26-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మధురమైన తండ్రిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేసినట్లయితే చాలా-చాలా మధురముగా తయారవుతారు’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు ఏ పురుషార్థము చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు?

జవాబు:-
మీరు ఇప్పుడు జ్ఞాన మానస సరోవరములో మునకలు వేసి జ్ఞాన ఫరిశ్తాలుగా అవుతారు, జ్ఞాన స్నానముతో మీ గుణము మారుతూ ఉంటుంది. ఏవైతే అవగుణాలు ఉన్నాయో, అవి తొలగుతూ ఉంటాయి. తండ్రిని మరియు విష్ణుపురిని స్మృతి చేసి మీరు పావన దేవతలుగా తయారవుతారు. దేవతలలో ‘పవిత్రత’ యొక్క ఆకర్షణయే ఉంటుంది. దీని కారణముగానే మనుష్యులు దేవతల మందిరాలకు ఆకర్షించబడి దూరదూరాల నుండి వెళ్తారు.

పాట:-
మా తీర్థము అతీతమైనది...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. పిల్లలే అదృష్ట సితారలని మహిమ చేయబడతారు. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, అదృష్ట జ్ఞాన సితారలు. ఆ సూర్య-చంద్రులైతే ఈ రంగస్థలానికి ప్రకాశాన్ని ఇస్తాయి, అందుకే మీ మహిమ గాయనము చేయబడింది. మీరు జ్ఞాన సితారలు, వాటిని జ్ఞాన సితారలని అనడము జరగదు. జ్ఞాన సూర్యుడు అన్న పేరు విని, ఆ సూర్యుడు జ్ఞాన స్వరూపుడేమో అని భావిస్తారు ఎందుకంటే రాయి-రప్పల్లో భగవంతుడు ఉన్నారని భావిస్తారు, అలా సూర్యుడిని బాగా నమ్ముతారు. తమను తాము సూర్యవంశీయులని చెప్పుకుంటారు. సూర్యుడిని పూజిస్తారు, జెండా కూడా సూర్యునిదే ఉంటుంది. మీది త్రిమూర్తి జెండా. ఇది ఎంత అద్భుతము. ‘సత్యమేవ జయతే’ అని కూడా అందులో వ్రాయబడి ఉంది. వాస్తవానికి విశ్వముపై వారే విజయాన్ని ప్రాప్తి చేయిస్తారు. మీరు శివశక్తి పాండవ సైన్యము. వారు - త్రిమూర్తి మార్గ్, త్రిమూర్తి హౌస్ అని పేర్లు పెట్టారు. దీని అర్థాన్ని మరియు ఈ త్రిమూర్తుల ద్వారా వారు ఏ కర్తవ్యము చేయిస్తారు అనేది తండ్రి తెలియజేస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన... వారు త్రిమూర్తి చిత్రము నుండి శివుడిని తీసేసి, చిత్రాన్ని ఖండితము చేసేసారు. ఈ త్రిమూర్తి చిత్రములో ఎంత రహస్యము ఉంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. సత్యమైన శివబాబా బ్రహ్మా ద్వారా రాజ్యాన్ని ఇస్తారు. పిల్లలైన మనము శివబాబా ద్వారా కల్పక్రితం వలె మళ్ళీ పవిత్రత, సుఖము, శాంతి మరియు సంపదల రాజ్యాన్ని తీసుకుంటున్నాము. చదువు ఎప్పుడూ కూడా బ్రహ్మచర్యములోనే చదువుకోవడము జరుగుతుంది. ఇప్పుడైతే కొందరు వివాహము తర్వాత కూడా కోర్సులు నేర్చుకుంటారు ఎందుకంటే దాని వలన సంపాదన పెరుగుతుంది. ఇక్కడ మీకు లెక్కలేనంత సంపాదన ఉంది. శివబాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చారని పిల్లలకు తెలుసు. శ్రీమతము శ్రేష్ఠమైనదని గాయనము చేయబడింది. బాబాకు బిడ్డగా అయ్యారంటే తప్పకుండా తండ్రి మతముపై నడుస్తారు. సోదరుల మతముపై నడవరు. సోదరుల మతముపై అనేక జన్మలు నడిచారు, కానీ దానితో ఏ లాభము కలగలేదు. ఇప్పుడు బాబా మతముపై నడవాలి. సాధు-సత్పురుషులు మొదలైనవారంతా సోదరులే. ఇప్పుడు ఉన్నతమైన మతాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. నేచర్ క్యూర్ (ప్రకృతి వైద్యము) లో కూడా చాలా మందులు తీసుకుంటారు. అవన్నీ అల్పకాలం