28-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఎప్పుడైతే నంబరువారుగా సతోప్రధానముగా అవుతారో, అప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు అనగా వినాశనము యొక్క ఫోర్స్ పెరుగుతుంది మరియు ఈ పాత ప్రపంచము సమాప్తమవుతుంది’’

ప్రశ్న:-
ఏ పురుషార్థము చేసేవారికి తండ్రి యొక్క పూర్తి వారసత్వం ప్రాప్తిస్తుంది?

జవాబు:-
పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే మొదట తండ్రిని మీ వారసునిగా చేసుకోండి అనగా మీ వద్ద ఏదైతే ఉందో, దానిని అంతటినీ తండ్రిపై బలిహారం చేయండి. తండ్రిని మీ కొడుకుగా చేసుకున్నట్లయితే పూర్తి వారసత్వానికి అధికారులుగా అవుతారు. 2. సంపూర్ణ పవిత్రముగా అయినట్లయితే పూర్తి వారసత్వం లభిస్తుంది. సంపూర్ణ పవిత్రముగా అవ్వకపోతే శిక్షలు అనుభవించి, చిన్న రొట్టెను (తక్కువ పదవిని) పొందుతారు.

ఓంశాంతి
పిల్లలు కేవలం ఒక్కరి స్మృతిలోనే కూర్చోకూడదు, ముగ్గురి స్మృతిలో కూర్చోవాలి. వారు ఒక్కరే ఉన్నా కానీ వారే తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. వారు మనందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చారు, ఈ కొత్త విషయాన్ని మీరే అర్థం చేసుకుంటారు. వారు ఎవరైతే భక్తిని నేర్పిస్తారో, శాస్త్రాలను వినిపిస్తారో వారంతా మనుష్యులే. వీరినైతే మనిషి అని అనరు కదా. వీరు నిరాకారుడు, ఈ నిరాకారుడు కూర్చుని ఆత్మలను చదివిస్తారు. ఆత్మ శరీరము ద్వారా వింటుంది. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి స్మృతిలో కూర్చున్నారు. అనంతమైన తండ్రి అంటున్నారు - ఆత్మిక పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీకు తెలుసు. వారు ఎంతో గొప్ప టీచర్, ఉన్నతోన్నతమైనవారు, కావున పదవిని కూడా ఉన్నతోన్నతమైనది ప్రాప్తింపజేస్తారు. మీరు ఎప్పుడైతే నంబరువారు పురుషార్థానుసారముగా సతోప్రధానముగా అవుతారో, అప్పుడు మళ్ళీ యుద్ధము జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. స్మృతి కూడా తప్పకుండా చేయాలి. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉండాలి. కేవలం ఒకేసారి పురుషోత్తమ సంగమయుగములో తండ్రి వచ్చి కొత్త ప్రపంచం కొరకు అర్థం చేయిస్తారు. చిన్న పిల్లలు కూడా తమ తండ్రిని తలచుకుంటారు. మీరైతే తెలివైనవారు, తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు తండ్రి ద్వారా ఉన్నత పదవిని పొందుతారు అని మీకు తెలుసు. మీకు ఇది కూడా తెలుసు - ఈ లక్ష్మీ-నారాయణులు కొత్త ప్రపంచములో ఏ పదవిని అయితే పొందారో అది శివబాబా ద్వారానే పొందారు. ఈ లక్ష్మీ-నారాయణులే మళ్ళీ 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చి ఇప్పుడు బ్రహ్మా-సరస్వతులుగా అయ్యారు. వీరే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము మీకు ఉంది. ఇప్పుడు మీరు అంధవిశ్వాసముతో దేవతల ముందు శిరస్సు వంచరు. దేవతల ముందుకు మనుష్యులు వెళ్ళి స్వయాన్ని పతితులుగా నిరూపించుకుంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము, వికారులము, మాలో ఏ గుణమూ లేదు అని అంటారు. మీరు ఎవరి మహిమనైతే గానం చేసేవారో, ఇప్పుడు మీరు స్వయమే అలా తయారవుతున్నారు. బాబా, ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అని అంటారు. బాబా అంటారు, ఎప్పటి నుండైతే రావణ రాజ్యము ప్రారంభమయ్యిందో అప్పటి నుండీ ప్రారంభమయ్యింది. అదంతా భక్తి యొక్క సామాగ్రి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ధారణ అవ్వాలి. ఈ సంస్కారాలను ఆత్మయే తీసుకువెళ్తుంది. భక్తి సంస్కారాలు వెళ్ళవు. భక్తి సంస్కారాలు కలవారు పాత ప్రపంచములో మనుష్యుల వద్దే జన్మ తీసుకుంటారు. ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానము యొక్క చక్రమంతా తిరగాలి. దీనితోపాటు బాబాను కూడా స్మృతి చేయాలి. బాబా మనకు తండ్రి కూడా. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. బాబా మనకు టీచర్ కూడా, కావున చదువు బుద్ధిలోకి వస్తుంది మరియు సృష్టి చక్రపు జ్ఞానము బుద్ధిలో ఉంది కావున మీరు చక్రవర్తీ రాజులుగా అవుతారు (ఆ సమయంలో అక్కడ స్మృతి యాత్ర జరుగుతోంది).

