26-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 02.02.2011


‘‘తమ భాగ్యాన్ని మరియు ప్రాప్తులను స్మృతిలో ఉంచుకుని సదా హర్షితముగా మరియు సంతుష్టముగా ఉండండి, దృష్టి, వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టతను అనుభవము చేయించండి’’

ఈ రోజు బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పరమాత్ముని ప్రేమ ద్వారా చేరుకున్నారు. ఈ రోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకములో భాగ్య రేఖలను చూస్తున్నారు. ఇటువంటి భాగ్యము మరియు ఇంత పెద్ద భాగ్యము పూర్తి కల్పములో మరెవ్వరికీ ప్రాప్తించలేదు ఎందుకంటే మీకు భాగ్యాన్ని ఇచ్చేది స్వయంగా భాగ్య దాత. ముందుగా ప్రతి ఒక్కరి మస్తకములో మెరుస్తున్న భాగ్య సితార మెరుస్తుంది. నోటిపై మధుర వాణి యొక్క రేఖ మెరుస్తుంది. పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తుంది. హృదయములో హృదయాభిరాముడైన బాబా ప్రేమలో లవలీనమైన రేఖ మెరుస్తుంది. చేతులలో సర్వ ఖజానాల శ్రేష్ఠతా రేఖ మెరుస్తుంది. పాదాలలో ప్రతి అడుగులోనూ పదమాల రేఖ మెరుస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇటువంటి భాగ్యము ఇంకెవరికైనా లభించిందా! అందుకే మీ స్మృతిచిహ్న చిత్రాలలో కూడా భాగ్యాన్ని వర్ణించడము జరుగుతుంది. అంతేకాక ఈ భాగ్యాన్ని స్వయంగా భాగ్యవిధాత తమ పిల్లలందరికీ తయారుచేసారు.

బాప్ దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూసి పిల్లలు ప్రతి ఒక్కరికీ అభినందనలను తెలియజేస్తున్నారు - వాహ్ పిల్లలూ వాహ్! మరియు ఈ భాగ్యము ఈ సంగమయుగములోనే లభిస్తుంది మరియు నడుస్తుంది. సంగమయుగపు సుఖము అన్ని యుగాలలో కల్లా శ్రేష్ఠమైనది. సత్యయుగ భాగ్యము కూడా సంగమములోని పురుషార్థానికి ప్రారబ్ధమే. అందుకే సంగమయుగ ప్రాప్తి సత్యయుగ ప్రారబ్ధము కన్నా ఎక్కువ. మీ భాగ్యములో మైమరిచిపోండి. ఏమి జరుగుతున్నా సరే మీ భాగ్యాన్ని స్మృతిలోకి తెచ్చుకున్నట్లయితే ఏమని వెలువడుతుంది? వాహ్ నా భాగ్యము! ఎందుకంటే స్వయంగా భాగ్య దాత మీ తండ్రి. మరి భాగ్య దాత ద్వారా ప్రతి ఒక్కరికీ తమ భాగ్యము లభించింది. మేము ఇంతటి భాగ్యవంతులము అని తెలుసా లేక అప్పుడప్పుడూ తెలుస్తుందా, సదా నషా ఉంటుందా? మీకు ఏమి లభించింది అని ప్రపంచములోని వారు మిమ్మల్ని చూసి అడుగుతారు. అప్పుడు మీరు ఏమని జవాబు ఇస్తారు? ఏదైతే పొందాలో, అది పొందేసాము అని అంటారు. పొందేసారు కదా, చేతులెత్తండి. పొందేసారా, మంచిది. పొందారా? గర్వముగా చెప్తారు కదా, ఎటువంటి అప్రాప్తి అనే వస్తువే లేదు, ఉంది కదా నషా? మరి అది లభించింది ఎలా? కేవలం బాబాను తెలుసుకున్నారు, ఒప్పుకున్నారు, తమవారిగా చేసుకున్నారు, ఇక భాగ్యము లభించింది. ఈ భాగ్యాన్ని ఎంతగా స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉంటారో, అంతగా హర్షితముగా అవుతూ ఉంటారు. భాగ్యశాలి ఆత్మ యొక్క ముఖము సదా హర్షితముగా ఉంటుంది. ఉంటుంది కాదు, అది ఎప్పుడూ అలానే ఉంటుంది. వారి దృష్టి, వారి వృత్తి మరియు వారి ప్రవృత్తి ద్వారా సదా సంతుష్ట ఆత్మగా అయ్యి స్వయం కూడా సంతుష్టముగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టముగా చేస్తారు. మరి మీ అందరికీ సంతుష్టత యొక్క నషా ఉంటుందా? ఎందుకంటే సంతుష్టతకు ఆధారము సర్వ ప్రాప్తులు. అప్రాప్తి అసంతుష్టతకు ఆధారము. మరి మీరు ఏమి అనుభవం చేస్తున్నారు? అప్రాప్తి అనే వస్తువు ఏదైనా ఉందా లేక సర్వ ప్రాప్తులు ఉన్నాయా? ప్రాప్తి యొక్క నషా ఉందా? ఉందా, సదా ఉందా లేక అప్పుడప్పుడూ ఉందా? ఆ మాటకొస్తే - పొందాల్సిందేదో పొందేసాము అనే అంటారు కదా. మరి ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో, అక్కడ అసంతుష్టత నామమాత్రముగా కూడా ఉండదు.

