28-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు, మీకు జ్ఞాన సూర్యుడైన తండ్రి లభించారు, ఇప్పుడు మీరు మేలుకున్నారు కావున ఇతరులను కూడా మేలుకొలపండి’’

ప్రశ్న:-
అనేక రకాల ఘర్షణలకు కారణమేమిటి మరియు దాని నివారణ ఏమిటి?

జవాబు:-
ఎప్పుడైతే దేహాభిమానములోకి వస్తారో, అప్పుడు అనేక రకాల ఘర్షణలు ఏర్పడతాయి, మాయ గ్రహచారము కూర్చుంటుంది. బాబా అంటారు - దేహీ అభిమానులుగా అవ్వండి, సేవలో నిమగ్నమైపోండి. స్మృతియాత్రలో ఉన్నట్లయితే గ్రహచారము తొలగిపోతుంది.

ఓంశాంతి
ఆత్మిక పిల్లల వద్దకు తండ్రి శ్రీమతాన్ని ఇవ్వడానికి మరియు అర్థం చేయించడానికి వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారముగా మొత్తం కార్యమంతా జరగనున్నదని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇంకా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. ఈ భారత్ ను రావణపురి నుండి మళ్ళీ విష్ణుపురిగా తయారుచేయాలి. ఇప్పుడు తండ్రి కూడా గుప్తముగా ఉన్నారు, చదువు కూడా గుప్తమైనదే. సెంటర్లు అయితే చాలా ఉన్నాయి, చిన్న-పెద్ద గ్రామాలలో చిన్న-పెద్ద సెంటర్లు ఉన్నాయి మరియు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలు ఛాలెంజ్ అయితే చేసారు, అది వ్రాయాలి కూడా. ఎప్పుడైనా ఏదైనా లిటరేచర్ తయారుచేసేటప్పుడు అందులో - మేము మా ఈ భారతభూమిని స్వర్గముగా తయారుచేసి తీరుతామని వ్రాయాలి. మీకు కూడా మీ భారతభూమి చాలా ప్రియమైనది, ఎందుకంటే ఈ భారత్ యే 5 వేల సంవత్సరాలు క్రితం స్వర్గముగా ఉండేదని మీకు తెలుసు. భారత్ చాలా సుందరముగా ఉండేది, దానిని స్వర్గమని అంటారు. బ్రహ్మా ముఖవంశావళి అయిన మీకు మాత్రమే ఈ జ్ఞానముంది. మనము ఈ భారత్ ను శ్రీమతమనుసారముగా స్వర్గముగా తప్పకుండా తయారుచేయాలి. అందరికీ మార్గాన్ని తెలియజేయాలి, అంతేకానీ గొడవల గురించిన విషయాలేవీ లేవు. ఎలాగైతే గవర్నమెంట్ వారు పరస్పరము కలుసుకుని - భారత్ ను మనము ఎలా తీర్చిదిద్దాలి, ఇక్కడ ఇన్ని అభిప్రాయ బేధాలు ఏవైతే ఏర్పడ్డాయో వాటిని పరస్పరము కలుసుకుని ఎలా సరి చేయాలి మరియు భారత్ లో సుఖ-శాంతులను ఎలా స్థాపన చేయాలి అని చర్చించుకుంటారో, అలా మీరు కూడా - వార్తాపత్రికలలో కూడా చిత్రాలు ముద్రింపబడే విధముగా, మనము ఈ ప్రదర్శనీలోని చిత్రాల ద్వారా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అని పరస్పరము చర్చించుకోవాలి, పరస్పరము దీని గురించి సెమినార్ చేసుకోవాలి. ఆ గవర్నమెంట్ లో కూడా పురుషార్థము నడుస్తుంది. మీరు కూడా పాండవ గవర్నమెంట్ గా గాయనము చేయబడ్డారు. ఇది పెద్ద ఈశ్వరీయ గవర్నమెంట్, దీనిని వాస్తవానికి పావనమైన ఈశ్వరీయ గవర్నమెంట్ అని అంటారు, పతిత-పావనుడైన తండ్రియే కూర్చుని పతిత పిల్లలను పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తారు. ఈ విషయము పిల్లలకు మాత్రమే తెలుసు. ముఖ్యమైనది భారత్ యొక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞమని కూడా పిల్లలకు తెలుసు. ఈశ్వరుడైన తండ్రినే, శివుడినే రుద్రుడని అంటారు. తప్పకుండా తండ్రి వచ్చి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారని అంటూ ఉంటారు. వారు ఆ కాలాన్ని పొడిగించి ఎక్కువగా చూపించారు. అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి మేలుకొలిపారు, మీరు మళ్ళీ ఇతరులను మేలుకొలపాలి. డ్రామా ప్లాన్ అనుసారముగా మీరు మేలుకొలుపుతూ ఉంటారు. ఇప్పటివరకు, ఎవరు ఏయే విధముగా, ఎంతెంత పురుషార్థము చేసారో, కల్పక్రితము కూడా అంతే చేసారు. అయితే, యుద్ధ మైదానములో గెలుపు-ఓటములైతే ఉంటూనే ఉంటాయి. అప్పుడప్పుడు మాయ శక్తివంతము అవుతుంది, అప్పుడప్పుడు ఈశ్వరీయ సంతానము శక్తివంతమవుతారు. అప్పుడప్పుడు సేవ చాలా మంచిగా, వేగవంతముగా జరుగుతుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ పిల్లలకు మాయ విఘ్నాలు కలుగుతాయి, మాయ పూర్తిగా మూర్ఛితులుగా చేసేస్తుంది. ఇది యుద్ధ మైదానము కదా. రావణ మాయ, రాముని సంతానాన్ని మూర్ఛితులుగా చేసేస్తుంది. లక్ష్మణుడి గురించి కూడా కథ ఉంది కదా.

