26-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది, టిక్-టిక్ అని గడుస్తూనే ఉంటుంది, ఇందులో ఒకరి పాత్ర మరొకరితో కలవదు, దీనిని యథార్థముగా అర్థం చేసుకొని సదా హర్షితముగా ఉండాలి’’

ప్రశ్న:-
ఏ యుక్తి ద్వారా మీరు భగవంతుడు వచ్చేసారు అని నిరూపించి చెప్పగలుగుతారు?

జవాబు:-
ఎవరితోనూ కూడా భగవంతుడు వచ్చేసారు అని డైరెక్టుగా చెప్పకండి, అలా చెప్తే మనుష్యులు అపహాస్యం చేస్తారు, విమర్శిస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో తమను తాము భగవంతునిగా పిలుచుకునేవారు ఎందరో ఉన్నారు, అందుకే మీరు యుక్తితో మొదట ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. వారికి ఇలా చెప్పండి - ఒకరు హద్దు తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి, హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వము లభిస్తుంది, ఇప్పుడు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు, ఇలా చెప్పినట్లయితే అర్థం చేసుకుంటారు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. సృష్టి అయితే ఇదే. అర్థం చేయించేందుకు తండ్రికి కూడా ఇక్కడికి రావలసి ఉంటుంది. మూలవతనములోనైతే అర్థం చేయించటం జరగదు. స్థూలవతనములోనే అర్థం చేయించడం జరుగుతుంది. పిల్లలందరూ పతితులుగా ఉన్నారని, ఎందుకూ పనికిరాకుండా ఉన్నారని తండ్రికి తెలుసు. ఈ ప్రపంచములో అంతా దుఃఖమే దుఃఖము ఉంది. ఇప్పుడు మీరు విషయసాగరములో పడి ఉన్నారని తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి మీరు క్షీరసాగరములో ఉండేవారు. విష్ణుపురిని క్షీరసాగరము అని అంటారు. ఇప్పుడు క్షీరసాగరమైతే ఇక్కడ లభించదు, కావున ఒక సరస్సును తయారుచేసారు. ఆ ప్రపంచములోనైతే పాల నదులు ప్రవహించేవి అని అంటారు, అక్కడి గోవులు కూడా ఫస్ట్ క్లాసయినవి, ప్రసిద్ధమైనవి. ఇక్కడైతే మనుష్యులు కూడా రోగగ్రస్థులుగా అవుతారు, అక్కడైతే గోవులు కూడా ఎప్పుడూ రోగగ్రస్థముగా అవ్వవు. అవి ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. జంతువులు మొదలైనవేవీ రోగగ్రస్థముగా అవ్వవు. ఇక్కడికి మరియు అక్కడికి ఎంతో తేడా ఉంది. ఈ విషయాలను తండ్రే వచ్చి తెలియజేస్తారు. ప్రపంచములో ఇంకెవ్వరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమయుగమని, ఈ సమయములోనే తండ్రి వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తారని మీకు తెలుసు. తండ్రి అంటారు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కొందరు అల్లాహ్ అని, కొందరు గాడ్ అని, కొందరు భగవంతుడు అని పిలుస్తారు. నాకు ఎన్నో పేర్లను పెట్టేశారు. మంచివి, చెడ్డవి ఏ పేర్లు తోస్తే ఆ పేర్లు పెట్టేస్తారు. బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచము ఇది అర్థం చేసుకోలేదు. ఎవరైతే 5000 సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు, అందుకే కోట్లాదిమందిలో కొందరు, ఆ కొందరిలో కూడా ఏ ఒక్కరో అన్న గాయనము ఉంది. నేను ఎవరిని, ఎలా ఉన్నాను, పిల్లలకు ఏమి నేర్పిస్తాను అనేది పిల్లలైన మీకే తెలుసు, దీనిని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మనమేమీ సాకారుని ద్వారా చదువుకోవడం లేదని కూడా మీకు తెలుసు. నిరాకారుడు చదివిస్తున్నారు. మనుష్యులు తప్పకుండా తికమకపడతారు, నిరాకారుడైతే పైన ఉంటారు, మరి వారు ఎలా చదివిస్తారు అని తికమకపడతారు. నిరాకార ఆత్మలైన మీరు కూడా పైన ఉంటారు, తర్వాత ఈ సింహాసనము పైకి వస్తారు. ఈ సింహాసనము వినాశీ, ఆత్మ అయితే అకాల్ (అమరము). ఆత్మ ఎప్పుడూ మృత్యువును పొందదు. శరీరము మృత్యువు పొందుతుంది. ఇది చైతన్యమైన సింహాసనము. అమృత్సర్ లో కూడా అకాల సింహాసనము ఉంది కదా. అది చెక్కతో తయారుచేయబడిన సింహాసనము. పాపం వారికి అకాల్ అయినది ఆత్మ అని, దానిని కాలుడు ఎప్పటికీ కబళించలేడని తెలియదు. అకాలమూర్తి అయిన ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. దానికి కూడా రథమైతే కావాలి కదా. నిరాకారుడైన తండ్రికి కూడా తప్పకుండా మనుష్య రథము కావాలి ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరుడు, జ్ఞానేశ్వరుడు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ అన్న పేరైతే ఎంతోమందికి ఉంది. స్వయాన్ని ఈశ్వరునిగా భావిస్తారు కదా. భక్తిలోని శాస్త్రాల విషయాలను వినిపిస్తారు. జ్ఞానేశ్వర్ అన్న పేరును పెట్టుకుంటారు అనగా జ్ఞానాన్ని ఇచ్చే ఈశ్వరుడు. వారు జ్ఞానసాగరుడే, వారినే గాడ్ ఫాదర్ అని అంటారు. ఇక్కడైతే ఎంతోమంది భగవంతుళ్ళు అయిపోయారు. ఎప్పుడైతే అతి గ్లాని జరుగుతుందో, చాలా నిరుపేదలుగా అవుతారో, దుఃఖితులుగా అవుతారో అప్పుడే తండ్రి వస్తారు. తండ్రిని పేదల పాలిటి పెన్నిధి అని అంటారు. చివరికి పేదల పాలిటి పెన్నిధి అయిన తండ్రి వచ్చే రోజు వస్తుంది. తండ్రి వచ్చి స్వర్గ స్థాపనను చేస్తారని పిల్లలకు కూడా తెలుసు. అక్కడైతే అపారమైన ధనం ఉంటుంది. అక్కడ ధనం ఎప్పుడూ లెక్కించబడదు. ఇక్కడైతే ఇన్ని కోట్లు ఖర్చయ్యాయి అని లెక్క వేస్తూ ఉంటారు. అక్కడ అసలు లెక్కపెట్టే ప్రసక్తే ఉండదు, అపారమైన ధనము ఉంటుంది.

