27-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు సత్యాతి-సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు, ఇది సత్సంగము కూడా, ఇక్కడ మీకు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యము లభించింది, ఇది మిమ్మల్ని ఆవలి తీరానికి చేరుస్తుంది’’

ప్రశ్న:-
లెక్కాచారాల ఆట గురించి మనుష్యులు అర్థం చేసుకునేదానికి మరియు మీరు అర్థం చేసుకునేదానికి మధ్యన తేడా ఏమిటి?

జవాబు:-
మనుష్యులు - ఈ సుఖ-దుఃఖాల ఆట ఏదైతే నడుస్తుందో, ఈ సుఖ-దుఃఖాలన్నీ పరమాత్మయే ఇస్తారు అని భావిస్తారు, మరియు పిల్లలైన మీరు - ఇది ప్రతి ఒక్కరి కర్మల లెక్కాచారాల ఆట అని భావిస్తారు. తండ్రి ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. వారు సుఖము యొక్క మార్గాన్ని తెలియజేసేందుకే వస్తారు. బాబా అంటారు - పిల్లలూ, నేను ఎవ్వరినీ దుఃఖితులుగా చేయలేదు. ఇది మీ యొక్క కర్మల ఫలమే.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి...

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఎవరిని పిలుస్తున్నారు? తండ్రిని. బాబా, మీరు వచ్చి ఈ పాపపు కలియుగీ ప్రపంచము నుండి సత్యయుగీ పుణ్య ప్రపంచములోకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు జీవాత్మలందరూ కలియుగములో ఉన్నారు. వారి బుద్ధి పైకి వెళ్తుంది. తండ్రి చెప్తున్నారు, నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అదే విధంగా ఎవ్వరికీ తెలియదు. మాకు రచయిత అయిన యజమాని గురించి అనగా అనంతమైన తండ్రి గురించి మరియు వారి అనంతమైన రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అని ఋషులు-మునులు మొదలైనవారు కూడా అంటారు. ఆత్మలు ఎక్కడైతే ఉంటారో, ఆ స్థానము బ్రహ్మ మహాతత్వము, అక్కడ సూర్యుడు, చంద్రుడు ఉండరు. అవి మూలవతనములోనూ ఉండవు, సూక్ష్మవతనములోనూ ఉండవు. ఇకపోతే ఈ రంగస్థలములోనైతే దీపాలు మొదలైనవన్నీ కావాలి కదా. కనుక ఈ రంగస్థలానికి రాత్రి పూట చంద్రుడు, నక్షత్రాల ద్వారా, పగలు సూర్యుడి ద్వారా వెలుతురు లభిస్తుంది. ఇవి దీపాలు. ఈ దీపాలు ఉన్నప్పటికీ కూడా అంధకారమని అంటారు. రాత్రివేళ ఎంతైనా మళ్ళీ దీపాలు వెలిగించాల్సి ఉంటుంది. సత్య, త్రేతాయుగాలను పగలు అని మరియు భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు. ఇది కూడా అర్థము చేసుకోవలసిన విషయము. కొత్త ప్రపంచము తప్పకుండా మళ్ళీ పాతదిగా అవుతుంది. మళ్ళీ అది కొత్తదిగా అయ్యేటప్పుడు పాతది తప్పకుండా వినాశనమవుతుంది. ఇది అనంతమైన ప్రపంచము. రాజులు మొదలైనవారి భవనాలు కూడా కొన్ని చాలా పెద్ద-పెద్దవిగా ఉంటాయి. ఇది అనంతమైన ఇల్లు, అలాగే ఇది రంగస్థలము అనగా స్టేజ్, అలాగే దీనిని కర్మక్షేత్రమని కూడా అంటారు. కర్మ అయితే తప్పకుండా చేయవలసి ఉంటుంది. మనుష్యులందరికీ ఇది కర్మక్షేత్రము. అందరూ కర్మలు చేయవలసిందే, పాత్రను అభినయించవలసిందే. పాత్ర