27-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - హద్దు ప్రపంచము యొక్క వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు, బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలు నడుస్తూ ఉండాలి’’

ప్రశ్న:-
ఏ పిల్లలు తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ ను అమలులోకి తీసుకురాగలరు?

జవాబు:-
ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో, తమ షో చేసుకోరో, ఆత్మిక నషాలో ఉంటారో, వారే తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ ను అమలులోకి తీసుకురాగలుగుతారు. మీకు అసత్యమైన అహంకారము ఎప్పుడూ రాకూడదు. ఆంతరికముగా చాలా స్వచ్ఛత ఉండాలి. ఆత్మ చాలా బాగుండాలి, ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడూ ఉప్పునీరులా అయ్యే సంస్కారము అనగా ఉప్పదనము యొక్క సంస్కారము ఉండకూడదు, అప్పుడు తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ అమలులోకి వస్తుంది.

ఓంశాంతి
పిల్లలు కేవలం స్మృతియాత్రలోనే కూర్చోలేదు. వారికి - మేము శ్రీమతముపై మా పరిస్తాన్ ను స్థాపన చేస్తున్నాము అన్న నషా కూడా ఉంది, అంతటి ఉల్లాసము మరియు సంతోషము ఉండాలి. చెత్తతో కూడిన వ్యర్థమైన విషయాలన్నీ తొలగిపోవాలి. అనంతమైన తండ్రిని చూస్తూనే ఉల్లాసములోకి రావాలి. ఎంతెంతగా మీరు స్మృతియాత్రలో ఉంటారో అంతంతగా స్వయములో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. తండ్రి అంటారు, పిల్లల కోసం ఆత్మిక యూనివర్సిటీ ఉండాలి. మీది వరల్డ్ స్పిరిట్యుయల్ యూనివర్సిటీ. మరి ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? యూనివర్సిటీ విశేషముగా స్థాపించబడుతుంది. దానితోపాటు చాలా పెద్ద రాయల్ హాస్టల్ కావాలి. మీకు ఎంత రాయల్ ఆలోచనలు ఉండాలి. తండ్రికైతే రాత్రింబవళ్ళు ఇవే ఆలోచనలు ఉంటాయి - ఏ విధముగా పిల్లలను చదివించి ఉన్నతమైన పరీక్షలో పాస్ చేయించాలి, తద్వారా వారు ఈ విశ్వానికి అధిపతులుగా అవ్వనున్నారు. నిజానికి మీ ఆత్మ శుద్ధముగా, సతోప్రధానముగా ఉండేది, అప్పుడు శరీరము కూడా ఎంత సతోప్రధానముగా, సుందరముగా ఉండేది. రాజ్యము కూడా ఎంత ఉన్నతముగా ఉండేది. హద్దు ప్రపంచానికి సంబంధించిన చెత్తతో కూడిన విషయాలలో మీ సమయము ఎంతో వ్యర్థమవుతుంది. విద్యార్థులైన మీలో చెత్తతో కూడిన ఆలోచనలేవీ ఉండకూడదు. కమిటీలు మొదలైనవైతే చాలా మంచి, మంచివి తయారుచేస్తారు. కానీ యోగబలము లేదు. మేము ఇది చేస్తాము, అది చేస్తాము అని ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. మాయ కూడా - నేను వీరి ముక్కు, చెవులతో పట్టుకుంటాను అని అంటుంది. తండ్రి పట్ల ప్రేమయే లేదు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు... అని అంటూ ఉంటారు కదా. కావున మాయ కూడా ఏమీ చేయనివ్వదు. మాయ ఎంతగానో మోసగించేదిగా ఉంటుంది, చెవులనే కోసేస్తుంది. తండ్రి పిల్లలను ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు, ఇది-ఇది చేయండి అని డైరెక్షన్లు ఇస్తారు. బాబా చాలా రాయల్, రాయల్ కుమార్తెలను పంపిస్తారు. బాబా, మమ్మల్ని ఈ ట్రైనింగ్ కోసం వెళ్ళమంటారా అని కొందరు అంటారు. అప్పుడు బాబా అంటారు, పిల్లలూ, మొదట మీరు మీ లోపాలనైతే తొలగించుకోండి. స్వయాన్ని చూసుకోండి - నాలో ఎన్ని అవగుణాలు ఉన్నాయి? మంచి-మంచి మహారథులను కూడా మాయ ఒక్కసారిగా ఉప్పనీరులా చేసేస్తుంది. ఎటువంటి ఉప్పగా ఉన్న పిల్లలు ఉన్నారంటే, వారు తండ్రిని ఎప్పుడూ స్మృతి కూడా చేయరు. జ్ఞానము యొక్క అ, ఆ, ఇ, ఈ లు కూడా తెలియదు. బాహ్య షో ఎంతో ఉంది. ఇందులోనైతే చాలా అంతర్ముఖులుగా ఉండాలి, కానీ కొందరి నడవడిక ఎలా ఉంటుందంటే దానితో వారు చదువురాని జాట్ జాతికి (జాట్ జాతి అనేది వ్వయసాయము చేసుకునేవారి ఒక జాతి) చెందినవారిలా ఉంటారు. ఏదో కాస్త ధనము ఉంటే దాని నషా ఎక్కిపోతుంది. అరే, మేము నిరుపేదలుగా ఉన్నామే అని భావించరు. మాయ అలా భావించనివ్వదు. మాయ చాలా శక్తివంతమైనది. బాబా కాస్త మహిమ చేస్తే అందులో ఎంతో సంతోషపడిపోతారు.

