28-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అంతర్ముఖులుగా అవ్వండి అనగా మౌనంగా ఉండండి, నోటితో ఏమీ మాట్లాడకండి, ప్రతి కార్యమునూ శాంతిగా చేయండి, ఎప్పుడూ అశాంతిని వ్యాపింపజేయకండి’’

ప్రశ్న:-
పిల్లలైన మిమ్మల్ని నిరుపేదలుగా తయారుచేసే అందరికన్నా పెద్ద శత్రువు ఎవరు?

జవాబు:-
క్రోధము. ఎక్కడైతే క్రోధము ఉంటుందో అక్కడ నీటి కుండలు కూడా ఆవిరైపోతాయి అని అంటారు. భారత్ యొక్క కుండ ఏదైతే వజ్ర-వైఢూర్యాలతో నిండుగా ఉండేదో, అది ఈ భూతము కారణముగా ఖాళీ అయిపోయింది. ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేసాయి. క్రోధీ మనుష్యులు స్వయమూ వేడిగా అయిపోతారు మరియు ఇతరులను కూడా వేడిగా అయిపోయేలా చేస్తారు, అందుకే ఇప్పుడు ఈ భూతాన్ని అంతర్ముఖులుగా అయి తొలగించండి.

ఓంశాంతి
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖత అనగా ఏమీ మాట్లాడకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఈ విధంగా తండ్రి కూర్చొని పిల్లలకు శిక్షణను ఇస్తారు. ఇందులో ఇంకేమీ మాట్లాడే విషయం లేదు. కేవలం అర్థం చేయించడం జరుగుతుంది. గృహస్థ వ్యవహారములో ఈ విధంగా ఉండాలి. ఇది మన్మనాభవ. నన్ను స్మృతి చేయండి, ఇదే మొట్టమొదటి ముఖ్యమైన పాయింట్. పిల్లలైన మీరు ఇంట్లో క్రోధము కూడా చేయకూడదు. క్రోధము ఎటువంటిదంటే, అది నీటి కుండలను కూడా ఆవిరైపోయేలా చేసేస్తుంది. క్రోధీ మనుష్యులు అశాంతిని వ్యాపింపజేస్తారు, అందుకే గృహస్థ వ్యవహారములో ఉంటూ శాంతిగా ఉండాలి. భోజనం చేసి తమ వ్యాపారానికి లేక ఆఫీస్ కు వెళ్ళిపోవాలి, అక్కడ కూడా సైలెన్స్ లో ఉండడం మంచిది. మాకు శాంతి కావాలి అని అందరూ అంటారు. శాంతిసాగరుడు ఒక్క తండ్రియేనని పిల్లలకు తెలియజేయడం జరిగింది. నన్ను స్మృతి చేయండి అని తండ్రియే డైరెక్షన్ ను ఇస్తారు. ఇందులో మాట్లాడేది ఏమీ లేదు. అంతర్ముఖులుగా ఉండాలి. ఆఫీస్ మొదలైన చోట్ల మీ పనులు కూడా చేసుకోవాలి కావున ఇందులో ఎక్కువగా మాట్లాడేది ఉండదు, పూర్తిగా మధురముగా అవ్వాలి, ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. కొట్లాటలు మొదలైనవి చేయడం, అదంతా క్రోధమే. అన్నింటికన్నా పెద్ద శత్రువు కామము, ఆ తర్వాత రెండవ నెంబర్ ది క్రోధము. ఒకరికొకరు దుఃఖాన్ని కలిగించుకుంటారు. క్రోధము వలన ఎంత కొట్లాట జరుగుతుంది. సత్యయుగములో కొట్లాటలు ఉండవని పిల్లలకు తెలుసు. ఇది రావణత్వానికి గుర్తు. క్రోధము కలవారిని కూడా అసురీ సాంప్రదాయమువారు అని అంటారు. అది భూతము ప్రవేశించడమే కదా. ఇందులో ఏమీ చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ మనుష్యులకైతే జ్ఞానం లేదు. వారైతే క్రోధం చేస్తారు, క్రోధం ఉన్నవారితో క్రోధం చేస్తే కొట్లాట మొదలవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది చాలా పెద్ద కఠినమైన భూతము, దీనిని యుక్తిగా పారద్రోలాలి. నోటి నుండి ఎటువంటి కఠినమైన పదాలను రానివ్వకూడదు. అవి చాలా నష్టదాయకమైనవి. వినాశనం కూడా క్రోధము ద్వారానే జరుగుతుంది కదా. ప్రతి ఇంట్లోనూ ఎక్కడైతే క్రోధము ఉంటుందో అక్కడ అశాంతి ఎంతగానో ఉంటుంది. క్రోధము చేసినట్లయితే మీరు తండ్రి పేరును అప్రతిష్టపాలు చేస్తారు. ఈ భూతాలను పారద్రోలాలి. ఒక్కసారి పారద్రోలితే ఇక మళ్ళీ అర్ధకల్పం వరకూ ఈ భూతాలు ఉండనే ఉండవు. ఈ 5 వికారాలు ఇప్పుడు ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి. ఇటువంటి సమయములోనే, అనగా ఎప్పుడైతే వికారాలు ఫుల్ ఫోర్స్ లో ఉంటాయో, అప్పుడే తండ్రి వస్తారు. ఈ కళ్ళు చాలా అశుద్ధమైనవి. నోరు కూడా అశుద్ధమైనదే. గట్టిగా మాట్లాడడం వల్ల మనుష్యులు స్వయమూ వేడిగా అయిపోతారు మరియు ఇంటిని కూడా వేడిగా అయిపోయేలా చేస్తారు. కామము మరియు క్రోధము, ఈ రెండూ పెద్ద శత్రువులు. క్రోధము కలవారు స్మృతి చేయలేరు. స్మృతి చేసేవారు ఎల్లప్పుడూ శాంతిగా ఉంటారు. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - మాలో భూతమైతే లేదు కదా? మోహము, లోభము యొక్క భూతము కూడా ఉంటుంది. లోభము యొక్క భూతము కూడా తక్కువేమీ కాదు. ఇవన్నీ భూతాలు, ఎందుకంటే ఇది రావణ సైన్యము. తండ్రి పిల్లలకు స్మృతి యాత్రను నేర్పిస్తారు. కానీ పిల్లలు ఇందులో ఎంతగానో తికమకపడతారు. వారు అర్థం చేసుకోరు, ఎందుకంటే భక్తిని ఎంతగానో చేసారు కదా. భక్తి దేహాభిమానము. అర్ధకల్పం దేహాభిమానము ఉంది. బాహ్యముఖత ఉన్న కారణముగా స్వయాన్ని ఆత్మగా భావించలేరు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి ఎంతో దృఢంగా చెప్తారు, కానీ ఆ విధంగా చేయడం రావట్లేదు. ఇతర విషయాలన్నింటినీ అంగీకరిస్తారు కూడా, కానీ మళ్ళీ - స్మృతి ఎలా చేయాలి, ఏ వస్తువూ కనిపించడం లేదు కదా అని అంటారు. వారికి ఇలా అర్థం చేయించడం జరుగుతుంది - మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా? అలాగే వారు అనంతమైన తండ్రి అని కూడా మీకు తెలుసు. నోటితో శివ, శివ అని అనకూడదు. నేను ఆత్మను అని లోలోపల తెలుసు కదా. మనుష్యులు శాంతిని కోరుకుంటారు, శాంతిసాగరుడు ఆ పరమాత్మయే. తప్పకుండా వారసత్వాన్ని కూడా వారే ఇస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే శాంతి ఏర్పడుతుంది, అలాగే జన్మ-జన్మాంతరాల వికర్మలు కూడా వినాశనమవుతాయి. వేరే ఏ విషయమూ లేదు. అంత పెద్ద లింగమేదీ లేదు. ఆత్మ చిన్నగా ఉంటుంది, తండ్రి కూడా చిన్నగా ఉంటారు. ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి అయితే అందరూ చేస్తారు. ఇలా ఎవరంటారు? ఆత్మ అంటుంది - తన తండ్రిని స్మృతి చేస్తుంది. కావున తండ్రి పిల్లలకు మన్మనాభవ అని చెప్తారు. మధురాతి మధురమైన పిల్లలూ, అంతర్ముఖులుగా ఉండండి, ఈ కనులతో ఏవైతే చూస్తున్నారో అవన్నీ అంతమైపోనున్నాయి. ఇకపోతే ఆత్మ మాత్రం శాంతిలో ఉంటుంది, ఆత్మ శాంతిధామానికే వెళ్ళాలి. ఎప్పటివరకైతే ఆత్మ పవిత్రముగా అవ్వదో, అప్పటివరకూ శాంతిధామానికి వెళ్ళలేదు. ఋషులు, మునులు మొదలైనవారందరూ శాంతి ఎలా లభిస్తుంది? అని అంటారు. తండ్రి అయితే సహజమైన యుక్తిని తెలియజేస్తారు. కాని పిల్లల్లో శాంతిగా ఉండనివారు ఎందరో ఉన్నారు. ఇళ్ళలో ఉంటారు, ఏమాత్రమూ శాంతిగా ఉండరు అని బాబాకు తెలుసు. సెంటర్లకు కొద్ది సమయం కోసం వెళ్తారు, కానీ లోలోపల శాంతిగా ఉంటూ తండ్రిని స్మృతి చేయడమనేది ఉండదు. రోజంతా ఇంట్లో హంగామాలు చేస్తూ ఉంటారు, కావున సెంటరుకు వచ్చాక కూడా శాంతిలో ఉండలేకపోతారు. ఎవరి దేహము పైనైనా ప్రేమ ఏర్పడితే ఇక వారి మనస్సుకు ఎప్పుడూ శాంతి లభించదు. కేవలం ఆ వ్యక్తి స్మృతియే కలుగుతూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మనుష్యులలో ఐదు భూతాలు ఉన్నాయి. ఫలానా వ్యక్తిలో భూతము ప్రవేశించింది అని అంటారు కదా. ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేసాయి. అక్కడ మహా అయితే ఏదో ఒక్క భూతమే ఉంటుంది, అది కూడా ఎప్పుడైనా ప్రవేశిస్తుంది. తండ్రి అంటున్నారు - ఈ 5 భూతాలూ ప్రతి ఒక్కరిలోనూ ప్రవేశించి ఉన్నాయి. ఈ భూతాలను పారద్రోలేందుకే పిలుస్తారు - బాబా, మీరు వచ్చి మాకు శాంతిని ఇవ్వండి, ఈ భూతాలను పారద్రోలేందుకు యుక్తిని తెలియజేయండి. ఈ భూతాలైతే అందరిలోనూ ఉన్నాయి. ఇది రావణ రాజ్యము కదా. అన్నింటికన్నా పెద్ద భూతాలు - కామ-క్రోధాలు. తండ్రి వచ్చి భూతాలను పారద్రోలుతారు కావున అందుకు బదులుగా ఏదో ఒకటి లభించాలి కదా. వారు భూత-ప్రేతాలను పారద్రోలుతారు కానీ ఏమీ లభించదు. తండ్రి మొత్తం విశ్వం నుండే భూతాలను పారద్రోలేందుకు వస్తారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మొత్తం విశ్వమంతటిలో అందరిలోనూ భూతాలు ప్రవేశించి ఉన్నాయి. దేవతలలో ఏ భూతాలూ ఉండవు, దేహాభిమానము, కామము, క్రోధము, లోభము, మోహము... ఏ భూతాలూ ఉండవు. లోభము యొక్క భూతము కూడా తక్కువేమీ కాదు. ఈ గుడ్డు తినాలి, అది తినాలి... అంటూ ఎందరిలోనో ఆ భూతము ఉంటుంది. తప్పకుండా నాలో కామము యొక్క భూతము ఉంది, క్రోధము యొక్క భూతము ఉంది అని తమ హృదయములో తాము అర్థం చేసుకుంటారు. కావున ఈ భూతాలను పారద్రోలేందుకు తండ్రి ఎంతగా కష్టపడతారు. దేహాభిమానములోకి