బాబా మనల్ని మన ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. పిల్లలు తమ ఇంటిని మర్చిపోయారు. భక్తి మార్గములో ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు, దీనిని రాత్రి అని అంటారు. భగవంతుడిని వెదుకుతూనే ఉంటారు, కానీ భగవంతుడు ఎవ్వరికీ లభించరు. ఇప్పుడు భగవంతుడు వచ్చి ఉన్నారు, ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు, నిశ్చయము కూడా ఉంది. అలా అని అందరికీ పక్కా నిశ్చయముంది అని కాదు, ఏదో ఒక సమయములో మాయ మరపింపజేస్తుంది, అందుకే తండ్రి అంటారు - ఆశ్చర్యము కలిగించేలా నన్ను చూస్తారు, నాకు చెందినవారిగా అవుతారు, ఇతరులకు వినిపిస్తారు, అయినా కానీ అహో మాయా, నీవు ఎంత శక్తివంతమైనదానివి, ఇంత చేశాక కూడా నీవు వారిని పారిపోయేలా చేస్తావు! అలా లెక్కలేనంతమంది పారిపోతారు, విడాకులిచ్చేస్తారు. మరి వారు ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు! చాలా చిన్న స్థాయి జన్మను పొందుతారు. పరీక్షలలో ఫెయిల్ అవుతారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష. తండ్రి అందరూ నారాయణులుగా అవుతారు అనైతే అనరు. ఎవరైతే మంచి పురుషార్థాన్ని చేస్తారో వారు పదవి కూడా మంచిది పొందుతారు. మంచి పురుషార్థులు ఎవరు అనేది తండ్రి అర్థం చేసుకుంటారు - వారు ఎవరంటే ఇతరుల చేత కూడా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే పురుషార్థాన్ని చేయిస్తారు అనగా తండ్రి పరిచయాన్ని ఇస్తారు. ఈ రోజుల్లో అపోజిషన్ లో ఎంతమంది మనుష్యులు తమను తామే భగవంతునిగా పిలుచుకుంటున్నారు. మిమ్మల్ని అబలలుగా భావిస్తారు. భగవంతుడు వచ్చి ఉన్నారని ఇప్పుడు వారికి ఎలా అర్థం చేయించాలి. ఎవరికైనా భగవంతుడు వచ్చారని డైరెక్టుగా చెప్తే వారు ఎప్పటికీ అంగీకరించరు, అందుకే అర్థం చేయించేందుకు యుక్తి కూడా కావాలి. భగవంతుడు వచ్చి ఉన్నారు అని ఎప్పుడూ, ఎవ్వరికీ చెప్పకూడదు. వారికి ఎలా అర్థం చేయించాలంటే - మీకు ఇద్దరు తండ్రులున్నారు, ఒకరేమో పారలౌకిక అనంతమైన తండ్రి, ఇంకొకరు హద్దులోని లౌకిక తండ్రి. ఈ విధంగా బాగా పరిచయాన్ని ఇవ్వాలి, తద్వారా వీరు నిజమే చెప్తున్నారు అని వారు అర్థం చేసుకోగలగాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వము ఎలా లభిస్తుంది - ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది. ఇంకెవ్వరూ ఈ విధంగా మనుష్యులకు ఇద్దరు తండ్రులు ఉంటారు అని చెప్పలేరు. మీరు నిరూపించి చెప్తారు, హద్దులోని లౌకిక తండ్రి నుండి హద్దులోని వారసత్వము మరియు పారలౌకిక అనంతమైన తండ్రి నుండి అనంతమైన అనగా కొత్త ప్రపంచపు వారసత్వము లభిస్తుంది. కొత్త ప్రపంచము స్వర్గము, దానిని తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఇస్తారు. ఆ తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు. అంతేకానీ మీరు కేవలం - భగవంతుడు వచ్చి ఉన్నారు అని చెప్తే వారు ఎప్పుడూ అంగీకరించరు, ఇంకా విమర్శిస్తారు. విననే వినరు. సత్యయుగములో అర్థం చేయించడం జరగదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి శిక్షణను ఇస్తారో అప్పుడే అర్థం చేయించవలసి ఉంటుంది. సుఖములో ఎవ్వరూ స్మరించరు, దుఃఖములో అందరూ స్మరిస్తారు. కావున ఆ పారలౌకిక తండ్రినే దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. వారు దుఃఖము నుండి విముక్తులను చేసి, మార్గదర్శకునిగా అయి మళ్ళీ మన మధురమైన ఇంటికి తీసుకువెళ్తారు. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. అక్కడికి మనం ఎలా వెళ్తాము - ఇది ఎవ్వరికీ తెలియదు. రచయిత లేక రచన యొక్క ఆదిమధ్యాంతాలను గురించి వారికి తెలియదు. మనల్ని బాబా నిర్వాణధామానికి తీసుకువెళ్ళేందుకు వచ్చారని మీకు తెలుసు. వారు ఆత్మలందరినీ తీసుకువెళ్తారు, ఒక్కరిని కూడా వదలరు. అది ఆత్మల ఇల్లు, ఇది శరీరాలకు ఇల్లు. కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు నిరాకారుడైన తండ్రి, వారిని పరమపిత అని అనడం జరుగుతుంది. పరమపిత అన్న పదము సరైనది మరియు అది మధురమైనది. కేవలం భగవంతుడు, ఈశ్వరుడు అని అనడం ద్వారా వారసత్వపు సుగంధము రాదు. మీరు పరమపితను స్మృతి చేస్తారు కావున వారసత్వం లభిస్తుంది. వారు తండ్రి కదా. సత్యయుగము సుఖధామమని కూడా పిల్లలకు అర్థం చేయించారు. స్వర్గాన్ని శాంతిధామము అని అనరు. ఎక్కడైతే ఆత్మలు ఉంటాయో దానిని శాంతిధామము అని అంటారు. ఈ విషయాన్ని పూర్తిగా పక్కా చేసుకోండి.