బాబాకు రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన నడుస్తూ ఉంటుంది - యూనివర్సిటీ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి, అందులో పిల్లలు బాగా చదువుకోవాలి. మనము స్వర్గములోకి వెళ్తామని మీకు తెలుసు కావున సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉండాలి కదా. ఇక్కడ బాబా రకరకాల డోస్ లు ఇస్తారు, నషా ఎక్కిస్తారు. ఎవరైనా దివాలా తీసి ఉంటే, వారికి మద్యము తాగిస్తే, నేను చక్రవర్తిని అని భావిస్తారు, మళ్ళీ నషా తగ్గిపోతే ఎలా ఉన్నవారు అలా అయిపోతారు. ఇప్పుడు ఇది ఆత్మిక నషా. మీకు తెలుసు - అనంతమైన తండ్రి టీచరుగా అయి మనల్ని చదివిస్తారు మరియు ఇలా, ఇలా చేయండి అని డైరెక్షన్లు ఇస్తారు. కొన్ని-కొన్ని సమయాలలో కొందరికి అసత్యమైన అహంకారము కూడా వచ్చేస్తుంది. మాయ ఉంది కదా. ఎటువంటి విషయాలను తయారుచేస్తారో ఇక అడగకండి. వీరు ఇక నడవలేరు అని బాబా భావిస్తారు. ఆంతరిక స్వచ్ఛత చాలా కావాలి. ఆత్మ చాలా మంచిగా ఉండాలి. మీకు లవ్ మ్యారేజ్ జరిగింది కదా. లవ్ మ్యారేజ్ లో ఎంత ప్రేమ ఉంటుంది. వీరైతే పతులకే పతి. అందులోనూ ఎంతమందికి లవ్ మ్యారేజ్ జరుగుతుంది. ఒక్కరిదే జరగదు కదా. మాకు శివబాబాతో నిశ్చితార్థము జరిగింది, మేమైతే స్వర్గములోకి వెళ్ళి కూర్చుంటాము అని అందరూ అంటారు. ఇది సంతోషించే విషయము కదా. బాబా మనల్ని ఎంతగా అలంకరిస్తారు అని లోలోపల అనిపించాలి కదా. శివబాబా వీరి ద్వారా అలంకరిస్తారు. మేము తండ్రిని స్మృతి చేస్తూ, చేస్తూ సతోప్రధానముగా అయిపోతాము అని మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానము గురించి ఇంకెవరికీ తెలియదు. ఇందులో చాలా నషా ఉంటుంది. ప్రస్తుతం అంతటి నషా ఎక్కడం లేదు కానీ అది తప్పకుండా జరగనున్నది. అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను అడగండి అన్న గాయనము కూడా ఉంది. ఇప్పుడు మీ ఆత్మలు ఎంత అశుద్ధముగా ఉన్నాయి. చాలా ఛీ-ఛీ చెత్తలో కూర్చున్నట్లుగా ఉన్నారు. వారిని తండ్రి వచ్చి మారుస్తారు, తిరిగి శక్తిని ఇస్తారు. మనుష్యులకు గ్రంథులు మార్చుకున్నప్పుడు వారికి ఎంత సంతోషము కలుగుతుంది. మీకైతే ఇప్పుడు తండ్రి లభించారు కావున మీ నావ ఆవలి తీరానికి చేరుకుంది. మేము అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము అని భావిస్తారు, మరి స్వయాన్ని ఎంత త్వరగా తీర్చిదిద్దుకోవాలి. రాత్రింబవళ్ళు ఇదే సంతోషము, ఇదే చింతన ఉండాలి - మీకు ఎటువంటి మార్షల్ లభించారో చూడండి! రాత్రింబవళ్ళూ ఇదే ఆలోచనలో ఉండవలసి ఉంటుంది. ఎవరెవరైతే బాగా అర్థం చేసుకుంటారో, గుర్తిస్తారో, వారు ఇక ఎగరడం మొదలుపెడతారు.

