26-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు త్రిమూర్తి తండ్రికి పిల్లలు, మీకు మీ మూడు కర్తవ్యాలైన - స్థాపన, వినాశనము, పాలన గుర్తుండాలి’’

ప్రశ్న:-
దేహాభిమానము అనే కఠినమైన రోగము వస్తే ఏయే నష్టాలు కలుగుతాయి?

జవాబు:-
1. దేహాభిమానము ఉన్నవారిలో ఈర్ష్య ఉంటుంది, ఈర్ష్య కారణముగా పరస్పరం ఉప్పు-నీరులా అవుతూ ఉంటారు, ప్రేమతో సేవ చేయలేకపోతారు, లోలోపల కాలిపోతూ ఉంటారు. 2. నిర్లక్ష్యముగా ఉంటారు, మాయ వారిని ఎంతగానో మోసగిస్తూ ఉంటుంది, పురుషార్థం చేస్తూ-చేస్తూ అలసిపోయి పడిపోతారు, దాని వలన చదువునే వదిలేస్తారు. 3. దేహాభిమానము కారణముగా హృదయము స్వచ్ఛముగా ఉండదు, హృదయము స్వచ్ఛముగా ఉండని కారణముగా తండ్రి హృదయముపైకి ఎక్కలేరు. 4. మూడ్ ఆఫ్ చేసుకుంటారు, వారి ముఖమే మారిపోతుంది.

ఓంశాంతి
కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేస్తున్నారా లేక ఇంకేదైనా కూడా గుర్తుకువస్తుందా? పిల్లలకు స్థాపన, వినాశనము మరియు పాలన - ఈ మూడింటి స్మృతి ఉండాలి ఎందుకంటే ఈ మూడూ కలిసి నడుస్తాయి కదా. ఉదాహరణకు ఎవరైనా బ్యారిస్టరీ చదువుతున్నట్లయితే వారికి - నేను బ్యారిస్టరుగా అవుతాను, న్యాయవాదము చేస్తాను అన్నది తెలిసే ఉంటుంది, అలాగే బ్యారిస్టరీని పాటిస్తారు కూడా కదా. ఏమి చదివినా దానికి సంబంధించిన లక్ష్యము ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు మనం కన్సట్రక్షన్ చేస్తున్నామని మీకు తెలుసు. పవిత్రమైన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. ఇందులో యోగము చాలా అవసరము. యోగము ద్వారానే పతితముగా అయిపోయిన మన ఆత్మ పావనముగా అవుతుంది. అప్పుడు మనం పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచములోకి వెళ్ళి రాజ్యం చేస్తాము, ఇది బుద్ధిలోకి రావాలి. అన్ని పరీక్షలలోనూ అన్నింటికంటే పెద్ద పరీక్ష లేక అన్ని చదువులలో కల్లా ఉన్నతమైన చదువు ఇదే. చదువులైతే అనేక రకాలవి ఉన్నాయి కదా. అక్కడైతే అంతా మనుష్యులు మనుష్యులను చదివిస్తారు, అంతేకాక ఆ చదువులు ఈ ప్రపంచము కొరకే ఉన్నాయి. వాటిని చదువుకుని వాటి ఫలితాన్ని ఇక్కడే పొందుతారు. ఈ అనంతమైన చదువు యొక్క ఫలము మనకు కొత్త ప్రపంచములో లభించనున్నదని పిల్లలైన మీకు తెలుసు. ఆ కొత్త ప్రపంచము దూరముగానేమీ లేదు. ఇప్పుడు ఇది సంగమయుగము. కొత్త ప్రపంచములోనే మనము రాజ్యం చేయాలి. ఇక్కడ కూర్చున్నా కూడా బుద్ధిలో దీనిని గుర్తు చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రముగా అవుతుంది. మనము పవిత్రముగా అవుతాము, అప్పుడు ఈ అపవిత్ర ప్రపంచము యొక్క వినాశనము తప్పకుండా జరుగుతుంది అన్నది కూడా గుర్తుంచుకోవాలి. అందరూ పవిత్రముగా అవ్వరు. ఆ శక్తి ఉన్న మీరు చాలా కొద్దిమందే ఉన్నారు. మీలో కూడా నంబరువారు శక్తి