోల్ సేల్ అని ఉంటాయి కదా! వారు ఎంత జ్ఞానాన్ని వినిపిస్తారంటే, సాగరమును సిరాగా మార్చినా అది అంతమవ్వదు - ఇది రిటేల్. హోల్ సేల్ లో కేవలం మన్మనాభవ అని అంటారు. ఒకటే పదము, దాని అర్థాన్ని కూడా మీరు తెలుసుకున్నారు, ఇంకెవ్వరూ దాన్ని తెలియజేయలేరు. తండ్రి జ్ఞానాన్ని సంస్కృతములో ఇవ్వలేదు. ఏ రాజు ఉంటే ఆ రాజు తన భాషను నడిపిస్తారు. మనదైతే ఒక్క హిందీ భాషయే ఉంటుంది, మరి సంస్కృతము ఎందుకు నేర్చుకోవాలి. ఎంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు.

మీ వద్దకు ఎవరైనా వస్తే, వారికి ఈ విధంగా చెప్పండి - తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే శాంతిధామము, సుఖధామము యొక్క వారసత్వము లభిస్తుంది. ఈ విషయాలను అర్థం చేసుకోవాలనుకుంటే కూర్చొని అర్థం చేసుకోండి, అంతేకానీ మా వద్ద ఇంకే విషయమూ లేదు. అల్లాహ్ అయిన తండ్రే అర్థం చేయిస్తారు. అల్లాహ్ నుండే వారసత్వము లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు నాశనమై, పవిత్రముగా అయి, శాంతిధామములోకి వెళ్ళిపోతారు. శాంతిదేవా అని కూడా అంటారు. తండ్రే శాంతిసాగరుడు కావున వారినే స్మృతి చేస్తారు. స్వర్గ స్థాపన చేసే తండ్రి అయితే ఇక్కడే ఉంటారు. సూక్ష్మవతనములో ఏమీ లేదు. ఇవి సాక్షాత్కారాల విషయాలు. ఇటువంటి ఫరిశ్తాగా అవ్వాలి. ఇక్కడే అలా అవ్వవలసి ఉంటుంది. ఫరిశ్తాగా అయి ఇక ఇంటికి వెళ్ళిపోతారు. రాజధాని వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. శాంతి మరియు సుఖము, రెండు వారసత్వాలు లభిస్తాయి. తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ సాగరుడు అని అనలేరు. జ్ఞానసాగరుడైన తండ్రే సర్వుల సద్గతిని చెయ్యగలరు. తండ్రి అడుగుతారు - నేను మీ తండ్రిని, టీచరును, గురువును, మీకు సద్గతిని ఇస్తాను, మరి మీ దుర్గతిని ఎవరు చేస్తారు? రావణుడు. ఇది దుర్గతి మరియు సద్గతుల ఆట. ఎవరైనా తికమకపడితే వివరంగా అడిగి తెలుసుకోవచ్చు. భక్తి మార్గములో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, జ్ఞాన మార్గములో ప్రశ్నల విషయమేమీ లేదు. శాస్త్రాలలో శివబాబా నుండి మొదలుకుని దేవతలను కూడా ఎంతగా గ్లాని చేసారు, ఎవ్వరినీ వదలలేదు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది, ఇలా మళ్ళీ చేస్తారు. తండ్రి అంటారు, ఈ దేవీ-దేవతా ధర్మము ఎంతో సుఖాన్ని ఇచ్చే ధర్మము, అప్పుడిక ఈ దుఃఖము ఉండదు. తండ్రి మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు వివేకవంతులు, కావుననే వారు విశ్వాధిపతులు. అవివేకులు విశ్వాధిపతులుగా అవ్వలేరు. మొదట మీరు ముళ్ళగా ఉండేవారు, ఇప్పుడు పుష్పాలుగా అవుతున్నారు, అందుకే బాబా కూడా - ఇలా పుష్పాలుగా అవ్వాలి అని చెప్తూ గులాబీ పుష్పాన్ని తీసుకువస్తారు. వారు స్వయమే వచ్చి పుష్పాలతోటను తయారుచేస్తారు. ఆ తర్వాత రావణుడు ముళ్ళ అడవిగా చేయడానికి వస్తాడు. ఇది ఎంత స్పష్టముగా ఉంది. వీటన్నింటినీ స్మరణ చేయాలి. ఒక్కరిని స్మృతి చేసినట్లయితే అందులో అంతా వచ్చేస్తుంది. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఇది చాలా భారీ సంపద. శాంతి వారసత్వము కూడా లభిస్తుంది ఎందుకంటే వారే శాంతిసాగరుడు. లౌకిక తండ్రిని ఎప్పుడూ ఇలా మహిమ చేయరు. శ్రీకృష్ణుడు అందరికన్నా ప్రియమైనవారు. మొట్టమొదట వారి జన్మే జరుగుతుంది, అందుకే వారిని అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. తండ్రి తమ పిల్లలకే మొత్తం ఇంటి సమాచారమునంతా వినిపిస్తారు. తండ్రి కూడా పక్కా వ్యాపారి, ఏ ఒక్కరో అరుదుగా ఇటువంటి వ్యాపారాన్ని చేస్తారు. హోల్ సేల్ వ్యాపారిగా ఏ ఒక్కరో కష్టం మీద అవుతారు. మీరు హోల్ సేల్ వ్యాపారులు కదా! తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటారు. కొందరు రిటేల్ వ్యాపారం చేసి మళ్ళీ మర్చిపోతారు. నిరంతరము స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి అంటారు. వారసత్వము లభించిన తర్వాత ఇక స్మృతి చేసే అవసరం ఉండదు. లౌకిక సంబంధములో తండ్రి వృద్ధుడైతే కొందరు పిల్లలు చివరి వరకూ కూడా సహాయకులుగా అవుతారు. కొందరైతే ఆస్తి లభించగానే దాని పోగొట్టేసి సమాప్తం చేసేస్తారు. బాబా అన్ని విషయాలలోనూ అనుభవజ్ఞులు. అందుకే తండ్రి కూడా వీరిని తమ రథముగా చేసుకున్నారు. పేదరికము, షావుకారుతనము, అన్ని విషయాలలోనూ అనుభవజ్ఞులు. డ్రామానుసారంగా ఈ ఒక్క రథమే ఉంది, ఇది ఎప్పుడూ మారదు. డ్రామా రచింపబడి ఉంది, ఇందులో ఎప్పుడూ మార్పు రాదు. అన్ని విషయాలను హోల్ సెల్ మరియు రిటేల్ లో అర్థం చేయించి ఇక చివరిలో - మన్మనాభవ, మధ్యాజీభవ అని అంటారు. మన్మనాభవలో అంతా వచ్చేస్తుంది. ఇది చాలా భారీ ఖజానా, దీని ద్వారా జోలెను నింపుకుంటారు. అవినాశీ జ్ఞాన రత్నాలు ఒక్కొక్కటీ లక్షల రూపాయల విలువ చేస్తాయి. మీరు పదమాపదమ భాగ్యశాలురుగా అవుతారు. తండ్రి సంతోషము, దుఃఖమూ రెండింటికీ అతీతులు. వారు సాక్షీగా అయి డ్రామాను చూస్తున్నారు. మీరు పాత్రను అభినయిస్తారు. నేను పాత్రను అభినయిస్తూ కూడా సాక్షీగా ఉన్నాను. నేను జనన-మరణాలలోకి రాను. ఇంకెవ్వరూ దీని నుండి తప్పించుకోలేరు, మోక్షము లభించదు. ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. ఇది కూడా అద్భుతమైనది. చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా నిండి ఉంది. ఈ అవినాశీ డ్రామా ఎప్పుడూ వినాశనమవ్వదు. అచ్ఛా.

