25-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పావనముగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయము -
తండ్రి స్మృతి, స్మృతి విషయములో చేసే శ్రమయే అంతిమములో పనికొస్తుంది’’
ప్రశ్న:-
సంగమములో ఏ
తిలకాన్ని దిద్దుకున్నట్లయితే స్వర్గ రాజ్యము యొక్క తిలకము లభిస్తుంది?
జవాబు:-
సంగమములో ఈ
తిలకాన్ని దిద్దుకోండి - ఆత్మనైన నేను బిందువును, నేను శరీరాన్ని కాదు. లోలోపల ఇదే
అభ్యాసాన్ని చేస్తూ ఉండండి - నేను ఆత్మను, నేను తండ్రి నుండి వారసత్వాన్ని
తీసుకోవాలి. బాబా కూడా బిందువు, నేను కూడా బిందువును. ఈ తిలకముతో స్వర్గ రాజ్యము
యొక్క తిలకము ప్రాప్తిస్తుంది. బాబా అంటున్నారు - నేను గ్యారెంటీ ఇస్తున్నాను, మీరు
స్మృతి చేసినట్లయితే, అర్ధకల్పము కోసం ఏడవడము నుండి విముక్తులైపోతారు.
ఓంశాంతి
ఆత్మనైన నేను తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి అనే చింత ఉండాలి, అప్పుడే పావనముగా
అవ్వగలరు. శ్రమ అంటూ ఉంటే అది ఇదే, కానీ పిల్లలు అంతగా శ్రమించలేకపోతున్నారు. మాయ
చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక్క తండ్రి స్మృతిని మరపింపజేస్తుంది, ఇతరుల స్మృతి
వస్తుంది. తండ్రిని లేక ప్రియుడిని స్మృతి చేయరు. ఇటువంటి ప్రియుడినైతే తక్కువలో
తక్కువ 8 గంటలు స్మృతి చేసే సేవ చేయాలి అనగా ప్రియునికి స్మృతి చేసే సహాయాన్ని
అందించాలి, అనగా పిల్లలు తండ్రిని స్మృతి చేయాలి - ఇదే చాలా గొప్ప శ్రమ. గీతలో కూడా
మన్మనాభవ అని ఉంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. లేస్తూ-కూర్చుంటూ,
నడుస్తూ-తిరుగుతూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి, ఇంకేమీ చేయనవసరము లేదు.
అంతిమములో ఈ స్మృతియే పనికొస్తుంది. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి, ఇప్పుడు
మనము తిరిగి వెళ్ళాలి. ఈ విషయములో చాలా శ్రమ చేయాలి. ఉదయాన్నే స్నానము మొదలైనవి
చేసుకుని, ఏకాంతములో మేడ పైన లేదా హాలులోకి వచ్చి కూర్చుండిపోండి. ఎంత ఏకాంతము ఉంటే
అంత మంచిది. సదా ఇదే ఆలోచన చేయండి - నేను తండ్రిని స్మృతి చేయాలి, తండ్రి నుండి
పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ శ్రమను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మీరు
చేయాల్సి ఉంటుంది. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలలో ఎక్కడా కూడా మీరు ఈ శ్రమను
చేయవలసిన అవసరముండదు. ఈ సంగమములోనే తండ్రి మీకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి,
అంతే. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పే వేళ ఇదే. తండ్రి రావడము కూడా
సంగమములోనే వస్తారు, ఇంకెప్పుడూ తండ్రి రారు. మీకు కూడా నంబరువారు
పురుషార్థానుసారముగా తెలుసు. చాలామంది పిల్లలు తండ్రిని మర్చిపోతారు, అందుకే చాలా
మోసపోతారు. రావణుడు చాలా మోసకారి, అతను అర్ధకల్పము యొక్క శత్రువు. అందుకే తండ్రి
అంటారు - రోజూ ఉదయాన్నే లేచి విచార సాగర మంథనము చేయండి మరియు ఈ విధముగా చార్టును
పెట్టుకోండి - నేను ఎంత సమయము తండ్రిని స్మృతి చేసాను! ఎంత తుప్పు తొలగి ఉంటుంది!
అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది. తమ పూర్తి వారసత్వాన్ని పొందేందుకు, పిల్లలు పూర్తిగా
ప్రయత్నించాలి. నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. ఇది సత్యమైన సత్యనారాయణుడి కథ.
భక్తులు పౌర్ణమి రోజున సత్యనారాయణుడి కథను చెప్పుకుంటారు. 16 కళల సంపూర్ణులుగా
అవ్వాలని ఇప్పుడు మీకు తెలుసు. సత్యమైన తండ్రిని స్మృతి చేసినట్లయితేనే ఆ విధముగా
అవుతారు. తండ్రి శ్రీమతాన్ని ఇచ్చేవారు. తండ్రి అంటారు - గృహస్థములో ఉండండి,
వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి ఏవైనా చేసుకోండి, తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి
మరియు పావనముగా అవ్వాలి, అంతే. స్మృతి చేయకపోతే ఎక్కడో ఒక చోట రావణుడి వల్ల మోసపోతూ
ఉంటారు, అందుకే స్మృతి అనే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. శివబాబాను
స్మృతి చేయాలి. దేహ సహితముగా దేహము యొక్క సంబంధీకులెవరైతే ఉన్నారో, వారిని మరచి
స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. తండ్రి పదే-పదే అర్థం చేయిస్తున్నారు -
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి లేదంటే అంతిమములో చాలా-చాలా
పశ్చాత్తాపపడతారు, చాలా మోసపోతారు. ఎంత గట్టిగా చెంపదెబ్బ తగులుతుందంటే, మాయ
పూర్తిగా నల్ల ముఖము చేసేస్తుంది. తండ్రి తెల్ల ముఖముగా తయారుచేయడానికి వచ్చారు. ఈ
సమయములో అందరూ ఒకరి ముఖాన్ని ఒకరు నల్లగా చేస్తూ ఉంటారు. తెల్లగా తయారుచేసేవారు
ఒక్క తండ్రి మాత్రమే, వారి స్మృతితో మీరు తెల్లగా, స్వర్గానికి యజమానులుగా అవుతారు.
ఇది ఉన్నదే పతిత ప్రపంచము. తండ్రి పతితులను పావనముగా తయారుచేయడానికే వస్తారు. ఇకపోతే
మీ వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటితో బాబాకు ఎటువంటి సంబంధము లేదు. శరీర
నిర్వహణార్థము మీరు ఏమి చేయాల్సి ఉంటే అది చేయండి. తండ్రి అయితే కేవలం మన్మనాభవ అని
అంటారు. మేము పావన ప్రపంచానికి యజమానులుగా ఎలా అవ్వాలి అని మీరంటారు కూడా. తండ్రి
అంటారు, కేవలం నన్ను స్మృతి చేయండి, అంతే. పావనముగా అయ్యేందుకు ఇంకే ఉపాయము లేదు.
దాన-పుణ్యాలు మొదలైనవి ఎన్ని చేసినా కానీ, ఎంత కష్టపడినా కానీ, నిప్పులపై అటు-ఇటు
నడిచినా కానీ - ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇవేవీ ఉపయోగపడవు. ఇది చాలా సింపుల్ విషయము,
దీనిని సహజయోగమని అంటారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - నేను నా మధురాతి
మధురమైన బాబాను రోజంతటిలో ఎంత స్మృతి చేసాను! నిద్రలోనైతే ఏ పాపము జరగదు, అశరీరిగా
అయిపోతారు. ఇకపోతే, పగలు చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి, అంతేకాక పాత పాపాలు కూడా చాలా
ఉన్నాయి. స్మృతి విషయములో శ్రమ చేయాలి. ఇక్కడకు వచ్చినప్పుడు ఈ శ్రమను చేయాలి. బయటి
వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేయండి లేకపోతే వాయుమండలాన్ని చాలా పాడు చేస్తారు. ఇంటి
గురించి, పంటపొలాల గురించి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఒక్కోసారి పిల్లలు
గుర్తుకువస్తారు, ఒక్కోసారి గురువు గుర్తుకువస్తారు. సంకల్పాలు నడుస్తూ ఉన్నట్లయితే
వాయుమండలాన్ని పాడు చేస్తారు. శ్రమ చేయనివారు విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. ఇవి చాలా
సూక్ష్మమైన విషయాలు. మీరు కూడా ఇప్పుడే తెలుసుకుంటారు, ఇంకెప్పుడూ తెలుసుకోరు.
