25-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ డ్రామా ఆట ఏక్యురేట్ గా నడుస్తుంది,
ఏ సమయంలో ఎవరి పాత్ర ఎలా ఉండాలో అదే రిపీట్ అవుతుంది, ఈ విషయాన్ని యథార్థ రీతిలో
అర్థము చేసుకోవాలి’’
ప్రశ్న:-
పిల్లలైన మీ ప్రభావము ఎప్పుడు వెలువడుతుంది? ఇప్పటి వరకు ఏ శక్తి యొక్క లోపముంది?
జవాబు:-
ఎప్పుడైతే
యోగంలో దృఢంగా అవుతారో, అప్పుడు ప్రభావము వెలువడుతుంది. ఇప్పుడు ఆ పదును, ఆ శక్తి
లేదు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. జ్ఞాన ఖడ్గములో స్మృతి అనే పదును కావాలి,
అది ఇప్పటికీ తక్కువగా ఉంది. ఒకవేళ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి
చేస్తూ ఉన్నట్లయితే నావ తీరానికి చేరుకుంటుంది. ఇది సెకెండు యొక్క విషయమే.
ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి అని
ఒక్కరినే అంటారు. మిగిలినవారంతా ఆత్మలే. వారిని పరమ ఆత్మ అని అంటారు. తండ్రి అంటారు
- నేను కూడా ఆత్మనే కానీ నేను పరమ ఆత్మను, సుప్రీమ్ ఆత్మను, సత్యమును. నేనే
పతిత-పావనుడను, జ్ఞానసాగరుడను. తండ్రి అంటారు, పిల్లలను విశ్వానికి యజమానులుగా
తయారుచేసేందుకు నేను భారత్ లోనే వస్తాను. మీరే యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడు
స్మృతి కలిగింది. పిల్లలకు ఏమని స్మృతిని కలిగిస్తారంటే - మీరు మొట్టమొదట
సత్యయుగంలోకి వచ్చారు, తర్వాత పాత్రను అభినయిస్తూ, 84 జన్మలు అనుభవించి ఇప్పుడు
చివరిలోకి వచ్చారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ.
ఆత్మయే దేహము ద్వారా ఆత్మలతో మాట్లాడుతుంది. ఆత్మాభిమానులుగా అయి ఉండకపోతే తప్పకుండా
దేహాభిమానం ఉన్నట్లు. నేను ఆత్మను అనేది అందరూ మర్చిపోయారు. పాపాత్మ, పుణ్యాత్మ,
మహాన్ ఆత్మ అని కూడా అంటారు. వారు పరమాత్మగా అయితే అవ్వలేరు. ఎవ్వరూ కూడా తమను తాము
శివ అని చెప్పుకోలేరు. చాలామంది శరీరాలకు శివ అన్న పేరు ఉంది. ఆత్మ శరీరములోకి
ప్రవేశించినప్పుడు పేరు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే శరీరముతోనే పాత్రను
అభినయించాల్సి ఉంటుంది. అప్పుడు మనుష్యులు, నేను ఫలానా అన్న శరీర భానములోకి
వచ్చేస్తారు. కానీ ఇప్పుడు - అవును, నేను ఆత్మను, నేను 84 జన్మల పాత్రను అభినయించాను
అని అర్థము చేసుకుంటారు. ఇప్పుడు నేను ఆత్మ గురించి తెలుసుకున్నాను. ఆత్మనైన నేను
సతోప్రధానంగా ఉండేవాడిని, ఇప్పుడు మళ్ళీ తమోప్రధానంగా అయ్యాను. ఎప్పుడైతే
ఆత్మలన్నిటికీ తుప్పు పడుతుందో, అప్పుడే తండ్రి వస్తారు. ఉదాహరణకు బంగారంలో మాలిన్యం
చేరుకుంటుంది కదా. మీరు మొదట సత్యమైన బంగారంగా ఉండేవారు, తర్వాత వెండి, రాగి, ఇనుము
చేరి మీరు పూర్తిగా నల్లగా అయిపోయారు. ఈ విషయము ఇతరులెవ్వరూ అర్థము చేయించలేరు.