అనుసారముగానే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు కదా. శక్తి అయితే ప్రతి విషయములోనూ కావాలి. ఇది ఈశ్వరీయ శక్తి, దీనిని యోగబలము యొక్క శక్తి అని అంటారు. మిగిలినవన్నీ దైహికమైన శక్తులు. ఇది ఆత్మిక శక్తి. తండ్రి కల్ప-కల్పమూ చెప్తారు - ఓ పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి, సర్వశక్తివంతుడైన తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి ఒక్కరే, వారిని స్మృతి చేయడం ద్వారా ఆత్మ పవిత్రముగా అవుతుంది. ఇవి ధారణ చేయవలసిన చాలా మంచి విషయాలు. ఎవరికైతే - మేము 84 జన్మలను తీసుకున్నాము అన్న నిశ్చయమే లేదో, వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. ఎవరైతే సతోప్రధాన ప్రపంచములోకి వచ్చారో, వారే ఇప్పుడు తమోప్రధానతలోకి వచ్చారు. వారే వచ్చి త్వరగా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే అడగాలి. పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే మరి తండ్రిని కూడా స్మృతి చేయాలి. అర్థం చేసుకోకపోతే స్మృతి కూడా చేయలేకపోతారు. ఇది డైరెక్టు విషయము. ఆత్మలమైన మనమెవరమైతే సతోప్రధానముగా ఉండేవారిమో, వారిమే మళ్ళీ తమోప్రధానముగా అయ్యాము. మేము 84 జన్మలు తీసుకున్నాము అని ఎలా అనుకోవాలి లేక తండ్రి నుండి కల్పపూర్వము కూడా వారసత్వాన్ని తీసుకున్నాము అని ఎలా అనుకోవాలి అంటూ ఎవరికైతే ఈ సంశయము ఉంటుందో, వారు చదువుపై పూర్తి ధ్యాస కూడా పెట్టరు. వారి భాగ్యములోనే లేదు అని భావించడం జరుగుతుంది. కల్పపూర్వము కూడా అర్థం చేసుకోలేదు, అందుకే స్మృతి చేయలేకపోతారు. ఇది ఉన్నదే భవిష్యత్తు కోసం చదువుకునే చదువు. చదువుకోకపోతే ప్రతి కల్పమూ చదువుకోలేదు లేక కొద్ది మార్కులతోనే పాస్ అయి ఉంటారు అని భావించడం జరుగుతుంది. స్కూల్లో చాలామంది ఫెయిల్ అయిపోతారు కూడా. అలాగే పాస్ కూడా నంబరువారుగానే అవుతారు. ఇది కూడా చదువు, ఇందులో నంబరువారుగా పాస్ అవుతారు. చురుకైనవారు ఎవరైతే ఉంటారో వారు చదువుకుని, చదివిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు సేవకుడిని. పిల్లలు కూడా - మేమూ సేవకులమే అని అంటారు. ప్రతి ఒక్క సోదరీ, సోదరుల కళ్యాణము చేయాలి. తండ్రి మన కళ్యాణము చేస్తారు, మనం మళ్ళీ ఇతరుల కళ్యాణము చేయాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి అని అందరికీ ఇది కూడా అర్థం చేయించాలి. ఎవరెవరు ఎంతెంతగా అనేకులకు సందేశాన్ని చేరుస్తారో వారిని అంత గొప్ప సందేశకులు అని అంటారు. వారినే మహారథులు లేక గుర్రపుస్వారీ వారు అని అంటారు. పాదచారులు ప్రజలలోకి వెళ్ళిపోతారు. ఇందులో కూడా ఎవరెవరు షావుకార్లుగా అవ్వగలరు అనేది పిల్లలు అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. పిల్లలైన మీరు ఎవరైతే సేవ కొరకు నిమిత్తులయ్యారో, సేవ కొరకే జీవితాన్ని ఇచ్చారో