మనుష్యులందరూ కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్నారని మీరు అంటారు. ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారైన మీరు మాత్రమే ఈ విధముగా అంటారు. ఎవరికైతే జ్ఞాన సూర్యుడు లభించారో మరియు ఎవరైతే మేలుకున్నారో, వారే అర్థం చేసుకుంటారు. ఇందులో ఒకరికొకరు చెప్పుకునే విషయము కూడా ఏమీ లేదు. తప్పకుండా ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన మనము మేలుకున్నామని, మిగిలినవారంతా నిద్రపోతున్నారని మీకు తెలుసు. పరమపిత పరమాత్మ పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చేసారని వారికి తెలియదు, వారు ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. తండ్రి భారత్ లోనే వస్తారు, వచ్చి భారత్ ను స్వర్గానికి యజమానిగా తయారుచేస్తారు. భారత్ స్వర్గానికి యజమానిగా ఉండేది, ఇందులో ఎటువంటి సంశయము లేదు. పరమపిత పరమాత్ముని జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. శివజయంతిని జరుపుతారు కదా, అంటే తప్పకుండా వారు వచ్చి ఏదో చేసి ఉంటారు కదా. వారు తప్పకుండా వచ్చి స్వర్గ స్థాపన చేసి ఉంటారని బుద్ధి చెప్తుంది. ప్రేరణ ద్వారా స్థాపన జరగదు. ఇక్కడైతే పిల్లలైన మీకు రాజయోగము నేర్పించడము జరుగుతుంది, స్మృతియాత్ర గురించి అర్థం చేయించడము జరుగుతుంది. ప్రేరణ ద్వారా ఎటువంటి శబ్దము వ్యాపించదు. శంకరుని ప్రేరణ కూడా ఉంటుందని, అప్పుడే ఈ యాదవులు మిసైల్స్ మొదలైనవి తయారుచేస్తారని భావిస్తారు. కానీ ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. డ్రామాలో ఈ మిసైల్స్ మొదలైనవి తయారుచేసే పాత్ర వారికి ఉందని మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. డ్రామానుసారముగా వినాశనమైతే తప్పకుండా జరగవలసిందే. మహాభారత యుద్ధములో ముసలాలు ఉపయోగించారని అంటూ ఉంటారు. ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము భారత్ లో స్వర్గ స్థాపన చేస్తాము, అక్కడ ఒకే ధర్మము ఉంటుంది అని మీరు గ్యారెంటీ ఇస్తారు. అయితే, అనేక ధర్మాలు వినాశనమవుతాయి అన్న మాటను మీరు వ్రాయరు. స్వర్గ స్థాపన జరిగినప్పుడు ఇంకే ధర్మము ఉండదని చిత్రములో వ్రాయబడి ఉంది, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అందరికన్నా గొప్ప పాత్ర శివునిది, బ్రహ్మాది మరియు విష్ణువుది. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు - ఇవి చాలా గుహ్యమైన విషయాలు. విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు, బ్రహ్మా నుండి మళ్ళీ విష్ణువుగా ఎలా అవుతారు, ఇది తెలివైన పిల్లల బుద్ధిలోకి వెంటనే వస్తుంది. దైవీ సాంప్రదాయులైతే తయారవుతారు, ఇది కేవలం ఒక్కరి విషయమే కాదు. ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ప్రపంచములో ఒక్కరు కూడా అర్థం చేసుకోరు. లక్ష్మీ-నారాయణులను మరియు విష్ణువును కూడా పూజిస్తారు, కానీ విష్ణువు యొక్క రెండు రూపాలే లక్ష్మీ-నారాయణులని, వారే కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారని వారికి తెలియదు. ఇకపోతే, నాలుగు భుజాలు గల మనుష్యులెవ్వరూ ఉండరు. సూక్ష్మవతనములో విష్ణువును ప్రవృత్తి మార్గము యొక్క లక్ష్యము-ఉద్దేశ్యముగా చూపిస్తారు. ఈ మొత్తం ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది ఎవ్వరికీ తెలియదు. తండ్రి గురించే తెలియనప్పుడు ఇక తండ్రి యొక్క రచన గురించి ఎలా తెలుసుకోగలరు. తండ్రియే రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తెలియజేస్తారు, ఋషులు-మునులు కూడా మాకు తెలియదు అని అనేవారు. తండ్రిని తెలుసుకుంటే, రచన యొక్క ఆదిమధ్యాంతాలను కూడా తెలుసుకుంటారు. తండ్రి అంటారు - నేను ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లలైన మీకు కూడా మొత్తం జ్ఞానాన్ని అర్థం చేయిస్తాను, ఇక తర్వాత రానే రాను, మరి అటువంటప్పుడు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను ఎలా తెలుసుకోగలరు. తండ్రి స్వయంగా అంటారు - నేను సంగమయుగములో తప్ప ఇంకెప్పుడూ రాను, నన్ను పిలవడము కూడా సంగమములోనే పిలుస్తారు. పావనమైనది అని సత్యయుగాన్ని అంటారు, కలియుగాన్ని పతితమైనదని అంటారు. కావున తప్పకుండా నేను పతిత ప్రపంచము యొక్క అంతిమములోనే వస్తాను కదా. కలియుగాంతములో వచ్చి పతితము నుండి పావనముగా తయారుచేస్తాను. సత్యయుగము ఆదిలో పావనముగా ఉంటారు, ఇది సహజమైన విషయము కదా. పతిత-పావనుడైన తండ్రి ఎప్పుడు వస్తారు అనేది మనుష్యులు ఏమీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు దీనిని కలియుగము యొక్క అంతిమము అని అంటారు. ఒకవేళ కలియుగానికి ఇంకా 40 వేల సంవత్సరాలు ఉన్నాయంటే, ఇంకెంత పతితముగా అవుతారు! ఎంత దుఃఖము ఉంటుంది! ఇక సుఖమనేది అసలు ఉండనే ఉండదు. వారికేమీ తెలియని కారణముగా పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. మీరు అర్థం చేసుకోగలరు. కనుక పిల్లలు పరస్పరములో కలుసుకోవాలి. చిత్రాలపై మంచి రీతిలో అర్థం చేయించవలసి ఉంటుంది. చిత్రాలు మొదలైనవన్నీ కూడా డ్రామానుసారముగా తయారుచేసారు. ఏదైతే సమయము గడుస్తూ ఉంటుందో, డ్రామా మళ్ళీ యథావిధిగా అలాగే నడుస్తూ ఉంటుందని పిల్లలకు తెలుసు. పిల్లల అవస్థలు కూడా అప్పుడప్పుడు కిందకు, అప్పుడప్పుడు పైకి అవుతూ ఉంటాయి. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. అప్పుడప్పుడు గ్రహచారము కూర్చుంటుంది, అప్పుడు దానిని తొలగించడానికి ఎంతగా ప్రయత్నిస్తారు.