కోసం. ఇది 21 జన్మల కోసం నేచర్ క్యూర్. వారు - చల్లని నీటితో స్నానము చేయండి, ఇది చేయండి, ఆహార-పానీయాల పథ్యాన్ని పాటించండి అని అంటారు. ఇక్కడ ఆ ఆహార-పానీయాల విషయము లేదు. ఇక్కడైతే స్వీట్ ఫాదర్ పిల్లలకు చెప్తున్నారు - ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు చాలా మధురముగా తయారవుతారు. దేవతలు మధురమైనవారు కదా, వారిలో ఎంత ఆకర్షణ ఉంటుంది. ఇంతకుముందు శివుని మందిరాలు కూడా చాలా ఎత్తైన కొండలపై నిర్మించబడేవి. మనుష్యులు కాలి నడకన, సాక్షాత్కారము కోసం వెళ్ళేవారు ఎందుకంటే పవిత్రత ఆకర్షించేది. దేవతలు పవిత్రముగా ఉన్నప్పుడు విశ్వముపై రాజ్యము చేసేవారు. ఇప్పుడు వారి చిత్రాల ఎదురుగా వెళ్ళి ప్రార్థన చేసి నమస్కరిస్తారు. ఇప్పుడు, ఆ మధురమైన తండ్రిని అయితే అందరూ స్మృతి చేస్తారు. వారు రావడము కూడా ఇక్కడికే రావాలి. తప్పకుండా వారి నుండి అపారమైన వైకుంఠ సుఖము లభిస్తుంది, అందుకే వారిని స్మృతి చేస్తారు. రావణ రాజ్యము సమాప్తమైనప్పుడే తండ్రి వచ్చి స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. బాబా రావడము కూడా భారత్ లోనే వస్తారు. శివజయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు కానీ వారి నుండి ఏం లభిస్తుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటారు - నేను పిల్లలైన మిమ్మల్ని మధురముగా తయారుచేయడానికి వచ్చాను. మీరెంత ఛీ-ఛీగా (అశుద్ధముగా) అయిపోయారు. బాబా నాలెడ్జ్ ఫుల్, ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా లభిస్తూ ఉంది. బీజములోనే మొత్తం జ్ఞానము ఉంటుంది కదా. వారు బీజము, సత్యమైనవారు, చైతన్యమైనవారు మరియు జ్ఞానసాగరుడు, వారు సత్యము చెప్తారు. వారు కూడా ఆత్మే కానీ వారు పరమ్ (ఉన్నతమైనవారు). పరమ ఆత్మ అనగా పరమాత్మ. వారు సదా పరంధామములో ఉంటారు, వారు ఉన్నతోన్నతమైనవారు. వారు నామ-రూపాలకు అతీతమైనవారని చాలామంది అంటారు. కానీ నామ-రూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. వారి పేరు ‘శివ’. అందరూ వారిని పూజిస్తారు, వారు నిరాకారుడు. ఇప్పుడు వచ్చి ఉన్నారు. ఇంతకుముందు మనము దేహాభిమానులుగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, ఆత్మాభిమాని భవ. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. అందులో కేవలం శివునికి బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసిన కారణముగా అది ఖండితమైపోయింది. అయినా కేవలం పుస్తకము చదివినంత మాత్రాన రాజ్యము లభించదు. రాజ్యము సత్యయుగములో ఉంటుంది. తప్పకుండా తండ్రి సంగమములో వస్తారు. ఇప్పుడు డ్రామానుసారముగా భక్తి పూర్తవుతుంది. భక్తి తర్వాత జ్ఞానముంటుంది. ఇది పాత ప్రపంచము, సత్యయుగము కొత్త ప్రపంచము. సత్యయుగములో సూర్యవంశీయులు రాజ్యము చేసేవారు. ఇది రాజయోగము. దీని ద్వారా నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతారు. సత్యయుగములో వీరి రాజ్యముండేది. ఇప్పుడు కలియుగములో ఏముందో చూడండి! ఇప్పుడు మీరు సత్యయుగములోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. భక్తి మార్గానికి చెందిన వేద-శాస్త్రాలు మొదలైనవాటన్నింటినీ ఇప్పుడు వదలాల్సి ఉంటుంది. జ్ఞానము లభించిన తర్వాత ఇక భక్తి అవసరముండదు. జ్ఞానము ద్వారా మనము విశ్వానికి యజమానులుగా అవుతాము.

భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. వారు జ్ఞానము వినిపిస్తున్నారు. ఇప్పుడు మనము పతితుల నుండి పావనముగా తప్పకుండా తయారవ్వాలి, ఎందుకంటే పతితులైతే తిరిగి వెళ్ళలేరు. ముక్తిధామములో కూడా అందరూ పావన ఆత్మలే ఉంటారు. సుఖధామములో కూడా అందరూ పవిత్రమైనవారు ఉంటారు. ఇప్పుడు కలియుగములో అందరూ పతితులుగా ఉన్నారు. ఇప్పుడు వారిని పావనముగా ఎవరు తయారుచేస్తారు? పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు తండ్రి అంటారు - నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో వస్తాను. అందరికంటే నంబరువన్ భక్తునిగా ఈ దాదా ఉండేవారు. వారిని బ్రహ్మా అనండి లేదా లక్ష్మీ-నారాయణుల ఆత్మ అనండి. ఇది అర్థం చేసుకునే చాలా గుప్తమైన విషయము. విష్ణువు నాభి నుండి బ్రహ్మా మరియు బ్రహ్మా నాభి నుండి విష్ణువు వెలువడ్డారు... అని అంటారు. విష్ణువు 84 జన్మల తర్వాత బ్రహ్మాగా అవుతారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. బాబా కూడా గీతను చదివేవారు. జ్ఞానము లభించిన తర్వాత, బాబా విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు అనేది గమనించారు. విష్ణువు సాక్షాత్కారము జరిగిన తర్వాత, ఒక్కసారిగా గీత మొదలైనవి వదిలేశారు. బాబా యొక్క ప్రవేశము జరిగింది కదా. ఇక తర్వాత ఎప్పుడూ గీతను ముట్టుకోలేదు. ఒక్క తండ్రినే స్మృతి చేయడము మొదలుపెట్టారు. నేను కూడా ఆ తండ్రి నుండి వినడము ప్రారంభించాను - అని నేను అంటాను. శివబాబా అంటారు - నేను పిల్లలకు వినిపించేటప్పుడు ఇతను కూడా వింటారు. నేను ఇతని తనువులోకి ప్రవేశించి వచ్చాను, అందుకే ఇతనికి అర్జునుడు అని పేరు పెట్టారు. శాస్త్రాలలో గుర్రపు రథాన్ని చూపిస్తారు. ఎంత తేడా ఉంది. గుర్రపు రథములో కూర్చుని ఒక్కరికే జ్ఞానమిచ్చారా ఏమిటి? ఇదెలా సాధ్యమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. బాబా ఎలా చదివిస్తున్నారు అనేది ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. ఎన్ని సెంటర్లు ఉన్నాయి. కావున చదివించడానికి తప్పకుండా పాఠశాల కావాలి, అంతేకానీ యుద్ధ మైదానము కాదు. బాబా రాజయోగము నేర్పిస్తారు. సత్యయుగములో ఏ శాస్త్రము ఉండదు. నేనిప్పుడు జ్ఞానము వినిపించాను, అంతే. సత్యయుగములో దీని అవసరమే ఉండదు. పాత ప్రపంచానికి సంబంధించినదంతా బూడిదలో కలిసిపోతుంది. ఇది రాజశ్వ అశ్వమేధ యజ్ఞము. అశ్వము అని ఈ రథాన్ని అంటారు, దీనిని కూడా స్వాహా చేయాలి. ఆత్మ తండ్రికి చెందినదిగా అయ్యాక, ఇక ఈ పాత శరీరము కూడా సమాప్తమైపోతుంది. కృష్ణపురిలోకి ఈ ఛీ-ఛీ శరీరాన్ని తీసుకువెళ్ళరు. ఆత్మ అమరమైనది. హోలీలో చూపిస్తారు - కోకి (తీపి రొట్టె) కాలిపోతుంది, కానీ దాని దారం కాలదు. బాబా ఇప్పుడు అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు - ఇప్పటివరకు విన్నదంతా మర్చిపోండి. ఇప్పుడు భారత్ అసత్య ఖండముగా అయిపోయింది, నిన్న సత్యఖండముగా ఉండేది. సత్యఖండముగా తండ్రి తయారుచేసారు, మళ్ళీ రావణుడు అసత్య ఖండముగా తయారుచేసాడు. ఈ రావణుడు అందరికీ పాత శత్రువు. కేవలం ఎవరో ఏదో చెప్తే, దానిని అనుసరించడము మొదలుపెడతారు. ఉదాహరణకు దిల్వాడా మందిరములో ఆదిదేవ్ కు మహావీర్ అన్న పేరును పెట్టారు. మహావీర్ అని హనుమంతుడిని అంటారు. ఇప్పుడు వారెక్కడ, వీరెక్కడ. మీ అసలైన స్మృతిచిహ్నము ఈ మందిరములో ఉంది. పైన స్వర్గము, కింద తపస్య. ఆదినాథుని మూర్తి బంగారముతో తయారుచేయబడింది. భారత్ బంగారు పిచ్చుకగా ఉండేదని అంటారు కదా. భారత్ లో ఉన్నంత బంగారము ఇంకెక్కడా ఉండేది కాదు. బంగారు మహళ్ళు ఉండేవి. పై కప్పులలో, గోడలలో వజ్ర-వైఢూర్యాలు పొదగబడి ఉండేవి. మందిరాలలో ఎన్ని వజ్ర-వైఢూర్యాలు ఉండేవి, తర్వాత వాటిని దోచుకున్నారు. వాటిని తీసుకువెళ్ళి మసీదులలో పెట్టారు. ఆ సమయములో వాటి విలువ ఎంత ఉండి ఉంటుంది. అంతులేని ధనముండేది, అందుకే దోచుకుని తీసుకువెళ్ళారు. ప్రాచీన భారత్ చాలా షావుకారుగా ఉండేదని అందరికీ తెలుసు. ఇప్పుడెంత నిరుపేదగా అయిపోయింది. పేదవారి పట్ల జాలి కలుగుతుంది. రావణుడు ఎంత నిరుపేదగా తయారుచేసాడు. తండ్రి మళ్ళీ సంపన్నముగా తయారుచేస్తారు. ఇది అనంతమైన నాటకము, దీని ఆదిమధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి నాలెడ్జ్ ఫుల్. అలాగని అందరిలో కూర్చుని చూస్తానని కాదు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరైతే పాపాలు చేస్తారో, వారికి శిక్షలు తప్పకుండా లభిస్తాయి. నన్ను నాలెడ్జ్ ఫుల్, పతిత-పావనుడని అంటారు. ఓ బాబా రండి, వచ్చి మాకు జ్ఞానమివ్వండి, పావనముగా చేయండి - అని పిలుస్తారు. కనుక నేను వచ్చి ఈ కార్యము చేస్తాను. ఇకపోతే శాస్త్రాల విషయాలను మర్చిపోండి, నేను చెప్పేది వినండి అని తండ్రి అంటారు. ఇప్పుడు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. తర్వాత సూర్యవంశీయులుగా అవుతారు. ఆ తర్వాత చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అవుతారు. ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. సత్యయుగములో అన్ని విషయాలను మర్చిపోతారు. అక్కడ తండ్రిని ఎవ్వరూ స్మృతి చేయరు. వారసత్వము లభించాక ఇక ఎందుకు స్మృతి చేస్తారు. ఎంత బాగా అర్థం చేయించడము జరుగుతుంది. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. వృక్షపతి తండ్రి. నన్ను స్మృతి చేయండి అని వారు అంటారు. రచయిత ఒక్కరే ఉంటారా లేక రాళ్ళు- రప్పలు కూడా రచయితలు అవుతాయా?

