ఓంశాంతి
తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు, వారు ఎటువంటి తండ్రి, ఆ తండ్రి
మహిమను పిల్లలైన మీరు చేయాలి. సత్య శివబాబా, సత్య శివ టీచరు, సత్య శివ గురు అని
గాయనం కూడా చేస్తారు. సత్యమైనవారు వారే కదా. మనకు సత్యమైన శివబాబా లభించారని
పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మనము ఇప్పుడు శ్రీమతంపై ఏకమతం కలవారిగా అవుతున్నాము.
కావున శ్రీమతంపై నడవాలి కదా. తండ్రి అంటారు - ఒకటేమో, దేహీ-అభిమానులుగా అవ్వండి
మరియు తండ్రిని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా తమ కళ్యాణాన్ని
చేసుకుంటారు. మీరు మీ రాజధానిని మళ్ళీ స్థాపన చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మన
రాజధాని ఉండేది. దేవీ-దేవతా ధర్మానికి చెందిన మనమే 84 జన్మలు అనుభవించి, అంతిమ
జన్మలో ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము. ఈ పురుషోత్తమ సంగమయుగము గురించి పిల్లలైన మీకు
తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. బాబా ఎన్ని పాయింట్లు ఇస్తారు - పిల్లలూ, ఒకవేళ మంచి
రీతిలో స్మృతిలో ఉన్నట్లయితే చాలా సంతోషంగా ఉంటారు. కానీ తండ్రిని స్మృతి చేసేందుకు
బదులుగా ఇతర ప్రాపంచిక విషయాలలో పడిపోతారు. మనము శ్రీమతంపై మన రాజ్యాన్ని స్థాపన
చేస్తున్నామని గుర్తుండాలి. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు అని, వారిదే ఉన్నతోన్నతమైన
శ్రీమతము అని గాయనం కూడా ఉంది. శ్రీమతము ఏం నేర్పిస్తుంది? సహజ రాజయోగము. రాజ్యము
కోసం చదివిస్తున్నారు. మన తండ్రి ద్వారా సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకుని దైవీ
గుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రిని ఎప్పుడూ ఎదిరించకూడదు. చాలా మంది పిల్లలు
స్వయాన్ని సర్వీసబుల్ గా భావించి అహంకారములోకి వచ్చేస్తారు. ఇటువంటివారు చాలామంది
ఉంటారు. అక్కడక్కడా ఓడిపోయేటప్పటికి నషాయే దూరమైపోతుంది. మాతలైన మీరు చదువుకోలేదు.
చదువుకుని ఉండి ఉంటే అద్భుతము చేసి చూపించేవారు. పురుషులలో కొంతమంది చదువుకున్నవారు
ఉన్నారు. కుమారీలైన మీరు పేరును ఎంతగా ప్రసిద్ధము చేయాలి. మీరు శ్రీమతంపై రాజ్యాన్ని
స్థాపన చేశారు. నారి నుండి లక్ష్మిగా తయారయ్యారంటే ఎంత నషా ఉండాలి. ఈ ప్రపంచంలో
చూడండి, చాలా తక్కువ విలువ చేసే చదువు కోసం ప్రాణాలనే అర్పిస్తున్నారు. అరే, మీరు
తెల్లగా అవుతున్నారు, మళ్ళీ నలుపు, తమోప్రధానత వైపు ఎందుకు మనసు పెట్టుకుంటున్నారు.
ఈ స్మశానము పట్ల మనసు పెట్టుకోకూడదు. మనము తండ్రి నుండి వారసత్వాన్ని
తీసుకుంటున్నాము. పాత ప్రపంచముపై మనసు పెట్టుకోవడం అంటే నరకములోకి వెళ్ళడము. తండ్రి
వచ్చి నరకము నుండి రక్షిస్తారు, మళ్ళీ నరకము వైపుకు ముఖాన్ని ఎందుకు తిప్పుతారు. మీ
ఈ చదువు ఎంత సహజమైనది. దీని గురించి ఋషులు-మునులు ఎవరికీ తెలియదు. ఏ టీచరు కానీ,
ఋషులు-మునులు కానీ ఎవ్వరూ అర్థము చేయించలేరు. వీరు తండ్రి-టీచరు-గురువు కూడా. ఆ
గురువులు శాస్త్రాలు వినిపిస్తారు. వారిని టీచర్ అని అనరు. వారేమీ - మేము ప్రపంచ
చరిత్ర-భూగోళాలను వినిపిస్తాము అని అనరు. వారు శాస్త్రాల విషయాలనే వినిపిస్తారు.