బాబా ఘడియ, ఘడియ చెప్తూ ఉంటారు - పిల్లలూ, మీరు దేహాభిమానములోకి వస్తారు, అందుకే ఘర్షణ జరుగుతుంది, ఇందులో దేహీ-అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. పిల్లలలో దేహాభిమానము చాలా ఉంది. మీరు దేహీ-అభిమానులుగా అయినట్లయితే తండ్రి స్మృతి ఉంటుంది మరియు సేవలో ఉన్నతి చెందుతూ ఉంటారు. ఎవరైతే ఉన్నత పదవిని పొందేది ఉందో, వారు సదా సేవలో నిమగ్నమై ఉంటారు. భాగ్యములో లేకపోతే మరి పురుషార్థము కూడా చేయరు. వారు స్వయం అంటారు - బాబా, మాకు ధారణ జరగడము లేదు, బుద్ధిలో కూర్చోవడము లేదు. ఎవరికైతే ధారణ జరుగుతుందో, వారికి సంతోషము కూడా చాలా కలుగుతుంది. వారు శివబాబా వచ్చి ఉన్నారని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, మీరు మంచి రీతిలో అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించండి. కొంతమందైతే సేవలోనే నిమగ్నమై ఉంటారు, పురుషార్థము చేస్తూ ఉంటారు. ఏ క్షణమైతే గడుస్తుందో, అది డ్రామాలో నిశ్చితమై ఉందని, అది మళ్ళీ అలాగే రిపీట్ అవుతుందని కూడా పిల్లలకు తెలుసు. బయట భాషణ మొదలైనవి చేసినప్పుడు, అవి వినడానికి అనేక రకాల కొత్తవారు వస్తారని పిల్లలకు అర్థం చేయించడము జరుగుతుంది. గీత, వేద శాస్త్రాలు మొదలైనవాటిపై ఎంతమంది మనుష్యులు భాషణ చేస్తారు అనేది మీకు తెలుసు, కానీ వారికి - ఇక్కడ ఈశ్వరుడు తన గురించి మరియు తన రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని తెలియదు. రచయితే వచ్చి మొత్తం జ్ఞానాన్ని వినిపిస్తారు. త్రికాలదర్శులుగా తయారుచేయడమనేది కేవలం తండ్రి పనే. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. ఇవి కొత్త విషయాలు. బాబా పదే-పదే అర్థం చేయిస్తారు - ఎక్కడికి వెళ్ళినా సరే, మొట్టమొదట, గీతా భగవానుడు ఎవరు - శ్రీకృష్ణుడా లేక నిరాకార శివుడా అన్నది అర్థం చేయించండి. ఈ విషయాలను మీరు ప్రొజెక్టర్ ద్వారా అర్థం చేయించలేరు. ప్రదర్శనీలో చిత్రాలు ఎదురుగా ఉంటాయి, వాటిని చూపించి అర్థం చేయించి అప్పుడు - గీతా భగవానుడు ఎవరు, జ్ఞానసాగరుడు ఎవరు, ఇప్పుడు చెప్పండి అని వారిని అడగవచ్చు. శ్రీకృష్ణుడు అనైతే చెప్పలేరు. పవిత్రత మరియు సుఖ-శాంతుల సాగరుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు ఎవరు? మొట్టమొదటైతే ఈ విషయము వారితో వ్రాయించాలి, ఫారమ్ నింపించాలి, ఆ తర్వాత అందరి నుండి సంతకాలు తీసుకోవాలి.

(పక్షుల శబ్దము వినిపించింది) ఎంత కొట్లాడుకుంటున్నాయో చూడండి. ఈ సమయములో మొత్తం ప్రపంచములో గొడవలు-కొట్లాటలే ఉన్నాయి. మనుష్యులు కూడా పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు. మనుష్యుల్లోనే అర్థం చేసుకునే బుద్ధి ఉంది. 5 వికారాలు కూడా మనుష్యుల్లోనే ఉన్నాయని అంటారు. ఇక్కడ జంతువుల విషయమేమీ లేదు. ఇది వికారీ ప్రపంచము. ప్రపంచము అని మనుష్యుల కోసమే అంటారు. కలియుగములో ఆసురీ సాంప్రదాయులు ఉంటారు, సత్యయుగములో దైవీ సాంప్రదాయులు ఉంటారు. ఇప్పుడు మీకు ఈ తేడా గురించి పూర్తిగా తెలిసింది కనుక మీరు ఋజువు చేసి చెప్పగలరు. మెట్ల వరుస చిత్రములో కూడా చాలా స్పష్టముగా చూపించడము జరిగింది, కింద పతితమైనవారు ఉన్నారు, పైన పావనమైనవారు ఉన్నారు. ఇందులో చాలా స్పష్టముగా ఉంది. మెట్ల వరుస చిత్రమే ముఖ్యమైనది - అందులో దిగే కళను మరియు ఎక్కే కళను చూపించారు. ఈ మెట్ల వరుస చిత్రము చాలా బాగుంది. ఇది తప్పకుండా పతిత ప్రపంచమని, స్వర్గము పావన ప్రపంచమని మనుష్యులు మంచి రీతిలో పూర్తిగా అర్థం చేసుకునే విధముగా ఈ చిత్రములో ఏమి చూపించాలి. ఇక్కడ అందరూ పతితముగా ఉన్నారు, పావనమైనవారు ఒక్కరు కూడా ఉండరు. రాత్రింబవళ్ళు ఈ ఆలోచనలు నడవాలి. బాబా, ఈ చిత్రము తయారుచేయనా అని ఆత్మప్రకాష్ బిడ్డ వ్రాస్తారు. అప్పుడు బాబా అంటారు - విచార సాగర మంథనము చేసి ఏ చిత్రాన్ని అయినా తయారుచేయండి పర్వాలేదు కానీ మెట్ల వరుస చిత్రము చాలా బాగా తయారవ్వాలి. మీరు 84 జన్మలను పూర్తి చేసుకుని మళ్ళీ మొదటి నంబరు జన్మ తీసుకున్నారు, దిగే కళ నుండి మళ్ళీ ఎక్కే కళలోకి వెళ్ళాలి అని ఈ చిత్రములో చాలా బాగా అర్థం చేయించవచ్చు. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లేదంటే సేవ ఎలా చేయగలరు. చిత్రాలపై అర్థం చేయించడము చాలా సహజము. సత్యయుగము తర్వాత మెట్లు దిగవలసి ఉంటుంది. మనము పాత్రధారులమని, నటులమని కూడా పిల్లలకు తెలుసు. ఇక్కడ నుండి నేరుగా సత్యయుగములోకి ట్రాన్స్ఫర్ అవ్వరు, మొదట శాంతిధామానికి వెళ్ళాలి. ఈ డ్రామాలో స్వయాన్ని పాత్రధారులుగా భావించేవారు మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ప్రపంచములో ఎవ్వరూ మేము పాత్రధారులమని అనలేరు. పాత్రధారులు, యాక్టర్లు అయి ఉండి కూడా డ్రామా యొక్క క్రియేటర్, డైరెక్టర్ గురించి, ఆదిమధ్యాంతాల గురించి తెలుసుకోలేకపోతే వారు ఫస్ట్ క్లాస్ తెలివిహీనులని మనము వ్రాస్తాము కూడా. ఇదైతే భగవానువాచ. శివ భగవానువాచ బ్రహ్మా తనువు ద్వారా. జ్ఞానసాగరుడు ఆ నిరాకారుడు, వారికి తమదంటూ శరీరము లేదు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన యుక్తులు. పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. మనము ఎవ్వరినీ నిందించము. ఇది రైట్ విషయము కదా. ఎవరైతే పెద్ద-పెద్దవారు ఉన్నారో, వారందరి చిత్రాలను మీరు పెట్టవచ్చు. మెట్ల వరుస చిత్రాన్ని ఎవరికైనా చూపించవచ్చు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. భారత్ లో సుఖ-శాంతులను స్థాపన చేయడానికి మరియు భారత్ ను స్వర్గముగా తయారుచేయడానికి పరస్పరము సెమినార్లు చేసుకోవాలి, శ్రీమతమనుసారముగా భారత్ కు ఇటువంటి సేవను చేయాలి.