మధురాతి మధురమైన సికీలధే సేవాధారులైన పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారంగా మాత-పిత, బాప్ దాదా యొక్క హృదయపూర్వకమైన, ప్రాణప్రదమైన, ఎంతో ప్రేమతో నిండిన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విధంగా తండ్రి పిల్లలపై బలిహారమవుతారో, అలా తనువు, మనస్సు, ధనం సహితంగా ఒక్క సారి తండ్రిపై పూర్తిగా బలిహారమై 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి.

2. తండ్రి ఏ అమూల్యమైన అవినాశీ ఖజానాను ఇస్తారో, దానితో మీ జోలెను సదా నిండుగా ఉంచుకోవాలి. సదా మేము పదమాపదమ భాగ్యశాలురము అన్న సంతోషము మరియు నషాలోనే ఉండాలి.

వరదానము:-

బ్రాహ్మణ జీవితపు ప్రాపర్టీని మరియు పర్సనాలిటీని అనుభవం చేసే మరియు చేయించే విశేష ఆత్మా భవ

బాప్ దాదా బ్రాహ్మణ పిల్లలందరికీ ఏ స్మృతిని ఇప్పిస్తారంటే - బ్రాహ్మణులుగా అయ్యారంటే అహో సౌభాగ్యము! కానీ బ్రాహ్మణ జీవితపు వారసత్వము, ప్రాపర్టీ సంతుష్టత మరియు బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ ప్రసన్నత. ఈ అనుభవము నుండి ఎప్పుడూ వంచితులుగా ఉండకండి. మీరు అధికారులు. దాత, వరదాత విశాల హృదయముతో ప్రాప్తుల ఖజానాను ఇస్తున్నప్పుడు దానిని అనుభవములోకి తీసుకురండి మరియు ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా తయారుచెయ్యండి, అప్పుడే విశేష ఆత్మ అని అంటారు.

స్లోగన్:-

చివరి సమయము గురించి ఆలోచించేందుకు బదులుగా చివరి స్థితిని గురించి ఆలోచించండి.