ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు 15
నిమిషాల ముందు వచ్చి ఇక్కడ తండ్రి స్మృతిలో కూర్చుంటారు. ఇప్పుడు ఇక్కడైతే ఇంకే పనీ
లేదు. వచ్చి తండ్రి స్మృతిలోనే కూర్చుంటారు. భక్తి మార్గములోనైతే తండ్రి పరిచయము
లేదు. ఇక్కడ తండ్రి పరిచయం లభించింది మరియు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి
చేయండి. నేనైతే పిల్లలందరి తండ్రిని. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వారసత్వము
దానంతట అదే గుర్తుకు రావాలి. మీరు చిన్న పిల్లలైతే కాదు కదా. మేము ఐదు నెలలు లేక
రెండు నెలల పిల్లలము అని వ్రాసినా కానీ మీ కర్మేంద్రియాలైతే పెద్దగానే ఉన్నాయి.
కావున ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇక్కడ తండ్రి మరియు వారసత్వము యొక్క
స్మృతిలో కూర్చోవాలి. మనము నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థములో తత్పరులమై
ఉన్నాము లేక స్వర్గములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నాము అని మీకు తెలుసు.
కావున పిల్లలు నోట్ చేసుకోవాలి - మేము ఇక్కడ కూర్చుని ఎంత సమయం స్మృతి చేసాము?
వ్రాయడం ద్వారా తండ్రి అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఎంత సమయం స్మృతిలో
ఉంటున్నారు అన్నది తండ్రికి తెలుస్తుంది అని కాదు. అది ప్రతి ఒక్కరూ తమ చార్ట్
ద్వారా అర్థం చేసుకోగలరు - తండ్రి స్మృతి ఉందా లేక బుద్ధి ఇతరవైపులకు వెళ్ళిపోయిందా
అని? ఇప్పుడు బాబా వస్తారు అన్నది కూడా బుద్ధిలో ఉంది కావున అది కూడా స్మృతియే కదా.
ఎంత సమయమైతే స్మృతి చేస్తారో, అది చార్టులో సత్యమే వ్రాస్తారు. అబద్ధం
వ్రాసినట్లయితే ఇంకా 100 రెట్లు పాపం పెరుగుతుంది, ఇంకా నష్టపోతారు, అందుకే సత్యమే
వ్రాయాలి - ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలూ వినాశనమవుతాయి. అంతేకాక స్మృతితో
మనము సమీపముగా వస్తూ ఉంటాము అని కూడా తెలుసు. చివరికి ఎప్పుడైతే స్మృతి పూర్తి
అయిపోతుందో, అప్పుడు మనం మళ్ళీ బాబా వద్దకు వెళ్ళిపోతాము. అప్పుడు కొందరు వెంటనే
కొత్త ప్రపంచములోకి వచ్చి పాత్రను అభినయిస్తారు, కొందరైతే అక్కడే కూర్చుని ఉంటారు.
అక్కడ ఎటువంటి సంకల్పమూ రాదు. అది ఉన్నదే ముక్తిధామము, సుఖ-దుఃఖాలకు అతీతమైనది.
సుఖధామములోకి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తారు. ఎంతగా మీరు స్మృతి
చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చార్టును పెట్టడం ద్వారా జ్ఞాన
ధారణ కూడా బాగా జరుగుతుంది. చార్టు వ్రాయడం వలనైతే లాభమే ఉంది. స్మృతిలో ఉండని
కారణముగా వ్రాయడానికి సిగ్గు కలుగుతుంది అని బాబాకు తెలుసు. బాబా ఏమంటారో, మురళిలో
వినిపిస్తారేమోనని సిగ్గుపడతారు. తండ్రి అంటారు, ఇందులో సిగ్గుపడే విషయమేముంది. మేము
స్మృతి చేస్తున్నామా, లేదా? అన్నది ప్రతి ఒక్కరూ తమ హృదయములో అర్థం చేసుకోగలరు.
కళ్యాణకారి తండ్రి అయితే అర్థం చేయిస్తున్నారు, నోట్ చేసుకుంటే కళ్యాణము జరుగుతుంది.
బాబా వచ్చే లోపు ఎంత సమయమైతే కూర్చుని ఉన్నారో, అందులో స్మృతి చార్ట్ ఎంత ఉంది?
తేడాను చూడాలి. ప్రియమైన వస్తువునైతే ఎంతగానో స్మృతి చేయడం జరుగుతుంది.