అనేది ప్రతి ఒక్క ఆత్మకు ముందు నుండే లభించి ఉంది. మీలో కూడా ఈ విషయాలను బాగా అర్థం చేసుకోగలిగేవారు కొంతమంది ఉన్నారు. వాస్తవానికి ఇది గీతా పాఠశాల. పాఠశాలలో ఎప్పుడైనా వృద్ధులు మొదలైనవారు చదువుకుంటారా? ఇక్కడైతే వృద్ధులు, యుక్త వయస్కులు మొదలైనవారందరూ చదువుకుంటారు. వేదాల పాఠశాల అని అనరు. అక్కడ ఎటువంటి లక్ష్యము-ఉద్దేశ్యము ఉండదు. వారు అన్ని వేద-శాస్త్రాలు మొదలైనవి చదువుతారు కానీ వాటి ద్వారా ఏమవుతారు అనేది వారికి తెలియదు. ఏయే సత్సంగాలైతే ఉన్నాయో, వాటి వేటిలోనూ లక్ష్యము-ఉద్దేశ్యము ఏమీ లేదు. ఇప్పుడైతే వాటిని సత్సంగాలు అనటానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. సత్యమైనవారైతే ఒక్క తండ్రియే. వారి విషయములోనే - మంచి సాంగత్యము తీరానికి చేరుస్తుంది... అని అంటారు. చెడు సాంగత్యము ముంచేస్తుంది... చెడు సాంగత్యము అంటే కలియుగీ మనుష్యులది. సత్యమైన సాంగత్యము వారొక్కరిదే. మొత్తం సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తండ్రి ఏ విధముగా ఇస్తున్నారు అని ఇప్పుడు మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. మీకైతే సంతోషము కలగాలి. మీరు సత్యాతి-సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు. మిగిలినవన్నీ అసత్యమైన పాఠశాలలు, ఆ సత్సంగాలు మొదలైనవాటి ద్వారా ఏ విధంగానూ తయారవ్వరు. స్కూలు-కాలేజీ మొదలైనవాటి ద్వారానైతే ఏదో ఒక విధముగా తయారవుతారు ఎందుకంటే అక్కడ చదువుకుంటారు. వేరే ఏ చోట చదువు లేదు. సత్సంగాన్ని చదువు అని అనరు. శాస్త్రాలు మొదలైనవి చదివి, దుకాణాలు తెరుచుకుని కూర్చుంటారు, ధనము సంపాదిస్తారు. గ్రంథ్ ను కొద్దిగా నేర్చుకుని, గురుద్వారాలు తెరుచుకుని కూర్చుంటారు. గురుద్వారాలు కూడా ఎన్ని తెరుస్తారు. గురువు యొక్క ద్వారమంటే ఇల్లు అని అంటారు కదా. ద్వారాలు తెరుచుకోగానే అక్కడికి వెళ్ళి శాస్త్రాలు మొదలైనవి చదువుకుంటారు. మీ గురుద్వారము - సద్గురు ద్వారము, ముక్తి మరియు జీవన్ముక్తిధామాలు. సద్గురువు పేరు ఏమిటి? అకాలమూర్త్. సద్గురువును అకాలమూర్త్ అని అంటారు, వారు వచ్చి ముక్తి-జీవన్ముక్తి ద్వారాలను తెరుస్తారు. వారు అకాలమూర్త్ కదా. వారిని కాలుడు కూడా కబళించలేడు. ఆత్మ ఉన్నదే బిందువు, దానిని కాలుడెలా కబళించగలడు. ఆ ఆత్మ అయితే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఒక పాత శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొకటి తీసుకుంటుంది కనుక ఇందులో ఏడ్చే అవసరమేముంది అని మనుష్యులు అర్థం చేసుకోరు. ఇది అనాదిగా తయారైనటువంటి డ్రామా అని, ఇందులో ప్రతి ఒక్కరూ పాత్రను అభినయించాల్సిందే అని మీకు తెలుసు. సత్యయుగములో నష్టోమోహులుగా ఉంటారని తండ్రి అర్థం చేయించారు. మోహజీత్ రాజు కథ కూడా ఉంది కదా. పండితులు వినిపిస్తారు, వారి వద్ద మాతలు కూడా వినీ-వినీ మళ్ళీ గ్రంథ్ పట్టుకుని ఇతరులకు వినిపించేందుకు కూర్చుంటారు. చాలామంది మనుష్యులు వెళ్ళి వింటారు. దానిని కర్ణరసము (చెవులకు ఇంపుగా ఉండటము) అని అంటారు. ఇందులో మా దోషమేముంది అని డ్రామా ప్లాన్ అనుసారముగా మనుష్యులంటారు. తండ్రి చెప్తున్నారు, దుఃఖపు ప్రపంచము నుండి తీసుకువెళ్ళండి అని మీరు నన్ను పిలుస్తారు, ఇప్పుడు నేను వచ్చాను కావున నాది వినాలి కదా. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మంచి మతము లభిస్తున్నప్పుడు అది తీసుకోవాలి కదా. మీది కూడా ఎటువంటి దోషము లేదు. ఇది కూడా డ్రామా. రామ రాజ్యము, రావణ రాజ్యము యొక్క ఆట తయారై ఉంది. ఆటలో ఎవరైనా ఓడిపోతే అది వారి దోషము కాదు. గెలుపు మరియు ఓటములు జరుగుతాయి, ఇందులో యుద్ధము యొక్క విషయమేదీ లేదు. మీకు రాజ్యాధికారము ఉండేది. ఇది కూడా ఇంతకుముందు మీకు తెలియదు. ఎవరు సర్వీసబుల్ గా ఉన్నారు, ఎవరి పేరు ప్రసిద్ధమైనది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఢిల్లీలో అందరికన్నా బాగా అర్థం చేయించడములో ప్రసిద్ధి చెందినవారెవరు? వెంటనే జగదీష్ పేరు తీసుకుంటారు. మీ కోసం మ్యాగజైన్లు కూడా తయారుచేస్తారు. అందులో అన్నీ వచ్చేస్తాయి. అనేక రకాల పాయింట్లు వ్రాస్తారు, బ్రిజ్ మోహన్ కూడా వ్రాస్తారు. వ్రాయడము అంటే అది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువైన పనేమీ కాదు. తప్పకుండా విచార సాగర మంథనము చేస్తారు, మంచి సేవ చేస్తారు. వారు వ్రాసింది చదివి ఎంతమంది సంతోషిస్తారు. పిల్లలకు కూడా రిఫ్రెష్మెంట్ లభిస్తుంది. కొంతమంది ప్రదర్శనీలో చాలా కష్టపడుతుంటారు, కొంతమంది కర్మ బంధనాలలో చిక్కుకుని ఉన్నారు, అందుకే అంతగా జ్ఞానము తీసుకోలేకపోతారు. దీనిని కూడా డ్రామా అని అంటారు. అబలలపై అత్యాచారాలు జరగడం కూడా డ్రామాలోని పాత్ర. ఇటువంటి పాత్ర ఎందుకు ఉంది అన్న ఈ ప్రశ్నే తలెత్తదు. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా. దీనిని ఏమీ చేయలేము. నేను ఏం అపరాధము చేసానని నాకు ఇటువంటి పాత్ర లభించింది అని కొందరంటారు. ఇందులో అపరాధము అన్న మాటేమీ లేదు. ఇది పాత్ర. కష్టాలు అనుభవించేందుకని మరి కొందరు అబలలు నిమిత్తమవుతారు. అలాగైతే అందరూ నాకు ఈ పాత్ర ఎందుకు లభించింది అని అంటారు. అలా కాదు, ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. పురుషులపై కూడా అత్యాచారాలు జరుగుతాయి. ఈ విషయాలలో ఎంత సహనశీలత వహించవలసి ఉంటుంది. చాలా సహనశీలత కావాలి. మాయ విఘ్నాలు అయితే ఎన్నో వస్తాయి. విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు కావున ఎంతోకొంత శ్రమించవలసి ఉంటుంది. డ్రామాలో ఆపదలు, గొడవలు మొదలైనవి ఎన్ని ఉన్నాయి. అబలలపై అత్యాచారాలు అన్నదాని గురించి వ్రాసారు. రక్తపు నదులు కూడా ప్రవహిస్తాయి. ఎక్కడా కూడా రక్షణ ఉండదు. ఇప్పుడైతే ఉదయము క్లాసులు మొదలైనవాటికి సెంటర్లకు వెళ్తారు. మీరు బయటకు రాలేని సమయము కూడా