తండ్రి మీకు శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు, అలాగే ప్రపంచ చరిత్ర-భూగోళాల
గురించి కూడా తెలియపరుస్తారు. ఇప్పుడు ఈ టీచరు మంచివారా లేక ఆ టీచరు మంచివారా? ఆ
టీచర్ నుండి మీరు ఎంత చదివినా సరే, ఎంత సంపాదిస్తారు? అది కూడా మీ భాగ్యంపై ఆధారపడి
ఉంది. చదువుకుంటూ-చదువుకుంటూ ఏదైనా యాక్సిడెంట్ జరిగి మరణిస్తే, ఇక చదువు
సమాప్తమైపోతుంది. ఇక్కడ మీరు ఈ చదువును ఎంత చదివినా, ఇది వ్యర్థంగా పోదు. ఒకవేళ
శ్రీమతంపై నడవకుండా ఏదైనా తప్పుడు నడవడిక నడుచుకున్నట్లయితే లేదా వెళ్ళి మురికిలో
పడిపోతే, అప్పుడు చదివినది పూర్తిగా అయితే వ్యర్థంగా పోతుందని కాదు, ఈ చదువు 21
జన్మల కోసము. కానీ పడిపోవడంతో కల్ప-కల్పాంతరాలకు చాలా-చాలా నష్టము కలుగుతుంది.
తండ్రి అంటారు - పిల్లలూ, నల్ల ముఖం చేసుకోకండి. చాలామంది ఈ విధంగా నల్ల ముఖం
చేసుకుని, ఛీ-ఛీ గా అయి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. వారికి ఈ జ్ఞానము ఎప్పుడూ జీర్ణం
కాదు. అసలు జీర్ణమవ్వదు. ఏది విన్నా జీర్ణం కాదు, అప్పుడు నోటితో ఎవరికీ కూడా -
భగవానువాచ, కామము మహాశత్రువు, దానిపై విజయం పొందాలి అని చెప్పలేరు. స్వయమే విజయం
పొందకపోతే ఇతరులకు ఎలా చెప్తారు! లోపల తింటూ ఉంటుంది కదా! వారిని ఆసురీ సంప్రదాయం
కలవారని అంటారు, అమృతము తాగుతూ-తాగుతూ విషము తాగినట్లయితే 100 రెట్లు నల్లగా
అయిపోతారు. ఎముక-ఎముక విరిగిపోతుంది.
మాతలైన మీ సంగఠన చాలా బాగుండాలి. లక్ష్యం-ఉద్దేశ్యం అయితే ఎదురుగా ఉంది. మీకు
తెలుసు - ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యములో ఒకే దేవీ-దేవతా ధర్మముండేది. ఒకే రాజ్యము,
ఒకే భాష, 100 శాతము పవిత్రత, శాంతి, సంపదలు ఉండేవి. ఆ ఒక్క రాజ్యాన్నే తండ్రి
ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. ఇదే లక్ష్యము-ఉద్దేశ్యము. 100 శాతము పవిత్రత, సుఖము,
శాంతి, సంపదలు ఇప్పుడు స్థాపనవుతున్నాయి. వినాశనము తర్వాత శ్రీకృష్ణుడు వస్తున్నారని
మీరు చూపిస్తారు. దీనిని స్పష్టంగా రాయాలి. సత్యయుగములో ఒకే దేవీ-దేవతల రాజ్యము, ఒకే
భాష, పవిత్రత, సుఖము, శాంతి మళ్ళీ స్థాపనవుతున్నాయి. గవర్నమెంట్ ఇదే కోరుకుంటుంది
కదా. సత్య-త్రేతాయుగాలలో మాత్రమే స్వర్గముంటుంది. కానీ మనుష్యులు స్వయాన్ని
నరకవాసులుగా ఏమీ భావించరు. ద్వాపర-కలియుగాలలో అందరూ నరకవాసులేనని మీరు వ్రాయవచ్చు.
ఇప్పుడు మీరు సంగమయుగవాసులు. ఇంతకుముందు మీరు కూడా కలియుగీ నరకవాసులుగా ఉండేవారు,
ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. శ్రీమతంపై భారత్ ను స్వర్గంగా
తయారుచేస్తున్నారు. కానీ ఆ ధైర్యము, సంగఠన ఉండాలి. తిరిగేందుకు వెళ్ళినప్పుడు ఈ
లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఇది బాగుంది. ఇందులో -
త్రిమూర్తి శివబాబా శ్రీమతంపై ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము, సుఖ-శాంతుల రాజ్యము
స్థాపనవుతుందని వ్రాయండి. ఈ విధంగా పెద్ద-పెద్ద పదాలతో పెద్ద-పెద్ద చిత్రాలుండాలి.
