25-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు చాలా సమయము తర్వాత మళ్ళీ
తండ్రిని కలుసుకున్నారు, అందుకే మీరు చాలా ప్రియమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన
పిల్లలు’’
ప్రశ్న:-
మీ
స్థితిని ఏకరసముగా తయారుచేసుకునేందుకు సాధనమేమిటి?
జవాబు:-
సదా
గుర్తుంచుకోండి - ఏ క్షణమైతే గతించిందో, అది డ్రామా. కల్పక్రితము కూడా ఈ విధముగానే
జరిగింది. ఇప్పుడైతే నింద-స్తుతి, మానావమానాలు అన్నీ ఎదురవ్వబోతున్నాయి, అందుకే మీ
స్థితిని ఏకరసముగా తయారుచేసుకునేందుకు గతించినదాని గురించి చింతన చేయకండి.
ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పేరు ఏమిటి?
శివబాబా. వారు ఆత్మలందరికీ తండ్రి. ఆత్మిక పిల్లలందరి పేరు ఏమిటి? ఆత్మ. శరీరానికి
పేరు పెట్టడము జరుగుతుంది, ఆత్మకు అదే పేరు ఉంటుంది. సత్సంగాలు అనేకము ఉన్నాయని కూడా
పిల్లలకు తెలుసు. ఇది సత్యాతి-సత్యమైన సత్సంగము, ఇక్కడ సత్యమైన తండ్రి రాజయోగాన్ని
నేర్పించి మనల్ని సత్యయుగములోకి తీసుకువెళ్తారు. ఇటువంటి సత్సంగము మరియు పాఠశాల
ఇంకేదీ ఉండదు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మొత్తం సృష్టి చక్రమంతా పిల్లలైన మీ
బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. ఈ సృష్టిచక్రమెలా తిరుగుతుంది
అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారిని
సృష్టిచక్రము చిత్రము ఎదురుగా నిలబెట్టండి. ఇప్పుడు మీరు ఇటు వైపుకు వెళ్తారు అని
వారికి చెప్పండి. తండ్రి జీవాత్మలకు చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది
కొత్త విషయమేమీ కాదు. ఇది మీరు కల్ప-కల్పము వింటారు, ఇప్పుడు మళ్ళీ వింటున్నారు అని
మీకు తెలుసు. మీ బుద్ధిలో దేహధారులైన తండ్రి, టీచర్, గురువు ఎవ్వరూ లేరు. విదేహీ
శివబాబా మనకు టీచర్, గురువు అని మీకు తెలుసు. ఇతర ఏ సత్సంగాలు మొదలైనవాటిలో ఈ
విధముగా మాట్లాడకపోవచ్చు. మధుబన్ అయితే ఇది ఒక్కటే. వారు ఒక మధుబన్ ను బృందావనములో
చూపిస్తారు. దానిని భక్తి మార్గములో మనుష్యులు కూర్చుని తయారుచేసారు. ప్రాక్టికల్
గా మధుబన్ అయితే ఇదే. మీ బుద్ధిలో ఉంది - మనము సత్య, త్రేతాయుగాల నుండి మొదలుకొని
పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఇప్పుడు సంగమయుగములోకి వచ్చి నిలబడ్డాము,
పురుషోత్తములుగా తయారయ్యేందుకు. మనకు తండ్రి వచ్చి స్మృతినిప్పించారు. 84 జన్మలను
ఎవరు తీసుకుంటారు మరియు ఏ విధముగా తీసుకుంటారు అనేది కూడా మీకు తెలుసు. మనుష్యులైతే
కేవలం చెప్తూ ఉంటారు, ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి మంచి రీతిలో అర్థం చేయిస్తారు.