తండ్రి ఇప్పుడే వారసత్వాన్ని ఇస్తారు, తర్వాత అర్ధకల్పము కోసం నిశ్చింతగా అయిపోతారు.
లౌకిక తండ్రి చింతలకు (ఆలోచనలకు) మరియు అనంతమైన తండ్రి చింతలకు ఎంత తేడా ఉంటుంది.
తండ్రి అంటారు - భక్తి మార్గములో నాకు ఎంత చింత ఉంటుంది. భక్తులు పదే-పదే ఎంతగా
గుర్తు చేసుకుంటారు. సత్యయుగములో ఎవరూ స్మృతి చేయరు. తండ్రి అంటారు - మీకు ఎంత
సుఖాన్ని ఇస్తానంటే, అక్కడ మీరు నన్ను స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు. ఆ సమయములో నా
పిల్లలు సుఖధామములో, శాంతిధామములో కూర్చున్నారని నాకు తెలుసు. ఇతర మనుష్యులెవరూ ఈ
విషయాలను అర్థం చేసుకోలేరు. ఇటువంటి తండ్రి పట్ల నిశ్చయబుద్ధి కలిగి ఉండటములో మాయ
విఘ్నాలను కలిగిస్తుంది. తండ్రి అంటారు - కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీలో
ఏదైతే మాలిన్యము చేరుకుందో, వెండి, రాగి, ఇనుము... అదంతా తొలగిపోతుంది. బంగారు యుగము
నుండి వెండి యుగానికి వచ్చినప్పుడు కూడా రెండు కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలను మీరు
వింటారు మరియు అర్థం చేసుకుంటారు. ఎవరైతే సత్యమైన బ్రాహ్మణులు ఉంటారో, వారికే మంచి
రీతిలో బుద్ధిలో కూర్చుంటాయి, లేకపోతే కూర్చోవు. స్మృతి నిలవదు. మొత్తమంతా తండ్రిని
స్మృతి చేయడముపైనే ఆధారపడి ఉంది. పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి అని పదే-పదే
చెప్తారు. శివబాబాను స్మృతి చేయండి అని ఈ బాబా కూడా చెప్తారు. తండ్రినైన నన్ను
స్మృతి చేయండి అని శివబాబా స్వయం కూడా అంటారు. ఓ పిల్లలూ, అని ఆత్మలను పిలుస్తారు.
ఆ నిరాకార పరమాత్మ కూడా ఆత్మలకే చెప్తారు. ముఖ్యమైన విషయము ఇదే. ఎవరు వచ్చినా సరే
వారికి మొట్టమొదట భగవంతుడిని స్మృతి చేయమని చెప్పండి, ఇంక దేని గురించి ఎక్కువగా
చెప్పాల్సిన అవసరము లేదు. కేవలం - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయమని
చెప్పండి. నేను ఒక ఆత్మను అని లోలోపల ఈ అభ్యాసమే చేస్తూ ఉండాలి. తులసీదాసు చందనము
అరగదీసి రఘువీరునికి తిలకము దిద్దారు... అని పాడుతారు కదా. తిలకమంటే స్థూలమైనదేమీ
కాదు. వాస్తవానికి తిలకమనేది ఈ సమయానికి చెందిన స్మృతిచిహ్నమని మీరు అర్థం
చేసుకున్నారు. మీరు స్మృతి చేస్తూ ఉంటారు అనగా రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. మీకు
రాజ్య తిలకము లభిస్తుంది, మీరు డబల్ కిరీటధారులుగా అవుతారు. రాజ్య తిలకము లభించడమనగా
స్వర్గానికి మహారాజా-మహారాణులుగా అవుతారు. తండ్రి ఎంత సహజముగా తెలియజేస్తారు. నేను
ఆత్మను, శరీరాన్ని కాదు, నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి - కేవలం ఇదే
గుర్తు చేయండి.