బాప్ దాదా ఈ రోజు దేశ-విదేశాల నుండి, ఎన్ని దేశాల నుండి పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు, కానీ అందరికన్నా దూరం నుండి వచ్చేది ఎవరు? అమెరికా వారు దూరం నుండి వచ్చారా? అమెరికా వారు దూరం నుండి వచ్చారు కదా! మరి బాబా ఎక్కడి నుండి వచ్చారు? అమెరికా అయితే ఈ లోకములోనే ఉంది, కానీ బాప్ దాదా ఎక్కడి నుండి వచ్చారు? పరంధామము నుండి. బ్రహ్మాబాబా కూడా సూక్ష్మవతనము నుండి వచ్చారు. మరి ఎవరు దూరం నుండి వచ్చినట్లు? అందరికంటే దూరం నుండి వచ్చినవారు ఎవరు? ఇది తండ్రి మరియు పిల్లల ప్రేమ యొక్క దృశ్యము. మీరు ‘నా బాబా’ అని అన్నారు మరియు బాబా ‘నా పిల్లలు’ అని అన్నారు. కేవలం ఒక్కరిని తెలుసుకోవడము వలన ఎంత వారసత్వము లభించింది. ప్రపంచము వారు - ఎక్కడ శాంతి లభిస్తుంది, ఎక్కడ సుఖము లభిస్తుంది అని సుఖము కోసం, శాంతి కోసం వెతుకుతున్నారు. కానీ మీకైతే జీవితమే సుఖ-శాంతుల సంపన్నముగా అయిపోయింది. బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు, అని బాప్ దాదాను అడుగుతారు కదా. బాప్ దాదా ప్రతి బిడ్డ నుండి ఇదే కోరుకుంటున్నారు - ప్రతి బిడ్డ సదా స్వరాజ్య అధికారిగా అయి ఉండాలి, ‘అప్పుడప్పుడూ’ కాదు, ఎందుకంటే ఇప్పటి స్వరాజ్య అధికారపు వరదానము బాబా ఈ సంగమయుగములో పూర్తిగా ఇచ్చారు. కొద్దిగా కాదు, అప్పుడప్పుడూ కాదు, సదా. మరి ఆలోచించండి, సదా కోసం స్వరాజ్య అధికారిగా అయ్యి ఉంటున్నారా? ఎందుకంటే బాప్ దాదా వినిపించి ఉన్నారు - మీరు ఈ కర్మేంద్రియాలన్నింటికీ, మనసు-బుద్ధి-సంస్కారాలకు కూడా యజమాని. అన్నిటికీ ‘నాది’ అన్న పదాన్ని ఉపయోగిస్తారు, ‘నేను’ అని అనరు, ‘నాది’ అని అంటారు. కావున మనసు, బుద్ధి, సంస్కారాలు నావి. నావి అనేవాటిపై సదా అధికారము ఉంటుంది. ఇలా మనసు, బుద్ధి, సంస్కారాలపై పూర్తిగా అధికారము ఉండాలి, అలా ఉండేవారిని స్వరాజ్యధారీ అని అంటారు. ఏది ఆర్డర్ చేస్తే, దాని అనుసారముగానే అవి కార్యము చెయ్యడానికి నిమిత్తముగా ఉన్నాయి. కానీ దాని కోసం నడుస్తూ, తిరుగుతూ, కార్యము చేస్తూ యజమానత్వపు నషా ఉండాలి. నిశ్చయము మరియు నషా.