కుమార-కుమారీలకు నిశ్చితార్థము జరిగితే వారి హృదయములో ఒకరి స్మృతి ఒకరికి నిలిచి
ఉంటుంది. తర్వాత వివాహం జరగడంతో అది పక్కా అయిపోతుంది. ఒకరినొకరు చూసుకోకపోయినా, మా
నిశ్చితార్థము జరిగింది అని అర్థం చేసుకుంటారు. శివబాబా మా అనంతమైన తండ్రి అని
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారిని చూడలేదు కానీ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు.
ఆ తండ్రి ఒకవేళ నామ-రూపాలకు అతీతుడైతే, మరి పూజ ఎవరికి చేస్తున్నారు? స్మృతి ఎందుకు
చేస్తున్నారు? నామ-రూపాలకు అతీతముగా ఆది, అంత్యాలు లేకుండా ఏదీ ఉండదు. తప్పకుండా
దేనినైనా చూడడం జరుగుతుంది, అప్పుడే దాని వర్ణన జరుగుతుంది. ఆకాశాన్ని కూడా చూస్తారు
కదా. ఆది, అంత్యాలు లేనిది అని అనలేరు. భక్తి మార్గములో భగవంతుడిని - ఓ భగవంతుడా అని
తలచుకుంటారు, కావున వారిని ఆది, అంత్యాలు లేనివారు అని అనరు కదా. ఓ భగవంతుడా అని
అనడంతో వెంటనే వారు గుర్తుకు వస్తారు, అంటే అర్థం తప్పకుండా వారు ఉన్నారు. ఆత్మను
కూడా తెలుసుకోవడం జరుగుతుంది, చూడడం జరుగదు.
ఆత్మలందరికీ ఒకే తండ్రి ఉంటారు, వారిని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తండ్రి
వచ్చి చదివిస్తారు కూడా అని పిల్లలైన మీకు తెలుసు. వారు చదివిస్తారు కూడా అన్నది
ఇంతకుముందు తెలియదు. శ్రీకృష్ణుని పేరును వ్రాసేసారు. శ్రీకృష్ణుడైతే ఈ కనులకు
కనిపిస్తారు. అతడిని అనంతుడు, నామ-రూపాలకు అతీతుడు అని అనలేరు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ
- నన్నొక్కడినే స్మృతి చేయండి అని అనరు. అతనైతే సమ్ముఖముగా ఉన్నారు. అతడిని తండ్రి
అని కూడా అనరు. మాతలైతే శ్రీకృష్ణుడిని తమ బిడ్డగా భావిస్తూ తమ ఒడిలో
కూర్చోబెట్టుకుంటారు. జన్మాష్టమినాడు చిన్న శ్రీకృష్ణుడిని ఊయలలో ఊపుతారు. మరి అతను
ఎల్లప్పుడూ చిన్నగానే ఉంటారా! తర్వాత రాసవిలాసము (ఆట పాటలు) కూడా చేస్తారు. అంటే
తప్పకుండా కాస్త పెద్దవాడయ్యారు, మరి ఆ తర్వాత ఇంకా పెద్దవాడయ్యారా లేక ఇంకేమైంది,
ఎక్కడికి వెళ్ళారు, ఇది ఎవరికీ తెలియదు. సదా చిన్న శరీరమైతే ఉండదు కదా. ఏమీ
ఆలోచించరు. ఈ పూజ మొదలైనవాటి ఆచారము నడుస్తూ వస్తుంది. జ్ఞానమైతే ఎవరిలోనూ లేదు.
శ్రీకృష్ణుడు కంసపురిలో జన్మ తీసుకున్నట్లుగా చూపిస్తారు. ఇప్పుడు కంసపురి విషయమే
లేదు. ఎవరి ఆలోచన నడవదు. భక్తులైతే శ్రీకృష్ణుడు అంతటా హాజరై ఉన్నారు అని అంటారు,
ఇంకొకవైపు అతనికి స్నానము కూడా చేయిస్తారు, తినిపిస్తారు కూడా. వాస్తవానికి అతనైతే
తినరు. విగ్రహము ముందు పెడతారు, వారు స్వయమే తినేస్తారు. అది కూడా భక్తి
మార్గమైనట్లు కదా. శ్రీనాథుని ముందు ఎంతో నైవేద్యాన్ని పెడతారు, వారైతే తినరు,
స్వయమే తినేస్తారు. దేవీల పూజలో కూడా ఇలానే చేస్తారు. స్వయమే దేవీలను తయారుచేస్తారు,
వారి పూజ మొదలైనవి చేసి మళ్ళీ ముంచేస్తారు. నగలు మొదలైనవి తీసేసి ముంచేస్తారు, ఆ
సమయములో అక్కడ చాలామంది ఉంటారు, వారు ఎవరి చేతికి ఏది వస్తే అది తీసేసుకుంటారు.
