24-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.12.2002


‘‘సమయము అనుసారంగా లక్ష్యము మరియు లక్షణాల సమానత ద్వారా బాబా సమానముగా అవ్వండి’’

ఈ రోజు నలువైపులా ఉన్న సర్వ స్వమానధారీ పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఈ సంగమములో పిల్లలైన మీకు ఏ స్వమానమైతే లభిస్తుందో దానికంటే పెద్ద స్వమానము మొత్తము కల్పములో మరే ఆత్మకూ ప్రాప్తించదు. ఎంత గొప్ప స్వమానము, అది తెలుసా? స్వమానము యొక్క నషా ఎంత గొప్పది, ఇది స్మృతిలో ఉంటుందా? స్వమానాల మాల చాలా పెద్దది. ఒక్కొక్క పూసను లెక్కపెట్టుకుంటూ వెళ్ళండి మరియు స్వమానము యొక్క నషాలో లవలీనులైపోండి. ఈ స్వమానాలు అనగా టైటిల్స్ స్వయంగా బాప్ దాదా ద్వారా లభించాయి. పరమాత్మ ద్వారా స్వమానము ప్రాప్తించింది కనుక ఈ స్వమానము యొక్క ఆత్మిక నషాను కదిలింపజేయగలిగే అథారిటీ ఏదీ లేదు ఎందుకంటే ఇది ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) ద్వారా ప్రాప్తించింది.

బాప్ దాదా ఈ రోజు అమృతవేళ మొత్తము విశ్వములోని పిల్లలందరి వద్దకు తిరుగుతూ - పిల్లలు ప్రతి ఒక్కరి స్మృతిలో ఎన్ని స్వమానాల మాలలు ఉన్నాయి అన్నదానిని చూసారు. మాలను ధారణ చెయ్యటము అనగా స్మృతి ద్వారా ఆ స్థితిలోనే స్థితులై ఉండటము. కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి - ఈ స్మృతి యొక్క స్థితి ఎంతవరకు ఉంటుంది? బాప్ దాదా చూస్తున్నారు - స్వమానము యొక్క నిశ్చయము మరియు దానికి సంబంధించిన ఆత్మిక నషా, ఈ రెండింటి బ్యాలెన్స్ ఎంతవరకు ఉంటుంది? నిశ్చయము అంటే నాలెడ్జ్ ఫుల్ గా అవ్వటము మరియు ఆత్మిక నషా అంటే శక్తిశాలిగా అవ్వటము. నాలెడ్జ్ ఫుల్ లో కూడా రెండు రకాల వారిని చూసారు - ఒకరేమో నాలెడ్జ్ ఫుల్, ఇంకొకరు నాలెడ్జబుల్ (జ్ఞాన స్వరూపులు), మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎవరిని? పిల్లల లక్ష్యము చాలా ఉన్నతమైనది అన్నదైతే బాప్ దాదాకు తెలుసు. లక్ష్యము ఉన్నతమైనదే కదా, ఉన్నతమైనదేనా? బాబా సమానముగా అవుతాము అని అందరూ అంటారు. మరి బాబా ఏ విధంగా ఉన్నతోన్నతమైనవారో, అలా బాబా సమానముగా అయ్యే లక్ష్యము కూడా ఎంత ఉన్నతమైనది! ఈ లక్ష్యాన్ని చూసి బాప్ దాదా చాలా సంతోషిస్తారు కానీ... కానీ ఏమిటో చెప్పమంటారా? కానీ ఏమిటి... టీచర్లు మరియు డబుల్ విదేశీయులు వింటారా? అర్థమైపోయి ఉంటుంది. బాప్ దాదా లక్ష్యము మరియు లక్షణాలు సమానముగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి - లక్ష్యము మరియు లక్షణాలు అనగా ప్రాక్టికల్ స్థితి సమానముగా ఉన్నాయా? ఎందుకంటే లక్ష్యము మరియు లక్షణాలు సమానముగా ఉండటమే బాబా సమానముగా అవ్వటము. సమయమనుసారముగా ఈ సమానతను సమీపముగా తీసుకురండి.