ఓం శాంతి. భక్తి మరియు జ్ఞానము. తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు. వారికి భక్తి గురించి అంతా తెలుసు - భక్తి ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎప్పుడు పూర్తవుతుంది అనేదంతా తెలుసు. మనుష్యులకు ఇది తెలియదు. తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. సత్యయుగములో దేవీ-దేవతలైన మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు. అక్కడ భక్తి అన్న మాటే ఉండదు. అక్కడ ఒక్క మందిరము కూడా లేదు. అందరూ దేవీ-దేవతలే ఉండేవారు. తర్వాత ఎప్పుడైతే ప్రపంచం సగం పాతదిగా అవుతుందో అనగా ఎప్పుడైతే 2500 సంవత్సరాలు పూర్తవుతాయో అనగా త్రేతా మరియు ద్వాపరము యొక్క సంగమము వస్తుందో, అప్పుడు రావణుడు వస్తాడు, సంగమమైతే తప్పకుండా కావాలి. త్రేతా మరియు ద్వాపరము యొక్క సంగమములో రావణుడు వస్తాడు, ఆ సమయములో దేవీ-దేవతలు వామ మార్గములో పడిపోతారు. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరికీ తెలియవు. తండ్రి కూడా కలియుగాంతము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమములో వస్తారు మరియు రావణుడు త్రేతా మరియు ద్వాపరము యొక్క సంగమములో వస్తాడు. ఆ సంగమాన్ని కళ్యాణకారి అని అనరు. దానిని అకళ్యాణకారి అనే అంటారు. తండ్రి పేరే కళ్యాణకారి. ద్వాపరము నుండి అకళ్యాణకారీ యుగము ప్రారంభమవుతుంది. తండ్రి చైతన్య బీజరూపుడు. వారికి మొత్తం వృక్షము యొక్క జ్ఞానము ఉంది. ఆ బీజము కూడా ఒకవేళ చైతన్యమైనట్లయితే, నా ద్వారా ఈ వృక్షము ఇలా వెలువడుతుంది అని చెప్పగలదు. కానీ అది జడముగా ఉన్న కారణముగా చెప్పలేదు. బీజము వేయడం ద్వారా మొదట చిన్న వృక్షము వెలువడుతుందని మనం అర్థం చేసుకోగలము. ఆ తర్వాత అది పెద్దగా అయి ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కానీ చైతన్యమైన బీజమే అన్నింటినీ చెప్పగలదు. ప్రపంచములో ఈ రోజుల్లో మనుష్యులు ఏమేమో చేస్తూ ఉంటారు, ఇన్వెన్షన్లను కనుగొంటూ ఉంటారు, చంద్రునిపైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు వింటున్నారు. చంద్రుని వైపుకు ఎన్నో లక్షల మైళ్ళ దూరం వరకూ వెళ్ళిపోతారు, అసలు చంద్రుడు ఏమిటి అనేది పరిశీలించేందుకు వెళ్తారు. సముద్రములోకి ఎంతో దూరం వరకు వెళ్తారు, పరిశీలిస్తారు, కానీ దాని అంతాన్ని పొందలేరు, అంతా నీరే నీరు. విమానాల్లో పైకి వెళ్తారు, అందులో మళ్ళీ తిరిగి