తండ్రి అంటారు, రావణుడు మీ బుద్ధిని ఎంత పాడు చేసాడు. గొప్ప-గొప్ప విద్వాంసులకు ఎంత అహంకారముంది. తండ్రి గురించి తెలియనే తెలియదు, అలాగే రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి కూడా తెలియదు. తండ్రి అంటారు - నేను మీకు రాజ్యాన్ని ఇచ్చాను. మీరు ధన-సంపదలు అన్నింటినీ సమాప్తము చేసారు, ఇప్పుడు భిక్షము అడుగుతున్నారు, అందుకే ఆసురీ సాంప్రదాయము అని అంటారు. దేవతలకు ఎంత మహిమ చేసారు. మళ్ళీ, నిర్గుణులైన మాలో ఏ గుణాలు లేవని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు గుణాలను ధారణ చేయాలి, అవగుణాలను వదిలేయండి. రావణుడు మిమ్మల్ని కోతుల వలె తయారుచేసాడు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తారు. ఎవరిలోనైతే 5 వికారాలు ఉన్నాయో, వారిని కోతులు అని అంటారు. (నారదుని ఉదాహరణ) ఇప్పుడు మీ నడవడిక మారుతూ ఉంటుంది, తర్వాత మీరు దేవతలుగా తయారవుతారు. ఈ జ్ఞాన మానస సరోవరములో మునకలు వేసి మనము జ్ఞాన ఫరిశ్తాలుగా అవుతాము. వారు నీటిని మానస సరోవరము అని భావించారు. ఇది జ్ఞాన స్నానము యొక్క విషయము. బాబా ఖచ్చితముగా 5 వేల సంవత్సరాల క్రితం వలె మనకు అర్థం చేయిస్తున్నారని, ఇందులో ఏ సంశయము లేదని పిల్లలకు తెలుసు. పతిత-పావనుడైన తండ్రిని మరియు విష్ణుపురిని స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. మనుష్యులు ముక్తి కోసం ఎంతగా కష్టపడతారు కానీ ఇంటి గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మ లీనమైపోతుందని కొందరు అనుకుంటారు. ఆత్మ మరొక శరీరము తీసుకుంటుందని కొందరు అనుకుంటారు. అనేక మతాలు ఉన్నాయి. తండ్రి గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. ప్రపంచమంతా శ్రీకృష్ణ భగవానువాచ అని అనుకుంటారు. ఇక్కడ శివ భగవానువాచ అని తండ్రి అంటారు. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఒక్కసారిగా పేరునే మార్చేసారు. అచ్ఛా!