వారు పదవిని కూడా అలాగే పొందుతారు. వారికి ఎవరి చింతా ఉండదు. మనుష్యులు కాళ్ళు, చేతులు కలవారే కదా. వారిని బంధించడమనేది అయితే చేయలేరు. తమను తాము స్వతంత్రులుగా ఉంచుకోగలరు. మరి ఇలా బంధనములో నేను ఎందుకు చిక్కుకోవాలి? తండ్రి నుండి అమృతాన్ని తీసుకుని, ఆ అమృతాన్నే నేను ఎందుకు దానం చేయకూడదు? ఎవరైనా నన్ను బంధించేందుకు నేనేమైనా పిరికి మేకనా? ప్రారంభములో పిల్లలైన మీరు స్వయాన్ని ఎలా విడిపించుకున్నారు. వారు ఆర్తనాదాలు చేసారు, అయ్యో అయ్యో అని మొరపెట్టుకున్నారు, ఇక కూర్చుండిపోయారు. మీరు అంటారు - మాకు ఏమి చింత, మేము స్వర్గ స్థాపన చేయాలా లేక కూర్చుని ఈ పనులు చేయాలా. ఆ నషా ఎక్కిపోతుంది, దానినే ఈశ్వరీయ నషా అని అంటారు. మనం ఈశ్వరుని స్మృతిలో ఆనందముగా ఉన్నవారము. ఈశ్వరుని ద్వారా మనకు ఏమి ప్రాప్తిస్తుంది అనేది మీకు తెలుసు. ఈశ్వరుడు మనల్ని చదివిస్తున్నారు కదా. వారికి పేర్లు అయితే ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని-కొన్ని పేర్లు చాలా మధురముగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఈశ్వరుని స్మృతిలో ఆనందముగా ఉన్నవారిగా అయ్యాము. తండ్రి డైరెక్షన్లు అయితే చాలా సహజమైనవి ఇస్తారు. తప్పకుండా మేము తండ్రిని స్మృతి చేస్తూ, చేస్తూ సతోప్రధానముగా అయిపోతాము మరియు విశ్వాధిపతులుగా కూడా అవుతాము అని బుద్ధి కూడా భావిస్తుంది. తపనతో కూడిన ఇదే చింత ఉంది. తండ్రిని అనునిత్యము స్మృతి చేయాలి. మీరు ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే మర్చిపోతారు. ఇక్కడ ఎంత నషా అయితే ఎక్కుతుందో, అంతగా బయట ఉండదు, మర్చిపోతారు. మీరు మర్చిపోకూడదు. కానీ భాగ్యములో లేకపోతే ఇక్కడ కూర్చుని ఉంటూ కూడా మర్చిపోతారు.

పిల్లల కొరకు మ్యూజియంలోనూ మరియు పల్లె-పల్లెలోనూ సేవ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంత సమయం లభిస్తే అంతలో తండ్రి త్వరత్వరగా చేయండి అని అంటారు కానీ డ్రామాలో అలా త్వరగా జరగదు. తండ్రి ఏమంటారంటే - చేయి పెట్టగానే వస్తువు తయారైపోయే విధమైన మెషినరీ ఉండాలి. అలాగే తండ్రి ఇది కూడా అర్థం చేయిస్తూ ఉంటారు - మంచి, మంచి పిల్లలను మాయ ముక్కు మరియు చెవితో బాగా పట్టుకుంటుంది. ఎవరైతే స్వయాన్ని మహావీరులుగా భావిస్తారో వారికే మాయ తుఫానులు చాలా వస్తాయి, ఇక వారు ఎవ్వరినీ లెక్కచేయరు, దాచిపెట్టేస్తారు. ఆంతరికముగా హృదయము సత్యముగా ఉండదు. సత్యమైన హృదయము కలవారే స్కాలర్షిప్ ను పొందుతారు, ఆసురీ హృదయము కలవారు నడవలేరు. ఆసురీ హృదయముతో తమను తామే కష్టాలలో పెట్టుకుంటారు. అందరికీ శివబాబాతోనే పని ఉంది. ఇది మీరు సాక్షాత్కారములో చూస్తారు. బ్రహ్మాను కూడా తయారుచేసేవారు శివబాబాయే. శివబాబాను స్మృతి చేస్తే అప్పుడు ఇలా తయారవుతారు. మాయ చాలా శక్తివంతమైనదని బాబా భావిస్తారు. ఏ విధంగా ఎలుక కొరికినప్పుడు ఏమీ తెలియనే తెలయదో, అలాగే మాయ కూడా అటువంటి తెలివైన ఎలుకే. మహారథులే అప్రమత్తముగా ఉండాలి. మమ్మల్ని మాయ పడేసింది, ఉప్పు నీరులా చేసేసింది అని వారు స్వయం అర్థం చేసుకోరు. అలా ఉప్పు నీరులా అవ్వడం వలన మేము తండ్రి సేవను చేయలేము అని అర్థం చేసుకోవాలి. లోలోపలే కాలిపోతూ ఉంటారు. దేహాభిమానము ఉంది, అందుకే కాలిపోతూ ఉంటారు. ఆ అవస్థ అయితే లేదు. స్మృతి యొక్క పదును ఉండదు, అందుకే చాలా అప్రమత్తముగా ఉండాలి. మాయ చాలా చురుకైనది, మీరు యుద్ధ మైదానములో ఉన్నారు కావున మాయ కూడా మిమ్మల్ని వదలదు. సగం, ముప్పావు వంతు అంతం చేసేస్తుంది. ఇది ఎవరికీ తెలియను కూడా తెలియదు. ఎంతో మంచి-మంచి, కొత్త-కొత్తవారు కూడా చదువును ఆపు చేసి ఇంటిలో కూర్చుండిపోతారు. మంచి-మంచి ప్రసిద్ధమైనవారిపై కూడా మాయ దాడి జరుగుతుంది. అర్థమవుతున్నా కూడా నిర్లక్ష్యులుగా అయిపోతారు. చిన్న విషయానికే వెంటనే ఉప్పు నీరులా అయిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - దేహాభిమానము కారణముగానే ఉప్పు నీరులా అవుతారు, స్వయాన్ని మోసగించుకుంటారు. తండ్రి అంటారు, ఇది కూడా డ్రామాయే. ఏదైతే చూస్తారో, అదంతా కల్పపూర్వము వలె డ్రామాగా నడుస్తూ ఉంటుంది. అవస్థ పైకీ, కిందకీ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి గ్రహచారము కూర్చుంటుంది, ఒక్కోసారి చాలా మంచి సేవను చేసి సంతోషకరమైన సమాచారాన్ని వ్రాస్తారు. కిందకీ, పైకీ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి విజయము. పాండవులకు మాయతో ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి గెలుపు ఉంటుంది. మంచి-మంచి మహారథులు కూడా కదిలిపోతారు, కొందరు మరణిస్తారు కూడా, అందుకే ఎక్కడ ఉన్నా సరే, తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి మరియు సేవ చేస్తూ ఉండండి. మీరు సేవ కొరకు నిమిత్తమై ఉన్నారు. మీరు యుద్ధ మైదానములో ఉన్నారు కదా. బయట ఇళ్ళలో, గృహస్థ వ్యవహారాలలో ఎవరైతే ఉంటారో వారు ఇక్కడి వారి కన్నా చాలా చురుకుగా ముందుకు వెళ్ళగలుగుతారు. మాయతో పూర్తి యుద్ధము నడుస్తూ ఉంటుంది. క్షణక్షణమూ మీకు కల్పపూర్వము వలె పాత్ర నడుస్తూ వచ్చింది. ఇంత సమయము గతించిపోయింది అని మీరు అంటారు, ఏమేమి జరిగిందో అది కూడా మీ బుద్ధిలో ఉంది. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. ఏ విధంగా తండ్రిలో జ్ఞానము ఉందో, అది ఈ దాదాలోకి కూడా రావాలి. బాబా మాట్లాడినప్పుడు మరి తప్పకుండా దాదా కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. ఎవరెవరి హృదయము మంచిగా స్వచ్ఛముగా ఉంది అనేది మీకు తెలుసు. స్వచ్ఛమైన హృదయము కలవారే హృదయముపైకి ఎక్కుతారు. వారిలో ఉప్పు నీరులా అయ్యే స్వభావము ఉండదు, సదా హర్షితముగా ఉంటారు. వారి మూడ్ ఎప్పుడూ మారదు. ఇక్కడైతే అనేకుల మూడ్ మారిపోతూ ఉంటుంది, ఇక అడగకండి. ఈ సమయములో అందరూ, మేము పతితులుగా ఉన్నాము అని అంటారు కూడా. ఇప్పుడు పతితపావనుడైన తండ్రిని - మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని పిలిచారు. తండ్రి అంటారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వస్త్రాలు శుభ్రమవుతాయి. నా శ్రీమతముపై నడవండి. శ్రీమతముపై నడవనివారి వస్త్రాలు శుభ్రమవ్వవు. ఆత్మ అసలు శుద్ధముగా అవ్వనే అవ్వదు. తండ్రి అయితే రాత్రింబవళ్ళు -స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న విషయముపైనే బలముగా చెప్తూ ఉంటారు. దేహాభిమానములోకి రావడము వలనే మీరు గుటకలు మింగుతారు. ఎంతెంతగా మీరు పైకి ఎక్కుతూ ఉంటారో, అంతంతగా సంతోషపడుతూ ఉంటారు మరియు ముఖము హర్షితముగా ఉంటుంది. బాబాకు తెలుసు - మంచి, మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు ఉన్నారు కానీ ఆంతరిక పరిస్థితిని చూస్తే కరిగిపోతూ ఉన్నారు. దేహాభిమానపు అగ్ని కరిగించి వేస్తోంది. ఈ రోగము ఎక్కడి నుండి వచ్చింది అనేది అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, దేహాభిమానము వలన ఈ రోగము వస్తుంది. దేహీ-అభిమానులకు ఎప్పుడూ రోగము అంటుకోదు. లోలోపల ఎంతగానో కాలిపోతూ ఉంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, దేహీ-అభిమానీ భవ. ఈ రోగము ఎందుకు అంటుకుంది అని అడుగుతారు. తండ్రి అంటారు, ఈ దేహాభిమానము అనే రోగము ఎటువంటిదంటే ఇక అడగకండి. ఎవరికైనా ఈ రోగము అంటుకుంటే అది గట్టిగా అంటుకుపోతుంది, ఇక వదలనే వదలదు. శ్రీమతముపై నడవకుండా తమ దేహాభిమానములో నడిచినట్లయితే దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. బాబా వద్దకైతే అన్ని సమాచారాలూ వస్తాయి. మాయ ఒక్కసారిగా ఎలా ముక్కు పట్టుకుని పడేస్తుంది. బుద్ధిని పూర్తిగా హతమార్చేస్తుంది. ఇక సంశయబుద్ధి కలవారిగా అయిపోతారు. మీరు వచ్చి మమ్మల్ని రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా తయారుచేయండి అని భగవంతుడిని పిలుస్తారు. మళ్ళీ వారికి కూడా విరుద్ధులుగా అయిపోతారు, అప్పుడిక ఎటువంటి గతి ఉంటుంది! పూర్తిగా పడిపోయి రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. పిల్లలకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ సంతోషము ఉండాలి. అత్యుత్తమమైన విద్యార్థి జీవితము ఇదే. తండ్రి అంటారు, దీని కన్నా ఇంకే చదువైనా ఉన్నతమైనదా? ఇదే ది బెస్ట్ (అత్యుత్తమమైనది), ఇది 21 జన్మల ఫలాన్ని ఇస్తుంది, కావున ఇటువంటి చదువు పట్ల ఎంత అటెన్షన్ పెట్టాలి. కొందరైతే ఏమాత్రమూ అటెన్షన్ పెట్టరు. మాయ ముక్కు, చెవులను ఒక్కసారిగా కట్ చేసేస్తుంది. తండ్రి స్వయం చెప్తారు - అర్ధకల్పము దీని రాజ్యము నడుస్తుంది కావున ఇక అది ఎలా పట్టుకుంటుందంటే, ఇక అడగకండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉండండి. శివబాబాను స్మృతి చేయండి, లేకపోతే మాయ చెవులు, ముక్కును కట్ చేసేస్తుంది. ఇక అప్పుడు ఎందుకూ పనికిరానివారిగా అయిపోతారు. మేము లక్ష్మీ-నారాయణ పదవిని పొందడము అసంభవము అని చాలామంది అనుకుంటారు కూడా. అలసిపోయి పడిపోతారు. మాయతో ఓడిపోయి పూర్తిగా చెత్తలోకి వెళ్ళి పడిపోతారు. మా బుద్ధి పాడవుతోంది అని గమనించారంటే, మాయ ముక్కు పట్టుకుంది అని భావించాలి. స్మృతియాత్రలో చాలా బలము ఉంది, చాలా సంతోషము నిండి ఉంది. సంతోషము వంటి మందు లేదు అని అంటారు కూడా. దుకాణములోకి గ్రాహకులు వస్తూ ఉంటే, సంపాదన జరుగుతూ ఉంటే, వారికెప్పుడూ అలసట కలగదు, ఆకలి వేయదు. చాలా సంతోషముగా ఉంటారు. మీకైతే అపారమైన ధనము లభిస్తుంది. మీకైతే చాలా సంతోషము ఉండాలి. నా నడవడిక దైవీ నడవడికలా ఉందా లేక ఆసురీ నడవడికలా ఉందా? అని చూసుకోవాలి. సమయము చాలా తక్కువగా ఉంది. అకాల మృత్యువుల యొక్క రేస్ కూడా జరుగుతున్నట్లు ఉంది. యాక్సిడెంట్లు మొదలైనవి ఎన్ని జరుగుతూ ఉంటాయో చూడండి. తమోప్రధాన బుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. వర్షము జోరుగా పడుతుంది, వాటిని కూడా ప్రకృతి వైపరీత్యాలు అనే అంటారు. మృత్యువు ఇక మీ ముందుకు వచ్చినట్లే. ఆటమిక్ బాంబులతో యుద్ధము మొదలైపోతుంది అని అర్థం చేసుకుంటారు కూడా. ఎంతో భయంకరమైన పనులు చేస్తారు, వాటితో విసిగించేస్తారు, ఇక యుద్ధము కూడా మొదలైపోతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈశ్వరీయ నషాలో ఉంటూ స్వయాన్ని స్వతంత్రముగా చేసుకోవాలి. ఏ బంధనములోనూ బంధించుకోకూడదు. మాయా రూపీ ఎలుక నుండి చాలా-చాలా సంభాళించుకోవాలి, అప్రమత్తముగా ఉండాలి. హృదయములోకి ఎప్పుడూ ఆసురీ ఆలోచనలు రాకూడదు.

2. తండ్రి ద్వారా జ్ఞానమనే అపారమైన ధనము ఏదైతే లభిస్తుందో, దాని సంతోషములో ఉండాలి. ఈ సంపాదనలో ఎప్పుడూ సంశయబుద్ధి కలవారిగా అయి అలసిపోకూడదు. విద్యార్థి జీవితము అత్యుత్తమమైన జీవితము, అందుకే చదువుపై పూర్తి-పూర్తి అటెన్షన్ ఉంచాలి.

వరదానము:-
సదా అలర్ట్ గా ఉంటూ సర్వుల ఆశలను పూర్తి చేసే మాస్టర్ ముక్తి-జీవన్ముక్తి దాత భవ

ఇప్పుడు పిల్లలందరిలో ఏ శుభ సంకల్పము ఇమర్జ్ అవ్వాలంటే - మేము సర్వుల ఆశలను పూర్తి చెయ్యాలి అని. జనన-మరణాల నుండి ముక్తులైపోవాలి అన్నది అందరి కోరిక, కావున దాని అనుభవము చేయించండి. దీని కోసం తమ శక్తిశాలీ సతోప్రధాన వైబ్రేషన్లతో ప్రకృతి మరియు మనుష్యాత్మల వృత్తులను మార్చండి. మాస్టర్ దాతగా అయ్యి ప్రతి ఆత్మ ఆశలను పూర్తి చెయ్యండి. ముక్తి, జీవన్ముక్తుల దానమును ఇవ్వండి. ఈ బాధ్యత యొక్క స్మృతి మిమ్మల్ని సదా అలర్ట్ గా చేస్తుంది.

స్లోగన్:-
మురళీధరుని మురళి వింటూ దేహపు స్పృహను కూడా కోల్పోయేవారే సత్యమైన గోప-గోపికలు.