పిల్లలైన మీరు ఇప్పుడు సంగమములో ఉన్నారు. మిగిలినవారంతా చెత్తలో పడి ఉన్నారు. ఏ విధముగా చెత్త పక్కన గుడిసెలు వేసుకుని అశుద్ధతలో కూర్చుని ఉంటారు కదా. ఎన్ని చిన్న-చిన్న గుడిసెలు తయారై ఉంటాయి. అలా ఇది అనంతమైన విషయము. ఇప్పుడు దీని నుండి బయటపడేందుకు శివబాబా మీకు చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. మధురాతి మధురమైన పిల్లలూ, మీకు తెలుసు కదా, ఈ సమయములో మీ ఆత్మ మరియు శరీరము, రెండూ పతితముగా ఉన్నాయి. ఇప్పుడు మీరు దాని నుండి బయటకు వచ్చారు. ఎవరెవరైతే బయటకు వచ్చారో, వారిలో జ్ఞాన పరాకాష్ఠ ఉంది కదా. మీకు తండ్రి లభించారు, ఇంకేమిటి! ఈ నషా ఎప్పుడైతే ఎక్కుతుందో అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలుగుతారు. తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి మన ఆత్మను పవిత్రముగా తయారుచేస్తారు. ఆత్మ పవిత్రముగా అవ్వడముతో ఇక శరీరము కూడా ఫస్ట్ క్లాస్ అయినది లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ ఎక్కడ కూర్చుంది? ఈ చిన్న గుడిసెలో (శరీరములో) కూర్చొని ఉంది. ఇది తమోప్రధాన ప్రపంచము కదా. చెత్తాచెదారం పక్కకు వచ్చి కూర్చున్నారు కదా. మేము ఎక్కడ నుండి బయటకు వచ్చాము అని ఆలోచించండి. తండ్రి మురికి కాలువ నుండి బయటకు తీసారు. ఇప్పుడు మన ఆత్మ స్వచ్ఛముగా అయిపోతుంది. ఉండడానికి కూడా ఫస్ట్ క్లాస్ మహళ్ళను తయారుచేస్తారు. మన ఆత్మను తండ్రి అలంకరించి స్వర్గములోకి తీసుకువెళ్తున్నారు. పిల్లలకు లోలోపల ఇటువంటి ఆలోచనలు రావాలి. తండ్రి ఎంతగా నషాను ఎక్కిస్తారు. మీరు ఇంత ఉన్నతముగా ఉండేవారు, మళ్ళీ పడిపోతూ, పడిపోతూ కిందకు వచ్చి పడ్డారు. శివాలయములో ఉన్నప్పుడు ఆత్మ ఎంత శుద్ధముగా ఉండేది. కావున మళ్ళీ పరస్పరం కలుసుకుని త్వరత్వరగా శివాలయములోకి వెళ్ళే ఉపాయాన్ని ఆలోచించాలి.

పిల్లలకు ఈ తెలివి లేదా అని బాబాకైతే ఆశ్చర్యము కలుగుతుంది. బాబా మనల్ని ఎక్కడ నుండి బయటకు తీస్తారు! పాండవ గవర్నమెంటును స్థాపన చేసేవారు తండ్రియే. ఏ భారత్ అయితే స్వర్గముగా ఉండేదో, అది ఇప్పుడు నరకముగా ఉంది. ఇది ఆత్మకు సంబంధించిన విషయము. ఆత్మపైనే దయ కలుగుతుంది. ఆత్మ వచ్చి పూర్తిగా తమోప్రధానమైన ప్రపంచములో కూర్చొంది, అందుకే - బాబా, మమ్మల్ని అక్కడకు తీసుకువెళ్ళండి అని తండ్రిని తలచుకుంటుంది. ఇక్కడ కూర్చుని ఉంటూ కూడా మీరు ఈ ఆలోచనలను ఆలోచించాలి. అందుకే బాబా అంటారు, పిల్లల కోసం ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీని తయారుచేయండి అని. అది కల్ప-కల్పమూ తయారవుతుంది. మీ ఆలోచనలు చాలా రాయల్ గా ఉండాలి. ప్రస్తుతం ఇంకా ఆ నషా ఎక్కలేదు. నషా ఉన్నట్లయితే ఇక ఏం చేసి చూపిస్తారో తెలియదు. పిల్లలు యూనివర్సిటీ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. ఆ రాయల్టీతో కూడిన నషాలో ఉండరు. మాయ అణిచివేసి కూర్చుంది. బాబా అర్థం చేయిస్తారు - పిల్లలూ, తప్పుడు నషాను ఎక్కించుకోకండి. ప్రతి ఒక్కరూ తమ-తమ అర్హతలను చూసుకోండి. మేము ఎలా చదువుతున్నాము, ఏం సహాయం చేస్తున్నాము అని చూసుకోండి, కేవలం అలా అనవసరమైన మాటలు మాట్లాడటం కాదు. ఏదైతే మాట్లాడుతారో, అది చేయాలి. ఇది చేస్తాము, అది చేస్తాము అని ప్రగల్భాలు పలకడం కాదు. ఈ రోజు ఇది చేస్తాము అని అంటారు, రేపు మృత్యువు వస్తే అంతమైపోతారు. సత్యయుగములో అలా అనరు. అక్కడ ఎప్పుడూ అకాలమృత్యువు ఉండదు. మృత్యువు అక్కడకు రాలేదు. అది ఉన్నదే సుఖధామము. సుఖధామములోకి వచ్చేందుకు మృత్యువుకు అనుమతి లేదు. రావణ రాజ్యము మరియు రామ రాజ్యము యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ యుద్ధము రావణునితోనే ఉంది. దేహాభిమానము కూడా అద్భుతము చేస్తుంది, అది పూర్తిగా పతితలుగా చేసేస్తుంది. దేహీ-అభిమానులుగా ఉండడం ద్వారా ఆత్మ శుద్ధముగా అయిపోతుంది. అక్కడ మన మహళ్ళు ఎలా తయారవుతాయి అనేది మీరు అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరైతే సంగమములోకి వచ్చేసారు. నంబరువారుగా బాగవుతూ ఉన్నారు, అర్హులుగా అవుతున్నారు. మీ ఆత్మ పతితముగా అయిన కారణముగా శరీరము కూడా పతితముగా లభించింది. ఇప్పుడు నేను మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారుచేయడానికి వచ్చాను. స్మృతితోపాటు దైవీ గుణాలు కూడా కావాలి. ఇది అంత సులువైన విషయమేమీ కాదు. బాబా మనల్ని నరుని నుండి నారాయణునిగా తయారుచేయడానికి వచ్చారు అని భావిస్తారు, కానీ మాయ చాలా గుప్తముగా ఎదుర్కొంటుంది. మీ యుద్ధము గుప్తమైనది, అందుకే మిమ్మల్ని గుప్త యోధులు అని అంటారు. ఇలా గుప్త యోధులు ఇంకెవరూ ఉండరు. యోధులు అన్నది మీ పేరే. మిగిలినవారందరి పేర్లూ రిజిస్టర్ లో ఉంటాయి. గుప్త యోధులైన మీ గుర్తులను వారు పట్టుకున్నారు. మీరు ఎంత గుప్తమైనవారు, మీ గురించి ఎవరికీ తెలియదు. మీరు మాయను వశం చేసుకునేందుకు విశ్వముపై విజయాన్ని పొందుతున్నారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, అయినా మాయ మరపింపజేస్తుంది. కల్ప-కల్పమూ మీరు మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటారు. కావున మీరు ఎవరైతే కేవలం తండ్రినే స్మృతి చేస్తారో, వారే గుప్త యోధులు. ఇందులో కాళ్ళు, చేతులను ఏమీ ఉపయోగించరు. స్మృతి కొరకు యుక్తులను కూడా బాబా ఎన్నో తెలియజేస్తారు. నడుస్తూ, తిరుగుతూ మీరు స్మృతియాత్రను చేయండి, చదువును కూడా చదువుకోండి. మేము ఎలా ఉన్నవారము ఎలా అయిపోయాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పడు మళ్ళీ బాబా మనల్ని ఎలా తయారుచేస్తున్నారు. ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఎక్కడ ఉన్నా సరే స్మృతి చేస్తూ ఉండండి, తద్వారా తుప్పు వదిలిపోతుంది. కల్ప-కల్పమూ ఈ యుక్తిని ఇస్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అవుతారు, ఇంకెటువంటి బంధనము లేదు. బాత్ రూమ్ లోకి వెళ్ళినా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, తద్వారా ఆత్మలోని మురికి తొలగిపోతుంది. ఆత్మకు తిలకము దిద్దవలసిన అవసరమేమీ లేదు, అవన్నీ భక్తి మార్గములోని గుర్తులు. ఈ జ్ఞాన మార్గములో వాటి అవసరమేమీ లేదు, పైసా ఖర్చు లేదు. ఇంట్లో ఉంటూనే స్మృతి చేస్తూ ఉండండి. ఇది ఎంత సహజము. ఆ బాబా మనకు తండ్రి కూడా, టీచర్ మరియు గురువు కూడా.

