28-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఒక్క తండ్రి నుండే వినాలి మరియు విని ఇతరులకు వినిపించాలి’’

ప్రశ్న:-
తండ్రి పిల్లలైన మీకు ఏ జ్ఞానాన్ని ఇచ్చారు, దానిని మీరు ఇతరులకు వినిపించాలి?

జవాబు:-
బాబా మీకు ఏ జ్ఞానాన్ని ఇచ్చారంటే - ఆత్మలైన మీరందరూ సోదరులు. మీరు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఈ విషయాన్నే మీరు అందరికీ వినిపించండి ఎందుకంటే మీరు మొత్తం విశ్వములోని సోదరులందరి కళ్యాణాన్ని చేయాలి. మీరే ఈ సేవకు నిమిత్తులు.

ఓంశాంతి
ఓంశాంతి అని చాలావరకు ఎందుకు అనడం జరుగుతుంది. ఇది పరిచయాన్ని ఇవ్వడము - ఆత్మ పరిచయాన్ని ఆత్మయే ఇస్తుంది, మాట్లాడటము ఆత్మయే శరీరము ద్వారా మాట్లాడుతుంది. ఆత్మ లేకుండానైతే శరీరము ఏమీ చేయలేదు. కావున ఆత్మ తన పరిచయాన్ని ఇలా ఇస్తుంది. నేను ఆత్మను, పరమపిత పరమాత్ముని సంతానమును. వారు అహం ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. పిల్లలైన మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయించబడతాయి. తండ్రి అయితే పిల్లలూ, పిల్లలూ అనే అంటారు కదా. ఆత్మిక తండ్రి అంటారు - ఓ ఆత్మిక పిల్లలూ, ఈ ఇంద్రియాల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - మొట్టమొదట జ్ఞానము, ఆ తర్వాత భక్తి. అంతేకానీ మొదట భక్తి, ఆ తర్వాత జ్ఞానము అని కాదు. మొదట జ్ఞానము, అది పగలు, ఆ తర్వాత భక్తి, అది రాత్రి. మళ్ళీ తర్వాత పగలు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే భక్తిపై వైరాగ్యము కలుగుతుందో అప్పుడు. మీ బుద్ధిలో ఇది ఉండాలి. జ్ఞానము మరియు విజ్ఞానము ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు జ్ఞానము యొక్క చదువును చదువుతున్నారు. మళ్ళీ సత్య, త్రేతాయుగాలలో మీకు జ్ఞాన ప్రారబ్ధము లభిస్తుంది. జ్ఞానాన్ని బాబా ఇప్పుడు ఇస్తున్నారు, దాని ప్రారబ్ధము సత్యయుగములో లభిస్తుంది. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మనము మళ్ళీ జ్ఞానము నుండి అతీతముగా విజ్ఞానములోకి అనగా మన ఇల్లు అయిన శాంతిధామములోకి వెళ్తాము అని మీకు తెలుసు. దానిని జ్ఞానము అనీ అనరు, భక్తి అనీ అనరు. దానిని విజ్ఞానము అని అంటారు. జ్ఞానము నుండి అతీతముగా శాంతిధామములోకి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానమునంతటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు - ఎక్కడి కోసము? భవిష్య కొత్త ప్రపంచము కొరకు ఇస్తారు. కొత్త ప్రపంచములోకి వెళ్ళేటప్పుడు మొదట తమ ఇంటికి తప్పకుండా వెళ్తారు. ముక్తిధామములోకి వెళ్ళాలి. ఆత్మలు ఎక్కడి నివాసులో అక్కడికైతే తప్పకుండా వెళ్తారు కదా. ఈ కొత్త-కొత్త విషయాలను మీరే వింటారు, వీటిని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆత్మలమైన మనము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలము అని మీరు భావిస్తారు. ఆత్మిక పిల్లలకు తప్పకుండా ఆత్మిక తండ్రి కావాలి. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలు. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఒక్కరే. వారు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి ఎలా వస్తారు - అది కూడా అర్థం చేయించారు. తండ్రి అంటారు, నేను కూడా ప్రకృతిని ధారణ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక మీరు తండ్రి నుండి వింటూనే ఉండాలి. తండ్రి నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వినకూడదు. పిల్లలు విని మళ్ళీ ఇతర సోదరులకు వినిపిస్తారు. ఏదో ఒకటి తప్పకుండా వినిపిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే వారే పతిత-పావనుడు. బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది. పిల్లలకు అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇంతకుముందు వివేకహీనులుగా ఉండేవారు. భక్తి మార్గములో వివేకహీనతతో రావణుని పంజాలోకి రావడముతో ఏమేమి చేస్తారు! ఎంత అశుద్ధముగా అయిపోతారు! మద్యము తాగడం వల్ల ఎలా అయిపోతారు? మద్యము అశుద్ధతను ఇంకా ఎక్కువగా వ్యాపింపజేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది - అనంతమైన తండ్రి నుండి మేము వారసత్వాన్ని తీసుకోవాలి. కల్ప-కల్పమూ తీసుకుంటూ వచ్చాము. అందుకే దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి. శ్రీకృష్ణుని దైవీ గుణాలకు ఎంతటి మహిమ ఉంది. వైకుంఠాధిపతి ఎంత మధురమైనవారు. వాస్తవానికి శ్రీకృష్ణుని వంశావళి అని అనరు. వంశావళి విష్ణువుది లేక లక్ష్మీనారాయణులది అని అంటారు. తండ్రియే సత్యయుగ రాజ్య వంశాన్ని స్థాపన చేస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ చిత్రాలు మొదలైనవి లేకపోయినా కూడా అర్థం చేయించవచ్చు. మందిరాలైతే ఎన్నో తయారవుతూ ఉంటాయి, ఎవరిలోనైతే జ్ఞానము ఉందో వారు ఇతరుల కళ్యాణాన్ని కూడా చేసేందుకు, తమ సమానముగా తయారుచేసేందుకు పరిగెడుతూ ఉంటారు. స్వయాన్ని చూసుకోవాలి - నేను ఎంతమందికి జ్ఞానాన్ని వినిపించాను! కొందరికి వెంటనే జ్ఞాన బాణము తగులుతుంది. మాకు కుమారీలు జ్ఞాన బాణాలు వేసారు అని భీష్మపితామహులు మొదలైనవారు కూడా అన్నారు కదా. వీరందరూ పవిత్ర కుమార, కుమారీలు అనగా పిల్లలు. మీరందరూ పిల్లలు, అందుకే ఏమంటారంటే - మేము బ్రహ్మా పిల్లలము, కుమార-కుమారీలము, సోదర-సోదరీలము. ఇది పవిత్రమైన సంబంధము. అందులోనూ మీరు దత్తత తీసుకోబడ్డ పిల్లలు. తండ్రి దత్తత తీసుకున్నారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారు. వాస్తవానికి ఈ దత్తత అన్న పదము కూడా ఉపయోగించము. అందరూ శివబాబా పిల్లలే. అందరూ నన్ను శివబాబా, శివబాబా, మీరు రండి అని పిలుస్తారు. కానీ అర్థమేమీ తెలియదు. ఆత్మలందరూ శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తారు. కావున శివబాబా కూడా తప్పకుండా శరీరము ద్వారానే పాత్రను అభినయిస్తారు కదా. శివబాబా పాత్రను అభినయించకపోతే ఇక దేనికీ ఉపయోగపడనట్లే, విలువే ఉండదు. వారి విలువ ఎప్పుడు ఉంటుందంటే, వారు ఎప్పుడైతే మొత్తం ప్రపంచమంతటినీ సద్గతిలోకి చేరుస్తారో అప్పుడు. అందుకే వారి మహిమను భక్తి మార్గములో గానం చేస్తారు. సద్గతి జరిగాక ఇక తర్వాత తండ్రిని స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు. వారు కేవలం గాడ్ ఫాదర్ అని అన్నప్పుడు అందులో టీచర్ మాయమైపోతారు. పరమపిత పరమాత్మ పావనముగా తయారుచేసేవారు అన్నది కేవలం నామమాత్రముగా ఉండిపోతుంది. వారు సద్గతి చేసేవారు అని కూడా అనరు. సర్వుల సద్గతిదాత ఒక్కరే అని మహిమలో ఉంటుంది కానీ అర్థము తెలియకుండా అనేస్తారు. ఇప్పుడు మీరు ఏది చెప్పినా అదంతా అర్థసహితముగానే చెప్తారు. భక్తి అనే రాత్రి వేరు, జ్ఞానమనే పగలు వేరు అని మీరు అర్థం చేసుకున్నారు. పగలుకు కూడా సమయము ఉంటుంది. అలాగే భక్తికి కూడా సమయము ఉంటుంది. ఇది అనంతమైన విషయము. పిల్లలైన మీకు అనంతమైన జ్ఞానము లభించింది. అర్ధకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి. తండ్రి అంటారు, నేను కూడా రాత్రిని పగలుగా తయారుచేయడానికి వస్తాను.