వచ్చేందుకు సరిపడా పెట్రోల్ వేయవలసి ఉంటుంది. ఆకాశము అనంతమైనది కదా, అలాగే సముద్రము కూడా అనంతమైనది. ఏ విధముగా వీరు అనంతమైన జ్ఞానసాగరుడో, అలా అది అనంతమైన నీటి సాగరము. ఆకాశ తత్వము కూడా అనంతమైనది. భూమి కూడా అనంతమైనది, ఎంత వెళ్తున్నా ఉంటూనే ఉంటుంది. సముద్రము కింద మళ్ళీ భూమి ఉంది. పర్వతాలు దేనిపై నిలబడి ఉన్నాయి? భూమిపై. మళ్ళీ భూమిని తవ్వుతూ వెళ్తే పర్వతాలు వస్తాయి, దాని కింద మళ్ళీ నీరు కూడా వస్తుంది. సాగరము కూడా భూమిపైనే ఉంది. ఎంతవరకూ నీరు ఉంది, ఎంతవరకూ భూమి ఉంది అని దాని అంతాన్ని ఎవరూ కనుగొనలేరు. పరమపిత పరమాత్మ అనంతమైన తండ్రి, వారి గురించి అలా అంతము లేనివారు అని అనరు. మనుష్యులు ఈశ్వరుడు అంతము లేనివారు, అలాగే మాయ కూడా అంతము లేనిది అని అంటారు. కానీ ఈశ్వరుడు అలా అంతము లేనివారు కారు, ఈ ఆకాశతత్వము మాత్రము అంతము లేనిది అని మీరు అర్థం చేసుకున్నారు. ఆకాశము, వాయువు... ఇవి ఐదు తత్వాలు. ఈ ఐదు తత్వాలూ తమోప్రధానముగా అయిపోతాయి. ఆత్మ కూడా తమోప్రధానముగా అవుతుంది, మళ్ళీ తండ్రి వచ్చి సతోప్రధానముగా తయారుచేస్తారు. ఆత్మ ఎంత చిన్నది, అది 84 జన్మలను అనుభవిస్తుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది నాటకము, ఇది అంతమవ్వదు. ఇది పరంపరగా కొనసాగుతూ వస్తుంది. అది ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అని అన్నట్లయితే మరి దాని అంతము కూడా ఉండాలి కదా. అయితే, కొత్త ప్రపంచము ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని అర్థం చేయించాలి. అది మళ్ళీ పాతబడుతుంది. ఇది 5000 సంవత్సరాల చక్రము, ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, వారైతే కేవలం ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. సత్యయుగ ఆయువు ఇన్ని లక్షల సంవత్సరాలు అని శాస్త్రాలలో వ్రాశారు. కావున మనుష్యులు అది వింటూ, వింటూ దానినే సత్యముగా భావిస్తారు. భగవంతుడు ఎప్పుడు వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు అన్నది తెలియదు. వారికి అది తెలియని కారణముగా కలియుగ ఆయువుకు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని అనేస్తారు. ఎప్పటివరకైతే మీరు అర్థం చేయించరో అప్పటివరకు అలా భావిస్తారు. కల్పము ఆయువు 5000 సంవత్సరాలు, అంతేకానీ లక్షల సంవత్సరాలు కాదు అని అర్థం చేయించేందుకు ఇప్పుడు మీరు నిమిత్తులు.

భక్తి మార్గపు సామాగ్రి ఎంతగా ఉంది, మనుష్యుల వద్ద ధనముంటే దానిని ఎంతో ఖర్చు చేస్తారు. తండ్రి అంటారు, నేను మీకు ఎంత ధనాన్ని ఇచ్చి వెళ్తాను! అనంతమైన తండ్రి అయితే తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే ఇస్తారు. దాని ద్వారా సుఖము కూడా లభిస్తుంది, ఆయువు కూడా ఎక్కువ ఉంటుంది. తండ్రి పిల్లలతో అంటున్నారు - నా ప్రియమైన పిల్లలూ, ఆయుష్మాన్ భవ. అక్కడ మీకు 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది, అక్కడ ఎప్పుడూ మృత్యువు కబళించలేదు. తండ్రి వరదానాన్ని ఇస్తారు, మిమ్మల్ని ఆయుష్మంతులుగా తయారుచేస్తారు. మీరు అమరులుగా అవుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు. అక్కడ మీరు చాలా సుఖముగా ఉంటారు, అందుకే దానిని సుఖధామము అని అంటారు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది, ధనము కూడా ఎంతో లభిస్తుంది, ఎంతో సుఖముగా కూడా ఉంటారు. నిరుపేదల నుండి కిరీటధారులుగా అవుతారు. తండ్రి దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తారని మీ బుద్ధిలో ఉంది. అది తప్పకుండా చిన్న వృక్షముగానే ఉంటుంది. అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉంటుంది, దానినే విశ్వములో శాంతి అని అంటారు. మొత్తం విశ్వమంతటిలో మనమే పాత్రధారులము. ఇది ప్రపంచానికి తెలియదు. ఒకవేళ తెలిసినట్లయితే మనం ఎప్పటి నుండి పాత్రను అభినయిస్తూ వచ్చామో చెప్పాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. పాటలో కూడా ఉంది కదా - తండ్రి నుండి ఏదైతే లభిస్తుందో అది ఇంకెవరి నుండీ లభించదు అని. మొత్తం పృథ్వి, ఆకాశము, మొత్తం విశ్వమంతటి రాజధానిని వారు ఇస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు, తర్వాత రాజులు మొదలైనవారు ఎవరైతే ఉంటారో వారు భారత్ కు చెందినవారిగా ఉండేవారు. బాబా ఏదైతే ఇస్తారో దానిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు అన్న గాయనము కూడా ఉంది. తండ్రే వచ్చి ప్రాప్తిని కలిగిస్తారు. కావున ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి, దీనిని ఎవరికైనా అర్థం చేయించగలగాలి. అంతగా అర్థం చేసుకోవాలి. దీనిని ఎవరు అర్థం చేయించగలరు? ఎవరైతే బంధనముక్తులుగా ఉంటారో వారు. బాబా వద్దకు ఎప్పుడైనా ఎవరైనా వస్తే, వారిని - మీకు ఎంతమంది పిల్లలు అని బాబా అడుగుతారు. అప్పుడు వారు, మాకు ఐదుగురు పిల్లలు మరియు ఆరవ సంతానము శివబాబా అని అంటారు, మరి వారు తప్పకుండా అందరికన్నా పెద్ద కొడుకే కదా. శివబాబాకు చెందినవారిగా అయితే ఇక శివబాబా తమ సంతానముగా చేసుకుని విశ్వాధిపతులుగా చేస్తారు. పిల్లలు వారసులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు శివబాబాకు పూర్తి వారసులు. ముందు జన్మలో శివబాబాకు తమ సర్వస్వాన్నీ ఇచ్చేసారు. కావున వారసత్వము తప్పకుండా పిల్లలకు లభించాలి. బాబా అన్నారు - నన్ను వారసునిగా చేసుకోండి, ఇంకెవ్వరూ ఉండకూడదు. పిల్లలు అంటారు - బాబా, ఈ సర్వస్వమూ మీది మరియు మీదంతా మాది, మీరు మాకు మొత్తం విశ్వ రాజధాని యొక్క వారసత్వాన్ని ఇస్తారు ఎందుకంటే మా దగ్గర ఏదైతే ఉందో అదంతా మీకు ఇచ్చేసాము. డ్రామాలో రచింపబడి ఉంది కదా. అర్జునుడికి వినాశనాన్ని కూడా చూపించారు, అలాగే చతుర్భుజుడిని కూడా చూపించారు. అర్జునుడు అంటే ఇంకెవరో కాదు, వీరికే సాక్షాత్కారమయ్యింది. సాక్షాత్కారములో రాజ్యము లభిస్తుంది అని చూశారు, మరి శివబాబాను వారసునిగా ఎందుకు చేసుకోకూడదు. అలా చేస్తే వారు మళ్ళీ నన్ను వారసునిగా చేసుకుంటారు. ఈ వ్యాపారము చాలా బాగుంది. వీరు ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడగలేదు, గుప్తముగా అంతా ఇచ్చేసారు, దీనినే గుప్త దానము అని అంటారు. వీరికి ఏమైంది అనేది ఎవరికేమి తెలుసు. కొందరు - వీరికి వైరాగ్యము వచ్చిందేమో, సన్యాసిగా అయిపోయారేమో అని అనుకున్నారు. అలాగే ఈ కుమార్తెలు కూడా అంటారు - మాకు ఐదుగురు పిల్లలు, ఇంకొక కొడుకుగా మేము శివబాబాను చేసుకున్నాము. ఇతను కూడా తన సర్వస్వాన్నీ బాబా ముందు ఉంచారు, తద్వారా అనేకుల సేవ జరిగింది. బాబాను చూసి అందరికీ ఆలోచన వచ్చింది, అందరూ ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పరిగెత్తుకుని వచ్చారు. అక్కడి నుండే గొడవ ప్రారంభమయ్యింది. ఇళ్ళు-వాకిళ్ళను వదిలేసే ధైర్యాన్ని వారు చూపారు. శాస్త్రాలలో కూడా, భట్టీ జరిగిందని వ్రాయబడి ఉంది, ఎందుకంటే వారికి ఏకాంతము తప్పకుండా కావాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుండకూడదు. మిత్ర-సంబంధీకులు మొదలైనవారి స్మృతి కూడా ఉండకూడదు ఎందుకంటే ఆత్మ ఏదైతే పతితముగా అయ్యిందో, దానిని పావనముగా తప్పకుండా తయారుచేయాలి. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా అవ్వండి. ఈ విషయములోనే కష్టము వస్తుంది. ఇది స్త్రీ, పురుషుల మధ్యలో గొడవ తీసుకువచ్చే జ్ఞానము అని అనేవారు ఎందుకంటే ఒకరు పవిత్రముగా అయి ఇంకొకరు అవ్వకపోతే గొడవలు జరిగాయి. వీరందరూ దెబ్బలు తిన్నారు ఎందుకంటే అకస్మాత్తుగా కొత్త విషయము జరిగింది కదా. ఇక్కడ ఏం జరుగుతోందని ఇంతమంది పరిగెత్తుకుని వస్తున్నారు? అని అందరూ ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. మనుష్యులలో తెలివైతే లేదు. ఏదో శక్తి ఉంది అని మాత్రం అనేవారు! తమ ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పారిపోవడమనేది ఎప్పుడూ జరగలేదు. డ్రామాలో ఈ చరిత్ర అంతా శివబాబాదే. కొందరు ఒట్టి చేతులతో పరిగెత్తారు, ఇది కూడా డ్రామా. ఇళ్ళు-వాకిళ్ళూ అన్నీ వదిలేసి పరిగెత్తారు, ఏమీ గుర్తు లేవు. ఇకపోతే ఈ శరీరాలు మాత్రం ఉన్నాయి, వాటితో పని చేయాలి. ఆత్మను కూడా స్మృతియాత్రతో పవిత్రముగా తయారుచేసుకోవాలి, అప్పుడే పవిత్ర ఆత్మలు తిరిగి వెళ్ళగలుగుతాయి. స్వర్గములోకి అపవిత్ర ఆత్మలు వెళ్ళలేవు. అలాంటి నియమమే లేదు. ముక్తిధామములో కూడా పవిత్ర ఆత్మలే కావాలి. పవిత్రముగా అవ్వడములోనే ఎన్ని విఘ్నాలు కలుగుతాయి. ఇంతకుముందు సత్సంగాలు మొదలైనవాటికి వెళ్ళేందుకు అవరోధము ఉండేది కాదు, ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు. ఇక్కడ పవిత్రత కారణముగా విఘ్నాలు కలుగుతాయి. పవిత్రముగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు అని అయితే అర్థం చేసుకుంటారు. ధర్మరాజు ద్వారా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, ఆ తర్వాత ఏదో కాస్త రొట్టె (చిన్న పదవి) లభిస్తుంది. శిక్షలు అనుభవించకపోతే పదవి కూడా మంచిది లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, మీరు నా వద్దకు రావాలి. ఈ పాత శరీరాన్ని వదిలి పవిత్ర ఆత్మగా అయి రావాలి. మళ్ళీ ఎప్పుడైతే పంచ తత్వాలు సతోప్రధానముగా, కొత్తగా అయిపోతాయో, అప్పుడు మీకు సతోప్రధానమైన కొత్త శరీరాలు లభిస్తాయి. మొత్తం అతలాకుతలమై కొత్తగా తయారైపోతుంది. ఏ విధంగా తండ్రి వీరిలోకి వచ్చి కూర్చుంటారో, అలా ఆత్మ ఏ కష్టమూ లేకుండా గర్భ మహలులోకి వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు బయటకు వస్తుంది, అప్పుడు ఆకాశములో మెరుపులు మెరిసినట్లుగా ఉంటుంది ఎందుకంటే ఆత్మ పవిత్రముగా ఉంటుంది. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మను పావనంగా తయారుచేసుకునేందుకు ఏకాంతము యొక్క భట్టీలో ఉండాలి. ఒక్క తండ్రి తప్ప ఇతర మిత్ర-సంబంధీకులెవ్వరూ గుర్తుకు రాకూడదు.