దేవీల పూజయే ఎక్కువగా జరుగుతుంది. లక్ష్మి మరియు దుర్గ, ఇరువురి మూర్తులను
తయారుచేస్తారు. పెద్ద మమ్మా కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా, వారిని బ్రహ్మపుత్ర
అని కూడా అంటారు. ఈ జన్మ రూపానికి మరియు భవిష్య జన్మ రూపానికి పూజ చేస్తున్నారు అని
భావిస్తారు కదా. ఇది ఎంత అద్భుతమైన డ్రామా. ఇటువంటి విషయాలు శాస్త్రాలలో రావు. ఇది
ప్రాక్టికల్ గా జరుగుతుంది. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము ఉంది. అందరికన్నా
ఎక్కువగా ఆత్మల చిత్రాలను తయారుచేసారని మీరు అర్థం చేసుకున్నారు. రుద్ర యజ్ఞాన్ని
రచించినప్పుడు లక్షలాది సాలిగ్రామాలను తయారుచేస్తారు. దేవీలవి ఎప్పుడూ లక్షలాది
చిత్రాలు తయారుచేయరు. అక్కడ ఎంతమంది పూజారులు ఉంటే, అన్ని దేవీలను తయారుచేస్తూ
ఉండవచ్చు. కానీ రుద్ర యజ్ఞములోనైతే ఒకే సమయములో లక్షలాది సాలిగ్రామాలను
తయారుచేస్తారు. దానికి నిశ్చితమైన రోజు ఏదీ ఉండదు, ముహూర్తము మొదలైనవేవీ ఉండవు. ఏ
విధంగా దేవీల పూజ నిశ్చితమైన సమయములో జరుగుతుందో, సాలిగ్రామాలది అలా జరగదు.
షావుకారులకు రుద్ర యజ్ఞాన్ని లేక సాలిగ్రామాలను రచించాలి అని ఆలోచన వస్తే
బ్రాహ్మణులను పిలుస్తారు. రుద్రుడు అని ఒక్క తండ్రినే అంటారు, వారితోపాటు ఎన్నో
సాలిగ్రామాలను తయారుచేస్తారు. ఆ షావుకారులు ఇన్ని సాలిగ్రామాలను తయారుచేయండి అని
చెప్తారు. దానికి తిథి-తారీఖు అంటూ ఏదీ నిశ్చితమవ్వదు. శివజయంతి నాడే రుద్రపూజను
చేస్తారని కూడా కాదు. అలా కాదు. చాలా వరకు గురువారమును శుభదినముగా నిర్ణయిస్తారు.
దీపావళినాడు లక్ష్మీ చిత్రాన్ని పళ్ళెములో పెట్టి పూజిస్తారు. ఆ తర్వాత దానిని యధా
స్థానములో పెట్టేస్తారు. వారు మహాలక్ష్మి అనగా యుగళ రూపము కదా. మనుష్యులకు ఈ విషయాల
గురించి తెలియదు. లక్ష్మికి ధనం ఎక్కడి నుండి లభిస్తుంది? పతి అయితే కావాలి కదా.
కావున వీరు (లక్ష్మి-నారాయణులు) యుగళులు. అందుకే మహాలక్ష్మి అన్న పేరు పెడతారు.