తండ్రి అంటారు - పిల్లలూ, మీరు ఈ వేద-శాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా ఎటువంటి ప్రాప్తి కలగదు. భగవంతుడిని పొందేందుకే శాస్త్రాలను చదువుతుంటారు కానీ భగవంతుడు అంటారు, నేను ఎవ్వరికీ శాస్త్రాలను చదవడం ద్వారా లభించను. మీరు వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేయండి అనే నన్ను పిలుస్తారు. ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు, రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు కదా. స్కూల్లో పిల్లలు చదవకపోతే నీవు రాతిబుద్ధిలా ఉన్నావు అని అంటారు కదా. సత్యయుగములో అలా అనరు. పారసబుద్ధి కలవారిగా తయారుచేసేవారు ఒక్క అనంతమైన తండ్రియైన పరమపితయే. ఈ సమయములో మీ బుద్ధి పారసములా ఉంది ఎందుకంటే మీరు తండ్రితోపాటు ఉన్నారు. మళ్ళీ సత్యయుగములో ఒక్క జన్మలో కూడా కొంత తేడా తప్పకుండా వస్తుంది. 1250 సంవత్సరాలలో రెండు కళలు తగ్గిపోతాయి. క్షణ-క్షణము 1250 సంవత్సరాలలో కళలు తగ్గుతూ ఉంటాయి. మీ జీవితము ఈ సమయములో పూర్తిగా పర్ఫెక్ట్ గా అవుతుంది, ఈ సమయములో మీరు తండ్రి వలె జ్ఞానసాగరులుగా, సుఖ-శాంతుల సాగరులుగా అవుతారు, అన్ని వారసత్వాలను తీసుకుంటారు. తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికే వస్తారు. మొట్టమొదట మీరు శాంతిధామములోకి వెళ్తారు, ఆ తర్వాత సుఖధామములోకి వెళ్తారు. శాంతిధామములో కేవలం శాంతియే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సుఖధామములోకి వెళ్తారు, అక్కడ అశాంతి విషయము కొద్దిగా కూడా ఉండదు. మళ్ళీ కిందకు దిగవలసి ఉంటుంది. నిముష-నిముషము మీరు దిగడం జరుగుతుంది. కొత్త ప్రపంచము నుండి పాత ప్రపంచముగా అవుతూ ఉంటుంది. అందుకే బాబా అన్నారు, 5000 సంవత్సరాలలో ఎన్ని నెలలు, ఎన్ని గంటలు... ఉంటాయో లెక్క వేయండి, అప్పుడు మనుష్యులు ఆశ్చర్యపోతారు, వీరు పూర్తి లెక్కను చెప్పారు అని భావిస్తారు. లెక్కను ఏక్యురేట్ గా వ్రాయాలి, అందులో కొద్దిగా కూడా తేడా రాదు. నిముష-నిముషము టిక్-టిక్ అని అంటూనే ఉంటుంది. మొత్తం రీలు అంతా రిపీట్ అవుతుంది, తిరుగుతూ-తిరుగుతూ చుట్టుకుంటుంది, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈ పెద్ద రీలు చాలా అద్భుతమైనది. దీనిని ఎవ్వరూ కొలవలేరు. మొత్తం ప్రపంచము యొక్క పాత్ర ఏదైతే నడుస్తుందో, అది టిక్-టిక్ అని గడుస్తూ ఉంటుంది. ఒక క్షణము మరొక క్షణముతో కలవదు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. అది హద్దులోని డ్రామా, ఇది అనంతమైన డ్రామా. ఇది అవినాశీ డ్రామా అని ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరానిది ఏమైనా జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే ఇది పూర్వ నిర్ధారితమై ఉన్న డ్రామా. ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. అనేక సార్లు క్షణ-క్షణము ఈ డ్రామా రిపీట్ అవుతూ వచ్చింది. ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు. మొట్టమొదట అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు అని తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారికి శివ అన్న ఒక్క పేరే ఉంది. తండ్రి అంటారు, ఎప్పుడైతే అతి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడే నేను వస్తాను. దీనిని ఘోర కలియుగము అని అంటారు. ఇక్కడ ఎంతో దుఃఖము ఉంది. ఇటువంటి ఘోర కలియుగములో పవిత్రముగా ఎలా ఉండగలము అని అనేవారు ఎంతోమంది ఉన్నారు! కానీ వారికి పావనంగా తయారుచేసేవారు ఎవరు అన్నది తెలియనే తెలియదు. తండ్రే సంగమములో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ స్త్రీ-పురుషులు ఇరువురూ పవిత్రముగా ఉంటారు, ఇక్కడ ఇరువురూ అపవిత్రముగా ఉన్నారు. ఇది అపవిత్ర ప్రపంచము. అది పవిత్ర ప్రపంచము - స్వర్గము, హెవెన్. ఇది దోజక్, నరకము, హెల్. పిల్లలైన మీరు నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకున్నారు. అర్థం చేయించడములో కూడా శ్రమ ఉంది. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. రోజురోజుకు వృద్ధి జరుగుతూ ఉంటుంది, కావున ఇల్లు కూడా అంత పెద్దది కావాలి. ఎంతోమంది పిల్లలు వస్తారు ఎందుకంటే ఇప్పుడు తండ్రి అయితే ఎక్కడికీ వెళ్ళరు. ఇంతకుముందైతే ఎవ్వరూ పిలవకుండా కూడా తండ్రి తమకు తామే వెళ్ళేవారు. ఇప్పుడైతే పిల్లలు ఇక్కడకు వస్తూ ఉంటారు. చలిలో కూడా రావలసి ఉంటుంది. ప్రోగ్రామ్ తయారుచేయవలసి ఉంటుంది. ఫలానా-ఫలానా సమయాలలో రండి అని చెప్పాలి, అప్పుడు గుంపుగా రారు. అందరూ కలిసి ఒకే సమయములోనైతే రాలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలు చిన్న-చిన్న ఇళ్ళను నిర్మిస్తారు, అక్కడైతే ఎన్నో మహళ్ళు లభిస్తాయి. ధనమంతా మట్టిలో కలిసిపోతుందని పిల్లలైన మీకు తెలుసు. చాలామంది గోతులు తవ్వి అందులో పెడతారు. ఆ తర్వాత దొంగలైనా దోచుకుంటారు లేకపోతే గోతుల్లోనే అలా ఉండిపోతాయి, మళ్ళీ పొలాలు దున్నే సమయంలో ధనం బయటపడుతుంది. ఇప్పుడు వినాశనం జరుగుతుంది, అంతా పూడుకుపోతుంది. మళ్ళీ అక్కడ అంతా కొత్తగా లభిస్తుంది. ఇలాంటి రాజుల కోటలు ఎన్నో ఉన్నాయి, అక్కడ ఎంతో సామాను పూడ్చిపెట్టి ఉంది. పెద్ద-పెద్ద వజ్రాలు కూడా బయటపడతాయి, అప్పుడు వేలల్లో, లక్షల్లో సంపాదన జరుగుతుంది. అలాగని మీరు స్వర్గములో ఇలా తవ్వి వజ్రాలు మొదలైనవి తీస్తారని కాదు. అక్కడైతే ప్రతి వస్తువు యొక్క గనులు మొదలైనవన్నీ కొత్తగా నిండి ఉంటాయి. ఇక్కడ బీడుభూములు ఉన్నాయి, వాటిలో శక్తి లేదు. బీజాలు ఏవైతే నాటుతారో వాటిలో అంతటి శక్తి లేదు. చెత్తాచెదారము, అశుద్ధమైన వస్తువులు అన్నీ వేస్తారు. అక్కడైతే అశుద్ధమైన వస్తువు అన్న మాటే ఉండదు. అక్కడ ప్రతీది కొత్తదే. స్వర్గ సాక్షాత్కారాలు కూడా కుమార్తెలు చూసి వస్తారు. అక్కడి సౌందర్యమే ప్రకృతి సిద్ధమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆ ప్రపంచములోకి వెళ్ళే పురుషార్థము చేస్తున్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ సమయములోనే తండ్రి సమానముగా పర్ఫెక్ట్ గా అయి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి యొక్క శిక్షణలన్నింటినీ స్వయంలో ధారణ చేసి వారి సమానముగా జ్ఞానసాగరులుగా, శాంతి-సుఖ సాగరులుగా అవ్వాలి.