వర్తమాన సమయములో బాప్ దాదా పిల్లలలోని ఒక విషయాన్ని చూడలేకపోతున్నారు. చాలామంది పిల్లలు బాబా సమానముగా అయ్యేందుకు రకరకాలుగా శ్రమిస్తున్నారు. బాబా ప్రేమ ముందు శ్రమించాల్సిన అవసరమే లేదు, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. తప్పుడు నషా అనేది దేహాభిమానానికి చెందిన నేచర్ గా (స్వభావముగా) అయిపోయింది, న్యాచురల్ (సహజము) అయిపోయింది, కావున దేహాభిమానములోకి రావటానికి పురుషార్థము చెయ్యవలసి వస్తుందా? లేక 63 జన్మలలో దీని కోసమేమైనా పురుషార్థము చేసారా? నేచర్ అయిపోయింది, నేచురల్ అయిపోయింది. అందుకే ఇప్పుడు కూడా దేహీకు బదులుగా దేహములోకి వచ్చేస్తూ ఉంటాము అని అప్పుడప్పుడు అంటారు. మరి ఏ విధంగా దేహాభిమానము నేచర్ గా మరియు న్యాచురల్ గా ఉందో, అలా ఇప్పుడు దేహీ-అభిమానీ స్థితి కూడా నేచురల్ గా మరియు నేచర్ గా ఉండాలి, నేచర్ ను మార్చుకోవటము కష్టమవుతుంది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు - నా భావము అది కాదు, అది నా నేచర్ అని అంటుంటారు కదా. ఆ నేచర్ ను నేచురల్ చేసుకున్నారు, మరి బాబా సమానమైన నేచర్ ను నేచురల్ చేసుకోలేరా! చెడు నేచర్ కు వశమైపోతారు మరియు బాబా సమానముగా అయ్యే యథార్థ నేచర్ లో కష్టమెందుకు? బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరిలో దేహీ-అభిమానులుగా ఉండే నేచురల్ నేచర్ ను చూడాలని కోరుకుంటున్నారు. బ్రహ్మాబాబాను చూసారు, వారు నడుస్తూ-తిరుగుతూ, ఏ కార్యమునైనా చేస్తూ వారిలో దేహీ-అభిమానీ స్థితి నేచురల్ నేచర్ గా ఉండేది.