దేవీలు ఎప్పుడు ఉండేవారు, మహాలక్ష్మి ఇక్కడ ఎప్పుడు ఉండి వెళ్ళారు? ఈ విషయాలన్నీ
మనుష్యులకు తెలియవు. మీకు ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీలో కూడా
అందరికీ ఏకరసముగా ధారణ జరగదు. బాబా ఇవన్నీ అర్థం చేయించిన తర్వాత మళ్ళీ ఇలా అంటారు
- శివబాబా గుర్తున్నారా? వారసత్వము గుర్తుందా? ముఖ్యమైన విషయము ఇదే. భక్తి మార్గములో
ఎంత ధనాన్ని వృధా చేస్తారు. ఇక్కడ మీది ఒక్క పైసా కూడా వృధా అవ్వదు. మీరు
సుసంపన్నులుగా అయ్యేందుకే సేవ చేస్తారు. భక్తి మార్గములోనైతే ఎంతో ధనాన్ని ఖర్చు
చేస్తారు, దివాలా అయిపోతారు, అంతా మట్టిలో కలిసిపోతుంది. ఎంత తేడా ఉంది! ఈ సమయములో
ఏదైతే చేస్తారో దానినంతా ఈశ్వరీయ సేవలో శివబాబాకు ఇస్తారు. శివబాబా అయితే తినరు కదా,
తినేది మీరే. బ్రాహ్మణులైన మీరు మధ్యలో ట్రస్టీలుగా ఉన్నారు. మీరు బ్రహ్మాకు ఇవ్వడం
లేదు. మీరు శివబాబాకు ఇస్తున్నారు. బాబా, మీ కోసం పంచె, చొక్కా తీసుకువచ్చాము అని
అంటారు. బాబా అంటారు - ఇతనికి ఇచ్చినట్లయితే మీకు ఏమీ జమ అవ్వదు, మీరు ఏదైతే
శివబాబాను స్మృతి చేసి ఇతనికి ఇస్తారో అదే జమ అవుతుంది. బ్రాహ్మణులు శివబాబా ఖజానా
నుండే పాలింపబడతారనైతే మీరు అర్థం చేసుకుంటారు. ఏమి పంపించాలి అని బాబాను అడగవలసిన
అవసరం లేదు. ఇతనైతే తీసుకోరు. ఒకవేళ మీరు బ్రహ్మాను స్మృతి చేసినట్లయితే మీది జమాయే
అవ్వదు. బ్రహ్మా అయితే శివబాబా ఖజానా నుండే తీసుకోవాలి, అప్పుడు శివబాబాయే గుర్తుకు
వస్తారు. ఇతను మీ వస్తువును ఎందుకు తీసుకోవాలి. బి.కే.లకు ఇవ్వడం కూడా తప్పే. బాబా
అర్థం చేయించారు, మీరు ఎవరి నుండైనా ఏదైనా వస్తువు తీసుకుని ధరిస్తే వారు
గుర్తుకువస్తూ ఉంటారు. ఏదైనా చిన్న వస్తువైతే దాని గురించి కాదు. మంచి వస్తువైతే,
ఫలానావారు ఇది ఇచ్చారు అని అది ఇంకా ఎక్కువగా స్మృతిని కలిగిస్తుంది. వారిది ఏమీ జమ
అవ్వదు. కావున నష్టం వాటిల్లుతుంది కదా. శివబాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి.
నాకు బట్టలు మొదలైనవాటి అవసరం లేదు. బట్టలు మొదలైనవి పిల్లలకు కావాలి. వాటిని
శివబాబా ఖజానా నుండి ధరిస్తారు. నాకైతే నాదంటూ శరీరము లేదు. వీరు శివబాబా ఖజానా
నుండి తీసుకునేందుకు హక్కుదారులు, అలాగే రాజ్యానికి కూడా హక్కుదారులు. తండ్రి
ఇంటిలోనే పిల్లలు తింటారు, తాగుతారు కదా. మీరు కూడా సర్వీస్ చేస్తూ, సంపాదన చేస్తూ
ఉంటారు. ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత ఎక్కువ సంపాదన లభిస్తుంది. శివబాబా భండారము నుండే
తింటారు, తాగుతారు. వారికి ఇవ్వకపోతే జమాయే అవ్వదు. శివబాబాకే ఇవ్వాలి. బాబా, మీ
ద్వారా భవిష్య 21 జన్మల కొరకు పదమాపదమపతులుగా అవుతాము. ధనమైతే అంతమైపోతుంది, అందుకే
సమర్థమైనవారికి మనము ఇస్తాము. బాబా సమర్థుడు కదా. 21 జన్మల కోసం వారు ఇస్తారు. ఇన్
డైరెక్టుగా కూడా ఈశ్వరార్థము ఇస్తారు కదా. అలా ఇన్ డైరెక్టుగా ఇవ్వడములో అంతటి
సమర్థత లేదు. ఇప్పుడైతే చాలా సమర్థత ఉంది ఎందుకంటే వారు సమ్ముఖముగా ఉన్నారు. వరల్డ్
అల్మైటీ అథారిటీ ఈ సమయంలోనే ఉన్నారు.