2. బుద్ధిని పారసముగా చేసుకునేందుకు చదువుపై పూర్తి ధ్యాసను ఉంచాలి. నిశ్చయబుద్ధి కలవారిగా అయి మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షను పాస్ అవ్వాలి.

వరదానము:-

నిశ్చిత విజయము యొక్క నషాలో ఉంటూ తండ్రి నుండి పదమాల రెట్ల సహాయాన్ని ప్రాప్తి చేసుకునే మాయాజీత్ భవ

తండ్రి యొక్క పదమాల రెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు మాయ దాడులకు ఛాలెంజ్ చేస్తారు - నీ పని రావటము మరియు మా పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవటము. వారు మాయ యొక్క సింహము రూపాన్ని చీమలా భావిస్తారు ఎందుకంటే వారికి తెలుసు - ఈ మాయా రాజ్యము ఇప్పుడు అంతమయ్యేదే ఉంది, అనేక సార్లు విజయులుగా అయిన విజయీ ఆత్మలైన మా విజయము 100 శాతము నిశ్చితము. నిశ్చితము అన్న ఈ నషా తండ్రి నుండి పదమాల రెట్ల సహాయము యొక్క అధికారాన్ని ప్రాప్తి చేయిస్తుంది. ఈ నషాతో సహజముగానే మాయాజీతులుగా అవుతారు.

స్లోగన్:-

సంకల్ప శక్తిని జమ చేసుకుని స్వయము కొరకు మరియు విశ్వము కొరకు దానిని ప్రయోగము చెయ్యండి.