2. సేవలో ఉన్నతి చేయడానికి మరియు సేవ ద్వారా ఉన్నత పదవిని పొందడానికి, దేహీ-అభిమానులుగా ఉండే కృషి చేయాలి. జ్ఞానము యొక్క విచార సాగర మంథనము చేయాలి.

వరదానము:-
పవిత్రత ఆధారముగా సుఖ-శాంతులను అనుభవం చేసే నంబర్ వన్ అధికారీ భవ

ఏ పిల్లలైతే ‘‘పవిత్రత’’ యొక్క ప్రతిజ్ఞను సదా స్మృతిలో ఉంచుకుంటారో, వారికి సుఖ-శాంతుల అనుభూతి స్వతహాగా కలుగుతుంది. పవిత్రత అనే అధికారాన్ని తీసుకోవడములో నంబర్ వన్ గా ఉండడము అనగా సర్వ ప్రాప్తులలో నంబర్ వన్ గా అవ్వడము, అందుకే పవిత్రత అనే పునాదిని ఎప్పుడూ బలహీనమవ్వనివ్వకండి, అప్పుడే లాస్ట్ సో ఫాస్ట్ గా వెళ్ళగలరు, ఈ ధర్మములోనే సదా స్థితులై ఉండండి. ఏమి జరిగినా కానీ, వ్యక్తులు కావచ్చు, ప్రకృతి కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఎంత కదిలించినా కానీ, భూమి బద్దలైనా కానీ ధర్మాన్ని విడిచిపెట్టకండి.

స్లోగన్:-
వ్యర్థము నుండి ఇన్నోసెంట్ గా (అమాయకులుగా) అయినట్లయితే సత్యాతి-సత్యమైన సెయింట్ గా (ఋషిగా) అవుతారు.

అవ్యక్త సూచనలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

బాప్ దాదా ఏమి కోరుకుంటారంటే - ప్రతి బిడ్డ ఏకరస శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనధారులుగా, ఏకాంతవాసులుగా, అశరీరులుగా, ఏకతా స్థాపకులుగా, ఏకనామీ మరియు ఎకానమీ యొక్క అవతారముగా అవ్వాలి. ఒకరి ఆలోచనలను ఒకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ఒకరికొకరు సూచనలను ఇచ్చుకుంటూ, ఇచ్చి-పుచ్చుకుంటూ పరస్పరములో సంగఠనా శక్తి యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి ఎందుకంటే మీ సంగఠనలోని ఏకతా శక్తి మొత్తము బ్రాహ్మణ పరివారమంతటినీ సంగఠనలోకి తీసుకువచ్చేందుకు నిమిత్తమవుతుంది.