సత్యయుగములో సతోప్రధాన ఆత్మలు ఉండేవారు, శరీరాలు కూడా సతోప్రధానముగా ఉండేవి. ఈ
సమయములోనైతే సత్యయుగము లేదు, ఇది కలియుగము. స్వర్ణిమయుగములో మనము ఉండేవారము. ఆ
తర్వాత చక్రములో తిరుగుతూ, పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ మనము ఇనుపయుగములోకి
వచ్చేసాము, తప్పకుండా మళ్ళీ చక్రములో తిరగాలి. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. మీరు
చాలా కాలం దూరమై తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలు కదా. ఎవరైతే తప్పిపోయి, మళ్ళీ చాలా
సమయము తర్వాత కలుస్తారో, వారిని సికీలధే అని అంటారు. మీరు 5 వేల సంవత్సరాల తర్వాత
వచ్చి కలుసుకున్నారు. మాకు 5 వేల సంవత్సరాల క్రితము ఈ సృష్టిచక్రము యొక్క జ్ఞానాన్ని
ఇచ్చి, మమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారుచేసిన తండ్రి వీరేనని పిల్లలైన మీకు
మాత్రమే తెలుసు. జన్మ సిద్ధ అధికారాన్ని ఇవ్వడానికి ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి
కలుసుకున్నారు. ఇక్కడ తండ్రి రియలైజ్ చేయిస్తారు. ఇందులో ఆత్మ యొక్క 84 జన్మల
రియలైజేషన్ కూడా వచ్చేస్తుంది. ఇదంతా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనుష్యులను
దేవతలుగా లేక నిరుపేదలను కిరీటధారులుగా చేయడానికి 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ
విధముగా అర్థం చేయించారు. మనము 84 పునర్జన్మలు తీసుకున్నామని మీరు అర్థం
చేసుకున్నారు, ఎవరైతే తీసుకోలేదో వారు ఇక్కడకు నేర్చుకునేందుకు రాను కూడా రారు.
కొందరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. తమ-తమ ఇళ్ళల్లో,
గృహస్థములో ఉండాలి. అందరూ అయితే ఇక్కడకు వచ్చి కూర్చోరు. ఎవరైతే చాలా మంచి పదవిని
పొందేది ఉందో, వారు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. తక్కువ పదవి వారు ఎక్కువ
పురుషార్థము కూడా చేయరు. ఈ జ్ఞానము ఎటువంటిదంటే, కొద్దిగా పురుషార్థము చేసినా కూడా
అది వ్యర్థమవ్వదు. శిక్షలు అనుభవించి వచ్చేస్తారు. పురుషార్థము బాగా చేస్తే, శిక్షలు
కూడా తక్కువగా ఉంటాయి. స్మృతియాత్ర లేకుండా వికర్మలు వినాశనమవ్వవు. ఇది ఘడియ, ఘడియ
స్వయానికి గుర్తు తెప్పించుకోండి. మనుష్యులెవ్వరు కలిసినా సరే, వారికి మొదట -
స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న విషయాన్ని అర్థం చేయించాలి. పేరు అనేది శరీరానికి
తర్వాత పెట్టడము జరిగింది, ఎవరినైనా సరే శరీరము యొక్క పేరుతోనే పిలుస్తారు. ఈ
సంగమయుగములోనే అనంతమైన తండ్రి ఆత్మిక పిల్లలను పిలుస్తారు. ఆత్మిక తండ్రి వచ్చారని
మీరంటారు. ఆత్మిక పిల్లలూ అని తండ్రి అంటారు. మొదట ఆత్మ, ఆ తర్వాత పిల్లల పేరు
తీసుకుంటారు. ఆత్మిక పిల్లలూ - ఆత్మిక తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారు అనేది మీకు
తెలుసు. శివబాబా ఈ భగీరథునిపై విరాజమానమై ఉన్నారని, వారే మనకు సహజ రాజయోగాన్ని
నేర్పిస్తున్నారని మీ బుద్ధికి తెలుసు. తండ్రి ఇతర ఏ మనుష్యమాత్రులలోనూ ప్రవేశించి
రాజయోగాన్ని నేర్పించరు. ఆ తండ్రి వచ్చేదే పురుషోత్తమ సంగమయుగములో, ఇతర
మనుష్యులెవ్వరూ ఎప్పుడూ ఈ విధముగా చెప్పలేరు, అర్థం చేయించలేరు. ఈ శిక్షణ ఈ తండ్రిది
(బ్రహ్మాబాబాది) కాదు అని కూడా మీకు తెలుసు. కలియుగము సమాప్తమై సత్యయుగము రానున్నది
అని ఇంతకుముందు వీరికి తెలియదు. వీరికి ఇప్పుడు దేహధారీ గురువులెవ్వరూ లేరు. ఇతర
మనుష్యమాత్రులందరూ - మా గురువు ఫలానా, ఫలానావారి జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని
అంటారు. అందరికీ దేహధారీ గురువులు ఉన్నారు. ధర్మస్థాపకులు కూడా దేహధారులే. ఈ
ధర్మాన్ని ఎవరు స్థాపించారు? పరమపిత పరమాత్మ అయిన త్రిమూర్తి శివబాబా బ్రహ్మా ద్వారా
స్థాపన చేసారు. వీరి శరీరము పేరు బ్రహ్మా. క్రిస్టియన్ ధర్మాన్ని క్రైస్ట్ స్థాపన
చేసారని క్రిస్టియన్లు అంటారు. అతను దేహధారి. అతని చిత్రము కూడా ఉంది. ఈ ధర్మ
స్థాపకునికి ఏ చిత్రాన్ని చూపిస్తారు? శివునిదే చూపిస్తారు. శివుని చిత్రాలను కూడా
కొందరు చిన్నవిగా, కొందరు పెద్దవిగా చేస్తారు. వాస్తవానికి వారు ఒక బిందువే. వారికి
నామము, రూపము కూడా ఉన్నాయి, కానీ వారు అవ్యక్తమైనవారు. వారిని ఈ నేత్రాలతో చూడలేరు.