2. బుద్ధిలో జ్ఞానమంతటినీ ఉంచుకుని, బంధనముక్తులుగా అయి ఇతరుల సేవను చేయాలి. తండ్రితో సత్యమైన వ్యాపారము చేయాలి. ఏ విధంగా తండ్రి అంతా గుప్తంగా చేసారో, అలా గుప్త దానం చేయాలి.

వరదానము:-

మాయ యొక్క భయంకర రూపముతో కూడిన ఆటను సాక్షీగా అయ్యి చూసే మాయాజీత్ భవ

మాయను ఆహ్వానించేవారు దాని భయంకర రూపాన్ని చూసి భయపడరు. సాక్షీగా అయ్యి ఆటను చూసినట్లయితే ఆనందం కలుగుతుంది ఎందుకంటే మాయ యొక్క రూపం బయటకు పులిలా ఉంటుంది కానీ దానిలో పిల్లి అంతటి శక్తి కూడా లేదు. కేవలం మీరు భయపడి దానిని పెద్దదిగా చేస్తారు - ఏం చేయను... ఎలా అవుతుంది... అని ఆలోచిస్తారు. కానీ ఈ పాఠాన్నే గుర్తుంచుకోండి - ఏదైతే జరుగుతూ ఉందో అది మంచిది మరియు ఏదైతే జరగనున్నదో అది ఇంకా మంచిది. సాక్షీగా అయ్యి ఆటను చూసినట్లయితే మాయాజీతులుగా అవుతారు.

స్లోగన్:-

ఎవరైతే సహనశీలురుగా ఉంటారో, వారు ఎవరి భావ-స్వభావాల కారణముగా కాలిపోరు, వ్యర్థ విషయాలను ఒక చెవితో విని రెండవ చెవితో వదిలేస్తారు.