28-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీకు తండ్రి స్మృతి తప్ప వేరే చింతలేమీ లేవు, ఈ తండ్రికైతే ఎంతైనా చాలా ఆలోచనలు నడుస్తాయి’’

ప్రశ్న:-
తండ్రి వద్ద సుపుత్రులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
వారు అందరి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపజేస్తూ ఉంటారు, సర్వీసబుల్ గా ఉంటారు. మంచి రీతిలో చదువుకుని ఇతరులను చదివిస్తారు. తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారు. ఇటువంటి సుపుత్రులైన పిల్లలే తండ్రి పేరును ప్రఖ్యాతము చేస్తారు. ఎవరైతే పూర్తిగా చదువుకోరో, వారు ఇతరులను కూడా పాడు చేస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది.

పాట:-
తల్లిదండ్రుల ఆశీర్వాదాలను తీసుకోండి...

ఓంశాంతి
ప్రతి ఇంటిలో తల్లిదండ్రులు మరియు ఇద్దరు లేక నలుగురు పిల్లలు ఉంటారు, వారు తల్లిదండ్రుల ఆశీర్వాదాలను కోరుకుంటారు. అవి హద్దులోని విషయాలు. ఈ పాట హద్దులోని విషయాలను గురించి పాడడము జరిగింది. అనంతమైన విషయము గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - మనము అనంతమైన తండ్రికి కుమారులము మరియు కుమార్తెలము. ఆ తల్లిదండ్రులు హద్దులోని వారు, హద్దులోని తల్లిదండ్రుల ఆశీర్వాదాలను తీసుకోండి అని అంటారు. ఇక్కడ ఉన్నది అనంతమైన తల్లి-తండ్రి. ఆ హద్దులోని తల్లిదండ్రులు కూడా పిల్లలను సంభాళిస్తారు, ఆ తర్వాత టీచరు చదివిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - వీరు అనంతమైన తల్లి, తండ్రీ, అనంతమైన టీచర్, అనంతమైన సద్గురువు, సుప్రీమ్ ఫాదర్, టీచర్, సుప్రీమ్ గురువు. వీరు సత్యము వినిపించేవారు, సత్యము నేర్పించేవారు. పిల్లల్లో నంబరువారుగా అయితే ఉంటారు కదా. లౌకిక ఇంట్లో ఇద్దరు లేక నలుగురు పిల్లలు ఉంటే వారిని ఎంతగా సంభాళించవలసి ఉంటుంది. ఇక్కడ ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఎన్ని సెంటర్ల నుండి పిల్లల సమాచారాలు వస్తూ ఉంటాయి - ఫలానా బిడ్డ ఇలా ఉన్నారు, ఫలానా బిడ్డ అల్లరి చేస్తున్నారు, ఫలానా బిడ్డ విసిగిస్తున్నారు, విఘ్నాలను వేస్తున్నారు అని. చింత అయితే ఈ తండ్రికి ఉంటుంది కదా. ప్రజాపిత అయితే వీరు కదా. ఈ తండ్రికి ఎంతమంది పిల్లల గురించిన ఆలోచన ఉంటుంది, అందుకే బాబా అంటారు, పిల్లలైన మీరు మంచి రీతిలో తండ్రి స్మృతిలో ఉండగలరు. ఇతనికైతే కొన్ని వేల చింతలు ఉన్నాయి. స్మృతి చేయాలి అనే చింత అయితే ఎలాగూ ఉంది, దానితోపాటు వేరే చింతలు (ఆలోచనలు) కొన్ని వేలు ఉంటాయి. ఎంతమంది పిల్లలను సంభాళించవలసి ఉంటుంది. మాయ కూడా పెద్ద శత్రువు కదా. చాలా బాగా కొందరి చర్మాన్ని ఒలిచేస్తుంది, కొందరి ముక్కును, కొందరి పిలకను పట్టుకుంటుంది. వీరందరి గురించి ఆలోచించవలసి ఉంటుంది. అంతేకాక అనంతమైన తండ్రి స్మృతిలో కూడా ఉండాల్సి ఉంటుంది. మీరు అనంతమైన తండ్రి పిల్లలు. మేము బాబా శ్రీమతముపై నడుస్తూ బాబా నుండి పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు అని మీరు భావిస్తారు. అందరూ ఒకేలా నడవలేరు ఎందుకంటే ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది, ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోకి రావు. ఇది చాలా ఉన్నతమైన చదువు. రాజ్యము లభించిన తర్వాత, ఈ రాజ్యము ఎలా స్థాపన అయ్యింది అనేది తెలియదు. ఈ రాజ్య స్థాపన జరగడము చాలా అద్భుతముగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవీలు. తాను ఎలా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు ఎలా తీసుకున్నారు అనేది ఇంతకుముందు ఇతనికి కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అర్థమయ్యింది. మీరు కూడా అంటారు - బాబా, మీరు కల్పపూర్వము యొక్క ఆ తండ్రియే, ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయము. ఈ సమయములోనే తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ఈ సమయములో ఎవరు ఎంత లక్షాధికారులైనా, కోటీశ్వరులైనా కానీ తండ్రి అంటారు, ఈ ధనము మొదలైనదంతా మట్టిలో కలిసిపోనున్నది. ఇంకా సమయము కూడా ఎంత మిగిలి ఉంది. ప్రపంచములో ఏమేమి జరుగుతుంది అనే సమాచారము మీరు రేడియోలలో మరియు వార్తాపత్రికల ద్వారా వింటూ ఉంటారు. రోజురోజుకు గొడవలు బాగా పెరుగుతూ ఉన్నాయి. దారము చిక్కులు పడుతూనే ఉంటుంది. అందరూ పరస్పరము గొడవపడుతూ, కొట్లాడుకుంటూ, చనిపోతూ ఉంటారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటే, యుద్ధము ఇప్పుడిక ప్రారంభమవ్వబోతుంది అన్నది అర్థమవుతుంది. ఏం జరుగుతోంది మరియు ఏం జరగబోతోంది అనేది ప్రపంచానికి తెలియదు! మీలో కూడా పూర్తిగా అర్థము చేసుకుని సంతోషముగా ఉండేవారు చాలా తక్కువమందే ఉన్నారు. ఈ ప్రపంచములో మనము ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటాము. ఇప్పుడు మనము కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ తమ కొరకు పురుషార్థము చేసుకోవాలి. మీరైతే మీ కోసమే పురుషార్థము చేసుకుంటారు. ఎవరు ఎంత చేసుకుంటే అంత ఫలము పొందుతారు. స్వయమూ పురుషార్థము చేయాలి మరియు ఇతరుల చేత కూడా పురుషార్థము చేయించాలి. మార్గము తెలియజేయాలి. ఈ పాత ప్రపంచము ఇక అంతము కానున్నది. ఇప్పుడు బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు, అందుకే ఈ వినాశనము కంటే ముందే మీరు కొత్త ప్రపంచము కొరకు చదువు చదువుకోండి. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ప్రియమైన పిల్లలూ, మీరు ఎంతో భక్తి చేసారు. అర్ధకల్పము మీరు రావణ రాజ్యములో ఉన్నారు కదా. రామా అని ఎవరిని అంటారు, రామ రాజ్యము ఎలా స్థాపన అయ్యింది అనేది కూడా ఎవరికీ తెలియదు. ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీకే తెలుసు. మీలో కూడా కొందరు ఎలా ఉన్నారంటే, వారికి అసలు ఏమీ తెలియదు.

తండ్రి వద్ద సుపుత్రులైన పిల్లలు ఎవరంటే, ఎవరైతే అందరి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపజేస్తారో వారు. ఎవరైతే సర్వీసబుల్ గా ఉంటారో, ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉన్నారు. కొందరు అనర్హులుగా కూడా ఉంటారు, వారు సర్వీస్ కు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు, తండ్రి నుండి ఇతరుల బుద్ధియోగాన్ని తెంచివేస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. డ్రామానుసారముగా ఇది జరగవలసిందే. ఎవరైతే పూర్తిగా చదవరో, వారు ఏమి చేస్తారు? ఇతరులను కూడా పాడు చేస్తూ ఉంటారు, అందుకే పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది - తండ్రిని ఫాలో చేయండి మరియు సర్వీసబుల్ పిల్లలెవరైతే ఉన్నారో, బాబా హృదయాన్ని అధిరోహించి ఉన్నారో, వారి సాంగత్యము చేయండి. నేను ఎవరి సాంగత్యము చేయాలి? అని మీరు అడగవచ్చు. వీరి సాంగత్యము చాలా మంచిది అని బాబా వెంటనే చెప్తారు. చాలా మంది ఎటువంటివారితో సాంగత్యము చేస్తారంటే, దాని వలన వారికి తప్పుడు రంగు అంటుకుంటుంది. సత్సాంగత్యము తీరము చేరుస్తుందని, చెడు సాంగత్యము ముంచేస్తుందని అంటూ ఉంటారు కూడా. చెడు సాంగత్యము అంటుకుంటే పూర్తిగా నాశనము చేసేస్తారు. ఇంటిలో కూడా దాస-దాసీలు కావాలి. ప్రజలకు కూడా నౌకరులు మొదలైనవారంతా కావాలి కదా. ఇక్కడ రాజధాని అంతా స్థాపన అవుతూ ఉంది. ఇందులో చాలా విశాలబుద్ధి కావాలి, అందుకే అనంతమైన తండ్రి లభించారు, కావున వారి శ్రీమతము తీసుకుని దానిపై నడవండి. లేకపోతే అనవసరముగా పదవీ భ్రష్టులుగా అవుతారు. ఇది చదువు, ఇందులో ఇప్పుడు ఫెయిల్ అయితే జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పాంతరాలు ఫెయిల్ అవుతూ ఉంటారు. బాగా చదువుకుంటే కల్ప-కల్పాంతరాలు బాగా చదువుకుంటూ ఉంటారు. వీరు పూర్తిగా చదువుకోవటం లేదు అని అర్థమవుతుంది, మరి వారికి ఎటువంటి పదవి లభిస్తుంది? స్వయం కూడా అర్థం చేసుకుంటారు, నేను సేవ ఏమీ చేయడము లేదు, నా కంటే చురుకైనవారు చాలా మంది ఉన్నారు అని. చురుకుగా ఉండేవారినే భాషణ కొరకు పిలుస్తారు. కావున తప్పకుండా చురుకైనవారు ఎవరైతే ఉంటారో, ఉన్నత పదవిని కూడా వారే పొందుతారు. నేను అంత సేవ చేయకపోతే ఉన్నత పదవిని పొందలేను. టీచరు అయితే విద్యార్థిని కూడా అర్థము చేసుకోగలరు కదా. రోజూ చదివిస్తూ ఉంటారు. విద్యార్థుల రిజిస్టరు టీచర్ వద్ద ఉంటుంది. చదువు మరియు నడవడిక యొక్క రిజిస్టరు కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, ఇక్కడ ముఖ్యమైనది యోగము విషయము. యోగము బాగుంటే నడవడిక కూడా బాగుంటుంది. చదువులో అప్పుడప్పుడూ అహంకారము వస్తుంది. ఇందులో స్మృతి చేసే విషయములో గుప్తమైన శ్రమ చేయాలి. అందుకే ఎంతోమంది రిపోర్టు వస్తుంది - బాబా, మేము యోగములో ఉండలేకపోతున్నాము. బాబా అర్థం చేయించారు, యోగము అన్న పదము తీసేయండి. ఏ తండ్రి నుండైతే వారసత్వము లభిస్తుందో వారిని మీరు గుర్తు చేయలేరా. ఇది విచిత్రము. తండ్రి అంటారు, ఓ ఆత్మల్లారా, మీరు తండ్రినైన నన్ను స్మృతి చేయరా, నేను మీకు దారిని తెలియజేసేందుకు వచ్చాను, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్నితో పాపాలు దగ్ధమవుతాయి. భక్తి మార్గములో మనుష్యులు ఎంతగా భ్రమిస్తూ ఉంటారు. కుంభ మేళాలో ఎంత చల్లని నీటిలో స్నానాలు చేస్తారు. ఎన్ని ఇబ్బందులు సహిస్తారు. ఇక్కడైతే ఏ కష్టమూ లేదు. ఫస్ట్ క్లాస్ పిల్లలెవరైతే ఉన్నారో, వారు ఒక్క ప్రియునికి సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అయి స్మృతి చేస్తూ ఉంటారు. విహరించడానికి వెళ్ళినప్పుడు, ఏకాంతములో పూలతోటలో కూర్చుని స్మృతి చేస్తారు. పరచింతనతో కూడిన విషయాలను చర్చించుకోవడము వలన వాయుమండలము పాడవుతుంది, అందుకే ఎంత సమయము లభిస్తే అంత సమయము తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయండి. ఫస్ట్ క్లాస్ సత్యమైన ప్రియుడికి ప్రేయసులుగా అవ్వండి. తండ్రి అంటారు, దేహధారి ఫొటోను పెట్టుకోకండి. కేవలం ఒక్క శివబాబా ఫొటోను పెట్టుకోండి, వారిని స్మృతి చేయాలి. ఒకవేళ సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, చక్రము మరియు త్రిమూర్తి చిత్రములు ఫస్ట్ క్లాస్ అయినవి, వీటిలో జ్ఞానమంతా ఉంది. స్వదర్శన చక్రధారి అన్న మీ పేరు అర్థ సహితముగా ఉంది. కొత్తవారు ఎవరైనా ఈ పేరు వింటే అర్థము చేసుకోలేరు, దీనిని పిల్లలైన మీరే అర్థము చేసుకుంటారు. మీలో కూడా కొద్దిమంది బాగా స్మృతి చేస్తారు. చాలామంది అసలు స్మృతే చేయరు. తమ భాగ్యాన్ని పాడు చేసుకుంటారు. చదువు అయితే చాలా సహజమైనది. తండ్రి అంటారు, సైలెన్స్ ద్వారా మీరు సైన్స్ పై విజయము పొందాలి. సైలెన్స్ మరియు సైన్స్, ఈ రెండింటి రాశి ఒక్కటే. మిలటరీలో కూడా మూడు నిమిషాల నిశ్శబ్దాన్ని పాటిస్తారు. మాకు శాంతి లభించాలని మనుష్యులు కూడా కోరుకుంటారు. ఇప్పుడు మీకు తెలుసు, శాంతి ఉండే స్థానమైతే ఆ బ్రహ్మాండమే. ఆ బ్రహ్మ తత్వములో ఆత్మలైన మనము ఇంత చిన్న బిందువులా ఉంటాము. ఆత్మలన్నీ ఉండే ఆ వృక్షము అద్భుతముగా ఉంటుంది కదా. భృకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తూ ఉంటుంది అని మనుష్యులు అంటారు కూడా. బంగారముతో చాలా చిన్న తిలకాన్ని తయారుచేసుకుని అక్కడ పెట్టుకుంటారు. ఆత్మ కూడా బిందువే, తండ్రి కూడా వీరి పక్కనే వచ్చి కూర్చుంటారు. సాధు-సన్యాసులు మొదలైనవారెవ్వరికీ తమ ఆత్మ గురించి తెలియదు. ఆత్మ అంటే ఏమిటో కూడా తెలియనప్పుడు ఇక పరమాత్మను ఎలా తెలుసుకోగలరు. కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఆత్మ మరియు పరమాత్మల గురించి తెలుసు. ఇతర ధర్మాల వారెవరూ తెలుసుకోలేరు. ఇంత చిన్న ఆత్మ మొత్తము పాత్రనంతటినీ ఎలా అభినయిస్తుంది అనేది ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. ఎన్నో సత్సంగాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఏమీ అర్థము చేసుకోరు. వీరు కూడా ఎంతోమంది గురువులను ఆశ్రయించారు. ఇప్పుడు తండ్రి అంటారు, వారంతా భక్తి మార్గపు గురువులు. జ్ఞాన మార్గపు గురువు ఒక్కరే. ద్వికిరీటధారులైన రాజుల ఎదురుగా ఏక కిరీటధారులైన రాజులు తల వంచుతారు, నమస్కరిస్తారు, ఎందుకంటే వారు పవిత్రులు. ఆ పవిత్ర రాజులకే మందిరాలు నిర్మించబడ్డాయి. పతితులు వెళ్ళి వారి ముందు తల వంచి నమస్కరిస్తారు కానీ అసలు వారెవరూ, మేము వారికి ఎందుకు తల వంచి నమస్కరిస్తున్నాము అన్నదే వారికి తెలియదు. సోమనాథుడి మందిరాన్ని నిర్మించారు, ఇప్పుడు పూజలైతే చేస్తూ ఉంటారు, కానీ బిందువుకు ఎలా పూజ చేయాలి? బిందువుకు మందిరము ఎలా తయారవుతుంది? ఇవి చాలా గుహ్యమైన విషయాలు. గీత మొదలైనవాటిలో ఈ విషయాలు లేవు. ఎవరైతే స్వయం అధిపతినో, వారే అర్థము చేయిస్తారు. ఇంత చిన్న ఆత్మలో పాత్ర ఎలా నిశ్చితమై ఉంది అనేది మీకు ఇప్పుడు తెలుసు. ఆత్మ కూడా అవినాశీ, పాత్ర కూడా అవినాశీ. అద్భుతము కదా. ఇదంతా తయారై, తయారుచేయబడిన ఆట. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు, జరగరానిది ఏమైనా జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు అని అంటూ ఉంటారు. డ్రామాలో ఏదైతే నిశ్చితమై ఉందో, అదైతే తప్పకుండా జరిగి తీరుతుంది. చింతించవలసిన విషయమేమీ లేదు.

పిల్లలైన మీరు ఇప్పుడు మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి - ఏమి జరిగినా సరే కన్నీరు రానివ్వము. ఫలానావారు చనిపోయారు, ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరము తీసుకుంది, ఇందులో ఏడవవలసిన అవసరమేముంది? వారు తిరిగి వెనకకైతే రాలేరు. కన్నీరు వచ్చిందంటే ఫెయిల్ అయినట్లే. అందుకే బాబా అంటారు, ప్రతిజ్ఞ చేయండి, నేను ఎప్పుడూ ఏడవను. పరబ్రహ్మములో ఉండే తండ్రి గురించి చింత ఉండేది, ఇప్పుడు వారు లభించారు కావున ఇంకేం కావాలి. తండ్రి అంటారు, మీరు తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఈ రాజధానిని స్థాపన చేయడానికి నేను ఒకేసారి వస్తాను. ఇందులో యుద్ధాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. యుద్ధము జరిగిందని, కేవలము పాండవులు మాత్రమే మిగిలారని, వారు కుక్కను తమతో పాటు తీసుకువెళ్ళి పర్వతాల పై కరిగిపోయారని గీతలో చూపించారు. విజయము పొందారు మరియు మరణించారు. అసలు విషయమే సరిపోదు. ఇవన్నీ దంత కథలు. దీనినే భక్తి మార్గము అని అంటారు.

తండ్రి అంటారు, పిల్లలైన మీకు వీటన్నిటి పట్ల వైరాగ్యము కలగాలి. పాత వస్తువుల పట్ల అయిష్టము కలుగుతుంది కదా. అయిష్టము అన్నది కఠినమైన పదము. వైరాగ్యము అన్న పదము మధురమైనది. జ్ఞానము లభించిన తర్వాత భక్తి పట్ల వైరాగ్యము కలుగుతుంది. సత్య-త్రేతా యుగాలలోనైతే జ్ఞాన ప్రారబ్ధము 21 జన్మల కొరకు లభిస్తుంది. అక్కడ జ్ఞానము అవసరము ఉండదు. మళ్ళీ ఎప్పుడైతే వామ మార్గములోకి వెళ్తారో అప్పుడు మెట్లు దిగుతారు. ఇప్పుడు ఇది అంతిమము. తండ్రి అంటారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచము నుండి పిల్లలైన మీకు వైరాగ్యము కలగాలి. మీరు ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇతర మనుష్యులకు ఈ విషయాల గురించి ఏమి తెలుసు. విరాట రూపము యొక్క చిత్రాన్ని తయారుచేస్తారు కానీ అందులో పిలక లేదు, శివుడు కూడా లేరు. దేవతా, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని అంటారు, అంతే. కానీ శూద్రుల నుండి దేవతలుగా ఎలా తయారుచేస్తారు మరియు ఎవరు తయారుచేస్తారు, ఇదేమీ తెలియదు. తండ్రి అంటారు, దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు, మళ్ళీ ఆ ధనమంతా ఎక్కడికి పోయింది? తల వంచి నమస్కరిస్తూ, నమస్కరిస్తూ నుదురు అరగదీసుకుంటూ ధనమంతటినీ పోగొట్టుకున్నారు. ఇది నిన్నటి విషయమే కదా. మిమ్మల్ని ఆ విధంగా తయారుచేసి వెళ్ళాను, మళ్ళీ మీరు ఎలా అయిపోయారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పరచింతనతో కూడిన సంభాషణతో వాతావరణాన్ని పాడు చేయకూడదు. ఏకాంతములో కూర్చుని సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అయి తమ ప్రియుడిని స్మృతి చేయాలి.

2. మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి - ఎప్పుడూ కూడా ఏడవము, కళ్ళ నుండి కన్నీరు కార్చము. ఎవరైతే సర్వీసబుల్ గా, తండ్రి హృదయాన్ని అధిరోహించినవారిగా ఉన్నారో, వారి సాంగత్యమే చేయాలి. తమ రిజిస్టరును చాలా బాగా ఉంచుకోవాలి.

వరదానము:-
శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారీ భవ

విశ్వములోని తపిస్తున్న ఆత్మలకు మార్గాన్ని చూపించేందుకు సాక్షాత్తు తండ్రి సమానముగా లైట్ హౌస్, మైట్ హౌస్ గా అవ్వండి. లక్ష్యము పెట్టుకోండి - ప్రతి ఆత్మకు ఏదో ఒకటి ఇవ్వాలి. ముక్తినైనా ఇవ్వండి లేక జీవన్ముక్తినైనా ఇవ్వండి. సర్వుల పట్ల మహాదానులుగా మరియు వరదానులుగా అవ్వండి. ఇప్పుడు మీ-మీ స్థానాల సేవనైతే చేస్తున్నారు కానీ ఒకే స్థానములో ఉంటూ మనసా శక్తి ద్వారా వాయుమండలము, వైబ్రేషన్లతో విశ్వ సేవను చేయండి. ఎటువంటి శక్తిశాలి వృత్తిని తయారుచేసుకోండంటే, దాని ద్వారా వాయుమండలము తయారవ్వాలి - అప్పుడు విశ్వ కళ్యాణకారీ ఆత్మ అని అంటారు.

స్లోగన్:-
అశరీరితనపు ఎక్సర్ సైజ్ మరియు వ్యర్థ సంకల్పాల రూపీ భోజనము యొక్క పథ్యము ద్వారా స్వయాన్ని ఆరోగ్యవంతులుగా చేసుకోండి.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

ఇప్పుడు మీ భాషణల యొక్క రూపురేఖలను కొత్తగా చేయండి. విశ్వ శాంతి గురించిన భాషణలైతే చాలానే చేసారు కానీ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు శక్తి అంటే ఏమిటి మరియు వాటికి ఆధారము ఎవరు! ఈ సత్యతను సభ్యతాపూర్వకముగా నిరూపించండి. ఇక్కడ భగవంతుని కార్యము నడుస్తూ ఉంది అని అందరూ అర్థం చేసుకోవాలి. మాతలు చాలా మంచి కార్యాన్ని చేస్తున్నారు అని సమయమనుసారంగా ఇటువంటి ధరణిని కూడా తయారుచేయవలసి వచ్చింది కానీ ఏ విధంగా ఫాదర్ షోస్ సన్ (తండ్రి కొడుకును ప్రత్యక్షము చేస్తారు) అన్నది ఉందో, అలా సన్ షోస్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తున్నారు) అన్నట్లు అవ్వాలి, అప్పుడు ప్రత్యక్షతా జెండా ఎగరవేయబడుతుంది.