శివబాబా తన పిల్లలైన మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వెళ్ళారు, అందుకే వారిని స్మృతి
చేస్తారు కదా. శివబాబా అంటారు - మన్మనాభవ, తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి.
ఇంకెవ్వరి మహిమను చేయకూడదు. ఆత్మకు బుద్ధిలో ఏ దేహము గుర్తుకు రాకూడదు, ఇది బాగా
అర్థం చేసుకోవలసిన విషయము. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు. రోజంతా దీనిని రిపీట్
చేస్తూ ఉండండి. శివ భగవానువాచ - మొట్టమొదటైతే భగవంతుడినే అర్థం చేసుకోవలసి ఉంటుంది.
ఇది పక్కాగా చేయకుండా మిగిలిన విషయాలను వినిపించినట్లయితే వారి బుద్ధిలో ఏమీ
కూర్చోదు. కొందరేమో - ఈ విషయము కరక్టే అని అంటారు. మరికొందరు - ఇది అర్థం
చేసుకోవడానికి సమయము కావాలి అని అంటారు. మరికొందరు - ఆలోచిస్తాము అని అంటారు.
రకరకాల వారు వస్తారు. ఇది కొత్త విషయము. పరమపిత పరమాత్మ అయిన శివుడు కూర్చుని
ఆత్మలను చదివిస్తారు. మనుష్యులకు ఇది అర్థము కావాలంటే దాని కోసం ఏం చేయాలి అనే
ఆలోచన నడుస్తుంది. శివుడే జ్ఞాన సాగరుడు. శరీరము లేని ఆత్మను జ్ఞాన సాగరుడు అని ఎలా
అంటారు. జ్ఞాన సాగరుడు అంటే తప్పకుండా ఎప్పుడో వారు జ్ఞానాన్ని వినిపించి ఉంటారు,
అందుకే వారిని జ్ఞాన సాగరుడని అంటారు. ఊరికే ఎందుకు అలా అంటారు. కొంతమంది చాలా
చదివితే, వీరు చాలా వేద-శాస్త్రాలను చదివారు అని అంటారు, అందుకే వారిని శాస్త్రి
లేక విద్వాంసుడు అని అంటారు. తండ్రిని జ్ఞాన సాగరుడు, అథారిటీ అని అంటారు. వారు
తప్పకుండా ఇక్కడకు వచ్చి వెళ్ళారు. మొదటైతే ఇలా అడగాలి - ఇప్పుడు ఇది కలియుగమా లేక
సత్యయుగమా? కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా? లక్ష్యము-ఉద్దేశ్యమైతే మీ ఎదురుగా
నిలబడి ఉంది. ఈ లక్ష్మీ-నారాయణులు ఒకవేళ ఇక్కడ ఉండి ఉంటే వారి రాజ్యము ఉండేది. ఇది
పాత ప్రపంచము. వారు ఉన్న చోట పేదరికమే ఉండదు. ఇప్పుడైతే కేవలం వారి చిత్రాలు మాత్రమే
ఉన్నాయి. మందిరాలలో మోడల్స్ చూపిస్తారు. వాస్తవానికి వారు ఇక్కడ ఉన్నట్లయితే వారి
భవనాలు, తోటలు మొదలైనవి ఎంత పెద్ద-పెద్దవిగా ఉంటాయి, వారు ఇక్కడ ఉన్నట్లయితే కేవలం
మందిరాలలోనే ఉండరు కదా. ప్రెసిడెంట్ ఇల్లు ఎంత పెద్దది. దేవీ-దేవతలైతే పెద్ద-పెద్ద
మహళ్ళలో ఉంటారు. చాలా స్థలము ఉంటుంది. అక్కడ భయపడటము మొదలైన విషయాలేవీ ఉండవు. అక్కడ
సదా పుష్పాల తోటే ఉంటుంది. ముళ్ళు ఉండనే ఉండవు. అది ఉన్నదే పుష్పాల తోట. అక్కడైతే
కట్టెలు మొదలైనవి కాల్చరు, కట్టెలు కాల్చినప్పుడు పొగ వస్తే దుఃఖము కలుగుతుంది.