ఈశ్వరార్థము ఏదైనా దానపుణ్యాదులు చేస్తే అల్పకాలికముగా ఎంతోకొంత లభిస్తుంది.
ఇక్కడైతే తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు - నేను సమ్ముఖముగా ఉన్నాను. నేనే
ఇచ్చేవాడిని. ఇతను కూడా శివబాబాకు సర్వస్వాన్ని ఇచ్చి మొత్తం విశ్వరాజ్యాధికారాన్ని
తీసుకున్నారు. వ్యక్తములో ఉన్న వీరిదే అవ్యక్త రూపములో సాక్షాత్కారమవుతుందని కూడా
మీకు తెలుసు. ఇతనిలోకి శివబాబా వచ్చి పిల్లలతో మాట్లాడుతారు. ఎప్పుడూ కూడా - మేము
మనుష్యుల నుండి తీసుకోవాలి అన్న ఆలోచన చేయకూడదు. శివబాబా భండారానికి పంపించండి అని
చెప్పండి. వీరికి ఇవ్వడం ద్వారా ఏమీ లభించదు, ఇంకా నష్టపోతారు. ఎవరైనా పేదవారు ఉంటే
3-4 రూపాయల వస్తువును మీకు ఇస్తారు, దానికి బదులుగా వారు శివబాబా భండారములో వేస్తే
అది పదమాలు అయిపోతుంది. స్వయాన్ని ఎందుకు నష్టపరచుకోవాలి? ఎక్కువగా దేవీలదే పూజ
జరుగుతుంది ఎందుకంటే దేవీలైన మీరే విశేషముగా జ్ఞానాన్ని ఇచ్చేందుకు నిమిత్తముగా
అవుతారు. గోపులు కూడా అర్థం చేయిస్తారు కానీ చాలా వరకైతే మాతలే బ్రాహ్మణీలుగా అయి
దారిని చూపిస్తారు, అందుకే దేవీల పేరు ఎక్కువగా ఉంది. దేవీలకు ఎంతో పూజ జరుగుతుంది.
అర్ధకల్పం మీరు పూజ్యులుగా ఉండేవారని కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మొదట
ఫుల్ పూజ్యులుగా ఉంటారు, ఆ తర్వాత సెమీ పూజ్యులుగా అవుతారు, ఎందుకంటే రెండు కళలు
తగ్గిపోతాయి. త్రేతాలో రాముని వంశము ఉంటుంది అని అంటారు. వారైతే లక్షల సంవత్సరాల
విషయము అని అంటారు కావున దాని లెక్కే ఉండదు. భక్తి మార్గము వారి బుద్ధికి మరియు మీ
బుద్ధికి ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. మీది ఈశ్వరీయ బుద్ధి, అది
రావణుడి బుద్ధి. మీ బుద్ధిలో ఉంది - ఈ మొత్తం చక్రమంతా 5000 సంవత్సరాలది, ఇది
తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాత్రిలో ఉన్నారో, వారు లక్షల సంవత్సరాలు అని అంటారు,
ఎవరైతే పగలులో ఉన్నారో, వారు 5000 సంవత్సరాలు అని అంటారు. అర్ధకల్పము మీరు భక్తి
మార్గములో అసత్యమైన విషయాలను విన్నారు. సత్యయుగములో ఇటువంటి విషయాలు ఉండనే ఉండవు.
అక్కడైతే వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు మీకు డైరెక్టు మతము లభిస్తుంది.
శ్రీమద్భగవద్గీత ఉంది కదా. ఇంకే శాస్త్రానికి శ్రీమత్ అన్న పేరు లేదు. ప్రతి 5000
సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమయుగము, గీతా యుగము వస్తుంది. లక్షల సంవత్సరాల
విషయమైతే ఉండదు. ఎప్పుడైనా, ఎవరైనా వస్తే వారిని సంగమము వద్దకు తీసుకువెళ్ళండి.
అనంతమైన తండ్రి రచయిత అనగా తమ మరియు రచన యొక్క మొత్తం పరిచయమునంతా ఇచ్చారు. అయినా
మళ్ళీ ఇలా చెప్తారు - అచ్ఛా, తండ్రిని స్మృతి చేయండి, ఇంకేమీ ధారణ చేయలేకపోతే
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, పవిత్రముగా అయితే అవ్వవలసిందే,
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు కావున దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.