బాప్ దాదా సమాచారము విన్నారు - ఈ రోజుల్లో దాదీలు విశేషముగా ఈ ఆత్మిక సంభాషణను చేస్తున్నారు - ఫరిశ్తా అవస్థను, కర్మాతీత అవస్థను, బాబా సమాన అవస్థను నేచురల్ గా ఎలా తయారుచేసుకోవాలి, అది నేచర్ అయిపోవాలి అని ఈ ఆత్మిక సంభాషణను చేస్తున్నారు కదా! దాదీకు కూడా పదే-పదే - ఫరిశ్తాగా అయిపోవాలి, కర్మాతీతముగా అయిపోవాలి, బాబా ప్రత్యక్షమైపోవాలి అని అనిపిస్తుంది కదా. ఫరిశ్తాగా అయ్యేందుకు మరియు నిరాకారీ కర్మాతీత అవస్థను తయారుచేసుకునేందుకు విశేష సాధనము - నిరహంకారిగా అవ్వటము. నిరహంకారియే నిరాకారిగా అవ్వగలుగుతారు, అందుకే తండ్రి కూడా బ్రహ్మా ద్వారా చివరి మంత్రములో - నిరాకారీతోపాటు నిరహంకారి అని కూడా చెప్పారు. కేవలము మీ దేహములో లేక ఇతరుల దేహములో చిక్కుకోవడాన్నే దేహ-అహంకారము లేక దేహ-భానము అని అనరు. దేహ-అహంకారము కూడా ఉంది, దేహ-భానము కూడా ఉంది. మీ దేహము మరియు ఇతరులు దేహము యొక్క భానములో ఉండటము, మోహములో ఉండటము - ఇందులో అయితే మెజారిటీ పాస్ అయ్యారు. ఎవరైతే పురుషార్థము యొక్క లగనములో ఉంటారో, సత్యమైన పురుషార్థులో, వారు ఈ స్థూల రూపము నుండి అతీతముగా ఉన్నారు. కానీ దేహ-భానానికి చెందిన సూక్ష్మ రూపాలు అనేకమున్నాయి, దీని లిస్టు పరస్పరం తయారుచెయ్యండి. బాప్ దాదా అది ఈ రోజు వినిపించరు. ఈ రోజు ఈ మాత్రము సూచననివ్వటమే ఎక్కువ, ఎందుకంటే అందరూ తెలివైనవారు. మీ అందరికీ తెలుసు కదా, ఒకవేళ అందరినీ అడిగినట్లయితే అందరూ చాలా తెలివిగా వినిపిస్తారు. కానీ బాప్ దాదా కేవలము చిన్నపాటి సహజ పురుషార్థాన్ని చెప్తున్నారు, అదేమిటంటే - సదా మనసా-వాచా-కర్మణా, సంబంధ-సంపర్కాలలో మూడు పదాల చివరి మంత్రాన్ని (నిరాకారి, నిరహంకారి, నిర్వికారి), దీనిని సదా గుర్తుంచుకోండి. సంకల్పము చేసినప్పుడు - ఈ సంకల్పము మహామంత్ర సంపన్నముగా ఉందా అని చెక్ చేసుకోండి. అదే విధంగా మాటలు మరియు కర్మలు, అన్నింటిలోనూ ఈ మూడు పదాలను గుర్తుంచుకోండి మరియు సమానము చెయ్యండి. ఇది సహజమే కదా? మొత్తము మురళిని గుర్తు చేసుకోండి అని చెప్పటం లేదు, కేవలం మూడు పదాలు, అంతే. ఈ మహామంత్రము సంకల్పాలను కూడా శ్రేష్ఠముగా చేస్తుంది, వాణిలో నిర్మానతను తీసుకొస్తుంది, కర్మలలో సేవా భావాన్ని తీసుకొస్తుంది, సంబంధ-సంపర్కాలలో సదా శుభ భావన, శ్రేష్ఠ కామనల వృత్తిని తయారుచేస్తుంది.

బాప్ దాదా సేవ సమాచారాన్ని కూడా వింటారు. సేవలో ఈ రోజుల్లో రకరకాల కోర్సులు చేయిస్తారు, కానీ ఇప్పుడు ఒక కోర్సు ఉండిపోయింది. అదేమిటంటే, ప్రతి ఆత్మకు ఏ శక్తి అయితే కావాలో, ఆ ఫోర్సు యొక్క కోర్సు చేయించండి. శక్తిని నింపే కోర్సు చేయించండి, వాణి ద్వారా వినిపించే కోర్సు కాదు, వాణితోపాటు శక్తిని నింపే కోర్సు కూడా ఉండాలి. తద్వారా మంచిగా ఉంది, మంచిగా ఉంది అని అనటమే కాదు, కానీ మంచివారిగా అయిపోవాలి. ఈ రోజు నాకు శక్తి యొక్క అంచలి (దోసిలి) లభించింది అని వారు వర్ణించాలి. అంచలి అంత అనుభవమైనా సరే, ఆ ఆత్మలకు అది చాలా ఎక్కువ. కోర్సు చేయించండి కానీ ముందుగా మీకు మీరు కోర్సు చేయించుకుని ఆ తరువాత చెప్పండి. మరి బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో విన్నారా? లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానముగా తయారుచేసుకోండి. అందరి లక్ష్యాన్ని చూసి బాప్ దాదా చాలా, చాలా సంతోషిస్తారు. ఇప్పుడు కేవలము వాటిని సమానముగా తయారుచేసినట్లయితే బాబా సమానముగా చాలా సహజముగా అయిపోతారు.

బాప్ దాదా అయితే పిల్లలను సమానముకంటే కూడా ఉన్నతముగా, తమకంటే కూడా ఉన్నతముగా చూస్తారు. బాప్ దాదా పిల్లలను సదా శిరో కిరీటాలు అని అంటారు. కిరీటమైతే తల కంటే కూడా పైన ఉంటుంది కదా. టీచర్లూ, మీరు శిరో కిరీటాలేనా?

టీచర్లతో:- ఎంతమంది టీచర్లు ఉన్నారో చూడండి. ఒక గ్రూపులోనే ఇంతమంది టీచర్లు ఉంటే అన్ని గ్రూపులలో ఎంతమంది టీచర్లు ఉండవచ్చు! టీచర్లు బాప్ దాదా యొక్క ఒక ఆశను పూర్తి చెయ్యాలన్న సంకల్పము చేసారు, కానీ దానిని ముందుకు తీసుకురాలేదు. అది ఏమిటో తెలుసా? ఒకటి, ఇప్పుడు వారసుల మాలను తయారుచెయ్యండి అని బాప్ దాదా చెప్పారు. వారసుల మాల, జనరల్ మాల కాదు. రెండు, సంబంధ-సంపర్కములోనివారిని మైక్ లుగా తయారుచెయ్యండి. మీరు భాషణ చెయ్యకండి, కానీ వారు మీ వైపు నుండి మీడియాగా తయారవ్వాలి. మీ మీడియాను తయారుచెయ్యండి. మీడియా ఏం చేస్తుంది? చెడు విషయాన్ని అయినా, మంచి విషయాన్ని అయినా శబ్దాన్ని వ్యాపింపజేస్తుంది కదా! కనుక ఎటువంటి మైక్ లు తయారవ్వాలంటే, వారు మీడియా సమానముగా ప్రత్యక్షతా శబ్దాన్ని వ్యాపింపజెయ్యాలి. భగవంతుడు వచ్చేసారు, భగవంతుడు వచ్చేసారు... అని మీరు అంటారు, కానీ వారు దానిని సాధారణముగా భావిస్తారు, కనుక మీ వైపు నుండి ఇంకొకరెవరైనా చెప్పాలి, అధికారము కలవారు చెప్పాలి, వారు ముందుగా మిమ్మల్ని శక్తుల రూపములో ప్రత్యక్షము చెయ్యాలి. ఎప్పుడైతే శక్తులు ప్రత్యక్షమవుతారో, అప్పుడు బాబా ప్రత్యక్షమవుతారు. కనుక తయారుచెయ్యండి, మీడియాను తయారుచెయ్యండి. చూస్తాము. చేసారా? మాలను వదిలేయండి, చేతి కడియమునైనా తయారుచేసారా? ఎవరైతే ఇలా తయారుచేసారో వారు చేతులెత్తండి. ఎటువంటివారిని తయారుచేసారో బాప్ దాదా చూస్తారు, మంచి ధైర్యాన్ని అయితే పెట్టుకున్నారు. టీచర్లు ఏం చెయ్యాలో విన్నారా! శివరాత్రి సమయములో వారసుల క్వాలిటీని తయారుచెయ్యండి. మైక్ లు తయారుచెయ్యండి, అప్పుడు తరువాత సంవత్సరము వచ్చే శివరాత్రికి అందరి నోటి నుండి శివబాబా వచ్చారు, శివబాబా వచ్చారు అన్న మాట రావాలి. అటువంటి శివరాత్రిని జరుపుకోండి. ప్రోగ్రాములైతే చాలా మంచిగా తయారుచేసారు. అందరికీ ప్రోగ్రాములు పంపించారు కదా. ప్రోగ్రాములైతే బాగా తయారుచేసారు కానీ ప్రతి ప్రోగ్రాము నుండీ ఎవరైనా మైక్ లు తయారవ్వాలి, ఎవరైనా వారసులు తయారవ్వాలి. ఈ పురుషార్థము చెయ్యండి, అంతేకానీ భాషణ చేసారు, వెళ్ళిపోయారు అన్నట్లు ఉండకూడదు. ఇప్పుడైతే 66 సంవత్సరాలు గడిచిపోయాయి మరియు సేవలో 50 సంవత్సరాల ఉత్సవాన్ని కూడా జరుపుకున్నారు. ఇప్పుడు శివరాత్రి యొక్క డైమండ్ జూబ్లీని జరుపుకోండి. ఈ రెండు రకాల ఆత్మలను తయారుచెయ్యండి, ఇక అప్పుడు చూడండి నగారా మ్రోగుతుందో, మ్రోగదో. నగారాను మీరు మ్రోగించరు. మీరైతే దేవీలు, సాక్షాత్కారము చేయిస్తారు. నగారాను మ్రోగించేవారిని తయారుచెయ్యండి. శివశక్తులు వచ్చేసారు... అని ప్రాక్టికల్ గా పాట పాడాలి. శివరాత్రికి ఏం చెయ్యాలో విన్నారా! ఊరికే అలా భాషణ చెప్పేసి పూర్తి చెయ్యవద్దు. బాబా, 500-1000 మంది వ్యక్తులు, లక్ష మంది వ్యక్తులు వచ్చారు అని ఉత్తరం వ్రాస్తారు. సరే, వచ్చారు, సందేశాన్ని ఇచ్చారు, కానీ వారసులు ఎంతమంది వెలువడ్డారు, మైక్ లు ఎంతమంది వెలువడ్డారు, ఇప్పుడు ఈ సమాచారాన్ని ఇవ్వండి. ఇప్పటివరకు చేసిన సేవ ద్వారా ధరణిని తయారుచేసారు, సందేశాన్ని ఇచ్చారు, దానిని బాబా మంచిది అంటున్నారు, ఆ సేవ వ్యర్థము పోలేదు, సమర్థమైంది. ప్రజలైతే తయారయ్యారు, రాయల్ కుటుంబమైతే తయారైంది, కానీ రాజు, రాణి కూడా కావాలి. సింహసనముపై కూర్చునే రాజు, రాణి కాదు కానీ రాజు, రాణితోపాటు అక్కడ దర్బారులో కూడా రాజు సమానముగా కూర్చుంటారు కదా, అటువంటివారినైతే తయారుచెయ్యండి. రాజ్య దర్బారు శోభాయమానముగా అయిపోవాలి. శివరాత్రికి ఏం చెయ్యాలో విన్నారా. పాండవులు వింటున్నారు. చేతిని ఎత్తండి. అటెన్షన్ పెట్టారు. మంచిది. పెద్ద-పెద్ద మహారథులు కూర్చుని ఉన్నారు. బాప్ దాదా సంతోషిస్తారు, ఇది కూడా హృదయములోని ప్రేమ, ఎందుకంటే ప్రత్యక్షత ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుంది... అని మీ అందరికీ సంకల్పము నడుస్తుంది కదా, అది బాప్ దాదా వింటుంటారు. మధుబన్ వారు ఏం విన్నారు? మధుబన్ వారు విన్నారు. మధుబన్, శాంతివన్, జ్ఞాన సరోవర్ వారు, అందరూ మధుబన్ నివాసులే. అచ్ఛా.