మధురాతి మధురమైన పిల్లలు అని బాప్ దాదా ఇరువురు అంటారు. ఇద్దరికీ పిల్లలు కదా. ఇతను కూడా విద్యార్థియే, మీరు కూడా విద్యార్థులే. ఇతను కూడా చదువుకుంటున్నారు. భారత్ ను పావనముగా తయారుచేసే సేవలో ఉన్నవారే పిల్లలు అయినట్లు. పావనముగా అవ్వని వారిని, బాబా చూస్తూ కూడా చూడరు. శిక్షలు అనుభవించిన తర్వాత, వచ్చి వంట చేసేవారిగా అవుతారని అర్థం చేసుకుంటారు. పావనముగా అయ్యేవారు విశ్వానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా -

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మధురముగా తయారయ్యేందుకు మధురమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. సత్యమైన తండ్రితో సత్యముగా ఉండాలి. ఒక్క తండ్రి యొక్క శ్రేష్ఠ మతముపై నడవాలి.

2. పురుషార్థము చేసి సంపూర్ణముగా తయారవ్వాలి. భారత్ ను పావనముగా తయారుచేసే సేవను చేయాలి. ఏ విషయములోనూ సంశయము రానివ్వకూడదు.

వరదానము:-
జ్ఞాన స్వరూప ఆత్మగా అయి జ్ఞాన సాగరునిలో మరియు జ్ఞానములో ఇమిడిపోయే సర్వ ప్రాప్తి స్వరూప భవ

జ్ఞానయుక్త ఆత్మలు సదా జ్ఞాన సాగరునిలో మరియు జ్ఞానములో ఇమిడి ఉంటారు, సర్వ ప్రాప్తి స్వరూపులుగా ఉన్న కారణముగా వారికి ఇచ్ఛా మాత్రమ్ అవిద్య స్థితి స్వతహాగా ఉంటుంది. అంశమాత్రమైనా సరే ఏవైనా స్వభావ-సంస్కారాలకు ఆధీనులుగా ఉన్నవారిని, పేరు-ప్రతిష్టలు కావాలని కోరుకునేవారిని, ఎందుకు-ఏమిటి అనే ప్రశ్నలతో ఆర్తనాదాలు చేసేవారిని, పిలిచేవారిని, లోపల ఒక రూపము బయట మరొక రూపములో ఉండేవారిని జ్ఞాన స్వరూప ఆత్మలని అనలేరు.

స్లోగన్:-
ఈ జీవితములో అతీంద్రియ సుఖాన్ని మరియు ఆనందాన్ని అనుభవం చేసేవారే సహజయోగులు.

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

బ్రాహ్మణ జీవితము యొక్క లక్ష్యము - బ్రహ్మాబాబా సమానముగా సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వటము. ఈ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకై విశేషముగా సర్దుబాటు శక్తిని, ఇముడ్చుకునే శక్తిని స్వయంలో ధారణ చేయండి. కర్మబంధన ఆత్మలు ఎక్కడ ఉంటే అక్కడే కార్యము చేయగలరు కానీ కర్మాతీత ఆత్మలు ఒకే సమయములో నలువైపులా సేవా పాత్రను పోషించగలరు ఎందుకంటే వారు కర్మాతీతులు. వారి స్పీడ్ చాలా వేగవంతముగా ఉంటుంది, సెకండులో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు.