25-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తత్వాల సహితముగా మనుష్యమాత్రులందరినీ
మార్చే యూనివర్సిటీ కేవలం ఒక్కటే ఉంది, ఇక్కడి నుండే అందరి సద్గతి జరుగుతుంది’’
ప్రశ్న:-
తండ్రి పట్ల
నిశ్చయము ఏర్పడుతూనే ఏ సలహాను వెంటనే అమలులోకి తీసుకురావాలి?
జవాబు:-
1. తండ్రి
వచ్చారని నిశ్చయము ఏర్పడినప్పుడు తండ్రి యొక్క మొట్టమొదటి సలహా ఏమిటంటే - ఈ కళ్ళ
ద్వారా ఏదైతే చూస్తారో, అదంతా మర్చిపోండి. ఒక్క నా మతముపైనే నడవండి. ఈ సలహాను వెంటనే
అమలులోకి తీసుకురావాలి. 2. మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారంటే, పతితులతో
మీకు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండకూడదు. నిశ్చయబుద్ధి కల పిల్లలకు ఎప్పుడూ ఏ విషయములోనూ
సంశయము రాదు.
ఓంశాంతి
ఇది ఇల్లు కూడా మరియు యూనివర్సిటీ కూడా. దీనినే గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ అని
అంటారు ఎందుకంటే ప్రపంచములోని మనుష్యమాత్రులందరి సద్గతి జరుగుతుంది. రియల్ వరల్డ్
యూనివర్సిటీ ఇదే. ఇది ఇల్లు కూడా. ఇక్కడ మీరు మాతా-పితల ఎదురుగా కూర్చున్నారు,
అంతేకాక ఇది యూనివర్సిటీ కూడా. స్పిరిచ్యుల్ ఫాదర్ కూర్చుని ఉన్నారు. ఈ ఆత్మిక
నాలెడ్జ్ ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ను స్పిరిచ్యుల్
ఫాదర్ తప్ప ఇతర మనుష్యులెవరూ ఇవ్వలేరు. వారినే జ్ఞానసాగరుడు అని అంటారు మరియు
జ్ఞానముతోనే సద్గతి జరుగుతుంది, అందుకే జ్ఞానసాగరుడు, సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి
మాత్రమే. తండ్రి ద్వారా ప్రపంచములోని మనుష్యులు మాత్రమే కాదు, ప్రతి వస్తువు మరియు
పంచ తత్వాలు కూడా సతోప్రధానముగా అవుతాయి. సర్వుల సద్గతి జరుగుతుంది. ఇవి బాగా అర్థం
చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు అందరి సద్గతి జరగనున్నది. పాత ప్రపంచము మరియు
ప్రపంచములో నివసించేవారంతా మారిపోతారు. ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో, ఇవన్నీ మారి
కొత్తగా అవ్వనున్నాయి. ఇక్కడ అసత్యపు మాయ, అసత్యపు శరీరము ఉన్నాయి... అని అంటూ
ఉంటారు, ఇది అసత్య ఖండముగా తయారవుతుంది. భారత్ సత్యఖండముగా ఉండేది, ఇప్పుడు అసత్య
ఖండముగా ఉంది. రచయిత మరియు రచనల గురించి మనుష్యులు చెప్పేదంతా అసత్యము. ఇప్పుడు మీరు
తండ్రి ద్వారా తెలుసుకుంటారు - ఇది భగవానువాచ. ఆ తండ్రి ఒక్కరే భగవంతుడు కదా. వారు
నిరాకారుడు, వాస్తవానికైతే ఆత్మలన్నీ నిరాకారియే, తర్వాత ఇక్కడకు వచ్చి సాకార
రూపాన్ని తీసుకుంటాయి. అక్కడ ఆకారము ఉండదు. ఆత్మలు మూలవతనములో లేక బ్రహ్మ
మహాతత్వములో నివసిస్తాయి. అది ఆత్మలైన మన ఇల్లు, బ్రహ్మ మహాతత్వము. ఇది ఆకాశ తత్వము,
ఇక్కడ సాకార పాత్ర నడుస్తుంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి. దీని అర్థం
తెలియదు కానీ రిపీట్ అవుతుంది అని కేవలం అంటూ ఉంటారు. బంగారు యుగము, వెండి యుగము...
ఈ యుగాలన్నీ గడిచిన తర్వాత ఏమవుతుంది? తప్పకుండా మళ్ళీ బంగారు యుగము వస్తుంది.
సంగమయుగము ఒక్కటే ఉంటుంది. సత్య-త్రేతాయుగాలకు మరియు త్రేతా-ద్వాపరయుగాలకు
మధ్యనున్న సంగమాలను సంగమము అని అనరు. అది రాంగ్ అవుతుంది. తండ్రి అంటారు, నేను
కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగంలో వస్తాను. ఎప్పుడైతే పతితముగా అవుతారో, అప్పుడే
నన్ను పిలుస్తారు. మీరు పావనముగా చేయడానికి రండి అని అంటారు. సత్యయుగములోనే పావనముగా
ఉంటారు. ఇప్పుడిది సంగమము. దీనిని కళ్యాణకారీ సంగమయుగమని అంటారు. ఇది ఆత్మ మరియు
పరమాత్మల మిలనము యొక్క సంగమము, దీనిని కుంభము అని కూడా అంటారు. వారేమో నదుల మేళాను
చూపిస్తారు. రెండు నదులైతే ఉంటాయి, మూడవదానిని గుప్త నది అని అంటారు. ఇది కూడా
అసత్యమే. గుప్త నది అనేది ఏమైనా ఉంటుందా? గుప్త నది ఉంటుంది అనే మాటను సైన్సు వారు
కూడా ఒప్పుకోరు. బాణము వేయగానే గంగ వెలువడిందని చెప్తారు, ఇదంతా అసత్యము. జ్ఞానము,
భక్తి, వైరాగ్యము అని అంటూ ఉంటారు. ఈ పదాలను పట్టుకున్నారు కానీ వీటి అర్థం తెలియదు.
మొట్టమొదట జ్ఞానము అనగా పగలు, సుఖము, తర్వాత భక్తి అనగా రాత్రి, దుఃఖము. బ్రహ్మా
యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి అని అంటారు. ఇప్పుడు బ్రహ్మా ఒక్కరే ఉండరు కదా,
చాలామంది ఉంటారు కదా. పగలు అర్ధకల్పము ఉంటుంది, తర్వాత రాత్రి కూడా అర్ధకల్పము
ఉంటుంది. ఆ తర్వాత మొత్తం పాత ప్రపంచము పట్ల వైరాగ్యము కలుగుతుంది.
తండ్రి అంటారు - దేహ సహితముగా మీరు ఈ కనులతో చూసేదంతా జ్ఞానము ఆధారముగా మర్చిపోవాలి.
వ్యాపార-వ్యవహారాలు మొదలైనవన్నీ చేసుకోవాలి, పిల్లలను కూడా సంభాళించాలి కానీ బుద్ధి
యోగము ఒక్కరితోనే జోడించాలి. అర్ధకల్పము మీరు రావణుడి మతాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు
తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున ఏం చేసినా సరే, తండ్రి సలహా అనుసారముగా చేయండి.
ఇంతకాలం మీ ఇచ్చి-పుచ్చుకోవడాలు పతితులతోనే జరుగుతూ వచ్చాయి, దాని ప్రతిఫలం ఏమైంది.
రోజురోజుకు పతితులుగానే అవుతూ వచ్చారు ఎందుకంటే భక్తి మార్గమంటేనే దిగే కళ యొక్క
మార్గము. సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి రావాల్సి ఉంటుంది. తప్పకుండా
దిగాల్సిందే. దీని నుండి ఎవరూ విడిపించలేరు. లక్ష్మీ-నారాయణులకు కూడా 84 జన్మలను
చూపించారు కదా. ఇంగ్లీషు పదాలు చాలా బాగున్నాయి. గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్...
అలా-అలా మాలిన్యము చేరుకుంటూ ఉంటుంది. అలా ఈ సమయములో ఇనుప యుగము వారిగా అయ్యారు.
బంగారు యుగములో కొత్త ప్రపంచముండేది, కొత్త భారత్ ఉండేది. ఈ లక్ష్మీ-నారాయణుల
రాజ్యముండేది. ఇది నిన్నటి విషయమే. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని వ్రాసేసారు.
ఇప్పుడు తండ్రి అంటారు - మీ శాస్త్రాలు రైటా లేక నేను రైటా? తండ్రిని వరల్డ్ ఆల్మైటీ
అథారిటీ (సర్వశక్తివంతుడు) అని అంటారు. ఎవరైతే చాలా వేద-శాస్త్రాలను చదువుతారో,
వారిని అథారిటీ అని అంటారు. తండ్రి అంటారు - వారంతా భక్తి మార్గపు అథారిటీ. జ్ఞానము
విషయములో నన్ను - మీరు జ్ఞాన సాగరుడు, మేము కాదు అని మహిమ చేస్తారు. మనుష్యులంతా
భక్తి సాగరములో మునిగిపోయి ఉన్నారు. సత్యయుగములో ఎవరూ వికారాల్లోకి వెళ్ళరు.
కలియుగములోనైతే మనుష్యులు ఆదిమధ్యాంతాలు దుఃఖపడుతూనే ఉంటారు. తండ్రి కల్పక్రితం కూడా
ఇలా అర్థం చేయించారు, ఇప్పుడు మళ్ళీ అర్థం చేయిస్తున్నారు. కల్పక్రితం కూడా అనంతమైన
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ చదువుకుని పొందుతున్నామని
పిల్లలు అర్థం చేసుకుంటారు. సమయము చాలా తక్కువగా ఉంది. ఈ ప్రపంచము వినాశనమైపోతుంది,
అందుకే అనంతమైన తండ్రి నుండి పూర్తి వారసత్వము తీసుకోవాలి. వారు తండ్రి, టీచరు మరియు
గురువు కూడా. సుప్రీమ్ ఫాదర్ మరియు సుప్రీమ్ టీచరు కూడా. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు
ఎలా రిపీట్ అవుతాయి అనే జ్ఞానమంతా తెలియజేస్తారు. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం
చేయించలేరు. వీరు 5 వేల సంవత్సరాల క్రితం వలె వచ్చిన అదే గీతా భగవానుడని,
శ్రీకృష్ణుడు గీతా భగవానుడు కాదని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. మనుష్యులను
భగవంతుడని అనరు. భగవంతుడు పునర్జన్మ రహితుడు. వీరిది దివ్య జన్మ అని అంటారు. లేదంటే,
నిరాకారుడినైన నేను ఎలా మాట్లాడాలి. నేను తప్పకుండా వచ్చి పావనముగా తయారుచేయాలి
అన్నప్పుడు యుక్తులను చెప్పాల్సి ఉంటుంది. ఆత్మలమైన మనము అమరులమని మీకు తెలుసు.
రావణ రాజ్యములో మీరందరూ దేహాభిమానులుగా అయిపోయారు. సత్యయుగములో దేహీ-అభిమానులుగా
ఉంటారు. ఇకపోతే, రచయిత అయిన పరమాత్ముని గురించి మరియు వారి రచన గురించి అక్కడ
సత్యయుగములో కూడా ఎవరికీ తెలియదు. ఒకవేళ అక్కడ కూడా, మేము మళ్ళీ ఈ విధముగా
పడిపోవాల్సి ఉంటుందని తెలిస్తే ఇక రాజ్యము యొక్క సంతోషమే ఉండదు, అందుకే తండ్రి
అంటారు - అక్కడ ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది, మీకు సద్గతి కలిగిన తర్వాత ఇక జ్ఞానము
యొక్క అవసరమే ఉండదు. దుర్గతిలో ఉన్నప్పుడు జ్ఞానము యొక్క అవసరము ఉంటుంది. ఈ సమయములో
అందరూ దుర్గతిలో ఉన్నారు, అందరూ కామ చితిపై కూర్చుని కాలిపోయి మరణించారు. తండ్రి
అంటారు - నా పిల్లలైన ఆత్మలు వచ్చి శరీరాల ద్వారా పాత్రను అభినయిస్తారు, వారు కామ
చితిపై కూర్చుని తమోప్రధానముగా అయిపోయారు. మేము పతితముగా అయిపోయామని పిలుస్తారు కూడా.
కామ చితి వలనే పతితముగా అవుతారు. క్రోధము లేక లోభము వలన పతితముగా అవ్వరు.
సాధు-సన్యాసులు మొదలైనవారు పావనమైనవారు, దేవతలు పావనమైనవారు, అందుకే పతిత మనుష్యులు
వెళ్ళి వారికి తల వంచి నమస్కరిస్తారు. మీరు నిర్వికారులు, మేము వికారులము అని
పాడుతారు కూడా. నిర్వికారీ ప్రపంచము, వికారీ ప్రపంచము అని అంటూ ఉంటారు కదా. భారత్
యే నిర్వికారీ ప్రపంచముగా ఉండేది. ఇప్పుడు వికారీగా ఉంది. భారత్ తో పాటు మొత్తం
ప్రపంచమంతా వికారీగానే ఉంది. నిర్వికారీ ప్రపంచములో నేటికి 5 వేల సంవత్సరాల క్రితం
ఒకే ధర్మముండేది, పవిత్రత ఉండేది, కావున శాంతి, సంపద కూడా ఉండేవి, అలా మూడూ ఉండేవి.
పవిత్రత ఫస్ట్, ఇప్పుడు పవిత్రత లేదు కనుక శాంతి, సంపద కూడా లేవు.
జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. వారు మిమ్మల్ని
కూడా అలా ప్రియముగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజధానిలో అందరూ ప్రియమైనవారే.
మనుష్యులు, జంతువులు మొదలైనవన్నీ ప్రియమైనవే. పులి, మేక ఒకేచోట కలిసి నీరు తాగుతాయి.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అక్కడ అశుద్ధ పరిచే వస్తువేదీ ఉండదు. ఇక్కడ అనారోగ్యాలు,
దోమలు మొదలైనవి చాలా ఉన్నాయి. అక్కడ ఇటువంటివేవీ ఉండవు. షావుకారుల వద్ద ఫర్నీచర్
కూడా ఫస్ట్ క్లాసుగా ఉంటుంది. పేదవారి విషయములో ఫర్నీచర్ కూడా సాధారణముగా ఉంటుంది.
భారత్ ఇప్పుడు నిరుపేదగా ఉంది. ఎంత చెత్త చేరుకుంది. సత్యయుగములో ఎంత శుభ్రత ఉంటుంది.
బంగారు మహళ్ళు మొదలైనవి ఎంత ఫస్ట్ క్లాసుగా ఉంటాయి. వైకుంఠములో ఆవులు కూడా ఎంత ఫస్ట్
క్లాసుగా ఉంటాయో చూడండి. శ్రీకృష్ణునితో పాటు ఎంత మంచి ఆవులను చూపిస్తారు.
కృష్ణపురిలో ఆవులైతే ఉంటాయి కదా. అక్కడి వస్తువులు ఎంత ఫస్ట్ క్లాసుగా ఉంటాయి.
స్వర్గమంటే మరి ఏమిటి! ఈ పాత ఛీ-ఛీ ప్రపంచములోనైతే చాలా చెత్త ఉంది. ఇదంతా ఈ జ్ఞాన
యజ్ఞములో స్వాహా అయిపోతుంది. ఎలాంటి బాంబులను తయారుచేస్తూ ఉంటారు. బాంబు వేయగానే
నిప్పు అంటుకుంటుంది. ఈ రోజుల్లోనైతే రకరకాల జీవాణువులను కూడా జల్లుతూ ఉంటారు, అవి
ఒకేసారి అనంతములో సమాప్తము అయిపోయేలా వినాశనము చేస్తాయి. చికిత్స చేయించుకునేందుకు
హాస్పిటల్స్ మొదలైనవి ఉండవు. తండ్రి అంటారు - పిల్లలకు ఎటువంటి కష్టము కలగకూడదు,
అందుకే ప్రకృతి వైపరీత్యాలు, కుండపోత వర్షాలు జరుగుతాయని అంటూ ఉంటారు. పిల్లలు
వినాశన సాక్షాత్కారాన్ని కూడా చూసారు. వినాశనమైతే తప్పకుండా జరగనున్నదని బుద్ధి కూడా
చెప్తుంది. కొంతమంది, వినాశన సాక్షాత్కారము జరిగితేనే మేము నమ్ముతామని అంటారు. అచ్ఛా,
నమ్మకపోతే మీ ఇష్టము అని చెప్పండి. కొంతమంది, మాకు ఆత్మ సాక్షాత్కారము జరిగితేనే
మేము నమ్ముతామని అంటారు. అచ్ఛా, ఆత్మ ఒక బిందువు, దానిని చూసారనుకుందాము, అయితే
ఏమిటి, దాని వలన సద్గతి కలుగుతుందా? పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపుడు, వేలాది సూర్యుల
కన్నా తేజోమయుడు అని అంటారు. కానీ వారు అలా ఉండరు. గీతలో - ఇక చాలించండి, నేను
సహించలేను అని అర్జునుడు అన్నట్లుగా వ్రాశారు. కానీ అలా ఏమీ జరగలేదు. తండ్రిని
పిల్లలు చూసి, మేము సహించలేము అని అనడమనేదేమీ జరగదు. ఆత్మ ఎలా ఉంటుందో, పరమపిత
పరమాత్మ తండ్రి కూడా అలాగే ఉంటారు. కాకపోతే కేవలం వారు జ్ఞానసాగరుడు. మీలో కూడా
జ్ఞానముంది. తండ్రియే వచ్చి చదివిస్తారు, ఇంకే విషయము లేదు. ఎవరు ఏ భావనతో స్మృతి
చేస్తారో, ఆ భావనను పూర్తి చేస్తాను. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇకపోతే
భగవంతుడు ఎవరికీ లభించరు. మీరా సాక్షాత్కారాలను పొంది ఎంత సంతోషించేవారు. మరుసటి
జన్మలో కూడా భక్తురాలిగానే జన్మించి ఉంటారు. వైకుంఠములోకైతే వెళ్ళలేరు. ఇప్పుడు
పిల్లలైన మీరు వైకుంఠములోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనము
వైకుంఠానికి, ఆ కృష్ణపురికి యజమానులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇక్కడైతే అందరూ
నరకానికి యజమానులుగా ఉన్నారు. చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి కదా. మనము మన రాజ్య
భాగ్యాన్ని మళ్ళీ తీసుకుంటున్నామని పిల్లలకు తెలుసు. ఇది రాజయోగ బలము. బాహుబలముతో
కూడిన యుద్ధాలైతే అనేక సార్లు అనేక జన్మలుగా జరుగుతూ వచ్చాయి. యోగబలముతో మీరు ఎక్కే
కళలోకి వెళ్తారు. తప్పకుండా స్వర్గ రాజధాని స్థాపనవుతుందని మీకు తెలుసు. ఎవరైతే
కల్పక్రితం పురుషార్థము చేసి ఉంటారో, వారు మళ్ళీ అలాగే చేస్తారు. మీకు హార్ట్ ఫెయిల్
అవ్వకూడదు. ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో, వారికి ఎప్పుడూ సంశయము రాదు.
సంశయబుద్ధి కలవారు కూడా తప్పకుండా ఉన్నారు. బాబా అన్నారు - ఆశ్చర్యము కలిగేలా
వింటారు, వినిపిస్తారు, పారిపోతారు... అహో మాయ, నీవు వారిపై విజయము పొందుతావే. మాయ
చాలా బలశాలి అయినది. మంచి-మంచి ఫస్ట్ క్లాస్ సేవ చేసేవారికి, సెంటర్లు
నడిపించేవారికి కూడా మాయ చెంపదెబ్బ వేస్తుంది. కొంతమంది వ్రాస్తారు - బాబా, వివాహము
చేసుకుని నల్ల ముఖము చేసేసుకున్నాము, కామ ఖడ్గముతో మేము ఓడిపోయాము, బాబా, ఇక ఇప్పుడు
మీ ముందుకు వచ్చేందుకు యోగ్యులుగా లేము, బాబా, మేము మీ ముందుకు రావచ్చా? బాబా వారికి
ఇలా వ్రాస్తారు - నల్ల ముఖము చేసుకున్నారు కనుక ఇప్పుడు ఇక్కడకు రాలేరు, ఇక్కడకు
వచ్చి ఏం చేస్తారు, కానీ అక్కడే ఉండి పురుషార్థము చేయండి. ఒక్కసారి పడిపోయారు అంటే
ఇక పడిపోయినట్లే. అలాగని రాజ్య పదవిని పొందగలరని కాదు. ఎవరైతే జ్ఞాన మార్గములో సదా
ఉన్నతిని పొందుతారో, వారు వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు, కానీ ఒకవేళ తప్పటడుగు వేసి
మాయకు వశమై దిగజారిపోతే ఏకంగా చండాలురైపోతారు... అని అంటారు కదా. ఎముకలన్నీ
విరిగిపోతాయి. 5 అంతస్తుల నుండి పడిపోతారు. తర్వాత కొంతమంది సత్యము వ్రాస్తారు.
కొంతమందైతే అసలు వినిపించరు. ఇంద్రప్రస్థములోని దేవకన్యల ఉదాహరణ కూడా ఉంది కదా.
ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఈ సభలో పతితులు కూర్చునేందుకు అనుమతి లేదు.
కానీ కొన్ని పరిస్థితులలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. పతితులే వస్తారు కదా. ఇప్పుడు
ఎంతమంది ద్రౌపదులు పిలుస్తున్నారో చూడండి. బాబా, మేము వివస్త్రగా కాకుండా రక్షించండి
అని అంటారు. బంధనములో ఉన్నవారి పాత్ర కూడా నడుస్తుంది. కామేశు, క్రోధేశుగా ఉంటారు
కదా. చాలా గొడవలు జరుగుతాయి. బాబా వద్దకు సమాచారాలు వస్తూ ఉంటాయి. అనంతమైన తండ్రి
అంటారు - పిల్లలూ, దీనిని జయించండి, ఇప్పుడు పవిత్రముగా ఉండండి, నన్ను స్మృతి
చేసినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారని గ్యారంటీ ఉంది. వార్తాపత్రికలలో కూడా,
ఎవరో ప్రేరేపించి మా చేత ఈ బాంబులు మొదలైనవి తయారుచేయిస్తున్నారని స్వయము వారు కూడా
వ్రాస్తారు. వీటి వలన వాళ్ళ కులమే నాశనమవుతుంది. కానీ ఏమి చేయగలరు, డ్రామాలో
నిశ్చితమై ఉంది. రోజురోజుకు బాంబులను ఇంకా తయారుచేస్తూ ఉంటారు. సమయమైతే ఎక్కువ ఏమీ
లేదు కదా. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సత్యయుగీ ప్రేమభరిత రాజధానిలోకి వెళ్ళేందుకు చాలా-చాలా ప్రియముగా తయారవ్వాలి.
రాజ్య పదవి కోసం తప్పకుండా పావనముగా అవ్వాలి. పవిత్రత ఫస్ట్, అందుకే కామమనే
మహాశత్రువుపై విజయము పొందాలి.
2. ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగిగా అయ్యేందుకు, ఈ కళ్ళకు దేహ సహితముగా
ఏవైతే కనిపిస్తున్నాయో, వాటిని చూస్తూ కూడా చూడకూడదు. ప్రతి అడుగులో తండ్రి నుండి
సలహా తీసుకుని నడుచుకోవాలి.
వరదానము:-
మొత్తం వృక్షము యొక్క జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకుని తపస్య
చేసే సత్యమైన తపస్వీ మరియు సేవాధారీ భవ
తపస్వీలు వృక్షము కింద కూర్చుని తపస్య చేస్తున్నట్లుగా
భక్తి మార్గములో చూపిస్తారు. దీని వెనుక కూడా ఒక రహస్యముంది. పిల్లలైన మీ నివాసము ఈ
సృష్టి రూపీ కల్పవృక్షము యొక్క వేర్లలో ఉంది. వృక్షము కింద కూర్చోవడముతో మొత్తం
వృక్షము యొక్క జ్ఞానము బుద్ధిలో స్వతహాగా ఉంటుంది. కావున మొత్తం వృక్షము యొక్క
జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకుని, సాక్షీగా అయి, ఈ వృక్షాన్ని చూడండి. అప్పుడు ఆ నషా,
సంతోషాన్ని కలిగిస్తుంది మరియు దానితో బ్యాటరీ చార్జ్ అవుతుంది. సేవ చేస్తున్నా కూడా,
దానితో పాటు తపస్య ఉంటుంది.
స్లోగన్:-
తనువు యొక్క
అనారోగ్యము పెద్ద విషయమేమీ కాదు, కానీ మనసు ఎప్పుడూ అనారోగ్యముపాలు అవ్వకూడదు.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
దాత పిల్లలు సదా సర్వ
సంపదవంతులుగా ఉంటారు. ఎప్పుడూ భక్తి యొక్క లేక బికారి యొక్క సంస్కారాలు ఇమర్జ్
అవ్వకూడదు. బాబా నాకు ఏదో సహాయము చేయాలి, ఆశీర్వాదము ఇవ్వాలి అన్న సంకల్పము కూడా
రాకూడదు. బాబా, నాకు సహయోగము కావాలి, శక్తి కావాలి... ఇలా కావాలి అన్న మాట దాత,
విధాత, వరదాత పిల్లలకు శోభించదు. దాత పిల్లలు సర్వ శక్తులతో సంపన్నముగా ఉంటారు. ఈ
సంపన్న స్థితియే సంపూర్ణ స్థితిని సమీపముగా తీసుకువస్తుంది.