అందరూ ఆత్మ నిర్లేపి అనే అంటారు. మాలిన్యం ఎలా చేరుతుంది అనేది కూడా తండ్రి పిల్లలకు
అర్థము చేయించారు. తండ్రి అంటారు - నేను భారత్ లోనే వస్తాను. ఎప్పుడైతే పూర్తిగా
తమోప్రధానంగా అవుతారో, అప్పుడు వస్తాను. ఖచ్చితమైన సమయానికి వస్తారు. ఏ విధంగా
డ్రామా ఆట ఖచ్చితంగా నడుస్తుంది కదా. ఏ పాత్ర ఏ సమయానికి జరిగేది ఉందో, ఆ సమయంలో అది
మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇందులో ఏ మాత్రము తేడా ఉండదు. అది హద్దు యొక్క డ్రామా, ఇది
అనంతమైన డ్రామా. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. మీరు ఏ
పాత్రనైతే అభినయించారో, అది డ్రామానుసారంగా జరిగింది అని తండ్రి అంటారు.
మనుష్యమాత్రులెవ్వరికీ రచయిత గురించి కానీ, రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి కానీ
తెలియదు. ఋషులు-మునులు కూడా మాకు తెలియదు-తెలియదు అని అంటూ వచ్చారు. ఇప్పుడు ఎవరైనా
మిమ్మల్ని, రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలుసా అని అడిగితే, మీరు వెంటనే,
అవును అని చెప్తారు. ఇది కూడా మీరు కేవలం ఇప్పుడు మాత్రమే తెలుసుకోగలరు, ఇంకెప్పుడూ
తెలుసుకోలేరు. బాబా అర్థం చేయించారు - మీరే రచయిత అయిన నా గురించి మరియు రచన యొక్క
ఆదిమధ్యాంతాల గురించి తెలుసుకున్నారు. అచ్ఛా, ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడు
ఉంటుంది, ఈ విషయం వీరికి తెలిసి ఉంటుందా? లేదు, వీరిలో ఏ జ్ఞానము లేదు. ఇది
విచిత్రము. మాలో జ్ఞానముంది అని మీరంటారు, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు.
తండ్రి పాత్ర ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అవ్వడమే మీ
లక్ష్యము-ఉద్దేశ్యము. అలా అయిన తర్వాత ఇక చదువు యొక్క అవసరము ఉండదు. బ్యారిస్టరుగా
తయారయ్యారంటే ఇక తయారైనట్లే. చదివించే తండ్రిని స్మృతి చేయాలి కదా. మీకు అన్నీ సహజం
చేసేసారు. బాబా మీకు పదే-పదే చెప్తున్నారు - మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను
బాబాకు చెందినవాడిని. ఇంతకుముందు మీరు నాస్తికులుగా ఉండేవారు, ఇప్పుడు ఆస్తికులుగా
అయ్యారు. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా ఆస్తికులుగా అయ్యే ఈ వారసత్వాన్ని తీసుకున్నారు,
దానినే ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అవుతున్నారు.
ఆస్తికులు-నాస్తికులు అనే పదాలు ఈ సమయానికి చెందినవి. అక్కడ ఈ పదాలే ఉండవు. ఇలా
అడిగే విషయమే ఉండదు. ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, అందుకే - రచయిత మరియు రచనల
గురించి తెలుసా అని అడుగుతారు. అప్పుడు, వారు తెలియదు అని అంటారు. తండ్రియే వచ్చి
తమ పరిచయాన్ని ఇస్తారు మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు.
తండ్రి అనంతమైన యజమాని, రచయిత. ఇతర ధర్మ స్థాపకులు కూడా ఇక్కడకు తప్పకుండా వస్తారు
అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇబ్రహీమ్, క్రైస్టు మొదలైనవారు ఎలా వస్తారు
అనేది మీకు సాక్షాత్కారము చేయించారు. చివరిలో ఎప్పుడైతే శబ్దం బాగా వ్యాపిస్తుందో,
అప్పుడు వారు వస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, దేహ సహితంగా దేహ ధర్మాలన్నింటినీ
త్యాగము చేసి నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు మీరు సమ్ముఖంలో కూర్చున్నారు. స్వయాన్ని
దేహంగా భావించకూడదు, నేను ఒక ఆత్మను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి
చేస్తూ ఉన్నట్లయితే నావ తీరానికి చేరుకుంటుంది. ఇది సెకండు యొక్క విషయము. ముక్తిలోకి
వెళ్ళేందుకే అర్ధకల్పము భక్తి చేస్తారు. కానీ ఏ ఆత్మ కూడా తిరిగి వెళ్ళలేదు.
5 వేల సంవత్సరాల క్రితము కూడా తండ్రి ఈ విషయాలను అర్థం చేయించారు, ఇప్పుడు కూడా
అర్థం చేయిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఈ విషయాలను అర్థం చేయించలేరు. వారిని తండ్రి అని
కూడా అనరు. లౌకిక, అలౌకిక మరియు పారలౌకిక తండ్రులు ఉన్నారు. లౌకిక తండ్రి హద్దులోని
తండ్రి, అనంతమైన తండ్రి పారలౌకిక తండ్రి, వారు ఆత్మలందరికీ తండ్రి. మరియు వీరు
సంగమయుగములోని అద్భుతమైన తండ్రి, వీరిని అలౌకిక తండ్రి అని అంటారు. ప్రజాపిత
బ్రహ్మాను అసలు ఎవరూ స్మృతి చేయరు. వారు మన గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నది
బుద్ధిలోకి రాదు. వారిని ఆదిదేవ్, ఆడమ్... అని కూడా అంటారు. కానీ నామమాత్రంగా అంటారు.
మందిరాల్లో కూడా ఆదిదేవ్ చిత్రముంది కదా. మీరు అక్కడకు వెళ్తే, ఇది మా స్మృతిచిహ్నము
అని భావిస్తారు. బాబా కూడా కూర్చుని ఉన్నారు, మనము కూడా కూర్చుని ఉన్నాము. ఇక్కడ
తండ్రి చైతన్యంలో కూర్చుని ఉన్నారు, అక్కడ జడ చిత్రాలు ఉన్నాయి. పైన స్వర్గము కూడా
బాగానే ఉంది, ఎవరైతే మందిరాన్ని చూసారో, వారికి తెలుసు - ఇప్పుడు బాబా మాకు
చైతన్యములో రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని. తర్వాత మందిరాన్ని నిర్మిస్తారు.
ఇవన్నీ మా స్మృతిచిహ్నాలు అని స్మృతిలోకి రావాలి. ఈ విధంగా లక్ష్మీ-నారాయణులుగా
ఇప్పుడు మనము తయారవుతున్నాము. ఒకప్పుడు అలా ఉండేవారము, తర్వాత మెట్లు దిగుతూ వచ్చాము,
ఇప్పుడు మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి రామరాజ్యములోకి వస్తాము. ఆ తర్వాత రావణ రాజ్యము
వస్తుంది, అప్పుడు మనము వామ మార్గములోకి వెళ్ళిపోతాము. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం
చేయిస్తున్నారు, ఈ సమయంలో మనుష్యమాత్రులందరూ పతితులుగా ఉన్నారు, అందుకే ఏమని
పిలుస్తారంటే - ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. దుఃఖాన్ని హరించి
సుఖపు మార్గాన్ని తెలియజేయండి అని. భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపములో వస్తారని కూడా
అంటారు. ఇప్పుడు కుక్క-పిల్లి, రాయి-రప్పలు మొదలైన వాటిలోనైతే రారు. భాగ్యశాలీ
రథములో వస్తారని అంటూ ఉంటారు. తండ్రి స్వయంగా అంటారు - నేను ఈ సాధారణ రథంలోకి
ప్రవేశిస్తాను. వీరికి వీరి జన్మల గురించి తెలియదు, మీకిప్పుడు తెలుసు. వీరి అనేక
జన్మల అంతిమంలో వానప్రస్థావస్థకు చేరుకున్నప్పుడు నేను ప్రవేశిస్తాను. భక్తి
మార్గములో పాండవుల చిత్రాలను చాలా పెద్ద-పెద్దవిగా తయారుచేశారు, రంగూన్ లో
బుద్ధునిది కూడా చాలా పెద్ద చిత్రము ఉంది. ఏ మనిషీ ఇంత పెద్దగా ఉండరు. రావణుడి
చిత్రాన్ని ఎలా తయారుచేసారు అని పిల్లలకైతే ఇప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది.
రోజు-రోజుకూ పెద్దదిగా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము కాలుస్తారు, అసలు ఇతను ఎవరు.
ఇటువంటి శత్రువు ఎవరైనా ఉంటారా! శత్రువు చిత్రాన్నే తయారుచేసి కాలుస్తారు. అచ్ఛా,
రావణుడు ఎవరు, ప్రతి సంవత్సరము కాలుస్తూ వచ్చే విధంగా మీ శత్రువుగా ఎప్పుడయ్యాడు? ఈ
శత్రువు గురించి ఎవరికీ తెలియదు. దీని అర్థము ఎవరికీ ఏ మాత్రమూ తెలియదు. వారు రావణ
సంప్రదాయము వారు, మీరు రాముని సంప్రదాయము వారు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు
తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వండి మరియు నన్ను
స్మృతి చేస్తూ ఉండండి. బాబా, హంస మరియు కొంగ ఎలా కలిసి ఉండగలవు, ఘర్షణ జరుగుతూ
ఉంటుంది అని అంటారు. అదైతే తప్పకుండా జరుగుతుంది, సహనం చేయవలసి ఉంటుంది. అందుకు చాలా
యుక్తులు కూడా ఉన్నాయి. బాబాను, అన్ని రహస్యాలు తెలిసినవారు అని కూడా అంటారు. అందరూ
వారిని స్మృతి చేస్తుంటారు కదా - ఓ భగవంతుడా, దుఃఖాన్ని హరించండి, దయ చూపించండి,
విముక్తులుగా చేయండి అని. ఆ ముక్తిప్రదాత అయిన తండ్రి అందరికీ ఒక్కరే. మీ వద్దకు
ఎవరైనా వస్తే, వారికి వేర్వేరుగా అర్థం చేయించండి, కరాచీలో ఒక్కొక్కరికీ వేర్వేరుగా
కూర్చొని అర్థము చేయించేవారు.
పిల్లలైన మీరు ఎప్పుడైతే యోగములో దృఢంగా అవుతారో, అప్పుడు మీ ప్రభావము
వెలువడుతుంది. ఇప్పుడింకా ఆ పదును, శక్తి లేదు. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది.
చదువు ద్వారా శక్తి లభించదు. జ్ఞానం ఖడ్గము, అందులో స్మృతి అనే పదును నింపాలి. ఆ
శక్తి తక్కువగా ఉంది. తండ్రి ప్రతి రోజూ చెప్తూ ఉంటారు - పిల్లలూ, స్మృతి యాత్రలో
ఉన్నట్లయితే మీకు శక్తి లభిస్తుంది. చదువులో అంతటి శక్తి ఉండదు. స్మృతి ద్వారా మీరు
విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు. మీరు మీ కోసమే అంతా చేస్తారు. చాలా మంది వచ్చారు,
మళ్ళీ వెళ్ళిపోయారు. మాయ కూడా శక్తివంతమైనది. చాలా మంది రారు. జ్ఞానమైతే చాలా
బాగుంది, సంతోషము కూడా కలుగుతుంది అని అంటారు, కానీ బయటకు వెళ్ళగానే సమాప్తము.