మొదట తండ్రి స్మృతి, ఆ తర్వాత టీచర్ స్మృతి, ఆ తర్వాత గురువు స్మృతి. నియమము ఇలా చెప్తుంది కదా. టీచరునైతే తప్పకుండా తలచుకుంటారు, వారి ద్వారా చదువు యొక్క వారసత్వము లభిస్తుంది. మళ్ళీ వానప్రస్థావస్థలో గురువు లభిస్తారు. ఈ తండ్రి అయితే అన్నీ హోల్ సేల్ లో ఇచ్చేస్తారు. మీకు 21 జన్మల కొరకు రాజ్యాన్ని హోల్ సేల్ లో ఇచ్చేస్తారు. వివాహ సమయములో కన్యకు కట్నమును గుప్తముగా ఇస్తారు కదా. అది చూపించుకోవాల్సిన అవసరం లేదు. గుప్త దానము అని అంటారు. శివబాబా కూడా గుప్తమే కదా. ఇందులో అహంకారము యొక్క విషయమేదీ లేదు. కొందరికి, అందరూ చూడాలి అని అహంకారం ఉంటుంది. ఇక్కడ అంతా గుప్తము. తండ్రి మీకు విశ్వరాజ్యాధికారాన్ని కట్నముగా ఇస్తారు. మీ అలంకరణ ఎంత గుప్తముగా జరుగుతోంది. మీకు ఎంత గొప్ప కట్నము లభిస్తుంది. తండ్రి ఎంత యుక్తిగా ఇస్తారంటే, అది ఎవరికీ తెలియను కూడా తెలియదు. ఇక్కడ మీరు బికారులుగా ఉన్నారు, మరుసటి జన్మలో నోటిలో బంగారు చెంచా ఉంటుంది. మీరు బంగారు ప్రపంచములోకి వెళ్తారు కదా. అక్కడ అంతా బంగారమువే ఉంటాయి. షావుకార్ల మహళ్ళలో మంచిగా పొదగబడి ఉంటాయి. తేడా అయితే తప్పకుండా ఉంటుంది. మాయ అందరినీ తలక్రిందులుగా వ్రేలాడదీస్తుంది అని ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున పిల్లలలో ఎంతటి ఉత్సాహము ఉండాలి. కానీ ఇది తండ్రి డైరెక్షనా లేక బ్రహ్మా డైరెక్షనా, ఇది సోదరునిదా లేక తండ్రిదా అని మాయ మరపింపజేస్తుంది. ఈ విషయములోనే ఎంతోమంది తికమకపడతారు. తండ్రి అంటారు, మంచి అయినా లేక చెడు అయినా అది బాబా డైరెక్షన్ గానే భావించండి. దానిపై నడవవలసి ఉంటుంది. ఇతని వల్ల ఏదైనా పొరపాటు జరిగినా సరే, నేను దానిని సరిదిద్దుతాను. వారిలో శక్తి అయితే ఉంది కదా. వీరు ఎలా నడుస్తున్నారు, వీరి శిరస్సుపై ఎవరు కూర్చున్నారు అనేది మీరు చూస్తారు. పూర్తిగా పక్కనే కూర్చున్నారు. గురువులు పక్కన కూర్చొబెట్టుకుని నేర్పిస్తారు కదా. అయినా ఇతను కష్టపడవలసే ఉంటుంది. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వడానికి పురుషార్థము చేయవలసి ఉంటుంది.

తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తూ భోజనము తయారుచేయండి. శివబాబా స్మృతిలో తయారుచేయబడిన భోజనము ఇంకెవరికీ లభించదు. ఇప్పటి ఈ భోజనానికే గాయనము ఉంది. ఆ బ్రాహ్మణులు మహిమను గానము చేసినా కానీ అర్థమేమీ తెలియదు. ఏదైతే మహిమ చేస్తారో దానిని ఏమాత్రమూ అర్థం చేసుకోరు. కేవలం వారు ధార్మిక మనస్కులు అన్నంత వరకు భావించడం జరుగుతుంది ఎందుకంటే వారు పూజారులుగా ఉంటారు. అక్కడైతే ధార్మిక మనస్కులుగా ఉండడమనే విషయమే ఉండదు, అక్కడ భక్తి ఉండదు. అసలు భక్తి అంటే ఏమిటి అన్నది కూడా ఎవరికీ తెలియదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని అనేవారు. ఇవి ఎంత ఫస్ట్ క్లాస్ పదాలు. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. మళ్ళీ రాత్రి పట్ల వైరాగ్యము కలిగినప్పుడు పగలులోకి వెళ్తారు. ఇది ఎంత స్పష్టముగా ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కావున మీరు ఇక ఎదురుదెబ్బలు తినవలసిన అవసరం ఉండదు.

తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తాను. నేను మీ అనంతమైన తండ్రిని. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం కూడా ఎంత సహజము. బీజాన్ని మరియు వృక్షాన్ని స్మృతి చేయండి. ఇప్పుడు ఇది కలియుగ అంతిమము, మళ్ళీ సత్యయుగము రానున్నది. ఇప్పుడు మీరు సంగమయుగములో పుష్పాల వలె అవుతున్నారు. ఆత్మ సతోప్రధానముగా అయిపోతే ఇక ఉండడానికి కూడా సతోప్రధానమైన మహలు లభిస్తుంది. ప్రపంచమే కొత్తగా అయిపోతుంది. కావున పిల్లలకు ఎంతటి సంతోషముండాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మేము శ్రీమతముపై మా పరిస్తాన్ ను స్థాపన చేస్తున్నాము అని సదా నషా ఉండాలి. వ్యర్థమైన చెత్తతో కూడిన విషయాలను వదిలి చాలా ఉల్లాసములో ఉండాలి.

2. మీ ఆలోచనలను చాలా రాయల్ గా ఉంచుకోవాలి. చాలా మంచి రాయల్ యూనివర్సిటీని మరియు హాస్టల్ ను తెరిచే ఏర్పాట్లు చేయాలి. తండ్రికి గుప్తమైన సహాయకులుగా అవ్వాలి, తమ షో చేసుకోకూడదు.

వరదానము:-
నిమిత్తముగా ఏ సేవను చేస్తున్నా అనంతమైన వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేసే అనంతమైన సేవాధారీ భవ

ఇప్పుడు అనంతమైన పరివర్తన యొక్క సేవలో తీవ్రగతిని తీసుకురండి. అలాగని - చేయడమైతే చేస్తున్నాము, ఎంత బిజీగా ఉంటున్నామంటే సమయమే లభించటం లేదు అన్నట్లు ఉండకూడదు. నిమిత్తముగా ఏ సేవను చేస్తున్నా సరే అనంతమైన సహయోగిగా అవ్వగలరు, కేవలము వృత్తి అనంతములో ఉన్నట్లయితే వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటాయి. ఎంతగా అనంతములో బిజీగా ఉంటారో, అంతగా ఏ డ్యూటీ అయితే ఉందో, అది ఇంకా సహజమైపోతుంది. ప్రతి సంకల్పములో, ప్రతి క్షణములో శ్రేష్ఠ వైబ్రేషన్లను వ్యాపింపజేసే సేవ చెయ్యటమే అనంతమైన సేవాధారిగా అవ్వటము.

స్లోగన్:-
శివబాబాతో పాటు కంబైండ్ గా ఉండే శివశక్తుల యొక్క అలంకరణ - జ్ఞానము యొక్క అస్త్ర-శస్త్రాలు.