మధుబన్ నుండి నగారా మ్రోగుతుంది, ఎక్కడి నుండి నగారా మ్రోగుతుంది? (ఢిల్లీ నుండి). మధుబన్ నుండి కాదా? నలువైపుల నుండి మ్రోగుతుంది అని చెప్పండి. ఒకవైపు నుండే మ్రోగదు. మధుబన్ నుండి కూడా మ్రోగుతుంది, అలాగే నలువైపుల నుండి కూడా మ్రోగుతుంది, అప్పుడు కుంభకర్ణులు మేల్కొంటారు. మధుబన్ వారు సేవలో అలసిపోనివారుగా అయ్యి సేవా పాత్రను పోషిస్తున్నారు కదా, అలాగే ఈ మనసా సేవను కూడా చేస్తుండండి. కేవలము కర్మణా సేవ మాత్రమే కాదు, మనసా-వాచ-కర్మణా, మూడు సేవలు, చేస్తున్నారు కూడా, ఇంకా ఎక్కువ చెయ్యండి. అచ్ఛా. మధుబన్ వారిని మర్చిపోలేదు. బాప్ దాదా వచ్చేది మధుబన్ లోనే, కానీ మధుబన్ పేరును తీసుకోరు అని మధుబన్ వారు అనుకుంటారు. మధుబన్ అయితే సదా గుర్తుండనే ఉంటుంది. మధుబన్ లేకపోతే మరి వీరు ఎక్కడకు వస్తారు! సేవాధారులైన మీరు సేవ చెయ్యకపోతే వీరు తినేది, ఉండేది ఎలా! కనుక మధుబన్ వారిని బాప్ దాదా కూడా మనస్ఫూర్తిగా గుర్తు చేస్తారు మరియు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలను ఇస్తారు. అచ్ఛా. మధుబన్ వారిపై కూడా ప్రేమ ఉంది, టీచర్లపై కూడా ప్రేమ ఉంది, మధురాతి మధురమైన మాతలపై కూడా ప్రేమ ఉంది, అలాగే మహావీరులైన పాండవులపై కూడా ప్రేమ ఉంది. పాండవులు లేకపోయినా కూడా గతి లేదు. అందుకే చతుర్భుజ రూపము యొక్క మహిమ ఎక్కువగా ఉంది. పాండవులు మరియు శక్తులు, ఇరువురి కంబైండ్ స్వరూపమే చతుర్భుజుడైన విష్ణువు. అచ్ఛా!