అక్కడ మనము చాలా తక్కువ స్థలములో ఉంటాము. ఆ తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. చాలా
మంచి-మంచి పుష్పాల తోటలు ఉంటాయి, సుగంధము వస్తూ ఉంటుంది. అడవులు ఉండనే ఉండవు.
ఇప్పుడు దానిని చూడలేకపోయినా కానీ ఆ అనుభూతి కలుగుతుంది. మీరు ధ్యానములో
పెద్ద-పెద్ద మహళ్ళు మొదలైనవి చూసి వస్తారు, వాటిని ఇక్కడ కట్టలేరు. సాక్షాత్కారమైన
తర్వాత అవి మాయమైపోతాయి. సాక్షాత్కారాలు కలిగాయి కదా. రాజులు, రాకుమారులు,
రాకుమారీలు ఉంటారు. చాలా రమణీకమైన స్వర్గము ఉంటుంది. ఏ విధముగానైతే ఇక్కడ మైసూరు
మొదలైనవి రమణీకముగా ఉంటాయో, అదే విధముగా అక్కడ చాలా మంచి గాలులు వీస్తూ ఉంటాయి.
జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి. మేము మంచి-మంచి వస్తువులు తయారుచేయాలని ఆత్మకు
అనిపిస్తుంది. ఆత్మకు స్వర్గమైతే గుర్తుకొస్తుంది కదా.
ఏమేమి ఉంటాయి, మనమెక్కడ ఉంటాము అనేది పిల్లలైన మీకు రియలైజ్ అవుతుంది. ఈ సమయములో
ఈ స్మృతి ఉంటుంది. మీరు ఎంత అదృష్టవంతులు అనేది చిత్రాలలో చూడండి. అక్కడ దుఃఖమనే
విషయమే ఉండదు. మనమైతే స్వర్గములో ఉండేవారము, ఆ తర్వాత కిందికి దిగిపోయాము. ఇప్పుడు
మళ్ళీ స్వర్గములోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? తాడును పట్టుకుని వెళ్తారా? ఆత్మలమైన
మనమైతే శాంతిధామ నివాసులము. ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతున్నారు మరియు ఇతరులను
తయారుచేస్తున్నారు అని తండ్రి స్మృతిని ఇప్పించారు. ఎంతమంది ఇంటిలో కూర్చుని కూడా
సాక్షాత్కారాలు చూస్తూ ఉంటారు. బంధనములో ఉన్నవారు ఎప్పుడూ చూసి ఉండరు. ఆత్మకు ఎంత
ఉత్సాహము కలుగుతుంది. తన ఇల్లు సమీపించే కొద్దీ ఆత్మకు సంతోషము కలుగుతుంది. బాబా
నాకు జ్ఞానాన్ని ఇచ్చి అలంకరించడానికి వచ్చారని భావిస్తారు. చివరికి ఒకానొక రోజు
వార్తాపత్రికలలో కూడా వస్తుంది. ఇప్పుడైతే నింద-స్తుతి, మానావమానాలు అన్నీ ఎదురుగా
వస్తాయి. కల్పక్రితము కూడా ఇలాగే జరిగిందని మీకు తెలుసు, ఏ క్షణమైతే గతించిందో దాని
గురించి చింతన చేయకూడదు. వార్తాపత్రికలలో కల్పక్రితము కూడా ఇలాగే వచ్చింది. మళ్ళీ
పురుషార్థము చేయడము జరుగుతుంది. ఏ హంగామాలైతే జరిగాయో, అవి జరిగిపోయాయి. పేరైతే
అందరికీ తెలిసింది కదా. మీరు మళ్ళీ బదులు ఇస్తారు. కొందరు చదువుతారు, కొందరు చదవరు.