రావడంతో, కౌగలించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి... అని మనసు కలుగుతుంది, దానితో చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది. క్రోధం కలవారి పరిస్థితి కూడా ఇదే. క్రోధములోకి వచ్చి తండ్రి పిల్లలను హతమార్చేస్తాడు, పిల్లలు తండ్రిని హతమార్చేస్తారు, పత్ని తన పతిని హతమార్చేస్తుంది. మీరు జైల్లోకి వెళ్ళి చూడండి, ఎలాంటి-ఎలాంటి కేసులు ఉంటాయో. ఈ భూతాలు ప్రవేశించిన కారణముగా భారత్ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి! భారత్ యొక్క పెద్ద కుండ ఏదైతే ఉండేదో, అది బంగారము, వజ్రాలు మొదలైనవాటితో నిండి ఉండేది, అది ఇప్పుడు ఖాళీ అయిపోయింది. క్రోధము కారణముగా నీటి కుండలు కూడా ఆవిరైపోతాయి అని అంటారు కదా. ఈ భారత్ కూడా ఇటువంటి పరిస్థితికి చేరుకుంది. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. భూతాలను తొలగించడానికి స్వయంగా తండ్రే వస్తారు. వీటిని ఇంకే మనుష్యమాత్రులూ తొలగించలేరు. ఈ ఐదు భూతాలూ చాలా శక్తివంతమైనవి. ఇవి అర్ధకల్పం ప్రవేశించి ఉన్నాయి. ఈ సమయములోని పరిస్థితి అయితే ఇక చెప్పడానికి వీల్లేనట్లుగా ఉంది. ఎవరైనా పవిత్రముగా ఉన్నా కానీ, జన్మ అయితే వికారాల ద్వారానే లభిస్తుంది. భూతాలైతే ఉన్నాయి కదా. ఈ 5 భూతాలు భారత్ ను పూర్తిగా నిరుపేదగా చేసేసాయి. డ్రామా ఏ విధంగా తయారై ఉంది అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. భారత్ నిరుపేదగా అయిపోయింది, దాని వలన బయటి నుండి అప్పులు తీసుకుంటూ ఉంటారు. భారత్ గురించే తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ చదువు ద్వారా ఎంత ధనము లభిస్తుంది. ఇది అవినాశీ చదువు, దీనిని అవినాశీ తండ్రి చదివిస్తారు. భక్తి మార్గములో ఎంత సామాగ్రి ఉంది. బాబా చిన్ననాటి నుండీ గీతను చదివేవారు మరియు నారాయణుడిని పూజించేవారు. కానీ ఏమీ అర్థం తెలిసేది కాదు. నేను ఒక ఆత్మను, వారు నా తండ్రి అన్న వివేకము కూడా లేదు. అందుకే ఎలా స్మృతి చేయాలి? అని అడుగుతారు. అరే, మీరు భక్తి మార్గములో - ఓ భగవంతుడా, రండి, విముక్తులను చేయండి, మాకు మార్గదర్శకునిగా అవ్వండి అని తలచుకుంటూ వచ్చారు. మార్గదర్శకుడు ముక్తి-జీవన్ముక్తుల కోసమే లభిస్తారు. తండ్రి ఈ పాత ప్రపంచముపై అయిష్టాన్ని కలిగిస్తారు. ఈ సమయములో అందరి ఆత్మలూ నల్లగా ఉన్నాయి, కావున వారికి తెల్లని శరీరాలు ఎలా లభిస్తాయి? చర్మము ఎంత తెల్లగా ఉన్నా కానీ ఆత్మ అయితే నల్లగానే ఉంది కదా. తెల్లని సుందరమైన శరీరాలు ఉన్నవారికి తమ నషా ఎంతగా ఉంటుంది. ఆత్మ తెల్లగా ఎలా అవుతుంది అన్నది మనుష్యులకు తెలియనే తెలియదు. అందుకే వారిని నాస్తికులు అని అంటారు. ఎవరికైతే రచయిత అయిన తమ తండ్రి గురించి మరియు రచన గురించి తెలియదో, వారు నాస్తికులు, ఎవరికైతే తెలుసో వారు ఆస్తికులు. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి - నాలో ఎంతవరకూ స్వచ్ఛత ఉంది? ఎంతవరకూ నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నాను? స్మృతి బలముతోనే రావణునిపై విజయాన్ని పొందాలి. ఇందులో శరీరము పరంగా శక్తివంతులుగా ఉండే విషయమేమీ లేదు. ఈ సమయములో అన్నింటికన్నా శక్తివంతమైనది అమెరికా, ఎందుకంటే వారి వద్ద ధన-సంపదలు, ఆయుధాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి, కావున ఆ బలము దైహికమైనది, హతమార్చడము కోసమున్నది. మేము విజయాన్ని పొందాలి అని బుద్ధిలో ఉంది. మీది ఆత్మిక బలము, మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు, తద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీపై ఎవ్వరూ విజయాన్ని పొందలేరు. మీ రాజ్యాన్ని అర్ధకల్పం వరకూ ఎవ్వరూ దోచుకోలేరు, అలాగే ఇంకెవ్వరికీ తండ్రి నుండి వారసత్వము లభించదు. మీరు ఏమవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి! తండ్రినైతే ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. స్వదర్శన చక్రముతో విష్ణువు అందరి శిరస్సులనూ ఖండించారు అని వారు భావిస్తారు, కానీ ఇందులో హింస యొక్క విషయమేదీ లేదు.

మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీ పరిస్థితిని చూసుకోండి! మీరు ఎంత భక్తి మొదలైనవి చేసినా కానీ భూతాలను తొలగించుకోలేకపోయారు. ఇప్పుడు అంతర్ముఖులుగా అయి చూసుకోండి - నాలో ఏ భూతమూ లేదు కదా? ఎవరి పైనైనా మనసు పెట్టుకుంటే, కౌగిలించుకుంటే, ఇక ఖాతా అంతా నష్టపోయినట్లేనని అర్థం చేసుకోండి. అటువంటివారి ముఖం చూడడం కూడా మంచిగా అనిపించదు. వారు అంటరానివారిలా ఉన్నట్లు, స్వచ్ఛమైనవారు కారు. నేను తప్పకుండా అంటరానివాడినే అని లోలోపల మనసు తింటుంది. తండ్రి అంటారు, దేహ సహితముగా అన్నింటినీ మర్చిపోండి, స్వయాన్ని ఆత్మగా భావించండి, ఈ అవస్థను ఉంచుకోవడం ద్వారానే మీరు దేవతలుగా అవుతారు. కావున ఏ భూతాలూ రాకూడదు. స్వయాన్ని చెక్ చేసుకోండి అని అర్థం చేయిస్తూ ఉంటారు. చాలామందిలో క్రోధము ఉంటుంది, వారు తిట్టకుండా ఉండలేరు, ఇక కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. క్రోధము చాలా అశుద్ధమైనది. భూతాలను పారద్రోలి పూర్తిగా క్లియర్ గా ఉండాలి. శరీరము గుర్తుకు కూడా రాకూడదు, అప్పుడు ఉన్నత పదవిని పొందగలుగుతారు. కావుననే 8 రత్నాలు గాయనం చేయబడతాయి. మీరు రత్నాలుగా అయ్యేందుకు మీకు జ్ఞాన రత్నాలు లభిస్తాయి. భారత్ లో 33 కోట్లమంది దేవతలు ఉండేవారని అంటారు, కానీ వారిలో కూడా 8 రత్నాలు పాస్ విత్ హానర్ అవుతారు. వారికే ప్రైజ్ లభిస్తుంది. ఏ విధంగా స్కాలర్షిప్ లభిస్తుంది కదా. గమ్యము చాలా భారీ అయినదని మీకు తెలుసు. నడుస్తూ, నడుస్తూ పడిపోతారు, భూతాల ప్రవేశం జరుగుతుంది. అక్కడ వికారాలే ఉండవు. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం డ్రామా చక్రమంతా తిరగాలి.

5,000 సంవత్సరాలలో ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు ఉంటాయో మీకు తెలుసు. ఎవరైనా లెక్క వేస్తే అది తెలుస్తుంది. అలాగే ఈ వృక్షమేదైతే ఉందో, అందులో కూడా - ఈ కల్పములో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని క్షణాలు ఉంటాయి అని వ్రాయవచ్చు. వీరు చాలా ఏక్యురేట్ గా చెప్తారు అని మనుష్యులు అంటారు. 84 జన్మల లెక్కను తెలియజేస్తారు. మరి కల్పం ఆయువును ఎందుకు తెలియజేయరు? ఎలాగైనా సరే ఈ భూతాలను పారద్రోలాలి అన్న ముఖ్యమైన విషయాన్ని పిల్లలకు తెలియజేశారు. ఈ భూతాలే మిమ్మల్ని పూర్తిగా సర్వనాశనం చేసాయి. మనుష్యమాత్రులందరిలోనూ భూతాలు తప్పకుండా ఉన్నాయి. అంతా భ్రష్టాచారము నుండి జన్మించినవారే. అక్కడ అసలు భ్రష్టాచారమే ఉండదు, రావణుడే ఉండడు. రావణుడిని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. మీరు రావణునిపై విజయాన్ని పొందుతారు, ఇక తర్వాత రావణుడు ఉండనే ఉండడు. ఇప్పుడు పురుషార్థం చేయండి. తండ్రి వచ్చారు కావున తండ్రి వారసత్వం తప్పకుండా లభించాలి. మీరు ఎన్ని సార్లు దేవతలుగా అవుతారు, ఎన్ని సార్లు అసురులుగా అవుతారు అన్నదాని లెక్కను తీయలేరు. లెక్కలేనన్ని సార్లు అలా అయి ఉంటారు. అచ్ఛా పిల్లలూ, శాంతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ క్రోధము రాదు. తండ్రి ఏ శిక్షణనైతే ఇస్తారో, దానిని అమలుపరచాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమను తాము ప్రశ్నించుకోవాలి - మాలో ఏ భూతమూ లేదు కదా? కళ్ళు అశుద్ధంగానైతే అవ్వడం లేదు కదా? గట్టిగా మాట్లాడే లేక అశాంతిని వ్యాపింపజేసే సంస్కారమైతే లేదు కదా? లోభము, మోహము యొక్క వికారాలు విసిగించడమైతే లేదు కదా?

2. ఏ దేహధారి పట్ల మనసు పెట్టుకోకూడదు. దేహ సహితముగా అన్నింటినీ మరచి స్మృతియాత్రతో స్వయంలో ఆత్మిక బలాన్ని నింపుకోవాలి. ఒక్క సారి భూతాలను పారద్రోలి అర్ధకల్పం కొరకు విముక్తిని పొందాలి.

వరదానము:-

ఈశ్వరీయ చట్టాన్ని అర్థం చేసుకొని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే ఫస్ట్ డివిజన్ కు అధికారీ భవ

ధైర్యముతో వేసే ఒక్క అడుగుకు పదమాల అడుగుల సహాయము - డ్రామాలో ఈ చట్టము యొక్క విధి ఫిక్స్ అయి ఉంది. ఒకవేళ ఈ విధి చట్టములో లేనట్లయితే అందరూ విశ్వము యొక్క మొదటి రాజుగా అయిపోతారు. నంబరువారుగా అయ్యే నియమము ఈ విధి కారణంగానే తయారవుతుంది. కావున ఎంత కావాలనుకుంటే అంత ధైర్యాన్ని పెట్టండి మరియు సహాయాన్ని తీసుకోండి. సరెండర్ అయిన వారైనా లేక ప్రవృత్తిలోని వారైనా, అధికారము సమానముగానే ఉంది, కానీ విధి ద్వారానే సిద్ధి ఉంటుంది. ఈ ఈశ్వరీయ చట్టాన్ని అర్థం చేసుకొని నిర్లక్ష్యము యొక్క లీలను సమాప్తము చేయండి, అప్పుడు ఫస్ట్ డివిజన్ యొక్క అధికారము లభిస్తుంది.

స్లోగన్:-

సంకల్పాల ఖజానా విషయములో ఎకానమీ (పొదుపు) అవతారముగా అవ్వండి.