ఆత్మ అయిన మనము బిందువు వలె ఉన్నామని, బాబా కూడా బిందువని మీకు తెలుసు. బాబా జ్ఞాన
సాగరుడు, సుఖ సాగరుడు. వారు మనకు వరదానాలు ఇస్తారు. వీరి పక్కనే వచ్చి కూర్చుంటారు.
గురువు, తన శిష్యుడిని పక్కన కూర్చోబెట్టుకుని నేర్పిస్తారు. అలాగే వీరు కూడా పక్కనే
కూర్చున్నారు. పిల్లలకు కేవలం ఇదే చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించండి,
నన్నొక్కరినే స్మృతి చేయండి. సత్యయుగములో కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు
కానీ తండ్రి గురించి తెలియదు. ఆత్మనైన నేను శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి.
డ్రామానుసారముగా మీ పాత్రే ఆ విధముగా ఉంది, అందుకే అక్కడ మీ ఆయుష్షు ఎక్కువగా
ఉంటుంది, మీరు పవిత్రముగా ఉంటారు. సత్యయుగములో ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది, కలియుగములో
తగ్గిపోతుంది. అక్కడ ఉన్నది యోగులు, ఇక్కడ ఉన్నది భోగులు. యోగులు పవిత్రముగా ఉంటారు.
అక్కడ రావణ రాజ్యమే ఉండదు. ఆయుష్షు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆయుష్షు ఎంత తక్కువ
ఉంటుంది, దీనిని కర్మ భోగము అని అంటారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు సంభవించవు.
తండ్రి అంటారు - తండ్రిని గుర్తించారు కనుక శ్రీమతముపై నడవండి. ఒక్క తండ్రిని స్మృతి
చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనమిప్పుడు వెళ్ళాలి, ఈ శరీరాన్ని
విడిచిపెట్టాలి. మిగిలిన సమయాన్ని సేవలో వినియోగించాలి.
పిల్లలైన మీరు చాలా పేదవారు, అందుకే తండ్రికి దయ కలుగుతుంది. వృద్ధ మాతలు, కుబ్జలు
మొదలైనవారికి ఏ కష్టము ఇవ్వరు. వృద్ధ మాతలను కుబ్జలని అంటారు. తండ్రిని స్మృతి
చేయండి అని వృద్ధ మాతలకు అర్థం చేయించడము జరుగుతుంది. మీరు ఎక్కడకు వెళ్తున్నారు అని
మిమ్మల్ని ఎవరైనా అడిగితే - గీతా పాఠశాలకు వెళ్తున్నాము అని చెప్పండి.