మీకు తెలుసు, అర్ధకల్పము రావణ రాజ్యము ఉంటుంది, అందులో అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి, మళ్ళీ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు, అప్పుడు అందులో అంతా సుఖమే సుఖము లభిస్తుంది. ఇది సుఖ-దుఃఖాల ఆట అని అంటూ ఉంటారు కూడా. సుఖము అనగా రాముడు, దుఃఖము అనగా రావణుడు. రావణునిపై విజయాన్ని పొందితే ఇక రామ రాజ్యము వస్తుంది, మళ్ళీ అర్ధకల్పము తర్వాత రావణుడు రామ రాజ్యముపై విజయాన్ని పొంది రాజ్యం చేస్తాడు. మీరు ఇప్పుడు మాయపై విజయాన్ని పొందుతారు. ఒక్కొక్క పదమునూ మీరు అర్థ సహితముగా ఉపయోగిస్తారు. మీది ఈశ్వరీయ భాష. దీనిని ఎవరూ అర్థం చేసుకోరు. ఈశ్వరుడు ఎలా మాట్లాడుతారు. ఇది గాడ్ ఫాదర్ యొక్క భాష అని మీకు తెలుసు ఎందుకంటే గాడ్ ఫాదర్ నాలెడ్జ్ ఫుల్. వారు జ్ఞాన సాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటూ ఉంటారు కూడా, కావున తప్పకుండా ఎవరికో ఒకరికి జ్ఞానాన్ని ఇస్తారు కదా. బాబా ఏ విధముగా జ్ఞానాన్ని ఇస్తారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వారు తమ పరిచయాన్ని కూడా ఇస్తారు మరియు సృష్టి చక్రము యొక్క జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఆ జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా మనం చక్రవర్తీ రాజులుగా అవుతాము. ఇది స్వదర్శన చక్రము కదా. స్మృతి చేయడం ద్వారా మన పాపాలు అంతమవుతూ ఉంటాయి. ఇది మీ స్మృతి యొక్క అహింసక చక్రము. ఆ చక్రము హింసాయుతమైనది, శిరస్సును ఖండిస్తుంది. ఆ అజ్ఞానీ మనుష్యులు ఒకరి శిరస్సును ఒకరు ఖండించుకుంటూ ఉంటారు. మీరు ఈ స్వదర్శన చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా రాజ్యాధికారాన్ని పొందుతారు. కామము మహాశత్రువు, దాని ద్వారా ఆదిమధ్యాంతాలు దుఃఖము లభిస్తుంది. అది దుఃఖపు చక్రము. మీకు తండ్రి ఈ చక్రము యొక్క జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తారు. శాస్త్రాలలోనైతే ఎన్ని కథలను తయారుచేసారు. మీరు ఇప్పుడు వాటన్నింటినీ మర్చిపోవలసి ఉంటుంది. కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఎందుకంటే తండ్రి ద్వారానే స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని తీసుకోవాలి. ఇది ఎంత సహజము. అనంతమైన తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కావున వారసత్వాన్ని తీసుకునేందుకే మీరు స్మృతి చేస్తారు. ఇది మన్మనాభవ, మధ్యాజీభవ. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ పిల్లలకు సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉండాలి. మనం అనంతమైన తండ్రికి పిల్లలము. తండ్రి స్వర్గ స్థాపనను చేస్తారు, మనం అధిపతులుగా ఉండేవారము, మళ్ళీ తప్పకుండా అలా అవుతాము. మళ్ళీ మీరే నరకవాసులుగా అయ్యారు. సతోప్రధానులుగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానులుగా అయ్యారు. భక్తి మార్గములోకి కూడా మనమే వచ్చాము. ఆల్ రౌండ్ చక్రమును చుట్టి వచ్చాము. భారతవాసులమైన మనమే సూర్యవంశీయులుగా ఉండేవారము, తర్వాత చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా... అయి కిందకు పడిపోయాము. భారతవాసులైన మనము దేవీ-దేవతలుగా ఉండేవారము, ఆ తర్వాత మనమే పడిపోయాము. మీకు ఇప్పుడు మొత్తమంతా తెలుస్తుంది. వామ మార్గములోకి వెళ్ళినప్పుడు ఎంత అశుద్ధముగా అయిపోతారు. మందిరములో కూడా ఇలాంటి ఛీ-ఛీ చిత్రాలు తయారుచేయబడి ఉన్నాయి. పూర్వము గడియారాలు కూడా ఇటువంటి చిత్రాలతో తయారుచేసేవారు. మనం ఎంత మంచి పుష్పాలుగా ఉండేవారము, మళ్ళీ మనమే పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఎంత ఛీ-ఛీగా అయిపోతాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వీరు సత్యయుగ అధిపతులుగా ఉన్నప్పుడు దైవీ గుణాలు కల మనుష్యులుగా ఉండేవారు. ఇప్పుడు ఆసురీ గుణాలు కలవారిగా అయ్యారు. ఇంకే తేడా లేదు. తోక లేక తొండం ఉన్న మనుష్యులు ఎవరూ ఉండరు. ఇవి కేవలం దేవతల గుర్తులు. స్వర్గము కనుమరుగైపోయింది, కేవలం ఈ చిత్రాలు గుర్తులుగా మిగిలి ఉన్నాయి. చంద్రవంశీయుల గుర్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు మాయపై విజయాన్ని పొందేందుకు యుద్ధము చేస్తారు. యుద్ధము చేస్తూ-చేస్తూ ఓడిపోతారు కావున దానికి గుర్తుగా విల్లు-బాణాలు ఉన్నాయి. భారతవాసులు వాస్తవానికి దేవీ-దేవతా వంశానికి చెందినవారు. అలా కాకపోతే మరి వారిని ఏ వంశానికి చెందినవారనుకోవాలి. కానీ భారతవాసులకు తమ వంశము గురించి తెలియని కారణముగా హిందువులు అని అనేస్తారు. లేదంటే వాస్తవానికి మీది ఒకే వంశము. భారత్ లో అందరూ దేవతా వంశానికి చెందినవారు, దానిని అనంతమైన తండ్రి స్థాపన చేస్తారు. శాస్త్రము కూడా భారత్ కు సంబంధించినది ఒక్కటే. దైవీ వంశ స్థాపన జరుగుతుంది, ఆ తర్వాత అందులో భిన్న-భిన్న శాఖలు ఏర్పడుతాయి. తండ్రి దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు. పునాది దేవీ-దేవతా ధర్మమే. అందరూ ముక్తిధామ నివాసులే. ఆ తర్వాత మీరు మీ దేవతల శాఖలలోకి వెళ్ళిపోతారు. భారత్ యొక్క బౌండరీ ఒక్కటే, అప్పుడు ఇంకే ధర్మమూ లేదు. వీరు యథార్థముగా దేవతా ధర్మానికి చెందినవారు. ఆ తర్వాత దాని నుండి ఇతర ధర్మాలు డ్రామా ప్లాన్ అనుసారముగా వెలువడ్డాయి. భారత్ యొక్క యథార్థ ధర్మము దేవతా ధర్మమే, దానిని స్థాపన చేసేవారు కూడా తండ్రియే. తర్వాత కొత్త-కొత్త ఆకులు వెలువడుతాయి. ఇదంతా ఈశ్వరీయ వృక్షము. తండ్రి అంటారు, నేను ఈ వృక్షానికి బీజరూపుడను. ఇది కాండము, తర్వాత దాని నుండి శాఖలు వెలువడుతాయి. ఆత్మలమైన మనందరమూ పరస్పరం సోదరులము అన్నదే ముఖ్యమైన విషయము. ఆత్మలందరి తండ్రి ఒక్కరే, అందరూ వారిని తలచుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ కళ్ళ ద్వారా మీరు ఏదైతే చూస్తారో, దానిని మర్చిపోవాలి. ఇది అనంతమైన వైరాగ్యము, వారిది హద్దు వైరాగ్యము. కేవలం ఇళ్ళు-వాకిళ్ళ పట్ల వైరాగ్యము కలుగుతుంది. మీకైతే మొత్తం ఈ పాత ప్రపంచమంతటి పట్ల వైరాగ్యము ఉంది. భక్తి తర్వాత పాత ప్రపంచము పట్ల వైరాగ్యము ఉంటుంది. ఆ తర్వాత మనం వయా శాంతిధామము కొత్త ప్రపంచములోకి వెళ్తాము. తండ్రి కూడా అంటారు, ఈ పాత ప్రపంచము భస్మమవ్వనున్నది. ఈ పాత ప్రపంచముతో ఇప్పుడు మనసు పెట్టుకోకూడదు. యోగ్యులుగా అయ్యే వరకు ఇక్కడే ఉండేది ఉంది. లెక్కాచారాలన్నీ తీర్చుకోవాలి.

మీరు అర్ధకల్పము కొరకు సుఖాన్ని జమ చేసుకుంటారు. వాటి పేరే శాంతిధామము, సుఖధామము. మొదట సుఖము ఉంటుంది, ఆ తర్వాత దుఃఖము ఉంటుంది. తండ్రి అర్థం చేయించారు, ఏయే ఆత్మలైతే పై నుండి వస్తారో, ఉదాహరణకు క్రైస్టు ఆత్మ వచ్చారు, వారికి మొదట దుఃఖము కలగదు. ఈ ఆటలో ఉండేది మొదట సుఖము, ఆ తర్వాత దుఃఖము. కొత్త-కొత్తవారు ఎవరైతే వస్తారో, వారు సతోప్రధానముగా ఉంటారు. ఏ విధముగా మీ విషయములో సుఖము యొక్క లెక్క ఎక్కువ ఉందో, అలా వారందరి విషయములో దుఃఖము యొక్క లెక్క ఎక్కువ ఉంది. ఇవన్నీ బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసి ఉంటుంది. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. వారు మళ్ళీ ఇతర ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నేను ఈ శరీరాన్ని ధారణ చేసాను. అనేక జన్మల అంతిమములో అనగా తమోప్రధాన శరీరములో నేను ప్రవేశిస్తాను. మళ్ళీ వారే ఫస్ట్ నంబరులోకి వెళ్ళాలి. ఫస్ట్ సో లాస్ట్, లాస్ట్ సో ఫస్ట్. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. ఫస్ట్ తర్వాత ఎవరు ఉన్నారు? మమ్మా. ఆమె పాత్ర ఉండాలి. ఆమె అనేకులకు శిక్షణను ఇచ్చారు. ఆమె తర్వాత అనేకులకు శిక్షణను ఇచ్చేవారు, చదివించేవారు పిల్లలైన మీలో నంబరువారుగా ఉన్నారు. ఆ తర్వాత ఆ చదువుకునేవారు కూడా ఏ విధముగా ప్రయత్నిస్తారంటే వారు మీకన్నా కూడా ఉన్నతిలోకి వెళ్ళిపోతారు. చాలా సెంటర్లలో చదివించే టీచర్ కన్నా కూడా