చిన్న పిల్లలు చిన్న చిత్రాలను ఇష్టపడతారు. అరే, చిత్రాలు ఎంత పెద్దవిగా ఉంటే అంత
మంచిది. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము అయితే చాలా బాగుంది. ఇందులో కేవలం - ఒక్క
త్రిమూర్తి శివబాబాయే సత్యమైనవారు, త్రిమూర్తి శివుడే సత్యమైన శిక్షకుడు, త్రిమూర్తి
శివుడే సత్యమైన గురువు అని వ్రాయాలి. త్రిమూర్తి అన్న పదము వ్రాయకపోతే పరమాత్మ
నిరాకారుడు, వారు టీచరు ఎలా అవ్వగలరు అని అనుకుంటారు. జ్ఞానమైతే లేదు కదా. ఈ విధంగా
స్థాపన జరుగుతుంది అని లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని టిన్ షీటుపై తయారుచేసి ప్రతి
చోటా పెట్టాలి. బ్రహ్మా ద్వారా ఏక ధర్మ స్థాపన చేసి మిగిలిన వాటన్నింటినీ వినాశనము
చేయించడానికి తండ్రి వచ్చారు. పిల్లలకు ఈ నషా సదా ఉండాలి. చిన్న-చిన్న విషయాలలో
ఏకమతంగా అవ్వకపోతే వెంటనే డిస్టర్బ్ అవుతారు. ఇదైతే జరుగుతూనే ఉంటుంది. కొంతమంది
ఒకవైపు, కొంతమంది మరొకవైపు ఉంటారు, అప్పుడు మెజారిటీ వారి అభిప్రాయము తీసుకోవడం
జరుగుతుంది, ఇందులో బాధపడే విషయమేమీ లేదు. మా మాట వినలేదు అని పిల్లలు అలుగుతారు.
అరే, ఇందులో అలిగే విషయం ఏముంది. తండ్రి అయితే అందరినీ సంతోషపెట్టేవారు. మాయ అందరినీ
కోపగించుకునేటట్లు చేసింది, అందరూ తండ్రిపై అలిగి ఉన్నారు, అలగడమేమిటి, అసలు తండ్రి
గురించే తెలియదు. ఏ తండ్రి అయితే స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చారో, వారి గురించి
తెలియనే తెలియదు. తండ్రి అంటారు - నేను మీకు ఉపకారము చేస్తాను. మీరు మళ్ళీ నాకు
అపకారము చేస్తారు. భారత్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. మీలో కూడా నషా ఉన్నవారు చాలా
కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇది నారాయణీ నషా. మేము సీతా-రాములుగా అవుతామని అనకూడదు.
నరుని నుండి నారాయణునిగా అవ్వడమే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. మీరేమో సీతా-రాములుగా
అవ్వడంలోనే సంతోషపడిపోతారు, ధైర్యము చూపించాలి కదా. పాత ప్రపంచముపై అసలు మనసు
పెట్టుకోకూడదు. ఎవరి పట్లనైనా మనసు పెట్టుకున్నట్లయితే మరణిస్తారు. జన్మ-జన్మాంతరాల
కొరకు నష్టం కలుగుతుంది. బాబా నుండైతే స్వర్గ సుఖాలు లభిస్తాయి, మరి మనము నరకములో
ఎందుకు ఉండాలి. తండ్రి అంటారు - మీరు స్వర్గంలో ఉన్నప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు.
ఇప్పుడు డ్రామానుసారంగా మీ ధర్మము లేదు. ఎవరూ స్వయాన్ని దేవతా ధర్మము వారిగా
భావించరు. మనుష్యులై ఉండి కూడా తమ ధర్మం గురించి తెలుసుకోకపోతే ఇక ఏమనాలి. హిందూ
అనేది ధర్మము కాదు. దీనిని ఎవరు స్థాపించారో కూడా తెలియదు. పిల్లలైన మీకు ఎంతగా
అర్థము చేయించడం జరుగుతుంది. తండ్రి అంటారు - అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు
కాలుడికే కాలుడినైన నేను ఇప్పుడు వచ్చాను. మిగిలినవారు ఎవరైతే బాగా చదువుకుంటారో,
వారు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు ఇంటికి పదండి. ఇప్పుడు ఇక్కడ ఉండేందుకు
యోగ్యంగా లేదు, ఆసురీ మతంపై నడిచి చాలా మురికిగా చేసేసారు. తండ్రి అయితే ఇలాగే
అంటారు కదా. భారతవాసులైన మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు ఎన్ని
ఎదురుదెబ్బలు తింటూ ఉన్నారు. సిగ్గుగా అనిపించడం లేదా. మీలో కూడా బాగా అర్థము
చేసుకున్నవారు కొంతమందే ఉన్నారు. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. చాలామంది పిల్లలు
నిద్రలో ఉంటారు. వారికి సంతోషపు పాదరసం ఎక్కదు. బాబా మనకు మళ్ళీ రాజధానిని ఇస్తారు.
తండ్రి అంటారు - ఈ సాధువులు మొదలైనవారిని కూడా నేను ఉద్ధరిస్తాను. వారు స్వయానికి
కానీ, ఇతరులకు కానీ ముక్తిని ఇవ్వలేరు. సత్యమైన గురువు సద్గురువు ఒక్కరే, వారు
సంగమములో వచ్చి అందరికీ సద్గతినిస్తారు. తండ్రి అంటారు, కల్పము యొక్క ప్రతి
సంగమయుగంలో, ఎప్పుడైతే ప్రపంచమంతటినీ పావనంగా తయారుచేయవలసి వస్తుందో, అప్పుడు నేను
వస్తాను. బాబా సర్వశక్తివంతుడు, వారు చేయలేనిది అంటూ ఏముంటుంది అని మనుష్యులు
భావిస్తారు. అరే, పతితులుగా ఉన్న మమ్మల్ని పావనంగా చేయండి అని నన్ను పిలుస్తారు,
కావున నేను వచ్చి పావనంగా చేస్తాను. ఇంకేమి చేస్తాను. ఇకపోతే మంత్ర-తంత్రాలు
చేసేవారు అయితే చాలామంది ఉన్నారు, నరకాన్ని స్వర్గంగా చేయడమే నా పని. అది ప్రతి 5
వేల సంవత్సరాల తర్వాత తయారవుతుంది. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. ఆది సనాతనమైనది
దేవీ-దేవతా ధర్మము. మిగిలినవన్నీ దాని వెనుక వచ్చినవి. అరవింద్ ఘోష్ ఇప్పుడు వచ్చినా
కూడా, వారి ఆశ్రమాలు ఎన్ని తయారయ్యాయో చూడండి. అక్కడ నిర్వికారులుగా అయ్యే విషయమేమీ
లేదు. గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఎవ్వరూ ఉండలేరు అని వారు భావిస్తారు. తండ్రి అంటారు,
గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉండండి. మీరు జన్మ-జన్మాంతరాలుగా
పతితులుగా ఉన్నారు. మిమ్మల్ని పావనంగా చేసేందుకు ఇప్పుడు నేను వచ్చాను. ఈ అంతిమ
జన్మ పావనంగా అవ్వండి. సత్య-త్రేతాయుగాలలో వికారాలు ఉండనే ఉండవు.
ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము మరియు మెట్ల వరుస చిత్రము చాలా బాగున్నాయి.
సత్యయుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యముండేదని వీటిలో వ్రాసి ఉంది. అర్థము చేయించేందుకు
చాలా యుక్తి కావాలి. వృద్ధ మాతలకు కూడా ప్రదర్శనీలో ఎంతోకొంత అర్థం చేయించగలిగే
విధంగా నేర్పించి తయారుచేయాలి. ఎవరికైనా ఈ చిత్రాన్ని చూపించి ఈ విధంగా చెప్పండి,
వీరి రాజ్యముండేది కదా, ఇప్పుడైతే లేదు. తండ్రి అంటారు - ఇప్పుడు మీరు నన్ను స్మృతి
చేసినట్లయితే పావనంగా అయి పావన ప్రపంచములోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పావన ప్రపంచము
స్థాపనవుతుంది. ఇది ఎంత సహజము. వృద్ధ మాతలు కూర్చొని ప్రదర్శనీలో అర్థం చేయిస్తే,
అప్పుడు పేరు ప్రసిద్ధమవుతుంది. శ్రీకృష్ణుని చిత్రములో కూడా వివరణ చాలా బాగుంది.
ఏమని చెప్పాలంటే - ఇది తప్పకుండా చదవండి, దీనిని చదవడంతోనే మీకు నారాయణీ నషా మరియు
విశ్వానికి యజమానులుగా అయ్యే నషా ఎక్కుతుంది అని.
తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఈ విధంగా లక్ష్మీ-నారాయణుల వలె తయారుచేస్తాను,
కావున మీరు కూడా ఇతరులపై దయార్ద్రహృదయులుగా అవ్వాలి. ఎప్పుడైతే స్వ కళ్యాణం
చేసుకుంటారో, అప్పుడే ఇతరుల కళ్యాణం కూడా చేయగలుగుతారు. వృద్ధ మాతలకు ఈ విధంగా
నేర్పించి తెలివైనవారిగా చేయండి. ప్రదర్శనీలకు 8-10 మంది వృద్ధ మాతలను పంపించమని
బాబా అంటే వారు వెంటనే రాగలగాలి. ఎవరు చేస్తే, వారు పొందుతారు. ఎదురుగా
లక్ష్యము-ఉద్దేశ్యాన్ని చూసి సంతోషమనిపిస్తుంది. మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి
విశ్వానికి యజమానులుగా అవుతాము. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా పాపాలు తొలుగుతాయి.
చూడండి, కవరుపై - ఒకే ధర్మము, ఒకే దైవీ రాజ్యము, ఒకే భాష... అని ముద్రించి ఉంది. అది
త్వరగా స్థాపనవుతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.