పిల్లలు ప్రదర్శనీ మొదలైనవాటిపై ఎంత ఖర్చు చేస్తారు. ఫలానావారు బాగా
ప్రభావితులయ్యారని వ్రాస్తారు కూడా. కానీ బాబా అంటారు - తప్పకుండా ఈ సమయములో,
అనంతమైన తండ్రి ఈ బ్రహ్మా తనువులోకి వచ్చి ఉన్నారని, వారి నుండే స్వర్గ వారసత్వము
లభిస్తుందని వ్రాసేవారు ఒక్కరు కూడా లేరు. ఒక్కరికి కూడా నిశ్చయము ఏర్పడలేదని బాబాకు
అర్థమైపోతుంది. కేవలం - ఈ జ్ఞానము చాలా బాగుందని, మెట్ల వరుస చిత్రాన్ని కరక్టుగా
చూపించారని ప్రభావితులవుతారు, కానీ స్వయం యోగములో ఉంటూ తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అవ్వడమనేది చేయరు. పరమాత్మ నుండి వారసత్వాన్ని పొందే ఈ వివరణ చాలా
బాగుంది అని మాత్రం అంటారు. కానీ స్వయం వారసత్వాన్ని పొందాలి అనేది మాత్రం ఉండదు,
ఏమీ పురుషార్థము చేయరు. ప్రజలు ఎంతోమంది తయారవుతారు. ఇకపోతే రాజుగా అవ్వడమనేది
శ్రమతో కూడుకున్నది. ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎంతవరకు
తండ్రి స్మృతిలో హర్షితముగా ఉంటున్నాను? నేను మళ్ళీ దేవతగా అవుతాను... ఈ విధముగా
ఏకాంతములో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి, ప్రయత్నించి చూడండి. తండ్రిని స్మృతి
చేస్తూ ఉన్నట్లయితే తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు - మీరు అర్ధకల్పము కోసం ఎప్పుడూ
ఏడవనే ఏడవరు. ఇప్పుడు మీరంటారు - బాబా వచ్చి మాయ రావణుడిపై మాకు విజయాన్ని
ఇప్పిస్తున్నారు. ఎవరు ఎంత శ్రమించినా, అది స్వయం కోసమే చేసుకుంటారు. తర్వాత మీరు
కొత్త ప్రపంచములోకి వస్తారు. మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలంటే పాత
ప్రపంచము యొక్క లెక్కాచారాలను కూడా సమాప్తము చేసుకోవాలి. పావనముగా అయ్యే యుక్తులను
కూడా తెలియజేస్తారు. ఇది వినాశన సమయము, అందరి వినాశనము జరగనున్నది. కొత్త ప్రపంచ
స్థాపన జరగనున్నది. మనము ఈ మృత్యులోకములో ఈ శరీరాన్ని వదిలి, మళ్ళీ కొత్త ప్రపంచమైన
అమరలోకములోకి వెళ్తామని మీకు తెలుసు. మనము కొత్త ప్రపంచము కోసమే చదువుకుంటున్నాము.
భవిష్యత్తు కోసం చదివించే ఇటువంటి పాఠశాల ఇంకేదీ లేదు. ఎవరైతే చాలా దాన-పుణ్యాలు
చేస్తారో, వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ (నోటిలో
బంగారు చెంచా) అని అంటారు. మీకు అది సత్యయుగములో లభిస్తుంది. కలియుగములో కూడా ఎవరైతే
రాజుల వద్ద జన్మ తీసుకుంటారో, వారికి ఇది లభిస్తుంది. అయినా, ఇక్కడైతే అనేక రకాల
దుఃఖాలు ఉంటాయి. మీకైతే భవిష్య 21 జన్మల కోసం ఎటువంటి దుఃఖము ఉండదు. ఎప్పుడూ
అనారోగ్యంపాలు అవ్వరు. స్వర్గములో గోల్డెన్ స్పూన్ ఉంటుంది. ఇక్కడి రాజ్యము
అల్పకాలికమైనది. మీది 21 జన్మల కోసం ఉంటుంది. బుద్ధిని మంచి రీతిలో ఉపయోగించాలి,
తర్వాత అర్థం చేయించాలి. భక్తి మార్గములో రాజులుగా అవ్వలేరని కాదు. ఎవరైనా కాలేజ్
లేదా హాస్పిటల్ నిర్మించినట్లయితే వారికి కూడా ప్రతిఫలం లభిస్తుంది. హాస్పిటల్
నిర్మించినట్లయితే మరుసటి జన్మలో మంచి ఆరోగ్యము లభిస్తుంది. వీరికి జీవిత కాలములో
జ్వరము కూడా రాలేదు అని అంటారు కదా. దీర్ఘాయుష్షు ఉంటుంది. దానాలు మొదలైనవి చాలా
చేసినట్లయితే, హాస్పిటల్ మొదలైనవి నిర్మించినట్లయితే ఆయుష్షు పెరుగుతుంది. ఇక్కడైతే
యోగముతో మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. యోగముతో మీరు 21 జన్మల
కోసం ఆరోగ్యాన్ని పొందుతారు. ఇదైతే చాలా పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద కాలేజ్. తండ్రి
ప్రతి విషయాన్ని మంచి రీతిలో అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - ఎవరికి ఎక్కడ ఆనందము
కలిగితే, మనసుకు ఎక్కడ నచ్చితే, అక్కడకు వెళ్ళి చదువు చదువుకోవచ్చు. మా సెంటరుకు
రావాలి, వారి వద్దకు ఎందుకు వెళ్తున్నారు అని అనకూడదు. ఎవరికి ఎక్కడ నచ్చితే,
అక్కడకు వెళ్ళవచ్చు. విషయమైతే ఒక్కటే. మురళీ అయితే చదివి వినిపిస్తారు. ఆ మురళీ
ఇక్కడి నుండే వెళ్తుంది, అయితే కొంతమంది విస్తారముగా మంచిగా అర్థం చేయిస్తారు,
కొంతమంది కేవలం చదివి వినిపిస్తారు. భాషణ చేసేవారు మంచి సవాళ్ళను విసురుతూ ఉండవచ్చు.
ఎక్కడ భాషణ చేసినా సరే మొట్టమొదట ఇదే చెప్పండి - శివబాబా చెప్తున్నారు, స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి
మరియు పావనముగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎంత సహజముగా అర్థం
చేయిస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బయటి వ్యర్థమైన ఆలోచనలను వదిలి, ఏకాంతములో కూర్చుని స్మృతి విషయములో
శ్రమించాలి. ఉదయాన్నే లేచి విచార సాగర మంథనము చేయాలి మరియు తమ చార్టును చూసుకోవాలి.
2. ఎలాగైతే భక్తిలో దాన-పుణ్యాలకు మహత్వముందో, అలా జ్ఞాన మార్గములో స్మృతికి
మహత్వముంది. స్మృతితో ఆత్మను సదా ఆరోగ్యవంతముగా, ఐశ్వర్యవంతముగా చేసుకోవాలి.
అశరీరిగా ఉండే అభ్యాసము చేయాలి.
వరదానము:-
కంబైండ్ రూపము యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధములోకి
తీసుకువచ్చే కంబైండ్ రూపధారీ భవ
కేవలం శబ్దం ద్వారా సేవ చేయడముతో ప్రజలు తయారవుతున్నారు.
కానీ శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితులై శబ్దములోకి రండి. అవ్యక్త స్థితి మరియు
శబ్దం - ఈ కంబైండ్ రూపములోని సేవ వారసులను తయారుచేస్తుంది. శబ్దం ద్వారా
ప్రభావితులయ్యే ఆత్మలు అనేక శబ్దాలను విని రావడం-వెళ్ళడం చేస్తారు. కానీ, కంబైండ్
రూపధారులుగా అయి ఈ కంబైండ్ రూపపు సేవ చేసినట్లయితే ఆ ఆత్మలపై ఏ రూపము యొక్క ప్రభావము
పడదు.
స్లోగన్:-
సాధనాల వెనుక
అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధనను మర్జ్ అవ్వనివ్వకండి.
అవ్యక్త ప్రేరణలు -
సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి
సహనశీలత కల
పిల్లలెవరైతే ఉన్నారో, వారు తమ సహనశీలతా శక్తితో ఎటువంటి కఠోర సంస్కారాలు కలవారినైనా,
ఎటువంటి కఠిన కార్యాలనైనా శీతలముగా చేసేస్తారు మరియు సహజము చేసేస్తారు. సహనశీలతా
గుణము కలవారు గంభీరముగా ఉంటారు మరియు లోతులలోకి వెళ్తారు. వారు ఎప్పుడూ గాభరాపడరు,
లోతులలోకి వెళ్ళి సఫలతను ప్రాప్తి చేసుకుంటారు.