ఉన్నతిలోకి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఒక్కొక్కరిని చూడడం జరుగుతుంది. అందరి నడవడిక ద్వారా తెలుస్తుంది కదా. కొందరికైతే మాయ ఎలా ముక్కు పట్టుకుంటుందంటే అది ఒక్కసారిగా అంతం చేసేస్తుంది. వికారాలలో పడిపోతారు. మన్ముందు మీరు అనేకుల గురించి వింటూ ఉంటారు. ఆమె మాకు జ్ఞానము ఇచ్చేవారు, మరి ఆమె ఎలా వెళ్ళిపోయారు, మాకు పవిత్రముగా అవ్వమని చెప్పేవారు కానీ ఆమె స్వయమే ఛీ-ఛీగా అయిపోయారు అని ఆశ్చర్యపోతారు. తప్పకుండా అర్థమవుతుంది కదా. చాలా ఛీ-ఛీగా అయిపోతారు. బాబా అన్నారు, మంచి పెద్ద-పెద్ద మహారథులను కూడా మాయ గట్టిగా ఇబ్బంది పెడుతుంది. ఏ విధముగా మీరు మాయను ఇబ్బంది పెట్టి విజయాన్ని పొందుతారో, మాయ కూడా అలాగే చేస్తుంది. తండ్రి ఎంత మంచి-మంచి ఫస్ట్ క్లాస్ అయిన, రమణీకమైన పేర్లు కూడా పెట్టారు. కానీ అహో మాయ, ఆశ్చర్యము కలిగించేలా విన్నారు, వినిపించారు, మళ్ళీ పారిపోయారు, పడిపోయారు... మాయ ఎంత శక్తివంతమైనది, అందుకే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది యుద్ధ మైదానము కదా. మాయతో మీకు ఎంత పెద్ద యుద్ధము జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇక్కడే అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకుని అర్ధకల్పము కొరకు సుఖాన్ని జమ చేసుకోవాలి. ఈ పాత ప్రపంచము పట్ల ఇప్పుడు మనస్సు పెట్టుకోకూడదు. ఈ కనుల ద్వారా ఏదైతే కనిపిస్తుందో, దానిని మర్చిపోవాలి.

2. మాయ చాలా శక్తివంతమైనది, దానితో జాగ్రత్తగా ఉండాలి. చదువులో వేగంగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళాలి. ఒక్క తండ్రి నుండే వినాలి మరియు వారి నుండి విన్న విషయాలనే ఇతరులకు వినిపించాలి.

వరదానము:-
అనంతమైన దృష్టి, వృత్తి మరియు స్థితి ద్వారా సర్వులకు ప్రియమైనవారిగా అయ్యే డబల్ లైట్ ఫరిశ్తా భవ

ఫరిశ్తాలు అందరికీ చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే ఫరిశ్తాలు అందరికీ చెందినవారిగా ఉంటారు, ఒకరిద్దరికి చెందినవారిగా కాదు. అనంతమైన దృష్టి, వృత్తి మరియు అనంతమైన స్థితి కల ఫరిశ్తాలు సర్వాత్మల పట్ల పరమాత్ముని సందేశ వాహకులుగా ఉంటారు. ఫరిశ్తా అనగా డబల్ లైట్, అందరి సంబంధాన్ని ఒక్క తండ్రితో జోడింపజేసేవారు, దేహము మరియు దేహ సంబంధాల నుండి అతీతము, స్వయాన్ని మరియు సర్వులను తమ నడవడిక మరియు ముఖము ద్వారా బాబా సమానంగా తయారుచేసేవారు, సర్వుల పట్ల కళ్యాణకారులు. ఇటువంటి ఫరిశ్తాలే అందరికీ ప్రియమైనవారు.

స్లోగన్:-
ఎప్పుడైతే మీ ముఖము ద్వారా తండ్రి యొక్క గుణము, స్వభావము కనిపిస్తుందో, అప్పుడు సమాప్తి జరుగుతుంది.