తీరిక లభించదు. ఇతర పనులలో మునిగిపోతారు. ఇది అనంతమైన పెద్ద డ్రామా అని ఇప్పుడు మీ
బుద్ధిలో ఉంది. టిక్-టిక్ అని నడుస్తూ ఉంటుంది, చక్రము తిరుగుతూ ఉంటుంది. ఒక్క
క్షణములో ఏదైతే గతించిందో, అది మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది.
జరిగిపోయినదాని గురించి క్షణము తర్వాత ఆలోచన కలుగుతుంది. ఈ పొరపాటు జరిగిపోయింది,
డ్రామాలో నిశ్చితమైపోయింది. కల్పక్రితము కూడా ఇలాగే పొరపాటు జరిగింది, ఇప్పుడు అది
గతించిపోయింది. ఇప్పుడు మున్ముందు ఇక చెయ్యము అని అనుకుంటారు. పురుషార్థము చేస్తూ
ఉంటారు. పదే-పదే ఈ పొరపాటు చెయ్యడము మంచిది కాదు, ఈ కర్మ మంచిది కాదు అని మీకు అర్థం
చేయించడము జరుగుతుంది. నా ద్వారా ఈ తప్పుడు పని జరిగింది అని మనసు తింటూ ఉండవచ్చు.
తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - ఈ విధముగా చేయవద్దు, ఎవరికైనా దుఃఖము కలుగుతుంది.
వద్దు అని చెప్పడము జరుగుతుంది. తండ్రి తెలియజేస్తూ ఉంటారు - ఈ పని చేయకండి, ఏ
వస్తువునైనా అడగకుండా తీసుకుంటే దానిని దొంగతనము అని అంటారు. ఇటువంటి పనులు చేయకండి.
కటువుగా మాట్లాడకండి. ఈ రోజులలో ప్రపంచము ఎలా ఉందో చూడండి - ఎవరైనా పనివారిపై కోపం
చేస్తే, అతను కూడా శత్రుత్వము చూపించడము ప్రారంభిస్తారు. అక్కడైతే పులి-మేక పరస్పరము
క్షీరఖండము వలె ఉంటాయి. ఉప్పునీరు మరియు క్షీరఖండము. సత్యయుగములో మనుష్యాత్మలందరూ
పరస్పరములో క్షీరఖండము వలె ఉంటారు మరియు ఈ రావణ ప్రపంచములో మనుష్యులందరూ ఉప్పునీరులా
ఉన్నారు. తండ్రి-కొడుకులు కూడా ఉప్పునీరులానే ఉన్నారు. కామము మహాశత్రువు కదా. కామ
ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటారు. ఈ ప్రపంచమంతా ఉప్పునీరులా ఉంది.
సత్యయుగీ ప్రపంచము క్షీరఖండము. ఈ విషయాల గురించి ప్రపంచములోని వారికేమి తెలుసు.
మనుష్యులైతే స్వర్గానికి లక్షల సంవత్సరాలని అంటారు. అందుకే ఏ విషయము బుద్ధిలోకి రాదు.
ఎవరైతే దేవతలుగా ఉండేవారో, వారికే స్మృతిలోకి వస్తుంది. ఈ దేవతలు సత్యయుగములో
ఉండేవారని మీకు తెలుసు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో, వారే మళ్ళీ వచ్చి
చదువుకుంటారు మరియు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది తండ్రి యొక్క ఏకైక
యూనివర్సిటీ, దీని శాఖలు వెలువడుతూ ఉంటాయి. ఖుదా ఎప్పుడైతే వస్తారో, అప్పుడు మీరు
వారికి సహాయకులుగా అవుతారు, మీ ద్వారా స్వయం ఖుదా రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మేము
ఈశ్వరుని సేవాధారులమని మీరు భావిస్తారు. వారు దైహిక సేవ చేస్తారు, ఇది ఆత్మిక సేవ.
బాబా ఆత్మలమైన మనకు ఆత్మిక సేవ నేర్పిస్తున్నారు ఎందుకంటే ఆత్మే తమోప్రధానమైపోయింది.
బాబా మళ్ళీ సతోప్రధానముగా తయారుచేస్తున్నారు. బాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి
చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇది యోగాగ్ని. భారత్ యొక్క ప్రాచీన యోగము అని
అంటూ ఉంటారు కదా. కృత్రిమ యోగాలైతే చాలా ఉన్నాయి, అందుకే బాబా అంటారు, స్మృతియాత్ర
అని అనడము రైట్. శివబాబాను స్మృతి చేస్తూ-చేస్తూ మీరు శివపురిలోకి వెళ్ళిపోతారు. అది
శివపురి. మరొకటి విష్ణుపురి. ఇది రావణపురి. విష్ణుపురి తర్వాత రామపురి ఉంటుంది.
సూర్యవంశము తర్వాత చంద్రవంశము ఉంటుంది. ఇది కామన్ విషయమే. అర్ధకల్పము సత్య,
త్రేతాయుగాలు, అర్ధకల్పము ద్వాపర, కలియుగాలు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. ఇది
కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ఎవరైతే బాగా ధారణ చేస్తారో, వారు ఇతరులకు కూడా
అర్థం చేయిస్తారు. మనము పురుషోత్తమ సంగమయుగములో ఉన్నాము. ఈ విషయము ఎవరి బుద్ధిలో
గుర్తున్నా కూడా మొత్తం డ్రామా అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. కానీ కలియుగీ దేహ
సంబంధీకులు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు. తండ్రి అంటారు - మీరు ఒక్క తండ్రిని
మాత్రమే స్మృతి చేయాలి. సర్వుల సద్గతిదాత, రాజయోగాన్ని నేర్పించేవారు వారొక్కరే,
అందుకే బాబా అర్థం చేయించారు - శివబాబా జయంతి మాత్రమే మొత్తం ప్రపంచాన్ని
మారుస్తుంది. ఇప్పుడు మేము పురుషోత్తమ సంగమయుగములో ఉన్నామని బ్రాహ్మణులైన మీకు
మాత్రమే తెలుసు. బ్రాహ్మణులెవరైతే ఉన్నారో, వారికే రచయిత మరియు రచనల జ్ఞానము
బుద్ధిలో ఉంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎవరికైనా దుఃఖము కలిగించే కర్మలేవీ చేయకూడదు. కఠినమైన మాటలు మాట్లాడకూడదు.
చాలా-చాలా క్షీరఖండముగా అయి ఉండాలి.
2. ఏ దేహధారినీ మహిమ చేయకూడదు. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని బుద్ధిలో
ఉండాలి, ఆ ఒక్కరినే మహిమ చేయాలి, ఆత్మిక సేవాధారులుగా అవ్వాలి.
వరదానము:-
శుద్ధ సంకల్పాల వ్రతము (దృఢత) ద్వారా వృత్తిని పరివర్తన చేసే
హృదయ సింహాసనాధికారీ భవ
బాప్ దాదా యొక్క హృదయ సింహాసనము ఎంత పవిత్రమైనదంటే, ఈ
సింహాసనముపై సదా పవిత్రాత్మలే కూర్చోగలరు. ఎవరికైతే సంకల్పములోనైనా అపవిత్రత లేక
అమర్యాద కలుగుతాయో, వారు సింహాసనాధికారులుగా అయ్యేందుకు బదులుగా దిగేకళలో కిందకు
వచ్చేస్తారు, అందుకే మొదట శుద్ధ సంకల్పాల వ్రతము ద్వారా మీ వృత్తిని పరివర్తన
చేసుకోండి. వృత్తి పరివర్తన ద్వారా భవిష్య జీవితము రూపీ సృష్టి మారిపోతుంది. శుద్ధ
సంకల్పాలు మరియు దృఢ సంకల్పాల వ్రతము యొక్క ప్రత్యక్ష ఫలము - సదాకాలము కొరకు బాప్
దాదా యొక్క హృదయ సింహాసనము.
స్లోగన్:-
ఎక్కడైతే సర్వశక్తులు తోడుగా ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత ఉండనే ఉంటుంది.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి
అంతఃవాహక స్థితి అనగా
కర్మబంధన ముక్త కర్మాతీత స్థితి యొక్క వాహనము అనగా అంతిమ వాహనము, దీని ద్వారానే
క్షణములో కలిసి ఎగురుతారు. దాని కొరకు అన్ని హద్దుల నుండి అతీతముగా అనంతమైన
స్వరూపములో, అనంతమైన సేవాధారులుగా, సర్వ హద్దులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే
విజయీ రత్నాలుగా అవ్వండి, అప్పుడే అంతిమ కర్మాతీత స్వరూపము యొక్క అనుభవీ స్వరూపులుగా
అవుతారు.
| | | |