వస్తుంది. రోజురోజుకూ ప్రపంచము పాడైపోతూ ఉంటుంది, ఇంకా పాడైపోవాల్సిందే. దుఃఖపు రోజులు చాలా తీవ్రంగా వస్తాయి. అనారోగ్యాలు మొదలైనవాటిలో దుఃఖము కలిగినప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకుంటారు, వారిని పిలుస్తారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని మీకిప్పుడు తెలుసు. ఆ తర్వాత మనము మన శాంతిధామానికి, సుఖధామానికి తప్పకుండా వెళ్తాము. ప్రపంచములోనివారికైతే ఇది కూడా తెలియదు. పిల్లలైన మీరిప్పుడు ఇది అనుభవము చేస్తున్నారు కదా. ఇప్పుడు తండ్రిని పూర్తిగా తెలుసుకున్నారు. వారంతా - పరమాత్మ ఒక లింగము అని భావిస్తారు. శివలింగానికి పూజ కూడా చేస్తారు. మీరు శివుని మందిరాలకు వెళ్ళేవారు, అసలు శివలింగమంటే ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా. ఇది జడమైన రూపము కావున తప్పకుండా చైతన్యమైనవారు కూడా ఉంటారు కదా! మరి అదేమిటి? భగవంతుడు అయితే పైన ఉండే రచయిత. ఇది కేవలం వారిని పూజించేందుకని ఉన్న రూపము. పూజ్యులుగా అయినట్లయితే ఇక ఆ తర్వాత ఈ వస్తువులేవీ ఉండవు. కాశీలోని శివుని మందిరానికి వెళ్తారు, భగవంతుడు నిరాకారుడు, మేము కూడా వారి పిల్లలము అన్న విషయము ఎవ్వరికీ తెలియదు. తండ్రికి పిల్లలుగా అయి కూడా మళ్ళీ మనము దుఃఖితులుగా ఎందుకు ఉన్నాము? ఇది ఆలోచించాల్సిన విషయము కదా. మనము పరమాత్ముని సంతానము, మరి మనం దుఃఖితులుగా ఎందుకు ఉన్నాము అని ఆత్మ అంటుంది. తండ్రి అయితే సుఖాన్ని ఇచ్చేవారు. ఓ భగవంతుడా, మా దుఃఖాలను తొలగించండి అని పిలుస్తారు కూడా. వాటిని ఎలా తొలగించాలి? ఈ సుఖ-దుఃఖాలు అనేవి మీ కర్మల లెక్కాచారాలు. సుఖానికి ఫలముగా సుఖాన్ని, దుఃఖానికి ఫలముగా దుఃఖాన్ని పరమాత్మయే ఇస్తారని మనుష్యులు భావిస్తారు. ఇలా అంటూ వారిపై పెట్టేస్తారు, తండ్రి అంటారు - నేను ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వను. నేనైతే అర్ధ కల్పము కొరకు సుఖాన్నిచ్చి వెళ్తాను. ఇక్కడ ఉన్నది సుఖ-దుఃఖాల ఆట. కేవలం సుఖము యొక్క ఆట ఉన్నప్పుడు ఇక ఈ భక్తి మొదలైనవేవీ ఉండవు, భగవంతుడిని కలుసుకునేందుకే ఈ భక్తి మొదలైనవన్నీ చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి కూర్చొని మొత్తం సమాచారాన్ని వినిపిస్తారు. తండ్రి అంటారు, పిల్లలైన మీరు ఎంత భాగ్యశాలురు. ఆ ఋషులు-మునులు మొదలైనవారికి ఎంత పేరు ఉంటుంది. మీరు రాజఋషులు, వారు హఠయోగ ఋషులు. ఋషి అనగా పవిత్రమైనవారు. మీరు స్వర్గానికి రాజుగా అవుతారు కావున తప్పకుండా పవిత్రముగా అవ్వాల్సి ఉంటుంది. సత్య-త్రేతాయుగాలలో ఎవరి రాజ్యమైతే ఉండేదో, వారిదే మళ్ళీ ఉంటుంది. మిగిలినవారంతా తర్వాత వస్తారు. మేము శ్రీమతముపై మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము అని మీరిప్పుడు అంటారు. పాత ప్రపంచము వినాశనమయ్యేందుకు కూడా సమయమైతే పడుతుంది కదా. సత్యయుగము రావాలి, కలియుగము వెళ్ళిపోవాలి.

ఇది ఎంత పెద్ద ప్రపంచము. ఒక్కొక్క నగరము మనుష్యులతో ఎంతగా నిండిపోయి ఉంది. ధనవంతులు ప్రపంచాన్ని చుట్టి వస్తారు, కానీ ఇక్కడ మొత్తం ప్రపంచాన్ని ఎవ్వరూ చూడలేరు. ఆ మాటకొస్తే సత్యయుగములో చూడగలరు ఎందుకంటే సత్యయుగములో ఉండేదే ఒక రాజ్యము, రాజులు కొద్దిమందే ఉంటారు, ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద ప్రపంచము ఉంది. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఎవరు చుట్టి వస్తారు. అక్కడ మీరు సముద్రములోకి వెళ్ళవలసిన అవసరము ఉండదు. అక్కడ సీలోన్, బర్మా మొదలైనవి ఉంటాయా? ఉండవు, అవేవీ ఉండవు. ఈ కరాచీ ఉండదు. మీరంతా మధురమైన నదీ తీరాల వద్ద నివసిస్తారు. పంటపొలాలు మొదలైనవన్నీ ఉంటాయి, సృష్టి అయితే పెద్దదే. మనుష్యులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు, ఆ తర్వాత వృద్ధి జరుగుతుంది. మళ్ళీ అక్కడకు (విదేశాలకు) వెళ్ళి తమ రాజ్యాన్ని స్థాపించుకుంటారు. నెమ్మది-నెమ్మదిగా ఆక్రమిస్తూ వెళ్ళారు. తమ రాజ్యాన్ని స్థాపన చేసుకున్నారు. ఇప్పుడిక అన్నీ వదిలేయాల్సి ఉంటుంది. ఎవ్వరి రాజ్యాన్ని దోచుకోనిది ఒక్క భారత్ మాత్రమే ఎందుకంటే భారత్ నిజానికి అహింసాయుతమైనది కదా. భారత్ యే మొత్తం ప్రపంచమంతటికీ యజమానిగా ఉండేది, మిగిలినవారంతా తర్వాత వచ్చారు, వారు కొన్ని-కొన్ని భాగాలు చొప్పున తీసుకుంటూ వెళ్ళిపోయారు. మీరు ఎవరిదీ ఆక్రమించలేదు, బ్రిటీషు వారు ఆక్రమించారు. భారతవాసులైన మిమ్మల్ని తండ్రి విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. మీరెక్కడికీ వెళ్ళిపోలేదు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి, వృద్ధ మాతలైతే ఇవన్నీ అర్థము చేసుకోలేరు. తండ్రి అంటారు, మీరు ఏమీ చదువుకోకపోవడము మంచిది. చదివినదంతా బుద్ధి నుండి తీసేయాల్సి ఉంటుంది, కేవలం ఒక్క విషయాన్ని మాత్రమే ధారణ చేయాలి - మధురమైన పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి. బాబా, మీరు వస్తే మేము బలిహారమవుతాము అని మీరు అనేవారు కదా. కావున మీరు నా పై బలిహారమవ్వాలి. ఇచ్చి-పుచ్చుకోవడాలు ఉంటాయి కదా. వివాహ సమయములో స్త్రీ-పురుషులు ఒకరి చేతికి ఒకరు ఉప్పు ఇచ్చుకుంటారు. అలాగే తండ్రితో కూడా అంటారు - మేము పాతదంతా మీకు ఇచ్చేస్తాము అని. మరణించాల్సి అయితే ఉంది, ఇదంతా సమాప్తమవ్వాల్సిందే. మీరు మాకు మళ్ళీ కొత్త ప్రపంచములో ఇవ్వండి. తండ్రి వచ్చేదే అందరినీ తీసుకువెళ్ళడానికి. వారు కాలుడు కదా. అందరినీ ఎత్తుకువెళ్ళిపోయే ఈ కాలుడు ఎవరు అని సింధ్ లో అనేవారు, పిల్లలైన మీరైతే సంతోషిస్తారు. తండ్రి వచ్చేదే తీసుకువెళ్ళడానికి. మనమైతే సంతోషముగా మన ఇంటికి వెళ్తాము. సహనము కూడా చేయవలసి ఉంటుంది. మంచి-మంచి గొప్ప-గొప్ప ఇంటి యొక్క మాతలు దెబ్బలు తింటారు. మీరు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. వారు కలియుగీ శూద్ర సంప్రదాయమువారు అని మనుష్యులకు ఏమీ తెలియదు. మీరు సంగమయుగవాసులు, పురుషోత్తములుగా అవుతున్నారు. మొదటి నంబరు పురుషోత్తములు ఈ లక్ష్మీ-నారాయణులని మీకు తెలుసు కదా. ఆ తర్వాత డిగ్రీ తగ్గిపోతూ ఉంటుంది. పై నుండి క్రిందకు వస్తూ ఉంటారు. ఆ తర్వాత నెమ్మది-నెమ్మదిగా పడిపోతూ ఉంటారు. ఈ సమయములో అందరూ పడిపోయి ఉన్నారు. వృక్షము పాతదిగా అయిపోయింది, కాండము కుళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్థాపన