26-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సదా ఈ నషాలోనే ఉండండి - మాది పదమాపదమ భాగ్యము, స్వయం పతిత-పావనుడైన తండ్రికి మేము పిల్లలుగా అయ్యాము, వారి నుండి మాకు అనంతమైన సుఖము యొక్క వారసత్వం లభిస్తుంది’’

ప్రశ్న:-
పిల్లలైన మీకు ఏ ధర్మము పైనా అయిష్టము లేక ద్వేషము ఉండకూడదు - ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే మీకు బీజము మరియు వృక్షము గురించి తెలుసు. ఇది మనుష్య సృష్టి రూపీ అనంతమైన వృక్షమని, ఇందులో ప్రతి ఒక్కరికీ తమ, తమ పాత్ర ఉందని మీకు తెలుసు. నాటకంలో ఎప్పుడూ పాత్రధారులు ఒకరినొకరు ద్వేషించుకోరు. మనము ఈ నాటకంలో హీరో, హీరోయిన్ల పాత్రను అభినయించాము అని మీకు తెలుసు. మీరు ఏ సుఖమునైతే చూసారో, దానిని ఇంకెవ్వరూ చూడలేరు. మొత్తం విశ్వమంతటి పైనా రాజ్యం చేసేవారము మేమే అని మీకు అపారమైన సంతోషము ఉంది.

ఓంశాంతి
ఓం శాంతి అని అనడంతోనే పిల్లలకు ఏ జ్ఞానమైతే లభించిందో, అదంతా బుద్ధిలోకి వచ్చేయాలి. తండ్రి బుద్ధిలో కూడా ఏ జ్ఞానం ఉంది? ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము, దీనినే కల్పవృక్షము అని కూడా అంటారు. దీని ఉత్పత్తి, పాలన మరియు వినాశనం ఎలా అవుతుంది అనేదంతా బుద్ధిలోకి రావాలి. ఏ విధంగా ఆ జడమైన వృక్షము ఉంటుందో, అలా ఇది చైతన్యమైనది. బీజము కూడా చైతన్యమైనవారు. వారి మహిమను కూడా గానం చేస్తారు, వారు సత్యము, చైతన్యము అనగా వృక్షము యొక్క ఆదిమధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. వారి కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మా యొక్క కర్తవ్యమును కూడా తెలుసుకోవాలి కదా. బ్రహ్మాను ఎవ్వరూ తలచుకోరు, అసలు వారి గురించి తెలియనే తెలియదు. అజ్మీర్ లో బ్రహ్మా మందిరము ఉంది. త్రిమూర్తి చిత్రాన్ని ముద్రిస్తారు, అందులో బ్రహ్మా, విష్ణు, శంకరులు ఉన్నారు. బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు. ఈ సమయములో బ్రహ్మాను దేవత అని అనలేరని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు ఎప్పుడైతే సంపూర్ణము అవుతారో, అప్పుడే దేవత అని పిలవబడతారు. సంపూర్ణము అయి సూక్ష్మవతనములోకి వెళ్ళిపోతారు.