మధుబన్ లోని పాండవులూ, మీ అందరికి కూడా నషా ఉంది కదా? విజయానికి చెందిన నషా, వేరే నషా కాదు. మంచిది, పాండవ భవన్ లో మెజారిటీ పాండవులు ఉన్నారు, పాండవులు లేకపోతే మీ అందరికీ మధుబన్ లో మజా రాదు, అందుకే మిమ్మల్ని ఆనందముగా ఉంచే, తినిపించే మరియు ఎగిరింపజేసే మధువన నివాసులదే బలిహారమంతా. ఈ రోజు బాప్ దాదాకు మధుబన్ నివాసులు అమృతవేళ నుండి గుర్తుకొస్తున్నారు. ఇక్కడ కూర్చుని ఉన్నా, పైన కూర్చుని ఉన్నా, డ్యూటీలో ఉన్న మధుబన్ వారైనా, నలువైపులా ఉన్న మధుబన్ నివాసులకు బాప్ దాదా అమృతవేళ నుండి స్మృతులు ఇచ్చారు. అచ్ఛా!

బాప్ దాదా ఏదైతే ఆత్మిక ఎక్సర్సైజ్ ను ఇచ్చారో, దానిని రోజంతటిలో ఎన్ని సార్లు చేస్తున్నారు? మరియు ఎంత సమయములో చేస్తున్నారు? నిరాకారీ మరియు ఫరిశ్తా. బాప్ మరియు దాదా, ఇప్పుడిప్పుడే నిరాకారీ, ఇప్పుడిప్పుడే ఫరిశ్తా స్వరూపులు. రెండింటిలోనూ దేహ భానము ఉండదు. కనుక దేహ భానము నుండి దూరమవ్వాలంటే ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ ను కర్మలు చేస్తూ కూడా, మీ డ్యూటీని నిర్వహిస్తూ కూడా, ఒక్క క్షణములో అభ్యాసము చెయ్యగలరు. ఇది ఒక న్యాచురల్ అభ్యాసముగా అయిపోవాలి - ఇప్పుడిప్పుడే నిరాకారీ, ఇప్పుడిప్పుడే ఫరిశ్తా. అచ్ఛా! (బాప్ దాదా డ్రిల్ చేయించారు)