కొంచెము కూడా నిలవనివ్వదు. కొంతమందికైతే చాలా సంతోషం కలుగుతుంది. ఓహో! ఇప్పుడు బాబా
వచ్చారు, ఇక మనము మన సుఖధామానికి వెళ్తాము. తండ్రి అంటారు - ఇప్పుడింకా పూర్తి
రాజధాని ఎక్కడ స్థాపనయ్యింది. ఈ సమయంలో మీరు ఈశ్వరీయ సంతానము, తర్వాత దేవతలుగా
అవుతారు. డిగ్రీ తగ్గిపోయింది కదా. మీటరులో పాయింట్లు ఉంటాయి, ఇన్ని పాయింట్లు
తగ్గిపోయాయి అని తెలుపుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారిగా ఉన్నతంగా అవుతారు, తర్వాత
డిగ్రీ తగ్గిపోతూ-తగ్గిపోతూ క్రిందకు వచ్చేస్తారు. మెట్లు కిందకు దిగాల్సిందే.
ఇప్పుడు మీ బుద్ధిలో మెట్ల వరుస యొక్క జ్ఞానముంది. మీ ఎక్కే కళతో సర్వులకు మేలు
జరుగుతుంది. తర్వాత నెమ్మది-నెమ్మదిగా దిగే కళలోకి వస్తారు. ప్రారంభము నుండి
మొదలుకొని ఈ చక్రాన్ని బాగా అర్థము చేసుకోవాలి. ఈ సమయంలో మీది ఎక్కే కళ ఉంటుంది
ఎందుకంటే తండ్రి తోడుగా ఉన్నారు కదా. ఏ ఈశ్వరుడినైతే మనుష్యులు సర్వవ్యాపి అని
అంటారో, ఆ బాబా మిమ్మల్ని - మధురాతి-మధురమైన పిల్లలూ అని అంటూ ఉంటారు మరియు పిల్లలు
- బాబా-బాబా అని అంటూ ఉంటారు. బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు, ఆత్మ
చదువుకుంటుంది. ఆత్మయే కర్మలు చేస్తుంది. ఆత్మనైన నేను శాంత స్వరూపాన్ని. ఈ శరీరము
ద్వారా కర్మలు చేస్తున్నాను. ఎప్పుడైతే దుఃఖము కలుగుతుందో, అప్పుడే అశాంతి అన్న
పదాన్ని ఉపయోగిస్తారు. ఇకపోతే, శాంతి అనేది మన స్వధర్మము. మనసుకు శాంతి కావాలని
చాలామంది అంటారు. అరే, ఆత్మ అయితే స్వయంగా శాంతి స్వరూపము, ఆత్మ ఇల్లే శాంతిధామము.
మీరు స్వయాన్ని మర్చిపోయారు. మీరైతే శాంతిధామంలో నివసించేవారు, శాంతి అక్కడే
లభిస్తుంది. ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాష ఉండాలని ఈ రోజుల్లో అంటూ ఉంటారు. ఒకే
కులము, ఒకే ధర్మము, ఒకే భగవంతుడు అని అంటారు. భగవంతుడు ఒక్కరే అని ఇప్పుడు
గవర్నమెంట్ రాస్తుంది కూడా, మరి సర్వవ్యాపి అని ఎందుకంటారు? భగవంతుడు ఒక్కరే అన్నది
ఎవరూ అంగీకరించడమే లేదు. కావున ఇప్పుడు మీరు అది మళ్ళీ రాయాలి. లక్ష్మీ-నారాయణుల
చిత్రాన్ని తయారుచేస్తారు, దాని పైన ఈ విధంగా వ్రాయండి - సత్యయుగములో వీరి
రాజ్యమున్నప్పుడు ఒకే భగవంతుడు, ఒకే దేవతా ధర్మముండేది. కానీ మనుష్యులు ఏమీ అర్థము
చేసుకోరు, అటెన్షన్ పెట్టరు. మన బ్రాహ్మణ కులానికి చెందినవారికి మాత్రమే అటెన్షన్
వెళ్తుంది. ఇంకెవరూ అర్థం చేసుకోరు. అందుకే బాబా అంటారు - వేర్వేరుగా కూర్చోబెట్టి,
అప్పుడు అర్థం చేయించండి. ఫారం నింపిస్తే తెలుస్తుంది, ఎందుకంటే ఒకరు ఒకరిని
నమ్ముతారు, ఇంకొకరు ఇంకొకరిని నమ్ముతారు. అందరికీ కలిపి ఎలా అర్థం చేయిస్తారు.
తమ-తమ విషయాలను వినిపించడం మొదలుపెడతారు. మొట్టమొదట ఇలా అడగాలి - మీరు ఎక్కడికి
వచ్చారు? బ్రహ్మాకుమారీలు అన్న పేరు విన్నారా? ప్రజాపిత బ్రహ్మా మీకు ఏమవుతారు?
ఎప్పుడైనా ఆ పేరు విన్నారా? మీరు ప్రజాపిత బ్రహ్మాకు సంతానము కాదు, మేము ప్రాక్టికల్
గా వారి సంతానము. వాస్తవానికి మీరు కూడా వారి సంతానమే, కానీ అలా భావించటం లేదు.
అర్థం చేయించేందుకు మంచి యుక్తి కావాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మందిరాలు మొదలైనవాటిని చూసినప్పుడు సదా ఈ స్మృతి ఉండాలి - ఇవన్నీ మా
స్మృతిచిహ్నాలే, ఇప్పుడు మేము ఈ విధముగా లక్ష్మీ-నారాయణుల వలె తయారవుతున్నాము అని.
2. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండాలి. హంస మరియు కొంగ కలిసి
ఉంటున్నప్పుడు చాలా యుక్తిగా నడుచుకోవాలి. సహనం కూడా చేయాలి.
వరదానము:-
ఏకత మరియు సంతుష్టత యొక్క సర్టిఫికెట్ ద్వారా సేవలలో సదా
సఫలతామూర్త భవ
సేవలలో సఫలతా మూర్తులుగా అయ్యేందుకు రెండు విషయాలను
ధ్యానంలో ఉంచుకోవాలి, ఒకటి - సంస్కారాలను కలుపుకునే ఐక్యత మరియు రెండవది - స్వయము
కూడా సదా సంతుష్టంగా ఉండండి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచండి. సదా పరస్పరం స్నేహ
భావనతో, శ్రేష్ఠతా భావనతో సంపర్కంలోకి రండి, అప్పుడు ఈ రెండు సర్టిఫికెట్లు
లభిస్తాయి. అప్పుడిక మీ ప్రాక్టికల్ జీవితము బాబా ముఖాన్ని చూపించే దర్పణంగా
అవుతుంది మరియు ఆ దర్పణంలో బాబా ఎవరో, ఎలా ఉన్నారో అలాగే కనిపిస్తారు.
స్లోగన్:-
ఆత్మ
స్థితిలో స్థితులై అనేక ఆత్మలకు ప్రాణదానాన్ని ఇవ్వండి, అప్పుడు ఆశీర్వాదాలు
లభిస్తాయి.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి
ఏ విధంగా అగ్నిలో
ఏదైనా వస్తువును వేసినప్పుడు దాని నామము, రూపము, గుణము అన్నీ మారిపోతాయో, అదే
విధంగా ఎప్పుడైతే బాబా స్మృతి యొక్క లగనము అనే అగ్నిలో ఉంటారో అప్పుడు పరివర్తన
అయిపోతారు, మనుష్యుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు, ఆ తర్వాత బ్రాహ్మణుల నుండి
ఫరిశ్తాలుగా, ఆ తర్వాత దేవతలుగా అవుతారు. లగనము యొక్క అగ్నితో ఎటువంటి పరివర్తన
జరుగుతుందంటే, ఇక నాది అనేది ఏమీ ఉండదు, అందుకే స్మృతినే జ్వాలా రూపము అని అన్నారు.
| | |