మీ తండ్రి పేరు ఏమిటి అని బాబా అడుగుతారు. ఎవరిని అడుగుతారు? ఆత్మను. ఆత్మ, నా బాబా అని అంటుంది. ఆ మాట ఎవరు అన్నారు అన్నది ఎవరికైతే తెలియదో వారు ప్రశ్నను అడగలేరు. తప్పకుండా అందరికీ ఇద్దరు తండ్రులు ఉన్నారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. జ్ఞానాన్ని అయితే ఒక్క తండ్రే ఇస్తారు. వీరు శివబాబా రథమని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. బాబా ఈ రథము ద్వారా మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఒకటేమో ఇది దేహధారి అయిన బ్రహ్మాబాబా రథము, ఇంకొకటి ఇది ఆత్మిక తండ్రి రథము కూడా. ఆ ఆత్మిక తండ్రికి సుఖసాగరుడు, శాంతిసాగరుడు... అన్న మహిమ ఉంది. వీరు అనంతమైన తండ్రి అని, వీరి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుందని మొదట బుద్ధిలో ఉంటుంది. పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. నిరాకారుడిని పతిత-పావనా రండి అని పిలుస్తారు. ఆత్మయే పిలుస్తుంది. ఎప్పుడైతే పావన ఆత్మగా ఉంటారో అప్పుడు పిలవరు. పతితముగా ఉన్నప్పుడు పిలుస్తారు. ఆ పతిత పావనుడైన తండ్రి ఈ తనువులోకి వచ్చారని ఇప్పుడు ఆత్మయైన మీకు తెలుసు. మనం వారికి చెందినవారిగా అయ్యాము అన్నది మర్చిపోకూడదు. ఇది కేవలం సౌభాగ్యమే కాదు, పదమాల భాగ్యము యొక్క విషయము. మరి అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి. ఈ సమయంలో తండ్రి వచ్చారు - ఇది కొత్త విషయము. శివజయంతిని కూడా ప్రతి సంవత్సరమూ జరుపుకుంటారు. కావున తప్పకుండా వారు ఒక్క సారే వస్తారు. లక్ష్మీ-నారాయణులు సత్యయుగములో ఉండేవారు. వారు ఈ సమయంలో లేరు. కావున వారు పునర్జన్మలు తీసుకొని ఉంటారని అర్థం చేయించాలి. 16 కళల నుండి 12-14 కళలలోకి వారు వచ్చి ఉంటారు. ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సత్యయుగము అని కొత్త ప్రపంచాన్ని అంటారు. అక్కడ అన్నీ కొత్తగానే ఉంటాయి. దేవతా ధర్మము పేరు కూడా మహిమ చేయబడుతుంది. అదే దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో, అప్పుడు వారిని కొత్తవారు అని అనలేరు, అలాగే దేవతలు అని కూడా అనలేరు. మేము వారి వంశావళికి చెందినవారము అని ఇంకెవ్వరూ అలా అనరు. ఒకవేళ స్వయాన్ని ఆ వంశావళికి చెందినవారిగా భావించినట్లయితే, మరి వారి మహిమను మరియు తమ నిందను ఎందుకు చేసుకుంటారు? మహిమను చేస్తున్నారంటే తప్పకుండా అప్పుడు వారిని పవిత్రులుగా, స్వయాన్ని అపవిత్రులుగా, పతితులుగా భావిస్తున్నారు. పావనుల నుండి పతితులుగా అవుతారు, పునర్జన్మలు తీసుకుంటారు. మొట్టమొదట ఎవరైతే పావనులుగా ఉండేవారో, వారే మళ్ళీ పతితులుగా అయ్యారు. పావనుల నుండి ఇప్పుడు పతితులుగా అయ్యారని మీకు తెలుసు. మీరు స్కూల్లో చదువుకుంటారు, అందులో నంబరువారుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ అయితే తప్పకుండా ఉంటాయి.

తమను తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు, అందుకే వస్తారు కదా. లేకపోతే ఇక్కడకు వచ్చే అవసరమేముంది. ఇతనేమీ గురువు, మహాత్మ, మహాపురుషుడు మొదలైనవేవీ కాదు. ఇది సాధారణ మనుష్య తనువు, అందులోనూ చాలా పాతది. అనేక జన్మల అంతిమములో ప్రవేశిస్తాను. ఇతనికి ఇంకే మహిమా లేదు, కేవలం ఇతనిలోకి ప్రవేశిస్తాను, అప్పుడు ఇతని పేరు ప్రఖ్యాతమవుతుంది. లేకపోతే ప్రజాపిత బ్రహ్మా ఎక్కడి నుండి వచ్చారు. మనుష్యులు తప్పకుండా తికమకపడతారు కదా. తండ్రి మీకు అర్థం చేయించారు కావుననే మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. బ్రహ్మా యొక్క తండ్రి ఎవరు? బ్రహ్మా, విష్ణు, శంకరులు - వీరి రచయిత ఈ శివబాబా. బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. పరమపిత పరమాత్మ ఎవరైతే పరంధామంలో ఉంటారో, వారిదే ఈ రచన. బ్రహ్మా, విష్ణు, శంకరుల కర్తవ్యము వేరు. ఎవరైనా ముగ్గురు, నలుగురు కలిసి ఉన్నా, వారందరి కర్తవ్యాలు వేర్వేరుగా ఉంటాయి. పాత్ర ప్రతి ఒక్కరిదీ ఎవరిది వారిదే. ఇన్ని కోట్లాదిమంది ఆత్మలు ఉన్నారు, ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. ఈ అద్భుతమైన విషయాలు అర్థం చేసుకోబడతాయి. ఎంతమంది మనుష్యులు ఉన్నారు. ఇప్పుడు చక్రం పూర్తవుతుంది. ఇది అంతిమము కదా. అందరూ తిరిగి వెళ్తారు, మళ్ళీ చక్రం రిపీట్ అవ్వనున్నది. తండ్రి ఈ విషయాలన్నింటినీ రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు, ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పపూర్వము కూడా అర్థం చేయించాను అని అంటారు. వీరు చాలా ప్రియమైన తండ్రి. ఇటువంటి తండ్రినైతే చాలా ప్రేమగా స్మృతి చేయాలి. మీరు కూడా ఆ తండ్రికి ప్రియమైన పిల్లలే కదా. తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. మొదట అందరూ ఒక్కరినే పూజ చేసేవారు. భేద భావాల విషయమే లేదు. ఇప్పుడు ఎన్ని భేద భావాలు ఉన్నాయి. వీరు రాముని భక్తులు, వీరు శ్రీకృష్ణుని భక్తులు అని అంటారు. రాముని భక్తులు ధూపం వేస్తే కృష్ణుని ముక్కును మూసేస్తారు. ఇటువంటి విషయాలు కూడా కొన్ని శాస్త్రాలలో ఉన్నాయి. ఒకరు, మా భగవంతుడు గొప్పవారు అని అంటే ఇంకొకరు తమ భగవంతుడు గొప్పవారు అని అంటారు. ఇద్దరు భగవంతుళ్ళు ఉన్నారని భావిస్తారు. కావున పొరపాటు జరిగిన కారణముగా అందరూ అధర్మయుక్తమైన పనులే చేస్తారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, భక్తి భక్తియే, జ్ఞానం జ్ఞానమే. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే, మిగిలినవారంతా భక్తి సాగరులే. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞానవంతులుగా అయ్యారు. తండ్రి మీకు తమ మరియు మొత్తం చక్రము యొక్క పరిచయాన్ని కూడా ఇచ్చారు, దీనిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు, అందుకే తండ్రి అంటారు, పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులు! పరమపిత పరమాత్మ అయితే ఒక్కరే, మిగిలినవారంతా పిల్లలే పిల్లలు. పరమపిత అని తమను తాము ఎవ్వరూ పిలుచుకోలేరు. మంచి వివేకవంతులైన మనుష్యులు ఎవరైతే ఉంటారో, వారు - ఇది ఎంత పెద్ద డ్రామా అని భావిస్తారు. అందులో పాత్రధారులందరూ అవినాశీ పాత్రను అభినయిస్తారు. ఆ చిన్నని నాటకాలైతే అల్పకాలికమైనవి, ఇది అనాది, అవినాశీ. ఇది ఎప్పుడూ ఆగిపోదు. ఇంత చిన్నని ఆత్మకు - శరీరాన్ని తీసుకోవడం మరియు వదిలేయడం మరియు పాత్రను అభినయించడం... అనే ఎంత పెద్ద పాత్ర లభించింది! ఈ విషయాలు ఏ శాస్త్రములోనూ లేవు. వీటిని ఎవరైనా గురువు వినిపించి ఉన్నట్లయితే మరి అతనికి వేరే శిష్యులు కూడా ఉంటారు కదా, కేవలం ఒక్క శిష్యుడే ఉంటే ఏం పనికొస్తారు. ఎవరైతే పూర్తిగా ఫాలో చేస్తారో, వారినే ఫాలోవర్ అని అంటారు. వీరి వస్త్రాలు మొదలైనవేవీ వారిలా లేవు, మరి వీరిని శిష్యులు అని ఎవరు అంటారు. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రినే ఫాలో చేయాలి. ఊరేగింపు ఉంటుంది కదా. శివుని ఊరేగింపు అని కూడా అంటారు. ఇది నా ఊరేగింపు అని బాబా అంటారు. మీరందరూ భక్తులు, నేను భగవంతుడిని. మీరందరూ ప్రేయసులు, మిమ్మల్ని అలంకరించి తీసుకువెళ్ళడానికి బాబా వచ్చారు. మరి మీకు ఎంత సంతోషము ఉండాలి. ఇప్పుడు మీకు సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. మీరు తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ పవిత్రముగా అవుతారు, అప్పుడు పవిత్ర రాజ్యము లభిస్తుంది. నేను అంతిమములోనే వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు. పావన ప్రపంచ స్థాపనను మరియు పతిత ప్రపంచ వినాశమును చేయించడానికి రండి అనే నన్ను పిలుస్తారు, అందుకే నన్ను మహాకాలుడు అని కూడా అంటారు. మహాకాలుని మందిరము కూడా ఉంటుంది. కాలుని మందిరాన్ని చూస్తారు కదా. శివుడిని కాలుడు అని అంటారు కదా. మీరు వచ్చి పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు. వారు ఆత్మలను తీసుకువెళ్తారు. అనంతమైన తండ్రి ఎంతమంది ఆత్మలను తీసుకువెళ్ళేందుకు వచ్చారు. కాలుడికే కాలుడైన మహాకాలుడు ఆత్మలందరినీ పవిత్రముగా, పుష్పాలలా తయారుచేసి తీసుకువెళ్తారు. పుష్పాలుగా అయినట్లయితే తండ్రి కూడా తమ ఒడిలో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తారు. ఒకవేళ పవిత్రముగా అవ్వకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, తేడా అయితే ఉంటుంది కదా. పాపాలు మిగిలిపోతే మరి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా అటువంటిదే లభిస్తుంది, అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, చాలా-చాలా మధురముగా అవ్వండి. శ్రీకృష్ణుడు అందరికీ మధురంగా అనిపిస్తారు కదా. ఎంత ప్రేమగా శ్రీకృష్ణుడిని ఊయలలో ఊపుతారు, ధ్యానములో శ్రీకృష్ణుడిని చిన్న పిల్లవాడిగా చూసి వెంటనే ఒడిలోకి తీసుకొని ప్రేమ చేస్తారు, వైకుంఠములోకి వెళ్ళిపోతారు. వారు శ్రీకృష్ణుడిని చైతన్య రూపములో చూస్తారు. నిజంగానే వైకుంఠము వస్తోంది అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనం భవిష్యత్తులో ఈ విధంగా అవుతాము. శ్రీకృష్ణునిపై కళంకాలు మోపుతారు, అవన్నీ తప్పు. పిల్లలైన మీకు మొదట నషా ఎక్కాలి. ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగాయి, మళ్ళీ చివరిలో ఎన్నో జరుగుతాయి. జ్ఞానము ఎంత రమణీయమైనది, ఎంతటి సంతోషము ఉంటుంది. భక్తిలోనైతే ఎటువంటి సంతోషమూ ఉండదు. జ్ఞానములో ఎంతటి సంతోషము ఉంటుంది అనేది భక్తిలోని వారికి తెలియదు, వారు పోల్చలేరు. పిల్లలైన మీకు మొట్టమొదట ఈ నషా ఎక్కాలి. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకే ఋషులు, మునులు మొదలైనవారెవ్వరూ ఇవ్వలేరు. లౌకిక గురువులైతే ఎవ్వరికీ ముక్తి-జీవన్ముక్తుల దారిని తెలియజేయలేరు. మానవమాత్రులెవ్వరూ గురువులు కాలేరని, వారు - హే ఆత్మల్లారా, పిల్లలూ, నేను మీకు అర్థం చేయిస్తున్నాను అని అనలేరని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రికైతే ‘పిల్లలూ, పిల్లలూ’ అని అనే అలవాటు ఉంది. వీరంతా నా రచనయేనని వారికి తెలుసు. నేను అందరి రచయితను అని ఈ తండ్రి కూడా అంటారు. మీరందరూ పరస్పరం సోదరులు. వారికి పాత్ర లభించింది, అది ఎలా లభించింది అన్నది ఇప్పుడు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలోనే పాత్ర అంతా నిండి ఉంది. మనుష్యులు ఎవరైతే వస్తారో, వారి 84 జన్మలలో ఎప్పుడూ ఒకే రకమైన రూపురేఖలు ఉండవు, కొద్ది-కొద్దిగా తప్పకుండా మారతాయి. తత్వాలు కూడా సతో, రజో, తమోగా అవుతూ ఉంటాయి. ప్రతి జన్మలోని రూపు-రేఖలు ఒకదానితో ఒకటి కలవవు. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు - మధురమైన పిల్లలూ, తండ్రిలో ఎప్పుడూ సంశయాన్ని తెచ్చుకోకండి. సంశయం మరియు నిశ్చయం అనే రెండు పదాలు ఉన్నాయి కదా. తండ్రి అంటే తండ్రే, ఇందులో సంశయం కలగజాలదు. నేను తండ్రిని స్మృతి చేయలేను అని కొడుకు అనలేడు. మీరేమో - యోగం కుదరడం లేదు అని ఘడియ-ఘడియ అంటారు. యోగము అన్న పదము సరైనది కాదు. మీరు రాజఋషులు. ‘ఋషి’ అన్న పదము పవిత్రతకు గుర్తు. మీరు రాజఋషులు కావున తప్పకుండా పవిత్రముగా ఉంటారు. చిన్న విషయములో ఫెయిల్ అవ్వడం ద్వారా ఇక రాజ్యము లభించదు, ప్రజలలోకి వెళ్ళిపోతారు. ఎంత నష్టం వాటిల్లుతుంది. నంబరువారు పదవులు ఉంటాయి కదా, ఒకరి పదవి ఇంకొకరితో కలవదు. ఇది అనంతమైన తయారై-తయారుచేయబడిన డ్రామా. ఒక్క తండ్రి తప్ప దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. పిల్లలైన మీకు ఎంతటి సంతోషము ఉంటుంది. ఏ విధంగా తండ్రి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉందో, అలాగే మీ బుద్ధిలో కూడా ఉంది. బీజాన్ని మరియు వృక్షాన్ని అర్థం చేసుకోవాలి. మనుష్య సృష్టి యొక్క వృక్షము ఉంది, దీనితో మర్రి వృక్షము ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. మన ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క కాండము ఏదైతే ఉందో, అది కనుమరుగైపోయింది అని బుద్ధి కూడా చెప్తుంది. మిగిలిన ధర్మాలన్నింటి యొక్క శాఖలు మొదలైనవి ఉన్నాయి. డ్రామానుసారంగా ఇదంతా జరగవలసిందే, ఇందులో ద్వేషము కలగదు. నాటకంలో పాత్రధారులకు ఎప్పుడైనా ద్వేషము కలుగుతుందా! తండ్రి అంటారు, మీరు పతితంగా అయిపోయారు, మళ్ళీ పావనంగా అవ్వాలి. మీరు ఎంతటి సుఖాన్ని అయితే చూస్తారో, అంతగా ఇంకెవ్వరూ చూడరు. మీరు హీరో, హీరోయిన్లు, మీరు విశ్వంపై రాజ్యాన్ని పొందేవారు, కావున మీకు అపారమైన సంతోషం ఉండాలి కదా. భగవంతుడు చదివిస్తున్నారు! మరి ఎంత రెగ్యులర్ గా చదువుకోవాలి, ఎంతటి సంతోషము ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. రాజయోగాన్ని కూడా తండ్రే నేర్పిస్తారు. శరీరధారి ఎవ్వరూ నేర్పించలేరు. తండ్రి ఆత్మలకు నేర్పించారు, ఆత్మయే ధారణ చేస్తుంది. పాత్రను అభినయించేందుకు తండ్రి ఒక్కసారే వస్తారు. ఆత్మయే పాత్రను అభినయించి ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఆత్మలను తండ్రి చదివిస్తారు. వారు దేవతలను చదివించరు. అక్కడైతే దేవతలే చదివిస్తారు. సంగమయుగములో పురుషోత్తములుగా తయారుచేయడానికి తండ్రే చదివిస్తారు. మీరే చదువుకుంటారు. ఈ సంగమయుగము ఒక్కటే, ఇప్పుడే మీరు పురుషోత్తములుగా అవుతారు. సత్యంగా తయారుచేసేవారు, సత్యయుగ స్థాపనను చేసేవారు ఒక్క సత్యమైన బాబాయే. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సంగమయుగములో డైరెక్టుగా భగవంతుని ద్వారా చదువును చదువుకుని జ్ఞానవంతులుగా, ఆస్తికులుగా అవ్వాలి మరియు తయారుచేయాలి. ఎప్పుడూ కూడా తండ్రిపై లేక చదువుపై సంశయాన్ని తెచ్చుకోకూడదు.

2. తండ్రి సమానముగా ప్రియమైనవారిగా అవ్వాలి. భగవంతుడు మనల్ని అలంకరిస్తున్నారు అన్న ఈ సంతోషములో ఉండాలి. ఏ పాత్రధారి పైనా అయిష్టము లేక ద్వేషము ఉంచుకోకూడదు. ప్రతి ఒక్కరికీ ఈ డ్రామాలో ఏక్యురేట్ పాత్ర ఉంది.

వరదానము:-

సేవల ప్రవృత్తిలో ఉంటూ మధ్యమధ్యలో ఏకాంతవాసిగా అయ్యే అంతర్ముఖీ భవ

సైలెన్సు శక్తిని ప్రయోగము చేయడానికి అంతర్ముఖిగా మరియు ఏకాంతవాసిగా అయ్యే అవసరముంది. కొంతమంది పిల్లలేమంటారంటే - అంతర్ముఖి స్థితిని అనుభవం చేయడానికి మరియు ఏకాంతవాసిగా అవ్వడానికి సమయమే లభించటం లేదు, ఎందుకంటే సేవా ప్రవృత్తి, వాణి శక్తి యొక్క ప్రవృత్తి చాలా ఎక్కువైపోయాయి. కానీ ఇందుకొరకు ఒకేసారి అర్ధగంట లేక ఒక గంట కేటాయించేందుకు బదులుగా మధ్యమధ్యలో కొద్ది సమయాన్ని కేటాయించినా కూడా శక్తిశాలి స్థితి తయారైపోతుంది.

స్లోగన్:-

బ్రాహ్మణ జీవితములో యుద్ధము చేయడానికి బదులుగా ఆనందాన్ని అనుభవం చేసుకున్నట్లయితే కష్టము కూడా సహజమైపోతుంది.