జరుగుతుంది. పునాది వేయబడుతుంది కదా. అంటు ఎంత చిన్నదిగా ఉంటుంది మళ్ళీ దాని నుండి ఎంత పెద్ద వృక్షము పెరుగుతుంది. ఇది కూడా వృక్షము, సత్యయుగములో చాలా చిన్న వృక్షము ఉంటుంది. ఇప్పుడెంత పెద్ద వృక్షము ఉంది. మనుష్య సృష్టిలోని ఎన్ని వెరైటీ పుష్పాలు ఉన్నాయి. ఒకే వృక్షములో ఎన్ని వెరైటీలున్నాయి. ఇది మనుష్యుల యొక్క అనేక వెరైటీ ధర్మాల వృక్షము. ఒకరి ముఖకవళికలు మరొకరితో కలవవు. ఇది తయారై-తయారుచేయబడిన డ్రామా కదా. ఏ ఇద్దరికీ ఒకే లాంటి పాత్ర ఉండదు. దీనిని సహజసిద్ధమైన తయారై-తయారుచేయబడిన అనంతమైన డ్రామా అని అంటారు, ఇందులో కూడా కృత్రిమమైనవి అనేకము ఉన్నాయి. ఏవైతే రియల్ వస్తువులు ఉంటాయో అవి నశిస్తాయి కూడా. మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత అవి రియాల్టీ లోకి వస్తాయి. చిత్రాలు మొదలైనవి కూడా ఏవీ నిజమైనవి తయారవ్వలేదు. బ్రహ్మా ముఖాన్ని కూడా మీరు మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత చూస్తారు. ఈ డ్రామా యొక్క రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఇంకే విషయము అర్థము కాకపోయినా, కేవలం ఒక్క విషయాన్ని బుద్ధిలో ఉంచుకోండి - ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. బాబా, నేను మిమ్మల్నే స్మృతి చేస్తాను అని ఈ విధంగా ఆత్మయే చెప్పింది. ఇదైతే సహజము కదా. చేతులతో కర్మలు చేస్తూ ఉండండి మరియు బుద్ధితో తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సహనశీలత గుణాన్ని ధారణ చేసి మాయ కలిగించే విఘ్నాలలో పాస్ అవ్వాలి. అనేక ఆపదలు వస్తాయి, అత్యాచారాలు జరుగుతాయి - అటువంటి సమయములో సహనము చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి, సత్యమైన సంపాదన చేసుకోవాలి.

2. విశాలబుద్ధి కలవారిగా అయి ఈ తయారై తయారుచేయబడిన డ్రామాను మంచి రీతిలో అర్థం చేసుకోవాలి, ఈ అద్భుతమైన డ్రామా తయారుచేయబడి ఉంది, అందుకే ప్రశ్నలు ఉత్పన్నమవ్వడానికి లేదు. తండ్రి ఏదైతే మంచి మతాన్ని ఇస్తున్నారో, దానిపై నడుస్తూ ఉండాలి.

వరదానము:-
మాయాజీతులుగా, విజయులుగా అవ్వడంతోపాటు పరోపకారులుగా కండి

ఇప్పటికీ స్వ కళ్యాణములో చాలా సమయము పోతుంది. ఇప్పుడిక పరోపకారులుగా అవ్వండి. మాయాజీతులుగా, విజయులుగా అవ్వడంతోపాటు సర్వ ఖజానాల విధాతగా అవ్వండి అనగా ప్రతి ఖజానాను కార్యములో వినియోగించండి. సంతోషపు ఖజానా, శాంతి ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, సహయోగాన్ని ఇచ్చే ఖజానా అన్నింటినీ పంచండి మరియు పెంచండి. ఇప్పుడు విధాతా స్వరూపపు స్థితిని అనుభవము చేసినట్లయితే అనగా పరోపకారులుగా అయినట్లయితే అనేక జన్మలు విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు.

స్లోగన్:-
విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలంటే మీ సర్వ బలహీనతలకు సదాకాలము కొరకు వీడ్కోలు ఇవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా రూపంగా చేయండి

ఏ విధంగా ప్రజలందరూ కోట లోపల సురక్షితముగా ఉండాలి అని కోటను కడతారో, కేవలం ఒక రాజు కోసం ఒక గదిని కట్టరో, మొత్తం కోటను కడతారో, అలా మీరందరూ కూడా స్వయం కొరకు, సహచరుల కొరకు, ఇతర ఆత్మల కొరకు జ్వాలా రూపపు స్మృతి అనే కోటను కట్టండి. స్మృతి శక్తి యొక్క జ్వాల ఉన్నట్లయితే ప్రతి ఆత్మ రక్షణను అనుభవం చేస్తుంది.