ఇప్పుడైతే ఆత్మలకు మనసా ద్వారా కూడా సేవ చేసే సమయము ఇది. ఓ పూర్వజులారా, మాకు కొద్దిగా సుఖ-శాంతుల కిరణాలను అందించండి అని మొరపెట్టుకుంటూ ఉన్నారు. కావున ఓ పూర్వజులారా, దుఃఖములో ఉన్నవారి మొర వినిపిస్తుంది కదా! ఎటువంటి ఆపద అయినా అకస్మాత్తుగా వచ్చేదుంది అని బాప్ దాదా ముందుగానే సూచనను ఇచ్చి ఉన్నారు, దాని కోసం సెకండులో ఫుల్ స్టాప్. ఆ అభ్యాసాన్ని కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆ సమయములో పురుషార్థానికి సమయము ఉండదు. అభ్యాసము చేసి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే ఆశ్చర్యార్థకము వస్తుంది, అందుకే పురుషార్థానికి సమయము ఇప్పుడే లభించి ఉంది. ఆ సమయములో ప్రాక్టికల్ గా చేయవలసి ఉంటుంది, అందుకే ఇప్పటినుండే ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉన్నారు కూడా. బాప్ దాదా రిజల్టు చూస్తున్నారు, అటెన్షన్ లో ఉన్నారు, చేస్తున్నారు కూడా, కానీ అటెన్షన్ ను మరింత అండర్ లైన్ చేయండి. చూడండి, పురుషార్థము ఎంత సహజమైనది! నేను కూడా బిందువునే, పెట్టవలసింది కూడా బిందువే, కేవలం అటెన్షన్ ఇవ్వాలి.

బాప్ దాదా విశేషముగా పిల్లలకు కానుకను ఇస్తున్నారు, అదేమిటంటే - పిల్లలూ, నేను సదా మీకు తోడుగా ఉన్నాను. బాబా అని అనగానే పిల్లల కోసం బాబా సదా హాజరై ఉంటారు. హజూర్ హాజరై ఉన్నారు అని ఏదైతే అంటారో, దాని అర్థం వారు సర్వవ్యాపి అని కాదు, కానీ పిల్లల ఎదుట హజూర్ హాజరై ఉన్నారు. మరి సదా విజయులుగా అవ్వండి, ఎక్కడైతే భగవంతుడు తోడుగా ఉంటారో, అక్కడ విజయులుగా అవ్వడము ఏమంత కష్టము. విజయము మీ జన్మ సిద్ధ అధికారము. కేవలం ‘నా బాబా’ అని అన్నారంటే, విజయులుగా ఉన్నట్లే. అందుకే, సదా విజయులుగా అవ్వండి, ఎవరైతే స్మృతిలో ఉంటారో వారికి సదా విజయులుగా అవ్వడము అతి సహజము. కష్టము కాదు. ఎక్కడైతే భగవంతుడు ఉంటారో, అక్కడ విజయము ఉండనే ఉంది. ఈ రోజు బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు, ఎంతో స్నేహముతో, ఏ సాధనముతో చేరుకున్నారు? ట్రైన్ లోనా లేక విమానములోనా? అది శరీరము ద్వారా చేరుకోవడము కానీ హృదయపూర్వకమైన ప్రేమ మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది. ధైర్యము మీది ఉన్నట్లయితే, బాబా సహాయము ఉండనే ఉంది. ఇప్పుడు బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ప్రతి బిడ్డ ప్రతి కర్మలో తమ స్వరాజ్యమనే సీట్ పై సెట్ అవ్వాలి.

ఈ రోజు మొదటిసారిగా ఎవరైతే వచ్చారో, వారు చేతులెత్తండి. లేచి నిలబడండి. చాలామంది ఉన్నారు. అచ్ఛా, మొదటిసారి వచ్చినట్లుగా మొదటి నంబరులోకి కూడా వెళ్ళాలి కదా. వెళ్ళాలా? బాబా వరదానము ఏమిటంటే - ఎవరైతే ధైర్యమును ఉంచుతారో, వారికి తండ్రి సహాయము కూడా లభిస్తుంది మరియు ధైర్యముతో ఎంతగా ముందుకు వెళ్ళాలనుకుంటే దానికి అవకాశము ఉంది, ఎందుకంటే టూ లేట్ బోర్డును ఇంకా పెట్టలేదు. స్మృతిలో ఉండండి మరియు ఏదైతే ప్రాప్తించిందో, దానితో ఇతరుల సేవను చేయండి. ఎంతగా సేవ చేస్తారో, అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి, ఇక ఆ తర్వాత ఎవరి అదృష్టము వారిది. కానీ మీరు సందేశాన్ని ఇవ్వండి. మీ పుణ్యాన్ని జమ చేసుకుంటూ ఉండండి. ఆ పుణ్యము మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. అచ్ఛా!

బాప్ దాదా అమృతవేళ అన్ని వైపులకు వెళ్తూ ఉంటారు, వారికి అన్ని వైపులకు వెళ్ళడము ఏమంత పెద్ద విషయము. బాప్ దాదా ఇది కూడా చెప్పారు - అమృతవేళ నాలుగు గంటల సమయములో చేసుకునే మిలనము యొక్క విశేషత ఏమిటంటే, 4 గంటలకు బాప్ దాదా పిల్లలందరికీ సహజముగా వరదానాలను ఇస్తారు. వరదానాల దాత యొక్క విశేషమైన పాత్ర అమృతవేళ ఉంటుంది. ఏ వరదానము కావాలన్నా అది బాప్ దాదా ఇచ్చేస్తారు. ట్రయల్ వేసి చూడండి. కానీ మీరందరూ కూడా వరదానాలు తీసుకోవడానికి అలర్ట్ గా ఉండండి. ఒకవేళ అలర్ట్ గా లేకపోతే బాప్ దాదా వచ్చి వెళ్ళిపోతారు మరియు మీరు ఆలోచిస్తూ ఉండిపోతారు. అందుకే అమృతవేళకు మహత్వాన్ని అయితే ఇస్తున్నారు, కానీ మరింత అటెన్షన్ పెట్టండి. బాప్ దాదా ఏమి చూసారంటే, సమయమనుసారముగా సేవ కూడా పెరుగుతుంది కానీ సేవ కారణముగా బాబా నుండి వరదానాలను తీసుకోవడములో దూరం కావడానికి వీల్లేదు. ఇకపోతే, డబుల్ విదేశీయులు మెజారిటీ పురుషార్థము చేస్తారు కూడా. అయినా కానీ, అటెన్షన్ ను అండర్ లైన్ చేయండి. అంతేకాక, మధుబన్ కు ఎలా అయినా సరే చేరుకుంటారు, దాని కోసం బాప్ దాదా విశేషముగా పిల్లలందరికీ అభినందనలను తెలియజేస్తున్నారు. బాప్ దాదా ఏమి విన్నారంటే - సంస్కారాల విషయములో బాప్ దాదా ఏదైతే సూచనను ఇచ్చారో, ఆ విషయములో పిల్లలు ఏమని భావిస్తున్నారంటే - మేమైతే చెయ్యవలసిందే. అది చెయ్యడానికి, ప్రతిరోజూ అమృతవేళలో ఏదైతే స్వమానము పెట్టుకుంటారో, దానితో పాటుగా ఏదైనా ఒక సంస్కారముపై భిన్న-భిన్న విధాలుగా అటెన్షన్ పెట్టండి, ఈ రోజున ఫలానా సంస్కారముపై విశేషమైన అటెన్షన్ పెట్టాలి, మళ్ళీ రాత్రి పడుకునే ముందు బాప్ దాదాకు తమ రోజంతటి చార్టును ఇచ్చేటప్పుడు ఆ సమయములో ఆ సంస్కారము యొక్క రిజల్టును కూడా విశేషముగా వినిపించండి, అప్పుడు విశేషమైన అటెన్షన్ ఉంటుంది. ఏదో ఒక సంస్కారముపై అటెన్షన్ ఉంచాలి. ఎలా అయితే స్మృతి పట్ల అటెన్షన్ ఉంచుతారో, దానితో పాటుగా అదే సమయములో ఈ రిజల్టును కూడా బాప్ దాదాకు ఇవ్వండి. ఒకవేళ మీరు అనుకున్నా కానీ, ఆ రోజు మీ ఎదురుగా ఆ సంస్కారాన్ని తొలగించుకోవాల్సిన పని ఏమీ రాలేదంటే, బాబా తరఫున మీకు మీరే అభినందనలు తెలుపుకోండి. ఇలా ప్రతిరోజూ ఆ సంస్కారము గురించి బాబా నుండి విశేషమైన అభినందనలను తీసుకుంటూ ఉండండి, అప్పుడు ఆ సంస్కారము కార్యములోకి రావడములో బలహీనమవుతూ ఉంటుంది. ఎలా అయితే యోగము విషయములో చెక్ చేసుకుంటారో, అలాగే సంస్కారాల విషయములో కూడా చెక్ చేసుకోండి. సంస్కారాలు రోజూ రావు, అప్పుడప్పుడూ వస్తాయి. ఎవరైతే పురుషార్థీలు ఉంటారో, వారికి అనుకోకుండా పేపరు వస్తుంది. అంతేకానీ రోజూ రాదు. కానీ చెకింగ్ ప్రతిరోజు జరుగుతూ ఉంటే, ఆ అటెన్షన్ కూడా టెన్షన్ ను సమాప్తము చేస్తూ ఉంటుంది, ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే, విదేశీయులలో కూడా కొంతమంది పిల్లలు ఏదైనా కార్యము ప్రారంభించే ముందు అటెన్షన్ ను ఉంచుతారు. అటెన్షన్ ఉంచేవారే ముక్తిని పొందగలరు. బాబా వరదానము కూడా ఉంది. అర్థమైందా! ఇప్పుడు ఈ పని వెనుక ఉన్నట్లయితే, రోజూ రిజల్టును చెక్ చేసుకున్నట్లయితే, ఇక ఆ సంస్కారము స్వయమే ఢీలా పడిపోతుంది. మరియు బాప్ దాదా ఏదైతే కోరుకుంటున్నారో, సంస్కారాల సబ్జెక్టులో నంబర్ వన్ లోకి వెళ్ళాలి అని, ఏ సంస్కారము కావాలంటే అదే కార్యములోకి రావాలి, అది జరిగిపోతుంది. అటెన్షన్ లోకి వచ్చారు కదా, ఇక అయిపోతుంది. కానీ ఊరికే అలా అయిపోదు, అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. సంగఠనలోనే ఈ సంస్కారాలు బయటకు వస్తాయి, ఎందుకని? మీ చిత్రాలను ఎవరైతే పూజిస్తారో, వారు మీ సంస్కారాల గురించి ఎంత మంచిగా పాడుతారు. అంటే మీరు అలా అయ్యారు కావుననే వర్ణిస్తున్నారు కదా. తమ దైవీ చిత్రాన్ని ఇమర్జ్ చేసుకోండి, ఏమని పాడుతూ ఉంటారు? మరి అటువంటి దేవతగా అవ్వవలసిందే కదా. అచ్ఛా!

ఇకపోతే డబుల్ విదేశీయులందరూ పురుషార్థములో సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు కదా! చేస్తున్నారా? సఫలతను అనుభవం చేస్తున్నాము అని భావించేవారు చేతులెత్తండి. వాహ్! చేతులైతే మంచిగా ఎత్తుతున్నారు. ఇప్పుడు లక్ష్యము పెట్టుకోండి - దీనిపై అటెన్షన్ పెట్టవలసిందే. ఇందులో కూడా నంబరు తీసుకోవలసిందే. మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా ఉల్లాసము వస్తుంది, ఎందుకంటే మీరు నిమిత్తులు కదా. అంతేకాక, నిమిత్తముగా ఉన్నవారికి బాప్ దాదా యొక్క విశేషమైన సహాయము కూడా లభిస్తుంది. ఇకపోతే, సెంటర్లు వృద్ధి చెందుతూ ఉన్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. పురుషార్థము వైపు అటెన్షన్ ఉంది, కానీ ఇప్పుడు పరివర్తనకు నిమిత్తము అయ్యేవారిగా అవ్వండి, అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా పరివర్తన శక్తి యొక్క ఉల్లాసము కలుగుతుంది. ఇకపోతే బాప్ దాదా సంతోషిస్తున్నారు, పురుషార్థములో నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు, అది తెలిసిన విషయమే, కానీ పురుషార్థము వైపు అటెన్షన్ ఉంది, కానీ మరింత పెంచాలి. బాప్ దాదా తరఫు నుండైతే రోజూ ప్రియస్మృతులు లభిస్తూనే ఉంటాయి. చూడండి, ఇంటిలో కూర్చుని కూడా బాప్ దాదా ప్రియస్మృతులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వవు, ఒకవేళ రోజు విధి పూర్వకముగా మురళిని చదివినట్లయితే, ఒక్క రోజు కూడా ప్రియస్మృతులు మిస్ అవ్వరు. లభిస్తున్నాయి కదా! లభిస్తున్నాయా? రోజూ ప్రియస్మృతులు లభిస్తున్నాయి. అందరికీ లభిస్తున్నాయి కదా? ఇదే బాప్ దాదా ప్రేమకు గుర్తు. మురళిని మిస్ అయితే ప్రియస్మృతులను మిస్ అయినట్లే. కేవలం మురళిని మిస్ చేసినట్లు కాదు, బాప్ దాదా యొక్క ప్రియస్మృతులను, వరదానాలను, అన్నింటినీ మిస్ చేసినట్లు. మురళిని అయితే చదివేసుకుంటారు, కానీ బాప్ దాదా యొక్క ప్రియస్మృతులను తీసుకోవడానికి ఏ సమయమైతే ఫిక్స్ అయి ఉందో, అదైతే మిస్ అయినట్లే. కావున ఉల్లాసము ఉన్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా, మురళిని మిస్ చేస్తూ ఉంటారా? డబుల్ విదేశీయులలో ఉన్నారా? మురళిని మిస్ చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఏదైనా కారణము చేత మిస్ చేస్తుంటారా? లేదా? మిస్ చేయరా? ఒక్కరు చేయి ఎత్తారు. ఇప్పుడిక మిస్ చేయకండి, మురళిని మిస్ చేయకండి. కావాలంటే ఫోన్ ద్వారా వినండి. చదవలేకపోతే ఎలాగైనా సరే వినండి. హాజరు తప్పకుండా వేయించుకోండి. అచ్ఛా. ఇకపోతే, సభలో ఎవరైతే వచ్చారో, కొత్తవారు కూడా ఉన్నారు, పాతవారు కూడా ఉన్నారు, ఈ విషయాన్ని పక్కా పక్కా పక్కా నోట్ చేసుకోండి - మురళిని మిస్ అవ్వకూడదు. ఎందుకంటే బాబా రోజూ పరంధామము నుండి వస్తారు, ఎంత దూరం నుండి వస్తారు, పిల్లల కోసం వస్తారు కదా! ఎలా అయితే బాబా మురళిని మిస్ చేయరో, అలాగే పిల్లలు కూడా మురళిని మిస్ చేయకూడదు. అచ్ఛా!

ఇప్పుడు మధుబన్ కు వస్తారు కదా, అప్పుడు ఫారం నింపుతారు కదా, అందులో ఇది కూడా వ్రాయండి - మురళిని రోజూ విన్నారా లేక ఎన్ని రోజులు మిస్ అయ్యారు? సమ్మతమేనా? ఎవరికైతే సమ్మతమో వారు చేతులెత్తండి. మధుబన్ వారు కూడా చేతులెత్తండి. ఏ కారణము చేత కూడా మురళిని మిస్ అవ్వకూడదు. ఎలా అయితే భోజనము మిస్ చెయ్యరో, అలాగే ఇది కూడా భోజనమే కదా. అది శరీరానికి భోజనమైతే ఇది ఆత్మకు భోజనము. మంచిగా అనిపించిందా. కొత్తగా వచ్చినవారు కూడా, రావడానికైతే అవకాశము లభించింది కదా, మీరు కూడా ఈ నియమాన్ని పాటించాలి. ఎలా అయితే ఇతర నియమాలు ఉన్నాయో, అలాగే ఇది కూడా ఒక నియమము. బ్రాహ్మణులు అంటేనే మురళిని వినేవారు, సేవను చేసేవారు. అచ్ఛా!

ఇప్పుడు అన్ని వైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులతో పాటు అభినందనలను కూడా తెలియజేస్తున్నారు. సదా ఉల్లాస-ఉత్సాహాలలో ముందుకు వెళ్తున్నారు కూడా, మరింత వెళ్తూ ఉండండి. ఎప్పుడూ, ఏ కారణము వలన, ఏ విషయము వలన మీ ఉల్లాస-ఉత్సాహాలను తగ్గించుకోవద్దు. విషయము, విషయమే కానీ పురుషార్థము మరియు బాబా ప్రేమ మనవి. అందుకే ఎప్పుడూ కూడా మీ బుద్ధిని బాబాపై కాకుండా మరే విషయాలలోనూ బిజీగా ఉంచకండి. బాబా మరియు బాబా మురళి మరియు బాబా ద్వారా లభించిన సేవను చేస్తూ ఉండండి. అచ్ఛా! ఇప్పుడు ఏమని చెప్పమంటారు, తోడుగా అయితే ఉండవలసిందే కదా. అందుకే, సెలవు తీసుకుంటాను అని అయితే చెప్పలేను. కలిసే ఉంటాము, కలిసే వెళ్తాము మరియు కలిసే వస్తాము. అచ్ఛా. ఇప్పుడిక సమాప్తి.

వరదానము:-
శక్తి రూపపు స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనము చేసే కాళీ రూప భవ

సదా మీ ఈ స్వరూపము స్మృతిలో ఉండాలి - నేను సర్వ శస్త్రధారీ శక్తిని. పతిత-పావని అయిన నాపై ఏ పతిత ఆత్మ యొక్క దృష్టి రూపీ నీడ కూడా పడలేదు. పతిత ఆత్మలకు పతిత సంకల్పాలు కూడా నడవకూడదు - మీ బ్రేక్ అంత శక్తిశాలిగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా పతిత ఆత్మ యొక్క ప్రభావము పడింది అంటే, దాని అర్థం మీరు ప్రభావశాలిగా లేనట్లే. ఎవరైతే స్వయం సంహారులుగా ఉన్నారో, వారు ఎప్పుడూ ఎవరి చేతిలోనూ బలి అవ్వలేరు. కావున ఎటువంటి కాళీ రూపముగా అవ్వండి అంటే ఎవరైనా మీ ముందు అటువంటి సంకల్పాలను చేసినా సరే, వారి సంకల్పాలు మూర్ఛితమైపోవాలి.

స్లోగన్:-
రాయల్ రూపములోని కోరికల యొక్క స్వరూపము ఏమిటంటే - పేరు, ప్రతిష్ఠ మరియు గౌరవము.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

సారథి అనగా ఆత్మాభిమాని ఎందుకంటే ఆత్మయే సారథి. బ్రహ్మాబాబా ఈ విధి ద్వారా నంబర్ వన్ యొక్క సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు. కావున ఫాలో ఫాదర్ చేయండి. ఎలా అయితే బాబా దేహాన్ని ఆధీనము చేసుకుని ప్రవేశిస్తారో అనగా సారథిగా అవుతారో, దేహానికి ఆధీనులవ్వరో, అందుకే అతీతముగా మరియు ప్రియముగా ఉంటారో, అలాగే బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ కూడా బాబా సమానముగా సారథి స్థితిలో ఉండండి. సారథి స్వతహాగానే సాక్షీగా అయ్యి ఏదైనా చేస్తారు, చూస్తారు, వింటారు మరియు మిగిలినవన్నీ చేస్తూ కూడా మాయ యొక్క కర్మల ప్రభావము నుండి నిర్లిప్తముగా ఉంటారు.