ఇలా నిరంతర భవ! నలువైపులా బాప్ దాదా స్మృతిలో నిమగ్నమై ఉండేవారు, బాబా సమానముగా అయ్యే లక్ష్యమును, లక్షణాలలో సమానముగా చేసుకునేవారు, ఎవరైతే మూలమూలలో సైన్స్ సాధనాల ద్వారా రాత్రైనా, పగలైనా మేల్కొని కూర్చున్నవారు, అటువంటి పిల్లలకు కూడా బాప్ దాదా ప్రియస్మృతులను, అభినందనలను మరియు హృదయ పూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు. బాప్ దాదాకు తెలుసు - అందరి హృదయములో ఈ సమయములో హృదయాభిరాముడైన బాబా స్మృతి ఇమిడి ఉంది. మూలమూలలో కూర్చుని ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరికీ బాప్ దాదా వ్యక్తిగత పేరు సహితముగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. పేర్ల మాలను జపించినట్లయితే రాత్రంతా పూర్తయిపోతుంది. బాప్ దాదా పిల్లలందరికీ స్మృతులు ఇస్తున్నారు. పురుషార్థములో ఏ నంబరులో ఉన్నవారైనా కానీ బాప్ దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరి శ్రేష్ఠ స్వమానానికి ప్రియస్మృతులు ఇస్తారు మరియు నమస్తే చెప్తారు. ప్రియస్మృతులను ఇచ్చే సమయములో బాప్ దాదా ఎదురుగా నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ గుర్తున్నారు. ఏ ఒక్క బిడ్డ అయినా, ఏ మూలన ఉన్నా, ఊరిలో లేక పట్టణములో, దేశములో లేక విదేశములో, ఎక్కడ ఉన్నా సరే, బాప్ దాదా వారికి స్వమానాన్ని స్మృతి కలిగిస్తూ ప్రియస్మృతులను ఇస్తున్నారు. అందరూ ప్రియస్మృతులకు అధికారులు ఎందుకంటే బాబా అని అన్నారంటేనే ప్రియస్మృతులకు అధికారులుగా ఉన్నట్లే. సమ్ముఖముగా ఉన్న మీ అందరిని కూడా బాప్ దాదా స్వమానము యొక్క మాలను ధరించిన స్వరూపములో చూస్తున్నారు. అందరికీ బాబా సమాన స్వమాన స్వరూపములో ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీజీతో:- మీరు బాగైపోయారు, ఇప్పుడు ఏ అనారోగ్యమూ లేదు. అది పారిపోయింది. అది కేవలము చూపించేందుకు వచ్చింది, అది మా వద్దకు కూడా వస్తుంది, అది పెద్ద విషయమేమీ కాదు అని అందరికీ చూపించడానికి వచ్చింది.

దాదీలందరూ చాలా మంచిగా పాత్రను పోషిస్తున్నారు. బాప్ దాదా అందరి పాత్రను చూసి సంతోషిస్తారు. (నిర్మలశాంతాదాదీతో) ఆదిరత్నము కదా! అనాది రూపములో కూడా నిరాకారీ బాబాకు సమీపముగా ఉన్నారు, వారితో పాటే ఉంటారు మరియు ఆది రూపములో కూడా రాజ్య దర్బారులోని సహచరులు. సదా రాయల్ కుటుంబానికి చెందిన రాయల్ వారు మరియు సంగమములో కూడా ఆది రత్నముగా అయ్యే భాగ్యము లభించింది. ఇది చాలా గొప్ప భాగ్యము, భాగ్యమే కదా? మీరు హాజరై ఉండటమే అందరి కొరకు వరదానము. ఏదైనా మాట్లాడినా, మాట్లాడకపోయినా, ఏదైనా చేసినా, చెయ్యకపోయినా, మీరు హాజరై ఉండటమే అందరి కొరకు వరదానము. అచ్ఛా, ఓం శాంతి.

వరదానము:-
లౌకిక, అలౌకిక జీవితములో సదా అతీతముగా అయ్యి పరమాత్ముని తోడు యొక్క అనుభవము ద్వారా నష్టోమోహా భవ

సదా అతీతముగా ఉన్నదానికి గుర్తు - ప్రభు ప్రేమ యొక్క అనుభూతి మరియు ఎంతగా ప్రేమ ఉంటుందో, అంతగా తోడుగా ఉంటారు, వేరుగా ఉండరు. తోడుగా ఉండటమునే ప్రేమ అని అంటారు. తండ్రి తోడుగా ఉన్నప్పుడు మరి అన్ని భారాలను తండ్రికి ఇచ్చేసి స్వయం తేలికగా అయిపోండి, ఇదే నష్టోమోహాగా అయ్యేందుకు విధి. కానీ పురుషార్థము యొక్క సబ్జెక్టులో సదా అన్న పదాన్ని అండర్ లైన్ చెయ్యండి. లౌకిక మరియు అలౌకిక జీవితములో సదా అతీతముగా ఉండండి, అప్పుడు సదా తోడు యొక్క అనుభవము కలుగుతుంది.

స్లోగన్:-
వికారాల రూపీ సర్పాలను మీ పానుపుగా చేసుకోండి, అప్పుడు సహజయోగులుగా అవుతారు.